టీమిండియాతో ఐదో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సిడ్నీ టెస్ట్‌కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లిస్ గాయపడ్డాడు. ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయలేదు.
ప్రస్తుత ఆసీస్ జట్టులో ఇంగ్లిస్ ఒక్కడే స్పేర్ బ్యాటర్‌గా ఉన్నాడు. ఆసీస్ బోర్డు బిగ్‌బాష్ లీగ్ కోసం బ్యూ వెబ్‌స్టర్‌ను ఇదివరకే రిలీజ్ చేసింది. ఇంగ్లిస్ వైదొలగడంతో ఐదో టెస్ట్ కోసం నాథన్ మెక్‌స్వీనికి పిలుపు అందవచ్చు.
మిచెల్ మార్ష్ పేలవ ఫామ్‌తో సతమతమవుతండటంతో ఐదో టెస్ట్‌లో మెక్‌స్వీనికి అవకాశం రావచ్చు. మెక్‌స్వీనికి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఇంగ్లిస్ ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్ జట్టులో సభ్యుడు కాదు. నాలుగో టెస్ట్ రేపటితో ముగియనుండగా.. ఈ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న మొదలుకానుంది.
భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ విషయానికొస్తే.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లయోన్ (13), బోలాండ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment