Australia vs South Africa
-
W T20 WC: ఆసీస్ చిత్తు.. వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ధమాకా
దుబాయ్: ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా 2023)పై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు మెగా టోర్నీ జరిగితే ఏడుసార్లు ఫైనల్ చేరిన ఆ్రస్టేలియా జట్టును ఈసారి దక్షిణాఫ్రికా టైటిల్ పోరుకు దూరం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 2 ఫోర్లు), ఎలీస్ పెరీ (31; 2 ఫోర్లు), కెపె్టన్ తాలియా మెక్‌గ్రాత్ (27; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయ»ొంగ ఖాకా 2, మరిజాన్ కాప్, ఎమ్‌లాబా చెరో వికెట్ తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా మరో 2.4 ఓవర్లు మిగిలుండగానే 17.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ , ఓపెనర్ లౌరా వోల్వార్ట్ (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనెకె బాష్ (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు,1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. నేడు రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్‌కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్‌ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్‌లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
స్మిత్‌ది ఔటా? నాటౌటా? టెక్నాలజీ లోపానికి..! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దురదృష్టకరరీతిలో ఔటయ్యాడు. అతడు ఔటైన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడి ఔట్‌పై వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే? 312 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాలో పడింది. ఈ సమయంలో స్మిత్, లాబుషేన్తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో మూడో, నాలుగో బంతులను స్మిత్ బౌండరీలగా మలిచాడు. ఆ తర్వాతి బంతిని కూడా లెగ్ సైడ్ ఆడటానికి స్మిత్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి స్మిత్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ విల్సన్ నో అంటూ తలఊపాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో తొలుత బంతి ఈజీగా లెగ్‌స్టంప్ మిస్అవుతున్నట్లు కన్పించింది. కానీ బాల్ ట్రాకింగ్‌లో మాత్రం బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ స్మిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్అంపైర్ తీసుకున్న నిర్ణయం బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు ఫీల్డ్ అంపైర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కనీసం అంపైర్ కాల్ అయినా వస్తుందని భావించారు. కానీ అందరి అంచనాలను 'హాక్ ఐ' టెక్నాలజీ తారుమారు చేసింది. కాగా గత కొంతకాలంగా ఎల్బీ డబ్ల్యూ రివ్యూ, క్యాచ్‌ల ఫలితాల తేల్చడంలో 'హాక్ ఐ' టెక్నాలజీని ఐసీసీ వాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. టెక్నాలజీ లోపానికి స్మిత్ బలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ICC World Cup 2023 SA vs AUS: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
జన్సెన్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్‌రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
భీకర ఫామ్‌లో బవుమా.. వ్యక్తిగత అవమానాలు దిగమింగి..!
ప్రపంచ క్రికెట్లో ఫామ్‌తో సంబంధం లేకుండా క్రికెటేతర విషయాలైన రూపం, వర్ణం, ఆహార్యం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారధి టెంబా బవుమానే అని చెప్పాలి. ఈ సఫారీ స్టార్ గతంలో అనేక సందర్భాల్లో క్రికెటేతర కారణాల చేత అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత జట్టు సభ్యులతో సహా తన చుట్టూ ఉన్నవారంతా తన ఆహార్యాన్ని గేలి చేసినప్పటికీ ఎంతమాత్రం చలించని ఈ సఫారీ బ్యాటింగ్ యోధుడు, తనకు అవమానం ఎదురైన ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం బవుమా అదే పనిలోనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు తన ఆటను కించపరిచే వారికి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ సమాధానం చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్ మినహాయించి మిగతా రెండు ఫార్మాట్లలో ఈ ఏడాది బవుమా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను టెస్ట్‌ల్లో (1), వన్డేల్లో (3) నాలుగు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వన్డేల్లో అతని ఫామ్ అసామాన్యమైనదిగా ఉంది. ఈ ఏడాది అతనాడిన 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సహా 637 పరుగులు చేశాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన జట్టు నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నప్పటికీ, అతనొక్కడు అద్భుతంగా రాణిస్తూ, తన జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కోకుండా కాపాడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మూడో వన్డేలో బవుమా 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సఫారీ టీమ్ 39 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బవుమాతో పాటు డికాక్ (82), రీజా హెండ్రిక్స్ (39), మార్క్రమ్ (43 నాటౌట్) రాణించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంకా 11 ఓవర్లు ఆడాల్సి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
సెంచరీలతో చెలరేగిన వార్నర్, లబుషేన్.. దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 123 పరగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కంగూరుల బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(106), లబుషేన్(124) సెంచరీలతో చెలరేగగా.. హెడ్(64), జోష్ ఇంగ్లీష్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ప్రోటీస్ బౌలర్లలో స్పిన్నర్ షమ్సీ నాలుగు వికెట్లు సాధించగా.. రబాడ రెండు, మార్కో జానెసన్ వికెట్ సాధించారు. అనంతరం 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశాడు. అదే విధంగా నాథన్ ఈల్లీస్, అబాట్, హార్దే చెరో రెండు వికెట్లు సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ బావుమా(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 12న జరగనుంది. చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ! -
చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో వార్నర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఇది 20 వన్డే సెంచరీ. ఓవరాల్‌గా డేవిడ్ భాయ్‌కు ఇది 46వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. చరిత్ర సృష్టించిన వార్నర్.. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వార్నర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఓపెనర్‌గా 46 సెంచరీలు వార్నర్ నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(45) రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా 6000 పరుగుల మైలు రాయిని వార్నర్ అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్న నాలుగో ఓపెనర్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ 140 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(121) అగ్రస్ధానంలో ఉన్నాడు. చదవండి: Asia Cup 2023: 'అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్ కప్ జట్టులో అతడు ఉండాల్సింది' -
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా! ఆసీస్ విజయం
దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(114) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు మార్కో జానెసన్(32) పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లో హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్ రెండు, అబాట్, అగర్, జంపా, గ్రీన్ తలా వికెట్ సాధించారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. 223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో క్రీజులోకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్ లూబుషేన్(93 బంతుల్లో 80 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. తొలుత తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. కానీ కామెరూన్ గ్రీన్ తలకు గాయం కావడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశం మార్నస్కు వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని లబుషేన్ సద్వినియోగపరుచుకున్నాడు. అతడితో పాటు అస్టన్ అగర్(44) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 80 పరుగులతో అదరగొట్టిన లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ప్రోటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ, రబాడ చెరో రెండు వికెట్లు సాధించగా.. ఎంగిడి, మహారాజ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 9న ఇదే వేదికగా జరగనుంది. చదవండి: WC: ప్రపంచకప్-2023 జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తేజకు చోటు.. కెప్టెన్ ఎవరంటే! -
ట్రవిస్ హెడ్ విధ్వంసం.. సఫాలను ఊడ్చేసిన కంగారూలు
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 0-3 తేడాతో కోల్పోయింది. డర్బన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 3) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 3-0 తేడాతో ప్రొటీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫెర్రెయిరా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (30 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరంగేట్రం ఆటగాడు డొనొవన్ ఫెర్రెయిరా (21 బంతుల్లో 48; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో ఫెర్రెయిరా.. ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; ఫోర్, 2 సిక్సర్లు)తో పాటు సిక్సర్ల వర్షం కురిపించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్ 2, తన్వీర్ సంగా ఓ వికెట్ దక్కించుకున్నాడు. హెడ్, ఇంగ్లిస్, స్టొయినిస్ల ఊచకోత.. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (22 బంతుల్లో 42; ఫోర్, 4 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. భీకర ఫామ్‌లో ఉండిన కెప్టెన్ మిచెల్ మార్ష్ (15) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తదుపరి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 7, 9, 12, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
మిచెల్ మార్ష్ విధ్వంసం.. కేవలం 28 బంతుల్లోనే! ఆసీస్ ఘన విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. డర్భన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ మార్క్రమ్(49) పరుగులతో రాణించగా.. బావుమా(35) పర్వాలేదనపించాడు. ఆసీస్ బౌలర్లలో అబాట్, ఈల్లీస్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెండోర్ఫ్ రెండు వికెట్లు సాధించారు. మార్ష్, షార్ట్ విధ్వంసం.. ఇక 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది. మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా మార్ష్ తన హాఫ్‌సెంచరీ మార్క్‌ను కేవలం 28 బంతుల్లోనే అందకున్నాడు. అతడికి ఇది వరుసగా రెండో అర్ధ శతకం కావడం విశేషం. అతడితో పాటు ఓపెనర్ మాథ్యూ షార్ట్ కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న షార్ట్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. కాగా షార్ట్‌కు ఇది రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. ఇక ప్రోటీస్ బౌలర్లలో విలియమ్స్, షమ్సీ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: విరాట్ కోహ్లి అంటే నాకు గౌరవం.. అది అనవసరం! విజయం మాదే: బాబర్ -
విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్.. ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్ డేవిడ్ పేరును ఆసీస్ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో డేవిడ్‌కు చోటు దక్కలేదు. డేవిడ్‌కు కేవలం టీ20 జట్టులో మాత్రమే సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, స్టార్క్ వంటి ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడంతో డేవిడ్‌కు లక్కీ ఛాన్స్ లభించింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదేవిధంగా లిస్ట్-ఏ క్రికెట్లో డేవిడ్ కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి లిస్ట్-ఏ కెరీర్లో బ్యాటింగ్ సగటు 82.77గా ఉంది. ఇక ఇదే విషయంపై ఆసీస్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.."టీ20 సిరీస్ కోసం డేవిడ్ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అతడికి వన్డే జట్టులో కూడా అవకాశం ఇస్తున్నాము. టిమ్ తన దూకుడు వన్డేల్లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ప్రోటీస్‌ను కంగారూ జట్టు చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ఆసీస్ జట్టు: పాట్ కమ్మిన్స్(కెప్టెన్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ స్యాంగ్, టాన్హాన్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రోటీస్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడ్డాడు. కింగ్స్‌మేడ్ మైదానంలో మార్ష్ బౌండరీలు వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక మార్ష్‌తో పాటు టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ప్రోటీస్ బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, గెరాల్డ్, షమ్సీ తలా వికెట్ సాధించారు. కుప్పకూలిన ప్రోటీస్.. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో శుక్రవారం జరగనుంది. చదవండి: Asia Cup 2023: శ్రీలంక గడ్డపై భారత జట్టు -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..!
సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకుంటాడని సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కమిన్స్ స్థానంలో టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు వీలైనంత విశ్రాంతి కల్పించాలన్నది క్రికెట్ ఆస్ట్రేలియా యోచనగా తెలుస్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ సమయానికంతా సిద్ధంగా ఉండాలని సీఏ కమిన్స్ సూచించిందని సమాచారం. కాగా, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో పర్యటించనున్న విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్ సందర్భంగా గాయపడిన కమిన్స్ (ఎడమ చేతి మణికట్టు విరిగింది) వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ సమయానికంతా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. -
ఆసీస్‌తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే..!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు తొలిసారి పిలుపునిచ్చారు. ఇతనితో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెర్రీరా, యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీలను కూడా తొలిసారి ఎంపిక చేశారు. ఆసీస్ పర్యటనలోని 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన యువ జట్టును ప్రకటించారు. సీనియర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేల గైర్హాజరీలో సెలెక్టర్లు యువకులకు అవకాశం ఇచ్చారు. పైపేర్కొన్న సీనియర్లంతా ఇదే పర్యటనలో జరిగే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తారు. టీ20 సిరీస్‌కు ఎయిడెన్ మార్క్రమ్, వన్డే సిరీస్‌కు టెంబా బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గాయం కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కేశవ్ మహారాజ్ సైతం రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, సిసంద మగాల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ షెడ్యూల్.. ఆగస్ట్ 30: తొలి టీ20 (డర్బన్) సెప్టెంబర్ 1: రెండో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 2: మూడో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 7: తొలి వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 9: రెండో వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 12: మూడో వన్డే (పోచెఫ్‌స్ట్రూమ్) సెప్టెంబర్ 15: నాలుగో వన్డే (సెంచూరియన్) సెప్టెంబర్ 17: ఐదో వన్డే (జోహనెస్బర్గ్) -
T20 WC: సఫారీల చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో ఆసీస్‌తో పోరుకు సై
ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అలవాటే. పురుషులతో పాటు మహిళల టీమ్‌లోనూ ఇది చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు వీటికి ముగింపు పలుకుతూ దక్షిణాఫ్రికా మహిళల టీమ్ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల, మహిళల జట్లను కలిపి చూస్తే ఏ ఫార్మాట్లోనైనా సఫారీ టీమ్(సీనియర్) ఐసీసీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన తర్వాత కోలుకున్న టీమ్ ఇప్పుడు తుది సమరానికి సిద్ధమైంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్రిట్స్ హాఫ్ సెంచరీ ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజ్మీన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లౌరా వాల్వర్ట్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 82 బంతుల్లో 96 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. నాట్ సీవర్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/27), అయబొంగ ఖాక (4/29) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. షబ్నిమ్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, ఇంగ్లండ్ 6 పరుగులే చేయగలిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. కాగా భారత జట్టుతో జరిగిన తొలి సెమీస్‌లో గెలుపొంది ఆసీస్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. కమిన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో అతన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. నాలుగో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనప్పటికీ.. కేవలం ఒక్క ఓవర్ పాటు ఖ్వాజాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు కదా అని ఆసీస్ ఓపెనర్‌పై జాలిపడుతున్నారు. 2004లో నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా కమిన్స్ లాగే.. సహచరుడు సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదంతాన్ని నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఇవాళ (జనవరి 7) కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నాలుగో రోజు 59 ఓవర్లు (ఎటువంటి అంతరాయం కలగకపోతే), ఆఖరి రోజు 98 ఓవర్ల ఆట సాధ్యపడితే ఫలితం (సౌతాఫ్రికాను 2 సార్లు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది) తప్పక వస్తుందన్న అంచనాతో కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్ట్‌లో ఆసీస్ బౌలర్లు 137.3 ఓవర్లలో సఫారీలను 2 సార్లు ఆలౌట్ చేశారు. ఈ ధీమాతోనే కమిన్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్), స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు టీ విరామం సమయానికి (31 ఓవర్లు) 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శతకొట్టిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32) రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్.. మాథ్యూ హేడెన్‌తో (30) సమంగా మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్‌తో పాటు మార్నస్ లబూషేన్‌కు మాత్రమే ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్ 33 మ్యాచ్‌ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్ శతకం సాధించిన మ్యాచ్‌లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మూడో సెషన్ డ్రింక్స్ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (195) తన కెరీర్ తొలి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్ హెడ్ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్ రెన్షా (5) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్ వార్నర్ (10), లబూషేన్ (79) ఔటయ్యారు. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. -
శతకాల మోత మోగించిన ఆసీస్ ప్లేయర్లు.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు
AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. రెండో రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖ్వాజా (335 బంతుల్లో 172 నాటౌట్) కెరీర్లో 13 శతకం బాది డబుల్ సెంచరీ దిశగా సాగుతుండగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 30 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట కేవలం 47 ఓవర్లు మాత్రమే సాగగా.. ఇవాల్టి (జనవరి 5) ఆట షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది. టీ విరామం సమయానికి ఖ్వాజాకు జతగా ట్రావిస్ హెడ్ (17) క్రీజ్‌లో ఉన్నాడు. అచొచ్చిన సిడ్నీ గ్రౌండ్లో ఖ్వాజా (ఈ గ్రౌండ్లో ఇదివరకే 3 సెంచరీలు బాదాడు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. సఫారీ బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఖ్వాజా తన టెస్ట్ కెరీర్లో నాలుగోసారి 150 మార్కును క్రాస్ చేయగా.. స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్.. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. -
మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్
AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారితో సహా కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. లబూషేన్ ఎందుకు లైటర్ అడుతున్నాడో తెలియక ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారు కూడా కాసేపు తలలు గీకున్నారు. కామెంటేటర్ ఇష గుహ అయితే లబూషేన్ సిగరెట్ కాల్చాలని అనుకుంటున్నాడేమో అంటూ సహచరులతో డిస్కస్ చేశారు. మొత్తానికి లబూషేన్ చేసిన ఈ సంజ్ఞ తొలి రోజు ఆటకు హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో షికార్లు చేస్తుంది. అసలు లబూషేన్ సిగరెట్ లైటర్ ఎందుకు అడిగాడంటే..? అప్పటికే చాలాసేపుగా హెల్మెట్‌తో సమస్యను ఎదుర్కొంటూ పలుసార్లు తీస్తూ, వేసుకున్న లబూషేన్.. దాన్ని రిపేర్ చేసేందుకు గాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్‌కు మెసేజ్ చేశాడు. లబూషేన్ సైగ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అతనెందుకు లైటర్ అడుతున్నాడో అర్ధం కాలేదు. అయితే కాసేపటి తర్వాత విషయాన్ని గ్రహించి వారు లైటర్‌ను తీసుకెళ్లి లబూషేన్ సమస్యను పరిష్కరించారు. సిబ్బంది లైటర్‌తో లబూషేన్ హెల్మెట్ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశారు. Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV — cricket.com.au (@cricketcomau) January 4, 2023 ఇదిలా ఉంటే, వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్, లబూషేన్‌ల వికెట్లు అన్రిచ్ నోర్జే ఖాతాలో పడ్డాయి. కాగా, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా
సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తగిలింది. వేగంతో దూసుకొచ్చిన బంతి గ్రీన్ చేతివేలిని చీల్చడంతో రక్తం కూడా కారింది.దీంతో గ్రీన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.రిటైర్డ్‌హర్ట్ అయ్యేటప్పటికి గ్రీన్ 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా గ్రీన్‌కు తీసిన ఎక్స్‌రే రిపోర్ట్ బయటకు రావడంతో ఆసక్తికర విషయం బయటపడింది. వాస్తవానికి నోర్ట్జే వేసిన బంతి వేగానికి గ్రీన్ వేలు విరిగినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అయితే లంచ్‌కు ముందు 363/3తో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నాథన్ లియోన్ ఏడో వికెట్‌గా వెనుదిరగ్గానే కామెరున్ గ్రీన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా నాలుగు గంటల పాటు క్రీజులో నిలబడ్డాడు. దాదాపు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గ్రీన్.. 177 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన గ్రీన్ బ్యాగీ గ్రీన్స్‌తో కలిసి జట్టును స్కోరును 575 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత స్టార్క్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అయితే వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కామెరున్ గ్రీన్ బ్యాటింగ్ కొనసాగించడం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్లను మరింత పెంచుకొని అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఓటములతో సౌతాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య మూడోటెస్టు జనవరి 4 నుంచి 8 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. Cameron Green retired hurt after being hit on finger by a ball from Anrich Nortje!! 😳#AUSvsSA #BoxingDayTest pic.twitter.com/1X7PuYobCs — FaceTheFact! (@FaceTheFact7) December 27, 2022 -
AUS vs SA: ఆసీస్‌తో కీలక టెస్టు.. దూరమైన సౌతాఫ్రికా బ్యాటర్
South Africa tour of Australia, 2022-23- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ దూరం కానున్నాడు. మొదటిసారి తండ్రి కానున్న తరుణంలో బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా డీన్ ఎల్గర్ బృందం ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మొదటి రెండో టెస్టుల్లో ఓడి చేదు అనుభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత వెనుకబడిపోయింది. ఆసీస్‌తో మిగిలిన ఒక టెస్టు, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ గెలవడం సహా టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం తేలితేనే ఫైనల్ అవకాశాలపై క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించాలని ప్రొటిస్ పట్టుదలగా ఉంది. ఆసీస్- ప్రొటిస్ మధ్య జనవరి 4న మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక 30 ఏళ్ల బ్రూయిన్ విషయానికొస్తే.. గబ్బా టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మెల్బోర్న్లో ఆడే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాసీ వాన్ డెర్ డసెన్ స్థానంలో బాక్సింగ్ డే టెస్టులో ఆడిన బ్రూయిన్.. మొత్తంగా 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆట పరంగా విఫలమైనా... వ్యక్తిగత జీవితంలో మాత్రం శుభవార్త అందుకోనున్నాడు. చదవండి: Rishabh Pant: సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. లక్ష్మణ్ ట్వీట్ వైరల్; ‘రియల్ హీరో’లకు తగిన గౌరవం ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!