సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అన్‌రిచ్ నోర్ట్జే వేసిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తగిలింది. వేగంతో దూసుకొచ్చిన బంతి గ్రీన్ చేతివేలిని చీల్చడంతో రక్తం కూడా కారింది.దీంతో గ్రీన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.రిటైర్డ్‌హర్ట్ అయ్యేటప్పటికి గ్రీన్ 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
అయితే తాజాగా గ్రీన్‌కు తీసిన ఎక్స్‌రే రిపోర్ట్ బయటకు రావడంతో ఆసక్తికర విషయం బయటపడింది. వాస్తవానికి నోర్ట్జే వేసిన బంతి వేగానికి గ్రీన్ వేలు విరిగినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అయితే లంచ్‌కు ముందు 363/3తో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నాథన్ లియోన్ ఏడో వికెట్‌గా వెనుదిరగ్గానే కామెరున్ గ్రీన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా నాలుగు గంటల పాటు క్రీజులో నిలబడ్డాడు.
దాదాపు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గ్రీన్.. 177 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన గ్రీన్ బ్యాగీ గ్రీన్స్‌తో కలిసి జట్టును స్కోరును 575 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత స్టార్క్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అయితే వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కామెరున్ గ్రీన్ బ్యాటింగ్ కొనసాగించడం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్లను మరింత పెంచుకొని అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఓటములతో సౌతాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య మూడోటెస్టు జనవరి 4 నుంచి 8 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది.
Cameron Green retired hurt after being hit on finger by a ball from Anrich Nortje!! 😳#AUSvsSA #BoxingDayTest pic.twitter.com/1X7PuYobCs
— FaceTheFact! (@FaceTheFact7) December 27, 2022
Comments
Please login to add a commentAdd a comment