అశ్విన్‌తోనే ప్రమాదం: డు ప్లెసిస్ | South Africa wary of Ashwin, says Faf du Plessis | Sakshi
Sakshi News home page

అశ్విన్‌తోనే ప్రమాదం: డు ప్లెసిస్

Published Tue, Nov 3 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

అశ్విన్‌తోనే ప్రమాదం: డు ప్లెసిస్

అశ్విన్‌తోనే ప్రమాదం: డు ప్లెసిస్

మొహాలీ: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌తోనే తమకు ఎక్కువ ప్రమాదమని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ‘టెస్టు మ్యాచ్‌లలో తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఎదురవుతాయని భావిస్తున్నాం. కాబట్టి అన్ని మ్యాచ్‌లలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పిచ్‌లపై అశ్విన్ ప్రమాదకారి. అతడిని నిలువరిస్తే మా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని డు ప్లెసిస్ అన్నాడు.

భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం ఏ ప్రత్యర్థికైనా గొప్ప సవాల్ అని చెప్పాడు. ‘మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం కఠినం. అయితే సిరీస్‌లో ఇప్పటి వరకూ మేం బాగా ఆడాం. అదే ఆత్మవిశ్వాసంతో ఈ ఫార్మాట్‌లోనూ బరిలోకి దిగుతాం’ అని డు ప్లెసిస్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement