Australia Tour of India 2023
-
అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్ విజయంపై గురి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం(మార్చి 19న) విశాఖపట్నం వేదికగా జరగనుంది. భార్య సోదరుడి వివాహ వేడుకల కారణంగా తొలి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టును నడిపించాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. అదే జోష్‌తో రెండో వన్డేకు సిద్ధమవుతున్న టీమిండియాకు గుడ్‌న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశాఖ వన్డేకు అందుబాటులోకి రానున్నాడు. ఇక విశాఖపట్నం రోహిత్ శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. రోహిత్ తల్లి పూర్ణిమా శర్మ స్వస్థలం విశాఖపట్నం. అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ ఇరగదీయాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తొలి వన్డేలో ఓపెనర్‌గా విఫలమైన ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇది మినహా మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తొలి వన్డేలో కోహ్లి, సూర్యకుమార్‌లు విఫలమైనప్పటికి రెండో వన్డేలో వారు రాణించడం కీలకం. గిల్ 20 పరుగులు చేసినప్పటికి బ్యాటింగ్‌లో స్థిరత్వం లోపించింది. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ జడేజా, కీపర్ కేఎల్ రాహుల్‌లు మరోసారి కీలకం కానున్నారు. షమీ, సిరాజ్, కుల్దీప్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో రెండో వన్డేలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలవడంపై దృష్టి పెట్టింది. మ్యాచ్‌కు వర్షం ముప్పు.. అయితే విశాఖ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. చదవండి: ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్ 'రాహుల్ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం' -
'రాహుల్ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'
ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యం చిన్నదే అయినప్పటికి టీమిండియా తడబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కకావికలం అయింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో పాండ్యా కాస్త ప్రతిఘటించినా రాహుల్‌తో కలిసి 43 పరుగులు జోడించాకా అతను ఔటయ్యాడు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కంకణం కట్టుకున్న రాహుల్ మాత్రం ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. కానీ అతనికి సహకరించేవారు కరువయ్యారు. అప్పుడు వచ్చాడు రవీంద్ర జడేజా. ఆల్‌రౌండర్‌గా తానేంటో అందరికి తెలుసు. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ టీమిండియా కష్టాల్లో ఉంది. ఈ దశలో అతను కూడా ఔటైతే టీమిండియా ఓడడం ఖాయం. కానీ జడేజా అలా చేయలేదు. మరోసారి తన విలువేంటో చూపిస్తూ ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కెరీర్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడుతున్న కేఎల్ రాహుల్‌కు సహకరిస్తూ తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు. ఎంత రాహుల్ ఆపద్భాందవుడి పాత్రను పోషించి జట్టును గెలిపించినప్పటికి జడేజా లేకపోతే అతను ఆ ఇన్నింగ్స్ ఆడేవాడు కాదు. అందుకే విజయంలో కేఎల్ రాహుల్‌ది ఎంత ముఖ్యపాత్రో.. అంతే స్థాయి విలువ జడేజా ఇన్నింగ్స్‌కు ఉంది. మొత్తంగా 69 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 45 పరుగులు నాటౌట్‌గా నిలిచిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా జడ్డూ ఇన్నింగ్స్‌పై అభిమానులు స్పందించారు. ''కేఎల్ రాహుల్ మ్యాచ్‌ను గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం''.. ''మరోసారి నువ్వేంటో చూపించావు జడేజా.. నీ ఆటకు ఫిదా'' అంటూ కామెంట్ చేశారు. #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 చదవండి: గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్.. -
KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్..
''వరుసగా విఫలమవుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు''.. ''టీమిండియాకు భారంగా తయారయ్యాడు.. జట్టు నుంచి తొలగిస్తే మంచిది''.. ''ఐపీఎల్లో మాత్రమే మెరుస్తాడు.. జాతీయ జట్టు తరపున అతను ఆడడు''.. ''అతనొక ఐపీఎల్ ప్లేయర్.. అవకాశాలు వ్యర్థం''.. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కేఎల్ రాహుల్‌పై వచ్చిన విమర్శలు. కానీ ఇవాళ టీమిండియా కష్టాల్లో ఉంటే అదే కేఎల్ రాహుల్ ఆపద్భాందవుడయ్యాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ తనలోని అసలు సిసలైన బ్యాటర్‌ను వెలికి తీసిన కేఎల్ రాహుల్ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాను చేసింది 75 పరుగులే కావొచ్చు.. కానీ ఆ ఇన్నింగ్స్ ఒక సెంచరీతో సమానం. ఎందుకంటే 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ఈసారి ఎలాగైనా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాలనుకున్నాడేమో. దానిని చేసి చూపించాడు. ఒత్తిడిలో ఆడినప్పుడే అసలైన బ్యాటర్ వెలుగులోకి వస్తాడనే దానికి నిర్వచనంలా మిగిలిపోయింది రాహుల్ ఇన్నింగ్స్. అంత క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. అతని ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్కటి తప్పుడు షాట్ లేకపోవడం విశేషం. అర్థసెంచరీ సాధించేంత వరకు కూడా కేఎల్ రాహుల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టేలేదంటే బ్యాటింగ్ ఎంత కష్టంగా ఉందో చెప్పొచ్చు. మొత్తంగా 90 బంతులాడిన రాహుల్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 75 పరుగులు చేశాడు. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ టీమిండియా అభిమానులకు కొంతకాలం పాటు గుర్తుండిపోవడం ఖాయం. తన చెత్త ప్రదర్శనతో జట్టులో చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్న రాహుల్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ పెట్టి మరో పది మ్యాచ్‌ల వరకు తనపై వేలెత్తి చూపకుండా చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే హీరో అవుతాడని అంటుంటారు.. మరి ఎంత కాదన్నా ఇవాళ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హీరోనే కదా. An excellent knock from @klrahul here in Mumbai when the going got tough!#TeamIndia 22 runs away from victory. Live - https://t.co/8mvcwAwwah #INDvAUS @mastercardindia pic.twitter.com/Ct4Gq1R1ox — BCCI (@BCCI) March 17, 2023 చదవండి: IND Vs AUS: రాహుల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్.. తొలి వన్డే టీమిండియాదే -
దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే!
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మొదలైన తొలి వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇన్నింగ్ ఆరంభంలో మిచెల్ మార్ష్ దూకుడు చూసి ఆసీస్ స్కోరు మూడు, నాలుగు వందలు దాటుతుందని అంతా భావించారు. ఎందుకంటే మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉన్నంతసేపు ఆసీస్ స్కోరు మెరుపు వేగంతో పరిగెత్తింది. 19 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అంటే ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున రన్‌రేట్ నమోదయ్యింది. కానీ మార్ష్ ఔటయ్యాకా పరిస్థితి మొత్తం మారిపోయింది. టి20లతో పోలిస్తే వన్డేలు అంటే కాస్త నెమ్మదిగా ఆడాలన్న విషయాన్ని మరిచిపోయిన ఆసీస్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్ కేవలం 59 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ ఆడిన తీరుపై పెదవి విరిచిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మీ దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయారుగా..'' అంటూ పేర్కొన్నారు. చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ.. -
Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని ప్రత్యేకంగా కలిశాడు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. ఇక క్రికెట్‌పై ఆయనకున్న అభిమానం ఇవాళ వాంఖడే స్టేడియానికి రప్పించిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ పేర్కొన్నాడు. ''వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ని ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు'' అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. Superstar #Rajinikanth at the Wankhede stadium watching the #INDvsAUS 1st ODI match pic.twitter.com/8XB0Uvsltu — Chennai Times (@ChennaiTimesTOI) March 17, 2023 చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లితో రోహిత్ పోటాపోటీ! -
సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లితో రోహిత్ పోటాపోటీ!
India VS Australia ODI Series 2023: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డులు అనగానే మొదటగా గుర్తొచ్చేది సెంచరీలు. తన సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ వంద శతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సచిన్‌కు చేరువయ్యే క్రమంలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 75 సెంచరీలు బాదాడు. సెంచరీల రికార్డుల్లో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి సమకాలీన క్రికెటర్లకు సాధ్యం కాని రీతిలో శిఖరాగ్రాన నిలిచాడు. యాక్టివ్ ప్లేయర్లలో ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్- 45, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్- 45, టీమిండియా రోహిత్‌శర్మ- 43, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్-42 కనీసం శతకాల్లో అర్ధ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయారు. దీంతో సచిన్‌తో పోటీపడే విషయంలో కోహ్లికి పోటినిచ్చే వాళ్లు ఎవరూ లేకుండాపోయారు. అయితే, సచిన్‌కు సంబంధించిన ఓ రికార్డు విషయంలో మాత్రం రోహిత్ శర్మ కోహ్లితో పోటీపడుతున్నాడు. పటిష్ట ఆస్ట్రేలియాపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో సెంచరీ చేయడం అంతతేలికేమీ కాదు. అలాంటి కంగారూ జట్టుపై క్రికెట్ దేవుడు సచిన్ వన్డేల్లో మొత్తంగా 9 శతకాలు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ 8, మాజీ సారథి విరాట్ కోహ్లి 8 సెంచరీలతో సమానంగా ఉన్నారు. తాజాగా మార్చి 17- 22 వరకు స్వదేశంలో కంగారూలతో సిరీస్‌లో వీరు శతకం సాధిస్తే సచిన్ రికార్డును సమం చేస్తారు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో మొదటి వన్డేకు దూరమైన రోహిత్ మరికొంత కాలం వేచి చూడాల్సి ఉండగా.. టెస్టుల్లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి మరోసారి చెలరేగితే రోహిత్ కంటే ముందే ఈ ఫీట్ అందుకోగలుగుతాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదగా.. ఆఖరిదైన నాలుగో మ్యాచ్‌లో కోహ్లి 186 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. అదే ఊపులో తొలి వన్డేలో సెంచరీ బాది ఆసీస్‌పై సచిన్ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: WTC Final: అతడు అత్యుత్తమ బౌలర్.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్ మాజీ కెప్టెన్ Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు! -
Ind Vs Aus: గిల్‌కు జోడీగా ఓపెనింగ్ చేసేది అతడే: హార్దిక్ పాండ్యా క్లారిటీ
India vs Australia, 1st ODI- Hardik Pandya: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి జరుగుతున్న చర్చపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు తెలిపాడు. టీమిండియా నయా స్టార్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు ఆసీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా స్థానం లేదని స్పష్టమైంది. కాగా గత కొంతకాలంగా రాహుల్ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. వైఫల్యాల కారణంగా రాహుల్ అయినప్పటికీ ఈ కర్ణాటక బ్యాటర్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ను పక్కన పెట్టిన యాజమాన్యం గిల్‌కు అవకాశం ఇవ్వగా సెంచరీతో సత్తా చాటాడు. ఈ క్రమంలో మార్చి 17- 22 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ముంబై, వైజాగ్, చెన్నైలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కావడంతో పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇషాన్‌కు ఓపెనర్‌గా లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని పాండ్యా స్వయంగా ధ్రువీకరించాడు. వాళ్లే ఓపెనర్లు ఈ మేరకు... ‘‘ఇషాన్, శుబ్‌మన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. గత ఏడేళ్లుగా నేను ఇక్కడ క్రికెట్ ఆడుతున్నా. ఈ వికెట్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు’’ అని పాండ్యా మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాహుల్ ఇప్పటికే వైస్ కెప్టెన్ హోదాను కోల్పోయాడు. వరుస వైఫల్యాలతో ఓపెనింగ్ స్థానాన్ని కూడా కోల్పోయిన అతడు.. మిడిలార్డర్లో ఆడేందుకు సమాయత్తమయ్యాడు. కొన్ని రోజులుగా రాహుల్ స్థానంలో.. రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్ చేస్తున్న గిల్ పటిష్ట ఆస్ట్రేలియాపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఎలా రాణించనున్నాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. కంగారూలతో టెస్టుల్లో సెంచరీ బాదిన ఈ ‘వన్డే డబుల్ సెంచరీ వీరుడు’ మరోసారి సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు! Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్‌ను కలిసిన యువీ.. ఫొటో వైరల్ -
Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి..
India vs Australia, 1st ODI: హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ శుక్రవారం (మార్చి 17) ఆరంభం కానుంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా పాండ్యా చేతికి పగ్గాలు వచ్చాయి. ఈ క్రమంలో భారత్‌కు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా ఈ స్టార్ ఆల్‌రౌండర్ నిలువనున్నాడు. మరోవైపు.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. బలాబలాల అంచనా, వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా తుది జట్టు కూర్పు తదితర అంశాలపై మేనేజ్మెంట్లు దృష్టి సారించనున్నాయి. ఇక ఇప్పటికే సొంతగడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గెలిచి ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని రోహిత్ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విజయం పరిపూర్ణం చేయాలని ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ గెలుపొంది విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఇదిలా ఉంటే.. భారత మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఆడటం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. అన్క్యాప్డ్ ప్లేయర్ రజత్ పాటిదార్ వైపు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్య.. వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఆడిన 20 వన్డే మ్యాచ్‌లలో సూర్య చేసిన పరుగులు 433. అత్యధిక స్కోరు 64. ఇక రోహిత్ జట్టులో లేకపోవడంతో ఇషాన్ కిషన్‌కు చోటు ఖాయం కాగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సహా పేస్ విభాగంలో పాండ్యాతో పాటు శార్దూల్, సిరాజ్, షమీలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. తుది జట్లు (అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ / రజత్ పటిదార్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, షాన్ మార్ష్ / మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, నాథన్ ఎల్లిస్. పిచ్, వాతావరణం మొదటి నుంచీ వాంఖెడేమైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్ల కు అవకాశం ఉంది. ఛేదన ఇంకా సులు వు కాబట్టి గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఇరు జట్ల మధ్య ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ (2020)లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో వార్నర్, ఫించ్ మెరుపు సెంచరీలు చేశారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం ICC WC Qualifier: డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత -
Ind Vs Aus: ఆసీస్‌తో వన్డే సమరానికి టీమిండియా సై.. ప్రధాన లక్ష్యం అదే!
సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏ ఫార్మాట్లో పోరు అయినా ఆసక్తిని రేపుతుంది. కానీ బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా టెస్టు మ్యాచ్‌లపై ఇటీవలి వరకు అందరి దృష్టీ నిలవగా, త్వరలో జరగబోయే ఐపీఎల్‌పై కూడా చర్చ షురూ కావడంతో ఈ వన్డే సిరీస్‌పై హడావిడి కాస్త తక్కువగా కనిపిస్తోంది. పైగా వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో కూడా ఈ సిరీస్ భాగం కాదు. అయితే ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్ కప్ కోసం రిహార్సల్‌గా ఆసీస్ ఈ సిరీస్‌ను చూస్తుండగా... భారత్ కూడా మెగా టోర్నీకి తమ అత్యుత్తమ వన్డే జట్టును ఎంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మూడు వన్డేల్లో ఫలితంకంటే వ్యక్తిగత ప్రదర్శనలే కీలకం. ముంబై: టెస్టు సమరం తర్వాత భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు వాంఖెడే మైదానంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ ఫార్మాట్లో వరుస విజయాలతో టీమిండియా నిలకడ ప్రదర్శించగా...దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కంగారూ బృందం వన్డే బరిలోకి దిగుతోంది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్ల సమంగా కనిపిస్తుండగా, అంతిమ విజేత ఎవరో చూడాలి. మరో వైపు వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరం కావడంతో హార్దిక్ పాండ్యా తొలి సారి వన్డే కెపె్టన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. భారత్‌కు వన్డేల్లో కెపె్టన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా పాండ్యా నిలుస్తాడు. పటిదార్‌కు అవకాశం! భారత జట్టు ఇటీవలి ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో ఎలాంటి సమస్య లేదు. అద్భుతమైన ఆటతో గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఖరారు చేసుకోగా, రోహిత్ గైర్హాజరులో కిషన్‌కు మళ్లీ టీమ్‌లో చోటు ఖాయం. వీరిద్దరు శుభారంభం అందిస్తే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. గత ఏడు వన్డేల్లో 3 సెంచరీలు బాదిన కోహ్లి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన 75 సెంచరీల జాబితాలో మరిన్ని చేర్చుకునేందుకు ఇది అతనికి మరో అవకాశం. మిడిలార్డర్లో మెరుగైన రికార్డు ఉన్న రాహుల్ కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే శ్రేయస్ గాయం కారణంగా దూరం కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరం. సూర్యకుమార్ ఈ స్థానం కోసం అసలైన పోటీదారే అయినా ఆడిన 20 వన్డేల్లో అతని పేలవ రికార్డు సందేహాలు రేకెత్తిస్తోంది. కొత్త ఆటగాడు రజత్ పటిదార్నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. ఆల్రౌండర్లుగా హార్దిక్, జడేజా తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తే తిరుగుండదు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా షమీ, సిరాజ్ ఉంటే బ్యాటింగ్ బలం కోసం శార్దుల్‌ను ఎంపిక చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ స్థానంకోసం అక్షర్, సుందర్ మధ్య పోటీ ఉంది. మ్యాక్స్‌వెల్‌పై దృష్టి... కమిన్స్, హాజల్‌వుడ్‌తో పాటు జాయ్ రిచర్డ్సన్లాంటి పేసర్లు దూరమైనా ఆ్రస్టేలియా జ ట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వరు సగా ఆల్రౌండర్లలో జట్టు నిండి ఉంది. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగుతుండటం జట్టు బలాన్ని పెంచింది. ఫించ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌లో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు హెడ్ ఉవ్వి ళ్ళూరుతున్నాడు. టెస్టుల్లో చెత్త ప్రదర్శన చూపిన వార్నర్ ఇక్కడైనా రాణించడం కీలకం. ఎప్పటిలాగే స్మిత్, లబుషేన్ బ్యాటింగ్ జట్టుకు కీలకం కానుంది. మిచెల్ మార్ష్ , స్టొయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్...ఈ నలుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులోని రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి అవకాశం దక్కినా వారు టీమ్ విలువ పెంచగల సమర్థులు. ప్రధాన పేసర్‌గా స్టార్క్ ముందుండి నడిపించనుండగా యువ ఆటగాడు ఎలిస్‌కు కూడా అవకాశం ఖా యం. లెగ్‌స్పిన్నర్ జంపా భారత బ్యాట ర్లను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించగలడు. -
Ind Vs Aus: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
Australia tour of India, 2023- ODI Series: ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని ముద్దాడిన టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన రోహిత్ సేన.. కంగారూలతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. స్వదేశంలో జరుగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్.. తల్లి మరణం నేపథ్యంలో ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టనున్నాడు. మరి క్రికెట్ ప్రేమికులకు మజాను అందించే టాప్ 2 ర్యాంకింగ్ (టీమిండియా- ఆస్ట్రేలియా) జట్ల మధ్య మరో ఆసక్తికరపోరుకు సంబంధించిన వివరాలు చూద్దామా?! భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ 2023 షెడ్యూల్ 1. మొదటి వన్డే- మార్చి 17- శుక్రవారం- ముంబై- వాంఖడే స్టేడియం- ముంబై 2. రెండో వన్డే- మార్చి 19- ఆదివారం- డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం 3. మూడో వన్డే- మార్చి 22- బుధవారం- ఎంఏ చిదంబరం స్టేడియం- చెన్నై మ్యాచ్ ఆరంభ సమయం ►టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం కానున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ? ►టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ►డిజిటల్: డిస్నీ+ హాట్‌స్టార్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్(వెన్నునొప్పి కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం) టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్(జై రిచర్డ్సన్ స్థానంలో జట్టులోకి). చదవండి: Virat Kohli: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ -
'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా'
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు శతకాలతో విరుచుకుపడగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్లు సెంచరీలు చేశారు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికి తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. తద్వారా వరుసగా నాలుగోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమిండియా తమవద్దే అట్టిపెట్టుకుంది. ఈ విషయం పక్కనబెడితే ఆట ఆఖరిరోజున చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ స్పెషలిస్ట్‌లుగా ముద్రపడిన పుజారా, గిల్ చేతికి బంతినిచ్చి వారిచేత బౌలింగ్ చేయించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. పుజారా బౌలింగ్‌పై అశ్విన్.. ఇలా అయితే ఎలా.. నేను బౌలింగ్ జాబ్ వదిలేయాలా? అని చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అశ్విన్ కామెంట్‌పై పుజారా స్పందించాడు. ''లేదు.. నాగ్‌పూర్ టెస్టులో నేను ఆడాల్సిన మూడోస్థానంలో నువ్వు బ్యాటింగ్‌కు వచ్చావు. అందుకు కృతజ్ఞత చెప్పాలనే ఇలా చేశాను'' అంటూ ఫన్నీగా స్పందించాడు. ఆ వెంటనే అశ్విన్ మరో ట్వీట్ చేశాడు.. ''పుజారా నీ ఉద్దేశం ప్రశంసించేలా ఉంది.. కానీ ఇలా తిరిగి ఇచ్చేస్తావని నేను ఊహించలేదు'' అని తెలిపాడు. దీనిపై పుజారా మరో ట్వీట్ చేశాడు. ''నీకు మంచి విశ్రాంతినిస్తా.. భవిష్యత్తులో ఎప్పుడైనా వన్‌డౌన్‌లో నువ్వు వచ్చేందుకు సాయపడతా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ జడేజాతో కలిసి సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లు పడగొడితే.. జడేజా 22 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 17 నుంచి ఆరంభం కానుంది. Nahi. This was just to say thank you for going 1 down in Nagpur 😂 https://t.co/VbE92u6SXz — Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023 Giving you enough rest so that you can go 1 down again if needed in the future 😂 https://t.co/E8lt2GOAxJ — Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023 చదవండి: 'ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?' WTC: ఎలాగోలా ఫైనల్‌కు చేరామే కానీ, మన వాళ్లు సాధించిందేమిటి..? -
Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను(బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) టీమిండియా నిలబెట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా ముగియగా.. సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా వరుసగా నాలుగోసారి ట్రోఫీని అట్టిపెట్టుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. టీమిండియా తరపున కోహ్లి, గిల్లు సెంచరీలు చేస్తే.. ఆసీస్ నుంచి ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు శతకాలు చేశారు. అయితే మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదంతా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య తొలి టెస్టులో వచ్చిన ఫలితం ద్వారానే. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇదే విషయంపై స్పందించాడు. ''చాలా రోజుల తర్వాత రెండుజట్లు తీవ్రంగా పోటీ పడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనూ సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును నడిపించిన విధానం అద్బుతం. శుబ్‌మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కే పరిమితం అయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడడం చాలా బాగుంది. గిల్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు శ్రమించడం నచ్చింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే కివీస్-లంక తొలి టెస్టుపై కూడా ఒక కన్ను వేసి ఉంచాం. ఇక్కడ లంచ్ బ్రేక్ అవగానే అక్కడ లంక-కివీస్ మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఇక టీమిండియాతో సిరీస్ ద్వారా ఆసీస్‌కు ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు దొరికారు. ఒకరు టాడ్ మర్ఫీ అయితే మరొకరు కున్హెమన్. మాములుగా విదేశీ జట్లలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒక్కడికంటే ఎక్కువగా ఉండడం అరుదు. అయితే ఈసారి ఆసీస్ ఆ విషయంలో జాక్‌పాట్ కొట్టింది. సీనియర్ నాథన్ లియోన్‌తో పాటు కున్హెమన్, మర్ఫీలు పోటీ పడి మరి వికెట్లు తీశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మాత్రం ఆస్ట్రేలియాతో సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం.'' అని చెప్పుకొచ్చాడు. Moment to savour 👏👏 This is #TeamIndia 🇮🇳#INDvAUS | @mastercardindia pic.twitter.com/j6ZR8R8fZr — BCCI (@BCCI) March 13, 2023 చదవండి: కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్ -
కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీకి గిఫ్ట్ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్ట్ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ కాగా.. ఉస్మాన్ ఖవాజా 180, గ్రీన్ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి 186, శుబ్‌మన్ గిల్ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రెవిస్ హెడ్ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. సిరీస్‌లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది. Virat Kohli presents his match jersey to Usman Khawaja and Alex Carey. Class bloke! pic.twitter.com/tr3ciu1az7 — Vignesh Bharadwaj (@VBharadwaj31) March 13, 2023 -
'నేనేం గాలిలో తేలడం లేదు.. తగలాల్సిన చోట తగిలింది'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్లో ఇది 28వ శతకం. డబుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగిన కోహ్లి తన ఇన్నింగ్స్‌తో టీమిండియా 571 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం వచ్చేలా చేశాడు. అయితే ఈ టెస్టు సెంచరీకి ముందు కోహ్లిపై మరోసారి విమర్శలు వచ్చాయి. వన్డేలు, టి20ల్లో మాత్రమే కోహ్లిని ఆడించండి.. టెస్టులకు పక్కనబెట్టండి.. అంటూ పేర్కొన్నారు. కానీ కోహ్లి ఎన్నడూ వారి మాటలను పట్టించుకోలేదు. కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా శతకాలతో రెచ్చిపోయాడు. కానీ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం కోహ్లి ఆకట్టుకోలేదంటూ వార్తలు రాశారు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది కోహ్లి ఆటపై కాదు.. పిచ్ తీరు గురించి. ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో కోహ్లియే కాదు ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంటూ బ్యాటర్లు ఎలా పరుగులు చేయగలరు. పైగా మూడు టెస్టులో ఒకేరీతిలో రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మరి ఇలా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగుస్తుంటే కోహ్లి మాత్రం ఎలా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సరైన బ్యాటింగ్ పిచ్ కోసం కోహ్లి ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు మలి టెస్టులోనే ఫలించాయి. అహ్మదాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై కోహ్లి తన పవరేంటో చూపించాడు. ఒక్క సెంచరీతో చాలా మంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు తీసుకుంటూ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈ ఒక్క సెంచరీతో నేనేం గాల్లో తేలడం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు. విఫలమయ్యానన్న ప్రతీసారి నిలదొక్కుకుంటూ వస్తున్నా. ఎవరికి తగలాలో వాళ్లకి గట్టిగానే తగిలింది. నేను ఎందుకు ఫీల్డ్‌లో కొనసాగుతున్నానో చూపించాలనుకున్నా.. చూపించా. ఇక ఆట ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. నా డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. నాగ్‌పూర్ టెస్టు నుంచి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో రాణించేందుకు గతంలోలాగే నా శాయాశక్తులా ప్రయత్నించా. కానీ బ్యాటింగ్ సరిగా చేయకపోవడంతో కొంత నిరాశకు గురయ్యా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
'ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రా కావడంతో ట్రోఫీ వరుసగా నాలుగోసారి టీమిండియా వద్దే ఉండిపోయింది. ఇక అటు తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం పక్కనబెడితే నాలుగో టెస్టులో చివరి రోజు చివరి సెషన్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందనే ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌తో ప్రయోగాలు చేశాడు. బ్యాటర్లుగా ముద్రపడిన ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాడు. మొదట శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ 77వ ఓవర్ వేయగా.. ఇన్నింగ్స్ 78వ ఓవర్ టెస్టు స్పెషలిస్ట్ పుజారా చేత వేయించాడు. కాగా రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ బౌలర్ అయిన పుజారా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్ కూడా సరిగ్గా పడని పిచ్‌పై పుజారా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో పుజారా బౌలింగ్‌పై అశ్విన్ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించాడు. ''ఇప్పుడు నేనేం చేయాలి.. బౌలింగ్ జాబ్ వదిలేయాలేమో'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6 — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023 Saurashtra Skipper Jaydev Unadkat happy to see teammate Pujara rip a leg break to Smith!! pic.twitter.com/vwtQI8kYr5 — arnav.🏏 (@Cricket_Arnav) March 13, 2023 చదవండి: IND VS Aus 4th Test: అశ్విన్, విరాట్ ఖాతాలో రికార్డులు శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే! -
Ind Vs Aus: భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు.. మూడో రోజు ముగిసిన ఆట
India vs Australia, 4th Test - Day 3: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అహ్మదాబాద్‌లో శనివారం నాటి ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేయగా.. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకం(128)తో మెరిశాడు. ఛతేశ్వర్ పుజారా 42, కోహ్లి 59(నాటౌట్) పరుగులతో రాణించారు. దీంతో భారత జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లి 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఇంకా 191 పరుగుల వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్లు నాథన్ లియోన్, కుహ్నెమన్, టాడ్ మర్ఫీకి ఒక్కో వికెట్ దక్కాయి. కాగా స్మిత్ బృందం తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు స్కోరు చేసిన విషయం తెలిసిందే. డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 258/3 (87) కోహ్లి 42, జడేజా 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 78.4: మూడో వికెట్ డౌన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కోహ్లి, జడేజా క్రీజులో ఉన్నారు. 62: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా పుజారా రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 63వ ఓవర్ ముగిసే సరికి గిల్ 103, కోహ్లి 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 61.2: సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ మర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 ఓవర్లలో టీమిండియా స్కోరు: 152/1 శుబ్‌మన్ గిల్ 76, పుజారా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ సమయానికి టీమిండియా స్కోరు 129/1 లంచ్ సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. గిల్ 65 పరుగులతో, పుజారా 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ 35 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. గిల్ హాఫ్ సెంచరీ ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 29 ఓవర్ రెండోబంతిని ఫోర్ కొట్టడం ద్వారా గిల్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. 33 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. గిల్ 59 పరుగులతో ఆడుతున్నాడు. అతనికి జతగా పుజారా 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ(35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ కున్హెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 74 పరుగులు. గిల్ 38, పుజారా క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 35, రోహిత్ శర్మ 32 పరుగులతో ఆడుతున్నారు. మూడోరోజు ఆట ప్రారంభం.. టీమిండియాకు కీలకం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మూడోరోజు ఆట మొదలైంది. మూడోరోజు టీమిండియాకు కీలకం కానుంది. తొలి రెండురోజులు పూర్తి ఆధిపత్యం చూపించిన ఆసీస్ చివరి సెషన్లో వికెట్లు పారేసుకుంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించిన అహ్మదాబాద్ పిచ్.. మూడో రోజు నుంచి స్పిన్‌కు మొగ్గుచూపే అవకాశం ఉండటం భారత్‌ను కాస్త కలవరపెడుతున్నది. మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో శ్రీలంక దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. -
వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలిసారి 400 పరుగులు మార్క్‌ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది. ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్లో సూర్యకుమార్ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్.. షమీ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు. ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్ హ్యాండ్స్కోబ్తో పాటు మార్నస్ లబుషేన్ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్ హ్యాండ్స్‌కోబ్‌ను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz — Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023 చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ 'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' -
రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లి భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. అంతకముందు వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లి టెస్టు సిరీస్‌కు వచ్చేసరికి మాత్రం మాములు బ్యాటర్‌గా మారిపోయాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లో పిచ్ బౌలింగ్‌కే ఎక్కువగా అనుకూలించడంతో కోహ్లిని కూడా తప్పుబట్టడానికి లేదు. అయితే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అసలు ఏ మాత్రం బౌన్స్, స్పిన్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లి కనీసం నాలుగో టెస్టులోనైనా సెంచరీ మార్క్ అందుకుంటాడని సగటు అభిమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి ప్యాడ్లు కట్టుకొని గ్రౌండ్లోకి వచ్చాడు. చాలాసేపు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మూడో రోజు ఆటతో టీమిండియా భవితవ్యం తేలనుంది. పిచ్‌పై ఎలాంటి బౌన్స్ లేకుంటే మాత్రం మ్యాచ్ నుంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు విఫలమైతే మాత్రం ఆసీస్ ఈ టెస్టును గెలవడం గ్యారంటీ. ఒకవేళ టీమిండియా బ్యాటర్లు కూడా సమర్థంగా ఆడితే మ్యాచ్ డ్రా అవడం ఖాయం. King at work 🥳 pic.twitter.com/yCSSlz9YhB — Sunil (@Hitting_Middle) March 10, 2023 చదవండి: 'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు -
ఎట్టకేలకు వికెట్.. అక్షర్ కెరీర్లోనే అతి పెద్ద గ్యాప్
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వికెట్ సాధించాడు. అదేంటి అతను ఒక బౌలర్.. వికెట్ సాధించడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అక్షర్ తొలి మూడు టెస్టులు కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టిన అక్షర్ పటేల్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 185 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ ఉన్న అక్షర్ బ్యాట్‌తో రాణించినప్పటికి బంతితో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచిన ఉస్మాన్ ఖవాజా(180 పరుగులు) వికెట్‌ను అక్షర్ దక్కించుకోవడం విశేషం. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 47.4 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ తన టెస్టు కెరీర్లో ఒక వికెట్ తీయడం కోసం ఎదుర్కొన్న అతిపెద్ద గ్యాప్ ఇదే. చివరగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. Axar Patel gets the BIG WICKET! 🙌 Usman Khawaja goes for 180(422) 👏#IndvsAus #BGT2023 #UsmanKhawaja #Cricket pic.twitter.com/7j2PfVKFxf — OneCricket (@OneCricketApp) March 10, 2023 చదవండి: డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా? -
డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా?
ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్ ఈ ఘనత అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై యథేచ్చగా బ్యాట్ ఝులిపించిన గ్రీన్ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం మార్క్ సాధించాడు. కాగా గ్రీన్‌కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. టీమిండియా గడ్డపై టెస్టుల్లో డెబ్యూ శతకం అందుకున్న అరుదైన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు ఉస్మాన్ ఖవాజాతో కలిసి గ్రీన్ ఐదో వికెట్‌కు 208 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్ తరపున టీమిండియా గడ్డపై టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ పార్ట్నర్షిప్ కావడం విశేషం. తొలి స్థానంలో 1979-80లో చెన్నై వేదికగా అలెన్ బోర్డర్- హ్యూజెస్లు కలిసి 222 పరుగులు జోడించారు. ఇక మూడో స్థానంలో ఓ నీల్- హార్వే జంట 1959-60లో ముంబై వేదికగా 207 పరుగులు జోడించారు. అయితే డెబ్యూ సెంచరీ అందుకున్న కామెరాన్ గ్రీన్ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేళ టీమిండియా అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు. తొలి టెస్టు శతకం అందుకున్నందుకు కంగ్రాట్స్.. కానీ పోయి పోయి టీమిండియాపైనే అది సాధించాలా అంటూ కామెంట్ చేశారు. అయితే సెంచరీ తర్వాత మరో 14 పరుగులు చేసిన గ్రీన్ 114 వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Cameron Green celebrates his maiden Test century 👏 LIVE ▶️ https://t.co/BG0U48XqPn#INDvAUS pic.twitter.com/u4ghdGrgFg — CODE Cricket (@codecricketau) March 10, 2023 చదవండి: 'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్' 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం
అహ్మదాబాద్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆటలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా 300 పరుగుల మార్క్‌ను అందుకుంది. సెంచరీ భాగస్వామ్యంతో పటిష్టంగా తయారైన ఖవాజా, గ్రీన్ జోడిని విడదీయడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 112 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఖవాజా 138, గ్రీన్ 71 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. తొలిరోజు ఆటలో భాగంగా కోహ్లి కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా పట్ల భరత్ తీరును తప్పుబడుతూ అతన్ని క్షమాపణ కోరమని ఆదేశించాడు. కోహ్లి తప్పుబట్టేలా కేఎస్ భరత్ ఏం చేశాడో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ వార్త చదివేయండి. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 71వ ఓవర్ షమీ వేశాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులతో ఆడుతుంది. ఖవాజా క్రీజులో ఉన్నాడు. షమీ వేసిన బౌన్సర్‌ను ఖవాజా తప్పించుకోవడంతో బంతి కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. అయితే బంతిని షమీకి విసిరే ప్రయత్నంలో ఖవాజా చేతి వేలికి బలంగా తాకింది. దీంతో వెనక్కి తిరిగిన ఖవాజా..ఇదేంటి అన్నట్లుగా చూశాడు. భరత్ చర్యను తప్పుబట్టిన కోహ్లి.. వెళ్లి క్షమాపణ చెప్పు అని పేర్కొన్నాడు. దీంతో ఖవాజా దగ్గరికి వెళ్లిన కేఎస్ భరత్ అతన్ని క్షమాపణ కోరాడు. ''పర్లేదు.. కానీ కొంచెం పైనుంచి విసిరితే సరిపోయేది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నాలుగో టెస్టులో ఖవాజా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. అతనికి టెస్టుల్లో ఇది 14వ సెంచరీ అయినప్పటికి టీమిండియాపై ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అందుకే తొలిరోజు ఆట ముగియగానే ఖవాజా మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. ''ఈ సెంచరీ చాలా విలువైనది.. గతంలో రెండుసార్లు టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా. ఈ సెంచరీ నాకు ప్రత్యేకమైనది'' అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. pic.twitter.com/7TTea4zG4t — MAHARAJ JI (@MAHARAJ96620593) March 9, 2023 చదవండి: బ్యాటింగ్‌లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్‌లో ఇదే తొలిసారి పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత -
బ్యాటింగ్‌లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్‌లో ఇదే తొలిసారి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్‌లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్‌లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్‌లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్‌లు కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించడం బెస్ట్‌గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత భారత్, ఆసీస్ నాలుగో టెస్టు.. రెండో రోజు లైవ్ అప్డేట్స్ -
పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ''మారియా కమిన్స్ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్ ఆర్మ్ బాండ్స్) బరిలోకి దిగుతారు.. '' అంటూ ట్వీట్ చేసింది. పాట్ కమిన్స్ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ''ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం'' అంటూ ట్వీట్ చేశారు. కాగా తల్లి అనారోగ్యం కారణంగా పాట్ కమిన్స్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతని కోరికను మన్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. తన తల్లి మారియా చివరి రోజుల్లో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇటీవలే పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు. We are deeply saddened at the passing of Maria Cummins overnight. On behalf of Australian Cricket, we extend our heartfelt condolences to Pat, the Cummins family and their friends. The Australian Men's team will today wear black armbands as a mark of respect. — Cricket Australia (@CricketAus) March 10, 2023 On behalf of Indian Cricket, we express our sadness at the passing away of Pat Cummins mother. Our thoughts and prayers are with him and his family in this difficult period 🙏 — BCCI (@BCCI) March 10, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
Ind Vs Aus 4th Test Day 2: 444 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
Ind Vs Aus 4th Test Day 2 highlights: టీమిండియాతో నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగించింది. ఖవాజా, గ్రీన్ సెంచరీలకు తోడు టెయిలెండర్లు నాథన్ లియోన్ 34, టాడ్ మర్ఫీ 41 పరుగులతో రాణించడంతో భారీ స్కోరు చేసింది. 480 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 17, శుబ్‌మన్ గిల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కంటే రోహిత్ సేన 444 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ ఉస్మాన్ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 480 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో అశ్విన్‌కు అత్యధికంగా 6, షమీకి రెండు, జడేజా, అక్షర్ పటేల్‌లకు ఒక్కో వికెట్ దక్కాయి. విసిగిస్తున్న టెయిలెండెర్లు.. ఆసీస్ స్కోరు 458/8 అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ కొనసాగుతుంది. ఆసీస్ టెయింలెండర్లు టీమిండియా బౌలర్లను విసిగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 458 పరుగులు చేసింది. టాడ్ మర్ఫీ 34, నాథన్ లియోన్ 20 పరుగులతో ఆడుతున్నారు. ముగిసిన ఖవాజా మారథాన్ ఇన్నింగ్స్.. ఎనిమిదో వికెట్ డౌన్ అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో టెస్టులో ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 180 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీ విరామం.. ఆస్ట్రేలియా స్కోరు 409/7 టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. లియోన్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. 400 పరుగుల మార్క్ దాటిన ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 400 పరుగుల మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఖవాజా 174, లియోన్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ తన ప్రభావం చూపిస్తున్నాడు. వరుసగా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మిచెల్ స్టార్క్(8) రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన స్టార్క్ శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 387/7 గా ఉంది. ఖవాజా 165 పరుగులతో తన ఆటను కొనసాగిస్తున్నాడు. టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన అశ్విన్.. ఆరు వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు టీమిండియా వికెట్లు పడగొట్టింది. తొలుత సెంచరీ సాధించిన కామెరాన్ గ్రీన్‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఖవాజా, గ్రీన్ల మధ్య ఏర్పడిన 208 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మరోసారి అశ్విన్ బ్రేక్ ఇచ్చాడు. అలెక్స్ కేరీని డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 382 పరుగులతో ఆడుతుంది. ఖవాజా 169 పరుగులు, మిచెల్ స్టార్క్ మూడు పరుగులతో ఆడుతున్నారు. గ్రీన్ సెంచరీ.. ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. కాగా గ్రీన్ కెరీర్లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్.. 150 మార్క్ అందుకున్న ఖవాజా, సెంచరీ దిశగా గ్రీన్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 150 పరుగుల మార్క్‌ను అందుకొని అజేయంగా ఆడుతుండగా.. గ్రీన్ 95 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 177 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. తొలి సెషన్లో ఆస్ట్రేలియాదే పూర్తి ఆధిపత్యం.. టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఆసీస్ బ్యాటింగ్ చూస్తుంటే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. 150 మార్క్ అందుకున్న ఖవాజా.. భారీ స్కోరు దిశగా ఆసీస్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖవాజా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 348 బంతులెదుర్కొన్న ఖవాజా 20 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులతో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. గ్రీన్ 86 పరుగులతో ఖవాజాకు అండగా ఉన్నాడు. 300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడు కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో ఆసీస్ జట్టు స్కోరు 300 దాటింది. 109 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఖవాజా 133, గ్రీన్ 70 పరుగులతో క్రీజులో ఉన్నారు. గ్రీన్ అర్థసెంచరీ ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 99 ఓవర్లలో 267/4గా ఉంది. ఉస్మాన్ ఖవాజా 111, గ్రీన్ 54 పరుగులతో ఆడుతున్నారు. రెండోరోజు మొదలైన ఆట అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆట మొదలైంది. తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. ఖాజాతో పాటు కామెరాన్ గ్రీన్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. తొలిరోజు ఆలౌట్. మూడో రోజుకల్లా ముగింపు! ఆ్రస్టేలియా ఆడినా... భారత్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసినా... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఇది షరామామూలే! కానీ ఆఖరి టెస్టు అలా మొదలవలేదు. మొతెరా వికెట్ బ్యాటర్లకు అవకాశమిచ్చింది. ఆలౌట్ కాదుకదా... కనీసం సగం వికెట్లు (5) అయినా ఆతిథ్య భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు. ఇదే మరో నాలుగు రోజులు కొనసాగితే ఈ టెస్టు ఐదు రోజుల పాటు జరగడం ఖాయం. మరి రెండోరోజు ఆటలోనైనా టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు పడగొడతారేమో చూడాలి -
'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది'
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఇక తొలిరోజు ఆటలో హైలైట్ అయింది మాత్రం నిస్సందేహంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి ఈసారి తన ఆటతో ఎవరైనా భయపెడతారంటే ముందు వినిపించిన పేరు ఖవాజాదే. తాజాగా నాలుగో టెస్టులో ఖవాజా అద్భుత సెంచరీతో మెరిశాడు. 251 బంతుల్లో 104 పరుగులతో ఆడుతున్న ఖవాజా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతను ఆడిన ఒక్క షాట్లో కూడా చిన్న పొరపాటు లేదంటేనే ఎంత గొప్ప బ్యాటింగ్ కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు. ఖవాజా టెస్టు కెరీర్లో ఇది 14వ సెంచరీ కావొచ్చు.. కానీ టీమిండియాపై, భారత గడ్డపై ఇదే మొదటి శతకం కావడం విశేషం. అందునా భారత్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఎమెషన్తో కూడుకున్నది. అందుకే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఖవాజా మాట్లాడుతూ కాస్త ఎమెషన్ అయ్యాడు. ''గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. ఈసారి సెంచరీతో మెరిశాను.. అందుకే ఇది ఎంతో విలువైనది'' అని చెప్పుకొచ్చాడు. "ఈ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104 పరుగులు, గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది. First 💯 for Usman Khawaja against India and what a time to get it 🙌#INDvAUS #BGT2023 #UsmanKhawaja #SteveSmith #ViratKohli #Cricket pic.twitter.com/Xv4QAtP46z — Abdullah Liaquat (@im_abdullah115) March 9, 2023 చదవండి: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా.. విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా?