న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్‌ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. గత 24 గంటల్లో.. ఏకంగా 7,240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మార్చి 2 తర్వాత ఇదే అత్యధిక కేసులు కావడ గమనార్హం.
భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ దేశంలో కొత్త కేసుల పెరుగుదల 40 శాతంపైగా కనిపిస్తోంది. మొత్తం 7, 240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మూడున్నర లక్షల టెస్టులకుగానూ.. ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
మహారాష్ట్ర, కేరళలో కొత్త, క్రియాశీలక కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క ముంబై నగరంలోనే బుధవారం 1, 765 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్ర అప్రమత్తం అయ్యింది. క్లోజ్డ్ పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని చెప్తుండడం విశేషం.
తాజా కరోనా మరణాలు ఎనిమిది రికార్డు కాగా.. దేశంలో ఇప్పటిదాకా కరోనాతో 5, 24, 723కి చేరింది. డెయిలీ పాజిటివిటీ రేటు 2.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.31 శాతంగా నమోదు అవుతోంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 32,498కి చేరడం కలవర పరుస్తోంది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) June 9, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EcaW7dPkRU pic.twitter.com/XgCWmTPGtU
Comments
Please login to add a commentAdd a comment