Mitchell Marsh
-
భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టు ఫార్మాట్లో పరుగులు రాబట్టలేక ఈ మాజీ కెప్టెన్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. గత పదమూడు ఇన్నింగ్స్‌లో కలిపి స్మిత్ చేసిన పరుగులు కేవలం 232. ఇందులో ఒకే ఒక్క అర్ధ శతకం ఉంది.స్మిత్‌కు చేదు అనుభవంఇక టీమిండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ స్టీవ్ స్మిత్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 0, 17, 2. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 2015 తర్వాత అతడు కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోవడం ఇదే తొలిసారి.వేటు వేసేందుకు రెడీఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో మూడో టెస్టులో స్మిత్‌పై వేటు వేసేందుకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అతడికి కొన్నాళ్లపాటు విశ్రాంతి పేరిట తప్పించనున్నట్లు సమాచారం. అయితే, ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం.. స్మిత్ త్వరలోనే మునుపటి లయను అందుకుని.. పరుగుల వరద పారిస్తాడని ధీమా వ్యక్తం చేయడం విశేషం.1-1తో సమంగాకాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో తమకు చివరిదైన ఈ సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే.. భారత్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో 295 పరుగులు తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం పది వికెట్ల తేడాతో ఓడింది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో డిసెంబరు 14- 18 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అప్పుడు భీకర ఫామ్‌లో..2014-2017 మధ్య స్టీవ్ స్మిత్ ఏడాదికి కనీసం ఐదు నుంచి ఆరు శతకాలు బాదాడు. అదే స్థాయిలో హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. గతేడాది సైతం సగటున 42.22తో పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో మూడు శతకాలు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మాత్రం ఒక్కసారి కూడా అతడు బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ సగటు 23.20. 2010 తర్వాత ఇదే స్మిత్ లోయెస్ట్ యావరేజ్.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మరో ఆల్‌రౌండర్‌కు పిలుపు
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగే రెండో టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (నవంబర్ 28) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు పిలుపు వచ్చింది. ఇప్పటికే జట్టులో ఉన్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్నెస్ సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా వెబ్‌స్టర్‌ను ఎంపిక చేశారు. తొలి టెస్ట్ అనంతరం మార్ష్‌కు స్వల్ప గాయమైనట్లు తెలుస్తుంది.రెండో టెస్ట్‌లో మార్ష్ తుది జట్టులో చోటు దక్కించుకున్నా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఇదే జరిగితే ఆ జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్లపై భారం పడుతుంది.కాగా, వెబ్‌స్టర్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెబ్‌స్టర్‌కు గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు. గతేడాది అతను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో 900కు పైగా పరుగులు చేసి 30 వికెట్లు తీశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత వెబ్‌స్టర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ప్రస్తుత ఫస్ట్‌క్లాస్ సీజన్లో వెబ్‌స్టర్ ఇప్పటికే 448 పరుగులు చేసి, 16 వికెట్లు తీశాడు. బీజీటీకి ముందు ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో వెబ్‌స్టర్ ఆల్‌రౌండ్ షోతో (61 నాటౌట్, 46 నాటౌట్; 3/19, 3/49) అదరగొట్టాడు.టీమిండియాతో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్‌కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్ , బ్యూ వెబ్‌స్టర్ -
IND Vs AUS: నితీశ్ రెడ్డి ధనాధన్.. బౌలింగ్‌లోనూ అదుర్స్! బ్యాటర్ ఫ్యూజులు ఔట్
టీమిండియా యువ క్రికెటర్, విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి.. సత్తా చాటాడు. కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన నితీశ్.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 21 ఏళ్ల నితీశ్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఈ ఏడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మూడు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, అనూహ్య రీతిలో నితీశ్ రెడ్డిని సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం నితీశ్‌కు ఉన్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలే! హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకే పరిమితం కావడంతో టెస్టుల్లో అతడి వారసుడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ కూడా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండరే అయినా.. ఆసీస్ టూర్‌కు మాత్రం బీసీసీఐ నితీశ్‌నే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ శార్దూల్‌ను పక్కనపెట్టి.. ఈ యువ ఆటగాడికి పెద్దపీట వేసింది.అంతేకాదు... మెగా సిరీస్‌కు నితీశ్‌ను సన్నద్ధం చేసే క్రమంలో.. భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు ముందే అతడిని ఆస్ట్రేలియాకు పంపించింది. అయితే, ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు.ఆసీస్‌తో అనధికారిక సిరీస్‌లో 71 (0, 17, 16, 38) పరుగులు మాత్రమే చేయడంతో పాటు.. ఒకే ఒక్క వికెట్ తీశాడు నితీశ్. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అతడిని ఆడిస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ.. మేనేజ్మెంట్ మాత్రం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచింది.ఈ క్రమంలో పెర్త్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి.. టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 59 బంతుల్లో 41 పరుగులతో భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా నితీశ్ రెడ్డి టెస్టుల్లో వికెట్ల ఖాతా కూడా తెరిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకారిగా పరిణమించిన మిచెల్ మార్ష్(47)ను నితీశ్ తన బౌలింగ్ నైపుణ్యంతో బోల్తా కొట్టించాడు.అతడి బౌలింగ్‌లో మార్ష్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా.. బంతి తాకి స్టంప్స్ ఎగిరిపడ్డాయి. దీంతో మార్ష్ షాకింగ్ రియాక్షన్‌తో క్రీజును వీడాడు. ఈ క్రమంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా తొలి టెస్టులో టీమిండియా ఆసీస్‌కు 534 పరుగుల భారీ లక్ష్యం విధించింది. అయితే, ఆసీస్ 182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.EDGE & GONE!Nitish Kumar Reddy gets the big fish #MitchellMarsh!#AUSvINDOnStar 👉 1st Test, Day 4, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/n4mKpojPhp— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా మరో ముందడుగు వేసింది. నమీబియాతో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని సూపర్-8 దశకు అర్హత సాధించింది. ప్రత్యర్థిని 72 పరుగులకే పరిమితం చేసి.. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై జయభేరి మోగించి భారీ రన్‌రేటుతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నమీబియాపై భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో కీలక సభ్యుడైన ఆడం జంపా ఈ మ్యాచ్‌లో ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసించాడు.అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం‘‘ఈరోజు మా బౌలింగ్ విభాగం అత్యద్భుతంగా రాణించింది. సమిష్టి కృషితో దక్కిన విజయం ఇది. సూపర్-8కు అర్హత సాధించడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో వరుస గెలుపులు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఇక జంపా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.గత నాలుగైదేళ్లుగా మా జట్టులో అతడు అత్యంత ముఖ్యమైన సభ్యుడిగా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడం తన ప్రత్యేకత. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆడం జంపాను కొనియాడాడు.విండీస్‌లో బీచ్‌లు సూపర్ఇక వెస్టిండీస్ ఆతిథ్యం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. చాలా బీచ్‌లు ఇక్కడున్నాయి. ఒక్కోసారి మాకు పెర్త్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాతో కలిసి విండీస్ ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్-డి: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా👉వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా👉టాస్: ఆస్ట్రేలియా.. తొలుత బౌలింగ్👉నమీబియా స్కోరు: 72 (17)👉టాప్ స్కోరర్: గెర్హార్డ్ ఎరాస్మస్(43 బంతుల్లో 36 పరుగులు)👉ఆస్ట్రేలియా స్కోరు: 74/1 (5.4)👉టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 రన్స్, నాటౌట్)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సూపర్-8కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడం జంపా(4/12).చదవండి: T20 WC 2024: గెలిచి నిలిచిన పాక్ View this post on Instagram A post shared by ICC (@icc) -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నైబ్‌ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్‌ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7 వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపనడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ గాయం కారణంగా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు. అయితే మార్ష్‌కు ఎటువంటి గాయమైందో, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని దాదా వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది సీజన్లో మార్ష్ ఇప్పటివరకు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 71 పరుగులు చేసిన మార్ష్.. అటు బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక అతడి స్ధానంలో మరో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఐపీఎల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కుల్దీప్ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 32 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా రచిన్‌కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
విండీస్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ ‘సంచలన’ బౌలర్ రీఎంట్రీ
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది. నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది. ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం. ఆస్ట్రేలియా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. వెస్టిండీస్ టీ20 జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 24) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌కు కమిన్స్‌తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్,స్టీవ్ స్మిత్ కూడా దూరంగా ఉండనున్నారు. సెలెక్టర్లు స్టార్క్, స్మిత్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ జట్టులో చోటు పదిలం చేసుకోగా.. ఇటీవలే ఆసుపత్రిపాలైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ నాథన్ ఇల్లిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ 2023-24లో భీకర ఫామ్‌లో ఉండిన మ్యాట్ షార్ట్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, విండీస్‌తో టీ20 సిరీస్ ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో హోబర్ట్, అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్.. విండీస్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. టెస్ట్ సిరీస్ అనంతరం ఆసీస్-విండీస్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. వన్డే సిరీస్ మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా వేదికలుగా ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో జరుగనుంది. వన్డే సిరీస్ కోసం ఆసీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌కు కూడా కమిన్స్ దూరంగా ఉండనుండగా.. అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ వన్డే జట్లును ముందుండి నడిపించనున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు.. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా విండీస్‌తో సిరీస్‌కు ఆసీస్ వన్డే జట్టు.. స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా -
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్లో ఉన్నాడు. అయితే టాప్ టైర్లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది. -
పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడిపై కేసు నమోదు
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీఘర్కు చెందిన ఆర్టిఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. మార్ష్ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం కలిగించిందని ఆరోపించాడు. కేశవ్ తన ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పంపించాడు. మార్ష్ భారత్‌లో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని అతను డిమాండ్ చేశాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 19) జరిగిన వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరో సారి జగజ్జేతగా నిలిచింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామన్న గర్వంతో మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. మార్ష్‌పై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశాడు. ఏమా ఖండకావరం అంటూ ధ్వజమెత్తారు. భారత అభిమానులయితే మార్ష్ ఓ రేంజ్లో ఏకి పారేశారు. -
CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. !
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో 140 కోట్ల భారతీయుల గుండెలను ముక్కలు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తక్కువ స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. ఆరంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna — Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023 అయితే హెడ్.. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ సంబురాలు మినహా నరేంద్ర మోదీ స్టేడియంలో నిశబ్దం ఆవహించింది. ఆసీస్ ఆటగాళ్లు తమ జీవితాల్లో అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. హెడ్, లబూషేన్, మ్యాక్స్‌వెల్, కమిన్స్ ఇలా.. ప్రతి ఒక్క ఆసీస్ ఆటగాడు విజయ గర్వంతో ఊగిపోయారు. అయితే ఒక్క ఆసీస్ ఆటగాడి విజయదరహాసం మాత్రం శృతి మించింది. 2015 ఎడిషన్ ఫైనల్లోనూ ఆసీస్ గెలుపులో భాగమైన మిచెల్ మార్ష్ భారత్‌పై విజయానంతరం వరల్డ్‌కప్ ట్రోఫీని అగౌరవపరిచాడు. జగజ్జేతగా నిలిచామన్న గర్వంతో అతను మితిమీరి ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం బీర్ తాగుతూ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు మార్ష్ అనుచిత ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మతి తప్పినదా ఏంటి అంటూ తూర్పారబెడుతున్నారు. ప్రతి క్రికెటర్ ఎంతో అపురూపంగా భావించే వరల్డ్‌కప్ ట్రోఫీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఎంత గెలిస్తే మాత్రం ఇంత అహం పనికిరాదంటూ గడ్డి పెడుతున్నారు. -
మిచెల్ మార్ష్ వీరవిహారం
పుణే: ఐదు సార్లు విజేత ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో లీగ్ దశను ఘనంగా ముగించింది. ఆరంభంలో తడబడి రెండు మ్యాచ్‌లు ఓడినా...ఆ తర్వాత ప్రతీ మ్యాచ్‌కు తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైన తర్వాతా అదే దూకుడును కనబర్చి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హ్రిదయ్ (79 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజు్మల్ హొస్సేన్ (57 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించగా...తన్జిద్ (36), లిటన్ దాస్ (36), మహ్ముదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 22.3 ఓవర్లలోనే అభేద్యంగా 175 పరుగులు జోడించారు. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జిద్ (సి) అండ్ (బి) అబాట్ 36; లిటన్ (సి) లబుషేన్ (బి) జంపా 36; నజు్మల్ రనౌట్ 45; తౌహిద్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 74; మహ్ముదుల్లా రనౌట్ 32; ముషి్ఫకర్ (సి) కమిన్స్ (బి) జంపా 21; మెహిదీ హసన్ మిరాజ్ (సి) కమిన్స్ (బి) అబాట్ 29; నజుమ్ రనౌట్ 7; మెహదీ హసన్ నాటౌట్ 2; తస్కిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–76, 2–106, 3–170, 4–214, 5–251, 6–286, 7–303, 8–304. బౌలింగ్: హాజల్‌వుడ్ 7–1–21–0, కమిన్స్ 8–0–56–0, అబాట్ 10–0–61–2, మార్ష్ 4–0–48–0, జంపా 10–0–32–2, హెడ్ 6–0–33–0, స్టొయినిస్ 5–0–45–1. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) తస్కిన్ 10; వార్నర్ (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 53; మార్ష్ నాటౌట్ 177; స్మిత్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (44.4 ఓవర్లలో 2 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–12, 2–132. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 10–0–61–1, మెహిదీ హసన్ 9–0–38–0, నజుమ్ అహ్మద్ 10–0–85–0, మెహిదీహసన్ మిరాజ్ 6–0–47–0, ముస్తఫిజుర్ 9.4–1–76–1. -
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా నవంబర్ 7న వాంఖడే వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్ అందింది. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నాడు. తన తాత మరణంతో పెర్త్‌కు వెళ్లిన మార్ష్.. ఆదివారం(నవంబర్ 5) జట్టుతో కలవనున్నాడు. కాగా మిచిల్ మార్ష్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే తన పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ 121 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 225 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో దూసుకుపోతున్న ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్ కోసం మార్ష్ తిరిగి భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్ మీడియా వర్గాల సమాచారం. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ క్రికెట్ వర్గాలు ఖంగుతిన్నాయి. అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్ ఇన్ ఫామ్ ప్లేయర్ సేవలు కోల్పోవడాన్ని జీర్జించుకోలేకపోతుంది. మరోవైపు ఆసీస్ మరో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలను సైతం కోల్పోనుంది. తలకు తీవ్ర గాయం కావడం చేత మ్యాక్సీ నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంకానున్నాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి కింద పడిపోవడంతో మ్యాక్సీ తలకు తీవ్ర గాయమైంది. రోజుల వ్యవధిలో ఆసీస్ ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మార్ష్, మ్యాక్సీ ఇద్దరు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు చెరో మ్యాచ్‌లో సెంచరీ (మార్ష్ పాక్‌పై, మ్యాక్సీ నెదర్లాండ్స్‌పై) చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సౌతాఫ్రికా టేబుల్ టాపర్ కాగా.. భారత్ రెండో స్థానంలో.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. -
WC 2023: మీ నాన్న నేర్పించలేదా?: ఆసీస్ క్రికెటర్‌ను ప్రశ్నించిన గావస్కర్
ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్ 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్ మాక్స్వెల్(31- నాటౌట్), మార్కస్ స్టొయినిస్(20-నాటౌట్) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీ నాన్న నీకు నేర్పించలేదా? అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్‌ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్ష్‌ను టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశాడు. ‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్.. ‘‘మా నాన్న పూర్ స్ట్రైక్‌రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు. జెఫ్ మార్ష్ తనయుడే మిచెల్ కాగా మిచెల్ మార్ష్ మరెవరో కాదు.. ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు. గావస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రైక్‌రేటుతో 4357 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్‌రేటుతో 2290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తండ్రి అలా.. కొడుకు ఇలా ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్‌రేటును ఉద్దేశించి గావస్కర్ సరదాగా కామెంట్ చేయగా.. మార్ష్ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ఓ యోధుడని.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్! Sunil Gavaskar- "Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?" Mitch Marsh- "I am making up for his poor strike rate." pic.twitter.com/P4GuLGFCa6 — Rohit Yadav (@cricrohit) October 16, 2023 -
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే మొదటిసారి.. బుమ్రా అరుదైన రికార్డు
వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన కంగారూ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మూడో ఓవర్ రెండో బంతికి బుమ్రా.. మిచెల్ మార్ష్‌ను అవుట్ చేశాడు. ఆఫ్‌సైడ్ దిశగా బుమ్రా విసిరిన షార్ట్‌లెంత్ బాల్ మార్ష్ బ్యాట్‌ను ముద్దాడి ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి చేతుల్లో పడింది. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కడంతో పాటు.. బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. కాగా 1983 నుంచి ఇప్పటి వరకు.. 2007 వన్డే ప్రపంచకప్ మినహాయించి పటిష్ట టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు ఈ ఐసీసీ టోర్నీల్లో కనీసం ఒక్కసారైన ముఖాముఖి పోటీపడ్డాయి. అయితే, ఏ భారత బౌలర్ కూడా ఈ మెగా ఈవెంట్లో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌తో బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మార్ష్ చేత సున్నా చుట్టించి ఈ ఘనత సాధించిన టీమిండియా తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కాగా కంగారూలతో మ్యాచ్‌లో బుమ్రా రెండు, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా మూడు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీయగా.. ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కాయి. దీంతో 199 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడిన భారత్ విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో 41.2 ఓవర్లలో టార్గెట్ ఛేదించి ఆరు వికెట్ల తేడతో గెలుపొందింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023లో బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తగా ఐదు డకౌట్లు నమోదు కావడం గమనార్హం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్, అలెక్స్ క్యారీ.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి డ్రాప్ క్యాచ్‌పై స్పందించిన కమిన్స్.. మరో 50 పరుగులు చేసుంటే..!
చెన్నై వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్లిష్టమైన దశ నుంచి అద్భుతంగా పురోగమనం సాధించి, ఆసీస్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గట్టెక్కించారు. ఫలితంగా భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) కోహ్లి క్యాచ్‌ను జారవిడిచిన మార్ష్.. ఓ దశలో భారత్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద ఉండగా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ కోహ్లి క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్ అనంతరం వెనుదిరిగి చూసుకోని కోహ్లి భారత్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఓ రకంగా చెప్పాలంటే కోహ్లి డ్రాప్ క్యాచే ఆసీస్ కొంపముంచింది. అయితే ఈ విషయాన్ని కమిన్స్ అంగీకరించలేదు. కోహ్లి క్యాచ్ డ్రాప్.. అప్పుడే మర్చిపోయా..! మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. మార్ష్ కోహ్లి క్యాచ్ డ్రాప్ చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. క్రికెట్లో ఇది సర్వసాధారణం. అయితే స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఏ జట్టుకైనా 10/4 స్కోర్ డ్రీమ్ స్టార్ట్ అని చెప్పాలి. మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. అయినా మా ఓటమికి ఇది కారణం కాదు. మేము అదనంగా మరో 50 పరుగులు చేసి ఉండాల్సింది. ఇలాంటి టఫ్ పిచ్‌పై 200 స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. క్రెడిట్ భారత స్పిన్నర్లకే. వారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఓడిపోయినందుకు బాధ లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. రోహిత్ గెలిచి ఉన్నా ఇదే పని చేసేవాడు అని అన్నాడు. -
WC 2023: మినీ హార్ట్ ఎటాక్! భయపెట్టావు కదా కోహ్లి! మూల్యం చెల్లించకతప్పదు..
ICC Cricket World Cup 2023- India vs Australia- Virat Kohli: ఓపెనర్లు డకౌట్.. అందులోనూ ఓ గోల్డెన్ డక్.. నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటర్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు! సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా దుస్థితి ఇది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్.. బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థిని 199 పరుగులకే కట్టడి చేయగలిగింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఈజీగా ఊదేస్తుందంటూ అభిమానులు పండుగ చేసుకున్నారు. ముగ్గురు డకౌట్ కానీ ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. స్టార్క్ ఇషాన్‌ను పెవిలియన్‌కు పంపితే.. రోహిత్‌ను హాజిల్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను సైతం పెవిలియన్ పంపాడు. కోహ్లి, రాహుల్‌పై భారం 2 పరుగులకే.. 3 వికెట్లు.. అసలు ఆడుతోంది టీమిండియానే అన్న అనుమానం.. ఇలాగైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పైనే భారమంతా! అద్భుత షాట్‌తో ఇలాంటి సమయంలో.. కోహ్లి కొన్ని అద్భుత షాట్లతో అలరించాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గ్లోరియస్ ఫోర్‌తో దుమ్ములేపాడు. తర్వాత మళ్లీ పదకొండో ఓవర్ వరకు టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. View this post on Instagram A post shared by ICC (@icc) మినీ హార్ట్ ఎటాక్ ఇదిలా ఉంటే.. డేంజరస్ బ్యాటర్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ మిస్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇండియా ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన హాజిల్‌వుడ్ కోహ్లికి షార్ట్‌బాల్‌ను సంధించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మూల్యం చెల్లించకతప్పదు మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ సహా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. మార్ష్ బాల్‌ను క్యాచ్ చేసినట్లే చేసి.. పట్టుతప్పి బంతిని జారవిడిచాడు. దీంతో టీమిండియా శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘‘ఈ క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్‌ను కూడా ఆసీస్ డ్రాప్ చేసుకుంది. ఏదేమైనా మినీ హార్ట్‌టాక్ అనుకోండి. కింగ్ భయపెట్టేశావు పో! ఈ తప్పిదంతో ఆసీస్ భారీ మూల్యం చెల్లించకతప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WC 2023: ఆనందం కాసేపే! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్.. నీకెందుకు? View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన అతడు.. నాలుగో బంతికే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్ లెంత్ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ చేతిలో పడింది. ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా.. బాల్‌ను గిల్ ఒడిసిపట్టగానే.. భారత శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఆనందం కాసేపే.. ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఆదిలోనే వికెట్ దక్కినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 37, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 98 పరుగులు స్కోరు చేసింది. కానీ.. మరుసటి రెండో బంతికే రవీంద్ర జడేజా వార్నర్(52)ను పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ ఎందుకు వెళ్లిపోయాడు? ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్ షమీ మైదానం వీడాడు. మొహాలీలో ఎండ తీవ్రతకు తట్టుకోలేకే అతడు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్ Early success for #TeamIndia! A wicket for @MdShami11 as Shubman Gill takes the catch. Australia lose Mitchell Marsh. Live - https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/cNcwJeQiXN — BCCI (@BCCI) September 22, 2023 -
జన్సెన్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్‌రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే!
Injured Pat Cummins Eyeing Hopeful Return: గాయంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత పర్యటనకు సిద్ధంగా ఉంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో అతని ఎడమచేతి మణికట్టుకు ఫ్రాక్చరైంది. దీంతో 6 వారాల పాటు విశ్రాంతికే పరిమితమై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో సిరీస్ నాటికి తిరిగి వచ్చేస్తా అయితే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్‌తో సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో పునరాగమనం చేస్తానని ఆసీస్ సీమర్ చెప్పాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘గాయం మరీ అంత తీవ్రంగా ఏమీలేదు. మరికొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్‌ల నాటికి అందుబాటులో ఉంటాననే నమ్మకం ఉంది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! వన్డేల్లో కెప్టెన్సీ కాస్త వేరుగా ఉంటుంది. మెగా టోర్నీ ముగిసిన తర్వాత 50 ఓవర్ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగే అంశంపై ఆలోచిస్తా. మిచెల్ మార్ష్ రూపంలో మాకు మంచి ఆప్షన్ ఉంది. టీ20లలో అతడు అదరగొడుతున్నాడు. మైదానం లోపలే కాదు.. వెలుపలా మార్ష్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా గొప్ప వ్యక్తిత్వం కలవాడు. తనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్లను కూడా ఉత్తేజితం చేస్తాడు. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూసుకుంటాడు’’ అని భవిష్యత్తు కెప్టెన్ ఎవరన్న అంశంపై హింట్ ఇచ్చేశాడు. కాగా ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టాడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు టీమిండియా ఆసీస్‌తో సెప్టెంబరు 22 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: బజ్‌బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ క్రిస్ వోక్స్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని వోక్స్ వైడ్ లైన్ స్టంప్ మీదుగా వేశాడు. మార్ష్ పొజిషన్ మార్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్స్ కార్డన్ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్లో వెళ్లడంతో క్యాచ్ కష్టతరమనిపించింది. కానీ కీపర్ బెయిర్ స్టో డైవ్ చేస్తూ తన గ్లోవ్స్‌ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్‌గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్ తిన్న మార్ష్ నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్ స్టో క్యాచ్‌పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్‌గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. STOP THAT JONNY BAIRSTOW! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/aZ7wKcncRW — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: ICC ODI WC 2023: 'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
యాషెస్ సిరీస్ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!
యాషెస్ సిరీస్-2023లో భాగంగా లీడ్స్ వేదికగా నిన్న (జులై 6) మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్ష్ సూపర్ సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్ వచ్చీ రాగానే సెంచరీతో విరుచుకుపడి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 118 బంతులను ఎదుర్కొన్న మార్ష్.. 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్ మినహా మిగతావారెవ్వరూ కనీస పరుగులు కూడా చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్ (39), స్టీవ్ స్మిత్ (22), లబూషేన్ (21), ఉస్మాన్ ఖ్వాజా (13), టాడ్ మర్ఫీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిల్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మార్క్ వుడ్ (5/34) నిలువునా కూల్చాడు. మార్క్ వుడ్ సైతం దాదాపు ఏడాది తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (3/73), స్టువర్ట్ బ్రాడ్ (2/58) సహకరించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను పాట్ కమిన్స్ (2/28), మార్ష్ (1/9) దెబ్బకొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. రూట్ (19), బెయిర్‌స్టో (1) క్రీజ్‌లో ఉన్నారు. యాషెస్ సిరీస్ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..! దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్‌కు యాషెస్ సిరీస్ అంటే పూనకం వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. యాషెస్‌లో అతను ఆడిన చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 3 సెంచరీలు (118, 24, 17, 101, 29*, 9, 181) చేశాడు. 33 టెస్ట్‌ల కెరీర్లో తాను సాధించిన 3 శతకాలు యాషెస్‌లో సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన మార్ష్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలి రోజు తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమై జాక్ క్రాలే (33) వికెట్ పడగొట్టాడు. -
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్.. మార్ష్ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది. మార్ష్‌కు.. ట్రెవిస్ హెడ్ (39 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్ మార్ష్ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్ గ్రీన్ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్ ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. Mitchell Marsh playing brutally against England 100 completed #Ashes#MitchellMarsh#Ashes2023 pic.twitter.com/UDAE7xadUY — Ansh Gaba (@cricketansh12) July 6, 2023 #MitchellMarsh #Bisonball🦬 pic.twitter.com/xNKEXpHqJa — Mr.Mirja (@Mr_Mirja01) July 6, 2023 What an outstanding 100, great counter -attack from Mitchell Marsh. #Ashes pic.twitter.com/8gcITRxdxV — Virender Sehwag (@virendersehwag) July 6, 2023 Sensational, Mitchell Marsh ✨#ENGvAUS | #Ashes pic.twitter.com/F4ATR2Gknr — ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు -
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్ మార్ష్, మ్యాట్ రెన్షా మాత్రం తాజాగా టీమ్‌లో చోటు కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ జట్టులో కొనసాగనున్నారు. వారిద్దరు అవుట్.. వార్నర్‌కు కోచ్ మద్దతు మార్ష్, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు, యాషెస్ సిరీస్‌లోనూ వార్నర్ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్‌డొనాల్డ్ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Get your friends, form a circle and replicate this fun drill! 😉😀😀🏏#TeamIndia pic.twitter.com/X6iOuXPrhY — BCCI (@BCCI) May 26, 2023 -
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే ప్రభావం చూపాల్సింది పోయి తన జట్టు ఆటగాడికే ఎసరు పెట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ను అనవసరంగా రనౌట్ అయ్యేలా చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ తొలి బంతిని మనీష్ పాండే కవర్స్ దిశగా ఆడాడు. మనీష్ ముందుకు కదలడంతో సింగిల్‌కు పిలిచాడనుకొని మార్ష్ పరిగెత్తాడు. మనీష్ పరిగెత్తినట్లే చేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే మార్ష్ సగం క్రీజు దాటాడు. బంతిని అందుకున్న రహానే తెలివిగా వ్యవహరించాడు. త్రో వేయకుండా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. మార్ష్ స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నప్పటికి మనీష్ పాండే తన వికెట్‌ను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రహానే వికెట్లను ఎగురగొట్టడంతో పాపం మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ తప్పంతా మనీష్ పాండేదే అని క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చిన మార్ష్.. మనీష్ పాండేను ముందుకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. అయితే మార్ష్ ఔట్‌కు తానే కారణమని తెగ బాధపడిపోయిన మనీష్ పాండే తన చేత్తో హెల్మెట్‌ను బలంగా కొట్టుకోవడం కొసమెరుపు. ఇక మార్ష్‌ను ఔట్ చేసి తాను ఏమైనా ఆడాడా అంటే అదీ లేదు. పైగా 29 బాల్స్ ఎదుర్కొని 27 పరుగులు చేసి పతీరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే పనితనం ఎలా ఉందంటే.. తాను ఆడకపోగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా ఔట్ చేసి విలన్‌గా తయరయ్యాడు. దీంతో మనీష్ పాండేపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా రనౌట్ చేశావు.. ఆడేవాడిని ఔట్ చేశావు.. నువ్వు ఆడకపోయావో అంతే సంగతి.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి! It’s so hilarious to see the way Manish Pandey bodied Marsh after calling him halfway through! 🤣🤣 pic.twitter.com/TIxVPOAlvj — Akif (@KM_Akif) May 10, 2023 Impact of Manish Pandey 🔥 pic.twitter.com/tNhUZtCF3i — Indian Memes (@Theindianmeme) May 10, 2023 చదవండి: రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు -
సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు!
IPL 2023 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అవుటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. మార్ష్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందని.. తొందరపడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెలరేగిన మార్ష్ ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ ఆల్‌రౌండర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ విధించినన 198 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే ఢిల్లీ తమ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయిన వేళ ఫిలిప్ సాల్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 6 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. ఓవైపు సాల్ట్(35 బంతుల్లో 59 పరుగులు).. మరోవైపు మార్ష్ జోరు చూస్తే ఢిల్లీ టార్గెట్‌ను సులువుగానే ఛేదించేట్లు కనబడింది. ఆట కట్టించిన అకీల్ అయితే, సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే సాల్ట్‌ను అద్భుత రీతిలో పెవిలియన్‌కు పంపగా.. కాసేపటికే అకీల్ హొసేన్ మార్ష్ ఆట కట్టించాడు. 14 ఓవర్ మొదటి బంతికి మార్ష్ సిక్సర్ బాదగా.. మరుసటి బంతికే హొసేన్ బదులు తీర్చుకున్నాడు. ఈ విండీస్ బౌలర్ తన స్పిన్ మాయాజాలంతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. హొసేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మార్ష్ బంతిని గాల్లోకి లేపగా.. రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ క్యాచ్ అందుకోవడంతో మార్ష్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. షాట్ ఎంపికలో కాస్త తెలివి ప్రదర్శించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కొంచెం కూడా తెలివి లేదు ‘‘మిచెల్ మార్ష్ మొదటి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి అద్భుతం చేశాడు. రెండో బంతికి కూడా అదే పునరావృతం చేద్దామని భావించాడు. టీ20 ఫార్మాట్లో దూకుడు అవసరమేనన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఇలాంటి షాట్ ఎంపిక చేసుకోవడం తెలివిగల బ్యాటర్ పనైతే కాదు. మిచెల్ ఇంకాస్త క్లెవర్‌గా ఆలోచించి ఉండాల్సింది. అప్పటికే బౌలర్ మీద ఒత్తిడి పెంచగలిగాడు. అలాంటి సమయంలో తదుపరి బంతిపై ఓ అంచనాకు రాగలడు కదా! బంతి కాస్త స్లోగా వచ్చినట్లు అనిపించింది.. కానీ మార్ష్ లెక్క తప్పింది. తొలి బంతిని సిక్సర్ బాదిన అతడు.. మరుసటి బంతికి బౌలర్ విసిరిన సవాలును స్వీకరించకుండా ఉండాల్సింది’’ అని మైకేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కాగా సాల్ట్, మార్ష్ అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ సాగినా 9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. జట్టు ఓడినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..! IPL 2023: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్ అభిమానులు Turning point of the match? Akeal Hosein gets Mitchell Marsh out for 63!#DC require 60 off the final five overs 👊🏻 Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/LCIOKm5O6p — IndianPremierLeague (@IPL) April 29, 2023 -
ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా: మార్కరమ్
IPL 2023- SRH Won by 9 Runs On Delhi Capitals: ‘‘జట్టు సమష్టి ప్రదర్శన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. మా ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలకు తోడు గెలవాలన్న వారి పట్టుదలే ఇక్కడిదాకా తీసుకువచ్చింది. మనం సరైన వ్యూహాలు రచించినపుడు కూడా ఒక్కోసారి ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇలాంటి ఫలితాలు దక్కుతాయి. సరైన సమయంలో రాణించి మా జట్టు విజయం అందుకుంది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రైజర్స్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు శనివారం హోరాహొరీగా సాగిన పోరులో ఎట్టకేలకు మార్కరమ్ బృందం 9 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీని ఓడించి ఉప్పల్‌లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదరగొట్టిన అభిషేక్, క్లాసీ క్లాసెన్ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగులు) మినహా టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ.. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దంచికొట్టిన సాల్ట్, మిచెల్ ఆఖర్లో అబ్దుల్ సమద్(28 పరుగులు), అకీల్ హొసేన్ (16 పరుగులు నాటౌట్) తమ వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే షాకిచ్చినప్పటికీ.. ఫిలిప్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29 పరుగులు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో వార్నర్ బృందానికి రైజర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. ఢిల్లీపై గెలుపుతో సన్‌రైజర్స్ ఈ సీజన్లో మూడో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. వాళ్లిద్దరు అద్భుతం.. మా బౌలర్లు కూడా ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ ఆరంభం నుంచి అదరగొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న క్లాసీ(క్లాసెన్) అతడికి తోడయ్యాడు. ఆత్మవిశ్వాసంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మాకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు పట్టుదలగా నిలబడ్డారు. ప్రత్యర్థి ఆట కట్టించారు. ఈ విజయం మాలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక సొంతగడ్డపై కూడా విజయపరంపర ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా మే 4న సన్‌రైజర్స్ ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్‌రౌండర్ లేడు.. ఓడినా పర్లేదు..! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్‌రౌండర్ లేడు.. ఓడినా పర్లేదు..!
Mitchell Marsh: ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 29 రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఆసీస్ స్పీడ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలుత బంతి (4-1-27-4)తో, ఆతర్వాత బ్యాట్ (39 బంతుల్లో 63; ఫోర్, 6 సిక్సర్లు)తో వీరవిహారం చేసినప్పటికీ.. అతని జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ ఓడినప్పటికీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు మార్ష్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్రాంచైజీలకతీతంగా మార్ష్ ప్రదర్శనపై మనసు పారేసుకున్న అభిమానులు అతన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. మార్ష్ నామస్మరణతో ట్విటర్ మార్మోగిపోతుంది. ఆల్‌రౌండర్ అంటే ఇలా ఉండాలి (ఆడాలి).. ఇలాంటి వాడు జట్టుకు ఒక్కడుంటే చాలు.. ఓడినా ఢిల్లీనే గెలిచింది అంటూ కామెంట్లు చేస్తూ మార్ష్‌ను ఆకాశానికెత్తుతున్నారు. క్రికెట్ ప్రపంచం చాలామంది ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను చూసింది, కానీ ఇలాంటి నిఖార్సైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చూడటం ఇదే మొదటిసారని కొనియాడుతున్నారు. నిప్పులు చెరిగే వేగం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం, పేస్‌లో వేరియేషన్స్.. ఇలా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌కు ఇండాల్సిన లక్షణాలన్నీ మార్ష్ బౌలింగ్‌లో చూశామని, అలాగే పర్ఫెక్ట్ టీ20 బ్యాటర్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనని (పవర్ హిట్టింగ్, ఐ కాంటాక్ట్, చెత్త బంతులను అంచనా వేయడం) మార్ష్ నిన్నటి ఇన్నింగ్స్‌లో చూపెట్టాడని చర్చించుకుంటున్నారు. ఢిల్లీ ఓడినా పర్లేదని, అసలుసిసలు ఆల్‌రౌండ్ ప్రదర్శన చూసే అవకాశం దక్కిందని అంటున్నారు. తన జట్టును గెలిపించేందుకు మార్ష్ చేయాల్సిదంతా చేశాడని, జట్టులో ఇతర సభ్యుల సహకారం లేకపోవడం వల్ల, అలాగే ఛేదన సమయంలో పిచ్ నెమ్మదించడం వల్ల ఢిల్లీ ఓడిందని అభిప్రాయపడుతున్నారు. ఇన్ ఫామ్ బ్యాటర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపకపోవడం వల్ల డీసీ తగిన మూల్యం చెల్లించుకుందని, సాల్ట్ అద్భుతంగా ఆడాడని అంటున్నారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు అద్భుతమని, అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (27 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోరుల, 4 సిక్సర్లు) అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడారని ప్రశంసిస్తున్నారు. సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (4-0-20-2).. జోరుమీద ఉన్న ఫిల్ సాల్ట్ (59)ను ఔట్ చేసి తమ జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడని, అతనికి నటరాజన్ (4-0-31-1) నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమైంది. -
IPL 2023: వైరలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ పెళ్లి ఫోటోలు
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్ టర్మ్ పార్ట్నర్ గ్రెటా మాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్టౌన్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్ ఐపీఎల్-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్‌లకు మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్ గైర్హాజరీలో డీసీ రోవ్‌మన్ పావెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌ను ఇరు జట్లు చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం.. సిరీస్ సమర్పయామి
నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియా జట్టు భారత పర్యటనలో వన్డే సిరీస్‌లో ఒకదశలో 0–2తో వెనుకబడింది. కానీ చివరకు 3–2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో వెనుకబడినా కూడా పుంజుకొని కంగారూ టీమ్ భారత గడ్డపై మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి రెండు వన్డేల్లో పేస్, స్వింగ్ బౌలింగ్‌ను ఆడలేక తడబడిన టీమిండియా తుదిపోరులో స్పిన్‌కు బోల్తా పడింది. ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయకపోయినా అంతా తలా ఓ చేయి వేయడంతో ఆసీస్ ముందుగా 269 పరుగులు సాధించింది. ఊహించినట్లుగా స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన బ్యాటర్లు తడబడ్డారు. రోహిత్, గిల్ ఇచ్చిన మెరుపు ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత కోహ్లి, రాహుల్ అర్ధ సెంచరీ పార్ట్నర్షిప్తో ఒకదశలో టీమిండియా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే 39 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి జట్టు ఓటమిని ఆహ్వానించింది. టెస్టు సిరీస్ కోల్పోయినా ఒక మ్యాచ్ నెగ్గిన ఆసీస్ బృందం, ఇప్పుడు వన్డే సిరీస్‌తో సంతృప్తిగా స్వదేశం వెళ్లనుంది. చెన్నై: స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆ్రస్టేలియా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్ 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడి రెండో వన్డేలో నెగ్గిన కంగారూ బృందం 2–1తో సిరీస్‌ను దక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... పాండ్యా, కుల్దీప్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (72 బంతుల్లో 54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (4/45) భారత్‌ను దెబ్బ తీశాడు. మెరుపు వేగంతో ఈ సిరీస్‌లో 194 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఆసీస్ శుభారంభం... గత మ్యాచ్‌ల తరహాలోనే ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్ష్ శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి 10 ఓవర్లలో 61 పరుగులు జత చేశారు. పిచ్‌పై స్పిన్‌కు అనుకూలిస్తున్నట్లు కనిపించడంతో ఆరో ఓవర్లోనే భారత్ అక్షర్‌తో బౌలింగ్ చేయించింది. అయితే పాండ్యా బౌలింగ్‌కు దిగి మ్యాచ్ పరిస్థితిని మార్చాడు. తన తొలి మూడు ఓవర్లలో అతను హెడ్, స్మిత్ (0), మార్ష్ లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో వార్నర్ (23), లబుõషేన్ (28) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరిని కుల్దీప్ అవుట్ చేయడంతో స్కోరు 138/5 వద్ద నిలిచింది. ఈ సమయంలో క్యారీ (46 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టొయినిస్ (25) భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. భారత బౌలర్లు మళ్లీ దెబ్బ కొట్టడంతో ఆసీస్ స్కోరు 203/7కు చేరింది. సరిగ్గా ఇక్కడే భారత్ పట్టు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ అండతో చివరి మూడు వికెట్లకు ఆసీస్ 66 పరుగులు జత చేయడం విశేషం. రాణించిన పాండ్యా... ఛేదనను ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ప్రారంభించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఎదురుదాడినే నమ్ముకున్నారు. అయితే 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని ఆసీస్ వెనక్కి పంపించింది. ఈ దశలో కోహ్లి, రాహుల్ (50 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. అయితే మరీ నెమ్మదిగా ఆడిన రాహుల్‌తో పాటు అక్షర్ (2) కూడా నిష్క్రమించారు . కోహ్లి, పాండ్యా ఉన్నంత వరకు భారత్‌కు గెలుపు ఆశలు ఉన్నాయి. 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి పేలవ షాట్‌కు వెనుదిరగడంతో ఆసీస్ ఒత్తిడి పెంచింది. సూర్యకుమార్ (0) విఫలం కాగా, పాండ్యాను అవుట్ చేసి జంపా దెబ్బ కొట్టాడు. రవీంద్ర జడేజా (33 బంతుల్లో 18; 1 ఫోర్ ) ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోవడంతో లక్ష్యం మరీ కష్టంగా మారిపోయింది. మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆసీస్ భారత బ్యాటర్లను కట్టపడేయడంతో చివరకు ఓటమి తప్పలేదు. సూర్యకుమార్ ‘హ్యాట్రిక్ గోల్డెన్ డక్’ పాపం సూర్యకుమార్ యాదవ్... టి20ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో నంబర్‌వన్‌గా ఎదిగిన అతను వన్డేల్లో మాత్రం ‘బాంబే డక్’గా మారిపోయాడు. ఈ సిరీస్‌కు ముందు కూడా వన్డేల్లో గొప్ప రికార్డేమీ లేకపోయినా ఈసారి ప్రదర్శన మాత్రం అయ్యో అనిపించేదే. సిరీస్‌లో ఆడిన మూడు వన్డే ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగి 0, 0, 0తో ‘హ్యాట్రిక్ గోల్డెన్ డక్’ను నమోదు చేశాడు. గతంలో భారత ఆటగాళ్లు వరుసగా మూడు వన్డేల్లో డకౌటైనా, ఇలా మూడుసార్లు తొలి బంతికే ఎవరూ వెనుదిరగలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 33; మార్ష్ (బి) పాండ్యా 47; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 0; వార్నర్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 23; లబుõషేన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 28; క్యారీ (బి) కుల్దీప్ 38; స్టొయినిస్ (సి) గిల్ (బి) అక్షర్ 25; అబాట్ (బి) అక్షర్ 26; అగర్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 17; స్టార్క్ (సి) జడేజా (బి) సిరాజ్ 10; జంపా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 269. వికెట్ల పతనం: 1–68, 2–74, 3–85, 4–125, 5–138, 6–196, 7–203, 8–245, 9–247, 10–269. బౌలింగ్: షమీ 6–0–37–0, సిరాజ్ 7–1–37–2, అక్షర్ 8–0–57–2, పాండ్యా 8–0–44–3, జడేజా 10–0–34–0, కుల్దీప్ 10–1–56–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) అబాట్ 30; గిల్ (ఎల్బీ) (బి) జంపా 37; కోహ్లి (సి) వార్నర్ (బి) అగర్ 54; రాహుల్ (సి) అబాట్ (బి) జంపా 32; అక్షర్ (రనౌట్) 2; పాండ్యా (సి) స్మిత్ (బి) జంపా 40; సూర్యకుమార్ (బి) అగర్ 0; జడేజా (సి) స్టొయినిస్ (బి) జంపా 18; కుల్దీప్ (రనౌట్) 6; షమీ (బి) స్టొయినిస్ 14; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–146, 4–151, 5–185, 6–185, 7–218, 8–225, 9–243, 10–248. బౌలింగ్: స్టార్క్ 10–0–67–0, స్టొయినిస్ 9.1–0–43–1, అబాట్ 10–0–50–1, జంపా 10–0–45–4, అగర్ 10–0–41–2. -
మిచెల్ మార్ష్ విధ్వంసం.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో! ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన.. ఆసీస్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్(66 పరుగులు), ట్రావిస్ హెడ్( 51 పరుగులు) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. మిచెల్ మార్ష్ విధ్వంసం... ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే 66 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లకు మార్ష్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మార్ష్ చెమటలు పట్టించాడు. హార్దిక్ వేసిన 8వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాది.. 18 పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ షమీ, సిరాజ్‌ను కూడా మార్ష్ వదలలేదు. సిరాజ్ 3 ఓవర్లలో ఏకంగా 37 పరుగులివ్వగా.. షమీ 3 ఓవర్లలో 29 పరుగులిచ్చాడు. మార్ష్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 28 బంతుల్లోనే అందుకున్నాడు. కాగా ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా మార్ష్(81) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ 5వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఇక మిచెల్ మార్ష్ ఊచకోత చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలిపోతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు మార్ష్ ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం.. ఢిల్లీ మెనెజెమెంట్తో పాటు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఇదే తరహా విధ్వంసాన్ని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్లో మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను మార్ష్ ప్రారంభించే అవకాశం ఉంది. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: గోల్డన్ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి -
టీమిండియా ఘోర ఓటమి.. 10 వికెట్ల తేడాతో ఆసీస్ భారీ విజయం
విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 1-1తో సమం చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్(66 నాటౌట్), ట్రావిస్ హెడ్(51 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. మిచెల్ మార్ష్ అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఓవర్ నుంచే భారత బ్యాటర్లకు ప్రత్యర్ధి పేసర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ వికెట్‌ను కోల్పోయిన భారత్.. అనంతరం ఏ దశలోనే కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో అక్షర్ పటేల్ (29) పరుగులతో రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది. చదవండి: IND vs AUS: గోల్డన్ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి -
దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే!
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మొదలైన తొలి వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇన్నింగ్ ఆరంభంలో మిచెల్ మార్ష్ దూకుడు చూసి ఆసీస్ స్కోరు మూడు, నాలుగు వందలు దాటుతుందని అంతా భావించారు. ఎందుకంటే మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉన్నంతసేపు ఆసీస్ స్కోరు మెరుపు వేగంతో పరిగెత్తింది. 19 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అంటే ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున రన్‌రేట్ నమోదయ్యింది. కానీ మార్ష్ ఔటయ్యాకా పరిస్థితి మొత్తం మారిపోయింది. టి20లతో పోలిస్తే వన్డేలు అంటే కాస్త నెమ్మదిగా ఆడాలన్న విషయాన్ని మరిచిపోయిన ఆసీస్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్ కేవలం 59 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ ఆడిన తీరుపై పెదవి విరిచిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మీ దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయారుగా..'' అంటూ పేర్కొన్నారు. చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ.. -
ఇదేం షాట్ రా బాబు.. ఇండియాలో అయితే స్టేడియం బయటపడేది..!
Mitchell Marsh Massive 115 Metre Six: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (నవంబర్ 22) జరిగిన ఆఖరి వన్డేలో ఆతిధ్య ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. Clobbered 115 metres! 💥 Mitch Marsh middled this one! #AUSvENG #Dettol | #PlayOfTheDay pic.twitter.com/QzToL1irbC — cricket.com.au (@cricketcomau) November 22, 2022 తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. మిచెల్ మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్.. ఆసీస్ ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఆ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఓ కళ్లు చెదిరే షాట్ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఓల్లీ స్టోన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. మార్ష్ కొట్టిన ఈ షాట్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి ల్యాండైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెల్బోర్న్ మైదానంలో బంతికి స్టాండ్స్‌లోకి వెళ్లిందంటే.. ఇండియాలోని గ్రౌండ్స్‌లో బంతి మైదానం దాటుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 2013లో సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ స్టేడియంలో ఏకంగా 153 మీటర్ల అత్యంత భారీ సిక్సర్ బాదాడు. -
AUS Vs AFG: పూర్ అంపైరింగ్.. ఆరుకు బదులు ఐదు బంతులే
ఒక ఓవర్లో ఎన్ని బంతులుంటాయని క్రికెట్‌పై కనీసం పరిజ్ఞానం ఉన్న వాళ్లని అడిగితే టక్కున 'ఆరు' అని చెప్పేస్తారు. అయితే ఐదు బంతులు పడగానే ఓవర్ ముగిసిపోవడం ఎప్పుడైనా చూశారా. ఒకవేళ చూడకుంటే మాత్రం వెంటనే ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్ రీప్లే చూడండి. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఆసీస్, ఆఫ్గన్ మ్యాచ్ ఒక ఓవర్ ఐదు బంతులతోనే ముగియడం ఆసక్తికరంగా మారింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను నవీన్-ఉల్-హక్ వేశాడు. ఆ సమయంలో క్రీజులో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్‌లు క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మూడో బంతిని మార్ష్ బౌండరీ తరలించాడు. ఇక నాలుగో బంతిని వార్నర్ డాట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతికి మూడు పరుగులు వచ్చాయి. ఓవర్ పూర్తయిందనుకున్న నవీన్ ఉల్ హక్ అంపైర్ వద్దకి వచ్చాడు. అంపైర్ కూడా మిస్ కమ్యునికేషన్ వల్ల ఓవర్ పూర్తైనట్లుగా భావించాడు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఓవర్ పూర్తై మరుసటి ఓవర్ తొలి బంతి పడిన తర్వాత ఫీల్డ్ అంపైర్ తప్పిదాన్ని గమనించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక బంతి తక్కువగా ఆడినట్లయింది. అయితే ఇది అంపైర్ల తప్పిదమని అభిమానులు పేర్కొంటున్నా చిన్న మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందనుకోవచ్చు. ఫీల్డ్‌లో ఉండే అంపైర్లు చూసుకోవాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటి. ఓవర్ పూర్తయ్యేవరకు అన్ని బంతులను కౌంట్ చేయడంతో పాటు పరుగులు, రనౌట్లు, లెగ్‌బైలు, నోబ్లతో పాటు చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంపైర్లు కూడా పొరపాటు చేయడం సహజం. అయితే ఇది తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండో ఇన్నింగ్స్‌లో అయ్యుంటే వివాదంగా మారేది. In the 4th over of Australia's batting Only 5 ball to be bowled.. Poor Umpiring in this tournament... #AUSvAFG pic.twitter.com/zdUnAvOvrF — GUJARAT TITANS (@Gujrat_titans_) November 4, 2022 చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే 27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు -
వరల్డ్‌కప్‌ను ఇంతటితో ఆపేయడం బెటర్.. ఆసీస్ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజీ సమరంపై ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ప్రేమికులకు వరల్డ్‌కప్ మొత్తం మ్యాచ్‌లు చూసిన తర్వాత వచ్చే మజా ఒక్క మ్యాచ్‌తోనే (ఇండియా-పాక్) వచ్చింది కాబట్టి, ఈ మెగా టోర్నీని ఇంతటితో ఆపేయడం బెటర్ అని వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎన్నో మలుపులు, హై డ్రామా, సస్పెన్స్, థ్రిల్, ఉద్విగ్వ సన్నివేశాలు.. ఇలా సగటు క్రికెట్ అభిమానికి కావాల్సిన ప్రతీది ఈ మ్యాచ్‌లో దొరికిందని పేర్కొన్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇంతకు మించిన థ్రిల్లింగ్ మ్యాచ్‌ను చూడలేమని చెప్పుకొచ్చాడు. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడూ ఓ అద్భుతమేనని, దాయాదుల సమరం కోట్లాది మంది ప్రజల భావోద్వేగమని, సగటు ప్రేక్షకుడిలా మైదానంలో మ్యాచ్‌ను వీక్షిస్తే ఎలా ఉంటుందో ఊహించలేనని తెలిపాడు. ఈ సందర్భంగా మార్ష్.. విరాట్ విశ్వరూపాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. విరాట్‌కు మించిన ఆటగాడు మరొకరు లేరని, అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని, ప్రపంచకప్‌లో విరాట్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ మరిన్ని ఆశిస్తున్నానని కంక్లూడ్ చేశాడు. ఇదిలా ఉంటే, ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియా ఇవాళ (అక్టోబర్ 25) శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులో స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కరోనా నిర్ధారణ కావడంతో అతని స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక మాత్రం ఐర్లాండ్‌పై గెలిచిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. చదవండి: లంకతో పోరుకు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. కీలక బౌలర్‌కు అనారోగ్యం -
టీమిండియాతో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ దూరమయ్యే అవకాశం ఉంది. కాగా ఆక్టోబర్ 12న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో డేవిడ్ వార్నర్ మెడకు గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలివెళ్లాడు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా వార్నర్‌ను ఇంగ్లండ్‌తో అఖరి టీ20కు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా భారత్‌తో వార్మప్ మ్యాచ్‌లో కూడా డేవిడ్ భాయ్‌ను ఆడించి రిస్క్ తీసుకోడదని ఆసీస్ మేనేజెమెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాయం నుంచి కోలుకుని ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన స్టోయినిష్, మార్ష్‌కు కూడా వార్మప్ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్టోయినిష్, వార్నర్, మార్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. స్టోయినిష్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్22న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: రోహిత్ శర్మ సింప్లిసిటీ.. సాధారణ వ్యక్తిలా క్యాబ్‌లో..! -
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్!
Australia tour of India, 2022- Ind Vs Aus T20 Series: టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కాగా రోహిత్ సేనతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే మంగళవారం(సెప్టెంబరు 20)న ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురి స్థానాలు భర్తీ చేసేది వీళ్లే! అయితే, ఈ ముగ్గురిని గాయాల బెడద వేధిస్తోంది. స్టార్క్ ఇప్పుడిప్పుడే మోకాలి నొప్పి నుంచి కోలుకుంటుండగా.. మార్ష్ పాదానికి గాయమైంది. ఇక స్టొయినిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానాలను ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎలిస్, ఆల్‌రౌండర్లు డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌లతో భర్తీ చేసినట్లు సమాచారం. కాగా అక్టోబరు 16 నుంచి స్వదేశంలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో కూడా తాము భారత్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు సీఏ వెల్లడించింది. డేవిడ్ వార్నర్(ఈ ఓపెనర్‌కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్) మినహా అందరూ టీమిండియాతో సిరీస్ ఆడతారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం స్టార్క్, స్టొయినిస్, మార్ష్ గాయాల కారణంగా దూరమయ్యారు. ప్రపంచకప్ ఆరంభం నాటికి వీరు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా (తాజా) జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. -
శ్రీలంకతో తొలి వన్డే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ మార్ష్ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యారు. ఇక టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి టీ20లో ఆసీస్ ఆనూహ్యంగా ఓటమి చెందింది. అఖరి మూడు ఓవర్లలో 59 పరుగులను ఛేజ్ చేసి శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శ్రీలంకతో తొలి వన్డేకి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st Odi): ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కారీ, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జో రిచర్డ్సన్, జోష్ హేజిల్‌వుడ్. చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్ -
'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది'
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడంపై ఢిల్లీ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోవడం తమకు సిగ్గుగా ఉందని మార్ష్ తెలిపాడు. "మేము ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మా జట్టు ఆటగాళ్లను చాలా బాగా చూసుకున్నాడు. అతడు నాయకుడిగా, జట్టు ప్రధాన కోచ్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అతడి కోసమైనా మేము టైటిల్ సాధించాలని భావించాము. అదే విధంగా ఢిల్లీ జట్టుకు నేను చాలా ముఖ్యమైన ఆటగాడిగా పాంటింగ్ భావించాడు" అని మార్ష్ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు మార్ష్ దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చిన ఒక్క మ్యాచ్ తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మార్ష్ ఆద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 251 పరుగులు చేశాడు. చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను గాయపడుతున్నానని పేర్కొన్నాడు. ప్రస్త్తుతం మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వచ్చింది. ప్రాక్టీస్ ముగించుకున్న మార్ష్ ఒక మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కోవిడ్ వచ్చింది.. అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా. ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. కానీ నేను కోవిడ్ నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి ఢిల్లీ జట్టుతో చేరి మంచి ప్రదర్శనలు చేశా. అక్కడున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక నేను జట్టులో చేరినప్పుడు అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు. ఆటలో అతడు ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు తెలుసు. అయితే అతడితో కలిసి చేసిన ప్రయాణంలో పాంటింగ్ తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. నేను ఢిల్లీ జట్టుకు ఎంత ముఖ్యమైన ఆటగాడినో పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నన్ను మోటివేట్ చేసేవాడు. నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెంచేలా దోహదం చేసేవాడు.’ అని మార్ష్ చెప్పాడు. కాగా 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇక తాజా సీజన్ లో 8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా లంకతో మూడు టి20ల సిరీస్ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..! -
IPL 2022: ఢిల్లీ ఆశలు పదిలం
ముంబై: సీజన్లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదే శైలిని కొనసాగించింది! తాజా ఫలితం అనంతరం సరిగ్గా సగం మ్యాచ్‌లలో విజయం, సగం పరాజయాలతో ఆ జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు పదిలంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన పడిక్కల్... ప్రమాదకర బ్యాటర్ బట్లర్ (7)ను అవుట్ చేసి సకరియా ఢిల్లీకి శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్ (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే అనూహ్యంగా మూడో స్థానంలో వచ్చిన అశ్విన్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరో ఎండ్‌లో పడిక్కల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో అతను రెండు సిక్సర్లు కొట్టాడు. 37 బంతుల్లో అశ్విన్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్ సహా టి20 క్రికెట్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మూడో వికెట్‌కు పడిక్కల్‌తో 36 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం అశ్విన్ వెనుదిరగ్గా... సామ్సన్ (6), పరాగ్ (9) విఫలమయ్యారు. శతక భాగస్వామ్యం... కేఎస్ భరత్ (0) మరోసారి విఫలమవ్వగా... వార్నర్, మార్ష్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 38 పరుగులకు చేరింది. మార్ష్ దూకుడు కనబర్చగా, వార్నర్ నెమ్మదిగా ఆడాడు. కుల్దీప్ సేన్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మా చహల్ ఓవర్లో మరో భారీ సిక్స్‌తో 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 79 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం నమో దైంది. వేగంగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకుపోయిన మార్ష్ ఆ అవకాశం చేజార్చుకున్నాడు. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో మా అవుటయ్యాడు. వార్నర్, పంత్ (13 నాటౌ ట్; 2 సిక్స్‌లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) లలిత్ (బి) మార్ష్ 19; బట్లర్ (సి) శార్దుల్ (బి) సకరియా 7; అశ్విన్ (సి) వార్నర్ (బి) మార్ష్ 50; పడిక్కల్ (సి) (సబ్) నాగర్కోటి (బి) నోర్జే 48; సామ్సన్ (సి) శార్దుల్ (బి) నోర్జే 6; పరాగ్ (సి) పావెల్ (బి) సకరియా 9; డసెన్ (నాటౌట్) 12; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–107, 4–125, 5–142, 6–146. బౌలింగ్: సకరియా 4–0–23–2, నోర్జే 4–0–39–2, శార్దుల్ 4–0–27–0, అక్షర్ 2–0–25–0, మా 3–0–25–2, కుల్దీప్ 3–0–20–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: భరత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; వార్నర్ 52 (నాటౌట్); మార్ష్ (సి) కుల్దీప్ సేన్ (బి) చహల్ 89; పంత్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–144. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, ప్రసిధ్ 3–1–20–0, అశ్విన్ 4–0–32–0, కుల్దీప్ సేన్ 3.1–0–32–0, చహల్ 4–0–43–1. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్..
నేడు కోల్‌కతాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట లభించింది. కరోనాతో ఆస్పత్రిపాలైన జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం అతను కోవిడ్ బారిన పడ్డాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ మరో సభ్యుడు టిమ్ సీఫెర్ట్ కూడా కరోనా నుంచి విముక్తి పొందాడు. వీరిద్దరు బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కాగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌తో అమితుమీ తేల్చుకోనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..?
Delhi Capitals All Rounder Mitchell Marsh Test Positive For Covid: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. మూడు రోజుల కిందట (ఏప్రిల్ 15) జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా ఇద్దరు ఆటగాళ్లు మహమ్మారి బారిన పడ్డారని సమాచారం. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మార్ష్‌కు ఇవాళ ఉదయం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, అనంతరం చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Australian all-rounder Mitchell Marsh has tested negative in his mandatory RT-PCR test after returning a positive Rapid Antigen Test (RAT), meaning the IPL match between Delhi Capitals and Punjab Kings on Wednesday will go on as scheduled - via PTI#IPL2022 #DCvPBKS — Subhayan Chakraborty (@CricSubhayan) April 18, 2022 ఈ ప్రచారాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అని డైలమా కొనసాగుతుంది. మరోవైపు కోవిడ్ బారినపడ్డట్టుగా చెబుతున్న ఆ రెండో ఆటగాడు ఎవరో తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో డీసీ యాజమాన్యం కానీ, ఐపీఎల్ వర్గాలు కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యచ్‌ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. చదవండి: ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
12 ఏళ్లలో ఐదు టీమ్‌లు.. ఆడింది మాత్రం 22 మ్యాచ్‌లే
మిచెల్ మార్ష్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున స్టార్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో మిచెల్ మార్ష్ కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మిచెల్ మార్ష్ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో మార్ష్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా మిచెల్ మార్ష్ ఐపీఎల్లో అడుగుపెట్టి 12 ఏళ్లయింది. 2010లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కుడైన విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి 12 ఏళ్ల కాలంలో కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఇదే 12 ఏళ్లలో మార్ష్ ఐదు ఫ్రాంచైజీలు మారాడు. అవే డెక్కన్ చార్జర్స్, పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, ఎస్ఆర్హెచ్...తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో మార్ష్ 21 మ్యాచ్‌ల్లో 225 పరుగులు సాధించాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కీలక సమరానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త అందింది. వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పాక్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన మార్ష్.. తాజాగా నెట్స్‌లో హుషారుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డీసీ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేసింది. pic.twitter.com/0ES8BZSKrG — Delhi Capitals (@DelhiCapitals) April 15, 2022 కాగా, వాంఖడే వేదికగా ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. విండీస్ ఆల్‌రౌండర్ రోవమన్ పావెల్ స్థానంలో మార్ష్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్ష్ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ మరింత బలపడనుంది. ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్ష్‌ను రూ.6.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో డీసీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలైంది. ప్రస్తుతానికి ఆ జట్టు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఢిల్లీ కంటే ఓ ప్లేస్ ముందుంది. ఆర్సీబీ 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ చదవండి: దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నట్లు తేలినందున మార్ష్ పాక్‌తో జరగనున్న మిగతా వన్డేలు ఆడడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గాయం తీవ్రత పెద్దగా లేదని రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఒక రకంగా ఆస్ట్రేలియాకు ఇది షాకింగ్ న్యూస్ అయినప్పటికి.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే గాయపడిన మార్ష్ స్వదేశం వెళ్లకుండా ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరినప్పటికి ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికి ఆ తర్వాత సీజన్ అంతా అందుబాటులో ఉండనున్నాడు. భారత్‌కు రానున్న మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ రిహాబిటేషన్ సెంటర్లో ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ పర్యవేక్షణలో రికవరీ అవ్వనున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే పాట్రిక్ ఫర్హాత్ నేతృత్వంలోనే కోలుకుంటున్నాడు. ఏప్రిల్ 7న నోర్జ్టే ఢిల్లీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మార్ష్ కూడా ఏప్రిల్ రెండో వారంలో జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా మిచెల్ మార్ష్ గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. అదే తరహా మెరుపులు మార్ష్ నుంచి ఐపీఎల్లో చూసే అవకాశం ఉంది. మరో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రత్యేక అనుమతితో వార్న్ అంత్యక్రియల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. వచ్చే వారంలో వార్న్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరవచ్చు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ తర్వాతి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగీ ఎన్గిడి అందుబాటులోకి రానున్నారు. చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా? Virat Kohli: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న రికార్డులు -
పాకిస్తాన్‌తో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్!
పాకిస్తాన్‌తో తొలి వన్డే ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా బారిన పడడంతో పాక్‌తో సిరీస్ నుంచి ఇంగ్లిస్ తప్పుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్ నివేదికల ప్రకారం.. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలలో జోష్ ఇంగ్లిస్‌కు పాజిటివ్‌గా నిర్ధారణైంది. అతడు ఐదు రోజులు పాటు ఐషోలేషిన్లో ఉండనున్నాడు. ఐదు రోజుల తర్వాత ఇంగ్లిస్ మరోసారి పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని , నెగిటివ్‌గా తేలితే తిరిగి జట్టులో చేరనున్నాడని నివేదిక పేర్కొంది. ఇక మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, బెన్ మెక్‌డెర్మోట్, మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా చదవండి: IPL 2022: 145 కి.మీ.ల స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్! -
IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్
Mitchell Marsh Likely To Miss IPL 2022: ముంబై ఇండియన్స్‌పై సూపర్ విక్టరీ సాధించి సంబురాల్లో మునిగితేలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ సాడ్ న్యూస్ తెలిసింది. ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న ఆ జట్టు కీలక ఆటగాడు, స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు గాయమైనట్లు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారధి ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మార్ష్‌కు తొడ కండరాలు పట్టేసాయని ఫించ్ పేర్కొన్నాడు. దీంతో మార్ష్ పాక్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని ఫించ్ తెలిపాడు. ఒకవేళ మార్ష్‌కు తగిలిన గాయం పెద్దదైతే అతను ఐపీఎల్ 2022 ఆడేది కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఉలిక్కిపడింది. ఇటీవలే ముగిసిన వేలంలో మార్ష్‌ను డీసీ 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇప్పటికే కీలక బౌలర్, సౌతాఫ్రికా ఆటగాడు ఆన్రిచ్ నోర్జే సేవలను కోల్పోయిన డీసీకి.. ఆల్‌రౌండర్ మార్ష్ కూడా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పంత్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో (ఏప్రిల్ 2న) గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. చదవండి: పంజాబ్ విజయంపై 'ఆ సినిమా' ప్రభావం.. అదే స్పూర్తితో..! -
'మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు!
ఐసీసీ మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి ఐసీసీ బుధవారం నలుగురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా, ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. ►ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కనబరిచాడు. ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ 589 పరుగులు సాధించాడు. ఇటీవలే జరిగిన టి20 ప్రపంచకప్ 2021లో 269 పరుగులతో దుమ్మురేపాడు. ►ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్ పేరు చెప్పగానే.. 2021 టి20 ప్రపంచకప్ ఫైనల్ గుర్తురాక మానదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా మార్ష్ ఈ ఏడాది టి20 క్రికెట్లో 627 పరుగులు సాధించాడు. ►పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. టి 20 క్రికెట్లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు. ఒక్క ఏడాదిలో టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్ రికార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది టి20 క్రికెట్లో పాకిస్తాన్ తరపున 1326 పరుగులు చేశాడు. ఇక టి20 ప్రపంచకప్ 2021లో రిజ్వాన్ 281 పరుగులు సాధించడం విశేషం. ►శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టి20 క్రికెట్లో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ తనదైన పాత్ర పోషించాడు. -
60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2021లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న మార్ష్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బీబీఎల్ మార్ష్‌కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్లో రెండోది. ఓవరాల్‌గా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్ స్కార్చర్స్కే చెందిన ఓపెనర్ కొలిన్ మున్రో ఈ సీజన్లో తొలి శతకంతో మెరిశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. Click Here For Video: Mitchel Marsh Century MITCH. MARSH. CENTURY.#BBL11 pic.twitter.com/I4zyNQyv9i — 7Cricket (@7Cricket) December 14, 2021 -
యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్..
Australia announce Ashes squad: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ హీరో మిచల్ మార్ష్‌కు చోటు దక్కలేదు. మరో వైపు ఆజట్టు సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు రెండు ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లో చోటు దక్కింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా బుధవారం(నవంబర్-17) ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు, 16న ఆడిలైడ్‌లో రెండో టెస్టు, 26న మెల్బోర్న్లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్‌లో జనవరి 14న జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: టిమ్ పైన్ (సి), పాట్ కమిన్స్ , కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, స్విప్సన్, డేవిడ్ వార్నర్ యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్‌కి ఇదే మొట్టమొదటి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు’ అంటూ రాసుకొచ్చింది. 1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్ మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌కి ‘ది యాషెస్’ అనే పేరు వచ్చింది. చదవవండి: కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్తకొత్తగా..! -
T20 WC 2021 Winner: ఆసీస్ ఆటగాళ్ల సంబరం.. ఫొటోలు వైరల్
T20 WC 2021 Winner Australia Celebrate Maiden T20 WC Triumph Photo Highlights: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. నవంబరు 14 నాటి ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి మొట్టమొదటి సారి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో మాక్స్వెల్ ఫోర్ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. ఇక ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా ఆరోన్ ఫించ్ బృందం నిలిచింది. దీంతో ఆసీస్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ట్రోఫీని ముద్దాడుతూ.. షూలో డ్రింక్స్ తాగుతూ కంగారూలు తమ చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించారు. ఫైనల్ హీరోలు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ను అభినందిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC Winner Australia: షూలో డ్రింక్స్ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది!
T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ అందించిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. నవంబరు 14న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న ఆసీస్ జట్టు చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూలు.. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపుబాట పట్టించారు. ఇక చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది ఫించ్ టీమ్. బూట్ల(షూ)లో డ్రింక్స్ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూ విప్పేసి అందులో డ్రింక్స్ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అరె ఏంట్రా ఇది.. షూతో డ్రింక్స్ తాగటం... మీరు సూపర్.. వరల్డ్‌కప్ గెలిచారు కదా... మీ ఇష్టం కానీయండి.. కానీయండి’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా షూలో డ్రింక్స్ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటి. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటు. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV — ICC (@ICC) November 15, 2021 -
ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా
T20 World Cup 2021 Final: Mitchell Marsh Repeats His Father's Geoff Marsh World Cup Winner 34 Years Record: ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న టీ20 ప్రపంచకప్ ఎట్టకేలకు కంగూరూల సొంతమైంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను గెలిచింది. ఐదు సిరీస్ పరాజయాల నుంచి చాంపియన్‌గా నిలిచి ఆరోన్ ఫించ్ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఫైనల్లో స్టార్ ఓపెపర్ డేవిడ్ వార్నర్ (53 పరుగులు), మిచెల్ మార్ష్(77) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 34 ఏళ్ల క్రితం తండ్రి.. ప్రధానంగా మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆసీస్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, 34 ఏళ్ల క్రితం మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలిసారిగా విజేతగా నిలవడంలో కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు... రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌గా మారిన జెఫ్ మార్ష్... ఆసీస్ 1999లో తమ రెండో టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తండ్రిలాగే కొడుకు తండ్రి జెఫ్ మార్ష్ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్ మార్ష్(mitchell marsh). గత ఆరు పర్యాయాలుగా అందని ద్రాక్షగా ఆసీస్‌ను ఊరిస్తున్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో మార్ష్ మొత్తంగా.. ఐదు ఇన్నింగ్స్‌లో మార్ష్ 185 పరుగులతో రాణించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జెఫ్ మార్ష్ మరో తనయుడు, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సైతం క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇలా కుటుంబమంతా ఆసీస్ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా పలు కీలక సమయాల్లో విజయాలు అందించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
David Warner: ఐదు సిరీస్ పరాజయాల నుంచి.. చాంపియన్‌గా.. వార్నర్, మార్ష్ ఇంకా..
David Warner Mitchell Marsh Heroics Australia Become Champion: కొద్ది రోజుల క్రితం ఇదే యూఏఈలో ఐపీఎల్-2021 రెండో అంచె సందర్భంగా ‘అవమానాలకు’ డేవిడ్ వార్నర్(David Warner) తానేంటో నిరూపించుకున్నాడు. నెల రోజులు తిరిగేసరికి ఏకంగా వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. సరైన సమయంలో తన జాతీయ జట్టు తరఫున సత్తా చాటి తొలి టైటిల్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. తన విలువను చాటుకున్నాడు. ఇక పరిమిత ఓవర్ల కోసం రెండేళ్ల క్రితం టెస్టులను వదిలి పెట్టిన మిచెల్ మార్ష్(Mitchell Marsh)ను ఇప్పటి వరకు ‘బిట్స్ అండ్ పీసెస్’ తరహాలో ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తూ వచ్చిన ఆసీస్ కొన్నాళ్ల క్రితమే ప్రధాన బ్యాట్స్‌మన్ పాత్రను ఇస్తూ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. టోర్నీలో ఏకంగా 147 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన తనపై ఉంచిన నమ్మకాన్నిమార్ష్ నిలబెట్టాడు. అతను ఆడని ఒకే ఒక మ్యాచ్‌లోనే ఆసీస్ ఓడిందంటే మార్ష్ భాగస్వామ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ఫైనల్లో విజయం వైపు నడిపించిన వీరిద్దరే కాకుండా కీలక సమయాల్లో ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు ఆసీస్‌ను ముందంజంలో నిలిపాయి. సరిగ్గా చెప్పాలంటే ఎలాంటి ప్రత్యర్థి, వేదిక ఎదురైనా ఏ సమయంలోనూ వెనకడుగు వేయని ఒకనాటి దుర్భేద్యమైన ఆస్ట్రేలియాను గుర్తుకు తెస్తూ ఈ బృందం సత్తా చాటింది. T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా ఆడిన గత ఐదు టి20 సిరీస్‌లు చూస్తే... ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా ఐదు సిరీస్ పరాజయాలు... కానీ అసలు సమయంలో తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడంతో ఆసీస్ ఒక్కసారిగా ఎగసింది. సెమీఫైనల్లో వేడ్, స్టొయినిస్ హీరోలుగా నిలిస్తే బౌలింగ్‌లో హాజల్‌వుడ్, జంపా స్టార్లుగా నిలిచారు. ముఖ్యంగా ఇతర లెగ్‌స్పిన్నర్లతో పోలిస్తే జంపా ఇంతగా సూపర్ సక్సెస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆరుకంటే తక్కువ ఎకానమీ (5.81)తో అతను 13 వికెట్లు తీసి ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేశాడు. హాజల్‌వుడ్ కూడా పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తూ 11 వికెట్లతో చెలరేగాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో టైటిల్ సాధించడంలో భాగంగా ఉన్న హాజల్‌వుడ్ అదే అనుభవాన్ని ఇక్కడా ఉపయోగించాడు. కెప్టెన్ ఫించ్ మినహా (7 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 135 పరుగులు) మిగతా వారంతా ఏదో ఒక దశలో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ఆసీస్‌కు విజయాన్ని అందించింది. అయితేనేమి... ఆసీస్‌కు ప్రపంచకప్ అందించిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్లవంటి దిగ్గజాల సరసన ఫించ్ చోటు దక్కించుకున్నాడు. తొలి టి20 ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా అద్భుత ఫామ్‌లో ఉంది. వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత ఇది కూడా వారిదే అనిపించింది. అయితే అనూహ్యంగా సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన టీమ్‌కు ఆ తర్వాత ఐదు ప్రయత్నాల్లోనూ టైటిల్ దక్కలేదు. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదంటూ ఆసీస్ మాజీ ఆటగాళ్లు పదే పదే చెబుతూ వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత, కొత్త టి20 స్టార్లు వెలుగులోకి వచ్చినా కంగారూల సమస్య తీరలేదు. గత రెండు సార్లు (2014, 2016) టీమ్ కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. అంచనాలు లేకపోవడమే పెద్ద బలం అన్నట్లుగా ఈసారి బరిలోకి దిగిన జట్టు చివరకు సాధించి చూపించింది. భారత్ చేతిలో వార్మప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాతైతే ఆ టీమ్‌పై ఎవరికీ నమ్మకం కూడా లేకుండా పోయింది. అయితే మ్యాచ్ మ్యాచ్‌కూ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగింది. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడినా దాని ప్రభావం రన్‌రేట్‌పై పడకుండా తర్వాతి మ్యాచ్‌లలో చెలరేగడంతో సెమీస్ బెర్తు దక్కింది. ఈ అవకాశాన్ని వదలరాదనే పట్టుదల ప్రదర్శించిన టీమ్ చివరకు జగజ్జేతగా నిలవగలిగింది. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. చాలా గర్వంగా ఉంది..
T20 WC 2021 Winner Australia: Aaron Finch Comments On David Warner Adam Zampa: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం’’ అని టీ20 వరల్డ్‌కప్-2021 చాంపియన్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసీస్‌కు ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ టైటిల్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా.. మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం కెప్టెన్ ఫించ్ మాట్లాడుతూ.. వార్నర్, ఆడం జంపా, మార్ష్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘తన పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్ తన పనిని పూర్తి చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. స్కోర్లు: న్యూజిలాండ్- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5) -
T20 WC Final: వావ్.. మిచెల్ మార్ష్ అరుదైన రికార్డు.. కేన్ మామ, వార్నర్ భాయ్ కూడా!
T20 WC 2021 Winner Australia: Mitchell Marsh Kane Williamson Warner Rare Record In Final: టీ20 వరల్డ్‌కప్ కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి సారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీ-2021 కైవసం చేసుకుని సత్తా చాటింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్ష్ తక్కువ బంతుల్లోనే.. ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విలియమ్సన్ 32 బంతులు, వార్నర్ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(33), 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(33) ఈ ఘనత అందుకున్నారు. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్ షాట్ -
T20 World Cup 2021 Winner Australia: ఆసీస్‌కు అందిన ద్రాక్ష
సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాలు శాసించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. వన్డే క్రికెట్లో ఐదుసార్లు జగజ్జేతగా నిలిచినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టి20 క్రికెట్ ప్రస్తావన రాగానే ఇంతకాలం ఆస్ట్రేలియా గురించి చెప్పే ఒకే ఒక్క మాట ఇది... ఆస్ట్రేలియా టీమ్ గురించి ఇకపై అలాంటి మాటకు అవకాశమే లేదు. 2007 నుంచి తొలి టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న కంగారూలు ఎట్టకేలకు 14 ఏళ్ల ‘జైలు గోడలను’ బద్దలు కొట్టారు. టి20 ప్రపంచకప్‌లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ఇంతకాలంగా అందని ట్రోఫీని తమ ఖాతాలో వేసుకొని సగర్వంగా నిలిచారు. టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి అంచనాలు లేని, ఫేవరెట్ అంటూ ఎవరూ చెప్పని జట్టు చివరకు చాంపియన్ తరహా ఆటతో సత్తా చాటింది. నాకౌట్ మ్యాచ్‌లలో కనిపించే ఒత్తిడి, ఆందోళన తమ దరికి రావని చాటి చెబుతూ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను అందుకుంది. సెమీస్‌లో సూపర్ ఆటతో పాక్‌ను చిత్తు చేసిన టీమ్ తుది పోరులోనూ అదే స్థాయిని ప్రదర్శించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ముందుగా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన ఆసీస్... ఛేదనలో ఎక్కడా తడబడలేదు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్ అదరగొట్టగా... బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్, వార్నర్ ద్వయం చెలరేగింది. మెల్బోర్న్లో సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయం అవుతుండగా, తమ అభిమానులకు తీపి వార్త అందించింది. పాపం న్యూజిలాండ్... ఫైనల్ మ్యాచ్ ఫలితం చూసిన తర్వాత ఇలా స్పందించని క్రికెట్ అభిమాని ఉండడేమో! 2019 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఫైనల్ చేరి ‘బౌండరీ కౌంట్’తో గుండె పగిలిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఓడి విషాదంలో మునిగింది. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలోనే ఓటమి పాలైన టీమ్... గత రెండేళ్ల వ్యవధిలో రెండు మెగా టోర్నీ తుది సమరాల్లోనూ దురదృష్టవశాత్తూ తలవంచింది. అసలు సమయంలో చెలరేగిన కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి చుక్కానిలా జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం కివీస్‌ను దెబ్బ తీసింది. చివరకు మరోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్లో వరల్డ్ టైటిల్ అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్‡్ష (50 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. బౌలర్ల జోరు... భారీ స్కోరు సాధించేందుకు శుభారంభం చేయాల్సిన న్యూజిలాండ్ పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 6 ఓవర్లలో 32 పరుగులే చేయగలిగిన ఆ జట్టు డరైల్ మిచెల్ (8 బంతుల్లో 11; సిక్స్) వికెట్ కోల్పోయింది. ముఖ్యంగా పేసర్ హాజల్‌వుడ్ ప్రత్యర్థిని కట్టి పడేశాడు. తన 3 ఓవర్ల స్పెల్‌లో అతను 14 ‘డాట్’ బంతులు వేయడం విశేషం. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. విలియమ్సన్ బాగా నెమ్మదిగా ఆడగా, గప్టిల్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) కూడా పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 57 మాత్రమే! 6 ఓవర్లలో 79 పరుగులు... విరామం తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటికి 21 బంతులు ఆడిన విలియమ్సన్ 21 పరుగులతో ఉన్నాడు. స్టార్క్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను హాజల్‌వుడ్ వదిలేశాడు. ఆ బంతికి ఫోర్ రాగా, తర్వాతి రెండు బంతులను కూడా కేన్ బౌండరీకి పంపించాడు. మరుసటి ఓవర్లో గప్టిల్ అవుటైనా... మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జంపా ఓవర్లో ఫిలిప్స్ (17 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) ఒక సిక్స్, ఫోర్ కొట్టగా... స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో విలియమ్సన్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 0, 4, 4 కొట్టడం విశేషం. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన విలియమ్సన్... ఒక్క స్టార్క్ బౌలింగ్‌లోనే 12 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 39 పరుగులు రాబట్టాడు. అయితే కీలక సమయంలో విలియమ్సన్‌ను అవుట్ చేయడంతో పాటు చివరి నాలుగు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... కివీస్‌ను కొంత వరకు కట్టడి చేయడంలో సఫలమైంది. భారీ భాగస్వామ్యం... ఫామ్‌లో లేని కెప్టెన్ ఫించ్ (5) మరోసారి నిరాశపరుస్తూ ఆరంభంలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఛేదన మొదలైంది. అయితే వార్నర్, మార్ష్ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. మిల్నే ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4తో తన ఖాతా తెరిచిన మార్ష్ చివరి వరకు అదే జోరును కొనసాగించగా, సెమీస్ తరహాలో మళ్లీ మెరుపు ప్రదర్శనతో వార్నర్ దూసుకుపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులు కాగా... సోధి ఓవర్లో వార్నర్ కొట్టిన 2 ఫోర్లు, సిక్స్‌తో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 82 పరుగులకు చేరింది. కివీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు.ఎంతో నమ్ముకున్న స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి కూడా పేలవంగా బౌలింగ్ చేయడంతో కంగారూలకు ఎదురు లేకుండా పోయింది. ఆసీస్ దూసుకుపోతున్న సమయంలో లక్ష్యానికి 66 పరుగుల దూరంలో వార్నర్‌ను బౌల్డ్ చేసి బౌల్ట్ కొంత ఆశలు రేపాడు. అయితే నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాక్సీ అండతో మరింత చెలరేగిన మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడిన మార్ష్ , మ్యాక్స్‌వెల్ 39 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సౌతీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని రివర్స్ స్వీప్‌తో మ్యాక్స్‌వెల్ బౌండరీకి తరలించడంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది. ఇది చాలా పెద్ద విజయం. టి20 ప్రపంచకప్ నెగ్గిన తొలి ఆసీస్ జట్టు మాదే కావడం గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌పై సాధించిన విజయం కీలక మలుపు. టీమ్ ప్రదర్శనతో పాటు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఈ గెలుపును అందించాయి. కొన్నాళ్ల క్రితం వార్నర్‌ను కొందరు లెక్కలోకి తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. నా దృష్టిలో జంపా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. –ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్ మేం సాధించిన స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ ఆసీస్ అద్భుతంగా ఆడి ఛేదించింది. ఈ రోజు మాకు కలిసి రాలేదు. అయితే మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం. –విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) స్టొయినిస్ (బి) జంపా 28; మిచెల్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 11; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 85; ఫిలిప్స్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 18; నీషమ్ (నాటౌట్) 13, సీఫెర్ట్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–28; 2–76; 3–144; 4–148. బౌలింగ్: స్టార్క్ 4–0–60–0; హాజల్‌వుడ్ 4–0–16–3; మ్యాక్స్‌వెల్ 3–0–28–0; కమిన్స్ 4–0–27–0; జంపా 4–0–26–1; మిచెల్ మార్‡్ష 1–0–11–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) బౌల్ట్ 53; ఫించ్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 5; మార్‡్ష (నాటౌట్) 77; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–15; 2–107. బౌలింగ్: బౌల్ట్ 4–0–18–2; సౌతీ 3.5–0–43–0; మిల్నే 4–0–30–0; సోధి 3–0–40–0; సాన్‌ట్నర్ 3–0–23–0; నీషమ్ 1–0–15–0. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ట్రోఫీతో వార్నర్, విలియమ్సన్ మ్యాక్స్‌వెల్‌తో మిచెల్ మార్ష్ సంబరం -
Shane Warne: ఆ జట్టే ప్రపంచకప్ విజేత.. కచ్చితంగా..
T20 World Cup 2021: They can win the WC - Shane Warne: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తుది దశకు చేరుకుంటోంది. నవంబరు 14న ఈ మెగా టోర్నీ విజేత ఎవరో తేలనుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్ గెలిచే క్రమంలో హోరాహోరీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ వరల్డ్‌కప్ విన్నర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్‌కు ట్రోఫీ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంతవరకు నిలకడైన ప్రదర్శన కనబరిచిన అత్యుత్తమ జట్టుకు టైటిల్ అందుకునే అర్హత ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని.. అందరూ ఫామ్‌లో ఉండటం శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. మాజీ సారథి స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతూ.. మార్ష్, స్టొయినిస్, మాక్స్వెల్ మెరుగ్గా రాణిస్తే తిరుగే ఉండదని వార్న్ అభిప్రాయపడ్డాడు. పూర్తి విశ్వాసంతో ఉన్నాం గ్రూపు-1లో ఉన్న ఆస్ట్రేలియా... ఐదింట నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్‌తో పాటు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక గ్రూపు-2 టాపర్ అయిన పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది. నవంబరు 11 దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టుకే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాల నేపథ్యంలో మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘టాస్ అంతగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను. అయితే, ఇక్కడ టాష్ గెలిచిన దాదాపు అన్ని జట్లు తొలుత బౌలింగ్ చేసేందుకే మొగ్గుచూపాయి. కానీ.. గత రెండు మ్యాచ్‌లలో మంచు అంతగా లేనట్లు అనిపించింది. నిజానికి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కచ్చితంగా భారీ స్కోరు నమోదు చేయగలగాలి. అదే విధంగా స్కోరును కాపాడుకోగలగాలి. మేము ఇప్పుడు సెమీ ఫైనల్లో ఉన్నాం. పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఏం జరుగుతుందో ఊహించడం కష్టం’’ అని పేర్కొన్నాడు. కాగా ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఇంతవరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్‌కప్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫన్నీ బౌలింగ్.. మిచెల్ మార్ష్ ఔట్‌తో ముగించాడు
Chris Gayle Signs Off T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం నవ్వులు పంచింది. దీనికి కారణం క్రిస్ గేల్. అతని రిటైర్మెంట్పై క్లారిటీ లేనప్పటికీ టి20 ప్రపంచకప్‌లో విండీస్ తరపున గేల్ ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే. అందుకు తగ్గట్లే గేల్ హావభావాలు ఉండడం విశేషం. ముందు బ్యాటింగ్‌కు సన్‌గ్లాసెస్ పెట్టుకొని రావడం.. ఆ తర్వాత ఔటై వెళ్తూ తన బ్యాట్‌ను పైకెత్తి ఫ్యాన్స్‌కు అభివాదం చేయడం కనిపించింది. చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్ ఇక బౌలింగ్‌లోనూ గేల్ తన వైవిధ్యతను చూపించాడు. ఆసీస్ విజయానికి దగ్గరైన వేళ విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను గేల్ చేత వేయించాడు. కనీసం క్యాప్ తీయకుండా గేల్ బౌలింగ్ చేయడం విశేషం. ఓవర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఆసీస్ బ్యాటర్స్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు కూడా ఫన్నీవేలో బ్యాటింగ్ కొనసాగించారు. ఇన్నింగ్స్ మూడో బంతికి వార్నర్‌ను అవుట్ చేసినంత పని చేశాడు. అయితే పూరన్ స్టంపింగ్ మిస్ చేయడంతో గేల్ వార్నర్ దగ్గరకు చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోయాడు. ఇక ఓవర్ ఆఖరి బంతికి గేల్ మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసి వికెట్‌ను ఖాతాలో వేసుకొని టి20 కెరీర్‌ను ముగించాడు. ప్రస్తుతం గేల్ చేష్టలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గేల్ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి. చదవండి: T20 WC 2021 AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం -
మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు
Mitchell Marsh Golden Duck.. టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఈరోజు(అక్టోబర్ 20) మిచెల్ మార్ష్ 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి అలాంటి మార్ష్‌కు తన పుట్టినరోజు నాడే టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయితే బాధ ఉండదా.. మీరే చెప్పండి. డేవిడ్ వార్నర్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన మార్ష్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని ఫ్లిక్ చేయగా.. అది వెళ్లి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. దీంతో మార్ష్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 4 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: T20 WC 2021 IND Vs AUS: అటు హార్దిక్.. ఇటు స్టోయినిస్.. ఇద్దరి పరిస్థితి ఒకటే -
మూడో స్థానం అంటే చాలా ఇష్టం.. అవకాశమొస్తే
Mitchel Marsh Comments On Batting At No. 3.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన బ్యాటింగ్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడోస్థానంలో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టమని.. అవకాశమిస్తే మాత్రం చెలరేగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి మార్ష్ ఇటీవలే వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ మూడోస్థానంలో వచ్చిన మార్ష్ 10 మ్యాచ్‌లాడి 375 పరుగులు చేశాడు. ఇక రాబోయే టి20 ప్రపంచకప్‌లో ఆసీస్ బ్యాటింగ్‌లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో మార్ష్ ప్రపంచకప్ సన్నాహాలపై ఇంటర్య్వూ చేసింది. చదవండి: టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? ''టి20 ప్రపంచకప్ ప్రిపరేషన్ బాగానే ఉంది. జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా. కానీ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే కొంచెం సౌకర్యంగా అనిపిస్తుంది. గత రెండు సిరీస్‌ల్లో ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ప్రదర్శన కనబరిచా. గత కొన్ని నెలలుగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నా.. రానున్న టి20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నా. స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమిలేవు. ఇక నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడానికి స్పిన్నర్ల బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. మార్కస్ స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు క్రీజులో ఉండి కొట్టే భారీషాట్లు నన్ను ఆకట్టుకుంటున్నాయి. క్రీజులోనే వెనక్కి జరిగి డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌లు కొట్టడం సూపర్‌గా అనిపిస్తుంది. ఇలాంటి షాట్స్ ఆడేందుకు నేనే ప్రయత్నిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 23న అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చదవండి: T20 World Cup: అతడితో కలిసి ఓపెనింగ్ చేయడం ఖాయం: పాక్ కెప్టెన్ -
గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తన ఇష్ట సఖి, చిరకాల ప్రేయసి గ్రెటా మాక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని పంచుకున్నాడు. ఓ బీచ్ పక్కన దిగినట్టుగా ఉన్న ఈ ఫొటోలో గ్రెటా తన నిశ్చితార్థం ఉంగారాన్ని చూపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన వెంటనే అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. కాగా, మార్ష్‌కు ఈ సీజన్ వ్యక్తిగతంగా, క్రికెట్ పరంగా బాగా కలిసొచ్చింది. కొద్ది రోజుల కిందట విండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అతను సూపర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మూడు హాఫ్ సెంచరీలు సహా పలు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 1-4తో కోల్పోయినటప్పటికీ.. మార్ష ప్రదర్శన ఆసీస్ సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. కాగా, యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. చదవండి: 'వాతి కమింగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శ్రేయస్ అయ్యర్.. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్
హైదరాబాద్: ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ జట్టు రాయ్‌ను ఎంచుకుంది. 2020 ఐపీఎల్ ఆడని రాయ్‌కు రైజర్స్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లను చెల్లిస్తుంది. ఇటీవల భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాయ్ 5 మ్యాచ్‌లలో 132.11 స్ట్రయిక్‌రేట్‌తో 144 పరుగులు...3 వన్డేల్లో 123.65 స్ట్రయిక్‌రేట్‌తో 115 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. -
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్..లీగ్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఊహించని ఈ పరిణామంతో జట్టు యాజమాన్యంతో సహా సన్‌రైజర్స్ అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి తెలియజేశాడని సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 వేలంలో సన్‌రైజర్స్ అతన్ని కనీస ధర రూ.2 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. కాగా, మిచెల్ మార్ష్ స్థానంలో ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌ని తీసుకునేందుకు సన్‌రైజర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాయ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో వేళంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ వార్నర్ త్వరలో జట్టుతో కలువనుండగా, స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రాకపై ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్ -
అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించాడు
సాక్షి, సిడ్నీ: మైదానంలో క్రికెటర్లు ఆవేశానికి లోనై సహనాన్ని కోల్పోవడం, ఆతరువాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తరుచూ గమనిస్తూ ఉంటాం. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే పునరావృతమయ్యింది. పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ అంపైర్ నిర్ణయంపై విస్మయానికి గురై క్షణికావేశంలో పరుష పదాజాలాన్ని వాడి, దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో(13 వ ఓవర్ 5వ బంతి) సిడ్నీ బౌలర్ స్టీవ్ ఓ కీఫ్ వేసిన బంతి మిచెల్ మార్ష్ బ్యాట్‌కు తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిందని భావించిన అంపైర్.. మార్ష్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన మార్ష్.. ఆవేశంలో దురుసుగా ప్రవర్తించి 5000 డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా కోడ్ ఆఫ్ కాండక్ట్, లెవెల్-2 నేరం కింద ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌కు జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ బాబ్ స్ట్రాట్ఫోర్డ్ వెల్లడించారు. కాగా, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు పెర్త్ స్కార్చర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ 167 పరుగులు సాధించగా, సిడ్నీ జట్టు మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు జోష్ ఫిలిప్(45), జేమ్స్ విన్స్ (53 బంతుల్లో 98 నాటౌట్) అద్భుతంగా ఆడి తమ జట్టుకు విజయాన్నందించారు. -
కేన్ విలియమ్సన్ అందుకే ఆడలేదా..
దుబాయ్ : 2018, 2019లో డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా పనిచేసిన కేన్ విలియమ్సన్ ఆ రెండు సీజన్లలో తన ఆటతో పాటు కెప్టెన్సీలోనూ ఆకట్టుకున్నాడు. విలియమ్సన్ 2018లో సన్‌రైజర్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చినా చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా విలిమయ్సన్ 2018లో మొత్తం 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్‌కు వచ్చేసరికి సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌పై మరోసారి నమ్మకం ఉంచి అతన్ని తిరిగి కెప్టెన్‌గా నియమించింది. కేన్ విలియమ్సన్ ఆటగాడిగా మంచి రికార్డు ఉండడంతో జట్టులో తుది స్థానం తప్పకుండా ఉంటుందని అందరూ భావించారు. అయితే నిన్న(సోమవారం) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ ఆడకపోవడంపై పలు సందేహాలు రేకెత్తాయి. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఆడాలనే నిబంధన ఉండడం దీనికి కారణమై ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విలియమ్సన్ ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. (చదవండి : 'ఆర్చర్ రెడీగా ఉండు .. తేల్చుకుందాం') 'మ్యాచ్‌కు ముందురోజు మహ్మద్ నబీతో కలిసి ప్రాక్టీస్ చేస్తుండగా కేన్ విలియమ్సన్కు కండరాలు పట్టేశాయి. దాంతో చివరి నిమిషంలో ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌కు అతను దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మిచెల్ మార్ష్‌కు అవకాశం లభించింది. అయితే అనూహ్యంగా మార్ష్ కూడా గాయపడడం మాకు కష్టంగా మారింది. మార్ష్ తన నొప్పిని భరిస్తూనే మ్యాచ్ గెలిపించాలనే ఉద్దేశంతో 10వ నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎక్స్‌రే రిపోర్ట్‌లో మార్ష్ గాయం మరీ పెద్దది కాదని తేలింది. కానీ కుడికాలు చీలమండ గాయంతో అతని పాదాన్ని సరిగా నిలుపలేకపోతున్నాడు .. దీంతో టోర్నికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మేం ఒత్తిడికి తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగుతాం అంటూ తెలిపాడు. కాగా కేన్ విలియమ్సన్ సెప్టెంబర్ 26న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.(చదవండి : 'చహల్ కీలకమని ముందే అనుకున్నాం')