సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక, తెలంగాణలో కొత్తగా మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నాట్టు బులిటెన్‌లో తెలిపారు. అలాగే, కరోనా నుంచి నేడు ఒకరు కోలుకున్నారు. ఈరోజు తెలంగాణలో 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో ఎనిమిది, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.
మరోవైపు.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment