టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరిగిన తీరు కంటే పిచ్‌లపైనే ఎక్కువగా ఆసక్తి ఏర్పడింది. తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా రెండున్నర రోజుల్లో ముగిస్తే.. మూడో టెస్టులో అది రివర్స్ అయింది. ఇండోర్ టెస్టును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా అదే రెండున్నర రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది. అయితే ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. దీంతో నాలుగో టెస్టు జరగనున్న అహ్మదాబాద్ పిచ్‌పై ఆసక్తి ఏర్పడింది. నరేంద్రమోదీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేక బ్యాటింగ్, బౌలింగ్‌కు సమాంతరంగా ఉంటుందా అనేది వేచి చూడాలి.
తొలి మూడు టెస్టులకు సంబంధించి పిచ్ ఫోటోలు ఎలా వైరల్ అయ్యాయో తాజాగా అహ్మదాబాద్ పిచ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈసారి పిచ్ ఫోటోలు చూసినవారికి కాస్త కన్ఫూజన్ ఏర్పడింది. సోషల్ మీడియాలో విడుదలైన ఫోటోల్లో రెండు పిచ్‌లు కనిపించాయి. ఆ రెండు పిచ్‌లపై కవర్స్ కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్‌లో ఏ పిచ్ ఉపయోగిస్తారనేది క్లారిటీ లేదు.
ఈ విషయం గమనించిన ఆస్ట్రేలియా మీడియా అహ్మదాబాద్ పిచ్‌లపై కన్ఫూజన్‌కు గురైంది. ''మ్యాచ్‌ను గెలవడానికి టీమిండియా ఏమైనా చేస్తుందని.. మ్యాచ్ ప్రారంభమయ్యే ఆఖరి నిమిషం వరకు ఏ పిచ్‌పై ఆడాలనేది రివీల్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వారి ప్రణాళికలు మా గేమ్‌ప్లాన్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి.'' అంటూ కథనం ప్రచురించింది. ఇది తెలుసుకున్న టీమిండియా అభిమానులు.. ''పాపం ఆసీస్ మీడియాలో కలవరం మొదలైనట్లుంది.. కచ్చితంగా నాలుగో టెస్టులో టీమిండియాదే విజయం'' అంటూ కామెంట్స్ చేశారు.
ఇక మార్చి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానంది. ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియా కంటే టీమిండియాకు ఎంతో ముఖ్యం. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే భారత్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ టీమిండియా ఓడినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే టీమిండియా నాలుగో టెస్టును నెగ్గితే సరిపోతుంది.
Seems like a call over which pitch will be used for the fourth Test has not yet been made. They are covering two strips at the moment #INDvAUS pic.twitter.com/DgX6YF9JXA
— Louis Cameron (@LouisDBCameron) March 7, 2023
చదవండి: IPL 2023: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే..
Comments
Please login to add a commentAdd a comment