బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ బీజీటీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తుంది. ముందుగా గ్రీన్ ఈ సిరీస్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగింది.
అయితే తాజా అప్‌డేట్ ప్రకారం గ్రీన్ బ్యాటర్‌గానూ కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. గ్రీన్ అందుబాటులో లేకపోతే బీజీటీలో ఆసీస్ విజయావకాశాలు భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆసీస్ మీడియా కథనాల మేరకు గ్రీన్ మరో మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. గ్రీన్ వెన్ను సమస్యకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆసీస్‌లో జరిగే ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ నవంబర్ 22-26 మధ్యలో పెర్త్ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ డిసెంబర్ 6-10 మధ్యలో అడిలైడ్ వేదికగా జరుగనుంది.
మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 మధ్యలో జరుగనుండగా.. నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు జరుగనుంది. ఈ సిరీస్‌ను ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సిరీస్ ఇరు జట్లను ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment