du plessis
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
Viral Video: ఆహా.. ఏమా మాయాజాలం, కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్సీ క్లీన్ బౌల్డ్
IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు. Varun Chakravarthy was absolutely unplayable in that spell! 3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS — Prasenjit Dey (@CricPrasen) April 6, 2023 ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
వేలంలో తగ్గేదేలే.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు చెన్నై సూపర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. రానున్న వేలంలో సీఎస్కే.. డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంకు ముందు డు ప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. “వేలంలో మా వ్యూహాన్ని బయటకు చెప్పడం సరైనది కాదు, అయితే సీఎస్కేకు ఎక్కువ కాలం సేవలందించిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము టార్గెట్ చేసుకున్న పేర్లును నేను బయటకు వెల్లడించాలి అనుకోవడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలు అందిచారు. అయితే రీటెన్షన్ నిబంధనల కారణంగా మేము వదులుకోవాల్సి వచ్చింది" అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సీఎస్కే వేలానికి ముందు రవీంద్ర జడేజా,మొయిన్ అలీ,ఎంస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్‌లను రీటైన్ చేసుకుంది. చదవండి: 6 సిక్స్‌లు, 2ఫోర్లు.. కేవలం 19 బంతుల్లోనే.. బౌలర్లకు చక్కలు! -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్‌లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్‌తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్‌లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్‌లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్‌ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్‌కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్‌కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్‌తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్‌కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్‌కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్‌కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్‌లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్‌కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్‌ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్‌ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్‌కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్‌వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్‌వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్‌మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్‌లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్‌లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్‌లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్‌లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్‌కు పగ్గాలు..? -
ఈ ఏడాది ఐపీఎల్లో వీరి మెరుపులు లేనట్టేనా..?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా క్వింటన్ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్‌లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్‌ల్లో 140.5 స్ట్రెక్‌రేట్‌తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. -
డుప్లెసిస్ 199.. శ్రీలంక 180
సెంచూరియన్: శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 180 కుప్పకూల్చి ఇన్నింగ్స్ విజయాన్ని సఫారీలు నమోదు చేశారు. 65/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులు మరో 115 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను చేజార్చుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దెబ్బకు లంకేయులు చేతులెత్తేశారు. కుశల్ పెరీరా(64), వానిందు హసరంగా( 59)లు మినహా మిగతా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు. లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్తేలు లంకను ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో ఆ జట్టు ఇక తేరుకోలేకపోయింది. లంకేయులు తమ ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 621 పరుగులు చేసింది. ఇక్కడ డుప్లెసిస్ పరుగు తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. డుప్లెసిస్ 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఫలితంగా టెస్టుల్లో 199 పరుగుల వద్ద ఔటైన 11వ బ్యాట్స్‌మన్‌గా డుప్లెసిస్ నిలిచాడు. కాగా, డుప్లెసిస్ తొలి ఇన్నింగ్స్‌లో కొట్టిన పరుగుల కంటే శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు నమోదు చేయడం గమనార్హం. డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. (రహానే ఖాతాలో స్పెషల్ మెడల్.. దాని ప్రత్యేకత ఏమిటి?) -
బౌండరీ లైన్‌పై ఇదేమి ‘మాయ’ డుప్లెసిస్
దుబాయ్: ఈ ఐపీఎల్లో సీఎస్కే ఆటగాడు డుప్లెసిస్ మాయచేస్తున్నాడు. అరే ఇది సిక్స్ అనుకునేలోపే దాన్ని బౌండరీ లైన్‌పై ఎగిరేసి అమాంత క్యాచ్ పట్టేసి ఔరా అనిపిస్తున్నాడు. క్యాచ్ పట్టే క్రమంలో నియంత్రణ చేసుకోవడానికి బౌండరీ లైన్ దాటేసినా బంతిపై ఏకాగ్రత మాత్రం కోల్పోవడం లేదు. బంతిని అలా బౌండరీ లైన్ బయటకు గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి క్యాచ్‌లను అందుకునే తీరు శభాష్ అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో సౌరవ్ తివారీ, హార్దిక్ పాండ్యాలను ఇలాగే మింగేసిన డుప్లెసిస్.. తాజాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కీలకమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టేసుకున్నాడు. సీఎస్కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి వార్నర్ భారీ షాట్ కొట్టాడు. ఇది సిక్స్ అనుకున్నారంతా. కానీ అక్కడ డుప్లెసిస్ ఉన్నాడు. అంతే అమాంతం గాల్లోకి ఎగిరి ముందు క్యాచ్ అందుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్‌ను దాటేస్తూ బంతిని బయటకు విసిరాడు. మళ్లీ వచ్చీ తీరిగ్గా క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు పట్టడానికి అంతా ఆపసోపాలు పడుతూ ఉంటే డుప్లెసిస్ మాత్రం ఇట్టే వాటిని అందుకుంటున్నాడు. బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు పట్టడం ఇంత ఈజీని అని అనుకునేలా మైమరిస్తున్నాడు.వార్నర్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ 69 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై అదే స్కోరు విలియమ్సన్(9)ని అంబటి రాయుడు రనౌట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. -
ఐసీసీ.. ఇది ఎలా సాధ్యం?
కేప్‌టౌన్: ఏ ఒక్కరూ బంతిపై సలైవా(లాలాజలాన్ని)ను రుద్దు కూడదనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మార్గదర్శకాలపై మళ్లీ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ ప్రతిపాదన తర్వాత పలువురు క్రికెటర్లు దీన్ని తప్పుపట్టగా, దాన్ని పాటించాలనే కచ్చితమైన గైడ్‌లైన్స్ తర్వాత కూడా అదే తరహా నిరసన వ్యక్తమవుతుంది. ఈ నిబంధనను ప్రవేశ పెట్టినంత సులువుగా అమలు చేయడం సాధ్యపడదని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో రాత్రికే రాత్రే ఇందులో మార్పులు ఆశించడం తగదన్నాడు ఎప్పుట్నుంచో అలవాటుగా వస్తున్న దీన్ని ఆకస్మికంగా నిషేధం విధించడం చెప్పినంత తేలిక కాదనే విషయాన్ని ఐసీసీ తెలుసుకోవాలన్నాడు. మనం బంతిని పట్టుకున్న వెంటనే వేళ్లను నోటితో తడిచేసుకుని రుద్దడం ఎప్పుట్నుంచో వస్తుందని, దీన్ని వదిలేయాలంటే క్రికెటర్లు కత్తిమీద సాము చేసినట్లేనన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ఇక డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఒక బౌలర్ల విషయంలోనే కాకుండా, ఫీల్డర్లు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నాడు. తాను బంతిని స్లిప్‌లో అందుకున్న వెంటనే నోటితో వేళ్లను తడిచేసుకుని రుద్దుతూ ఉంటానన్నాడు. అది తనకు అలవాటుగా మారిపోయిందన్నాడు. గతంలో రికీ పాంటింగ్ కూడా ఇలానే చేసేవాడనే విషయాన్ని ప్రస్తావించాడు. అది అనుకోకుండా జరిగిపోయే చర్య అని, దీన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఈజీ కాదన్నాడు. కాగా, కరోనా వైరస్ సంక్షోభంతో భౌతిక దూరం అనే నిబంధనను మనం ఇప్పుడు చూస్తున్నాం. దాంతోపాటు పెద్ద ఎత్తున మాస్క్‌లు ధరించడం కూడా నిబంధనల్లో భాగమైపోయింది. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి నోటి ద్వారానే ఎక్కువ శాతం సోకే అవకాశం ఉండటంతో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది. క్రికెట్ గేమ్‌లో భాగమై పోయిన బంతిపై సలైవా రుద్దడాన్ని ఉన్నపళంగా నిలిపివేసింది. దాంతో క్రికెటర్లకు ఇది పెద్ద సవాల్‌గా మారిపోయింది. (నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు) -
‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’
కేప్‌టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ కావడానికి ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అనుసరించిన విధానాలే కారణమని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. తమ వ్యూహాలకు అండగా ఉండే అంతర్జాతీయ కెప్టెన్లను తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు విజయం కోసం తెగించి ఆడేవాళ్లను ఎంచుకోవడమే ధోని సక్సెస్ సూత్రమన్నాడు. సీఎస్కే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుప్లెసిస్ పలు విషయాల్ని వెల్లడించాడు. ‘నాతో పాటు బ్రెండన్ మెకల్లమ్, బ్రేవోలాంటి అంతర్జాతీయ కెప్టెన్లను లక్ష్యంగా పెట్టుకుని చెన్నై టీమ్‌ను ఎంచుకుంది. ధోనీ, రైనా ఎలాగూ ఉంటారు. ఈ ఇద్దరు క్రికెట్ గురించి చాలా ఆలోచిస్తారు. అంతేకాకుండా జట్టులో చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ల అనుభవం, ఆలోచన జట్టుకు ఉపయోగపడుతుంది. చాలా మ్యాచ్‌ల్లో అది నిరూపితమైంది. ఇందులో ధోనితో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర కూడా చాలా ఉంది. వీరిద్దరూ కలిసి సీఎస్కేను బలమైన జట్టుగా తీర్చిదిద్దారు. చెన్నై జట్టులో అద్భుత ఫీల్డర్లు కూడా ఉన్నారని ఈ సఫారీ బ్యాట్స్‌మన్ తెలిపాడు. అందులో జడేజా సూపర్బ్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. తన ఫీల్డింగ్‌తో సుమారు 20 నుంచి 30 పరుగులను జడేజా ఆపుతాడని దీనివల్ల బౌలర్లలో ఉత్సాహం వస్తుందన్నాడు తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో చెన్నై జట్టుతో ఎన్నో మధుర క్షణాలున్నాయని డుప్లెసిస్ తెలిపాడు. సురేశ్ రైనా విసిరిన ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ చాలెంజ్‌లో భాగంగా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. గతేడాది ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోని (84 నాటైట్) విధ్వంసకర ఇన్నింగ్స్, 2013లో రైనా చేసిన సెంచరీ, 2018లో బ్రేవో అందించిన అనూహ్య విజయం, గత రెండు సీజన్ల ఫైనల్లో షేన్ వాట్సన్ చేసిన పోరాటాలు ఫేవరెట్ మూమెంట్స్గా డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
విసిరేసి పడిపోతే.. పడిపోయి పట్టేశాడు..!
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో ఆసీస్ గెలిస్తే, అందుకు సఫారీలు ఘనంగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా, ఆసీస్‌ను 146 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్-డేవిడ్ మిల్లర్లు పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. లక్ష్య ఛేదనలో భాగంగా లుంగి ఎన్గిడి వేసిన 18 ఓవర్ ఐదో బంతిని ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్ట్రైట్‌గా సిక్స్ కొట్టే యత్నం చేశాడు. అయితే ఆ క్యాచ్ కోసం బౌండరీ లైన్ వద్దకు డుప్లెసిస్-మిల్లర్లు ఇద్దరూ పరుగెత్తుకొచ్చారు. ముందుగా డుప్లెసిస్ క్యాచ్‌ను పట్టేసి బౌండరీ లైన్ లోపల పడే సమయంలో బంతిని గ్రౌండ్‌లోపలికి వేగంగా విసిరేయగా, దాన్ని మిల్లర్ వృథా కానివ్వ లేదు. ఆ బంతిని ఎంతో చాకచాక్యంతో పట్టేసుకుని గ్రౌండ్లో పడిపోయాడు. క్యాచ్‌ను పట్టే క్రమంలో ఇలా ఒకరు బంతిని విసిరేసి పడిపోతే, మరొకరు పడిపోయి మరీ ఒడిసి పట్టుకోవడం సఫారీల చురుకైన ఫీల్డింగ్‌కు అద్దం పడుతోంది. ఇదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. మిచెల్ మార్ష్ ఔటయ్యే సమయానికి ఆసీస్ 138 పరుగులతో ఉంది. ఆ తర్వాత మాథ్యూ వేడ్(1), ఆస్టన్ ఆగర్(1)లు నిరాశపరచడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. డేవిడ్ వార్నర్(67 నాటౌట్) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 17 పరుగులు కావాల్సి న తరుణంలో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది.సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. (ఇక్కడ చదవండి: సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం) Wowee! What a catch! #SAvAUS pic.twitter.com/3UPDKpNZuU — Trishan Naidoo (@trishannai) February 23, 2020 -
డుప్లెసిస్ సంచలన నిర్ణయం
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ క్రికెట్ దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న డుప్లెసిస్ ఉన్నపళంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను ఆటగాడిగా అందుబాటులో ఉంటానని డుప్లెసిస్ తన ప్రకటనలో వెల్లడించాడు. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ముందుకు వెళుతుందని ఆశించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికాకు నూతన సారథ్యం అవసరం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంతకాలం దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు డుప్లెసిస్ తెలిపాడు. (ఇక్కడ చదవండి: ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్) టీ20 వరల్డ్‌కప్ తర్వాత తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని ఇటీవల తెలిపిన డుప్లెసిస్.. దానిలో భాగంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి ముందుగా గుడ్ బై చెప్పడం గమనార్హం. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు, టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో సఫారీ కెప్టెన్సీ పగ్గాలను డీకాక్ తీసుకున్నాడు. డీకాక్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను కోల్పోయినా ఆశించిన స్థాయిలో రాణించింది. కెప్టెన్సీ పగ్గాలను మోస్తూనే డీకాక్ తన బ్యాటింగ్ జోరుతో ఆకట్టుకున్నాడు. తన వారసుడిగా డీకాక్ సరైనడివాడని భావిస్తున్న డుప్లెసిస్.. అందుకు ఇదే తగిన సమయం అని భావించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. డుప్లెసిస్ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్లో ‘బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసింది. (ఇక్కడ చదవండి: మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్ దరహాసం) గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో డుప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఘోరంగా చతికిలబడింది. ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1తో డుప్లెసిస్ సారథ్యంలోని సఫారీ జట్టు కోల్పోయింది. మరొకవైపు డుప్లెసిస్ సైతం పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 14 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో డుప్లెసిస్ యావరేజ్ 20.92గా ఉంది. దాంతో డుప్లెసిస్ కెప్టెన్సీపై విమర్శలు రాకముందే అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ఒత్తిడి తగ్గించుకున్నాడు. It has been the greatest honour of my life to lead my country. Read my full statement here: https://t.co/QVRrvQGLmO pic.twitter.com/d5qH9pQJ9d — Faf Du Plessis (@faf1307) February 17, 2020 BREAKING! Faf du Plessis has announced he is stepping down as South Africa captain from all formats! pic.twitter.com/ukBYGgduiX — ICC (@ICC) February 17, 2020 -
ఏబీ టైమ్ లేదు.. తొందరగా వచ్చేయ్!
కేప్‌టౌన్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఆ దేశ క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా ఇటీవల ఎంపికైన మార్క్ బౌచర్ .. డివిలియర్స్ పునః రాగమనం కోసం తన చర్చలను వేగవంతంగా చేశారు. ఆ క్రమంలోనే జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌తో ముందుగా చర్చించగా అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది. దీనిలో భాగంగా తన సహచర క్రికెటర్ ఏబీతో చర్చలు ఆరంభించినట్లు డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్ టీ20కి ఎంతో సమయం లేనందున డివిలియర్స్ ఎంత తొందరగా జట్టుతో కలిస్తే అంత బాగుంటుందన్నాడు. ఈ విషయంపై రెండు-మూడు నెలల క్రితమే చర్చించినా బౌచర్ కొత్త కోచ్‌గా వచ్చిన తర్వాత ఏబీ రాకపై కామెంట్ చేయడంతో దానిపై డుప్లెసిస్ స్పందించాడు. ‘ టెస్టు క్రికెట్ అనేది ప్రస్తుతం మాకు చాలా ముఖ్యమైనది. కానీ టీ20 క్రికెట్ అనేది చాలా భిన్నమైనది. ఏబీ రాకతో మా జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఏబీ వస్తానంటే సాదరంగా స్వాగతిస్తాం. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంతో సమయం లేదు. అదే సమయంలో మా రోడ్ మ్యాప్ కూడా చాలా బిజిగా ఉంది. ప్రత్యేకంగా ఈ సీజన్ టీ20 షెడ్యూల్ ఎక్కువగా ఉంది. డివిలియర్స్ తొందరగా జట్టులో కలిస్తే అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు’ అని డుప్లెసిస్ తెలిపాడు.ప్రస్తుతం సఫారీ క్రికెట్ సంధి దశలో ఉన్నందున దాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు కోచ్ బౌచర్, కెప్టెన్ డుప్లెసిస్‌లు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లిసిస్‌తో పాటు హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది. -
ఆదిలోనే సఫారీలకు షాక్
రాంచీ: టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1) విఫలమయ్యాడు. ఓవర్‌నైట్ ఆటగాడిగా సోమవారం తన ఇన్నింగ్స్ ఆరంభించిన డుప్లెసిస్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఈ రోజు ఆటలో ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. డుప్లెసిస్ నిన్నటి ఆటతో కలుపుకుని తొమ్మిది బంతులు ఆడగా పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సఫారీలు 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి డుప్లెసిస్-హమ్జాలు బ్యాటింగ్‌కు దిగారు. కాగా, ఈ రోజు ఆటలో ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్ ఎదుర్కొన్నాడు. కాకపోతే ఉమేశ్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 438 పరుగుల వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో డీన్ ఎల్గర్(0), డీకాక్(4)లు పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కోల్పోయిన మూడు వికెట్లలో ఉమేశ్‌కు రెండు వికెట్లు లభించగా, షమీకి వికెట్ దక్కింది. (ఇక్కడ చదవండి:టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉమేశ్ ఫాస్టెస్ట్ రికార్డులు) -
హాఫ్ సెంచరీలతో గాడిలో పెట్టారు!
విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా తేరుకుంది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఓపెనర్ డీన్ ఎల్గర్ నిలబెట్టాడు. ఎల్గర్ సుదీర్ఘం క్రీజ్‌లో పాతుకుపోయి హాఫ్ సెంచరీతో మెరిశాడు. శుక్రవారం మూడో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు శ్రమించినా ఎల్గర్ వికెట్ ఇవ్వలేదు. బావుమా(18)ను తొందరగా పెవిలియన్‌కు పంపినప్పటికీ ఎల్గర్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతనికి జతగా సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అర్థ శతకం సాధించాడు. దాంతో దక్షిణాఫ్రికా గాడిలో పడింది. 39/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా వికెట్‌ను చేజార్చుకుంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బావుమా ఎల్బీగా ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్‌ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ముందుగా ఎల్గర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లంచ్ తర్వాత డుప్లెసిస్ సైతం అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. -
సాగర తీరంలో సమరానికి సైరా...
ఒకవైపు వరుస విజయాలతో సిరీస్‌ల మీద సిరీస్‌లు కొడుతూ దూసుకుపోతున్న జట్టు... మరోవైపు సీనియర్లు తప్పుకోవడం నుంచి జట్టు ఎంపికలో రాజకీయాలు చేరడం వరకు గందరగోళ స్థితిలో మరో జట్టు... అసాధారణ నాయకత్వంతో, రికార్డులతో, ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపిస్తున్న కోహ్లి ఒకవైపు, వరల్డ్ కప్ తర్వాతే వేటు తప్పదనుకున్నా మరో దిక్కు లేక కొనసాగుతున్న సారథి డు ప్లెసిస్ మరోవైపు... వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ బుమ్రా లేకపోయినా అసలు అలాంటి విషయం గుర్తుకే రాని స్థితిలో అతి బలంగా కనిపిస్తున్న టీమిండియా సొంతగడ్డపై మరో సిరీస్‌పై గురి పెట్టగా... గతంలో ఐదుసార్లు ఇక్కడ పర్యటించిన సఫారీలతో పోలిస్తే అతి బలహీనంగా ఉన్న బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు సాగర నగరం విశాఖపట్నం వేదికైంది. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడిన గత టెస్టు సిరీస్‌లో భారత్ 3–0తో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సొంతగడ్డపై డు ప్లెసిస్ ఇదే తరహాలో తాము దెబ్బ తీస్తామంటూ వ్యాఖ్యలు చేసినా చివరకు సఫారీలకు చచ్చీ చెడి 2–1తో సిరీస్ విజయం దక్కింది. భారత బౌలింగ్ బలాన్ని తక్కువగా అంచనా వేసి పేస్ పిచ్‌లను సిద్ధం చేయడం, దానిని మన బౌలర్లు వాడుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రెండు జట్లు టెస్టుల్లో ముఖాముఖీ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత స్థితిలో భారత్‌ను నిలువరించడం దక్షిణాఫ్రికాకు దాదాపు అసాధ్యమే. రోహిత్ రాణించేనా... సెహా్వగ్, రవిశాస్త్రి, జయసూర్య, దిల్షాన్... మిడిలార్డర్ బ్యాట్స్మెన్లుగా ఆడి ఆ తర్వాత ఓపెనర్లుగా మారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లలో కొందరు. ఇప్పుడు రోహిత్ శర్మ నుంచి కూడా భారత్ ఇదే ఆశిస్తోంది. తన కెరీర్ 28వ టెస్టులో తొలిసారి ఓపెనర్‌గా ఆడబోతున్న రోహిత్.... రబడ, ఫిలాండర్ వేసే మెరుపు ఎరుపు బంతులను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌటైనా దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సెహా్వగ్ శైలిలో తొలి బంతి నుంచే విరుచుకుపడే ఆటనూ చూపిస్తాడా లేక రెగ్యులర్ ఓపెనర్ల తరహాలో ఓపిగ్గా సుదీర్ఘ సమయం క్రీజ్‌లో గడిపేందుకు రోహిత్ ప్రయతి్నస్తాడా అనేది చూడాలి. ఈ స్థానంలో ఎక్కువ అవకాశాలు ఇస్తామంటూ కెపె్టన్ ధైర్యం చెప్పడం రోహిత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ ఖాయం కాబట్టి శుబ్‌మన్ గిల్ తొలి అవకాశం కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఇతర జట్టు కూర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పుజారా, కోహ్లి, రహానే తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్ భారీ స్కోరు సాధించడం, సఫారీ అవకాశాలకు దెబ్బ పడటం ఖాయంగా జరిగిపోతాయి. విండీస్‌లో సెంచరీ తర్వాత జోష్ మీదున్న తెలుగబ్బాయి హనుమ విహారి కూడా స్వదేశంలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. పైగా బౌలింగ్‌లో కూడా ఒక చేయి వేయగలడు. షమీ, ఇషాంత్ శర్మల రూపంలో ఇద్దరు పేసర్లున్నారు కాబట్టి ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కే పరిమితం. చాలా కాలం తర్వాత అశి్వన్, జడేజా ద్వయం సంయుక్తంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు సిద్ధమైంది. వీరిద్దరిని ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు కత్తి మీద సామే. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా కూడా విలువైన ఆటగాడైన సాహా రాక జట్టును మరింత పటిష్టపరచింది. మార్క్రమ్పై దృష్టి... భారత గడ్డపై 2015లో జరిగిన సిరీస్‌లో స్టార్లు ఆమ్లా, డివిలియర్స్‌లాంటి వాళ్లు స్పిన్‌ను సమర్థంగా ఆడటంలో ఇబ్బంది పడ్డారు. ఫలితంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు కనీస మాత్రం అనుభవం కూడా లేని బ్రూయిన్, బవుమా ఆ జట్టును ఏమాత్రం నిలబెడతారో చూడాలి. డు ప్లెసిస్ స్పిన్‌ను సమర్థంగా ఆడగలడు, పోరాడగలడు కానీ అతని ఇటీవలి ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ‘ఎ’ జట్టు తరఫున, ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా బాగా ఆడి భారత్‌లో పిచ్‌లకు కొంత అలవాటు పడిన మార్క్రమ్ ఈ సిరీస్‌లో కీలకం కావచ్చు. అతను గట్టిగా నిలబడితే జట్టుకు మేలు జరుగుతుంది. టెస్టుల్లో డి కాక్ చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ ఏమీ కాదు. ఆ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం ఖాయమైంది. ఫిలాండర్ బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి ఏడో స్థానంలో ఆడతాడు. జట్టులోని ఒకే ఒక స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌పై సఫారీలు ఆశలు పెట్టుకుంటున్నారు కానీ అభేద్యమైన టీమిండియా లైనప్‌ను ఛేదించడం అతని వల్ల అవుతుందా సందేహమే. వాతావరణం, పిచ్ తొలి టెస్టును వర్షం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి సోమవారం వరకు ఇక్కడ వర్షాలు కురిసినా... మ్యాచ్ ముందు రోజు తెరిపినిచ్చింది. ఒక్క చినుకు కూడా లేకపోగా, మంచి ఎండకాసింది. అయితే మళ్లీ మళ్లీ వాతావరణం మారుతూ వచ్చి ఒక్కసారిగా చల్లబడింది కూడా. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు అంతరాయం కలగడం ఖాయం. వికెట్ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలం. ఆ తర్వాత స్పిన్ ప్రభావం చూపించే సాధారణ భారతీయ పిచ్. జట్ల వివరాలు భారత్ తుది జట్టు: కోహ్లి (కెపె్టన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశి్వన్, జడేజా, ఇషాంత్, షమీ. దక్షిణాఫ్రికా (అంచనా): డు ప్లెసిస్ (కెపె్టన్), మార్క్రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ఇన్‌గిడి, పీట్. -
మన సమరం నేడే ఆరంభం
టోర్నీ ప్రారంభమై ఆరు రోజులైంది...అన్ని జట్లు మైదానంలో దిగాయి... ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు జరిగిపోయాయి... చిన్నాచితక సంచలనాలూ నమోదయ్యాయి... అయినా మన అభిమానుల్లో ఆ జోష్ లేదు... వారందరి నుంచి ఎదురవుతోంది ఒకటే ప్రశ్న......ఈసారి ప్రపంచ కప్‌లో ఊపు లేదెందుకని?...అంతా సాదాసీదాగా సాగుతుందేమని? దీనికి సమాధానం నేడే దొరకనుంది. వంద కోట్లమందిపైగా ఆశలను మోస్తూ... అంచనాలు నిలబెట్టుకుంటామని భరోసా ఇస్తూ... అదరగొట్టే ఆటతో కప్పు కొట్టుకొస్తామని ఊరిస్తూ... విశ్వ విజేతగా మువ్వన్నెలను రెపరెపలాడిస్తామంటూ... కోహ్లి సారథ్యంలోని భారత్ బరిలో దూకనుంది... మరిక...వినేవారికి వీనుల విందు కళ్లారా చూసేవారికి చూడ ముచ్చట టీవీల ముందు ప్రేక్షకులకు కన్నుల పండుగే! వీరాభిమానులకైతే మజా మజానే! ఇంకెందుకు ఆలస్యం...? ఆసాంతం ఆస్వాదిద్దాం... టీమిండియాకు శుభాభినందనలు చెబుదాం. సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ, మన వీరుల ప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఊహల్లో విహరిస్తూ, ఎవరెవరు అదరగొడతారని లెక్కలేసుకుంటూ వస్తున్న భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ కోసం టీమిండియా పోరాటం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ మైదానం వేదికగా విరాట్ కోహ్లి సేన తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్‌తో భారత్ బల ప్రదర్శనకు దిగనుండగా... పరాజయాలు, ఫామ్ లేమితో సఫారీల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వారికిది మూడో మ్యాచ్. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే కానీ కప్‌లో ముందుకెళ్లలేరు. మరోవైపు తుది కూర్పు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్న టీమిండియా తాజాగా ప్రయాణం ప్రారంభించనుంది. వారిలో ఎవరు? సౌతాంప్టన్‌లో మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుండటంతో భారత్ రెండో ప్రధాన పేసర్‌గా భువనేశ్వర్‌ను ఆడించే యోచనలో ఉంది. టోర్నీలో ఫ్లాట్ వికెట్లపై షార్ట్ పిచ్ బంతులు వేయగల భువనేశ్వర్‌లాంటి బౌలర్లు విజయవంతం అవుతున్నారు. దీంతో షమీ స్థానంలో అతడిని తీసుకునే వీలుంది. ముగ్గురు పేసర్లనూ తీసుకుంటారని వార్తలు వచ్చినా అందుకు పెద్దగా అవకాశం లేదు. రెండో స్పిన్నర్ స్థానం కోసం జడేజా, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఫిట్నెస్ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ మైదానంలో దిగడం ఖాయమైంది. స్పిన్ కూడా వేయగల అతడి చేరిక జట్టుకు బలాన్నిస్తుంది. ఐదో స్థానంలో ధోనినే రావొచ్చు. 6, 7లో జాదవ్, హార్దిక్ ఆడతారు. బ్యాట్ దూసే జడేజా, విలువైన పరుగులు చేయగల భువీని లెక్కలోకి తీసుకుంటే మొత్తం 9 మందితో లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తోంది. కష్టాల దక్షిణాఫ్రికా... గత మ్యాచ్ ప్రారంభంలోనే ఇన్‌గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్ స్టెయిన్ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్ బౌలర్లున్నారు. ఐదో బౌలర్ కోటాను మార్క్రమ్, డుమిని తదితరులతో భర్తీ చేయాల్సి వస్తోంది. వీరిలో రబడ మాత్రమే పక్కా పేసర్. మోరిస్, ఫెలుక్వాయోలకు ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగల సత్తా లేదు. బంగ్లాదేశ్ చేతిలో సఫారీల ఓటమికి సరైన బౌలింగ్ వనరులు లేకపోవడమూ ఓ కారణమైంది. వెటరన్ ఆమ్లా తిరిగి రావడం బ్యాటింగ్‌ను పటిష్ట పరుస్తోంది. ఈ జట్టులోనూ 9వ నంబరు స్థానం వరకు బ్యాటింగ్ చేయగల వారుండటం గమనార్హం. బౌలింగ్‌లో ఎలాగూ దమ్ము లేదు కాబట్టి... మొదట క్రీజులో దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదానం ఇలా... సౌతాంప్టన్ మైదానంలో చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 311. మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టే గెలిచింది. ఈ మ్యాచ్‌ల్లో పేసర్లు 6.4 ఎకానమీతో సగటున 58.4 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు 6 ఎకానమీతో సగటున 60.1 పరుగులు ఇచ్చారు. ముఖాముఖి రికార్డు ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. కమాన్ కోహ్లి... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లి మంచి ఇన్నింగ్సే ఆడాడు. కప్ కోసం సంసిద్ధమైనట్లు కనిపించాడు. ఎప్పటిలాగే అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా సిరీస్, తర్వాత ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోని కోహ్లి కప్‌లో రాణిస్తే.. లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ఓపెనర్లు విఫలమైనా పెద్దగా ఇబ్బంది రాదు. రాహుల్... రాహుల్... ఎంతో ఊగిసలాట మధ్య ఎట్టకేలకు నంబ ర్–4గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయమైంది. టీవీ షో వివాదం నుంచి తేరుకుని, ఐపీఎల్లో సత్తా చాటిన రాహుల్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ (108)తో తప్పక ఆడించే పరిస్థితి కల్పించాడు. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా వైఫల్యం, గాయం బెడద విజయ్ శంకర్‌ను పక్కనపెట్టేలా చేసింది. క్లాస్ బ్యాట్స్‌మన్ అయిన రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారత్ నిశ్చింతగా ఉండొచ్చు. పిచ్, వాతావరణం వర్షం కారణంగా క్రితం రోజంతా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. మంగళవారం వర్షం కారణంగా భారత నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలిగింది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరించే వీలుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే అయినా... చల్లని వాతావరణం మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు. శుభ సూచకం మొత్తమ్మీద వన్డే గణాంకాలు చూసినా, కప్‌లో వారిపై గెలుపోటములు చూసినా దక్షిణాఫ్రికా కఠిన ప్రత్యర్థే. సఫారీలపై విజయం అంత తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. అంతేకాక, వరుసగా పెద్ద జట్లతో ఆడాల్సిన పరిస్థితుల్లో... దక్షిణాఫ్రికాను తొలి మ్యాచ్‌లోనే ఎదుర్కొనడం సహజంగానే ఒత్తిడి, ఉత్కంఠ రేపుతుంది. కానీ, ఈసారి ప్రత్యర్థిని ముందే దెబ్బతీసి కాలం పరోక్షంగా మనకు మేలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటంతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకపోవడంతో దక్షిణా ఫ్రికా ఒకవిధంగా ఆత్మరక్షణలో పడింది. దీంతో మానసికంగా భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ ఆత్మ విశ్వాసంతో మైదానంలో రాణిస్తే టీమిండియాకు శుభారంభమే. ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్ ఆడబోతుండటం సంతోషంగా ఉంది. ఆలస్యంగా బరిలోకి దిగడం వల్ల మాకు కొంత మేలు జరిగిందనేది వాస్తవం. ఇతర జట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడుతున్నాయి, వాతావరణం ఎలా ఉంటోంది అనేవి పరిశీలించి, ప్రణాళికలు రూపొందించుకోవడానికి అవకాశం దక్కింది. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా మ్యాచ్ రోజున ఎలా ఆడతామనేదే ముఖ్యం. మా టీమ్ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగల సత్తా అందరిలో ఉంది. పిచ్‌ను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుంది. తొలిసారి ప్రపంచకప్‌లో దేశానికి నాయకత్వం వహిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. 2015లో టోర్నీ ఆడేటప్పుడు దీని గురించి అసలు ఏమాత్రం ఊహించలేదు. వేరే సిరీస్‌లతో పోలిస్తే ప్రపంచ కప్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ప్రత్యర్థి జట్టుకు గాయాల సమస్య ఉంది కాబట్టి వారిని బలహీనంగా భావించడం లేదు. మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం. మా బలాన్నే నమ్ముకున్నా. స్టెయిన్ నాకు మంచి మిత్రుడు కూడా కాబట్టి అతను టోర్నీకి దూరం కావడం బాధగా అనిపిస్తోంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి కొన్ని పాఠాలైతే నేర్చుకున్నాం. ఇంగ్లండ్‌లో పరిస్థితుల దృష్ట్యా తొలి పది ఓవర్లు ఎంతో కీలకం. గత రెండు ప్రపంచకప్‌ల తరహాలో తొలి మ్యాచ్‌లో నేను సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా జట్టు గెలుపు అన్నింటికంటే ముఖ్యం. – విరాట్ కోహ్లి, భారత్ కెప్టెన్ వరుసగా రెండు ఓటముల తర్వాత బాధ ఉండటం సహజమే. అయితే నాలాంటి సీనియర్లలో ఆత్మవిశ్వాసం లోపిస్తే తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న కొత్త కుర్రాళ్లు మానసికంగా మరింత బేలగా తయారవుతారు. తమపై తామే జాలి పడేలా వారిని వదిలేయలేం. బలమైన మాటలతో వారిలో విశ్వాసం నింపడం ముఖ్యం. లేదంటే జట్టు మొత్తం కుప్పకూలిపోతుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడతాం. కానీ ఫలితం మా చేతుల్లో లేదు. భారత్‌తో మ్యాచ్‌ను చావోరేవోగా భావించి ఆడమని మావాళ్లకు చెబుతున్నా. స్టెయిన్ తప్పుకోవడంతో ఇప్పుడు మాకు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అతను గాయాలతో బాధపడ్డాడు. కోలుకుంటున్న సమయంలో ఐపీఎల్లో ఆ రెండు మ్యాచ్‌లు ఆడకుండా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. –డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ తుది జట్లు (అంచనా) ►భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, జాదవ్, ధోని, హార్దిక్, జడేజా/చహల్, కుల్దీప్, భువనేశ్వర్/షమీ, బుమ్రా. ►దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్ (కెప్టెన్), డసెన్, మార్క్రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలుక్వాయో, తాహిర్, రబడ. -
దక్షిణాఫ్రికా ఢమాల్
ప్రపంచ కప్‌లలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి... వరుస విజయాల తర్వాత కీలక దశలో అదృష్టం మొహం చాటేస్తేనో లేక అనూహ్యంగా ఓటమి పాలై ‘చోకర్స్’గా ముద్రపడిన దక్షిణాఫ్రికా జట్టును ఇప్పటి వరకు చూశాం. మేం ’చోకర్స్’ కాదని నిరూపించుకుంటాం అని చెప్పిన సఫారీలు... టోర్నీ చివర్లో కాదు, ఆరంభం నుంచే ఓడిపోయి ఆ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది! మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన డు ప్లెసిస్ బృందం ఇప్పుడు బంగ్లాదేశ్ ముందు కూడా కుప్పకూలింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో బంగ్లాదేశ్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసేందుకు అవకాశమిచ్చి... ఆపైన పేలవ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించింది. జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ స్ఫూర్తిదాయక ఆటతీరుకనబర్చిన బంగ్లా పులులు అద్భుత విజయంతో టోర్నీని ఆరంభించారు. ప్రపంచ కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చి సవాల్‌కు సిద్ధమైనఆ జట్టు తమను ఇంకెవరూ బేబీలుగా చూడవద్దంటూ, తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. లండన్: వరుసగా సాగిన ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత వరల్డ్ కప్ ఒక ఆసక్తికర పోరుకు వేదికైంది. అయితే తుది ఫలితం మాత్రం అందరూ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. ఆదివారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (80 బంతుల్లో 78; 8 ఫోర్లు)... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’షకీబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... మహ్ముదుల్లా (33 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (30 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (53 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా... జేపీ డుమిని (37 బంతుల్లో 45; 4 ఫోర్లు), మార్క్రమ్ (56 బంతుల్లో 45; 4 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (38 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. 142 పరుగుల భాగస్వామ్యం... ఒక భారీ సెంచరీ పార్ట్నర్షిప్, మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల సహాయంతో బంగ్లాదేశ్ తమ అత్యుత్తమ వన్డే స్కోరును నమోదు చేయగలిగింది. ఓపెనర్లలో సర్కార్ దూకుడు ప్రదర్శించగా, తమీమ్ ఇక్బాల్ (16) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. తొలి ఐదు ఓవర్లను జాగ్రత్తగా ఆడిన బంగ్లా 14 పరుగులే చేసింది. అయితే ఇన్‌గిడి వేసిన ఆరో ఓవర్లో సర్కార్ మూడు ఫోర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. ఇన్‌గిడి తర్వాతి ఓవర్లో కూడా బంగ్లా మరో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్ వేయగానే ఇన్‌గిడి కండరాల గాయంతో మైదానం వీడటంతో దక్షిణాఫ్రికా తమ ప్రధాన పేసర్ సేవలు కోల్పోయింది. అనంతరం తమీమ్‌ను ఔట్ చేసి ఫెలుక్వాయో 60 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయగా, తొలి పవర్‌ప్లేలో బంగ్లా 65 పరుగులు చేయగలిగింది. మోరిస్ తన తొలి ఓవర్లోనే జట్టుకు వికెట్ అందించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన సర్కార్...డి కాక్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత షకీబ్, ముష్ఫికర్ మూడో వికెట్ భాగస్వామ్యం బంగ్లా భారీ స్కోరుకు బాటలు వేసింది. భారీ షాట్లు ఆడే సాహసం చేయకుండా వీరిద్దరు చక్కటి సమన్వయంతో, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా షకీబ్ 54 బంతుల్లో, ఆ తర్వాత ముష్ఫికర్ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి దక్షిణాఫ్రికా జట్టులో తీవ్ర అసహనం రేపుతున్న దశలో ఎట్టకేలకు ‘ట్రంప్ కార్డ్’తాహిర్ ఈ జంటను విడదీశాడు. తాహిర్ వేసిన చక్కటి బంతికి షకీబ్ క్లీన్‌బౌల్డయ్యాడు. పార్ట్‌టైమర్ మార్క్రమ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన మిథున్ (21)ను కూడా తాహిరే బౌల్డ్ చేయగా...కొద్ది సేపటికే ముష్ఫికర్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో బంగ్లా స్కోరు 250 పరుగులు. తర్వాతి 7.5 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 80 పరుగులు సాధించడం విశేషం. కెప్టెన్ అర్ధ సెంచరీ.... భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపించింది. గత మ్యాచ్‌లో తలకు బంతి తగిలిన ఆమ్లా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మార్క్రమ్, డి కాక్ (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించినా వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోయారు. మార్క్రమ్ను సునాయాసంగా రనౌట్ చేయడంలో విఫలమైన బంగ్లా... కొద్ది సేపటికి డి కాక్‌ను రనౌట్‌గా వెనక్కి పంపించింది. మెహదీ బౌలింగ్‌లో డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ ముష్ఫికర్ వదిలేయగా, బ్యాట్స్‌మన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే వేగంగా వెనక్కి వెళ్లి బంతిని అందుకున్న ముష్ఫికర్ నేరుగా వికెట్లపైకి కొట్టడంతో డి కాక్ ఔటయ్యాడు. వరుస బౌండరీలతో కెప్టెన్ డు ప్లెసిస్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేయగా... మరో ఎండ్‌లో మార్క్రమ్ను బౌల్డ్ చేసి షకీబ్ తన కెరీర్లో 250వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ప్లెసిస్... మెహదీ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి బౌల్డ్ కావడంతో సఫారీ జట్టులో ఆందోళన పెరిగింది. 16 పరుగుల వద్ద సర్కార్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన డేవిడ్ మిల్లర్ (43 బంతుల్లో 38; 2 ఫోర్లు) తన స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించి వెనుదిరిగాడు. ముస్తఫిజుర్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన డసెన్‌ను సైఫుద్దీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా శిబిరంలో విజయానందం కనిపించింది. చివర్లో డుమిని కొన్ని చక్కటి షాట్లతో పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. గెలుపు తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎలాంటి అతి సంబరాలకు పోకుండా ప్రశాంతంగా కనిపించడం ఆ జట్టు ఆలోచనల్లో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. ►5 షకీబ్ అల్ హసన్ వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 5 వేల పరుగులు చేయడంతో పాటు 250 వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా (జయసూర్య, ఆఫ్రిది, కలిస్, రజాక్ తర్వాత) షకీబ్ నిలిచాడు. అందరికంటే తక్కువ వన్డేల్లో (199) అతను ఈ ఘనత సాధించడం విశేషం. ►330బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్తాన్‌పై చేసిన 329 పరుగుల రికార్డును ఆ జట్టు అధిగమించింది. ►100దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 100 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటికి 166 వికెట్లు పడగొట్టాడు. ►2 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై బంగ్లాకు ఇది రెండో విజయం. గతంలో 2007 ప్రపంచ కప్‌లోనూ ఆ జట్టు గెలిచింది. -
మాకు బౌలింగే కావాలి...
ఈ ప్రపంచ కప్‌లో టాస్ గెలిచిన కెప్టెన్లు తడుముకోకుండా చెబుతున్న ఒకే ఒక్క మాట... ‘మేం ముందుగా బౌలింగ్ చేయదల్చుకున్నాం’ అని. టాస్ ఓడిన కెప్టెన్ సైతం తమ ఉద్దేశం తొలుత బౌలింగ్ చేయాలన్నదే అని అంటుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. పిచ్‌పై మొదట్లో కనిపిస్తున్న కాసింత పచ్చిక అనుకోని వరంలా వారిని ఊరిస్తుండటమే దీనికి కారణం. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా... చిన్న జట్టయిన అఫ్గానిస్తాన్ మినహా మిగతా మూడు పెద్ద జట్లు తొలుత బౌలింగ్‌కే మొగ్గుచూపాయి. పచ్చికపై పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టాయి. ఆసీస్‌పై ముందు బ్యాటింగ్‌కు దిగి అఫ్గాన్ తొలుతే రెండు వికెట్లు కోల్పొయింది. వెస్టిండీస్, న్యూజిలాండ్ సరిగ్గా ఇలానే ఫలితాన్ని పొందాయి. ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సైతం తొలుత కొంత లాభపడినా... సొంతగడ్డ అనుకూలతతో ఇంగ్లండ్ వెంటనే పుంజుకొంది. ముఖ్యంగా తొలి గంట పిచ్ నుంచి పేసర్లకు మంచి మద్దతు దొరుకుతోంది. దీంతో పేస్‌ను ఆడటంలో బలహీనులైన పాకిస్తాన్, శ్రీలంక బ్యాట్స్‌మెన్ వికెట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కనీసం పది ఓవర్లు నిలిస్తేనే ఏ జట్టయినా మంచి స్కోరు చేసేందుకు వీలుంటుంది. అనంతరం బ్యాటింగ్‌కు అనువుగా మారుతున్న పిచ్‌పై పరుగులు సులువుగా వస్తున్నాయి. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపకున్నా, టోర్నీ సాగే కొద్దీ మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుంది. దీన్నిబట్టి చూస్తే బలమైన పేస్ దళం ఉన్న జట్లు టాస్ గెలిస్తే మ్యాచ్ దాదాపు వారి చేతుల్లోకి వెళ్లినట్లేనేమో? -
అదిరే ఆరంభం ఎవరిదో?
లండన్: వన్డే వరల్డ్‌కప్ సమరానికి రంగం సిద్ధమైంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉండటంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, సంచలనాలకు మారుపేరైన సఫారీలు శుభారంభం చేయాలని భావిస్తున్నారు. ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ వారి బ్యాటింగ్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా స్టోక్స్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. (ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం) ఇక ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడ ఎంత వరకూ ప్రభావం చూపుతాడో చూడాలి. తుది జట్లు దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, జేపీ డుమినీ, డ్వైన్ ప్రిటోరియస్, ఫెహ్లుకోవాయా, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, ఇమ్రాన్ తాహీర్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్ -
డు ప్లెసిస్ అజేయ సెంచరీ
జొహన్నెస్‌బర్గ్: స్వదేశంలో తొలిసారి శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా... వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ డు ప్లెసిస్ (114 బంతుల్లో 112 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ చేసి తమ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. తొలుత శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఒషాదా ఫెర్నాండో (49 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (73 బంతుల్లో 60; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, ఇమ్రాన్ తాహిర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 38.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్ డి కాక్ (72 బంతుల్లో 81; 11 ఫోర్లు), డు ప్లెసిస్ రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. డి కాక్ ఔటయ్యాక... వాన్ డెర్ డసెన్ (43 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు), డు ప్లెసిస్ మూడో వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జత చేసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. రెండో వన్డే బుధవారం జరుగుతుంది. -
కోహ్లితో పెట్టుకోవద్దు!
మెల్బోర్న్: సొంతగడ్డపై భారత్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైన ఆస్ట్రేలియా జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బంగారం లాంటి సలహా ఇచ్చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో వాదనకు దిగే ప్రయత్నం చేయవద్దని, కోహ్లితో మౌనంగా ఉండటమే మెరుగైన భాష అని అతను సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి సెంచరీ సహా 286 పరుగులు చేశాడు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన భారత్ చివరి టెస్టులో గెలిచి 1–2తో సిరీస్ చేజార్చుకుంది. నాటి తమ అనుభవాన్ని ప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. ఆడుతున్నప్పుడు అతడిని ఏమీ అనకుండా మౌనంగా ఉండేందుకే ప్రయత్నించాం. అయినా సరే అతను పరుగులు సాధించాడు. ప్రతీ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు ఉంటారు. వారిని ఏమైనా అంటే మరింతగా చెలరేగిపోతారని తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉండాలని జట్టుగా మేం ముందే నిర్ణయించుకుంటాం. అంతర్జాతీయ క్రికెట్లో వాగ్వాదాలను ఇష్టపడే ఆటగాళ్లూ కనిపిస్తారు. కోహ్లితో ఆడినప్పుడు అతనూ గొడవకు దిగేందుకు సిద్ధమనే వ్యక్తని అర్థమైంది. మౌనంగా ఉండటం ద్వారానే అతడిని నియంత్రణలో ఉంచవచ్చు’ అని సఫారీ కెప్టెన్ కంగారూలను హెచ్చరించాడు. -
కోహ్లిని రెచ్చగొట్టొద్దు: డు ప్లెసిస్
కేప్‌టౌన్: ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆసీస్ క్రికెట్ జట్టును దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ హెచ్చరించాడు. త్వరలో భారత్-ఆసీస్ జట్ల మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ విరాట్ కోహ్లి వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అనే సంగతి మరచిపోవద్దు. అతన్ని ఎంత రెచ్చగొట్టకుండా ఉంటే అంత మంచిది. కోహ్లిలో పోరాట స్ఫూర్తి ఎక్కువ. సాధారణంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లను ప్రత్యర్థి జట్లు టార్గెట్ చేస్తూ ఉంటాయి. అందులో ఆసీస్ ముందు వరుసలో ఉంటుంది. కానీ కోహ్లి విషయంలో ఆసీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోహ్లికి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడమే కరెక్ట్. గతంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి వ్యవహారంలో మేము ఇలానే చేసి సక్సెస్ అయ్యాం. అతనొక అసాధారణ ఆటగాడు. ప్రతీ జట్టుకు వారి వారి ప్రణాళికలు ఉంటాయి. మేము కోహ్లిని భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేయకుండా ఎలా చేసేమో అనేది మాత్రమే స్పష్టం చేశా.. కోహ్లిని రెచ్చగొట్టొద్దు అనేది ఆసీస్‌కు నేనేచ్చి సలహా మాత్రమే’ అని డుప్లెసిస్ తెలిపాడు. ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియా బయల్దేరిన టీమిండియా భారత్ సిరీస్ నెగ్గక పోతేనే ఆశ్చర్యం! ఆసీస్-టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. -
ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్