T20 World Cup 2021: Aiden Markram Stunning Catch pulls Off Steve Smith - Sakshi
Sakshi News home page

T20 WC 2021 AUS Vs SA: మక్రమ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published Sat, Oct 23 2021 8:09 PM | Last Updated on Sun, Oct 24 2021 3:12 PM

T20 World Cup 2021: Aiden Markram Stunning Catch pulls Off Steve Smith - Sakshi

Aiden Markram Stunning Catch.. మక్రమ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్‌ మక్రమ్‌ స్టన్నింగ్  క్యాచ్‌తో మెరిశాడు. నోర్ట్జే వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ ఐదో బంతిని స్మిత్‌ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అంతా బౌండరీ అనుకుంటున్న దశలో మక్రమ్‌ అద్బుతం చేశాడు. లాంగాన్‌ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మక్రమ్‌ డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో స్మిత్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే మక్రమ్‌ది సూపర్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. 

చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే..

ఇక  మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం అందుకొని భోణి కొట్టింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన దశలో మార్కస్‌ స్టోయినిస్‌(24 నాటౌట్‌), మాథ్యూ వేడ్‌(15 నాటౌట్‌) ఆసీస్‌ను గెలిపించారు. అంతకముందు స్టీవ్‌ స్మిత్‌ 35 పరుగులు పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2, షంసీ, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్‌ బౌలర్‌.. ప్రతీసారి స్విచ్‌హిట్‌ పనికిరాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement