Cameron Green
-
ఐపీఎల్-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!
ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..బెన్ స్టోక్స్జేసన్ రాయ్శిఖర్ ధవన్అత్యంత పిన్నవయస్కుడు..ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..ఉన్ముక్త్ చంద్ (యూఎస్ఏ)అలీ ఖాన్ (యూఎస్ఏ)బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574 -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్నిక్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధ్రువీకరించింది.కాగా గ్రీన్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్ గాయపడ్డాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యలు సూచించారు. దీంతో గ్రీన్ శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు. సర్జరీ అనంతరం అతడు కనీసం 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, శ్రీలంక పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీలకు గ్రీన్ దూరం ఉన్నాడు. అతడు తిరిగి ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశముంది."గ్రీన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఎంఆర్ఐ స్కానింగ్‌లో చిన్న పగులు ఉన్నట్లు తేలింది. మా వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత కామెరాన్ శస్త్రచికిత్స చేసుకోవడానికి సిద్దమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాము" అని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగాప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు నిజంగా ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక నవంబరు 22- జనవరి 7 వరకు భారత్-ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.చదవండి: Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ బీజీటీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తుంది. ముందుగా గ్రీన్ ఈ సిరీస్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగింది. అయితే తాజా అప్డేట్ ప్రకారం గ్రీన్ బ్యాటర్‌గానూ కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. గ్రీన్ అందుబాటులో లేకపోతే బీజీటీలో ఆసీస్ విజయావకాశాలు భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆసీస్ మీడియా కథనాల మేరకు గ్రీన్ మరో మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. గ్రీన్ వెన్ను సమస్యకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆసీస్‌లో జరిగే ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ నవంబర్ 22-26 మధ్యలో పెర్త్ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ డిసెంబర్ 6-10 మధ్యలో అడిలైడ్ వేదికగా జరుగనుంది. మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 మధ్యలో జరుగనుండగా.. నాలుగో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు జరుగనుంది. ఈ సిరీస్‌ను ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సిరీస్ ఇరు జట్లను ప్రకటించాల్సి ఉంది.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా పాక్ -
టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిరీస్ మొదలయ్యేనాటికి అతడు అందుబాటులోకి వచ్చినా బౌలింగ్ చేసే అవకాశం మాత్రం లేదని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నర్ వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.ఫైనల్‌కు చేరే దారిలోప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు చేరుకునే టీమిండియా- ఆస్ట్రేలియా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్యాట్ కమిన్స్ బృందం రెండోస్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరులో టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఇందులో భాగంగా నవంబరు 22- జనవరి 7 వరకు ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతున్న వేళ.. సొంతగడ్డపై సత్తా చాటాలని కంగారూ జట్టు పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు ముందు కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్‌లేమి రూపంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.గ్రీన్‌కు వెన్నునొప్పిఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేల సందర్భంగా గ్రీన్‌కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో సిరీస్ మొత్తానికి అతడు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నా.. టీమిండియాతో సిరీస్‌లో మాత్రం బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి ఆసీస్ టీమ్ డాక్టర్ పీటర్ బ్రుక్నర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గ్రీన్ వెన్నునొప్పి కాస్త తగ్గిందనే చెబుతున్నాడు.బౌలింగ్ చేస్తే మొదటికే మోసంఅయితే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయం తీవ్రత ఎలా ఉందో అంచనా వేస్తాం. వెన్నుపై ఒత్తిడి ఎక్కువైతే కచ్చితంగా మళ్లీ నొప్పి తిరగబెడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం వల్ల పెద్దగా ప్రభావం పడకపోవచ్చు’’ అని తెలిపాడు. కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్రీన్ సేవల్ని గనుక ఆసీస్ కోల్పోతే.. స్టార్ బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా గ్రీన్‌కు వెన్ను సంబంధించిన సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరుగుతున్న నాలుగో వన్డేకు గ్రీన్ అందుబాటులో లేడు. ఈ గాయం నేపథ్యంలో గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో వన్డేకు దూరంగా ఉన్న గ్రీన్ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. తాజాగా గ్రీన్ గాయం బారిన పడటంతో ఈ పర్యటనలో ఆసీస్ ఇంజ్యూరీస్ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి గాయాల కారణంగా నాథన్ ఇల్లిస్, జేవియర్ బార్ట్లెట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్షుయిస్ జట్టుకు దూరమయ్యారు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఆసీస్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. నాలుగో వన్డే ఇవాళ లార్డ్స్ వేదికగా జరుగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ (22), విల్ జాక్స్ (10) ఔట్ కాగా.. బెన్ డకెట్ (58), హ్యారీ బ్రూక్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: 56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్ -
గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాటీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో బ్రాండెన్ మెక్కల్లమ్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 3 వికెట్లతో సత్తా చాటగా.. హార్దీ, అబాట్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్‌లో అదరగొట్టిన గ్రీన్.. బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 62 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మార్ష్(31) పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలక్లలో బ్రాడ్లీ క్యూరీ రెండు వికెట్లు పడగొట్టగా.. సోలే, జర్వీస్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో విజయం సాధించిన కంగారులు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌తో ఆసీస్ తలపడనుంది. -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
రూ. 17.5 కోట్లు ఇస్తే సరిపోతుందా?.. పాపం అతడు!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఫాఫ్ డుప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, గతంలో ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది. బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు.ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ కూడా లేడు. ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది. వాళ్లకు సునిల్ నరైన్ రూపంలో ప్రపంచస్థాయి స్పిన్ బౌలర్ దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలడు.ఆర్సీబీకి మాత్రం ఇలాంటి స్పిన్నర్ లేడు. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వారిలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది. అలాంటపుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా! నిజానికి మిడిలార్డర్లో కంటే టాపార్డర్‌లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు.కానీ అతడిని మిడిలార్డర్లోనే పంపిస్తున్నారు. తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు. కచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా’’ అని ఆరోన్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండూ కారణం కావొచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ. 17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే, టాపార్డర్‌లో పవర్ఫుల్ స్ట్రైకర్ అయిన గ్రీన్‌ను మిడిలార్డర్లో ఆడిస్తోంది. విరాట్ కోహ్లితో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్‌లో విల్‌జాక్స్ వన్‌డౌన్‌లో రాగా..పేస్ఆల్రౌండర్ గ్రీన్ ఐదో స్థానంలో బరిలోకి దిగాడు.చదవండి: MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్‌కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టెయిలాండర్ జోష్ హాజిల్‌వుడ్‌తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పదో వికెట్‌కు హాజిల్‌వుడ్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్‌కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్‌తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్‌కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్‌తో ఆల్‌టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్‌వుడ్ జోడీ బ్రేక్ చేసింది. ఇక 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. -
గ్రీన్ భారీ సెంచరీ.. 179 పరుగులకే కుప్పకూలిన కివీస్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ పేసర్లు మూకుమ్మడిగా రాణించడంతో 179 పరుగులకే కుప్పకూలింది. నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్‌తో పాటు టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు ముగ్గురితో పాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
AUS vs NZ: కామెరాన్ గ్రీన్ విరోచిత శతకం..
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. మొదటి రోజు ఆటలో కివీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మాత్రం అద్బుత సెంచరీతో అడ్డుగా నిలిచాడు. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆసీస్‌ను 4 వికెట్లతో దెబ్బతీశాడు. అతడితో పాటు విలియం ఒరోర్కే, కుగ్గిలిజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను గ్రీన్ అదుకున్నాడు. 155 బంతుల్లో 16 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గ్రీన్‌తో పాటు మిచెల్ మార్ష్(40) పరుగులతో రాణించాడు. చదవండి: #Shreyas Iyer: అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా? -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్‌గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు.. ఇలా దూరం పెట్టడమెందుకు..?
క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్‌తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ కోవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విండీస్‌తో మ్యాచ్‌లో గ్రీన్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్‌కు కోవిడ్ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్ సహచరులతో పాటు లైన్లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు. Hazlewood shoos away the Covid-positive Green! 🤪 #AUSvWI pic.twitter.com/iQFbbKfpwV— cricket.com.au (@cricketcomau) January 25, 2024 కోవిడ్ ఉందన్న కారణంగా గ్రీన్ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్ మేనేజ్మెంట్ తెలిపినట్లు సమాచారం. గ్రీన్ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్ మేనేజ్మెంట్ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్ జట్టులో గ్రీన్‌తో పాటు హెడ్ కోచ్ మెక్ డోనాల్డ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 38/1గా ఉంది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (17), కిర్క్ మెక్కెంజీ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
రూ. 17.5 కోట్లు: ఐపీఎల్‌కు దూరంగా ఉండు.. అప్పుడే మేటి క్రికెటర్‌గా!
మేటి టెస్టు క్రికెటర్‌గా ఎదగాలంటే కామెరాన్ గ్రీన్ కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కొన్నాళ్లు దూరంగా ఉండాలని సూచించాడు. సంప్రదాయ క్రికెట్‌పై మరింతగా దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను గతేడాది ఐపీఎల్ వేలంలో ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ పేస్ ఆల్‌రౌండర్ కోసం ఏకంగా.. రికార్డు స్థాయిలో 17. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే, ఐపీఎల్-2023 సీజన్ మొత్తంలో అతడు 16 మ్యాచ్‌లాడి 452 పరుగలు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ గ్రీన్‌ను ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాడిన్.. కామెరాన్ గ్రీన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఫాస్ట్‌బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నవాళ్లే. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ కూడా అదే పనిచేస్తే బాగుంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉందనుకుంటే.. అతడు టెస్టు క్రికెట్ కోసం ఐపీఎల్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది’’ అని ఫాక్స్ క్రికెట్‌తో హాడిన్ వ్యాఖ్యానించాడు. గ్రీన్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని.. ఆస్ట్రేలియా తరఫున మేటి క్రికెటర్‌గా ఎదగాలంటే ఇలాంటివి తప్పవని బ్రాడ్ హాడిన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియాను ఓడించి ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ఆడిన తుది జట్టులో కామెరాన్ గ్రీన్‌కు స్థానం దక్కలేదు. -
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. 17 కోట్ల ఆటగాడికి గుడ్‌బై!
ఐపీఎల్-2024 సీజన్ వేలంకు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో రూ 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను విడుదల చేయాలని ముంబై భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 వేలంలో అతడి భారీ అంచనాలతో ముంబై సొంతం చేసుకుంది. కానీ ముంబై నమ్మకాన్ని గ్రీన్ వమ్ముచేశాడు. తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 452 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతడిని విడిచిపెట్టి వేలంలో తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని ముంబై వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్(రూ.8 కోట్లు)ను కూడా విడిచిపెట్టేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. గత సీజన్లో అర్చర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అర్చర్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. అయితే ఇప్పుడు ఆ జట్టు స్టార్‌పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించడంతో అర్చర్‌ను ముంబై వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. అదే విధంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ రూపంలో ముంబై ఇండియన్స్ తిరిగిచ సొంతం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న ముంబై వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్ కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. చదవండి: -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డచ్తో మ్యాచ్‌లో ఆసీస్ తమ జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ స్టోయినిష్ స్ధానంలో కామెరూన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా చదవండి: World Cup 2023: అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. పాకిస్తాన్ కెప్టెన్‌పై వేటు! -
భారత బ్యాటర్ల విశ్వరూపం.. చెత్త రికార్డు మూటగట్టుకున్న గ్రీన్
ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఆసీస్ యువ పేసర్ కెమరూన్ గ్రీన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్ చేసిన గ్రీన్ రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకుని, వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. 2006లో జోహనెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ మిక్ లెవిస్ సమర్పించుకున్న 113 పరుగులు వన్డేల్లో ఆసీస్ తరఫున అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన కాగా.. కొద్ది రోజుల కిందట అదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్ జంపా కూడా 113 పరుగులు సమర్పించుకుని ఆసీస్ తరఫున రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. తాజాగా గ్రీన్ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 103 పరుగులు సమర్పించుకుని వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు మొత్తం నలుగురు కాగా.. వారిలో మిక్ లెవిస్, ఆడమ్ జంపా, కెమరూన్ గ్రీన్, ఆండ్రూ టై (100) ఉన్నారు. ఇవాల్టి మ్యాచ్‌లో గ్రీన్ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శనల్లో గ్రీన్ ఇవాల్టి మ్యాచ్ ప్రదర్శన (2/103) మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్ కంటే ముందు లంక బౌలర్ నువాన్ ప్రదీప్ (0/106), టిమ్ సౌథీ (0/105) ఉన్నారు. కాగా, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 82/2గా ఉంది. లబూషేన్ (26), వార్నర్ (43) క్రీజ్‌లో ఉన్నారు. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా? కెప్టెన్‌వే ఇలా చేస్తే ఎలా? రాహుల్‌పై ఫైర్
Fans Fires On KL Rahul: టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుతో తలపడతున్నపుడు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించకతప్పదని చురకలు అంటిస్తున్నారు. చేతి దాకా వచ్చిన బంతిని అలా ఎలా వదిలేస్తావంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు సన్నాహకంగా భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈ టీమిండియా... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. స్పిన్ విభాగం నుంచి అశ్విన్, జడేజా చెరో వికెట్ కూల్చారు. రాహుల్ వల్ల రనౌట్ మిస్ కాగా.. 23వ ఓవర్ మొదటి బంతికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చింది టీమిండియాకు! కానీ వికెట్ కీపింగ్ చేస్తున్న రాహుల్ నిర్లక్ష్యం కారణంగా అతడు బతికిపోయాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకునే క్రమంలో లబుషేన్, కామెరాన్ గ్రీన్ కన్ఫ్యూజన్కు లోనయ్యారు. లబుషేన్ పిచ్ మధ్యలో ఉన్న సమయంలో సూర్య బంతిని రాహుల్ వైపునకు విసిరాడు. కానీ క్యాచ్ పట్టడంలో అతడు విఫలం కావడంతో ఆసీస్ బ్యాటర్‌కు లైఫ్ వచ్చింది. సూర్య చాకచక్యం వల్ల ఆ రనౌట్ ఇదిలా ఉంటే.. 40వ ఓవర్లో వికెట్ కీపర్ రాహుల్ కారణంగా సువర్ణావకాశం టీమిండియా చేజారేదే! 39.3వ ఓవర్.. షమీ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్ బ్యాట్ తాకిన బంతిని ఆపే అవకాశాన్ని మిస్ చేశాడు రాహుల్. ఆ తర్వాత కూడా దానిని ఆపేందుకు పెద్దగా ప్రయత్నం చేయలేదు. రనౌట్‌కు ఆస్కారం ఉన్న తరుణంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే అనిపించింది. థర్డ్ మ్యాన్ దిశగా బంతి దూసుకుపోతున్న తరుణంలో.. దీనిని అలుసుగా తీసుకున్న ఆసీస్ బ్యాటర్లు మరో రన్ కోసం పరుగు తీయడానికి సిద్ధమయ్యారు. అయితే ఫీల్డర్ రుతురాజ్ విసిరిన బాల్‌ను.. సూర్య తన చేతుల్లోకి తీసుకుని.. చాకచక్యంగా వికెట్లకు గిరాటేయడంతో గ్రీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు సందర్భాల్లో కేఎల్ రాహల్ వైఖరిని ఉద్దేశించి ఫ్యాన్స్ ఈ మేరకు ఫైర్ అవుతున్నారు. బద్ధుండాలి.. కెప్టెన్‌వే ఇలా చేస్తే ఎలా అని చురకలు అంటిస్తున్నారు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? ICYMI Direct-Hit Alert! Confusion in the middle & @surya_14kumar gets the throw right to dismiss Cameron Green.#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Alg6Avxyif — BCCI (@BCCI) September 22, 2023 -
Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్‌లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్‌కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్‌వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన రూట్ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అదేంటంటే.. యాషెస్ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు. ఇక తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు నాటౌట్ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్ హెడ్(77 పరుగులు), డేవిడ్ వార్నర్(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. Joe Root strikes twice in an over and Australia are 5️⃣ down! #EnglandCricket | #Ashes pic.twitter.com/wmn9hC5K6c — England Cricket (@englandcricket) June 28, 2023 చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్ -
గిల్ది ఔటే.. నేను క్లియర్‌గానే క్యాచ్ పట్టుకున్నా: గ్రీన్
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ ఔటైన విధానం తీవ్రదుమారం రేపుతోంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ది నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గిల్ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే గ్రీన్ పట్టిన క్యాచ్ స్పష్టంగా లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదంపై నాలుగో రోజు ఆట అనంతరం కామెరూన్ గ్రీన్ స్పందించాడు. తను క్లియర్ క్యాచ్ పట్టానని గ్రీన్ చెప్పుకొచ్చాడు. "గిల్ క్యాచ్‌ను నేను సృష్టంగా పట్టుకున్నానని భావించాను. ఆ సమయంలో నేను అది క్లియర్ క్యాచ్ అనుకుని బంతి పైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాను. నా వైపు నుంచి ఎటువంటి సందేహాలు లేవు. కానీ తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వదిలేశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ సమయం ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కే కేటాయించేవాడిని. అదే విధంగా టెస్టుల్లో మొదటి లేదా రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో నేను కొన్ని మంచి క్యాచ్‌లను పట్టుకున్నాను. కానీ రెండో రోజు ఆటలో కొన్ని సులభమైన క్యాచ్‌లను విడిచిపెట్టాను. అది నన్ను చాలా నిరాశపరిచింది. అయితే తర్వాత అంతకమించిన క్యాచ్‌లను పట్టడం చాలా సంతోషంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ పేర్కొన్నాడు. చదవండి: WTC FINAL: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక! -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'
క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్‌లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్‌లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్‌ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్‌లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్‌తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్‌లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
#NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. 444 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు గిల్, రోహిత్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు టీమిండియాకు ఊహించని దెబ్బ తగలిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్ ఔట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్‌ను ఆశ్చర్యపరిచింది. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు.. అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా ఔట్ ఇచ్చాడు.. కళ్లకు గంతలు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) Cheating is in Blood of Australians and ICC. ICC is a slave of white skinned dominance. #WTCFinal#WTCFinal2023 Ponting Cameroon Green Gill pic.twitter.com/zlWAgob6zN — Ayush Jain (@aestheticayush6) June 10, 2023 చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప! -
అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మ్యాజిక్‌ను మరోసారి చూపెట్టాడు. నాలుగోరోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ ఔటైనప్పటికి క్రీజులో ఉన్న గ్రీన్, అలెక్స్ కేరీలు పట్టుదలగా ఆడారు. దీంతో మరో వికెట్ పడదేమో అనుకుంటున్న తరుణంలో జడ్డూ తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 63వ ఓవర్ జడేజా బౌలింగ్ చేశాడు. 25 పరుగులతో నిలకడ చూపిస్తున్న గ్రీన్ అప్పటికే ఓపికగా నాలుగు బంతులు ఎదుర్కొన్నాడు. ఇంకా ఒక్క బంతి ఆపితే ఓవర్ పూర్తవుతుంది. అయితే జడ్డూ ఆరో బంతిని కాస్త తెలివిగా ఔట్‌సైడ్ లెగ్ దిశగా వేశాడు. గ్రీన్‌కు ఆ బంతి ఆడే ఉద్దేశం లేకపోవడంతో బ్యాట్‌ను అడ్డుపెట్టాడు. కానీ ఎవరు ఊహించని విధంగా లోటర్న్ అయిన బంతి గ్రీన్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి పైకి లేచి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో గ్రీన్‌కు ఏం జరిగిందో కాసేపు అర్థం కాక షాక్‌లో ఉండిపోయాడు. తర్వాత చేసేదేంలేక నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిషన్‌సింగ్ బేడీ రికార్డు బద్దలు ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్‌ను ఔట్ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు)ని క్రాస్ చేసి ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్(433 వికెట్లు), డేనియల్ వెటోరి(362 వికెట్లు), డ్రీక్ అండర్వుడ్(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Excellent delivery by Ravinder Jadeja. A perfect set-up from Ravindra Jadeja and it disturbs the stumps to send back Cameron Green for 25. #INDvsAUS #WTCFinal2023 #SupriyaSule #AajKeBaadOutNow #unicornspotted #ShameOnKajolHotstar #WTC23 #TirupatiWelcomesNadda pic.twitter.com/MqCamF6Dsr — 𝒮𝒾𝓂𝓇𝒶𝓃 (𝒥𝑜𝓊𝓇𝓃𝒶𝓁𝒾𝓈𝓉)✨ (@simi2214) June 10, 2023 చదవండి: ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా? -
ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టిన ఐపీఎల్ 2023.. ఇంకా 4 మ్యాచ్‌లు ఉండగానే..!
ఐపీఎల్ 2023లో గత సీజన్ల రికార్డులు చాలా వరకు బద్దలవుతున్నాయి. ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే పరిస్థితి ఇది. అత్యధిక వికెట్లు (చహల్), అత్యధిక సెంచరీలు (విరాట్ కోహ్లి), అత్యధిక డకౌట్లు (దినేశ్ కార్తీక్), 200 పరుగులకు పైగా అత్యధిక ఛేజింగ్‌లు, ఫాస్టెస్ట్ ఫిఫ్టి (యశస్వి జైస్వాల్).. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీజన్లో బద్దలైన రికార్డులకు అంతే లేకుండా పోతుంది. నిన్న (మే 21) జరిగిన రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఒకే రోజు 3 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు కెమారూన్ గ్రీన్.. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్లు శతక్కొట్టారు. ఈ ఐపీఎల్ రికార్డుతో పాటు నిన్నటి మ్యాచ్‌లతో మరో రికార్డు కూడా బద్దలైంది. సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డు ఐపీఎల్ 2022 (8) పేరిట ఉండగా.. ఈ సీజన్ ఆ రికార్డును తుడిచిపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్లు వ్యక్తిగతంగా మరో రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వీరివురు ఐపీఎల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన 3, 4వ ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు. అంతకుముందు శిఖర్ ధవన్, జోస్ బట్లర్ ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లతో ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గుజరాత్, సీఎస్కే, లక్నో, ముంబై ఇండియన్స్‌లు ఫైనల్ ఫోర్కు చేరాయి. రేపు జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్కే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. ఆ తర్వాత క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: గిల్ ముంబై కోసమే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్ -
సెంచరీతో ముంబైని గెలిపించిన గ్రీన్
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సెంచరీతో మెరిశాడు. ఎస్ఆర్హెచ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్ గెలిపించడంతో పాటు తొలి ఐపీఎల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 47 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఎస్ఆర్హెచ్పై విజయంతో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికి.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దు అయితే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున కామెరాన్ గ్రీన్‌ది రెండో సెంచరీ కాగా తొలి సెంచరీ సూర్యకుమార్ యాదవ్ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ తరపున గ్రీన్‌ది ఆరో శతకం. ఇంతకముందు సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, లెండిల్ సిమన్స్, సూర్యకుమార్ ఉండగా.. తాజాగా వీరి సరసన కామెరాన్ గ్రీన్ నిలిచాడు. ఇక ఐపీఎల్ 2023లో గ్రీన్‌ది తొమ్మిదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ 100 పరుగులు, శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు)తో ఉన్నారు. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗛𝗔𝗦𝗘!@mipaltan stay alive in #TATAIPL 2023 courtesy of an exceptional batting display and an 8-wicket win over #SRH 👏🏻👏🏻#MIvSRH pic.twitter.com/t1qXyVbkqG — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
IPL 2023- MI Vs RR: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడీ టీ20 నంబర్ 1 బ్యాటర్. ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలిసారి అర్ధ శతకం సాధించిన ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి అభిమానులకు కనువిందు చేశాడు. అదరగొట్టేశాడు వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్య 29 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఆటతీరును ఇలాగే కొనసాగిస్తే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా ముంబై- రాజస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య గ్రహణం వీడింది.. ‘‘ముంబై లక్ష్య ఛేదన అంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. మునుపటి లయను అందుకున్నాడు. ఇన్నాళ్లు.. సూర్యగ్రహణం పట్టింది.. ఇప్పుడిప్పుడే గ్రహణం వీడి సూర్యుడు ప్రకాశించడం మొదలుపెట్టాడు. నిజానికి ఈరోజు రోహిత్ శర్మ తొందరగా అవుటైపోయాడు. తన పుట్టినరోజు అయినప్పటికీ సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అలాంటి క్లిష్ట సమయంలో కామెరాన్ గ్రీన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి పట్టుదలగా నిలబడ్డాడు. కామెరాన్ గ్రీన్ భవిష్యత్ సూపర్‌స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు భవిష్యత్ సూపర్‌స్టార్ మానసికంగా.. శారీరకంగా అతడు ఫిట్నెస్ కాపాడుకోగలిగితే కచ్చితంగా రాక్‌స్టార్‌గా వెలుగొందుతాడు. తనదొక విభిన్న శైలి. తను అద్బుతంగా బౌలింగ్ కూడా చేయగలడు. గ్రీన్ ఒక సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ఆకాశ్ చోప్రా ముంబై బ్యాటర్ల ఆటను విశ్లేషిస్తూ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా సొంతమైదానంలో రాజస్తాన్‌తో తలపడ్డ ముంబై మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి విధించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఇషాన్ 28 పరుగులు సాధించాడు. టిమ్ డేవిడ్ విధ్వంసం వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్ 26 బంతుల్లో 44 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 29, టిమ్ డేవిడ్ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. చివరి ఓవర్లో మొదటి మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబై గెలుపును ఖరారు చేశాడు. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 201 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 57. ముంబై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్- రాజస్తాన్- బ్యాటింగ్ ►రాజస్తాన్- 212/7 (20) ►ముంబై- 214/4 (19.3) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్(రాజస్తాన్)- 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 124 పరుగులు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్ 1️⃣0️⃣0️⃣0️⃣th IPL match. Special Occasion... ...And it ends with an electrifying finish courtesy Tim David & @mipaltan 💥💥💥 Scorecard ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/qK6V5bqiWV — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
17 కోట్లు దండగా అన్నారు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు! నోళ్లు మూయించాడుగా
ఐపీఎల్-2023లో శనివారం వాఖండే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గ్రీన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన గ్రీన్.. అనంతరం బ్యాటింగ్‌లో (43 బంతుల్లో 67) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లోనూ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 64 పరుగులు చేసిన గ్రీన్.. బౌలింగ్‌లో ఒక్క వికెట్ పడగొట్టాడు. తొలుత విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం విధితమే. అయితే తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగ అని, జట్టులోని తీసియండి అని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. ఇక గ్రీన్ తన అద్భుత ప్రదర్శనలతో విమర్శలకు చెక్ పెట్టాడు. అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. గ్రీన్ అద్భుతమైన ఆల్‌రౌండర్ అని, అతడు తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేస్తున్నాడని ముంబై అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ ఆల్‌రౌండర్.. 166 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా #ArshdeepSingh: జాగ్రత్త.. అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్! Stump breaker, Game changer! Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x — JioCinema (@JioCinema) April 22, 2023 -
ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా?
IPL 2023 CSK vs MI: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడని గ్రీన్‌పై ముంబై ఇంత మొత్తాన్ని వెచ్చించింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్.. ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్ దారుణంగా విఫలయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ గ్రీన్ రాణించలేకపోతున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు చేసి ఒక్క వికెట్ సాధించిన గ్రీన్.. అనంతరం శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో అయితే వికెట్ ఏమి సాధించకుండా 20 పరుగులిచ్చాడు. ఇక రూ.17.5 కోట్ల భారీ మెత్తం తీసుకుని దారుణంగా విఫలమవుతున్న గ్రీన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకేనా ఇంత తీసుకున్నావు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొంత మంది ముంబై మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు. ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు బాగా ఆడినంతమాత్రాన అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరములేదని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ముంబై ఈ సారి కూడా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2023 CSK vs MI: ఘోర ఓటమి.. ముఖం దాచుకున్న రోహిత్ శర్మ! ఫోటో వైరల్ -
అక్కడుంది జడ్డూ.. బంతి మిస్సయ్యే చాన్స్ లేదు
సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. తానే బౌలింగ్ చేసి తానే క్యాచ్ తీసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కామెరున్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్బుత రీతిలో తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన జడేజా రెండో బంతిని ఫ్లైటెడ్ డెలివరీ వేశాడు. కామెరున్ గ్రీన్ కవర్స్ దిశగా ఆడుదామని ప్రయత్నించి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే జడేజా చేతులు అడ్డుపెట్టి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో జడేజా క్యాచ్‌ను తీసుకున్నాడు. అంతే గ్రీన్ ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Now THAT'S what you call a blinder, courtesy Ravindra Jadeja 🤯#MIvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @imjadeja pic.twitter.com/NpJRXhBvtJ — JioCinema (@JioCinema) April 8, 2023 -
ఐపీఎల్.. వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వాళ్లకు మాత్రం కోట్లు!
IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఐపీఎల్లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. దశ తిరిగిపోతుందని ఇప్పటికే ఎంతో మంది ప్లేయర్లు నిరూపించారు కూడా! ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదహారవ సీజన్‌తో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం! కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్. ఐపీఎల్ మినీ వేలం-2023లో ముంబై ఇండియన్స్ అతడి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆసీస్ తరఫున ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో 173.75 స్ట్రైక్‌రేటుతో 139 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్. గతేడాది దారుణ వైఫల్యంతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఆల్‌రౌండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ పవర్ హిట్టర్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో విశ్వరూపం ప్రదర్శించిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్‌లలో 468 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి తనని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌కు మరి ఏ మేరకు ‘తిరిగి చెల్లిస్తాడో’ ఈ యువ బ్యాటర్. సికందర్ రజా పాకిస్తాన్ మూలాలున్న జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అతడి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 147.97 స్ట్రైక్‌రేటుతో 219 పరుగులు సాధించాడీ ఆల్‌రౌండర్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను తిప్పలు పెడుతూ 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు 66 టీ20లు ఆడి.. 1259 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గతేడాది మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రజాను 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆల్‌రౌండర్ తన తొలి ఐపీఎల్ ఎడిషన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి! ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్. 29 ఏళ్ల ముకేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచ్‌లలో 134 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 7.20 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రంజీ ట్రోఫీ-2021-22 సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. విజయ్ హజారే ట్రోఫీ-2022లో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన ముకేశ్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. తొలి సీజన్లోనే భారీ మొత్తం పలికిన ముకేశ్ కుమార్ ఢిల్లీ యాజమాన్యం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరి! జాషువా లిటిల్ ఐరిష్ పేసర్ జాషువా లిటిల్ అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. తన పదునైన పేస్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించే లిటిల్ తొలిసారి ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐర్లాండ్ తరఫున ఆడిన 26 టీ20లలో 39 వికెట్లు తీశాడు. గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లలో 7 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న 23 ఏళ్ల లిటిల్ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వీరు సైతం ఇక ఈ ఐదుగురితో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం కలిగిన 32 ఏళ్ల జో రూట్(రాజస్తాన్ రాయల్స్- ధర. కోటి), న్యూజిలాండ్ బ్యాటర్, 32 ఏళ్ల మైకేల్ బ్రేస్‌వెల్(ఆర్సీబీ- ధర కోటి) కూడా ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: Cristiano Ronaldo: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్ బ్యాటర్‌కే! కచ్చితంగా అతడే.. -
వారెవ్వా షమీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయిందిగా! వీడియో వైరల్
వాంఖడే వేదికగా ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రెండు మెయిడెన్లు ఉండడం గమనార్హం. అతడు పడగొట్టిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను షమీ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందడనంలో ఎటువంటి సందేహం లేదు. షమీ ఓ సంచలన బంతితో గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 30 ఓవర్లో మూడో బంతిని అద్భుతమైన ఫుల్లర్ లెంగ్త్ డెలివరిగా షమీ సంధించాడు. షమీ బంతికి గ్రీన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీతో పాటు సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Mohammad Shami the artist.#INDvsAUS #shami #TeamIndia #siraj pic.twitter.com/PmtcZBEzdC — Azaz ahmed mogal (@azaz_mogal) March 17, 2023 చదవండి: IND vs AUS: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్ చేస్తూ సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసీస్.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..
India vs Australia, 4th Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో మూడో టెస్టుతో ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా.. నాలుగో మ్యాచ్‌లోనూ దూకుడు కొనసాగిస్తోంది. టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పరుగులు తీసేందుకు ఆపసోపాలు పడిన ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా బ్యాట్ ఝులిపిస్తున్నారు. ఓవైపు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దంచి కొట్టగా.. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ శతకం(114)తో మెరిశాడు. అహ్మదాబాద్ టెస్టులో తొలిరోజే ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి 180 పరుగులతో అజేయంగా నిలిచాడు. 421 బంతులు ఎదుర్కొన్న అతడు 21 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ వెంటనే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగిలిన వాళ్లలో మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 32, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 146 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు(తాజా మ్యాచ్ కలిపి) తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు దాటింది. తాజా మ్యాచ్ మినహాయిస్తే.. ఈ మేర స్కోరు చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 4సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్ డ్రా చేసుకుంది. కాగా ఇప్పటివరకు భారత బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, రవిచంద్రన్ అశ్విన్‌కు నాలుగు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆశలు టీమిండియాతో మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ సేనకు చిక్కొచ్చిపడింది. ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. మ్యాచ్ ఓడినా, డ్రా అయినా.. న్యూజిలాండ్- శ్రీలంక సిరీస్ ఫలితం తేలేంత వరకు ఎదురుచూడాల్సిందే! అయితే, లంక న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తేనే టీమిండియాతో పోటీపడే అవకాశం ఉంటుంది. అయితే, విదేశీ గడ్డపై కరుణరత్నె బృందానికి అదేమీ అంత తేలికకాదు. దీంతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం! Ind vs Aus: చెలరేగిన అశ్విన్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్.. ఇంకా! వీడియో వైరల్ Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. 𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥 A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq — BCCI (@BCCI) March 10, 2023 -
డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా?
ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్ ఈ ఘనత అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై యథేచ్చగా బ్యాట్ ఝులిపించిన గ్రీన్ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం మార్క్ సాధించాడు. కాగా గ్రీన్‌కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. టీమిండియా గడ్డపై టెస్టుల్లో డెబ్యూ శతకం అందుకున్న అరుదైన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు ఉస్మాన్ ఖవాజాతో కలిసి గ్రీన్ ఐదో వికెట్‌కు 208 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్ తరపున టీమిండియా గడ్డపై టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ పార్ట్నర్షిప్ కావడం విశేషం. తొలి స్థానంలో 1979-80లో చెన్నై వేదికగా అలెన్ బోర్డర్- హ్యూజెస్లు కలిసి 222 పరుగులు జోడించారు. ఇక మూడో స్థానంలో ఓ నీల్- హార్వే జంట 1959-60లో ముంబై వేదికగా 207 పరుగులు జోడించారు. అయితే డెబ్యూ సెంచరీ అందుకున్న కామెరాన్ గ్రీన్ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేళ టీమిండియా అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు. తొలి టెస్టు శతకం అందుకున్నందుకు కంగ్రాట్స్.. కానీ పోయి పోయి టీమిండియాపైనే అది సాధించాలా అంటూ కామెంట్ చేశారు. అయితే సెంచరీ తర్వాత మరో 14 పరుగులు చేసిన గ్రీన్ 114 వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Cameron Green celebrates his maiden Test century 👏 LIVE ▶️ https://t.co/BG0U48XqPn#INDvAUS pic.twitter.com/u4ghdGrgFg — CODE Cricket (@codecricketau) March 10, 2023 చదవండి: 'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్' 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
Ind vs Aus: చెలరేగిన అశ్విన్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! భరత్ సూపర్!
India vs Australia, 4th Test- Ashwin Strikes 2 Video Viral: అహ్మదాబాద్ టెస్టులో రెండో రోజు ఆటలో ఎట్టకేలకు టీమిండియాకు కామెరాన్ గ్రీన్ రూపంలో తొలి వికెట్ దక్కింది.సెంచరీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఈ ఆల్‌రౌండర్‌ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో వికెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత జట్టుకు బ్రేక్ లభించింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి నాలుగో టెస్టు మార్చి 9న ఆరంభమైంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్.. రెండో రోజు కూడా దూకుడు ప్రదర్శించింది. అద్భుతం చేసిన అశ్విన్ మొదటి రోజు శతకం పూర్తి చేసుకున్న ఉస్మాన్ ఖవాజాకు సహకారం అందిస్తూనే గ్రీన్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 170 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్ 114 పరుగులు రాబట్టి భారత బౌలర్లకు కొరకరానికొయ్యగా తయారయ్యాడు. ఖవాజా- గ్రీన్ జోడీని విడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ .. 131వ ఓవర్ వరకు ఇది సాధ్యపడలేదు. అయితే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఎట్టకేలకు గ్రీన్ వికెట పడగొట్టాడు. అశ్విన్ బౌలింగ్‌లో 131వ ఓవర్ రెండో బంతిని స్వీప్‌షాట్ ఆడేందుకు గ్రీన్ ప్రయత్నించాడు. అయితే, వికెట్ల వెనకాల చురుగ్గా కదిలిన కీపర్ కేఎస్ భరత్ చక్కగా బంతిని ఒడిసిపట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు దీంతో గ్రీన్ సెంచరీ ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది. 378 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇక అదే ఓవర్లో అశ్విన్ అలెక్స్ క్యారీ వికెట్ కూడా తీయడం విశేషం. అశూ బౌలింగ్‌లో ఆఖరి బంతికి అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి క్యారీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఎట్టకేలకు వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు. అశ్విన్ అనుభవం అక్కరకొచ్చింది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా 131 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 378 పరుగులు చేసింది. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Aussie hunter: Ravichandran Ashwin 🇮🇳#INDvsAUS pic.twitter.com/tT3SwpD80u — Sushant Mehta (@SushantNMehta) March 10, 2023 𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥 A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq — BCCI (@BCCI) March 10, 2023 -
బ్యాటింగ్‌లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్‌లో ఇదే తొలిసారి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్‌లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్‌లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్‌లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్‌లు కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించడం బెస్ట్‌గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత భారత్, ఆసీస్ నాలుగో టెస్టు.. రెండో రోజు లైవ్ అప్డేట్స్ -
భారత్‌తో నాలుగో టెస్టు.. స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం! స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం మూడో టెస్టు ఫలితాన్ని రిపీట్ చేసి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్ వ్యూహాల ముందు రోహిత్ సేన తేలిపోయింది. అహ్మదాబాద్ టెస్టుకు కూడా ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో స్మిత్‌నే సారథ్యం వహించనున్నాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ముందు ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్‌తో పాటు స్టీవ్ స్మిత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగాలని ఆస్ట్రేలియా జట్టు యోచిస్తన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ఆఖరి టెస్టుకు పక్కనపెట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంగా గ్రీన్ మూడో టెస్టుకు జట్టులోకి వచ్చాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు ఇండోర్ టెస్టులో కన్పించాడు. బ్యాటింగ్‌లో కూడా కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడు స్థానంలో యువ పేసర్ లాన్స్ మోరిస్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని స్మిత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల లాన్స్ మోరిస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్‌లు ఆడిన అతడు 59 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రాగా ముగించినా చాలు.. ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్, లాన్స్ మోరిస్ చదవండి: BGT 2023: ‘ప్యాట్ కమిన్స్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి.. బౌలర్ల కంటే బ్యాటర్లే బెటర్’ -
ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు గుడ్‌న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ చేతిలో తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం పొందిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు సన్నద్దం అవుతోంది. కనీసం మూడో టెస్టులోనైనా విజయం సాధించి తొలి రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. అయితే మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు గాయం కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం అయ్యాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ఆసీస్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆఖరి రెండు టెస్టులకు ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా గాయాల కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. విధ్వంసకర ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మూడో టెస్టుకు అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా సృష్టం చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో కామెరాన్ గ్రీన్ చేతి వేలికి గాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే గ్రీన్ జట్టుతో కలిసి భారత్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో బ్యాటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాడు. అయితే ఇప్పుడు గ్రీన్ నెట్స్‌లో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. కాగా గతేడాది భారత్ గడ్డపై టీ20 సిరీస్‌లో గ్రీన్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడిని ఐపీఎల్-2023 మినీ వేలంలో ఏకంగా 17 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు సిరీస్ జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గాయపడిన ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తన చేతి వేలి గాయం నుంచి పూర్తిగా ఇంకా కోలుకోలేదు. అయితే గ్రీన్ ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో గ్రీన్ గాయం సంబంధించిన రిపోర్ట్‌లను వైద్యబృందం పరిశీలించాక తుది నిర్ణయం తీసుకున్నానమని ఆసీస్ హెడ్ కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు. "గ్రీన్ చేతి వేలి గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోనున్నాం. అతడి రిపోర్టులు వచ్చాక ఓ నిర్ణయం తీసుకోనున్నాం. నాకు తెలిసినంతవరకు అతడు బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. బౌలింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నాను. అయితే అతడు మా జట్టులో స్పెషలిస్టు బ్యాటర్. కాబట్టి మేము తొలి ప్రాధన్యత అతడి బ్యాటింగ్‌కే ఇస్తాము. అయితే తొలి టెస్టుకు ఇంకా మాకు చాలా సమయం ఉంది. అతడు పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి జట్టులో చేరతాడని ఆశిస్తున్నాను" అని మెక్‌డొనాల్డ్ విలేకురల సమావేశంలో పేర్కొన్నాడు. చదవండి: 'హార్దిక్ వద్దు.. టీమిండియా వన్డే కెప్టెన్సీకి వారిద్దరే సరైనోళ్లు' -
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. యువ స్పిన్నర్ ఎంట్రీ
Ind Vs Aus- Australia Test squad: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా భారత్‌తో ఆడనున్న సిరీస్‌కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తొలిసారి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నుంచి పిలుపు అందుకున్నాడు. స్టార్క్ అవుట్! అదే విధంగా.. అన్క్యాప్డ్ ప్లేయర్ లాన్స్ మోరిస్ సైతం మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు.. గాయం కారణంగా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం వేలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మొదటి టెస్టు ఆడే అంశంపై స్పష్టత లేదు. నలుగురు స్పెషలిస్టు స్పిన్నర్లతో ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 9- మార్చి 13 వరకు సిరీస్ ఆడనుంది. ఇక ఉపఖండ పిచ్‌లకు అనుగుణంగా కంగారూ జట్టు నలుగురు స్పెషలిస్టు స్పిన్నర్లు సహా ఆరుగురు ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకున్నట్లు ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్ ఆసీస్ కంటే కూడా టీమిండియాకు మరింత కీలకంగా మారింది. ఇందులో సత్తా చాటితేనే భారత్ వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. మూడున్నరేళ్ల విరామం తర్వాత! 22 ఏళ్ల స్పిన్నర్ మర్ఫీ పరిమిత ఓవర్ల క్రికెట్లో విక్టోరియా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తరఫున ఏడాది కాలంగా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక ఇప్పటికే 16 టెస్టులాడిన 31 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ హ్యాండ్స్కోంబ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి 2019 తర్వాత పునరాగమనం చేశాడు. మరోవైపు.. మాథ్యూ రేన్షా రిజర్వ్ బ్యాటర్‌గా సేవలు అందించనున్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హాండ్స్కోంబ్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), మాథ్యూ రేన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్), డేవిడ్ వార్నర్. చదవండి: IND VS SL 1st ODI: నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు IND Vs SL: కోహ్లి కమాల్.. భారత్ 'టాప్'గేర్ -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా
సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తగిలింది. వేగంతో దూసుకొచ్చిన బంతి గ్రీన్ చేతివేలిని చీల్చడంతో రక్తం కూడా కారింది.దీంతో గ్రీన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.రిటైర్డ్‌హర్ట్ అయ్యేటప్పటికి గ్రీన్ 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా గ్రీన్‌కు తీసిన ఎక్స్‌రే రిపోర్ట్ బయటకు రావడంతో ఆసక్తికర విషయం బయటపడింది. వాస్తవానికి నోర్ట్జే వేసిన బంతి వేగానికి గ్రీన్ వేలు విరిగినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అయితే లంచ్‌కు ముందు 363/3తో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నాథన్ లియోన్ ఏడో వికెట్‌గా వెనుదిరగ్గానే కామెరున్ గ్రీన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా నాలుగు గంటల పాటు క్రీజులో నిలబడ్డాడు. దాదాపు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గ్రీన్.. 177 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన గ్రీన్ బ్యాగీ గ్రీన్స్‌తో కలిసి జట్టును స్కోరును 575 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత స్టార్క్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అయితే వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కామెరున్ గ్రీన్ బ్యాటింగ్ కొనసాగించడం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్లను మరింత పెంచుకొని అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఓటములతో సౌతాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య మూడోటెస్టు జనవరి 4 నుంచి 8 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. Cameron Green retired hurt after being hit on finger by a ball from Anrich Nortje!! 😳#AUSvsSA #BoxingDayTest pic.twitter.com/1X7PuYobCs — FaceTheFact! (@FaceTheFact7) December 27, 2022 -
Aus Vs SA: ఆసీస్ భారీ స్కోరు.. చతికిల పడ్డ ప్రొటిస్! మరోసారి..
Australia vs South Africa, 2nd Test Day 3 Highlights: ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు కీలకమైన సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడింది ప్రొటిస్. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆసీస్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. మెల్బోర్న్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సరికి 371 పరుగుల వెనుకబడి ఉంది. కాగా సోమవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ను ఆల్‌రౌండర్‌ను కామెరాన్ గ్రీన్ దెబ్బకొట్టాడు. 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. 189కే ఆలౌట్ ఈ క్రమంలో 189 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (200), స్టీవ్ స్మిత్(85) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. ట్రవిస్ హెడ్(51), గ్రీన్(51- నాటౌట్) రాణించారు. ఇక అలెక్స్ క్యారీ టెస్టు కెరీర్లో తొలి సెంచరీ(111)తో మెరిశాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 575 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రొటిస్ బౌలర్లలో రబడకు రెండు, నోర్జేకు మూడు వికెట్లు దక్కగా.. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ తలా ఓ వికెట్ తీశారు. కెప్టెన్ మరోసారి విఫలం ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ప్రొటిస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ మరోసారి విఫలమయ్యాడు. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి సౌతాఫ్రికా 17 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ(7), థీనిస్ డి బ్రూయిన్ (6) క్రీజులో ఉన్నారు. కాగా ఎల్గర్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 575/8 d సౌతాఫ్రికా- 189 & 15/1 (7) చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! Nothing sweeter than getting your opposition skipper... for a duck! #OhWhatAFeeling #AUSvSA | @Toyota_Aus pic.twitter.com/KdTEdLZNFq — cricket.com.au (@cricketcomau) December 28, 2022 -
Aus Vs SA: రూ.17.5 కోట్లు.. కెరీర్లో తొలిసారి ఇలా! తోకముడిచిన ప్రొటిస్
Australia vs South Africa, 2nd Test- Day 1- Cameron Green: దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెల్బోర్న్లో సోమవారం ఆరంభమైన రెండో టెస్టు సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రెండు కీలక వికెట్లు కూల్చి డీన్ ఎల్గర్ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చిన గ్రీన్.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఇలా కెరీర్లో తొలిసారి ఈ ఫీట్(5 వికెట్ హాల్) నమోదు చేశాడు. ఇక గ్రీన్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. 189 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా ప్రొటిస్ టాపార్డర్ విఫలమైన వేళ.. ఆరోస్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సెన్(59) అర్ధ శతకాలతో రాణించారు. నాథన్ లియాన్‌తో గ్రీన్(PC: ICC) అయితే, వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు గ్రీన్. ఈ ఇద్దరితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్(12), రబడ(4), లుంగి ఎన్గిడి(2) వికెట్లు తీశాడు. ఇక గ్రీన్‌కు తోడు స్టార్క్ 2, బోలాండ్ 1, నాథన్ లియోన్ 1 ఒక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్‌ను ఎల్గర్ లబుషేన్ రనౌట్ చేశాడు. ఈ నేపథ్యంలో 189 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. 100వ టెస్టు ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ 32, వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై ఇండియన్స్ సంబరం ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ను గ్రీన్‌ను రూ. 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆక్షన్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ 23 ఏళ్ల యువ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ మేరకు కెరీర్లో ఉత్తమ గణాంకాలు(5/27) నమోదు చేయడం గమనార్హం. దీంతో ముంబై ఫ్రాంఛైజీ ఖుషీ అవుతోంది. గ్రీన్‌ను కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్.. ‘‘ముంబైకి మంచి రోజులు రాబోతున్నాయి. మనం మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాం. ఇలాంటి యంగ్ టాలెంట్ మనకు కావాలి. ఇండియన్ పిచ్‌లపై కూడా గ్రీన్ ఇలాగే రాణించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు KL Rahul: రాహుల్ వరుస సెంచరీలు చేయాలి! లేదంటే కష్టమే!.. గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా! Cameron चा कडक 5️⃣PELL 😍 Green claims his maiden 🖐️-wicket haul in Tests 🔥#OneFamily #AUSvSA @ICC pic.twitter.com/uSTNOymgdW — Mumbai Indians (@mipaltan) December 26, 2022 -
IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ల జాబితా, పూర్తి జట్లు.. పర్సులో ఎంత? ఇతర వివరాలు
IPL 2023 Mini Auction- 10 Squads- Purse Remaining- Slots: కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ స్టోక్స్‌లకు సైతం భారీ మొత్తం దక్కింది. కరన్‌ను పంజాబ్ దక్కించుకోగా.. గ్రీన్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఇక స్టోక్స్‌ను తిరిగి తమ కుటుంబంలోకి ఆహ్వానించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ఇక అట్టహాసంగా ముగిసిన శుక్రవారం నాటి వేలంలో 10 ఫ్రాంఛైజీలు కొన్న ఆటగాళ్ల వివరాలు, ఆక్షన్ తర్వాత పూర్తి స్థాయి జట్లు, పర్సులో మిలిగిన మొత్తం, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న అంశాలపై ఓ లుక్కేద్దాం. 1. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో కొన్న ఆటగాళ్లు(ధర రూపాయల్లో): హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ ( 8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ ( 5.25 కోట్లు), అదిల్ రషీద్ ( 2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రంత్ శర్మ ( 2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్ ( 20 లక్షలు), సన్వీర్ సింగ్ ( 20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ ( 25 లక్షలు), మయాంక్ దాగర్ ( 1.8 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి ( 20 లక్షలు), అకేల్ హోసేన్ (1 కోటి), అన్మోల్ప్రీత్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో ఇంకా మిగిలి ఉన్న మొత్తం: 6.75 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 2. చెన్నై సూపర్‌కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: అజింక్యా రహానే (50 లక్షలు), బెన్ స్టోక్స్ ( 16.25 కోట్లు), షేక్ రషీద్ ( 20 లక్షలు), నిశాంత్ సింధు ( 60 లక్షలు), కైల్ జేమిసన్ ( 1 కోటి), అజయ్ మండల్ ( 20 లక్షలు), భగత్ వర్మ ( 20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.7 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమ్ పజేతిరి, సిమ్ పజేతిరి చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ 3. ముంబై ఇండియన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: కామెరాన్ గ్రీన్ (17.5 కోట్లు), ఝే రిచర్డ్సన్ (1.5 కోట్లు), పియూష్ చావ్లా (50 లక్షలు), డువాన్ జాన్సెన్ (20 లక్షలు), విష్ణు వినోద్ (20 లక్షలు), షామ్స్ ములానీ (20 లక్షలు), మెహల్ వధేరా ( 20 లక్షలు), రాఘవ్ గోయల్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 0.05 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ ఆటగాళ్ల జాబితా: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్ 4. గుజరాత్ టైటాన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (2 కోట్లు), ఓడియన్ స్మిత్ (50 లక్షలు), KS భరత్ (1.2 కోట్లు), శివమ్ మావి (6 కోట్లు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు), జాషువా లిటిల్ (4.4 కోట్లు), మోహిత్ శర్మ (50 లక్షలు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేలంలో కొన్న ఆటగాళ్లు రీస్ టోప్లే (1.9 కోట్లు), హిమాన్షు శర్మ (20 లక్షలు), విల్ జాక్స్ (3.2 కోట్లు), మనోజ్ భాండాగే (20 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.95 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, జోహ్మద్ సిరాజ్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ 6. కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల లిస్టు నారాయణ్ జగదీశన్ (90 లక్షలు), వైభవ్ అరోరా (60 లక్షలు), సుయాష్ శర్మ (20 లక్షలు), డేవిడ్ వీస్ (1 కోటి), కుల్వంత్ ఖేజ్రోలియా (20 లక్షలు), లిట్టన్ దాస్ (50 లక్షలు), మన్దీప్ సింగ్ (50 లక్షలు), షకీబ్ అల్ హసన్ (1.50 కోట్లు) ►పర్సులో మిగిలింది: 1.65 కోట్లు ►ఖాళీ స్థానాలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటెన్షన్ జాబితా: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్ 7. లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు నికోలస్ పూరన్ (16 కోట్లు), జయదేవ్ ఉనాద్కట్ (50 లక్షలు) యష్ ఠాకూర్ (45 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), డేనియల్ సామ్స్ ( 75 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), నవీన్-ఉల్-హక్ ( 50 లక్షలు), యుధ్వీర్ చరక్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 3.55 కోట్లు ►మొత్తం ఖాళీలు: 0 రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ 8. పంజాబ్ కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: సామ్ కరన్ (18.50 కోట్లు), సికందర్ రజా (50 లక్షలు), హర్‌ప్రీత్ భాటియా (40 లక్షలు), విద్వాత్ కవేరప్ప (20 లక్షలు), మోహిత్ రాతీ (20 లక్షలు), శివమ్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో మిగిలిన మొత్తం: 12.2 కోట్లు ►ఖాళీలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 1 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ 9. రాజస్తాన్ రాయల్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల జాబితా జేసన్ హోల్డర్ (5.75 కోట్లు), డోనోవన్ ఫెరీరా (50 లక్షలు), కునాల్ రాథోడ్ (20 లక్షలు), ఆడమ్ జంపా (1.5 కోట్లు), కేఎల్ ఆసిఫ్ (30 లక్షలు), మురుగన్ అశ్విన్ (20 లక్షలు), అబ్దుల్ (20 లక్షలు), ఆకాష్ వశిష్ట్ ( 20 లక్షలు), జో రూట్ ( 2 కోట్లు) ►పర్సులో మిగిలింది: 3.35 కోట్లు ►ఖాళీలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కులదీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, యుజవేంద్ర చహల్ 10. ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగిజ్ ఎన్గిడి, లుంగిజ్ ఎన్గిడి, , అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. - వెబ్ స్పెషల్ చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా -
IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు
ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ పంట పండింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కరన్‌కు ఊహించినట్లుగానే ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం పలికింది. పంజాబ్ కింగ్స్ టీమ్ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కాగా... లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా 24 ఏళ్ల కరన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (2021లో రాజస్తాన్ రాయల్స్ రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా కూడా కరన్‌దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు... కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ. 17 కోట్లు చెల్లించాయి. ఇక అంచనాలకు అనుగుణంగా ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) కూడా భారీ మొత్తం పలకగా, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై కూడా తొలి ఐపీఎల్‌లోనే కోట్ల వర్షం కురిసింది. అటు ఐపీఎల్లో, ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ ‘నిలకడగా’ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనూహ్యం. కొచ్చి: ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ యువస్టార్ స్యామ్ కరన్ బాక్స్‌లు బద్దలు కొడితే ఆశ్చర్యపోవద్దు! వేలానికి ముందు పలువురు క్రికెట్ విశ్లేషకులు, మాజీల మాట ఇది. నిజంగానే ఈ మాట నిజమైంది. వారి అంచనా తప్పలేదు. ఎందుకంటే కరన్ బంతితో, బ్యాట్‌తో రెండు రకాలుగా ప్రభావం చూపించగల డని అత్యున్నత స్థాయిలో ఇప్పటికే రుజువైంది. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలి చాడు. అన్నింటితో పాటు అతని వయసు 24 ఏళ్లే! సరిగ్గా ఇదే కోణంలో ఫ్రాంచైజీలు ఆలోచించాయి. అందుకే అతని కోసం పోటీ పడ్డాయి. ముంబైతో మొదలు పెడితే బెంగళూరు, రాజస్తాన్, చెన్నై, పంజాబ్ విలువను పెంచుకుంటూ పోయాయి. చివరకు ముంబై రూ.18 కోట్ల వరకు తీసుకురాగా, పంజాబ్ మరో రూ.50 లక్షలు పెంచి రూ. 18 కోట్ల 50 లక్షలకు కరన్‌ను సొంతం చేసుకుంది. 2019 ఐపీఎల్లో పంజాబ్ జట్టే కరన్‌కు రూ. 7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్... 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఆ ముగ్గురూ సూపర్... ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన బెన్ స్టోక్స్‌కు సరైన విలువ లభించింది. అతని కోసం హైదరాబాద్, లక్నో మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరకు రూ. 16 కోట్ల 25 లక్షలకు అతను చెన్నై జట్టులోకి చేరాడు. వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్ సవరించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం (రూ. 17.5 కోట్లు) చెల్లించింది. ఓవరాల్‌గా టి20 రికార్డు గొప్పగా లేకపోయినా... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, ఆకట్టుకునే పేస్ బౌలింగ్‌తో పాటు ఇటీవల భారత గడ్డపై చేసిన రెండు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు గ్రీన్ విలువను పెంచాయి. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను పెద్ద మొత్తానికి (రూ. 13 కోట్ల 25 లక్షలు) సన్‌రైజర్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటతో మిడిలార్డర్లో, ఫినిషర్‌గా సత్తా చాటగల బ్రూక్ ఇటీవల పాకిస్తాన్‌తో టి20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గత ఐపీఎల్లో నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో కలిపి 306 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఒక్కటీ జట్టుకు చెప్పుకోదగ్గ విజయం అందించలేకపోయింది. నాడు అతనికి రైజర్స్ రూ. 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. ఇక ఇటీవలి వరల్డ్‌కప్‌లోనైతే అతను 5, 7, 13 చొప్పున పరుగులు చేశాడు. అయినా సరే, వేలంలో పోటీ బాగా కనిపించింది! ఎడంచేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కావడం ఒక కారణం కావచ్చు. చివరకు రూ. 16 కోట్లకు లక్నో ఎంచుకోవడం విశేషం. వేలం ఇతర విశేషాలు ► అందరికంటే ముందుగా విలియమ్సన్ పేరు రాగా సన్‌రైజర్స్ పట్టించుకోలేదు. గుజరాత్ రూ. 2 కోట్లకు విలియమ్సన్‌ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్ అవసరం ఉన్న సన్‌రైజర్స్...చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్ అగర్వాల్‌ను రూ. 8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్ కింగ్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. ► ఆంధ్ర యువ క్రికెటర్ షేక్ రషీద్‌ను రూ. 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను గుజరాత్ రూ. కోటీ 20 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు భగత్ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై... ఆంధ్ర ప్లేయర్ నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్ ఎంచుకున్నాయి. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను రూ. 4 కోట్ల 40 లక్షలకు గుజరాత్ తీసుకుంది. ఐపీఎల్ ఆడ నున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా లిటిల్ ఘనత వహిస్తాడు. -
IPL 2023: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు?
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ ఎవరు ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. శుక్రవారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కామెరున్ గ్రీన్‌ది రెండో అత్యధిక ధర. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదే వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో అతను తొలిస్థానంలో ఉన్నాడు. ఇక ఈసారి వేలంలో హాట్ ఫేవరెట్ గా ఉన్న కామెరున్ గ్రీన్ అంత ధరకు పలుకుతాడని ఎవరు ఊహించి ఉండరు. రూ. 10 నుంచి 15 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరి కామెరున్ గ్రీన్‌కు దీనిని అందుకునే అర్హత ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే గ్రీన్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు. 23 ఏళ్ల వయసు మాత్రమే కలిగిన గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 2020లో అడుగుపెట్టాడు. కామెరున్ గ్రీన్ అటు కొత్త బంతితో, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థుడు. అంతేకాదు బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. మంచి ఫీల్డర్ కూడా. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న కామెరున్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా తరపున కామెరున్ గ్రీన్ 20 టెస్టులు, 13 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. .@mipaltan win the bidding war to welcome Australian all-rounder Cameron Green!💰✅ He is SOLD for INR 17.5 Crore 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/tJWCkRgF3O — IndianPremierLeague (@IPL) December 23, 2022 చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా! -
IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలానికి ముందు అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి జియో సినిమాస్ మాక్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఆసీస్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ అత్యధికంగా 20 కోట్లకు అమ్ముడుపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రీన్ కోసం చివరి దాకా ప్రయత్నించి సొంతం చేసుకుంది. ఈ మాక్ వేలంలో రెండో అత్యధిక ధర ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్ హీరో సామ్ కర్రన్‌కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కర్రన్‌ను 19.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. అనూహ్యంగా గ్రీన్, కర్రన్ల కంటే తక్కువ ధర పలికాడు. స్టోక్స్‌ను పంజాబ్ కింగ్స్ 19 కోట్లకు కొనుగోలు చేసింది. వీరి తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కు 8.5 కోట్లు (ముంబై ఇండియన్స్), విండీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 8.5 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్) భారీ ధరలు పలికారు. కాగా, ఈ మాక్ వేలం కేవలం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసమేనని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే, రేపు జరుగబోయే వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. -
IPL 2023: సన్‌రైజర్స్‌లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..?
ఐపీఎల్-2023 సీజన్ మినీ వేలానికి (డిసెంబర్ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2022 స్టార్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, సికందర్ రాజా, కెమరూన్ గ్రీన్ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్ల్లో ఉన్న బ్యాలెన్స్ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ప్రకారం.. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్‌రైజర్స్.. స్టోక్స్‌పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకోవడంతో స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని, కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్-7.05 కోట్లు -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
T20 WC: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి
T20 World Cup 2022- Australia Updated Squad: ఆస్ట్రేలియా బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమయ్యాడు. గోల్ఫ్ ఆడుతూ గాయపడిన అతడు.. గాయం తీవ్రతరం కావడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిస్ స్థానంలో కామెరూన్ గ్రీన్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గా కామెరూన్ గ్రీన్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. టీమిండియాతో సిరీస్‌లో హిట్ ముఖ్యంగా భారత పర్యటనలో టీమిండియాతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మొదటి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గ్రీన్.. మూడో మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు 23 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇక ఇప్పుడు ఇంగ్లిస్ గాయపడటంతో స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. మరోవైపు.. ఇంగ్లిస్ దూరం కావడంతో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌పై అదనపు భారం పడనుంది. కాగా అక్టోబరు 22న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సూపర్-12లో న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2022: ఆస్ట్రేలియా జట్టు(అప్డేటెడ్): ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్,టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా. చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! T20 WC SL Vs NED: సూపర్-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్ ఇంటికి; అద్భుతం జరిగితే తప్ప He's in! #T20WorldCup — cricket.com.au (@cricketcomau) October 20, 2022 -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
ఈ ఆసీస్ యువ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టడం ఖాయం..!
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చెలరేగిన గ్రీన్ కోసం వచ్చే ఐపీఎల్ సీజన్లో ఫ్రాంచైజీలు ఎగబడతాయని జోస్యం చెప్పాడు. ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ గ్రీన్ కోసం కోట్లు కుమ్మరించడం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బంతిని బలంగా బాదడంతో పాటు భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేయడం గ్రీన్ ప్రధాన ఆయుధాలని వర్ణించాడు. బౌలింగ్ చేసేప్పుడు గ్రీన్‌కు అతని పొడవు అదనపు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపాడు. పవర్ ప్లేలో గ్రీన్ లాంటి ఆటగాడు ఉండాలని ఏ జట్టైనా కోరుకుంటుందని, తనంతట తాను తప్పుకుంటానంటే తప్ప ఏ జట్టు అతన్ని తప్పించే సాహసం చేయలేదంటూ గ్రీన్‌ను ఆకాశానితకెత్తాడు. ఇటీవలే ప్రకటించిన భారత టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. ఓ విదేశీ ఆటగాడిని ఇలా పొగడ్తలతో ముంచెత్తడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఆసీస్ యంగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు లభించిన ఆణిముత్యమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో అతను ఓటమి అంచుల్లో ఉన్న ఆసీస్‌ను అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో (89 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. 2020లో భారత్‌పైనే అరంగేట్రం చేసిన గ్రీన్.. ఇప్పటివరకు 14 టెస్ట్‌లు, 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఇందులో 6 అర్ధశతకాల సాయంతో 995 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అతను 29 వికెట్లు పడగొట్టాడు.