![Aiden Markram tests positive for COVID-19 - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/10/south-africa.jpg.webp?itok=Z-1BrUCL)
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో మార్క్రమ్ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టియన్ స్టబ్స్ ప్రోటిస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా తొలి టీ20 టాస్ సమయంలో ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వెల్లడించాడు.
"మార్క్రామ్ తొలి టీ20కు అందుబాటులో లేడు. అతడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అతడు స్థానంలో స్టబ్స్ డెబ్యూ చేయనున్నాడు" అని బావుమా పేర్కొన్నాడు. ఇక కోవిడ్ బారిన పడిన మార్క్రామ్ ఐదు రోజుల పాటే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20కు కూడా మార్క్రమ్ దూరమమ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20:
టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్
భారత్ స్కోరు: 211/4 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు)
ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్
చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి'
Comments
Please login to add a commentAdd a comment