టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మొదలైన తొలి వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇన్నింగ్ ఆరంభంలో మిచెల్ మార్ష్ దూకుడు చూసి ఆసీస్ స్కోరు మూడు, నాలుగు వందలు దాటుతుందని అంతా భావించారు.
ఎందుకంటే మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉన్నంతసేపు ఆసీస్ స్కోరు మెరుపు వేగంతో పరిగెత్తింది. 19 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అంటే ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున రన్‌రేట్ నమోదయ్యింది. కానీ మార్ష్ ఔటయ్యాకా పరిస్థితి మొత్తం మారిపోయింది.
టి20లతో పోలిస్తే వన్డేలు అంటే కాస్త నెమ్మదిగా ఆడాలన్న విషయాన్ని మరిచిపోయిన ఆసీస్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్ కేవలం 59 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ ఆడిన తీరుపై పెదవి విరిచిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మీ దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయారుగా..'' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment