![Josh Inglis tests positive for COVID 19 ahead of first ODI - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/29/Untitled-1.jpg.webp?itok=_W9YmhlR)
పాకిస్తాన్‌తో తొలి వన్డే ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా బారిన పడడంతో పాక్‌తో సిరీస్ నుంచి ఇంగ్లిస్ తప్పుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్ నివేదికల ప్రకారం.. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలలో జోష్ ఇంగ్లిస్‌కు పాజిటివ్‌గా నిర్ధారణైంది.
అతడు ఐదు రోజులు పాటు ఐషోలేషిన్‌లో ఉండనున్నాడు. ఐదు రోజుల తర్వాత ఇంగ్లిస్ మరోసారి పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని , నెగిటివ్‌గా తేలితే తిరిగి జట్టులో చేరనున్నాడని నివేదిక పేర్కొంది. ఇక మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.
ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, బెన్ మెక్‌డెర్మోట్, మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా
చదవండి: IPL 2022: 145 కి.మీ.ల స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment