
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అలర్ట్. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక, తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో నేడు 12 కేసులు నమోదయ్యాయి.
వివరాల ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇక, ఈరోజు 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. నేడు నమోదైన కేసులో హైదరాబాద్‌లోనే తొమ్మిది కేసులున్నాయి.
హైదరాబాద్- 9 కేసులు
రంగారెడ్డి- 1
సంగారెడ్డి-1
వరంగల్-1.
Comments
Please login to add a commentAdd a comment