
మిచెల్ మార్ష్ కూడా...
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగగా... వీరిద్దరి సరసన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా చేరాడు. పక్కటెముకల గాయంతో మార్ష్ ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.