Markram
-
South Africa vs India: సఫారీ గడ్డపై సమరానికి సై
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్‌ను ప్రతీకార సమరంగా చూడలేం. పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్‌కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది. డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్‌లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్‌కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది. సుస్థిర స్థానం కోసం... సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టి20 సిరీస్‌లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. రెండో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు. ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్‌లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్‌లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్‌గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను నడిపిస్తుండగా...అవేశ్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. హిట్టర్లు వచ్చేశారు... వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్డ్రిక్స్తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో మార్క్రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఈ సిరీస్ ద్వారా ఫామ్‌లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్‌దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెపె్టన్), హెన్డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి, కేశవ్, బార్ట్‌మన్.పిచ్, వాతావరణం కింగ్స్‌మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది?
టీ20 వరల్డ్‌కప్-2024లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం(జూన్ 3) న్యూయర్క్ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఈ పొట్టిప్రపంచకప్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.దక్షిణాఫ్రికా దంచికొడుతుందా?దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబాడ, మార్కో జానెసన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.కానీ ఇప్పుడూ వీరంతా జట్టులోకి రావడంతో శ్రీలంకకు గట్టిసవాలు ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ప్రోటీస్ జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్లో రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, వండర్ డస్సెన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.అయితే కెప్టెన్ మార్క్రమ్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇక బౌలింగ్‌లో కూడా కగిసో రబాడ, అన్రిచ్ నోర్డే, జానెసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయలేం.లంకేయులు పోటీ ఇస్తారా?శ్రీలంకలో మునపటి జోష్ లేనప్పటికి తమదైన రోజున ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించగలదు. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన వార్మాప్ మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి వార్మాప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.అయితే ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో మాత్రం లంక భారీ విజయాన్ని అందుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో శ్రీలంక ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుంది. శ్రీలంక కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృఢంగా కన్పిస్తోంది.బ్యాటింగ్‌లో పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక, మాథ్యూస్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ వనిందు హసరంగా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి రావడం లంకకు కలిసొచ్చే ఆంశం. బౌలింగ్‌లో చమీరా, పతిరానా వంటి కీలక ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. చివరగా లంక సమిష్టగా రాణిస్తే ప్రోటీస్‌కు కష్టాల్లు తప్పవు.దక్షిణాఫ్రికాదే పై చేయి..కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. సౌతాఫ్రికా మూడింట, శ్రీలంక కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.తుది జట్లు(అంచనా)శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, వనిందు హసరంగా (కెప్టెన్), దసున్ షనక, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, మతీషా పతిరణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, ఒట్నీల్ బార్ట్‌మన్. -
SA T20 WC Squad: మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దక్షిణాఫ్రికా
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. గత ఏడాది మార్చిలో తొలిసారి దక్షిణాఫ్రికా టి20 జట్టుకు కెపె్టన్‌గా ఎంపికైన మార్క్రమ్ సారథ్యంలోనే సఫారీ బృందం ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది.వికెట్ కీపర్ రికెల్టన్, పేసర్ బార్ట్‌మన్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. డికాక్, కొయెట్జీ, ఫోరŠూట్యన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, నోర్జే, రబడ, షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్
టి20 క్రికెట్లో మ్యాచ్ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించరు. ఓవర్ ఓవర్‌కు ఫలితాలు మారుతాయి కాబట్టే పొట్టి క్రికెట్‌కు అంత ఆదరణ దక్కింది. కొన్ని జట్లు ఒక్క పరుగుతో ఓడిపోయిన సందర్భాలు చూసే ఉంటారు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్లో పరుగుల పండగ చేసుకున్న జట్టు.. ఆ ఓవర్లో వచ్చిన పరుగులతోనే మ్యాచ్ విజయాన్ని శాసించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఫీట్ సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడో టి20లో నమోదైంది. మంగళవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టి20లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌కు తోడుగా.. ఐడెన్ మార్ర్కమ్ 18 బంతుల్లో 35 నాటౌట్ రాణించినప్పటికి సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తొలుత బ్రాండన్ కింగ్ 25 బంతుల్లో 36, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్ 22 బంతుల్లో 44 పరుగులు నాటౌట్, అల్జారీ జోసెఫ్ 9 బంతుల్లో 14 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు.. 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. స్ట్రైక్ తీసుకున్న షెపర్డ్ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షెపర్డ్ వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు రావడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. చిత్రంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో 26 పరుగులు బాదితే.. టార్గెట్‌లో సౌతాఫ్రికాకు ఆఖరి ఓవర్లో అదే 26 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తొలి ఇన్నింగ్స్ కాబట్టి ఒత్తిడి ఉండదు.. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ప్రొటిస్ విజయాన్ని దెబ్బతీసింది.ఈ విజయంతో వెస్టిండీస్ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టి20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్ నిలవగా.. జాన్సన్ చార్లెస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. West Indies vs South Africa 3rd T20 highlight WI 220-8(20)/213-6(20)SA#Highlights #SAvsWI #3rdt20 Watch full highlight on YouTube 👇https://t.co/tZW9e0Hbqc 1k subscribers Kara do yarr🙏 Share please #cricket pic.twitter.com/VJELBSzoVL — cricket kida (@cricket_kida1) March 29, 2023 First SERIES WIN as CAPTAIN! Thanks to all involved, until next time South Africa 🇿🇦.#Rpowell52 pic.twitter.com/703d9d74Wy — Rovman Powell (@Ravipowell26) March 29, 2023 చదవండి: చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన -
మార్క్రమ్ సెంచరీ: దక్షిణాఫ్రికా 314/8
వెస్టిండీస్ జట్టుతో సెంచూరియన్‌లో మంగళవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు సాధించింది. ఓపెనర్లలో మార్క్రమ్ (174 బంతుల్లో 115; 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... డీన్ ఎల్గర్ (118 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించారు. మార్కో జాన్సెన్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు), కోట్జీ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జారి జోసెఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్బుత విన్యాసం.. మార్క్రమ్ డైమండ్ డక్
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అద్బుత విన్యాసం అబ్బురపరిచింది. ఐడెన్ మార్ర్కమ్ను ఔట్ చేసే క్రమంలో బట్లర్ అమాంతం డైవ్ చేస్తూ త్రో వేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. డేవిడ్ విల్లే వేసిన ఆ ఓవర్లో ఐదో బంతిని క్లాసెన్ డిఫెన్స్ ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించిన మార్క్రమ్ అనవసరంగా పరిగెత్తాడు. అప్పటికే క్లాసెన్ వద్దని వారించినా మార్ర్కమ్ వినకుండా సగం క్రీజు దాటేశాడు. అప్పటికే చిరుత వేగంతో పరిగెత్తుకొచ్చిన జాస్ బట్లర్ అమాంతం డైవ్ చేస్తూ బంతిని వికెట్లకు విసిరాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటేయడంతో మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. కాగా ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే మార్ర్కమ్ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: కెరీర్లో సవాళ్లు సహజం.. నేను ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోను! ఎందుకంటే! -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు దూరం..!
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ టీమిండియాతో జరిగిన తొలి మూడు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన రెండు టీ20లకు కూడా మార్క్రామ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్విటర్ వేదికగా వెల్లడించింది. తొలి టీ20కు ముందు మార్క్రామ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే గత ఏడు రోజులుగా ఐషోలేషన్‌లో ఉన్న మార్క్రామ్ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోలేనట్లు తెలుస్తోంది. "మార్క్రామ్కు పాజిటివ్‌గా తేలిన తర్వాత 7 రోజులు క్వారంటైన్లో గడిపాడు. అయితే అతడు ఇంకా కోలుకోలేదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు" అని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్వీట్ చేసింది. ఇక గాయం కారణంగా గత రెండు టీ20లకు దూరమైన ప్రోటిస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ నాలుగో టీ20కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు ఇక రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. రెండో మ్యాచ్‌కు కూడా..!
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో మార్క్రమ్ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టియన్ స్టబ్స్ ప్రోటిస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా తొలి టీ20 టాస్ సమయంలో ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వెల్లడించాడు. "మార్క్రామ్ తొలి టీ20కు అందుబాటులో లేడు. అతడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అతడు స్థానంలో స్టబ్స్ డెబ్యూ చేయనున్నాడు" అని బావుమా పేర్కొన్నాడు. ఇక కోవిడ్ బారిన పడిన మార్క్రామ్ ఐదు రోజుల పాటే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20కు కూడా మార్క్రమ్ దూరమమ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్ చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..!
టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక ఈ సిరీస్ కోసం టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు గురువారం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీ వేదికగా జూన్ 9న తొలి టీ20 జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో స్వదేశంలో జరగనున్న టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ప్రోటీస్ జట్టును ఓడించడం అంత సులభం కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు టీమిండియాకు దూరం కాగా... ప్రోటీస్ మాత్రం తమ బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో ఆడిన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి భారత్‌కు వీరి నుంచి గట్టి పోటి ఎదురుకానుంది. ఈ ముగ్గురు ఆటగాళ్ల పట్ల టీమిండియా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన డికాక్ దుమ్మురేపాడు. 15 మ్యాచ్ లు ఆడిన డికాక్ 508 పరుగులు చేశాడు. ఇందులో ఒక భారీ సెంచరీ కూడా ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డికాక్ 140 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు అద్భుమైన ఫినిషర్‌గా మిల్లర్ మారాడు. 16 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 481 పరుగులు సాధించాడు. అదే విధంగా పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడ.. 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక వీరితో పాటు ఐడెన్ మారక్రమ్, ఫాస్ట్ బౌలర్ జానేసన్ పర్వాలేదనిపించారు. టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ -
'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా డెబ్యూ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సూపర్ త్రోతో మెరిశాడు. అతని దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మార్ర్కమ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ నాలుగో బంతిని మార్క్రమ్ మిడాఫ్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినప్పటికి బవుమాకు సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో మార్ర్కమ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి చేరుకునేలోపే వెంకటేశ్ అయ్యర్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. క్రీజుకు కొన్ని ఇంచుల దూరంలో మార్క్రమ్ ఉండగా.. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడం బిగ్స్క్రీన్పై కనిపించింది. ఇంకేముంది మార్క్రమ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చదవండి: డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్ ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మార్క్రమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తొలి వన్డేలో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రిస్క్ అని తెలిసినా అనవసర పరుగుకు యత్నించి చేజేతులా మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం Aiden Markram wicket !! #SAvsIND #venkateshiyer pic.twitter.com/H3RlkwZHEl — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) January 19, 2022 -
అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్..
టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రత్యర్ధి జట్టుపై అత్యంత తక్కువ సగటు(16.26)తో బ్యాటింగ్ చేసిన మూడో ఓపెనర్‌గా మార్క్రామ్ నిలిచాడు. కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 8 పరుగులు చేసిన మార్కరమ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకున్నాడు. అంతకు ముందు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ 15.50 సగటుతో తొలి స్ధానంలో ఉండగా, 16.26 ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డెన్నిస్ అమ్మీస్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో మార్కరమ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు కలిపి కేవలం 60 పరుగులు మాత్రమే సాదించాడు. ఇక కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. -
దూసుకొచ్చిన మార్క్రమ్.. దిగజారిన టీమిండియా బ్యాటర్స్ ర్యాంకింగ్
Aiden Markram Career Best ICC T20 Rankings.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ సత్తా చాటాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 40, 51* రాణించిన మార్క్రమ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 743 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకొని కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. ఇక పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తన కెరీర్ బెస్ట్ సాధించాడు. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా టీమిండియాతో మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ మూడుస్థానాలు ఎగబాకి 727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. డేవిడ్ మలాన్ 831 పాయింట్లతో తన నెంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోగా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 820 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ ర్యాంకులు దిగజారాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి అర్థసెంచరీ సాధించినప్పటికి ఒకస్థానం దిగజారి 725 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 684 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. భారత బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ 750 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ వనిందు డిసిల్వా(726 పాయింట్లు), అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(720 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం ⚡ Big gains for Aiden Markram, JJ Smit 🔥 Mohammad Rizwan rises to No.4 among batters All you need to know about the latest rankings 👉 https://t.co/1sQBCW4KB0 pic.twitter.com/WfPp8XBb5I — ICC (@ICC) October 27, 2021 -
AUS Vs SA: మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Aiden Markram Stunning Catch.. మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. నోర్ట్జే వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతా బౌండరీ అనుకుంటున్న దశలో మక్రమ్ అద్బుతం చేశాడు. లాంగాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మక్రమ్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో స్మిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే మక్రమ్ది సూపర్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే.. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం అందుకొని భోణి కొట్టింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన దశలో మార్కస్ స్టోయినిస్(24 నాటౌట్), మాథ్యూ వేడ్(15 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించారు. అంతకముందు స్టీవ్ స్మిత్ 35 పరుగులు పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2, షంసీ, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. Flying Markram!!! Whatta Catch!!!@AidenMarkram#SAvsAUS#T20WorldCup#LiveTheGame pic.twitter.com/C37EPswwRs — Arnavicious!!! (@TweetsByArnav) October 23, 2021 చదవండి: Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు View this post on Instagram A post shared by ICC (@icc) -
పంజాబ్ కింగ్స్‌కి షాక్.. మలాన్ ఔట్.. జట్టులోకి ఐడెన్ మార్కమ్
దుబాయి: ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ముంగిట పంజాబ్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ సీజన్ నుంచి వైదొలిగాడు. అయితే, మలాన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్కమ్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2021, యాషెస్ సిరీస్‌కి ముందు కుటుంబంతో కలిసి గడపాలని అనుకుంటున్నా... అందుకే ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు తప్పుకోవడం గమనార్హం. మలాన్ తో పాటు క్రిస్‌వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో (సన్‌రైజర్స్ హైదరాబాద్) సీజన్ నుంచి తప్పుకున్నారు. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు 𝘼𝙞-𝙙𝙚𝙣 vich tuhadda swaagat hai! 👋🏻 Welcoming our newest 🦁 Aiden Markram who will replace Dawid Malan for the remainder of the season! 😍#SaddaPunjab #IPL2021 #PunjabKings pic.twitter.com/OJMW3QEwW1 — Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2021 -
అసహనంతో ‘పంచ్’ విసిరి...
రాంచీ: భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ సిరీస్ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. పుణే టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయిన మార్క్రమ్ మ్యాచ్ తర్వాత ఆ అసహనాన్ని ఒక ‘బలమైన వస్తువు’పైన చూపించాడు. దాంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు ఎముకల్లో ఫ్రాక్చర్ ఉందని తేలినట్లు దక్షిణాఫ్రికా టీమ్ ప్రకటించింది. దాంతో అతను చికిత్స కోసం గురువారం దక్షిణాఫ్రికా పయనమయ్యాడు. అతని స్థానంలో సఫారీలు మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. శనివారంనుంచి రాంచీలో మూడో టెస్టు జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. సీనియర్ జట్టుకంటే ముందుగా ‘ఎ’ టీమ్ తరఫున మార్క్రమ్ భారత్‌లో అడుగు పెట్టాడు. ఒక మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన అతను... ఆ తర్వాత విజయనగరంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా మరో శతకం బాదాడు. దాంతో ఎంతో ఆశలతో టెస్టు బరిలోకి దిగిన అతను విశాఖపట్నంలో 5, 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పుణేలో రెండో ఇన్నింగ్స్‌లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాక రివ్యూకు అవకాశం ఉన్నా... మానసికంగా అప్పటికే కుంగిపోయిన అతను దానికీ సాహసించలేదు. రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. ‘ఈ రకంగా స్వదేశం తిరిగి వెళ్లడం బాధాకరం. నేను చేసింది పూర్తిగా తప్పే. దానికి బాధ్యత వహిస్తాను. మంచి వాతావరణం ఉన్న మా జట్టులో నాపై నమ్మకముంచినవారిని నిరాశపర్చడం నన్ను ఎక్కువగా వేదనకు గురి చేస్తోంది. క్రీడల్లో కొన్ని భావోద్వేగాలు దాటిపోయి అసహనం పెరిగిపోతుంది. నాకూ అదే జరిగింది. దీనికి సహచరులకు క్షమాపణ కూడా చెప్పాను. ఈ తప్పును దిద్దుకుంటా’ అని మార్క్రమ్ వివరణ ఇచ్చాడు. మూడో టెస్టులో మార్క్రమ్ స్థానంలో జుబేర్ హమ్జాకు తుది జట్టులో చోటు లభించవచ్చు. భారత్‌లో ఎంతో నేర్చుకోవచ్చు: ఎల్గర్ ఒక్కసారి భారత పర్యటనకు వస్తే ఎంతో అనుభవం లభిస్తుందని, వ్యక్తిగతంగా కూడా అనేక మార్పులు వస్తాయని దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ వ్యాఖ్యానించాడు. అది మైదానంలో కావచ్చు లేదా మైదానం బయట కూడా కావచ్చని అతను అన్నాడు. ‘భారత పర్యటన ఒక సవాల్లాంటిది. క్రికెటర్‌గా, వ్యక్తిగా కూడా ఎంతో మెరుగయ్యేందుకు ఇది అవకాశం కలి్పస్తుంది. మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. బయటకు వెళ్లినప్పుడు చిన్న నగరాలు, పెద్దగా సౌకర్యాలు లేని హోటళ్లలో కూడా ఉండాల్సి వస్తుంది. ఇలాంటివి మన గురించి మనం తెలుసుకునేందుకు పనికొస్తాయి’ అని ఎల్గర్ అభిప్రాయపడ్డాడు. -
‘గాయం చేసుకుని సఫారీలకు షాకిచ్చాడు’
రాంచీ: టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు ఓపెనర్ మార్కరమ్ గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమయ్యాడు. స్వీయ తప్పిదం కారణంగా చేతికి గాయం చేసుకుని సఫారీలకు షాకిచ్చాడు. రెండో టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడంతో నిరాశకు గురైన మార్కరమ్ ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నాడు. దాంతో శనివారం నుంచి రాంచీలో ఆరంభం కానున్న చివరిదైన మూడో టెస్టు నుంచి వైదొలిగాడు. మార్కరమ్ కుడిచేయి మణికట్టుకు గాయం కావడంతో అతను జట్టుకు దూరమవుతున్న విషయాన్ని దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దాంతో మార్కరమ్ ఉన్నపళంగా స్వదేశానికి పయనమయ్యాడు. దీనిపై మార్కరమ్ మాట్లాడుతూ.. ‘ సిరీస్ మధ్యలో ఇలా స్వదేశానికి పయనం కావాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. నాకు గాయం కావడం కంటే కూడా క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం ఎక్కువగా బాధిస్తుంది. ఇక్కడ క్షమించడం అనేది ఏమీ లేదు. ఇలా గాయం కావడానికి నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో నిరాశలో నా చేతికి గాయం చేసుకున్నా. కొన్ని సందర్బాల్లో నిరాశ కూడా మరింత మెరుగు కావడానికి దోహదం చేస్తుంది’ అని మార్కరమ్ పేర్కొన్నాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మార్కరమ్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. విశాఖలో సఫారీలతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించగా, పుణేలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో టెస్టును కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే యోచనలో ఉంది విరాట్ గ్యాంగ్. ఇప్పటికే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా డబుల్ సెంచరీ కొట్టేసిన టీమిండియా.. సఫారీలతో చివరి టెస్టును కూడా గెలిస్తే ఆ పాయింట్ల సంఖ్యను 240కి పెంచుకుంటుంది. -
మార్క్రమ్ మెరుపు శతకం
సాక్షి ప్రతినిధి విజయనగరం: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (118 బంతుల్లో 100 రిటైర్డ్ ఔట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫామ్ చాటుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో విజయనగరంలో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు అతడు సెంచరీ కొట్టాడు. ఇటీవల భారత్ ‘ఎ’ జట్టుపై భారీ శతకం (160) బాదిన అతడు... ఈ మ్యాచ్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. 50 ఓవర్ల అనంతరం వెలుతురు లేమి తో ముందే నిలిపివేశారు. కీలక బ్యాట్స్‌మెన్ టెంబా బవుమా (92 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో సఫారీలు రోజు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను ఏడో ఓవర్లోనే ఉమేశ్ యాదవ్ వెనక్కు పంపాడు. డి బ్రుయెన్ (6)ను ఇషాన్ పొరెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో జుబయిర్ హమ్జా (22)తో కలిసి మార్క్రమ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ పూర్తయ్యాక మార్క్రమ్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కెపె్టన్ డు ప్లెసిస్ (9)ను ధర్మేంద్ర జడేజా ఎల్బీ చేశాడు. మ్యాచ్‌కు శనివారం చివరి రోజు. దక్షిణాఫ్రికా ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసి బోర్డు జట్టు బ్యాటింగ్‌కు వీలు కల్పించనుంది. తద్వారా టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా చూసే అవకాశం ఉంది. -
సెంచరీతో అదరగొట్టాడు..
విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ఇక్కడ డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ సెంచరీతో అదరగొట్టాడు. అత్యంత నిలకడగా ఆడి శతకంతో మెరిశాడు. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో మార్కరమ్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సఫారీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్కరమ్-డీన్ ఎల్గర్‌లు ఆరంభించారు. కాగా, ఎల్గర్(6) ఆదిలోనే పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్గర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై ఫస్ట్ డౌన్ ఆటగాడు డీ బ్రన్(6) సైతం వెనుదిరగడంతో బోర్డు ప్రెసిడెంట్స్‌కు పట్టుదొరికినట్లు కనబడింది. అయితే మార్కరమ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. హమ్జా(22)తో కలిసి మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం, బావుమాతో కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే మార్కరమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకంతో మెరిసిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. -
దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్
కేప్‌టౌన్: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించిన శ్రీలంక వన్డేల్లో మాత్రం దక్షిణాఫ్రికా ధాటికి తలవంచింది. ఆడిన ఐదు వన్డేల్లోనూ ఓడి 0–5తో వైట్‌వాష్ అయింది. ఈ రెండేళ్లలో లంక పరాభవానికి గురైన నాలుగో వన్డే సిరీస్ ఇది. శనివారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట లంక 49.3 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (56; 3 ఫోర్లు) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబడ 3, నోర్జి, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఈ దశలో మైదానంలోని ఫ్లడ్‌లైట్లలో ఒకటి మొరాయించింది. దాంతో సరైన వెలుతురు లేకపోవడంతో మిగతా ఓవర్లు సాధ్యపడలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ లెక్కల ప్రకారం దక్షిణాఫ్రికా విజయానికి 95 పరుగులు చేస్తే సరిపోయేది. విజయలక్ష్యం కంటే దక్షిణాఫ్రికా స్కోరు ఎక్కువగా ఉండటంతో వారి విజయం ఖాయమైంది. మార్క్రమ్ (67 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. కెప్టెన్ డు ప్లెసిస్ 24 పరుగులు చేయగా, డసెన్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్క్రమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
ఆదుకున్న డికాక్, మార్క్రమ్
పోర్ట్ఎలిజబెత్: పర్యాటక జట్టు శ్రీలంక చేతిలో తొలి టెస్టు ఓడిపోయిన దక్షిణాఫ్రికా ... రెండో టెస్టులోనూ తడబడింది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 222 పరుగులు చేసింది. 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను మార్క్రమ్ (116 బంతుల్లో 60; 9 ఫోర్లు), క్వింటన్ డికాక్ (87 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో, రజిత చెరో 3 వికెట్లు పడగొట్టారు. ధనంజయ డిసిల్వా 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలిరోజు ఆటముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు చేసింది. లహిరు తిరిమన్నే (25 బ్యాటింగ్), కసున్ రజిత (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
వాట్ ఏ క్యాచ్ మార్క్రమ్.!
జొహన్నెస్‌బర్గ్ : వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డేలో ప్రొటీస్ కెప్టెన్ మార్క్రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో వావ్ అనిపించాడు. రబడా వేసిన 46 ఓవర్ చివరి బంతిని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ కొట్టాడు. అదే దిశలో ఆఫ్‌సైడ్ సర్కిల్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ అంతే వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో పాండ్యా పెవిలియన్ చేరాడు. అయితే ఈ అద్భుత క్యాచ్‌కు సఫారీ ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏ మాత్రం సాధ్యం కాని క్యాచ్‌ను మార్క్రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. -
'మూడో వన్డేకు టైమ్ లేదు'
కేప్‌టౌన్: ఇప్పటికే భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో వెనుకబడిన తమ జట్టు మూడో వన్డేకు సన్నద్ధం కావడానికి తగినంత సమయం లేదని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మర్క్రామ్ ఆందోళన వ్యక్తం చేశాడు. గత రెండు వన్డేల్లో పేలవమైన ప్రదర్శనతో ఘోర పరాజయాల్ని ఎదుర్కొన్న విషయాన్ని అంగీకరించిన మర్క్రామ్.. కీలకమైన మూడో వన్డేకు ప్రిపేర్ కావడానికి కావాల్సినంతం సమయం లేదన్నాడు. రెండో వన్డే తర్వాత మాట్లాడిన మర్క్రామ్..' సిరీస్‌లో నిలబడాలంటే కచ్చితంగా మూడో వన్డేలో గెలుపు మాకు అవసరం. ఆ మేరకు సన్నద్ధమవడానికి యత్నిస్తాం. అయితే తగినంత సమయం లేదనే చెప్పాలి. కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మేము రెండు వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాం. మా జట్టు సమష్టి ప్రదర్శన చేయలేదు. కేప్‌టౌన్‌లో వన్డే మాకు చాలా చాలా కీలకం. ఆ వన్డేలో అంతా రాణిస్తారని ఆశిస్తున్నా. రెండు వన్డేల్లో ఎదురైన పరాభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాల్సి ఉంది. ఆటలో ఎత్తు-పల్లాలు అనేవి సర్వ సాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసర లేదు' అని మర్క్రామ్ తెలిపాడు. రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ డు ప్లెసిస్ గాయపడటంతో ఆ స్థానంలో మర్‌క్రామ్‌కు సారథిగా బాధ్యతలు అప్పజెప్పారు. దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడో వన్డే కేప్‌టౌన్‌లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్
-
రెండో వన్డే ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు’ గా ఉంది దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. ఇప్పటికే గాయంతో తొలి మూడు వన్డేలకు సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ దూరం అయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆదివారం జరిగే రెండో వన్డే ముందే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ డుప్లెసిస్ చేతి వేలి గాయంతో పూర్తి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్‌కు కుడి చేతి చూపుడు వేలు విరిగిందని, మూడు నుంచి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గాయపడటంతో కెప్టెన్ ఎవరా అనే సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో అనూహ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌ను ప్రకటించింది. డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్ బెహర్డీన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. వన్డే సిరీస్ మొత్తానికి మర్ క్రామ్ నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ దక్షిణాఫ్రికా కన్వీనర్ లిండాజొండి తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమేమి కాదని, మరక్రమ్కు డివిలియర్స్, ఇతర సీనియర్ ఆటగాళ్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. -
నాలుగులో రహానే..!
డర్బన్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. డర్బన్ మైదానం స్వతహాగా బ్యాటింగ్ ట్రాక్ కావడంతో ముందుగా డు ప్లెసిస్ బ్యాటింగ్ తీసుకునేందుకు ప్రధాన కారణం. తొలి మూడు వన్డేలకు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానంలో మొదటి వన్డేలో మర్‌క్రామ్‌ను తుది జట్టులో తీసుకున్నారు. నాలుగులో రహానే.. నాల్గో స్థానంలో నమ్మదగిన బ్యాట్స్‌మన్ అయిన అజింక్యా రహానేపైనే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. మనీశ్‌పాండే పోటీలో ఉండటంతోనాలుగో స్థానంపై ప్రధానం చర్చ సాగింది. అయితే ఆ స్థానంలో రహానే కరెక్ట్ అని భావించిన యాజమాన్యం అతన్నే తుది జట్టులోకి తీసుకుంది. లంకతో సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. కాగా, భారత జట్టు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్, చాహల్‌ను జట్టులోకి తీసుకుంది.కాగా, వీరిద్దరితో కలిసి పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదర్ జాదవ్ స్పిన్ విభాగాన్ని పంచుకోనున్నాడు. దక్షిణాఫ్రికా తుది జట్టు: డు ప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీ కాక్, మర్క్రామ్, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఫెలూక్వాయో, రబడా, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్ భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రహానే, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, చాహల్