Josh Inglis
-
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
జోస్ ఇంగ్లీష్ అరుదైన ఘనత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ విఫలమైన చోట స్కాటిష్ బౌలర్లను ఇంగ్లిష్ ఊచకోత కోశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లిష్‌కు ఇది రెండో టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న జోష్ 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.జోష్ది బాస్..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లిష్.. తన సొంత రికార్డునే బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లిష్, మాక్స్వెల్, ఆరోన్ ఫించ్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరి ముగ్గురూ 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లిష్.. హెడ్, మాక్సీని అధిగిమించి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. స్కాట్లాండ్పై 70 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0తో కంగరూలు కైవసం చేసుకున్నారు. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్‌వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్‌తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్‌తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్‌ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్‌కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్‌గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్‌ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్‌కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక విమర్శలు -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
ఐపీఎల్-2024 మిని వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ప్రాంఛైజీలు దృష్టి సారించాయి. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొత్తం 10 ప్రాంఛైజీలు ఆ పనుల్లో బీజీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైలు ట్రేడింగ్‌లో ఆటగాళ్లను మార్చుకున్నాయి కూడా. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి జోష్ ఇంగ్లీష్.. ఐపీఎల్-2024 సీజన్ నుంచి సీఎస్కే స్టార్, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తప్పుకున్నాడు. వర్క్‌లోడ్, ఫిట్నెస్ దృష్ట్యా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2023 మెగా వేలంలో సీఎస్కే అతడిని ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా స్టోక్సీ స్ధానాన్ని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్‌తో భర్తీ చేయాలని సీఎస్కే మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న వేలంలో ఇంగ్లీష్‌ను సొంతం చేసుకోవడానికి సీఎస్కే ఇప్పటికే వ్యహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇంగ్లీష్‌కు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. అదే విధంగా అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఇంగ్లీష్‌కు ఉంది. ఈ క్రమంలోనే సీఎస్కే అతడిపై కన్నేసింది. గురువారం విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ టీ20లీగ్‌లో కూడా ఇంగ్లీష్‌కు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సీజన్లలోనూ 400కు పైగా పరుగలు చేశాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు జోష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: అతడు ప్రత్యేకం.. వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్ -
World Cup 2023: ఆసీస్ బోణీ
లక్నో: ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్ మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా స్పిన్, బ్యాటర్ల సమష్టి బాధ్యత ‘కంగారూ’ జట్టును గెలిపించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78; 12 ఫోర్లు), నిసాంక (67 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జంపా (4/47) తిప్పేయగా, పేసర్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి నెగ్గింది. మిచెల్ మార్‡ ్ష(51బంతుల్లో 52; 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (59 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మదుషంకకు 3 వికెట్లు దక్కాయి. శుభారంభానికి స్పిన్‌తో చెక్ లంక ఓపెనర్లు ఆడిన ఆట, చేసిన పరుగులు, జతకూడిన భాగస్వామ్యం చూస్తే భారీస్కోరు గ్యారంటీ అనిపించింది! దీంతో ఒకదశలో ఆసీస్‌కు మళ్లీ ఓటమి కంగారూ తప్పదేమో అనిపించింది. అంతలా నిసాంక, కుశాల్ పెరీరా ఓపెనింగ్ జోడీ 21 ఓవర్లదాకా అర్ధసెంచరీలతో పరుగుల్ని పోగేసింది. అయితే కమిన్స్ పేస్ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపించింది. దీంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడ్డాక... స్పిన్ వైపు పిచ్ మళ్లింది. ఇదే అదనుగా జంపా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8)లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ అసలంక (25) వికెట్ తీయగా ఆ తర్వాత ఎవరూ పది పరుగులైనా చేయనీకుండా జంపా స్పిన్ ఉచ్చు, స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ లంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. 157 వద్ద రెండో వికెట్ పడిన లంక అనూహ్యంగా 209 పరుగులకే కుప్పకూలింది. కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయింది. తడబడినా... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ మళ్లీ తడబడింది. వార్నర్ (11; 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (0)లను మదుషంక ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో కంగారూ శిబిరం ఆత్మరక్షణలో పడినట్లయింది. అయితే మరో ఓపెనర్ మార్‡్ష, లబుõÙన్ (60 బంతుల్లో 40; 2 ఫోర్లు) కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన మార్‡్ష అర్ధసెంచరీ పూర్తయ్యాక రనౌట్ కాగా... తర్వాత వచి్చన ఇంగ్లిస్, లబుõÙన్ గట్టెక్కించే భాగస్వామ్యం నమోదు చేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతయ్యాక లబుõÙన్ పెవిలియన్ చేరాడు. ఫిఫ్టీ అనంతరం జట్టు విజయానికి చేరువ చేసి ఇంగ్లిస్ నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టొయినిస్ (10 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 61; కుశాల్ పెరీరా (బి) కమిన్స్ 78; మెండిస్ (సి) వార్నర్ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 8; అసలంక (సి) లబుషేన్ (బి) మ్యాక్స్‌వెల్ 25; ధనంజయ (బి) స్టార్క్ 7; వెలలాగె (రనౌట్) 2; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 2; తీక్షణ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; లహిరు (బి) స్టార్క్ 4; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1–125, 2–157, 3–165, 4–166, 5–178, 6–184, 7–196, 8–199, 9–204, 10–209. బౌలింగ్: స్టార్క్ 10–0–43–2, హాజల్‌వుడ్ 7–1–36–0, కమిన్స్ 7–0–32–2, మ్యాక్స్‌వెల్ 9.3–0–36–1, జంపా 8–1–47–4, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్‡్ష (రనౌట్) 52; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 11; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 0; లబుషేన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 40; ఇంగ్లిస్ (సి) తీక్షణ (బి) వెలలాగె 58; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 31; స్టొయినిస్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (35.2 ఓవర్లలో 5 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–24, 2–24, 3–81, 4–158, 5–192. బౌలింగ్: లహిరు 4–0–47–0, మదుషంక 9–2–38–3, తీక్షణ 7–0–49–0, వెలలాగె 9.2–0–53–1, కరుణరత్నే 3–0–15–0, ధనంజయ 3–0–13–0. ఈదురు గాలులతో వర్షం, ఊడిపడిన హోర్డింగ్స్ బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. గాలి బలంగా వీయడంతో స్టేడియంలోని కొన్నిచోట్ల హోర్డింగులన్నీ ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రేక్షకుల హాజరు పలుచగా ఉండటం... ఊడిపడిన చోట జనం లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. చదవండి: SMT 2023: నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం -
ట్రవిస్ హెడ్ విధ్వంసం.. సఫాలను ఊడ్చేసిన కంగారూలు
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 0-3 తేడాతో కోల్పోయింది. డర్బన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 3) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 3-0 తేడాతో ప్రొటీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫెర్రెయిరా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (30 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరంగేట్రం ఆటగాడు డొనొవన్ ఫెర్రెయిరా (21 బంతుల్లో 48; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో ఫెర్రెయిరా.. ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; ఫోర్, 2 సిక్సర్లు)తో పాటు సిక్సర్ల వర్షం కురిపించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్ 2, తన్వీర్ సంగా ఓ వికెట్ దక్కించుకున్నాడు. హెడ్, ఇంగ్లిస్, స్టొయినిస్ల ఊచకోత.. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (22 బంతుల్లో 42; ఫోర్, 4 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. భీకర ఫామ్‌లో ఉండిన కెప్టెన్ మిచెల్ మార్ష్ (15) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తదుపరి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 7, 9, 12, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగివెళ్లనున్న జోష్ ఇంగ్లిస్ స్థానంలో ఆన్క్యాప్డ్ ఆటగాడు జిమ్మీ పీర్సన్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో తొలి టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లిస్ స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు జిమ్మీ పీర్సన్ ఆస్ట్రేలియా క్యాంప్‌లో కలవనున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీర్సన్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ క్వీన్స్లాండ్ ఆటగాడు 34.75 సగటుతో 3000 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్ వచ్చి 6 సెంచరీలు సాధించడం విశేషం. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతోతలపడనుంది. అనంతరం జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ చదవండి: IPL 2023: అతడిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు: సెహ్వాగ్ -
T20 WC: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి
T20 World Cup 2022- Australia Updated Squad: ఆస్ట్రేలియా బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమయ్యాడు. గోల్ఫ్ ఆడుతూ గాయపడిన అతడు.. గాయం తీవ్రతరం కావడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిస్ స్థానంలో కామెరూన్ గ్రీన్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గా కామెరూన్ గ్రీన్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. టీమిండియాతో సిరీస్‌లో హిట్ ముఖ్యంగా భారత పర్యటనలో టీమిండియాతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మొదటి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గ్రీన్.. మూడో మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు 23 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇక ఇప్పుడు ఇంగ్లిస్ గాయపడటంతో స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. మరోవైపు.. ఇంగ్లిస్ దూరం కావడంతో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌పై అదనపు భారం పడనుంది. కాగా అక్టోబరు 22న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సూపర్-12లో న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2022: ఆస్ట్రేలియా జట్టు(అప్డేటెడ్): ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్,టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా. చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! T20 WC SL Vs NED: సూపర్-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్ ఇంటికి; అద్భుతం జరిగితే తప్ప He's in! #T20WorldCup — cricket.com.au (@cricketcomau) October 20, 2022 -
సూపర్-12 మ్యాచ్‌లకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ
టీ20 వరల్డ్ కప్-2022 సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే అన్ని జట్లను గాయల సమస్య వేధిస్తుంది. శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్.. ఇలా దాదాపు ప్రతి జట్టులో ఎవరో ఒకరు గాయాల బారిన పడుతూ ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలోకి చేరింది. ఆ జట్టు సెకెండ్ వికెట్‌కీపర్ జోష్ ఇంగ్లిస్.. ఇవాళ ఉదయం గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. అతని గాయం తీవ్రమైంది కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇంగ్లిస్ గాయం బారిన పడటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పేర్ వికెట్‌కీపర్ లేకుండానే ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. 15 మంది సభ్యులు గల ఆసీస్ టీమ్‌లో మాథ్యూ వేడ్ రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. ఇంగ్లిస్ జట్టుకు దూరమైతే వేడ్‌పై అదనపు భారం పడుతుంది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా.. అక్టోబర్ 22న తమ సూపర్ 12 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా.. మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే గాయాల బెడద, వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమి ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మరోవైపు భారత్.. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న తలపడనున్న విషయం తెలిసిందే. -
పాకిస్తాన్‌తో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్!
పాకిస్తాన్‌తో తొలి వన్డే ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా బారిన పడడంతో పాక్‌తో సిరీస్ నుంచి ఇంగ్లిస్ తప్పుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్ నివేదికల ప్రకారం.. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలలో జోష్ ఇంగ్లిస్‌కు పాజిటివ్‌గా నిర్ధారణైంది. అతడు ఐదు రోజులు పాటు ఐషోలేషిన్లో ఉండనున్నాడు. ఐదు రోజుల తర్వాత ఇంగ్లిస్ మరోసారి పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని , నెగిటివ్‌గా తేలితే తిరిగి జట్టులో చేరనున్నాడని నివేదిక పేర్కొంది. ఇక మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, బెన్ మెక్‌డెర్మోట్, మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా చదవండి: IPL 2022: 145 కి.మీ.ల స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్!