Covid Test
-
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్ సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం పొందడంతో...దీనిని చూసిన వారంతా కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఇటీవల చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నట్లుగా గత మూడు, నాలుగు నెలల్లో చోటుచేసుకున్న వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వీరే కాకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే వయసుతో తేడా లేకుండా కొందరు హఠాత్తుగా వస్తున్న గుండెపోటుతో మరణించారు. ముందే గుర్తించవచ్చు... లోకం తెలియని చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. అయితే హఠాత్తుగా గుండె జబ్బుతో చనిపోవడం అంటూ ఉండదని, పుట్టినప్పటి నుంచే అంటే.. గర్భస్త స్థితి నుంచే గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలతో ఈ ప్రాణాంతక ముప్పును గుర్తించవచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో గుండెజబ్బుకు సంబంధించి కొన్ని లక్షణాలను ముందునుంచే గుర్తించవచ్చునని, వారి శరీరరంగు ముఖ్యంగా పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం వంటివి గమనించాలని చెబుతున్నారు. సాధారణంగా పసిపిల్లలుగా చిన్నవయసులో ఉన్నప్పుడే 3, 4 పర్యాయాలు శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయని, అంతకు మించిన సంఖ్యలో, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. వారి వయసుకు తగ్గట్టుగా తగినంతగా బరువు పెరగకపోవడం, నాలుగు మాసాల వయసప్పుడు మందహాసం (నార్మల్ స్మైల్), ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం వంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని, ముందస్తుగా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే వారి గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ‘2 డీ ఎకో’, ఈసీజీ ఇతర రూపాల్లోని పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే. సడన్ హార్ట్అటాక్ వంటి వాటిని చాలా మటుకు నివారించవచ్చునని సూచిస్తున్నారు. ఇక పెద్ద వయసులోని (యువకులతో సహా) వారి విషయానికొస్తే...గుండెనొప్పా లేక ఎసిడిటీనా అని సొంతంగా తేల్చుకునే ప్రయత్నంతోనే ప్రాణాపాయ పరిస్థితి పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎవరికైనా గుండెలో నొప్పిగా అనిపిస్తే దానిని ఎసిడిటీగా కొట్టిపారేసి నిర్లక్ష్యం చేయడం అధికశాతం మందిలో పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఇలా గుండెనొప్పికి, అసౌకర్యానికి గురయ్యాక వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ఈసీజీ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్ చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చునని సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చాక 4 నుంచి 6 గంటలు గోల్డెన్ పీరియడ్ వంటివని, ఈ సమయంలోగా ఆసుపత్రికి చేరుకుంటే ప్రమాదంనుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు. అదే ఆరుగంటల తర్వాత ఆస్పత్రికి వెళితే లక్షలాది రూపాయలు వెచ్చిoచినా ఒకసారి గాయపడిన గుండె మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోవడం అరుదేనని హెచ్చరిస్తున్నారు. నిద్రించే సమయాల్లోనే అధికంగా హార్ట్అటాక్లకు అవకాశం ఉందని, ఆరోగ్యమైన గుండె కలవారు హఠాత్ గుండెపోటుతో మరణించడం అనేది అత్యంత అరుదని చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించే ప్రమాదాన్ని అరికట్టేందుకు రెగ్యులర్ పరీక్షలతో పాటు, హెల్త్‌కేర్ విషయంలో అందుబాటులోకి వచి్చన నూతన సాంకేతికను అధికంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. 40, 50 ఏళ్ల వయసుల్లోని వారిలో వేలాది మంది గుండెజబ్బు ఉన్న వారిని డయాగ్నైజ్ చేసిన దాఖలాలు లేవంటున్నారు. మధ్యవయసు్కల్లోనూ శారీరకంగా దృఢంగా ఉన్న వారు, ఫిట్‌గా కనిపించేవారు, కసరత్తులు చేసేవారు సైతం హార్ట్ అటాక్‌కు గురి కావడం పట్ల ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. అయితే అధికశాతం కేసుల్లో వీరికి గతం నుంచే గుండెజబ్బులు ఉండి అవి తీవ్రస్థాయికి చేరుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఆరోగ్యవంతులైనా సరే ఒక్కసారైనా సీటీ స్కాన్, కార్డియక్ ఎవాల్యువేషన్ చేయించుకుంటే ముందుగానే ఆరోగ్య సమస్య బయటపడి మరణానికి గురయ్యే ప్రమాదం ఉండదని అంటున్నారు. ఆరోగ్యమైన గుండెకు పంచసూత్రాలు... వైద్యనిపుణుల సూచనల ప్రకారం...రెగ్యులర్ చెకప్‌లు... రక్తపరీక్షలు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్, సీటీ యాంజియో, అ్రల్టాసౌండ్. మహిళలకు మామ్మొగ్రామ్స్ ఇంకా పాప్ స్మియర్ టెస్ట్‌లు ఎక్సర్సైజ్... ప్రతీరోజు రెగ్యులర్ కసరత్తులు, స్వల్ప ఎక్సర్సైజులు, వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), యోగా వంటివి ఎంతో ఉపయోగం డైట్... బియ్యం, చపాతీ, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి. రెడ్ మీట్‌ను దూరం పెట్టాలి స్లీప్ఎర్లీ... రాత్రి సమయాల్లో త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా నిద్రలేవడం వంటి అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది స్పిరిచ్యువాలిటీ... ఆధ్యాతి్మకతను అలవరుచుకోవడం ద్వారా ఒత్తిళ్లను తగ్గించుకుని గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. -
సమంత వివాదాస్పద పోస్ట్ మండిపడుతున్న డాక్టర్లు
-
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. ఈరోజు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అలర్ట్. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక, తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో నేడు 12 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇక, ఈరోజు 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. నేడు నమోదైన కేసులో హైదరాబాద్‌లోనే తొమ్మిది కేసులున్నాయి. హైదరాబాద్- 9 కేసులు రంగారెడ్డి- 1 సంగారెడ్డి-1 వరంగల్-1. -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
ఆదిలాబాద్: కోవిడ్.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్–1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. వైరస్ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ కలవరం.. ప్రస్తుతం జేఎన్–1 వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం! ప్రమాదకరమైన కొత్త వేరియంట్ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టుల వివరాలు : 7,40,181 పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707 జిల్లాలో సంభవించిన మరణాలు : 92 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు : 5,52,815 సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు : 5,55,884 ప్రికాషన్ డోస్ తీసుకున్న వారు : 2,65,780 ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో -
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల అలెర్ట్
-
తెలంగాణలో కొత్త వేరియంట్...టెన్షన్..టెన్షన్
-
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..
జీరో కోవిడ్ పాలసీని ఎత్తేశాక ఘోరంగా కేసులు పెరిగిపోవడంతో పాటు అదేరీతిలో ఘెరంగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకపక్క వైద్యులు నిరంతరం సేవలు అందిచంలేకపోతుంటే, మరోవైపు ఔషధాల కొరతతో గందరగోళంగా ఉంది. ఇంకోవైపు రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ..ఆస్పత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి క్లినిక్ రోగులతో నిండి పోయి..ఆఖరికి వైద్యం ఆరుబయటే అందిచాల్సినంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తూర్పు చైనాలో అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన అన్హుయ్ పట్టణం కరోనాతో విలవిలలాడుతోంది. గత కొద్ది నెలల నుంచి పెరుగుతున్న కేసుల కారణంగా అధిక సంఖ్యలో వృద్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. దీనికి తీడు ఔషధాల కొరతతోపాటు, కరోనాను నిర్థారించే కిట్లు సైతం వేగంగా అయిపోయాయి. అందువల్ల అక్కడ ప్రస్తుతం కరోనా టెస్ట్‌లు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ ఎంతమందికి కరోనా పాజిటివ్ అన్నది కూడా తెలియనంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ చేసినప్పుడే పరిస్థితులు బాగున్నాయని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. ఆ ప్రావిన్స్‌కి సమీపంలోని పట్టణంలో ఉన్న హెల్త్ సెంటర్ అధికారి మాట్లాడుతూ..మందుల కోరత ఘోరంగా ఉందని, అందువల్లే ప్రిస్క్రిప్షన్లను కూడా నిలిపేశామని చెప్పారు. అలాగే ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోవడంతో మెట్ల వద్ద, ఆస్పత్రి వెలుపల వైద్యం అందిచాల్సి వస్తుందని అన్నారు. పైగా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వృద్ధులను నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులంతా నిరాశ నిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనగా చెప్పారు. అందువల్ల తాము వారిని ఉత్సాహపరిచేలా..."ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, బ్రతికేందుకు ప్రయత్నిద్దాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అనే నినాదంతో కూడిన బ్యానర్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు అక్కడి గ్రామాల్లో కరోనా బారిన పడిన వృద్ధులు అసులు కోలుకోలేదని, కనీవినీ ఎరుగని రీతిలో అధిక సంఖ్యలో వృద్ధులే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం కూడా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బహిర్గతం చేయకుండా గట్టి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్నవారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు వెల్లడించడం కూడా నిషిద్ధమే. దీంతో అక్కడి ప్రజలు వాటి గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. (చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..) -
Covid-19: ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది. చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం.. -
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
రాష్ట్రపతి పర్యటన భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు
వెంకటాపురం (ఎం): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో పాల్గొనే భద్రతా సిబ్బందికి సోమవారం పాలంపేట గ్రామపంచాయతీ ఆవరణలో కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం రాష్ట్రపతి ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని చారిత్రక రామప్ప ఆలయానికి రానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేశారు. దేశంలో నాలుగో వేవ్ బీఎఫ్–7 వేరియెంట్ ప్రారంభం కావడంతో వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా రామప్పలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు? ఎమైనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయా? అనే విషయమై వైద్యాధికారులు ప్రకటించలేదు. -
అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు షురూ
-
వామ్మో.. 20 రోజుల్లో 20లక్షల మందికి కరోనా పాజిటివ్!
లండన్: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ భయాందోళనలు పెంచుతున్నాయి. బ్రిటన్‌లో కొద్ది రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు ద గార్డియన్ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంగ్లాండ్ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ అని కోవిడ్-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సారా క్రాఫ్ట్ తెలిపారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది. కోవిడ్-19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్ బీక్యూ1.1 కొత్త వేరియంట్ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Gujarat Polls: ఆ సీట్లలో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలే.. కారణమేంటి? -
ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు. ’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ► జోక్ చేస్తున్నామా... భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు. ► ప్రమాదకరమే శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం. ► ప్రేమగా అవమానం.. ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి. ► జాప్యమూ లోపమేనా! భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు. ► అరిస్తే వింటారా.. చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ► తామే గొప్పని.. కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు. చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది. మాట్లాడే ముందే ఆలోచన శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి. – ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ – నిర్మలారెడ్డి -
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
విడ్డూరం! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో
మూడేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంది. ఈ వైరస్ సోకిందో లేదో తెలియాలంటే ముందుగా కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సిందే! జ్వరం, దగ్గు, జలుబు, నీరసం.. ఇలా ఎలాంటి లక్షణాలు కనిపించినా కరోనా ఏమోనని భయపడి టెస్టులకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పటి వరకు సాధారణంగా కేవలం మనుషులకు మాత్రమే ఈ కరోనా టెస్టులు చేశారు. తాజాగా మానవులతోపాటు చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్‌లో ఈ సంఘటన జరిగింది. చైనాలోని సముద్రతీర నగరం జియామెన్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. జియామెన్‌లో 40 మందికి కోవిడ్ సోకడంతో.. నగరంలోని అయిదు మిలియన్ల మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కేవలం మనుషుకు మాత్రమే కాదు. కొన్ని రకాల సముద్రజీవులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సముద్రం మీద వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చినపుడు.. వారితోపాటు తీసుకొచ్చిన చేపలు, జలచరాలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఫలితంగా బతికున్న చేపలు, పీతలకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో పీపీఈ కిట్ ధరించిన వైద్యాధికారులు చేపలు, పీతలు వంటి జలచరాల స్వాబ్ తీసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్ దంపతులు Videos of pandemic medical workers giving live seafood PCR tests have gone viral on Chinese social media. pic.twitter.com/C7IJYE7Ses — South China Morning Post (@SCMPNews) August 18, 2022 అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది చేపలకు టెస్టులు చేయడాన్ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అధికారుల తీరును విమర్శిస్తున్నారు. కాగా తమ నిర్ణయాన్ని జియామెన్ మున్సిపల్ ఓషియానిక్ డెవలప్మెంట్ బ్యూరో అధికారులు సమర్థించుకున్నారు. కరోనా కల్లోలం రేపిన హైనాన్ నుంచి తాము పాఠం నేర్చుకున్నామని తెలిపారు. విదేశీయుల నుంచి మత్స్యకారులకు వైరస్ సోకి సముద్ర ఉత్పత్తులకు వ్యాపిస్తున్నదని చెప్పారు. -
రాకాసిలా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారీ... మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు
Covid outbreak Tropical Sanya, ‘China’s Hawaii’: చైనాలో మళ్లీ కరోనా మహమ్మారీ రాకాసిలా విరుచుకుపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిందని ఆనందంగా ఊపిరి పీల్చుకునేలోపు మళ్లీ పగపట్టినట్టుగా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మేరకు చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ రాజధాని సాన్యాలో అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదీగాక సాన్యా పర్యాటక హాట్‌స్పాట్‌గా ప్రసిద్ధి. దీంతో ప్రస్తుతం అక్కడ సుమారు 80 వేల మంది దాక పర్యాటకులు ఉన్నారు. ఐతే వేగంగా విజృంభిస్తున్న ఈ కరోనా కేసుల దృష్ట్యా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో సాముహికంగా ప్రజలు తిరగడాన్ని నిషేధించారు. శనివారం ఉదయం నుంచి ప్రజల కదలికలను నియంత్రించడమే కాకుండా రెస్టారెంట్లు, బార్లు, నగరంలోని ప్రసిద్ధ డ్యూటీ-ఫ్రీ మాల్స్‌తో సహా చాలా బహిరంగ వేదికలను మూసివేయమని ఆదేశించారు. అంతేగాదు ప్రసుతం నగరంలో నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకుని పర్యాటకులు తమకు సహకరించాలని కోరారు. పర్యాటకులు సాన్యా నగరాన్ని విడిచిపెట్టడం కోసం సకాలంలో కరోనా టెస్టులు చేయించుకోవడం తప్పనసరి అని చెప్పారు. అలాగే విమానం ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎంతమంది సాధ్యమైనంత తొందరగా సాన్యా నగరాన్ని వదిలి వెళ్లగలరనేది చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం సాన్యాలో ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 455 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నగరంలో మాస్ టెస్టింగ్ జరుగుతోందని, కనీసం ఆగస్ట్ 8 వరకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నివాసితులకు సూచించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పౌరులు కూడా నగరంలోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు కట్టడి చేసే దిశగా మళ్లీ కఠిన లాక్ డౌన్ ఆంక్షలు విధించనున్నట్లు నొక్కి చెప్పారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
జో బైడెన్‌కు మళ్లీ కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కొవిడ్ నుంచి బైడెన్ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించిన మూడురోజుల్లోనే.. మళ్లీ ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో మరోమారు ఆయన ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ తెలిపారు. ‘79 ఏళ్ల బైడెన్‌కు గత శనివారం నిర్వహించిన ఆంటిజెన్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వరుసగా నాలుగు రోజులు నెగెటివ్‌గా తేలిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మళ్లీ ఐసోలేషన్ నిబంధనలు పాటిస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.’ అని పేర్కొన్నారు డాక్టర్ కెవిన్ ఓ కానర్. An update from Dr. Kevin O’Connor, Physician to the President. pic.twitter.com/40oqYOYTQN — The White House (@WhiteHouse) July 30, 2022 ఇదీ చదవండి: అమెరికా అధ్యక్షునికి కరోనా -
కామన్వెల్త్ గేమ్స్.. భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్..!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్ మహిళల జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్‌హామ్‌లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది. ఇక మేఘనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్‌హామ్‌కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్ బార్బడోస్ జట్లతో కలిపి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా చదవండి: PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు -
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా సోకింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పేర్కొంది. గత నాలుగు రోజులుగా నితీశ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ప్రత్యాయ అమృత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: MK Stalin Covid Positive: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా.. ట్విటర్ ద్వారా ప్రకటన -
కోవిడ్ వ్యాక్సిన్ @ 200 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది. -
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్ ప్రస్తుతం తన శాంతినికేతన్ నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్ కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆయన డాక్టర్లను సంప్రదించడంతో వైద్య పరీక్షల్లో కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. వాస్తవానికి అమర్త్యసేన్ కోల్‌కతాలోని పెళ్లికి హాజరు కావల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది కూడా. ఐతే ప్రస్తుతం ఆ ప్రయాణాలన్ని రద్దయ్యాయి. అమర్త్యసేన్ ప్రస్తుతం తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతని కటుంబం వెల్లడించింది. (చదవండి: యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్ షాక్) -
రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ..!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎనిమిది రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రాగానే ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను రెడీ అంటూ అభిమానులకు సంకేతాలు పంపాడు. ఆదివారం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కాకుండా డిఫెన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన రోహిత్.. నెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు.. ఇక ఇంగ్లీషోల్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Exclusive and Latest video 📸 Captain Rohit Sharma is looking in great touch in nets. pic.twitter.com/OsXPZP4r32 — Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 4, 2022 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ రిపోర్డు వచ్చినప్పటికీ మరో పరీక్షకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్‌కు ఇవాళ (జులై 4) గండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్నెస్ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ప్రకారం హిట్‌మ్యాన్ ఈ ప్రొసీజర్ మొత్తాన్ని క్లియర్ చేస్తేనే తొలి టీ20కి అందుబాటులో ఉంటాడు. కాగా, జులై 7 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి. చదవండి: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..!
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్ తేలింది. ప్రస్తుతం రోహిత్ జట్టు హోటల్లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. "శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం లీసెస్టర్ షైర్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచులో మాత్రం శర్మ పాల్గొంటున్నాడు. అయితే ఈ మ్యాచ్ అఖరి రోజు ఆటకి రోహిత్ దూరం కానున్నాడు. ఇక రోహిత్ వారం రోజులు పాటు ఐషోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై1న జరగబోయే నిర్ణయాత్మక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్ UPDATE - #TeamIndia Captain Mr Rohit Sharma has tested positive for COVID-19 following a Rapid Antigen Test (RAT) conducted on Saturday. He is currently in isolation at the team hotel and is under the care of the BCCI Medical Team. — BCCI (@BCCI) June 25, 2022 -
భారత్‌లో కరోనా.. ఒక్కసారిగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేవ్ సంకేతాలకు ఊతమిచ్చేలా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం కేసులు పెరిగిపోగా.. నాలుగు నెలల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం నుంచి రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు.. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం 17,336 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 30 శాతం(4,294 కేసులు) మేర పెరిగింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. కరోనాతో 13 మంది చనిపోయారు. అలాగే పాజిటివిటీ రేటు కూడా దాదాపు 4 శాతంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి. కేరళలో 3,890, ఢిల్లీ 1,934 కేసులు, తమిళనాడు 1,063 కేసులు, హర్యానా(872) కేసులు వచ్చాయి. ఢిల్లీలో అంతకు ముందు రోజు 926 కేసులు రాగా, తాజాగా 1,934 కేసులతో రెట్టింపు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. వైరస్ మ్యూటేషన్ గురించి ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కరోనాతో ఇప్పటిదాకా దేశంలో 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. 4,27,49,056 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,96,77,33,217 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. -
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...
Covid Mass Testing Mantra: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే జీరో కోవిడ్ పాలసీని అనుసరించాల్సిందే అంటూ ప్రజలపై కఠినతర ఆంక్షలు విధించి నిర్బంధించింది. ఓ పక్క చైనా జీరో కోవిడ్ పాలసీ అట్టర్ ప్లాప్ అయ్యి కేసులు పెరిగిపోతున్నా చైనా అధికారులు మాత్రం జీరో కోవిడ్ వ్యూహం అంటూ పట్టుకుని వేళాడారు. ప్రపంచ దేశాలన్ని విమర్శిస్తున్న తన మాటే శాసనం అంటూ మూర్ఖంగా వ్యవహారించింది చైనా. ఈ జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రజలందరికి పెద్ద ఎత్తున మాస్ కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. దీంతో ఇప్పుడూ చైనాలో పెద్ద కొండలా వైద్య వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్జెన్, టియాంజిన్‌లో ఇప్పుడు టెస్టింగ్ కియోస్క్‌ల వంటి వైద్య వ్యర్థాల నిలయంగా మారాయి. అదీగాక ఈ వ్యర్థాలను తొలగించాలంటే చైనా ప్రభుత్వం పై సుమారు పది బిలయన్ల డాలర్ల పైనే పెనుభారం పడుతుందని అధికారులు చెబుతున్నారు అసలే వరుస లాక్‌డౌన్‌తో దారుణమైన స్థితిలో ఉన్న చైనా ఆర్థిక పరిస్థితికి ఇదొక పెద్ద సవాలు అని అంటున్నారు. పైగా ఈ వైద్యవ్యర్థాలు తొలగించలేని విధంగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయని షాంఘైలోని న్యూయార్క్ పర్యావరణ నిపుణుడు యిఫీ లీ అన్నారు. అదీగాక చైనా 2060 నాటికల్లా కార్బన్ న్యూట్రల్‌గా మార్చాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా వాయు, జల కాలుష్యాన్ని సైతం అరికట్టే చర్యలు చేపట్టింది కూడా. కానీ ఇపుడూ ఈ కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వైద్యవ్యర్థాలను చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అంటున్నారు చైనా అధికారులు. -
విజృంభిస్తున్న కేసులు ... జీరో కోవిడ్ పాలసీని వదలనంటున్న చైనా!
Xi Jinping has doubled down on a zero-Covid policy: చైనా ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారీ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటుంది. అయినా కరోనా కేసులు తగ్గాయని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోనని చైనా ఆంక్షలు విధించింది కూడా. ప్రజలు లాక్డౌన్ వద్దని గగ్గోలు పెట్టినా ముందు జాగ్రత్త చర్యలు అంటూ ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ఐసోలేషన్‌లో ఉంచింది. ఆఖరికి చైనా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి మాత్రం చైనాని ఒక పట్టాన వదలడం లేదు. చైనా అమలు చేస్తున్న కఠినమైన జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని బ్రేక్ చేస్తూ...కరోనా మహమ్మరి విజృంభిస్తూనే ఉంది. గత కొద్దివారాల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చైనా యంత్రాంగం అందరికీ సాముహిక కరోనా టెస్టులు నిర్వహించింది. ఈ పరీక్షల్లో చైనాకి ఊహించని ఝలక్ ఇచ్చింది కరోనా. శుక్రవారం ఒక్క రోజులో చైనా రాజధాని బీజింగ్‌లో 61 కొత్త కేసులు నమోదవ్వగ... శనివారం నాటికల్లా బీజింగ్‌లో మరో 46 కొత్త కేసులు వెలుగు చూశాయని చైనా అధికారులు తెలిపారు. ఐతే ఇప్పటి వరకు మొత్తం 115 కేసులు వెలుగు చూశాయని చైనా తెలిపింది. పైగా ఈ బాధితులంతా బీజింగ్‌లోని ఒక బార్కి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు ఆ బార్కి వచ్చిన మరో 6,158కి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చైనా యంత్రాంగం పేర్కొంది. ఏదిఏమైనా చైనా ఆ కరోనా మహమ్మారితో సహజీవనం చేసేందుకు రెడీ అవ్వక తప్పదేమో అన్నట్లుగా ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వృద్ధులను, వైద్యా వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని రెట్టింపు చేస్తానని చెప్పడం గమనార్హం. (చదవండి: ఉప్పెనల విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ దళాలు... ఆవిరై పోతున్న రష్యా ఆశ) -
కరోనా అప్డేట్స్: అంతకంతకు పెరిగిపోతున్న కేసులు
ముంబై/ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ నాలుగో వేవ్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. దేశంలో కరోనా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 3 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో ఢిల్లీలోనూ 655 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 3,081 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరణాలు నమోదు కాకపోవడం ఊరట ఇచ్చే అంశం. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 13, 329కి చేరింది. అదే సమయంలో ముంబైలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా రెండు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. బులిటెన్‌లో 1,956 కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర యాక్టివ్ కేసుల సంఖ్యలో ముంబైలనే 9వేల దాకా ఉండడం గమనార్హం. Maharashtra | 3081 new COVID cases were reported today in the state while 1323 patients were discharged. With zero deaths today, active cases stood at 13,329 pic.twitter.com/d4oUxFF3ee — ANI (@ANI) June 10, 2022 ఇంకోవైపు ఢిల్లీలోనూ కేసులు కొనసాగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 655 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు మరణాలు నమోదు అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ తాజా బులిటెన్‌లో 155 కేసుల దాకా నమోదు అయ్యాయి. తాజా గణాంకాలతో.. శనివారం కేంద్రం విడుదల చేసే బులిటెన్‌లో కేసులు అత్యధికంగా నమోదు కానున్నాయి. Delhi reports 655 new #COVID19 cases, 419 recoveries and 2 deaths in the last 24 hours. Active cases 2008 pic.twitter.com/0rzLDETjar — ANI (@ANI) June 10, 2022 చదవండి: కరోనా కథ అయిపోలేదు.. డిసెంబర్ వరకు ఇలాగే..: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ -
దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. రెండో మ్యాచ్‌కు కూడా..!
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో మార్క్రమ్ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టియన్ స్టబ్స్ ప్రోటిస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా తొలి టీ20 టాస్ సమయంలో ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వెల్లడించాడు. "మార్క్రామ్ తొలి టీ20కు అందుబాటులో లేడు. అతడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అతడు స్థానంలో స్టబ్స్ డెబ్యూ చేయనున్నాడు" అని బావుమా పేర్కొన్నాడు. ఇక కోవిడ్ బారిన పడిన మార్క్రామ్ ఐదు రోజుల పాటే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20కు కూడా మార్క్రమ్ దూరమమ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్ చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
కరోనా ఫోర్త్ వేవ్!: మూడు నెలల తర్వాత హయ్యెస్ట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్‌ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. గత 24 గంటల్లో.. ఏకంగా 7,240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మార్చి 2 తర్వాత ఇదే అత్యధిక కేసులు కావడ గమనార్హం. భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ దేశంలో కొత్త కేసుల పెరుగుదల 40 శాతంపైగా కనిపిస్తోంది. మొత్తం 7, 240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మూడున్నర లక్షల టెస్టులకుగానూ.. ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, కేరళలో కొత్త, క్రియాశీలక కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క ముంబై నగరంలోనే బుధవారం 1, 765 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్ర అప్రమత్తం అయ్యింది. క్లోజ్డ్ పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని చెప్తుండడం విశేషం. తాజా కరోనా మరణాలు ఎనిమిది రికార్డు కాగా.. దేశంలో ఇప్పటిదాకా కరోనాతో 5, 24, 723కి చేరింది. డెయిలీ పాజిటివిటీ రేటు 2.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.31 శాతంగా నమోదు అవుతోంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 32,498కి చేరడం కలవర పరుస్తోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EcaW7dPkRU pic.twitter.com/XgCWmTPGtU — Ministry of Health (@MoHFW_INDIA) June 9, 2022 చదవండి: కేసులు పెరుగుతున్నాయ్.. తెలంగాణలో టెస్టులు పెంచండి -
కరోనా కేసులు పెరుగుతున్నాయ్: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టెస్టులు కూడా పెంచాలంటూ ఆదేశించింది. కరోనా కేసులపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అనంతరం విచారణను ఈ నెల 22కి హైకోర్టు వాయిదా వేసింది. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం 13,149 నమూనాలను పరీక్షించగా 119 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65 మాత్రమే. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనూ కరోనా కేసులు పెరుగు ముఖం పడుతుండడం గమనార్హం. -
కోవిడ్ బారిన పడిన బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంలో వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు.. అందులో కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలినట్టు ఆయన వెల్లడించారు. వైద్యులు అందించిన సూచనటు పాటిస్తూ ఐసోలేషన్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. తిరిగి ఆరోగ్యవంతుడైన తర్వాత ఐసోలేసన్ వీడుతానని బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. I've tested positive for COVID. I'm experiencing mild symptoms and am following the experts' advice by isolating until I'm healthy again. — Bill Gates (@BillGates) May 10, 2022 అయితే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ , బూస్టర్ డోసు వేసుకున్నందున వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రపంచాన్ని ముంచెత్తడానికి ముందే ఓ మహమ్మారి మానవాళిపై దాడి చేసే అవకాశం ఉందని బిల్‌గేట్స్ ముందుగానే ప్రపంచ దేశాలకు సూచనలు చేశారు. చదవండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్! -
చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు వీడియో వైరల్
woman pinned down by a man for a Covid test: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా విజృభిస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వంటి పలు ఆంక్షలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది చైనా. అదీగాక వరుస లాక్డౌన్లతో విసుగుపోయిన ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అంతేగాదు ప్రజలు నివాసాల నుంచి బయటకు రాకుండా కట్టుదిటమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా అధికారులు ప్రజలకు బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పైగా చైనా ప్రభుత్వ పేద ప్రజలను పరీక్షల పేరుతో ఎలా ఇబ్బందిపెడుతోంది వంటి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి అక్కడ ప్రజలు కరోనా కంటే లాక్డౌన్ అంటేనే హడలిపోతున్నారు. కరోనా తగ్గిందనుకునే దశలో మళ్లీ విరుచుకుపడటంతో చైనా ప్రభుత్వం మళ్లీ ఆంక్షల కొరడా విధించింది. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, కార్యాలయాలు మూసివేయడంతో ప్రజలు ఆర్థిక సంక్షోభంతో సతమతమతున్నారు. అంతేగాదు చైనా కూడా కరోనాని కట్టడి చేసే దిశగా ప్రజలకు మూడోరౌండ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టకుండా బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. 这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t — 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022 Chinese government forcing grandma take a mandatory Covid test pic.twitter.com/tD1aZCdj6v — Songpinganq (@songpinganq) March 19, 2022 (చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!) -
భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు
న్యూఢిల్లీ: ఒక్కసారిగా పడిపోయాయని సంతోషించేలోపే.. కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 3,668 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశ రాజధానిలో ఢిల్లీ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం 3,668 కేసుల్లో.. 1, 607 కేసులు, రెండు మరణాలు ఢిల్లీలోనే నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌కేసుల సంఖ్య 18, 684గా ఉంది. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వాళ్ల సంఖ్య 5,23,803గా నమోదు అయ్యింది. -
మూడే నిమిషాల్లో కరోనా టెస్ట్!
భారత్‌లో ఇంకా స్వాబ్ టెస్టుల ఆధారితంగానే కరోనా నిర్ధారణ జరగుతోంది. అయితే చాలా చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో పరీక్షల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో.. కేవలం మూడే నిమిషాల్లో కరోనాను నిర్ధారించే పరీక్షలకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది. నోటి ద్వారా ఊదినప్పుడు.. కరోనాను నిర్ధారించే డివైజ్‌ను ఉపయోగించొచ్చని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఇన్‌స్పెక్ట్‌ఐఆర్ కొవిడ్-19 బ్రీతలైజర్గా పిలువబడే డివైజ్‌ను పరీక్షల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లగేజీ బ్యాగు సైజులో ఉండే ఈ డివైజ్‌ను ఆస్పత్రులు, క్లినిక్‌లు, మొబైల్ టెస్టింగ్ సైట్లలో ఉపయోగించుకునేందుకు అనుమతులు జారీ చేసింది ఎఫ్‌డీఏ. వారానికి వంద పరికరాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం సదరు కంపెనీకి ఉందని, ఒకరోజులో 160 శాంపిల్స్‌ను.. ఒక యూనిట్ తేల్చేయగలుగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్యాస్ క్రోమోథెరపీ గ్యాస్ మాస్ స్పెక్రటోమిట్రీ ఆధారంగా కోవిడ్ బారిన పడ్డవాళ్లు శ్వాస నుంచి బయటకు వచ్చే ఐదు కాంపౌండ్లను ఇన్‌స్పెక్ట్‌ఐఆర్ బయటపెడుతుంది. కరోనా మొదలైన చాలాకాలం దాకా స్వాబ్ టెస్టులకే ప్రాధాన్యత ఇచ్చాయి చాలా దేశాలు. అయితే టెక్నాలజీ సాయంతో ప్రత్యామ్నాయ పరీక్షలకు ఆస్కారం దొరుకుతోంది ఇప్పుడు. ఇన్‌స్పెక్ట్‌ఐఆర్ కొవిడ్-19 బ్రీతలైజర్ వినియోగానికి రెండేళ్ల తర్వాత అనుమతులు దొరకడం గమనార్హం. -
చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్ పింగ్ సంచలన నిర్ణయం
బీజింగ్: చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇక, ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్, షాంఘైలోనూ లాక్‌డైన్ విధించారు. అయితే, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కాగా, రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది. ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు. China has sent the military and thousands of healthcare workers into Shanghai to help carry out COVID-19 tests for all of its 26 million residents as cases continued to rise on Monday. https://t.co/VbbmOE2OvY — SBS News (@SBSNews) April 4, 2022 -
Coronavirus: జూన్‌లో నాలుగో వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్‌ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులు 8,013 దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది. -
94 శాతం మందికి రెండు డోసుల టీకా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన జనాభాలో 93.94 శాతం మందికి కోవిడ్ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో టీకాల ప్రక్రియలు జరగడంవల్లే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా తొలిడోసు నూటికి నూరు శాతం పూర్తయింది. అలాగే, 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తికాగా.. ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది. మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మొత్తం మీద రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన 50.28 లక్షల మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకా వేయాల్సి ఉంది. వీరికి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయడంవల్లే.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తిచేయడంవల్లే కోవిడ్ మూడవ వేవ్‌లో మరణాల సంఖ్య దేశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. అంతేకాక.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు కూడా చాలా స్పల్పంగా ఉండడంవల్ల కేవలం వారం రోజుల్లోనే అందరూ కోలుకుంటున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషనే కోవిడ్‌కు పరిష్కారమని తొలి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడమే కాక రాష్ట్రంలో ఆచరణలో అమలుచేసి చూపించారు. దీనివల్లే ఇప్పుడు కోవిడ్ కేసులతో పాటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దేశంలో మరణాల రేటు 1.20 శాతం ఉంటే రాష్ట్రంలో కేవలం 0.64 శాతమే ఉంది. అందుకే మరణాల రేటు తక్కువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించడంవల్లే రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారిలో 93.94 శాతం మందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. దీని ఫలితం ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగైదు రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడమే కాకుండా మరణాల రేటు దేశంతో పాటు ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కూడా లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను రాష్ట్రంలో వేగంగా పూర్తిచేయడమే ఇందుకు కారణం. ఈ నెలాఖరుకల్లా మిగతా వారికీ పూర్తిచేస్తాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
కరోనా పేరు చెప్పి విమానం ఎక్కనివ్వరా ? హైకోర్టులో ఎన్నారై ఫైట్!
కరోనా వచ్చింది మొదలు జాగ్రత్తలు మొదలు , టెస్టుల, చికిత్సా విధానం వరకు నిబంధనల్లో బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి. చాలా మంది వీటిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఓ ఎన్నారై మాత్రం కరోనా టెస్టుల్లో డొల్లతనం.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏవియేషన్ డిపార్ట్మెంట్, ఐసీఎంఆర్‌ల పనితీరుని నేరుగా ప్రశ్నించాడు. అబుదాబీకి పయణం కేరళాకి చెందిన ముజామిల్ వరికొట్టిల్ (29) అనే యువకుడు పదేళ్లుగా అబుదాబీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని సంపాదనపైనే ఇండియాలో కుటుంబం ఆధారపడి ఉంది. కాగా నాలుగు నెలల క్రితం ముజామిల్ కేరళా వచ్చాడు. తిరిగి అబుదాబీ వెళ్లేందుకు టిక్కెట్టు బుక్ చేసుకున్నాడు. 2022 జనవరి 29న కోజికోడ్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేందుకు అతను ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. చిక్కొచ్చి పడింది ఎయిర్పోర్ట్ అధికారులు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా ముజామిల్‌ని ఆదేశించారు. ప్రయాణానికి రెండు రోజుల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించిన కరోనా ఆర్టీ పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించినా ఎయిర్పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. ఎయిర్‌పోర్టులో టెస్ట్ చేయించాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీంతో రూ. 2,490 చెల్లించి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాడు. అప్పుడు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు ముజామిల్‌ని ఫ్లైట్ ఎక్కనీయకుండా ఇంటికి పంపించేశారు. హైకోర్టులో కేసు ఫ్లైట్ మిస్ అవడం వల్ల అబుదాబీలో డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు ముజామిల్. అంతేకాకుండా ఫ్లైట్ టిక్కెట్ కోసం ఖర్చు పెట్టిన రూ.15,000 వెనక్కి ఇచ్చేందుకు విమాన సంస్థ నిరాకరించింది. ఓ వైపు ఉద్యోగం పోవడం, మరోవైపు ఆర్థిక నష్టం కలగడంతో ముజామిల్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే తగు ఆధారాలతో కేరళా హైకోర్టును ఆశ్రయించాడు. అతను సమర్పించిన ఆధారాలు బలంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ఆర్యోగ శాఖలు, ఐసీఎంఆర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కాలికట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్లను ప్రతివాదులగా చేర్చుతూ కేసును విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపింది. ముజామిల్ లేవనెత్తిన కీలక అంశాలు - ప్రయాణానికి రెండు రోజుల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఎందుకు అంగీకరించలేదు - కోజికోడ్ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్‌కి ఐసీఎంఆర్ నుంచి ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు. ఎటువంటి గుర్తింపు లేకుండా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రైవేట్‌గా ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. - ప్రయాణానికి రెండు రోజుల ముందు, అంతకు ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు ఐసీఎంఆర్ సైట్లో కనిపిస్తున్నాయి. కానీ ఎయిర్‌పోర్టులో చేసిన రిపోర్టులు కనిపించడం లేదు. - రెండు రోజులు ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ రిపోర్టు ఉండగా గుర్తింపు లేని ల్యాబ్ నుంచి మరోసారి ఎందుకు కోవిడ్ టెస్ట్ చేయించారు. - నిబంధనలకు విరుద్ధంగా చేసిన టెస్ట్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండ లేకుండా పోయింది. అంతేకాదు ప్రయాణం చేయకుండా నా ప్రాథమిక హక్కును అడ్డుకున్నారు. చదవండి: అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా.. -
కరోనా టెస్ట్ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష
కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో.. పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్లో పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆమె పనిచేసే మాల్లో పాతిక మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్‌తో కలిసి ఆమె సైతం పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్‌కు రావాలంటూ సదరు ల్యాబ్‌టెక్నీషియన్(నిందితుడు) ఆ యువతి రప్పించుకున్నాడు. స్వాబ్ సేకరణలో భాగంగా ఈసారి శాంపిల్ సేకరణ ప్రైవేట్ పార్ట్ నుంచి చేయాలని చెప్పి.. నీచంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్‌ను సంప్రదించగా.. కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ ముక్కు, నోటి నుంచి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున్న నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ చేశారు. సుమారు పదిహేడు నెలల విచారణ తర్వాత.. అమరావతి జిల్లా కోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్ల 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
బయట నెగెటివ్.. ఎయిర్‌పోర్టులో పాజిటివ్.. మళ్లీ చేస్తే నెగెటివ్.. రచ్చ రచ్చ
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అక్కడి ల్యాబ్‌లో ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి. అయితే ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారం రిపోర్టులు ఇస్తున్నారని మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటిదే మరో సంఘటన గత గత గురువారం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి వెళ్లాల్సిన ఒక యువకుడు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని నివేదిక ఇచ్చారు. అంతకుముందే అతడు బయట టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మళ్లీ బయట టెస్టు చేస్తే నెగెటివ్‌గా తేలింది. దీంతో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌పోర్టుకు వచ్చి తనకు టెస్టు చేసిన సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలో సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. తప్పుడు నివేదిక వల్ల దుబాయ్‌కి వెళ్లలేకపోయానని, ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. ఈ గొడవ వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, అడిగినంత డబ్బులను ముట్టజెబితే ల్యాబ్ సిబ్బంది ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. చదవండి: (అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు) -
భారతీయ ప్రయాణికులకు కెనడా శుభవార్త! ఆ నిబంధనలు ఎత్తివేత?
ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఇండియా నుంచి నేరుగా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల విషయంలో కెనడా కఠిన ఆంక్షలు విధించింది. కెనడా బయట్దేరడానికి 18 గంటల ముందు కోవిడ్ నెగటీవ్ సర్టిఫికేట్ (ఆర్టీ పీసీఆర్) సమర్పిస్తేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. ఇక సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులైతే మార్గమధ్యంలోని ఎయిర్‌పోర్టులో కూడా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటూ నిబంధన విధించింది. దీని కారణంగా అనేక మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో క్వారంటైన్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కెనడా ప్రభుత్వం తాజాగా సడలించిన నిబంధనల ప్రకారం ఇండియా నుంచి నేరుగా లేదా సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులకు 18 గంటల కోవిడ్ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు టెస్ట్ చేయించిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే చాలని పేర్కొంది. ఇండియాతో పాటు మొరాకో దేశానికి ఈ మినహాయింపును వర్తింప చేస్తోంది. 2022 జనవరి 28 నుంచి ఈ మినహాయింపు అమల్లోకి రానుంది. Effective January 28, 2022, we’re removing the modified pre-departure #COVID19 test requirements for travellers on direct flights to Canada from #India and #Morocco, and the requirement for third country testing for travellers on indirect routes to Canada from these countries. https://t.co/07qv65DtIQ — Transport Canada (@Transport_gc) January 28, 2022 కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన సందర్భంలో భారతీయ ప్రయాణికులపై కెనడా నిషేధం విధించింది. ఐదు నెలల అనంతరం 2021 సెప్టెంబరు 27న విమాన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. కానీ కొద్ది కాలానికే ఒమిక్రాన్ వెలుగు చూటడంతో మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చదవండి: ప్రయాణం మధ్యలో పాజిటివ్. అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు -
Covid: కొద్దిపాటి జలుబు, జ్వరానికే పాజిటివ్.. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయాందోళనలతో టెస్టుల కోసం వెళ్లే బాధితులను పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సకాలంలో వెలువడని ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులైనా ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు కోవిడ్ పరీక్ష ఫీజులను అమాంతం పెంచి నిలువునా దోచుకుంటున్నాయి. వారం, పది రోజుల క్రితం వరకు రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఇప్పుడు ఏకంగా రూ,750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాలు రూ.1500 వరకు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రస్తుతం ఇదో దందాగా మారింది. కొద్దిపాటి జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంంతో జనం తప్పనిసరిగా పరీక్షలకు వెళ్లాల్సివస్తోంది. చదవండి: Corona: తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది.. అక్కడా పడిగాపులే... నగరంలోని సుమారు 200కుపైగా బస్తీ దవాఖానాలు, మరో 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ఏరియా ఆస్పత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ పరి«ధిలో రోజుకు 50వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంచనా. ఒక్కో ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో మాత్రం తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. బాధితుల తాకిడి, డిమాండ్ మేరకు పరీక్షలు నిర్వహించే సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో, ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యంగా మారింది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫలితాల కోసం 48 గంటల పాటు నిరీక్షించాల్సివస్తే మరికొన్ని చోట్ల మూడు రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బాధితులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సాధారణ జలుబు, జ్వరమో, కోవిడ్ లక్షణాలో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలో, వద్దో తెలియడం లేదు’ అని సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి ‘తమకు తెలియకుండానే కుటుంబ సభ్యులను కూడా వైరస్‌కు గురి చేసినట్లవుతుంద’ని పద్మారావునగర్‌కు చెందిన మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగానే కొన్ని చోట్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ‘ప్రతి రోజూ వందలాది మంది నుంచి నమూనాలను సేకరించే క్రమంలో సిబ్బంది సైతం కోవిడ్ బా రిన పడుతున్నారు’అని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు ఒకరు తెలిపారు, రెండోసారి తప్పనిసరి కాదు.. కోవిడ్ పరీక్షల కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ‘సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఒమిక్రాన్ బారిన పడినవారు వారం పాటు ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే చాలు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకపోతే ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. మరోసారి పరీక్షలు అవసరం లేదు’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివరాజ్ తెలిపారు. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ.. బాధితుల అవసరాన్ని, ఆపదను ప్రైవేట్ లాబ్‌లు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోచుకుంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాలు పరీక్ష ఫీజులు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ నెల రెండో వారం వరకు కేవలం రూ.500కే ఆర్టీపీసీఆర్ నిర్వహించిన లాబ్‌లలో ఇప్పుడు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు పెంచారు. వైరస్ ఏ రకం వేరియంటో కూడా తమ పరీక్షల్లో తేలుతుందని, డెల్టా రకమా? ఒమిక్రానా? చెప్పేస్తామని మరికొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు రూ,1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నమూనాలు సేకరిస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఫీజులు మరింత పెరగవచ్చు’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు ఇలా వేల రూపాయల్లో ఖర్చు చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ 24 గంటల తర్వాతే ఫలితాలు వెలువడడం గమనార్హం. -
కరోనా హైరానా: తప్పుల తడకగా పరీక్షా ఫలితాలు
రాహుల్.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. సాయంత్రానికి నెగెటివ్ అని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పాజిటివ్ అని మరో మెసేజ్ వచ్చింది. దీంతో ఏది నిజమో తెలియక ఆయన ఆందోళనలో పడిపోయాడు. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. మూడురోజుల తర్వాత పాజిటివ్ అంటూ ఫలితం వచ్చింది. ఆ మూడురోజులూ ఆయన ఎంతో ఆందోళనకు గురయ్యాడు. డాక్టర్ కృష్ణ్ణకాంత్ (పేరు మార్చాం)కు, ఆయన భార్యకు ఇద్దరికీ తీవ్రమైన జలుబు, కాస్తంత జ్వరం ఉండటంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. అందులో ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇచ్చారు. రెండ్రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ‘ఇన్డిటర్మినేట్’(అనిశ్చయత) అని వచ్చింది. తర్వాత మూడో రోజు పాజిటివ్ అంటూ మరో రిపోర్టు పంపారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండగా కొందరి పరీక్షా ఫలితాల్లో ఆలస్యం, గందరగోళం చోటు చేసుకుంటుండడంతో అనుమానితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతుండగా కొన్ని కేసుల్లో పాజిటివ్ అని ఒకసారి రిపోర్టు వచ్చిన కాసేపటికే నెగిటివ్ అంటూ మరో రిపోర్టు వస్తోంది. అలాగే ముందు నెగిటివ్ అని చెప్పి తర్వాత పాజిటివ్ అంటున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో సైతం కొన్ని సందర్భాల్లో ఇలాంటి గందరగోళం చోటు చేసుకుంటున్నా.. చాలావరకు కేసుల్లో రెండు మూడు రోజులకు కానీ ఫలితం రావడం లేదు. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో బాధితులు చాలాచోట్ల ప్రై వేట్ లేబరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1,500 వరకు వసూలు చేస్తుండటంతో జేబులు గుల్లవుతున్నాయి. 25 వేల టెస్టుల సామర్థ్యమున్నా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 ఆర్టీపీసీఆర్ లేబరేటరీలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 25 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. అయినా రోజుకు 10 వేల వరకు ఫలితాలు వెయిటింగ్లో ఉంటున్నాయి. ఆయా లేబరేటరీలపై సరైన పర్యవేక్షణ కొరవడడంతోనే పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున లేబరేటరీలను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణ సమయంలో కూడా సామర్ధ్యం మేరకు టెస్టులు జరగడం లేదు. జిల్లాల్లోని లేబరేటరీల్లో ఒక్కోచోట రోజుకు 300 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ స్థాయిలో చేస్తే రెండు మూడు రోజుల ఆలస్యం ఉండదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. చాలా లేబరేటరీలు 2 షిఫ్టులు కూడా పనిచేయడం లేదని సమాచారం. ఇంత కీలక సమయంలో ఇటువంటి అంశాలపై అధికారులు దృష్టి్ట పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడ సిబ్బంది కూడా లేక.. మరోవైపు సెకండ్ వేవ్‌లో నియమించుకున్న ల్యాబ్ టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆ తర్వాత కాలంలో తొలగించడం వల్ల కూడా ఇప్పుడు కీలక సమయంలో పనిచేసేవారు లేకుండా పోయారు. దీంతో తప్పుల తడక రిపోర్టులు, రెండు మూడు రోజుల ఆలస్యంతో నివేదికల వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఆలస్యపు రిపోర్టుల వల్ల పాజిటివా నెగెటివా తెలియక అనుమానితులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇతరులకు అంటిస్తున్నారు. కొందరికి పాజిటివ్ అయినా తెలియక మందులు వాడకపోవడంతో సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా నెలకొంటోంది. -
ఇదెక్కడి గోస నాయనా! అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు
దేశం కాని దేశంలో ప్రయాణం మధ్యలో చిక్కుకుని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ లేక ఫోన్లు కలవక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా మార్గమధ్యలో వచ్చిన కరోనానే అందుకు కారణం. టొరంటో వెళ్తూ హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ ఓమర్ అజామ్ అనే వ్యక్తి ఇండియా నుంచి కెనడాలోని టోరంటో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడున్న గేట్ నంబర్ 28 దగ్గరే అతన్ని గంటల తరబడి ఉంచారు. దీంతో సాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా అతను కోరాడు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని ఐసోలేషన్‌లో భాగంగా ఆల్ రజీమ్ క్వారంటైన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. లగేజీ ఇతర ముఖ్యమైన వస్తువులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాయి. అక్కడి అధికారులు ఎవరితో పెద్దగా కలవనివ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశారు అజామ్ I’m traveling from Hyderabad, India to Toronto, Canada via Abu Dhabi (20-Jan-2022). We are struck at Abu Dhabi airport since 18+ hours as some of the passengers including myself were tested positive for COVID19 (did multiple Rapid RT PCR test at airport facility). pic.twitter.com/Gwzx2DOS5h — Syed Omar Azam (@SyedOmarAzam1) January 20, 2022 మరింత మంది అజామ్ ట్వీట్‌కి క్వారంటైన్ సెంటర్లో ఉన్న మరో భారతీయుడు కూడా స్పందించాడు. మనిద్దరమే కాదు అనేక మంది ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారని.. ఇక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ తెలిపాడు. చివరకు ఆల్ రజీమ్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదా స్వదేశానికి వచ్చే విధంగా సాయం చేయాలంటూ వారు విదేశాంగ మంత్రి జయ్శంకర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా సాయం కోరారు. Dear sir i am also in al razeen camp that because you tested positive i know it is very hard to live here i am also living here with 5 people and there are lot of indians here. So dont loose hope and stay strong. Tell your room number and building number. — Voice of hyderabad (@Voiceofhyderab5) January 21, 2022 సాయం చేయండి ఇండియా నుంచి యూరప్, అమెరికాకు వెళ్లే అనేక మంది దుబాయ్, అబుదాబిలో కనెక్టింగ్ ప్లైట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. విమానం ఎక్కే ముందే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యంలో చేసే పరీక్షల్లో పాజిటివ్‌గా తేలుతున్నారు. దీంతో అజామ్ తరహాలో అనేక మంది దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వారికి అవసరమైన సాయం అందించే విషయంలో ముందుకు రావాలని కోరుతున్నారు. చదవండి: ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం -
కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..
సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): వేర్వేరు ఘటనల్లో నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ఆరుగురిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పి.లక్ష్మణ్(30) పదేళ్ల క్రితం డిప్లోమా పూర్తి చేసి పలు డయాగ్నోస్టిక్ సెంటర్లలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేశాడు. ఏడాది క్రితం ఆస్మాన్‌ఘడ్‌లో ‘హోం కేర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సెంటర్’ను ప్రారంభించాడు. ఇటీవల థర్డ్‌వేవ్ ప్రారంభం కావడంతో విమాన, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేయడాన్ని లక్ష్మణ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నాంపల్లికి చెందిన ప్రభాత్ కుమార్ సంఘీ(45) సహకారంతో అవసరమైన వారికి స్వాబ్‌ను పూర్తిస్థాయిలో తీయకుండా (లిక్విడ్ వేయకపోవడం) తను ఒప్పందం చేసుకున్న ల్యాబ్‌లకు పంపి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా చేసి వినియోగదారులకు ఇచ్చేవాడు. ఇలా ఒక్కో రిపోర్ట్‌కు రూ.2–3 వేల వరకు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, మలక్‌పేట పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 65 నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, 20 శాంపిల్ కిట్లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తూ వ్యాక్సిన్ తీసుకోకున్నా యూపీహెచ్ఎసీ అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నిషియన్ మహ్మద్ తారీఖ్ హబీబ్(28) ఏడాది క్రితం స్థానికంగానే “ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్’ను ఏర్పాటు చేసి నెగెటివ్ రిపోర్ట్లు ఇచ్చాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అఫ్జల్‌సాగర్ యూపీహెచ్‌సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ‘కుమారీ’ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో కలిసి పథకం పన్నాడు. మెహదీపట్నంకు చెందిన గులాం ముస్తఫా షకీల్(48), అబ్దుల్ బషీర్(37), ఇర్ఫాన్ ఉర్ రబ్ అన్సారీ (32)ల సహకారంతో వాటిని అందజేస్తున్నాడు. హుమాయన్‌నగర్ పోలీసులతో కలిసి దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
ఫ్రీగా కోవిడ్ కిట్సా.. జాగ్రత్తగా ఉండండి!!
కీర్తి (పేరు మార్చడమైనది)కి రెండు రోజులుగా జలుబు, దగ్గు, కాస్త జ్వరంగా ఉంది. ఇంట్లో వాళ్లు కోవిడ్ ఏమో టెస్ట్ చేయించుకుంటే మంచిది అని పోరుతున్నారు. దానికి టెస్టింగ్ సెంటర్ వరకు ఎందుకు కిట్ తెప్పించుకుంటే సరిపోతుంది కదా! అని ఆన్లైన్లో శోధించడం మొదలుపెట్టింది. ఒక లింక్‌లో రూ.100 కే కోవిడ్ టెస్ట్ కిట్ అని చూసింది. కిట్ సమయానికి రాకపోతే మనీ బ్యాక్ కూడా చేస్తాం డీటెయిల్స్ ఇస్తే అని ఉంటే.. తన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత తన అకౌంట్ నుంచి డబ్బులు వేరేగా ట్రాన్స్ఫర్ అవడం చూసి బ్యాంక్‌ను సంప్రదించి, తను మోసపోయానట్టుగా తెలుసుకుంది. ∙∙ కరోనా మహమ్మారి ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే మరో వైపు సైబర్‌నేరగాళ్లు రకరకాల పద్ధతులు ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాతో పాటు ఖాతా నుంచి నగదు కూడా దొంగిలిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో బ్యాంకుల మారటోరియం గురించి వివరాలు సేకరిస్తున్నాం అంటూ, చారిటీ ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నాం అంటూ, మాస్కులు ఫ్రీగా ఇస్తున్నాం అని, ఆక్సిజన్ సిలండర్లు తక్కువ ధరకే అంటూ.. రకరకాల లింక్‌లను ఆన్లైన్ వేదికగా సెండ్ చేశారు. వాటి ద్వారా మోసపోయినవారూ ఉన్నారు. ∙∙ కోవిడ్ బూస్టర్ డోసులు, కోవిడ్ టెస్టింగ్ కిట్, డాక్టర్ ఆన్ హెల్ప్.. ఈ మూడింటిపై ఎక్కువ ఫ్రాడ్ జరుగుతున్నాయి. మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే 24 గంటలు మీకు ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. అవసరమైతే మీకు మనిషిని కూడా ఏర్పాటు చేస్తాం, పేదలకు సాయం చేయండి అంటూ చారిటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. రూ.100లకే కోవిడ్ టెస్టింగ్ కిట్, తక్కువ ధరలో పల్స్ ఆక్సిమీటర్, స్మార్ట్ పల్స్ వాచ్, పోస్టర్ కిట్ ఎట్ హోమ్... ఇలాంటివాటిని ఆధారంగా చేసుకొని రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు సైబర్‌నేరగాళ్లు. (చదవండి: జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్.. యూత్‌ను పట్టేసింది!) మోసాల నుంచి జాగ్రత్త.. ► కోవిడ్ ఆధారిత వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తాం అనే ఎసెమ్మెస్, వాట్సప్ లింక్‌లు వస్తుంటాయి. వీటిని క్లిక్ చేయకుండా ఉండాలి. ► కోవిడ్–19ను ప్రస్తావిస్తూ వచ్చిన తెలియని ఇ–మెయిల్లను, లింక్‌లను, మ్యాప్‌లను క్లిక్ చేయరాదు. ► ఇ–మెయిల్, బ్యాంకింగ్ వాటికి విడివిడిగా రెండు ఫోన్ నెంబర్లను వాడటం మంచిది. ► మీ పాస్‌వర్డ్‌లను అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్వర్డ్లు సంక్లిష్టమైన వర్డ్స్‌తో ఉండేలా జాగ్రత్తపడండి. ► అక్షరదోషాలు, అదనపు పదాలు ఉన్న URLల పట్ల జాగ్రత్త వహించండి. ► విరాళం ఇచ్చే ముందు స్వచ్ఛంద సంస్థ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి. ► కోవిడ్–19 గురించిన తాజా సమాచారం కోసం చట్లబద్ధమైన, ప్రభుత్వ వెబ్సైట్లను ఉపయోగించండి. ► ఆన్లైన్ చాట్లు, సమావేశాలలో పాల్గొన్నప్పుడు మీరున్న నేపథ్య స్థానాన్ని బ్లర్ చేయడం, ఇతర చిత్రాలను ఉపయోగించడం మంచిది. - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
లక్షల్లో కేసులు.. కరోనా పరీక్షల కోసం క్యూ కడుతున్న హైదరాబాదీలు
-
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
-
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు. 6,996 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384 చేరింది. ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది. -
TS: ఆస్పత్రుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి : తెలంగాణలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడుతుండడం చూస్తున్నాం. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 120 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 120 మందికి పైగా కరోనా సోకగా.. ఇందులో 38 మంది వైద్యులు, 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ పరిణామాలతో పేషెంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతుండగా.. పేషెంట్ల బంధువుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇన్ పేషంట్లు గా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు 9మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు ఉన్న మరికొందరి ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. భద్రాద్రిలో.. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షణాలున్న 286 మందికి కరోనా పరీక్షలు నిర్వహించించగా.. వీళ్లలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు. -
జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భారిన పడేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకట్టుకున్న డ్రాగన్ దేశం..కరోనా కట్టడిలో భాగంగా ప్రజలపై పలు కఠినమైన ఆంక్షలు విధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత దారుణంగా పౌరులను కిక్కిరిసిన బాక్స్‌లో నిర్భంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. China has imposed several draconian rules: చైనా కరోనా కట్టడిలో భాగంగా పలు కఠిన ఆంక్షలు విధించుకుంటూ పోతుంది. మరోవైపు వచ్చే నెలల జరగనున్న వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చే నేపథ్యంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. జీరో కోవిడ్ విధానం అంటూ చైనా తన దేశంలో పౌరులపై క్రూరమైన నిబంధనలను అమలు చేసింది. ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్ బాక్స్‌లలో నివశించేలా నిర్భంధించింది. అయితే వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్ బాక్స్‌ల వరుసలు కనిపించాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వృద్ధులతో సహా ప్రజలు, చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడిన ఈ కిక్కిరిసిన పెట్టెల్లో ఉండేలా బలవంతం చేస్తోంది. పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు చైనాలోని తమ ప్రజల కదిలికలను సైతం ట్రాక్-అండ్-ట్రేస్ యాప్ ద్వారా గుర్తించి మరీ నిర్భంధిస్తోంది. చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఖరికి ఆహారం కొనడానికి కూడా తమ ఇంటిని వదిలి వెళ్లకుండా నిషేధించారు. Millions of chinese people are living in covid quarantine camps now! 2022/1/9 pic.twitter.com/wO1cekQhps — Songpinganq (@songpinganq) January 9, 2022 Millions of chinese people are living in covid quarantine camps now! 2022/1/9 pic.twitter.com/wO1cekQhps — Songpinganq (@songpinganq) January 9, 2022 -
Andhra Pradesh: లక్షణంగా ఆరోగ్యం
Andhra Pradesh: రాష్ట్రంలో గతంలో ఒక్క వీఆర్డీఎల్ (వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్) ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం రోజూ లక్ష మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి ల్యాబ్‌లను నెలకొల్పామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. కోవిడ్‌తో ఆర్థిక కష్టాలు తలెత్తినా ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నాడు – నేడు ద్వారా వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. కోవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, పిల్లలకు వ్యాక్సినేషన్లోనూ అందరి కన్నా ముందున్నామని చెప్పారు. ఫిబ్రవరి నాటికి వైద్య రంగంలో 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 23 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్పీఎం సామర్ధ్యం కలిగిన 144 (ఆక్సిజన్ జనరేషన్) పీఎస్ఏ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. 247 పీఎస్ఏ ప్లాంట్లు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను అంటే సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. ఈ 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. 50 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వంద పడకలకుపైగా ఉన్న మరో 71 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీని భరిస్తూ చేయూత అందిస్తోంది. తద్వారా 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆక్సిజన్ కొరతతో అస్తవ్యస్తం.. కోవిడ్ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆక్సిజన్ కొరత వల్ల దేశవ్యాప్తంగా ఎంత ఇబ్బందులు ఎదురయ్యాయో అంతా చూశాం. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో తరలించాల్సి వచ్చింది. విదేశాల నుంచి కూడా తెప్పించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. క్రయోజనిక్ ట్యాంకుల్లో విదేశాల నుంచి ఓడల్లో కూడా తర లించాల్సి వచ్చింది. నిమిషానికి 44 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి.. అలాంటి పరిస్థితులను సమర్థంగా అధిగమించి ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాం. రూ.426 కోట్లు ఖర్చు చేసి నిమిషానికి 44 వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 ప్లాంట్లను ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఆదాయం తగ్గినా.. సంక్షేమం తగ్గలేదు కోవిడ్‌తో రెండేళ్లుగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి మంచి జరగాలనే ఆరాటంతో సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. నాడు –నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్లను బాగు చేశాం. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి దూరదృష్టితో సిద్ధం.. కోవిడ్ మేనేజ్మెంట్లో మరో కీలక ఘట్టం మొదలైంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రజల ప్రాణాల పరిరక్షణ, ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వేల కోట్లు వెచ్చించారు. కోవిడ్‌ను మనం ఎంత కట్టడి చేసినా ఆక్సిజన్ కోసం కేంద్రంపై ఆధారపడటం, ఇతర రాష్ట్రాల నుంచి కోటా మేరకు పొందటాన్ని గతంలో చూశాం. వీటిని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టితో ఆదేశించారు. భవిష్యత్‌లో ఎన్ని వేవ్‌లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి చిత్తూరు, తిరుపతి వెళ్లాల్సిన పనిలేదు.. చిత్తూరు జిల్లాలో 27 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. పుంగనూరు ఆసుపత్రిలో కూడా ప్లాంట్ ఏర్పాటైనందున ఆక్సిజన్ కొరతతో రోగులను చిత్తూరు, తిరుపతి పంపాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే వైద్యం అందించగలుగుతున్నాం. – డాక్టర్ కిరణ్, మెడికల్ ఆఫీసర్æ, పుంగనూరు సీహెచ్‌సీ, చిత్తూరు మందులు.. మంచి భోజనం కోవిడ్ సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్రంగా సోకడంతో నాకు ఆక్సిజన్ లెవల్స్ 75కి పడిపోయాయి. గుంటూరు జీజీహెచ్‌లో ఐసీయూకి తరలించి మెరుగైన చికిత్స అందించారు. మందులతో పాటు మంచి భోజనం కూడా పెట్టారు. ఆ సమయంలో మీరు (సీఎం వైఎస్ జగన్) చక్కగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మీ ముందు నిలుచుని ఇలా మాట్లాడుతున్నానంటే అది మీరు పెట్టిన భిక్షే. – శైలజ, కోవిడ్ బాధితురాలు -
కరోనా పరీక్షలు.. పండుగ తర్వాత పరుగులు
సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కువ పరీక్షలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ (వీఆర్డీఎల్)లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మాత్రమే ఇవి ఉండటంవల్ల జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి నమూనాలు తరలించి, పరీక్షలు చేసి ఫలితాలు వెలువరించడానికి కొంత సమయం పడుతోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, కొన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రయోగశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటిల్లో పనిచేయడానికి మైక్రోబయాలజిస్ట్‌లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత వీటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ పరీక్షలు చేసి తద్వారా పాజిటివ్ రోగులను గుర్తించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నది సర్కారు భావన. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో.. ప్రస్తుతం ఈ వీఆర్డీఎల్ ల్యాబ్‌లు రాష్ట్రంలోని 14 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 19 చోట్ల కొత్త ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ ప్రయోగశాలల్లో క్షయ, హెచ్ఐవీ, డెంగీ, ఇతర వైరస్ పరీక్షలూ చేసేందుకు వీలుంటుంది. ప్రారంభంలో ఒక్కో సెంటర్ రోజుకు వెయ్యి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉంటుంది. ముందు ముందు నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తొలి నుంచి దూకుడుగా.. కరోనా కట్టడి చర్యల్లో సీఎం వైఎస్ జగన్ సర్కార్ తొలి నుంచి దూకుడుగానే ముందుకెళ్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 10న నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది. ప్రారంభంలో వైరస్ నిర్ధారణకు రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడాలేదు. పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు అప్పట్లో నమూనాలు పంపేవారు. తదనంతరం యుద్ధప్రాతిపదికన అదే ఏడాది అక్టోబర్ నాటికి రోజుకు 80వేల ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్, యాంటిజెన్లతో కలిపి రోజుకు ఒక లక్ష నుంచి 1.20 లక్షల పరీక్షల సామర్థ్యం కలిగిన 150 ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తాజాగా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరీక్షలు చేపట్టడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఇటీవల ప్రారంభించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నమూనాలను ప్రస్తుతం విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. పండుగ తర్వాత అందుబాటులోకి సంక్రాంతి పండుగ అనంతరం ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. సిబ్బంది నియామకానికి వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది నియామకం, ఇతర కార్యకలాపాల పురోగతిపై రోజు సమీక్షిస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రూ.6.22 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 19 ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.22 కోట్లు వెచ్చించింది. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చుల రూపంలో నెలకు రూ.1.10 కోట్లు ఖర్చుచేయనుంది. – వినయ్‌చంద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ -
కోవిడ్ రిపోర్టును నెగిటివ్‌గా మార్చి తప్పించుకోవాలని ప్లాన్.. చివరిలో
మైసూరు(కర్ణాటక): కోవిడ్ రిపోర్టును నెగిటివ్‌గా మార్చుకుని చెక్‌పోస్టు దాటాలని చూసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని తిరిగి వెనక్కి పంపిన ఘటన మైసూరు జిల్లా హెచ్‌డీకోటె తాలూకా బావలి చెక్‌పోస్టు వద్ద గురువారం చోటు చేసుకుంది. మైసూరు సమీపంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతంగా ఉండటంతో కేరళ–మైసూరు సరిహద్దులో భారీ బందోబస్తు ఉంది. కోవిడ్ నెగెటివ్ ఉన్న వారినే మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఓ వ్యక్తి తన పాజిటివ్ రిపోర్టును నెగెటివ్‌గా మార్చుకుని చెక్‌పోస్టు దాటాలని చూశాడు. చెక్‌పోస్టు పోలీసులు బస్సులో ఉన్న ఇతని రిపోర్టును నిశితంగా పరిశీలించి మార్చినట్లుగా గుర్తించి తిరిగి వెనక్కి పంపారు. ( చదవండి: ‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్ ) మరో ఘటనలో.. కళాశాలలో వ్యాక్సిన్ డ్రైవ్ బనశంకరి: పుట్టేనహళ్లిలోని జేపీ.నగర నారాయణ పీయూ కళాశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం కాలేజీలో నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ సతీశ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రభావతి రమేశ్, జల్లిరమేశ్, మాజీ నగరసభ సభ్యుడు మురళీధర్, బీజేపీ నేత రమేశ్‌రాజు, కాలేజీ డీన్ సురేంద్రనాథరెడ్డి, ప్రిన్సిపాల్ జగదీశ్, ఏజీఎం బాబు, రీజనల్ ఇన్చార్జ్ నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
విమానంలో భారత్‌కు వచ్చిన 125 మందికి కరోనా
-
China: స్మార్ట్‌ఫోన్ బదులు బియ్యం! కూరగాయలకు బదులు..
ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందన్న అపవాదును మోస్తున్న డ్రాగన్ కంట్రీ.. వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు కేసులు, మరణాల సంఖ్యను దాస్తూనే.. మరోవైపు జీరో కేసులంటూ ప్రకటనలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క కేసు కూడా బయటపడలేదంటూనే జియాన్ నగరంలో భారీ లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి కోటికి పైగా జనాభా ఉన్న జియాన్ మహానగరంలో లాక్డౌన్ అమలు అవుతోంది. కఠిన ఆంక్షలతో జనాలు అడుగు బయటవేయని పరిస్థితి నెలకొందక్కడ. మీడియా ఎలాగూ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా జనాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలి కేకలతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. Scenes from Xi’An lockdown: return of the barter economy 🚬 People can no longer leave their flats, even to shop. This resident makes light of the situation via Kuaishou, a TikTok-like social media platform pic.twitter.com/gsE9NnJnWz — Cindy Yu (@CindyXiaodanYu) January 3, 2022 ఓవైపు ప్రభుత్వమేమో.. తాము ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ, సోషల్ మీడియాలో జనాల ఆవేదన మరోలా ఉంటోంది. అసలు సహాయమే అందట్లేదని వాపోతున్నారు జియాన్ నగర వాసులు. ఈ మేరకు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెయిబోలో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. క్యాబేజీకి సిగరెట్, యాపిల్స్‌కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్, రొట్టెలకు బదులు నూడుల్స్.. ఇలా వస్తు మార్పిడి ఇది అక్కడ కనిపిస్తోంది అక్కడ. ఎక్కువగా అపార్ట్మెంట్లలో ప్రజలు ఇలా వస్తు మార్పిడితో పొట్ట నింపుకుంటున్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు సైతం.. లాక్డౌన్ ద్వారా ఎదుర్కొంటున్న పరిస్థితులపై రేడియో ఛానెల్స్ ఇంటర్వ్యూల ద్వారా పలువురు వాపోతుండడం విశేషం. బియ్యం కోసం ఏకంగా స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను అమ్మేయడం, తాకట్టుపెట్టడం లాంటి పరిస్థితులు జియాన్ నగరంలో కనిపిస్తున్నాయి. కొందరు వయసుపైబడిన వాళ్లు.. పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుందో అనే గ్యారెంటీ లేకపోవడంతో.. ఫ్రిడ్జ్‌లను నింపేస్తున్నారు. మరికొందరు మాత్రం జాలి పడి.. ఇతరుకు దానం చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి. జియాన్ నగరంలో కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా.. అధికారులు, ప్రభుత్వ తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు జనాలు. తిండి కోసం క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్నారన్న కథనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వైపు ఈ-కామర్స్ డెలివరీలకు, ఎమర్జెన్సీ వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. గుండెపోటు, ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెయిబో అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. xi'an city When apartment building's gates locked and residents can't go out for groceries shopping... People go back to barter! 2022/1/2 pic.twitter.com/0NKBHmY1uI — Songpinganq (@songpinganq) January 2, 2022 కఠిన లాక్‌డౌన్‌తో చైనాలోని ఒక్కో ప్రాంతాన్ని బంధించుకుంటూ పోతోంది చైనా ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే ఉచితంగా సరుకుల చేరివేత పరిమితంకాగా, కరోనా పరీక్షలకు సైతం సిబ్బంది వెనుకడుగు వేస్తుండడం విశేషం. మరోవైపు పోలీసులు జనాల్ని అడుగు తీసి బయటపెట్టనివ్వడం లేదు. చివరికి ఆస్పత్రులకు, అవసరాలకు సైతం బయట అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా మూడే కేసులు వచ్చాయంటూ ప్రకటిస్తూ.. 11 లక్షల జనాభా ఉన్న యుజౌవు నగరాన్ని రాత్రికి రాత్రే లాక్డౌన్ పేరిట మూసేశారు. కొత్త సంవత్సర వేడుకలు, ఆ వెంటనే శీతాకాల ఒలింపిక్స్ ఉన్నందున ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత వార్త: వుహాన్‌ను మించిన లాక్డౌన్.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు -
కోవిడ్ టెస్ట్ ఇంట్లోనే
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వెళ్లి క్యూలైన్లో నిల్చొవాల్సిన పనిలేదు.. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇంట్లోనే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతించింది. టెస్ట్ కిట్లను మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతిస్తారు. పరీక్ష చేసుకునే విధానం కిట్ లో ఉంటుందని వైద్య, ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. కిట్ ధరను మాత్రం త్వరలో వెల్లడించ నున్నాయి. ఇప్పటికే అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ ఆసుపత్రుల్లోనే.. ఇప్పటివరకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు తదితర చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేసేవారు. ప్రైవేట్‌లో ఈ టెస్టులు అందుబాటులో లేవు. పది నిమిషాల్లో ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో 90 శాతం పరీక్షలు ర్యాపిడ్ యాంటిజెన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. రోజుకు వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తుంటారు. దీనికోసం లైన్లలో నిలబడటం ప్రయాసగా మారింది. పైగా కరోనా ఉన్నవారు ఇతరులకు అంటించే కేంద్రాలుగా కూడా ఆసుపత్రుల వద్ద పరిస్థితి తయారైంది. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులన్నీ తగ్గనున్నాయి. కొన్నిచోట్ల అనధికారికంగా కొన్ని లేబొరేటరీల్లో నిర్వాహకులు ఇంటికొచ్చి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కాగా, ర్యాపిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే చేస్తారు. ఇంటి వద్దకే మందులు.. ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తారు. ఈ మేరకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరికివారు సొంతంగా పరీక్షలు చేయించుకుంటే ఆ వివరాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎంతమందికి కరోనా సోకిందో పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉండదన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే స్వాబ్‌ను సరిగా తీయకుంటే సరైన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 25 లక్షల మేరకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు కోట్ల వరకు కొనుగోలు చేస్తారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కరోజే 397 కరోనా కేసులు!!
సాక్షి హైదరాబాద్: గ్రేటర్‌జిల్లాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వందలోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దు రాష్ట్రాల రోగులపై నిఘా.. డెల్టా సహా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఇతర సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం నగరానికి చేరుకుంటున్నారు. వీరికి సహాయంగా వచ్చిన బంధువులు సాధారణ రోగుల మధ్యే తిరుగుతున్నారు. వీరి ద్వారా ఇతర రోగులకు కూడా వైరస్ విస్తరిస్తుండటంతో పోలీసులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులపై నిఘా పెట్టారు. రోగులు, వారి సహాయకులు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన 23 మందికి.. విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 423 మందిలో 23 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం 53 శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే..