India vs Australia, 4th Test - Day 3: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అహ్మదాబాద్‌లో శనివారం నాటి ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేయగా.. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకం(128)తో మెరిశాడు. ఛతేశ్వర్ పుజారా 42, కోహ్లి 59(నాటౌట్) పరుగులతో రాణించారు. దీంతో భారత జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
కోహ్లి 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఇంకా 191 పరుగుల వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్లు నాథన్ లియోన్, కుహ్నెమన్, టాడ్ మర్ఫీకి ఒక్కో వికెట్ దక్కాయి. కాగా స్మిత్ బృందం తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు స్కోరు చేసిన విషయం తెలిసిందే.
డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 258/3 (87)
కోహ్లి 42, జడేజా 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
78.4: మూడో వికెట్ డౌన్
గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కోహ్లి, జడేజా క్రీజులో ఉన్నారు.
62: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
పుజారా రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 63వ ఓవర్ ముగిసే సరికి గిల్ 103, కోహ్లి 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
61.2: సెంచరీ పూర్తి చేసుకున్న గిల్
మర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
51 ఓవర్లలో టీమిండియా స్కోరు: 152/1
శుబ్‌మన్ గిల్ 76, పుజారా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ సమయానికి టీమిండియా స్కోరు 129/1
లంచ్ సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. గిల్ 65 పరుగులతో, పుజారా 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ 35 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
గిల్ హాఫ్ సెంచరీ
ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 29 ఓవర్ రెండోబంతిని ఫోర్ కొట్టడం ద్వారా గిల్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. 33 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. గిల్ 59 పరుగులతో ఆడుతున్నాడు. అతనికి జతగా పుజారా 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
రోహిత్ శర్మ(35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ కున్హెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 74 పరుగులు. గిల్ 38, పుజారా క్రీజులో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న టీమిండియా
మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 35, రోహిత్ శర్మ 32 పరుగులతో ఆడుతున్నారు.
మూడోరోజు ఆట ప్రారంభం.. టీమిండియాకు కీలకం
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మూడోరోజు ఆట మొదలైంది. మూడోరోజు టీమిండియాకు కీలకం కానుంది. తొలి రెండురోజులు పూర్తి ఆధిపత్యం చూపించిన ఆసీస్ చివరి సెషన్‌లో వికెట్లు పారేసుకుంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు.
చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించిన అహ్మదాబాద్ పిచ్.. మూడో రోజు నుంచి స్పిన్‌కు మొగ్గుచూపే అవకాశం ఉండటం భారత్‌ను కాస్త కలవరపెడుతున్నది. మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో శ్రీలంక దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment