న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మరోసారి మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మంది కరోనా బారినపడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక నిన్న ఒక్క రోజే 14 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దీని ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 44,196,318కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కు చేరింది. మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. రికవరీ రేటు 98.74, మరణాల రేటు 1.19గా ఉంది.
మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. అంతేగాక మూడు రాష్ట్రాలు (హర్యానా, కేరళ పుదుచ్చేరి) బహరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీచేశాయి.
చదవండి: తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ
Comments
Please login to add a commentAdd a comment