ODI match
-
IND Vs ENG: రోహిత్ సూపర్ సెంచరీ..రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
వన్డే సమరం!
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్‌లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో, వెస్టిండీస్‌తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది. కొత్త ప్లేయర్లకు అవకాశం... రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించింది. టాప్ పేసర్ రేణుకా సింగ్ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. హర్మన్ స్థానంలో రాఘ్వీ బిస్త్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్ సాధు, సైమా ఠాకూర్లపై పేస్ బౌలింగ్ భారం ఉంది. ఆల్‌రౌండర్ కావాలంటే సయాలీ సత్ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్ కావాలంటే తనూజ కన్వర్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్‌గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోతోంది. సీనియర్ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్‌గా స్మృతి సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లపై భారత బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్లే బలం... గాబీ లూయిస్ సారథ్యంలో ఐర్లాండ్ ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. ఈ టీమ్‌లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్‌లు నెగ్గిన ఐర్లాండ్... ఇంగ్లండ్, బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్‌పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్‌లో గెలవగలిగింది. ఐర్లాండ్ టీమ్‌లో ఒర్లా ప్రెండర్ఘాస్ట్ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఆల్‌రౌండర్‌గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆమెకు మంచి అనుభవం ఉంది. మరో ఆల్‌రౌండర్ లౌరా డెలానీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్రన్ టీమ్‌లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్ స్టార్‌గా ఎదిగిన ఎమీ హంటర్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది. -
సిరీస్‌లో నిలిచేందుకు...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత మహిళల జట్టు సిరీస్‌ను కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ లోపాలను అధిగమించి పటిష్టమైన ఆసీస్‌తో ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు కనీసం 35 ఓవర్లయినా ఆడలేక 100 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (8), ప్రియా పూనియా (3) ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ (19) వైఫల్యం బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావమే చూపింది. ఓవరాల్‌గా 11 మంది బ్యాటింగ్‌కు దిగితే ఒక్క జెమీమా రోడ్రిగ్స్ (23) మాత్రమే ఇరవై పైచిలుకు స్కోరు చేయగలిగింది. అనుభవజు్ఞరాలైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఆసీస్ బౌలింగ్‌కు చేతులెత్తేసింది. ఇప్పుడు రెండో వన్డేలో ఈ పేలవ ఆటతీరు కొనసాగిస్తే మాత్రం పెర్త్‌కు ముందే ఇక్కడే సిరీస్‌ను ప్రత్యర్థి జట్టుకి సమరి్పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో అందరు సమష్టి బాధ్యత తీసుకోవాలి. క్రీజులో నిలబడి పరుగులు రాబడితే బౌలర్లకు మ్యాచ్ గెలిపించేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కానీ వారి సొంతగడ్డపై వందకో... 150 పరుగులకో కుప్పకూలితే ఆసీస్ చకచకా ఛేదించడం ఖాయం. ఆసీస్ స్పీడ్‌స్టర్ మేగన్ షట్ (5/19)ను ఎదుర్కోవడంపై భారత బ్యాటర్లు కసరత్తు చేయాలి. బౌలర్లలో రేణుక, ప్రియా మిశ్రా ఆకట్టుకున్నారు. బౌలింగ్ దళంతో ఏ ఇబ్బంది లేకపోయినా కీలకమైన రెండో వన్డేలో అన్ని విభాగాలు సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లోనూ ఆసీస్ బలంగా కనిపిస్తోంది. ఎలైస్ పెరీ, లిచ్‌ఫీల్డ్, బెత్‌మూనీ, సదర్లాండ్, గార్డ్నర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. -
Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్ చేతిలో తప్పని ఓటమి
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాజైబ్ ఖాన్ భారీ శతకంఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.ఆదిలోనే ఎదురుదెబ్బఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024 నిఖిల్ వీరోచిత అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్‌లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు. చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగాచేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.తదుపరి జపాన్తోఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
Ind vs Pak: ఐపీఎల్ కాంట్రాక్టు పట్టాడు.. పాక్‌తో మ్యాచ్‌లో ఫెయిల్! కారణం అదే!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్.. అండర్- 19 క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్‌గానూ చరిత్రకెక్కాడు.కోటీశ్వరుడు అయ్యాడు.. దిష్టి తగిలిందిఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌తో జరిగిన అనధికారిక టెస్టులో 58 బంతుల్లోనే వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పదమూడేళ్ల లెఫ్టాండర్‌ను రాజస్తాన్ రాయల్స్ ఊహించని ధరకు సొంతం చేసుకుంది. ఈ బిహారీ అబ్బాయిని ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుక్కుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అయితే, కొంతమంది మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ ఆరోపణలు చేయగా.. వైభవ్ తండ్రి సంజీవ్ వాటిని కొట్టిపారేశాడు.తమకు ఏ భయమూ లేదని.. కావాలంటే బీసీసీఐ ఏజ్ టెస్టుకు వైభవ్‌ను మరోసారి పంపించడానికి సిద్దమని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. వైభవ్ సైతం తన గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్.. ‘‘పదమూడేళ్లకే ఇతడు ఏం చేశాడో చూడండి’’ అంటూ వైభవ్ నైపుణ్యాలను కొనియాడింది.తీవ్రమైన ఒత్తిడిలోఓవైపు ఓవర్‌నైట్ స్టార్‌గా మారడటం.. మరోవైపు వయసు గురించి ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల నడుమ అండర్-19 ఆసియా కప్ బరిలో దిగాడు వైభవ్ సూర్యవంశీ. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థిని ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఫలితంగా బౌలింగ్‌కు దిగిన యువ భారత్‌కు పాక్ ఓపెనర్లు కొరకరాని కొయ్యగా మారారు. ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు సాధించగా.. షాజైబ్ ఖాన్ ఏకంగా 159 పరుగులతో భారీ శతకం నమోదు చేశాడు. నాలుగో స్థానంలో మహ్మద్ రియాజుల్లా వచ్చిన 27 పరుగులు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అయితే, ఓపెనర్ల విజృంభణ వల్ల పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆయుశ్ మాత్రే రెండు, యుధాజిత్ గుహ, కిరన్ చోర్మలే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Samarth takes his 3️⃣rd wicket! 💥Shahzaib Khan departs after scoring 159Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/m3dZn8YskL— Sony LIV (@SonyLIV) November 30, 2024 ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. అలీ రజా బౌలింగ్‌లో సాద్ బేగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ కూడా 15 పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. నిఖిల్ కుమార్ హాఫ్ సెంచరీ(67) చేయగా.. మిగతా వారిలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26), మొహ్మద్ ఇనాన్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 238 పరుగులకే పరిమితమైన యువ భారత్ పాక్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ఆశలపై నీళ్లు! -
ODI: ఆఖరి బంతికి అద్భుతం.. ఇంగ్లండ్‌కు భారీ షాక్
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు సంచలన విజయం సాధించింది. దాదాపు ఇరవై మూడేళ్ల అనంతరం తొలిసారి ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో గెలుపొందింది. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసి జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైంది.తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఘన విజయంఇందుకోసం ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లిష్ జట్టు.. తొలి రెండు వన్డేల్లో ఘన విజయం సాధించింది. శనివారం నాటి (సెప్టెంబరు 7) మ్యాచ్‌లో 4 వికెట్లు, సోమవారం నాటి వన్డే(సెప్టెంబరు 9) రెండో వన్డేల్లో ఏకంగా 275 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.22 ఓవర్లకు మ్యాచ్ కుదింపుఈ క్రమంలో మూడో వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకోవాలని భావించిన ఐర్లాండ్.. తమ సంకల్పం నెరవేర్చుకుంది. బెల్ఫాస్ట్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. 22 ఓవర్లకు కుదించారు. ఇక ఈ వన్డేలో టాస్ ఓడిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బౌలింగ్ చేసింది.5 వికెట్లు తీసిన ఐరిష్ స్పిన్నర్బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ క్రికెటర్లలో టామీ బీమౌంట్(42 బంతుల్లో 52 పరుగులు) మాత్రమే రాణించింది. మిగతా వాళ్లంతా విఫలం కావడంతో 20.5 ఓవర్లలో 153 పరుగులకే ఇంగ్లండ్ మహిళా జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఐరిష్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఐమీ మగిర్ ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది.Aimee Maguire is on a roll!!! 🎉Sensational stuff from the spinner 👏Her figures so far read 2-0-9-3▪️ England 119-7 (17 overs)#BackingGreen #FuelledByCerta ☘️🏏 pic.twitter.com/4rbxD3RZFM— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2024Two in the over! 🙌Aimee Maguire first gets the better of Freya Kemp and then castles Paige Scholfield! 💥▪️ England 112-5 (15 overs)WATCH: https://t.co/cm9SJGAHrBSCORE: https://t.co/OBAjl0lQouMATCH PROGRAMME: https://t.co/3atiwXGh6G#BackingGreen #FuelledByCerta ☘️🏏 pic.twitter.com/PIp1jvUGbx— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2024 గాబీ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్, కెప్టెన్ గాబీ లూయీస్ ఘనమైన ఆరంభం అందించింది. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 56 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. కానీ మిగతా వాళ్లలో నాలుగో నంబర్ బ్యాటర్ లీ పాల్(22) తప్ప అందరూ విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐర్లాండ్ గెలుపుపై ఆశలను దాదాపుగా వదిలేసుకుంది.5️⃣0️⃣ for Gaby Lewis and she is leading from the front 👏Keep going, skip!▪️ England 153 (20.5 overs)▪️ Ireland 93-2 (12.2 overs)WATCH: https://t.co/cm9SJGBfh9SCORE: https://t.co/OBAjl0moe2MATCH PROGRAMME: https://t.co/3atiwXGOWe#BackingGreen #FuelledByCerta ☘️🏏 pic.twitter.com/I1DVWjhodN— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2024ఆఖరి బంతికి అద్భుతంఆ సమయంలో టెయిలెండర్ అలనా డాల్జెల్ అద్భుతం చేసింది. చివరి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి జోరు మీదున్న ఇంగ్లిష్ బౌలర్ మ్యాడీ విలియర్స్‌కు షాకిస్తూ.. ఆఖరి బంతికి ఫోర్ బాదింది. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో జయకేతం ఎగురవేయగా.. ఊహించని పరిణామానికి కంగుతినడం ఇంగ్లిష్ జట్టు వంతైంది. కాగా ఇరవై మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఐర్లాండ్ మహిళా జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే! -
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
నిసాంక 210 నాటౌట్
పల్లెకెలె: ఓపెనర్ పతున్ నిసాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 42 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. నిసాంక ప్రత్యర్థి బౌలింగ్‌పై కడదాకా విధ్వంసం కొనసాగించాడు. 88 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ ఓపెనర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో తర్వాతి 100 పరుగుల్ని కేవలం 48 బంతుల్లోనే సాధించడంతో 136 బంతుల్లో అతని డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో లంక టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (189) ప్రేక్షకుడిగా హాజరైన ఈ మ్యాచ్‌లోనే నిసాంక అతని రికార్డును అతని కళ్లముందే బద్దలు కొట్టడం విశేషం. అవిష్క ఫెర్నాండో (88 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన నిసాంక... సమరవిక్రమ (45; 4 ఫోర్లు, 1 సిక్స్)తో మూడో వికెట్‌కు 120 పరుగులు జత చేశాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పోరాడి ఓడింది. 27/4 స్కోరు వద్ద కష్టాల్లో పడిన జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (130 బంతుల్లో 136; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్‌కు 242 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. 12 ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య. ఇందులో సగానికి (7)పైగా బాదింది భారత బ్యాటర్లే! ఒక్క రోహిత్ శర్మే మూడు ద్విశతకాలను సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) కూడా వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. 3 నిసాంకది వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ (138 బంతుల్లో). ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో), ఇషాన్ కిషన్ (131 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
నేడు భారత్ Vs ఆసీస్ మధ్య రెండో వన్డే
-
ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్..
ACC Mens Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్.. తుది పోరుకు అర్హత సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో ఆర్షద్ ఇక్భాల్ 5 వికెట్లతో చెలరేగగా.. ముబాసిర్ ఖాన్,సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(97),సహన్ అరాచ్చిగే(97) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఒమర్ యూసఫ్(88), మహ్మద్ హారిస్(52), ముబాసిర్ ఖాన్(42) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో బౌలర్ మహ్మద్ వసీం(24) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో లహిరు సమరకోన్,ప్రమోద్ మదుషన్, కరుణ్ రత్నే తలా రెండు వికెట్లు సాధించగా.. వెల్లలగే, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ పడగొట్టాడరు. ఇక జూన్ 23న కొలంబో వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్ లేదా బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలడపడనుంది. చదవండి: IND vs WI: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న బంగ్లాదేశ్ ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ తమ హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తమ వన్డే క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ బంగ్లా బౌలర్ల దాటికి 30.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ డాక్రెల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎబాదత్ హొసెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసూమ్ అహ్మద్ మూడు, తస్కిన్ అహ్మద్ రెండు, షకీబ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్(89 బంతుల్లో 93), తౌహిద్ హృదోయ్ (85 బంతుల్లో 92) మెరుపులు మెరిపించగా.. ముష్పికర్ రహీమ్ 44 పరుగులు చేశాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో హ్యూమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కర్టిస్ కాంపెర్, ఆండీ మెక్‌బ్రిన్, మార్క్ అడైర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 20న జరగనుంది. త్రౌహిద్ హృదోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు.. -
'రాహుల్ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'
ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యం చిన్నదే అయినప్పటికి టీమిండియా తడబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కకావికలం అయింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో పాండ్యా కాస్త ప్రతిఘటించినా రాహుల్‌తో కలిసి 43 పరుగులు జోడించాకా అతను ఔటయ్యాడు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కంకణం కట్టుకున్న రాహుల్ మాత్రం ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. కానీ అతనికి సహకరించేవారు కరువయ్యారు. అప్పుడు వచ్చాడు రవీంద్ర జడేజా. ఆల్‌రౌండర్‌గా తానేంటో అందరికి తెలుసు. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ టీమిండియా కష్టాల్లో ఉంది. ఈ దశలో అతను కూడా ఔటైతే టీమిండియా ఓడడం ఖాయం. కానీ జడేజా అలా చేయలేదు. మరోసారి తన విలువేంటో చూపిస్తూ ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కెరీర్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడుతున్న కేఎల్ రాహుల్‌కు సహకరిస్తూ తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు. ఎంత రాహుల్ ఆపద్భాందవుడి పాత్రను పోషించి జట్టును గెలిపించినప్పటికి జడేజా లేకపోతే అతను ఆ ఇన్నింగ్స్ ఆడేవాడు కాదు. అందుకే విజయంలో కేఎల్ రాహుల్‌ది ఎంత ముఖ్యపాత్రో.. అంతే స్థాయి విలువ జడేజా ఇన్నింగ్స్‌కు ఉంది. మొత్తంగా 69 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 45 పరుగులు నాటౌట్‌గా నిలిచిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా జడ్డూ ఇన్నింగ్స్‌పై అభిమానులు స్పందించారు. ''కేఎల్ రాహుల్ మ్యాచ్‌ను గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం''.. ''మరోసారి నువ్వేంటో చూపించావు జడేజా.. నీ ఆటకు ఫిదా'' అంటూ కామెంట్ చేశారు. #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 చదవండి: గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్.. -
KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్..
''వరుసగా విఫలమవుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు''.. ''టీమిండియాకు భారంగా తయారయ్యాడు.. జట్టు నుంచి తొలగిస్తే మంచిది''.. ''ఐపీఎల్లో మాత్రమే మెరుస్తాడు.. జాతీయ జట్టు తరపున అతను ఆడడు''.. ''అతనొక ఐపీఎల్ ప్లేయర్.. అవకాశాలు వ్యర్థం''.. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కేఎల్ రాహుల్‌పై వచ్చిన విమర్శలు. కానీ ఇవాళ టీమిండియా కష్టాల్లో ఉంటే అదే కేఎల్ రాహుల్ ఆపద్భాందవుడయ్యాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ తనలోని అసలు సిసలైన బ్యాటర్‌ను వెలికి తీసిన కేఎల్ రాహుల్ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాను చేసింది 75 పరుగులే కావొచ్చు.. కానీ ఆ ఇన్నింగ్స్ ఒక సెంచరీతో సమానం. ఎందుకంటే 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ఈసారి ఎలాగైనా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాలనుకున్నాడేమో. దానిని చేసి చూపించాడు. ఒత్తిడిలో ఆడినప్పుడే అసలైన బ్యాటర్ వెలుగులోకి వస్తాడనే దానికి నిర్వచనంలా మిగిలిపోయింది రాహుల్ ఇన్నింగ్స్. అంత క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. అతని ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్కటి తప్పుడు షాట్ లేకపోవడం విశేషం. అర్థసెంచరీ సాధించేంత వరకు కూడా కేఎల్ రాహుల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టేలేదంటే బ్యాటింగ్ ఎంత కష్టంగా ఉందో చెప్పొచ్చు. మొత్తంగా 90 బంతులాడిన రాహుల్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 75 పరుగులు చేశాడు. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ టీమిండియా అభిమానులకు కొంతకాలం పాటు గుర్తుండిపోవడం ఖాయం. తన చెత్త ప్రదర్శనతో జట్టులో చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్న రాహుల్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ పెట్టి మరో పది మ్యాచ్‌ల వరకు తనపై వేలెత్తి చూపకుండా చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే హీరో అవుతాడని అంటుంటారు.. మరి ఎంత కాదన్నా ఇవాళ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హీరోనే కదా. An excellent knock from @klrahul here in Mumbai when the going got tough!#TeamIndia 22 runs away from victory. Live - https://t.co/8mvcwAwwah #INDvAUS @mastercardindia pic.twitter.com/Ct4Gq1R1ox — BCCI (@BCCI) March 17, 2023 చదవండి: IND Vs AUS: రాహుల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్.. తొలి వన్డే టీమిండియాదే -
గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 పరుగులు నాటౌట్) తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. జడేజా(69 బంతుల్లో 45 పరుగులు నాటౌట్) తన స్టైల్ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఒక దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ దశలో జట్టు స్కోరు 89 పరుగులకు చేరగానే పాండ్యా(25 పరుగులు) ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జడేజా తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఎలాంటి పొరపాటు చేయకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కేఎల్ రాహుల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత కాస్త వేగం పెంచగా జడ్డూ అతనికి సహకరించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది, మిచెల్ మార్ష్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీ, సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. జడ్డూ రెండు, కుల్దీప్ , పాండ్యా చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 19న(ఆదివారం) విశాఖపట్నం వేదికగా జరగనుంది. #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 -
దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే!
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మొదలైన తొలి వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇన్నింగ్ ఆరంభంలో మిచెల్ మార్ష్ దూకుడు చూసి ఆసీస్ స్కోరు మూడు, నాలుగు వందలు దాటుతుందని అంతా భావించారు. ఎందుకంటే మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉన్నంతసేపు ఆసీస్ స్కోరు మెరుపు వేగంతో పరిగెత్తింది. 19 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అంటే ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున రన్‌రేట్ నమోదయ్యింది. కానీ మార్ష్ ఔటయ్యాకా పరిస్థితి మొత్తం మారిపోయింది. టి20లతో పోలిస్తే వన్డేలు అంటే కాస్త నెమ్మదిగా ఆడాలన్న విషయాన్ని మరిచిపోయిన ఆసీస్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్ కేవలం 59 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ ఆడిన తీరుపై పెదవి విరిచిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మీ దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయారుగా..'' అంటూ పేర్కొన్నారు. చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ.. -
Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని ప్రత్యేకంగా కలిశాడు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. ఇక క్రికెట్‌పై ఆయనకున్న అభిమానం ఇవాళ వాంఖడే స్టేడియానికి రప్పించిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ పేర్కొన్నాడు. ''వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ని ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు'' అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. Superstar #Rajinikanth at the Wankhede stadium watching the #INDvsAUS 1st ODI match pic.twitter.com/8XB0Uvsltu — Chennai Times (@ChennaiTimesTOI) March 17, 2023 చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లితో రోహిత్ పోటాపోటీ! -
Ind Vs Aus: ఆసీస్‌తో వన్డే సమరానికి టీమిండియా సై.. ప్రధాన లక్ష్యం అదే!
సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏ ఫార్మాట్లో పోరు అయినా ఆసక్తిని రేపుతుంది. కానీ బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా టెస్టు మ్యాచ్‌లపై ఇటీవలి వరకు అందరి దృష్టీ నిలవగా, త్వరలో జరగబోయే ఐపీఎల్‌పై కూడా చర్చ షురూ కావడంతో ఈ వన్డే సిరీస్‌పై హడావిడి కాస్త తక్కువగా కనిపిస్తోంది. పైగా వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో కూడా ఈ సిరీస్ భాగం కాదు. అయితే ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్ కప్ కోసం రిహార్సల్‌గా ఆసీస్ ఈ సిరీస్‌ను చూస్తుండగా... భారత్ కూడా మెగా టోర్నీకి తమ అత్యుత్తమ వన్డే జట్టును ఎంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మూడు వన్డేల్లో ఫలితంకంటే వ్యక్తిగత ప్రదర్శనలే కీలకం. ముంబై: టెస్టు సమరం తర్వాత భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు వాంఖెడే మైదానంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ ఫార్మాట్లో వరుస విజయాలతో టీమిండియా నిలకడ ప్రదర్శించగా...దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కంగారూ బృందం వన్డే బరిలోకి దిగుతోంది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్ల సమంగా కనిపిస్తుండగా, అంతిమ విజేత ఎవరో చూడాలి. మరో వైపు వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరం కావడంతో హార్దిక్ పాండ్యా తొలి సారి వన్డే కెపె్టన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. భారత్‌కు వన్డేల్లో కెపె్టన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా పాండ్యా నిలుస్తాడు. పటిదార్‌కు అవకాశం! భారత జట్టు ఇటీవలి ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో ఎలాంటి సమస్య లేదు. అద్భుతమైన ఆటతో గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఖరారు చేసుకోగా, రోహిత్ గైర్హాజరులో కిషన్‌కు మళ్లీ టీమ్‌లో చోటు ఖాయం. వీరిద్దరు శుభారంభం అందిస్తే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. గత ఏడు వన్డేల్లో 3 సెంచరీలు బాదిన కోహ్లి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన 75 సెంచరీల జాబితాలో మరిన్ని చేర్చుకునేందుకు ఇది అతనికి మరో అవకాశం. మిడిలార్డర్లో మెరుగైన రికార్డు ఉన్న రాహుల్ కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే శ్రేయస్ గాయం కారణంగా దూరం కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరం. సూర్యకుమార్ ఈ స్థానం కోసం అసలైన పోటీదారే అయినా ఆడిన 20 వన్డేల్లో అతని పేలవ రికార్డు సందేహాలు రేకెత్తిస్తోంది. కొత్త ఆటగాడు రజత్ పటిదార్నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. ఆల్రౌండర్లుగా హార్దిక్, జడేజా తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తే తిరుగుండదు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా షమీ, సిరాజ్ ఉంటే బ్యాటింగ్ బలం కోసం శార్దుల్‌ను ఎంపిక చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ స్థానంకోసం అక్షర్, సుందర్ మధ్య పోటీ ఉంది. మ్యాక్స్‌వెల్‌పై దృష్టి... కమిన్స్, హాజల్‌వుడ్‌తో పాటు జాయ్ రిచర్డ్సన్లాంటి పేసర్లు దూరమైనా ఆ్రస్టేలియా జ ట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వరు సగా ఆల్రౌండర్లలో జట్టు నిండి ఉంది. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగుతుండటం జట్టు బలాన్ని పెంచింది. ఫించ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌లో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు హెడ్ ఉవ్వి ళ్ళూరుతున్నాడు. టెస్టుల్లో చెత్త ప్రదర్శన చూపిన వార్నర్ ఇక్కడైనా రాణించడం కీలకం. ఎప్పటిలాగే స్మిత్, లబుషేన్ బ్యాటింగ్ జట్టుకు కీలకం కానుంది. మిచెల్ మార్ష్ , స్టొయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్...ఈ నలుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులోని రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి అవకాశం దక్కినా వారు టీమ్ విలువ పెంచగల సమర్థులు. ప్రధాన పేసర్‌గా స్టార్క్ ముందుండి నడిపించనుండగా యువ ఆటగాడు ఎలిస్‌కు కూడా అవకాశం ఖా యం. లెగ్‌స్పిన్నర్ జంపా భారత బ్యాట ర్లను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించగలడు. -
రిపబ్లిక్ డే రోజు టీమిండియా గెలిచిన ఏకైక వన్డే ఏదో గుర్తుందా..?
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు భారత క్రికెట్ జట్టు ఏదైన మ్యాచ్ గెలిచిందా..? గెలిచి ఉంటే.. ఆ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై గెలిచింది..? ఈ వివరాలు 2023 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని భారత క్రికెట్ అభిమానుల కోసం. వివరాల్లోకి వెళితే.. 2019 న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా భారత జట్టు రిపబ్లిక్ డే రోజున ఓ వన్డే మ్యాచ్ గెలిచింది. చరిత్రలో ఈ రోజున టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఆతిధ్య జట్టుపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఒక్క విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజు ఇప్పటివరకు టీమిండియాకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లభించలేదు. ఈ మ్యాచ్‌కు ముందు 3 సందర్భాల్లో ఇదే రోజున టీమిండియా వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ, విజయం సాధించలేకపోయింది. Another brilliant performance by the Men in Blue. #TeamIndia wrap the second ODI, win by 90 runs. 2-0 🇮🇳🇮🇳 #NZvIND pic.twitter.com/2fTF9uQ5JM — BCCI (@BCCI) January 26, 2019 1985-86 వరల్డ్ సిరీస్‌లో భాగంగా తొలిసారి రిపబ్లిక్ డే రోజున అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత 2000 సంవత్సరంలో ఇదే రోజు, అదే అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆసీస్ చేతిలోనే రెండోసారి కూడా ఓడింది (152 పరుగుల తేడాతో). 2015 సిడ్నీ వేదికగా రిపబ్లిక్ డే రోజున ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఇలా.. చరిత్రను తిరగేస్తే, భారత క్రికెట్ జట్టు 2019లో న్యూజిలాండ్‌పై విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజున ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకు ఈ విజయానికి అంత ప్రత్యేకత. ఇక, ఆ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (87), శిఖర్ ధవన్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో ధోని (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/45), చహల్ (2/52) మాయాజాలం దెబ్బకు 40.2 ఓవర్లలో 234 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డౌగ్ బ్రేస్‌వెల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
కివీస్ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు
రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. తొలి వన్డేలో పోరాడిన జట్టేనా ఇప్పుడు ఆడుతుంది అన్న తరహాలో కివీస్ బ్యాటింగ్ సాగుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 20, మిచెల్ సాంట్నర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న మైకెల్ బ్రాస్‌వెల్ ఈ మ్యాచ్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్ల దాటికి కివీస్ టాపార్డర్ కకావికలమైంది. మహ్మద్ షమీ తన పేస్ పదును చూపిస్తూ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వన్డేల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియాతో వన్డేలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్‌కు ఇదే అత్యల్పం. ఇంతకముందు 2001లో శ్రీలంకతో మ్యాచ్‌లో 18 పరుగులకు ఐదు వికెట్లు, 2010లో బంగ్లా తో మ్యాచ్‌లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా! -
9 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో కివీస్
టీమిండియాతో రెండో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. తొమ్మిది పరుగులకే మూడో వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు సిరాజ్, షమీలు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించారు. పిచ్‌పై ఉన్న పచ్చికను బాగా ఉపయోగించుకున్న షమీ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్‌కు క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మహ్మద్ సిరాజ్ రెండు పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లో షమీ బౌలింగ్‌లో డారిల్ మిచెల్(1) కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. లాథమ్ 1, కాన్వే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
తొలి వన్డేకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం
-
మా శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకోవడానికి నాకు ఇది మంచి అవకాశం
-
'సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్.. వరల్డ్‌కప్‌కు బలమైన జట్టే లక్ష్యంగా'
సాక్షి, హైదరాబాద్: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే బుధవారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంకతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా కివీస్‌పై కూడా అదే ప్రదర్శన కనబరచాలని ఉవ్విళ్లూరుతుంది. కాగా మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గేమ్‌ప్లాన్ స్ట్రాటజీని మీడియాకు వివరించాడు. వివరాలు రోహిత్ మాటల్లోనే.. ''బలమైన టీం తో ఆడుతున్నాం మా శక్తి సామర్ధ్యాలను పరీక్షించు కోవడానికి మాకు ఇది మంచి అవకాశం. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్ కు ఈ సారి మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. వన్డే వరల్డ్‌కప్ వరకు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక మహ్మద్ సిరాజ్‌కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్. తొలిసారి హోమ్‌గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్. గత రెండేళ్లుగా సూపర్ ప్రదర్శన కనబరుస్తున్న సిరాజ్ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్త బంతితో వికెట్లు తీస్తూ టీమిండియాకు బూస్టప్ ఇస్తున్నాడు. ఇది మాకు మంచి పరిణామం. ప్రస్తుతం సిరాజ్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. వరల్డ్ కప్ దగ్గరపడుతుండడంతో అతనిపై వర్క్‌లోడ్ కాస్త ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ జట్టులో ప్రధాన బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. కచ్చితంగా రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో అతను కీలకం కానున్నాడు. ఇక రేపటి వన్డేలో జట్టు ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారించాం. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉందన్న విషయం ఇప్పుడు ఆలోచించడం లేదు. మా శక్తి సామర్థ్యాలపై మాత్రమే మ్యాచ్ విజయం ఆధారపడి ఉంటుంది. స్పిన్నర్లు చహల్, అక్షర్ , షెహబాష్ ,కుల్దీప్ యాదవ్‌లు అందుబాటులో ఉన్నారు. మ్యాచ్ సమయానికి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు లేదా ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లు కాంబినేషన్‌పై ఆలోచిస్తాం. ఇక వన్డే వరల్డ్ కప్ జరగనున్న అక్టోబర్-నవంబర్ నెలలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మ్యాచ్ టైమింగ్ అనేది మాచేతుల్లో లేదు.. దానిని బ్రాడ్ కాస్టర్స్ డిసైడ్ చేస్తారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు
విశాఖ స్పోర్ట్స్: విశాఖ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో పర్యటించనున్న ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడేందుకు రానుంది. ఆ్రస్టేలియా జట్టు ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లాడనుండగా.. రెండో వన్డే మార్చి19న వైఎస్సార్ స్టేడియం వేదికగా జరగనుంది. 17న తొలి వన్డే ముంబయిలో, 22న మూడో వన్డే చెన్నై వేదికగా బీసీసీఐ ఖరారు చేసింది. ఇక 12 ఏళ్ల విరామం అనంతరం మరోసారి ఆస్ట్రేలియా జట్టు విశాఖ క్రీడాభిమానులను అలరించనుంది. 2010 అక్టోబర్ 10న కంగారు జట్టు భారత్‌తో ఆడింది. అప్పట్లోనూ సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలోనే ఇరు జట్లు ఇక్కడ తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ ఏడు బంతులుండగా విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌తో భారత్ సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది. విరాట్‌కోహ్లీ విశ్వరూపం చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్ తరఫున శిఖర్‌ధావన్ ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశాడు. చదవండి: మొక్కుబడిగా ఆడుతున్నారు.. గెలవాలన్న తపనే లేదు! ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు! -
అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా
డిసెంబర్లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌లో భాగంగా షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్‌లు బంగ్లా రాజధాని ఢాకాలోనే జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డే వేదికను మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్‌కు మార్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) బుధవారం పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) డిసెంబర్ 10న వేలాది మందితో ఢాకా వీదుల్లో ర్యాలీతో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే అదే రోజు డాకాలో మూడో వన్డే జరగాల్సి ఉంది. దీంతో అల్లర్లకు ఆస్కారం ఉండడంతో వన్డే వేదికను మార్చాలని బీసీబీ నిర్ణయించుకుంది. అందుకే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డేను డాకాలో కాకుండా చిట్టగాంగ్ వేదికగా జరుగుతుందని తెలిపింది. ఇక గత నెలలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్పీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీఎన్పీ కోరుతుంది. ఇక మొదటగా అనుకున్న ప్రకారం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు డాకా, చిట్టగాంగ్‌లు వేదికలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని బీసీబీ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యునస్ తెలిపారు. డిసెంబర్ 4,7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. డిసెంబర్ 14-18 వరకు చిట్టగాంగ్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 22-26 వరకు డాకా వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా! బంగ్లాతో టెస్టు సిరీస్.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య? -
ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా!
ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో కివీస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 25 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో మిచెల్ స్టార్క్(45 బంతుల్లో 38 నాటౌట్), జోష్ హాజిల్‌వుడ్(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, మాట్ హెన్రీ 3, సౌథీ, సాంట్నర్ చెరొక వికెట్ తీశారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బ్యాటింగే దారుణమనుకుంటే.. న్యూజిలాండ్ బ్యాటర్లు అంతకన్నా ఘోరంగా ఆడడం గమనార్హం. కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న(ఆదివారం) జరగనుంది. -
జింబాబ్వే టూర్ ను ఘనంగా ఆరంభించిన భారత్
-
SCO Vs NZ: అదరగొట్టిన లీస్క్.. కానీ పాపం చాప్మన్ విజృంభణతో.. ఏకైక వన్డేలోనూ..
Scotland vs New Zealand, Only ODI: టీ20 సిరీస్‌లో స్కాట్లాండ్ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఏకైక వన్డే మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. మార్క్ చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. కాగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఒక వన్డే మ్యాచ్ ఆడేందుకు కివీస్ స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మిచెల్ సాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో వరుసగా 68, 102 పరుగులతో స్కాట్లాండ్పై ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఏకైక వన్డేలోనూ గెలుపొంది స్కాట్లాండ్ టూర్‌ను విజయంతో పరిపూర్ణం చేసుకుంది. మ్యాచ్ సాగిందిలా! ఎడిన్బర్గ్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆతిథ్య స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ 53 పరుగులతో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మైఖేల్ లీస్క్ 85 పరుగుల(55 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు. 50 for @leasky29 💪#FollowScotland 🏴 pic.twitter.com/nUiVFL2z3Q — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 మిగిలిన వాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారు ఫర్వాలేదనిపించారు. దీంతో 49.4 ఓవర్లలో 306 పరుగులు చేసి స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీ 3, ఫెర్గూసన్ 2, టిక్నర్ ఒకటి, బ్రాస్‌వెల్ 3 వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అందరూ ఆడేసుకున్నారు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (47), ఫిన్ అలెన్(50) శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ క్లీవర్ 32 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మార్క్ చాప్మన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. WICKET ⚡️ Leasky gets Guptill LBW 👊@BLACKCAPS 128/2 after 23 #FollowScotland 🏴 pic.twitter.com/Bpe4GnIEMm — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 75 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. డారిల్ మిచెల్ సైతం 74 పరుగులు(నాటౌట్) చేశాడు. దీంతో 45.5 ఓవర్లకే లక్ష్యం ఛేదించిన న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. మార్క్ చాప్మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే: ►టాస్: స్కాట్లాండ్- బ్యాటింగ్ ►స్కాట్లాండ్ స్కోరు: 306 (49.4) ►న్యూజిలాండ్ స్కోరు: 307/3 (45.5) ►విజేత: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ చాప్మన్ చదవండి: ENG VS SA 3rd T20: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ IND VS WI 2nd T20: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా.. ? రెండో టీ20లో విండీస్‌తో ఢీకి రెడీ అయిన రోహిత్ సేన -
విండీస్‌పై టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్‌పై టీమిండియా విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు.మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టీమిండియా దక్కించుకుంది. భారత బ్యాట్స్మెన్లలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శామ్సన్ 54, శుభమన్ గిల్ 43, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. 300 పైచిలుకు స్కోరు చేసిన వెస్టిండీస్ భారత బౌలింగ్‌ను కరీబియన్లు మళ్లీ ఓ ఆటాడుకున్నారు. దీంతో అవలీలగా మళ్లీ రెండో వన్డేలోనూ వెస్టిండీస్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న ఓపెనర్ షై హోప్ (135 బంతుల్లో 115; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. తొలి బంతి నుంచి 49వ ఓవర్‌దాకా విండీస్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ @244 వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో బరిలో దిగడం ద్వారా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 244వ క్రికెటర్‌గా అవేశ్ ఖాన్ గుర్తింపు పొందాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ చేతుల మీదుగా అవేశ్ టోపీని అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్ ఖాన్ ఇప్పటివరకు భారత్ తరఫున 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో విండీస్ జట్టుపై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ కంగారు పెట్టించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. గర్జించిన భారత్ బ్యాట్స్‌మెన్ సీనియర్లు లేని భారత టాపార్డర్ వెస్టిండీస్ బౌలింగ్‌పై గర్జించింది. ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోగా... శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీశారు. ఓపెనర్ల శుభారంభం ధావన్, గిల్ జోడీ ఓపెనింగ్‌లో అదరగొట్టింది. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు చేశారు. దీంతో తొలి 3 ఓవర్లయితే టి20ని తలపించింది. ఈ ధాటి కొనసాగడంతో 6.5 ఓవర్లలో భారత్ స్కోరు 50కి చేరింది. చూడచక్కని షాట్లతో గిల్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో 14 ఓవర్ల దాకా 7పైచిలుకు రన్‌రేట్‌తో భారత్ 100/0 స్కోరు చేసింది. తర్వాత 18వ ఓవర్లో ధావన్ 53 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేయగా, గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధావన్ సెంచరీ మిస్ అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో రెండో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగడంతో కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సెంచరీపై కన్నేసిన ధావన్... గుడకేశ్ మోతీ 34వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కానీ తర్వాతి బంతికే అతను పెవిలియన్ చేరడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్, సూర్యకుమార్ (13) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. సంజూ సామ్సన్ (12) కూడా విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 48వ ఓవర్లో అక్షర్ పటేల్ (21; ఫోర్, సిక్స్) 6, 4 కొట్టగా, దీపక్ హుడా (27; ఫోర్, సిక్స్) 6 బాదడంతో ఏకంగా 20 పరుగులొచ్చాయి. అల్జారీ జోసెఫ్ 49వ ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చగా, ఆఖరి ఓవర్లో భారత్ 300 మార్క్‌ను దాటింది. -
సెంచరీ మిస్ అయినా రికార్డుల మోత
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో స్టాండింగ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై శతకం అందుకోవాలన్న ధావన్ ఈ మ్యాచ్‌లో తీరకుండానే ఔటయ్యాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికి ధావన్ తొలి వన్డేలో మాత్రం రికార్డుల మోత మోగించాడు. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ►అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు. ►వెస్టిండీస్ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా కోహ్లితో కలిసి ధావన్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి, ధావన్‌లు విండీస్ గడ్డపై 15 మ్యాచ్‌లు ఆడారు. ►విండీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా టాప్-5 బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ యువరాజ్, రోహిత్ శర్మలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ధావన్ 15 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేశాడు. ధావన్ కంటే ముందు ఎంఎస్ ధోని(15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు), కోహ్లి (15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు), ఉన్నారు. ►శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. హషీమ్ ఆమ్లా 57, విరాట్ కోహ్లీ, వీవిన్ రిచర్డ్స్ 55 సార్లు 50+ స్కోర్లు చేయగా శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు. ►వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు. ►వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్. 22 ఏళ్ల 215 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌లో వన్డేల్లో 50+ స్కోరు నమోదు చేయగా, శుబ్‌మన్ గిల్ వయసు ప్రస్తుతం 22 ఏళ్ల 317 రోజులు. చదవండి: హాట్ టాపిక్‌గా భారత్- విండీస్ వన్డే ట్రోపీ.. ఎక్తాకపూర్ తయారు చేసిందా? -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో వెస్టిండీస్‌పై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఇక ఛేజింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులు చేశారు. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. విండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. వెస్టిండీస్ టార్గెట్ 309 ►వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఒక దశలో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత 20 ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షెపర్డ్, హొసెన్ తలా ఒక వికెట్ తీశారు. 45 ఓవర్లలోటీమిండియా 264/5 ►టీమిండియా 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. దీపక్ హుడా 12, అక్షర్ పటేల్ 4 పరుగులతో ఆడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్(54) ఔట్.. మూడో వికెట్ డౌన్ ►శ్రేయాస్ అయ్యర్(54) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మోతీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 9 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ సెంచరీ మిస్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ►విండీస్‌తో తొలి వన్డేలో శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయ్యర్ 45, సూర్యకుమార్ ఒక పరుగుతో ఆడుతున్నారు. సెంచరీ దిశగా ధావన్.. టీమిండియా 193/1 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 87 పరుగులు.. సెంచరీ వైపు పరుగులు తీస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులతో ఆడుతున్నాడు. గిల్ రనౌట్.. టీమిండియా 20 ఓవర్లలో 127/1 ►టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 57, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు శుబ్‌మన్ గిల్(64) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే? ►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. గిల్ 41, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 50/0 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 24, శుబ్‌మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ►ఇంగ్లండ్‌తో సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సహా సీనియర్ల గైర్హాజరీలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ భారత్ జట్టు విండీస్‌తో తలపడుతుండడంతో ఆసక్తిగా మారింది. ముందుగా అనుకున్నట్లే జడేజా గాయంతో ఈ వన్డేకు దూరం కాగా.. జాసన్ హోల్డర్ కరోనా కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు. A look at our Playing XI for the 1st ODI. Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75 — BCCI (@BCCI) July 22, 2022 భారత్: ధావన్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ,దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్, చహల్, సిరాజ్. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ పిచ్, వాతావరణం వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్ రోజు మాత్రం వర్ష సూచన లేదు. -
కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా
-
మాంచెస్టర్ వన్డేలో భారత్ ఘన విజయం
-
కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
న్యూజిలాండ్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 12న(మంగళవారం) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే అదే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కివీస్ సీమర్ బ్లెయిర్ టిక్నర్ గుడ్‌లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. క్రీజులో ఉన్న సిమీ సింగ్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ టాప్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ పాల్ రెనాల్డ్స్ మొదట ఔట్ అంటూ వేలెత్తాడు. అయితే మరుక్షణమే ఔట్ కాదంటూ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అంపైర్ నిర్ణయంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. వెంటనే టామ్ లాథమ్ ఎందుకు ఔట్ కాదంటూ అంపైర్ వద్దకు వచ్చాడు. కాగా టిక్నర్ బంతి విడుదల చేయడానికి ముందు అతని టవల్ పిచ్‌పై పడింది. ఇది నిబంధనలకు విరుద్దమని.. ఈ చర్య వల్ల బ్యాట్స్‌మన్ ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌బాల్‌గా ప్రకటించినట్లు తెలిపాడు. దీంతో లాథమ్ అసలు టవల్ వల్ల బ్యాటర్ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని వివరించినప్పటికి పాల్ రెనాల్డ్స్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. ఇక చేసేదేం లేక టామ్ లాథమ్ నిరాశగా వెనుదిరిగాడు. అలా ఔట్ నుంచి బయటపడ్డ సిమీ సింగ్ 25 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. మరి క్రికెట్లో చట్టాలు అమలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఏం చెబుతుందంటే.. ►ఎంసీసీ లా ఆఫ్ క్రికెట్ ప్రకారం లా 20.4.2.6 కింద ఏవైనా శబ్దాలు.. ఏదైనా కదలిక.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఫీల్డ్ అంపైర్‌కు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించే అధికారం ఉంటుంది. ఇది మ్యాచ్ జరుగుతున్న మైదానంలో కావొచ్చు.. లేదా మైదానం బయట ప్రేక్షకుల స్టాండ్స్‌లో జరిగినా కూడా అంపైర్ డెడ్‌బాల్‌గా పరిగణిస్తాడు. ►లా 20.4.2.7 ప్రకారం స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ దృష్టి మరల్చడానికి లా 41.4 (ఉద్దేశపూర్వక ప్రయత్నం) లేదా లా 41.5 (ఉద్దేశపూర్వకంగా మోసం లేదా బ్యాటర్‌ను అడ్డుకోవడం) కిందకు వస్తుంది. టిక్నర్ తన తప్పు లేకున్నప్పటికి అతని టవల్ బంతి విడవడానికి ముందే పిచ్‌పై పడడంతో అంపైర్ పాల్ రెనాల్డ్స్ పై రెండు నిబంధన ప్రకారం డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. pic.twitter.com/lmFW1uEnwr — ParthJindalClub (@ClubJindal) July 13, 2022 -
అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం
ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా సహా మరికొంతమంది ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇదే మ్యాచ్‌కు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో సచిన్.. గారీ సోబర్స్‌తో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ''సర్ గారీతో లార్డ్స్‌లో మ్యాచ్ చూసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఇది నిజంగా స్పెషల్ మూమెంట్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక గార్ఫీల్డ్ సోబర్స్ వెస్టిండీస్ నుంచి వచ్చిన దిగ్గజ ఆల్‌రౌండర్. విండీస్ తరపున సోబర్స్ 93 టెస్టుల్లో 8032 పరుగులు సహా బౌలింగ్‌లో 235 వికెట్లు పడగొట్టాడు. వన్డే కెరీర్లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ నిలిచాడు. కాగా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట 2004 నుంచి ఐసీసీ అవార్డు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐసీసీ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును(ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్) పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది దక్కించుకున్నాడు. ఇక భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. క్రికెట్ గాడ్‌గా పేరు పొందిన సచిన్ క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు(టెస్టుల్లో 51, వన్డేల్లో 49) కొట్టిన తొలి ఆటగాడిగా సచిన్ చరిత్ర పుటల్లో నిలిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,246 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డే విషయానికి వస్తే.. ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రీస్ టాప్లీ ఆరు వికెట్లతో దుమ్మురేపడంతో భారత్ 143 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు ఇంగ్లండ్ 49 ఓవర్లలో 243 పరుగులుకు ఆలౌట్ అయింది. ఇరుజట్ల మధ్య చివరి వన్డే(జూలై 17న) ఆదివారం జరగనుంది. Got to watch the game at Lord's with the One and Only Sir Gary!#SpecialMoment😀 pic.twitter.com/9WzYi91Z1a — Sachin Tendulkar (@sachin_rt) July 15, 2022 చదవండి: England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Scott Styris: 'స్విచ్‌హిట్ బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే' -
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం
బుమ్రా వేసిన నాలుగో బంతి...రాయ్ వికెట్లపై ఆడుకున్నాడు...మరో రెండు బంతులకే రూట్ అవుట్...అతని రెండో ఓవర్లో కాస్త ప్రశాంతత... మరుసటి ఓవర్లో టెస్టు మ్యాచ్ హీరో బెయిర్‌స్టో ఖేల్ ఖతం...ఆ తర్వాతి ఓవర్లో లివింగ్‌స్టోన్ క్లీన్‌బౌల్డ్...ఆఖర్లో తిరిగొచ్చి మరో రెండు వికెట్లు...ఇదీ జస్ప్రీత్ చూపించిన జాదూ...మధ్యలో నేనూ ఉన్నాను అన్నట్లుగా షమీ జోరు...చక్కటి బంతితో స్టోక్స్ పని పట్టిన అతను, జట్టును రక్షించే ప్రయత్నం చేస్తున్న బట్లర్‌ను సాగనంపగా... మరో వికెట్‌తో ప్రసిధ్ కూడా పార్టీలో భాగమయ్యాడు. ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నానంటూ టాస్ సమయంలో రోహిత్ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్‌తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్ ముందు ప్రపంచ చాంపియన్ తలవంచింది. లైనప్‌లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్ చూస్తే ఈ టీమ్ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది. అనంతరం భారత ఓపెనర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ 31.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించారు. లండన్: ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్‌ను కూడా ఘనంగా ప్రారంభించింది. ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ కాగా, మొత్తంగా ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (6/19) చెలరేగగా... షమీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్ ధావన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) వన్డేల్లో 18వ సారి శతక భాగస్వామ్యం నమోదు చేసి జట్టును గెలిపించారు. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్ ఆడలేదు. రేపు లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. టపటపా... ప్రత్యర్థి జట్టులో సత్తా ఉన్న బౌలర్లు, పదునైన స్వింగ్ ఉంటే సొంతగడ్డపై కూడా తాము బలహీనమేనని ఇంగ్లండ్ మరో సారి రుజువు చేసింది. బుమ్రా ఓవర్లో తొలి మూడు బంతులను ఎంతో కష్టంగా ఎదుర్కొన్న జేసన్ రాయ్ (0) దూరంగా వెళుతున్న తర్వాతి బంతిని వెంటాడి వెనుదిరిగాడు. ఆ తర్వాత అనూహ్యంగా పైకి ఎగసిన బంతిని ఆడలేక రూట్ (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. లోపలికి దూసుకొచ్చిన షమీ ఇన్‌స్వింగర్ స్టోక్స్ (0) ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోగా, పంత్ అద్భుతంగా అందుకున్నాడు. ఇటీవల చెలరేగుతున్న బెయిర్‌స్టో (7) కూడా ఇంగ్లండ్‌ను ఆదుకోవడంలో విఫలం కాగా, ఏడు బంతుల్లో పరుగులు చేయలేని అసహనంతో బుమ్రా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన లివింగ్‌స్టోన్ (0) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. 26కు సగం జట్టు పెవిలియన్ చేరగా...బట్లర్, మొయిన్ అలీ (14) భాగస్వామ్యంపై ఇంగ్లండ్ నమ్మకం పెట్టుకుంది. అయితే ఇదీ ఎంతో సేపు సాగలేదు. అలీని రిటర్న్ క్యాచ్‌తో ప్రసిధ్ అవుట్ చేయగా, బౌండరీ వద్ద సూర్యకుమార్ ఏకాగ్రత బట్లర్ వెనుదిరిగేలా చేసింది. కాస్త గౌరవప్రదమైన స్కోరు చేద్దామనుకున్న జట్టు ఆశలు ఈ వికెట్‌తో ముగిసిపోయాయి. అలవోకగా... ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్, ధావన్‌లకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, ధావన్ మాత్రం జాగ్రత్త ప్రదర్శించాడు. ఒక్క ఇంగ్లండ్ బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోవడంతో జట్టు లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఒవర్టన్ వేసిన పదో ఓవర్లో రోహిత్ సిక్స్‌తో స్కోరు 50 పరుగులకు చేరింది. ఆ తర్వాత కార్స్ ఓవర్లో సిక్సర్‌తో 49 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్లో స్కోరు వంద పరుగులు దాటింది. కార్స్ వేసిన ఓవర్లో పాయింట్ దిశగా ఫోర్ కొట్టి శిఖర్ ధావన్ మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) బుమ్రా 0; బెయిర్‌స్టో (సి) పంత్ (బి) బుమ్రా 7; రూట్ (సి) పంత్ (బి) బుమ్రా 0; స్టోక్స్ (సి) పంత్ (బి) షమీ 0; బట్లర్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 30; లివింగ్‌స్టోన్ (బి) బుమ్రా 0; అలీ (సి) అండ్ (బి) ప్రసిధ్ 14; విల్లీ (బి) బుమ్రా 21; ఒవర్టన్ (బి) షమీ 8; కార్స్ (బి) బుమ్రా 15; టాప్లీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (25.2 ఓవర్లలో ఆలౌట్) 110. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–7, 4–17, 5–26, 6–53, 7–59, 8–68, 9–103, 10–110. బౌలింగ్: షమీ 7–0–31–3, బుమ్రా 7.2–3–19–6, హార్దిక్ 4–0–22–0, ప్రసిధ్ 5–0–26–1, చహల్ 2–0–10–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 76; ధావన్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లో వికెట్ నష్టపోకుండా) 114. బౌలింగ్: విల్లీ 3–0–8–0, టాప్లీ 5–3–22–0, ఒవర్టన్ 4–0–34–0, కార్స్ 3.4–0–38–0, స్టోక్స్ 1–0–1–0, అలీ 2–0–9–0. ►వన్డేల్లో భారత్ తరఫున బుమ్రా మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ►వన్డేల్లో బుమ్రాకు ఇదే అత్యుత్తమ బౌలింగ్. గతంలో ఇది 5/27 (శ్రీలంక)గా ఉంది. ►వన్డేల్లో ఇంగ్లండ్‌కు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు. ఇంగ్లండ్‌పై భారత్ 10 వికెట్లతో గెలవడం ఇదే మొదటిసారి కాగా, మిగిలిన బంతుల పరంగా (188) భారత్‌కు ఇది మూడో అతి పెద్ద విజయం. ►ఓపెనర్లుగా 5 వేల పరుగులు జోడించిన నాలుగో జోడీగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నిలిచారు. చదవండి: Rohit Sharma-Shikar Dhawan: రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్-ధావన్ ద్వయం అరుదైన ఫీట్ Steve Smith: 'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు' -
ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర..
టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేశాడు. మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురిని డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. మరో ముగ్గురిని తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా పలు అరుదైన రికార్డులు సాధించాడు. ►టీమిండియా తరపున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఐదో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్టువర్ట్ బిన్నీ( 2014లో బంగ్లాదేశ్‌పై 6/4), అనిల్ కుంబ్లే (1993లో వెస్టిండీస్‌పై 6/12), ఆశిష్ నెహ్రా(2003లో ఇంగ్లండ్‌పై, 6/23), కుల్దీప్ యాదవ్( 201లో ఇంగ్లండ్‌పై, 6/25).. తాజాగా బుమ్రా(6/19)తో వీరి సరసన చేరాడు. ►ఇక ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాటింగ్హమ్ వేదికగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై 6/25తో మెరిశాడు. ఇక టీమిండియా తరపున ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో పేసర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో ఆశిష్ నెహ్రా (6/23, 2003లో) తొలి పేసర్‌గా ఉన్నాడు. ►ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో పేస్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు వకార్ యూనిస్(2001లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై 7/36), విన్స్టన్ డేవిస్(1983లో లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాపై 7/51), గారీ గాలిమోర్(1975లో ఇంగ్లండ్‌పై 6/14).. తాజాగా బుమ్రా ఇంగ్లండ్‌పై 6/19తో మెరిశాడు. ►ఒక వన్డే మ్యాచ్‌లో టీమిండియా తరపున అన్ని వికెట్లు సీమర్లే తీయడం ఇది ఆరోసారి. ఇంతకముందు 1983లో ఆస్ట్రేలియాపై, 1983లో వెస్టిండీస్‌పై, 1997లో పాకిస్తాన్‌పై, 2003లో సౌతాఫ్రికాపై, 2014లో బంగ్లాదేశ్‌పై.. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అన్ని వికెట్లు భారత్ సీమర్లే తీశారు. ►ఇక ఇంగ్లండ్‌కు వన్డేల్లో టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2006లో జైపూర్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 125 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. టీమిండియా తరపున మూడో బౌలర్‌గా -
బుమ్రా, రోహిత్ మెరుపులు.. టీమిండియా శుభారంభం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీతో కథం తొక్కగా.. శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. రోహిత్ శర్మ అర్థశతకం.. విజయం దిశగా టీమిండియా ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ అర్థశతకంతో మెరిశాడు. తద్వారా మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువగా వచ్చింది. ప్రస్తుతం 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. రోహిత్ 67, ధావన్ 27 పరుగులతో ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా ►111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 3, శిఖర్ ధావన్ 15 పరుగులతో ఆడుతున్నారు. ►3 ఓవర్లలో టీమిండియా 8 పరుగులు చేసింది. రోహిత్ 7, ధావన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. బుమ్రా కెరీర్ అత్యుత్తమ గణాంకాలు.. ఇంగ్లండ్ 110 ఆలౌట్ ►టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 110 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా తన వన్డే కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేయగా.. షమీ 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జాస్ బట్లర్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టీమిండియా బౌలర్ల దాటికి నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. చివర్లో డేవిడ్ విల్లీ 21 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ వంద పరుగులను దాటగలిగింది. ఐదేసిన బుమ్రా.. ఇంగ్లండ్ 103/9 ►టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా తన వన్డే కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఎనిమిదో వికెట్ డౌన్.. ఇంగ్లండ్ స్కోరు 68/8 ►క్రెయిగ్ ఓవర్టన్ రూపంలో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్‌స్వింగర్‌కు ఓవర్టన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఢిపెన్స్ ఆడే ప్రయత్నంలో ఓవర్టన్ విఫలం కాగా.. బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఇంగ్లండ్ వంద పరుగులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. డేవిడ్ విల్లే 5, బ్రైడన్ కార్స్ క్రీజులో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ►ఇంగ్లండ్ ఆటతీరు దారుణంగా ఉంది. పరుగులు చేయడానికి బ్యాటర్లు నానాపాట్లు పడుతున్నారు. తాజాగా కెప్టెన్ జాస్ బట్లర్(30) షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఆడుతుంది. క్రీజులో డేవిడ్ విల్లే, క్రెయిగ్ ఓవర్టన్ ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ►మొయిన్ అలీ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన మొయిన్ అలీ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 24 పరుగులుతో ఆడుతున్నాడు. చెలరేగిన బుమ్రా.. 30 పరుగులకే ఐదు వికెట్లు ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్ కనబరుస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. వీరిద్దరి దాటికి నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. ప్రస్తుతం బట్లర్ 14, మొయిన్ అలీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ►ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటి వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి గాయంతో దూరమయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసురుతున్న భారత్ ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ ► ఈ సిరీస్‌ను కూడా టి20 తరహా దూకుడుతో చేజిక్కించుకోవాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు టి20 చివరి మ్యాచ్‌లో నెగ్గిన ఊపులో ఉన్న ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయం. -
Ireland vs New Zealand: భళా బ్రేస్‌వెల్.. ఐర్లాండ్‌పై కివీస్ విజయం
డబ్లిన్: ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఒక వికెట్‌తో గెలిచింది. మైకేల్ బ్రేస్‌వెల్ (82 బంతుల్లో 127 నాటౌ ట్; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకంతో న్యూజిలాండ్‌ను గెలిపించాడు. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 20 పరుగులు అవసరంకాగా... ఐర్లాండ్ బౌలర్ యంగ్ వేసిన ఈ ఓవర్లో బ్రేస్‌వెల్ వరుసగా 4, 4, 6, 4, 6 బాది మరో బంతి మిగిలి ఉండగానే కివీస్ విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 300 పరుగులు చేసింది. టెక్టర్ (113; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 305 పరుగులు చేసి నెగ్గింది. చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! Michael Bracewell gets New Zealand to needing 6 runs to win off the final 3 balls, can he bring them home? 🏏 Find out by watching the highlights on-demand of Ireland v BLACKCAPS on Spark Sport#SparkSport #IREvNZ pic.twitter.com/a00QJsy2YI — Spark Sport (@sparknzsport) July 10, 2022 -
నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
ఇంగ్లండ్ వన్డే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి 11 నెలలు కావొస్తుంది. గ్యాప్ చాలా వచ్చిందనో ఏమో కానీ శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ నెదర్లాండ్స్ ఆటగాళ్లకు ఏకంగా విశ్వరూపం చూపించింది. డచ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. తమ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ వన్డేల్లో అత్యధిక స్కోరు (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు) నమోదు చేసింది. ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలతో చెలరేగడం విశేషం. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లకు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా వస్తాయి. అలాంటి వారి దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే డచ్ దేశంలో ఉన్న క్రికెట్ స్టేడియాల్లో చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో మైదానం పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు రావడంతో అప్పటికప్పుడు స్టేడియాలను సిద్ధం చేసినప్పటికి చెట్లను మాత్రం తొలగించలేకపోయారు. తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఘోస మాములుగా లేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు కొట్టే కొట్టుడుకు బంతులన్నీ వెళ్లి స్టేడియం అవతల ఉన్న చెట్ల పోదల్లోకి వెళ్లిపోయాయి. దీంతో డచ్ ఆటగాళ్లు పదే పదే పొదల్లోకి దూరి బంతి కోసం వెతుకులాట చేయడం ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మధ్యలో డేవిడ్ మాలన్.. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి వెళ్లి స్టేడియంలో అవతల ఉన్న చెట్ల పొదల్లో పడింది. బంతిని వెతకడానికి నెదర్లాండ్స్ జట్టులో దాదాపు సగం మంది సభ్యులు చెట్లు, పుట్టల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది ఒకేసారి వెతికితే గానీ రెండు నిమిషాలకు బంతి కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Drama in Amstelveen as the ball ends up in the trees 🔍 pic.twitter.com/MM7stEMHEJ — Henry Moeran (@henrymoeranBBC) June 17, 2022 చదవండి: వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్ Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి -
వర్షం హోరులో మ్యాక్స్‌వెల్ జోరు.. తొలి వన్డే ఆసీస్‌దే
శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ సాధించింది. వర్షం హోరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ జోరు చూపించాడు. అతని మెరుపులకు తోడు జట్టు సమిష్టి ప్రదర్శన తోడవ్వండతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 86 నాటౌట్, పాతుమ్ నిస్సాంక 56, గుణతిలక 55 రాణించారు. చివర్లో హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తొలి ఇన్నింగ్స్ అనంతరం ఆటకు 90 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ టార్గెట్‌ను 44 ఓవర్లలో 282 పరుగులుగా నిర్ణయించారు. డేవిడ్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44, స్టీవ్ స్మిత్ 53 జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత లబుషేన్ 24, మార్కస్ స్టోయినిస్ 44, అలెక్స్ క్యారీ 21 పరుగులు చేశారు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విధ్వంసం సృష్టించి జట్టును విజేతగా నిలిపాడు. చదవండి: బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం -
కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది
వెస్టిండీస్ వుమెన్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును సాధించింది. సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. అలా తన కెరీర్ బెస్ట్ నమోదు చేసిన డియాండ్రాకు మ్యాచ్‌లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె సెంచరీ చేసిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిందనుకుంటే పొరపాటే.. వరుణుడి రూపంలో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం రాలేదు. చదవండి: U19 World Cup 2022: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ జట్టు 46వ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అందులో సగానికి పైగా స్కోరు డియాండ్రాదే. 159 బంతుల్లో 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 150 పరుగుల కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌పై 132 పరుగులు ఆమెకు వన్డేల్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 46 ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యం 29 ఓవర్లలో 204 పరుగుల టార్గెట్‌ను విధించారు. అయితే 18 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా వర్షం రూపంలో డియాండ్రాను దురదృష్టం వెంటాడింది. తాను భారీ స్కోరు చేసిన మ్యాచ్ ఇలా వర్షార్పణం అవడం ఊహించలేదని.. చాలా బాధగా ఉందని డియాండ్రా ఇంటర్య్వూలో పేర్కొంది. చదవండి: మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు -
3093 బంతులు, దాదాపు ఆరేళ్లు.. ఒకే ఒక్క నోబాల్
కొలొంబో: లంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ కుమార్.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నోబాల్ వేసిన భువీ.. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ తప్పును చేశాడు. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన అతను.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్ వేశాడు. మొత్తంగా భువీ తన అంతర్జాతీయ కెరీర్లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం మరో విశేషం. Bhuvneshwar Kumar has bowled a No Balls after 5 years and 3093 international deliveries. — Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2021 8 ఏళ్లకు పైబడిన కెరీర్లో ఇన్ని తక్కువ నోబాల్స్ వేసిన బౌలర్ కేవలం భువీ మాత్రమే అయ్యిండొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, భువీ ఖాతాలోని నోబాల్ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే మంగళవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో భువీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 119 వన్డేలు, 21 టెస్ట్‌లు, 48 టీ20లు ఆడిన భువీ.. అతి తక్కువ ఎకానమీతో 247 వికెట్లు పడగొట్టాడు. That was Bhuvneshwar Kumar's first no-ball after October 2015 😳#SLvIND — Priya 🦋🦋 (@BabesPatiyala) July 20, 2021 Bhuvneshwar Kumar has bowled a No ball after 6 years in International Cricket. #INDvsSL #INDvSL pic.twitter.com/BNdPE4KVW1 — Noman Views (@Noman2294) July 20, 2021 -
చాహర్ ఒంటరి పోరాటం.. భారత్ ఘన విజయం
► చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ అండతో దీపక్ చాహర్ ఒంటరి పోరాటం చేసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో దీపక్ చాహర్ 82 బంతుల్లో 69 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు జట్టుకు విజయాన్నందించాడు. ► 45 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 245/7గా ఉంది. దీపక్ చాహర్ 51, భువనేశ్వర్ కుమార్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►దీపక్ చాహర్ 64 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. భారత్ విజయతీరాలకు చేరడానికి 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కృనాల్(35) క్లీన్‌బౌల్డ్ టీమిండియా తరఫున అఖరి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కృనాల్ పాండ్యా(54 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో కృనాల్ క్లీన్ బౌల్డయ్యాడు. 35.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 193/6. భారత్ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో చాహర్(9), భువనేశ్వర్ కుమార్(0) ఉన్నారు. ఓటమి దిశగా టీమిండియా, సూర్యకుమార్ యాదవ్(53) ఔట్ టీమిండియాకు ఆఖరి ఆశాకిరణంలా ఉన్న సూర్యకుమార్ యాదవ్(44 బంతుల్లో 53; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగానే పెవిలియన్ బాటపట్టాడు. సందకన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 160/6. క్రీజ్‌లో కృనాల్(19), చాహర్(0) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా లంక కెప్టెన్ శనక వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి మనీశ్ పాండే రనౌట్ కాగా, అదే ఓవర్లో ఆఖరి బంతికి హార్ధిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందే హార్ధిక్‌కు లైఫ్ లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిడ్ వికెట్లో ఉన్న డిసిల్వాకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 116/5. క్రీజ్‌లో సూర్యకుమార్(30), కృనాల్ పాండ్యా(0) ఉన్నారు. మనీశ్ పాండే(37) రనౌట్.. టీమిండియా నాలుగో వికెట్ డౌన్ మనీశ్ పాండే(31 బంతుల్లో 37; 3 ఫోర్లు)ను దురదృష్టం వెంటాడింది. లంక కెప్టెన్ శనక బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రయిక్ ఎండ్ ఉన్న మనీశ్.. క్రీజ్ వదిలి ముందుకు రావడం, స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ శనక చేతులను తాకుతూ వికెట్లకు తగలడంతో మనీశ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 17.2 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్(30), హార్దిక్(0) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్.. ధవన్(29) ఔట్ శ్రీలంక లెగ్ బ్రేక్ బౌలర్ వనిందు హసరంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా కెప్టెన్ ధవన్(38 బంతుల్లో 29; 6 ఫోర్లు)ను ఎల్బీడబ్యూగా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు మూడు ఓవర్లు వేసిన హసరంగ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన(షా, ధవన్) వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/3. క్రీజ్‌లో మనీశ్ పాండే(17), సూర్యకుమార్ యాదవ్(0) ఉన్నారు. ఇషాన్ కిషన్(1) క్లీన్ బౌల్డ్, 5 ఓవర్ల తర్వాత 39/2 11 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. తొలుత 28 పరుగుల వద్ద పృథ్వీ షా పెవిలియన్‌కు చేరగా, 5వ ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రజిత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధవన్(22)కు తోడుగా మనీవ్ పాండే(0) ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. పృథీ షా(13) ఔట్ హ్యాట్రిక్ ఫోర్లు సాధించి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా(11 బంతుల్లో 13; 3 ఫోర్లు).. హసరంగా వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో ధవన్(7 బంతుల్లో 13; 3 ఫోర్లు), ఇషాన్ కిషన్(0) ఉన్నారు. తొలి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన షా.. శ్రీలంక బౌలర్ కసున్ రజిత వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పృథ్వీషా(6 బంతుల్లో 12; 3 ఫోర్లు) చెలరేగిపోయాడు. ఆఖరి మూడు బంతులను బౌండరీలకు తరలించాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 276 భువీ వేసిన ఆఖరి ఓవర్లో మూడో బంతికి సందకన్(0) రనౌట్ కాగా, చివరి రెండు బంతులను కరణరత్నే(33 బంతుల్లో 44; 5 ఫోర్లు) బౌండరీలకు తరలించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. కరుణరత్నే అఖరి వరకు క్రీజ్‌లో ఉండి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్ తలో మూడు వికెట్లు, చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు. సేమ్ సీన్ రిపీట్.. చమీరా(2) ఔట్ అంతకుముందు ఓవర్లో అసలంకను ఎలా ఔట్ చేశాడో అచ్చం అలానే మరో స్లో లెంగ్త్ ఆఫ్ కట్టర్ బంతిని సంధించి చమీరా(5 బంతుల్లో 2)ను పెవిలియన్‌కు పంపాడు భువీ. పడిక్కల్ డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ అందుకోవడంతో చమీరా పెవిలియన్ బాట పట్టాడు. 49.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 264/8. క్రీజ్‌లో కరుణరత్నే(35), సందకన్(0) ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(65) ఔట్ భువీ వేసిన స్లో లెంగ్త్ ఆఫ్ కట్టర్ బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అసలంక(68 బంతుల్లో 65; 6 ఫోర్లు) ఔటయ్యాడు. సబ్ ఫీల్డర్ పడిక్కల్ డీప్ మిడ్ వికెట్లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. 48 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 252/7. క్రీజ్‌లో కరుణరత్నే(25), చమీరా(1) ఉన్నారు. చాహర్ యార్కర్.. హసరంగ(8) క్లీన్ బౌల్డ్ మూడో స్పెల్ తొలి బంతికే దీపక్ చాహర్ అదరగొట్టాడు. అద్భుతమైన యార్కర్‌తో హసరంగ(11 బంతుల్లో 8; ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 39.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 194/6గా ఉంది. క్రీజ్‌లో అసలంక(43 బంతుల్లో 34), కరుణరత్నే(0) ఉన్నారు. భారత బౌలర్లలో చహల్ 3, చాహర్ 2, భువీ ఓ వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక..శనక(16) క్లీన్ బౌల్డ్ తొలి వన్డేలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చహల్ రెండో వన్డేలో రెచ్చిపోతున్నాడు. తొలి స్పెల్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో స్పెల్‌లోనూ మ్యాజిక్ చేశాడు. లంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శనక(24 బంతుల్లో 16; ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 36 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 178/5. క్రీజ్‌లో అసలంక(34 బంతుల్లో 29), వహిందు హసరంగ(1) ఉన్నారు. డిసిల్వా(32) ఔట్.. 28 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 137/4 దీపక్ చాహర్ వేసిన నకుల్ బంతికి ధనుంజయ డిసిల్వా(45 బంతుల్లో 32; ఫోర్) చిక్కాడు. మిడాఫ్ దిశగా ఆడే క్రమంలో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 28 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 137/4గా ఉంది. క్రీజ్‌లో చరిత్ అసలంక(5), దసున్ శనక(1) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో చహల్ 2, భువీ, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అవిష్క ఫెర్నాండో(50) ఔట్ హాఫ్ సెంచరీ సాధించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(71 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్)ను టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో ఫెర్నాండో.. మిడాన్‌లో ఉన్న కృనాల్ పాండ్యా చేతికి క్యాచ్ అందించి వెనుదిరిగాడు. 25 ఓవర్ల తర్వాత లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(38 బంతుల్లో 26), అసలంక(0) ఉన్నారు. చహల్ మాయాజాలం.. వరుస బంతుల్లో రెండు వికెట్లు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మాయ చేశాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులిచ్చిన చహల్.. ఆతరువాత వరుస బంతుల్లో భానుక(42 బంతుల్లో 36; 6 ఫోర్లు), రాజపక్సా(0)లను పెవిలియన్‌కు పంపాడు. భానుక క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్లో మనీశ్ పాండే అందుకోగా, రాజపక్సా.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13.3 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 77/2. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(0), అవిష్క ఫెర్నాండో(41 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నారు. ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. భానుక(23 బంతుల్లో 26; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో(27 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరి ధాటికి 7.4 ఓవర్లలోనే లంక స్కోర్ 50 పరుగులు దాటింది. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 53/0. కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ధవన్ సేన ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, లంక జట్టు ఓ మార్పు చేసింది. ఉదాన స్థానంలో కసున్ రజిత బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే ఆతిధ్య లంక జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా, టీమిండియా మరో విజయంపై ధీమాగా ఉంది. టీమిండియా తుదిజట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక తుదిజట్టు: షనక(కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భానుక రాజపక్సా, మినోద్ భానుకా, దనంజయ డిసిల్వా, చరిత్ ఆసలంకా, వినిందు హసరంగా, చమికా కరుణరత్నే, కసున్ రజిత, దుస్మంతా చమీరా, లక్షణ్ షన్‌దాకన్ -
క్లీన్ షేవ్ చేసుకున్న కోహ్లీలా ఉన్నాడు.. ఎవరీ ప్లేయర్?
కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ యువ క్రికెటర్ అప్పియరెన్స్ అందరి దృష్టిని ఆకర్శించింది. క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీలా కనిపిస్తూ ఓ కుర్రాడు మైదానంలోకి ప్రవేశించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అతన్ని సడెన్‌గా చూస్తే.. కోహ్లీ ఏంటి ఇక్కడ ఉన్నాడు అనిపించక మానదు. చిన్నతనంలో కోహ్లీ ఎలా ఉండేవాడో ఆ ఆటగాడు అచ్చం అలానే కనిపించాడు. ఇక అతను హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చూస్తే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌లా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ కోహ్లీని తలపించిన ఆ ప్లేయర్ ఎవరని ఆలోచిస్తున్నారా..? అతనేననండి టీమిండియా నయా వన్డే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ నిన్నటి మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అంతేకాదు తనదైన స్టైల్లో కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. నిన్ననే తన 23వ పుట్టిన రోజును జరుపుకున్న ఈ డాషింగ్ వికెట్ కీపర్.. కోహ్లీలా దర్శనమిస్తూ నిన్నటి మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఇదిలా ఉంటే, అరంగేట్రం వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్.. టీ20 అరంగేట్రంలోనూ అర్ధశతకాన్ని బాదాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ పొట్టి ఫార్మాట్లోని అడుగుపెట్టాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో యువ భారత జట్టు మూకుమ్మడిగా రాణించడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. -
దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్
డబ్లిన్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. వన్డేల్లో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. డబ్లిన్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 43 పరుగుల తేడాతో నెగ్గింది. కెప్టెన్ బాల్బిర్నీ సెంచరీ (102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దాంతో తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. జానెమన్ మలాన్ (84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుసెన్ (49; 2 ఫోర్లు) పోరాడినా చివరి వరుస బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. -
ఇంగ్లండ్ పేసర్ దెబ్బ; తొలి వన్డేలో ఘన విజయం
కార్డీఫ్: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ షకీబ్ మహమూద్ దెబ్బకు 141 పరుగులకే కూప్పకులిపోయింది. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. జాక్ క్రాలే అరంగేట్ర మ్యాచ్ లోనే ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. షకీబ్ 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. షకీబ్ మహమూద్తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.తొలి వన్డే కు ముందు ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. -
Viral Video: సూపర్ ఉమెన్ స్మృతి మంధాన.. జస్ట్ వావ్
ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది. Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v — Female Cricket (@imfemalecricket) July 3, 2021 కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది. -
వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు
లండన్: వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిన జట్టుగా లంక తొలిస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓడిన లంక జట్టు 428వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 858 వన్డే మ్యాచ్‌లాడిన శ్రీలంక 390 విజయాలు, 428 పరాజయాలు చవిచూసింది. అయితే వన్డేల్లో అధిక ఓటములు చవిచూసిన రెండో జట్టుగా టీమిండియా(427) ఉండడం విశేషం. కాగా టీమిండియా మ్యాచ్‌ల సంఖ్య పరంగా చూస్తే మాత్రం లంకకు చాలా దూరంలో ఉంది. టీమిండియా మొత్తంగా 993 వన్డే మ్యాచ్‌లాడింది. లంకతో పోలిస్తే 137 మ్యాచ్‌లు అధికంగా ఉన్నాయి. ఇక విజయాల శాతం పరంగా చూస్తే భారత్ 54.67 శాతంతో ఉండగా.. శ్రీలంక 47.69 శాతంతో ఉంది. ఇక 414 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది. మరో విశేషమేమిటంటే.. టీ20ల్లో అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా శ్రీలంక(70) తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్ 67, పాకిస్తాన్ 65 ఓటములతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా కుమార సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమైన తర్వాత శ్రీలంక ఆటతీరు నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. ఈ మధ్యకాలంలో ఆడిన ప్రతీ సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న లంక జట్టు వరుస ఓటములను చవిచూసింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక స్వదేశంలో టీమిండియాను ఎదుర్కొనబోతుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా రెండో జట్టును ఓడించి సిరీస్‌లను కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి. కాగా ఇండియా, శ్రీలంకల మధ్య తొలి వన్డే జూలై 13న జరగనుంది. View this post on Instagram A post shared by BrokenCricket (@broken_cricket) -
వైరల్: ఏంటా వేగం.. బ్యాట్ రెండు ముక్కలైంది
జొహన్నెస్‌బర్గ్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ రనౌట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ అంశంపై చర్చ నడుస్తున్న సమయంలోనే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి జరగింది వివాదాస్పద అంశం మాత్రం కాదు.. కాసేపు ఫన్నీగా నవ్వుకునే అంశం జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన బంతి దాటికి ప్రొటీస్ బ్యాట్స్‌మన్ బవుమా బ్యాట్ రెండు ముక్కలైంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అష్రఫ్ వేసిన మూడో బంతిని బవుమా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అష్రఫ్ వేసిన బంతి131 కిమీ వేగంతో వచ్చి బ్యాట్‌కు తగలడంతో బ్యాట్ పైభాగం ఊడి కిందపడిపోయింది. దీంతో షాక్‌కు గురవ్వడం బవుమా వంతైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు బవుమా 31 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. బవుమా 92, డికాక్ 80, వాండర్ డసెన్ 60, మిల్లర్ 50 నాటౌట్ రాణించారు. అనంతరం 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 193 పరుగులు అసాధారణ ఇన్నింగ్స్‌తో పాక్ మ్యాచ్‌ను గెలిచేలా కనిపించింది. అయితే వివాదాస్సద రనౌట్‌తో జమాన్ వెనుదిరగడంతో పాక్ ఓటమి ఖరారైంది. చదవండి: అతను మీ గన్‌డెత్ బౌలర్ కాకపోవచ్చు.. కానీ Just wao Faheem breaking bat of temba bavuma#PakvRSA pic.twitter.com/wxveHTnphX — Haseeb ur rehman (Advocate) (@Haseebu67038988) April 4, 2021 -
రాణించిన ఝాన్సీలక్ష్మి: సెమీస్‌లో ఆంధ్ర
రాజ్‌కోట్: బీసీసీఐ మహిళల సీనియర్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విదర్భ జట్టుతో మంగళవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. చల్లా ఝాన్సీలక్ష్మి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆంధ్ర జట్టు గెలుపులో ముఖ్యపాత్ర పోషించింది. ఝాన్సీలక్ష్మి బ్యాటింగ్‌లో 33 పరుగులు చేయడంతోపాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకొని 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర 50 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసింది. కెప్టెన్ నీరగట్టు అనూష (52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... పుష్పలత (39; 5 ఫోర్లు), మిరియాల దుర్గ (32; 4 ఫోర్లు) రాణించారు. విదర్భ బౌలర్లలో దిశా కసత్ మూడు వికెట్లు తీసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 46.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దిశా కసత్ (52; 6 ఫోర్లు, సిక్స్), నుపుర్ (43; 4 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శరణ్య గద్వాల్ రెండు వికెట్లు తీయగా... ఝాన్సీలక్ష్మి ఐదు వికెట్లతో విదర్భను దెబ్బతీసింది. రేపు జరిగే సెమీఫైనల్లో జార్ఖండ్‌తో ఆంధ్ర తలపడుతుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 28 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి రైల్వేస్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. -
మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనత..
లక్నో: భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇటీవల పదివేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ.. ఇప్పుడు వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్‌వుమెన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ పరుగుల వద్ద మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది.తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ సెంచరీతో(104 పరుగులు నాటౌట్) మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ 55 పరుగులు చేసింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 22వ ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 110 పరుగులు చేసింది. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయ వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీరాజ్.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో.. 50.7 సగటుతో 7008 పరుగులు చేయగా.. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధసెంచరీలు సాధించింది. చదవండి: జెర్సీ 18.. జెర్సీ 22.. నిజంగా అద్బుతం -
టీమిండియా తొలి ఉమెన్ క్రికెటర్‌గా
లక్నో: టీమిండియా ఉమెన్స్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు అందుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అన్నే బోస్క్ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తరపున ఎడ్వర్డ్స్ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 77 పరుగులతో రాణించగా.. మిథాలీ, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 8 పరుగులు చేసింది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్ Congratulations, Mithali Raj 👏 A modern-day legend. pic.twitter.com/XyI89zWL47 — ICC (@ICC) March 12, 2021 -
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి
నార్త్‌సౌండ్: వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జాసన్ మొహమ్మద్ 2, పొలార్డ్ , పాబియెన్ అలెన్, జోసెఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 -
రెండు రోజుల్లోనే ఆసీస్ నయా రికార్డు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 66 పరుగులు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 374 పరుగులు చేయగా, టీమిండియా 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో ఆసీస్ నమోదు చేసిన 374 పరుగుల స్కోరు వారికి భారత్‌పై అత్యధిక వన్డే స్కోరుగా నమోదైంది. కాగా, ఆ రికార్డు సాధించిన రెండు రోజుల్లోనే ఆసీస్ దాన్ని బ్రేక్ చేసింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్ ఝుళిపించి 389 పరుగులు సాధించి కొత్త రికార్డును లిఖించింది. వార్నర్(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ), స్టీవ్ స్మిత్(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), లబూషేన్(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్ రికార్డు స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌ను వార్నర్-ఫించ్‌లు దాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు తిరుగులేకుండా పోయింది. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్ ఫ్రీగా బ్యాటింగ్ చేసి పరుగులు వరద పారించారు. ఇక ఆసీస్ వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఐదుగురు ఆటగాళ్లు 50కి పైగా పరుగులు నమోదు చేయడం భారత్‌పై ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013లో జైపూర్‌లో జరిగిన వన్డేలో ఆసీస్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇలానే 50కి పైగా పరుగులు సాధించారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ అరుదైన ఘనతను ఆసీస్ మళ్లీ సాధించింది. -
మోర్గాన్ సెంచరీ: ఇంగ్లండ్ 328
సౌతాంప్టన్: ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి వన్డే కెరీర్లో 14వ సెంచరీ నమోదు చేశాడు. టామ్ బాంటన్ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్)తో కలిసి మోర్గాన్ నాలుగో వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. చివర్లో విల్లీ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్ కరన్ (38 నాటౌట్; 4 ఫోర్లు) కూడా మెరిపించడంతో ఇంగ్లండ్ స్కోరు 300 పరుగులు దాటింది. 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కడపటి వార్తలు అందే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి
న్యూఢిల్లీ: ఏడాది క్రితం వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదుర్కొన్న ఓటమి బాధను న్యూజిలాండ్ క్రికెటర్లు అంత సులువుగా మరచిపోయేలా లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, ఆపై సూపర్ ఓవర్ కూడా ‘టై’ కావడంతో బౌండరీ కౌంట్‌తో కివీస్ ఓడింది. దీనిపై ఆ జట్టు టాప్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మాట్లాడుతూ... వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమే లేదని...ఆ నిబంధనను తొలగించి, మ్యాచ్ ‘టై’గా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలన్నాడు. ‘టి20ల్లో సూపర్ ఓవర్ అంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్ తరహాలో ఏదో ఒక ఫలితం కోసం అలా ఆడవచ్చు. కానీ వన్డేలో సూపర్ ఓవర్ ఆడించడమే అసమంజసం. ఇరు జట్లు అప్పటికి 100 ఓవర్లు ఆడి ఉంటాయి. ఇంతసేపు పోటీ పడిన తర్వాత రెండు జట్లు సమఉజ్జీగా నిలిచాయంటేనే ఎవరూ గెలవలేదనే కదా అర్థం. మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించడంలో తప్పేముంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. -
ఆ ఇద్దరిని ఔట్ చేయాలి.. ఎలా అంపైర్?
లండన్: టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలు ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తుంటే ఫ్యాన్స్‌కు ఎంత మజా వస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థి జట్టులో గుబులు మొదలవుతుంది. ఒక్కసారి వీరిద్దరూ క్రీజుల పాతుకపోతే బౌండరీల వర్షం.. పరుగుల వరద ఖాయం. అలా వీరిద్దరూ ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు, కెప్టెన్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. అయితే గతంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు విధ్వంసం సృష్టిస్తుంటే ఏం చేయాలో పాలుపోని సారథి ఫించ్ అంపైరింగ్ చేస్తున్న మైకేల్ గాఫ్ సలహా కోరాడు. ఈ విషయాన్ని స్థానిక మాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైకేల్ గాఫ్ బయటపెట్టాడు. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’) ‘భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఒకటి గుర్తొస్తోంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారీ భాగస్వామ్యం దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ సమయంలో స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫించ్ పక్కన అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఈ ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మన్ ఆట చూడకుండా ఉండేదెలా? వారిద్దరికి నేనెలా బౌలింగ్ చేయించాలి? అని సలహా కోరాడు. అప్పుడు నాకు పని ఉంది. నీ పని నువ్వు చూసుకో’ అని జవాబిచ్చినట్లు ఆనాటి మ్యాచ్ విశేషాలను గాఫ్ గుర్తుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్ గాఫ్ 62 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాడు. ('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది') -
ఇందులో తప్పెవరిదీ?
-
‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’
హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న క్రికెటర్లు తమ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తన ఇన్‌స్టాలో హైదరాబాద్ వేదికగా 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తను 17 బంతుల్లో 37 పరుగులు కొట్టిన వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన యువరాజ్ సింగ్‌తో భజ్జీ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్న తరుణంలో యువీ అనవసరంగా రనౌట్ అయ్యాడు. ఇదే విషయాన్ని భజ్జీ ప్రస్తావిస్తూ ఈ రనౌట్‌లో తప్పెవరిదని ఆ వీడియో కింద కామెంట్ జతచేశాడు. ‘అనవసరంగా పరుగు తీసి రనౌట్ అయ్యావు. ఇందులో తప్పెవరిదీ? మొత్తానికి మంచి ఇన్నింగ్స్ ఆడావు’ అంటూ భజ్జీ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన యువీ ‘పాజీ ఈ రనౌట్‌లో నీ తప్పేమి లేదు. నేనే ముందు పిలిచా. అందుకే నేనే వెనుదిరిగిపోయాను. అయినా నువ్వు నీ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తావనే నమ్మకం ఉంది అప్పుడు’అంటూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈమ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే యువీ (103; 122 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. యువీకి తోడు ఇర్ఫాన్ పఠాన్(46), హర్భజన్ (37 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన దక్షణాఫ్రికా కలిస్ (68), గ్రేమ్ స్మిత్ (48)లు రాణించడంతో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. చదవండి: బంతులే బుల్లెట్లుగా మారి... బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_551241572.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వాండరర్స్‌లో వండర్ వన్డే
వన్డేల్లో పరుగుల విధ్వంసం అంటే ఏమిటో ఆ మ్యాచ్ చూపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి పరుగుల వరద పారించడం అంటే ఎలా ఉంటుందో వాండరర్స్ మైదానంలో కనిపించింది. రెండు అగ్రశ్రేణి జట్లు కొదమ సింహాల్లా భీకరంగా తలపడుతుంటే అటు మైదానంలో, ఇటు టీవీల్లో ప్రేక్షకులు కన్నార్పకుండా చూశారు. అప్పటికి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆస్ట్రేలియా 434 పరుగులు నమోదు చేసి సవాల్ విసిరితే మరో జట్టయితే మైదానంలో దిగక ముందే చేతులెత్తేసేదేమో. కానీ దక్షిణాఫ్రికా అలా చేయలేదు. విజయం కోసం తుదికంటా పోరాడింది. ఒక వికెట్ చేతిలో, ఒక బంతి మిగిలి ఉండగా లక్ష్యం చేరి గర్జించింది. మొత్తంగా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యద్భుతమైన మ్యాచ్‌గా ఆ పోరు నిలిచిపోయింది. మార్చి 12, 2006, జొహన్నెస్‌బర్గ్... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (44 బంతుల్లో 55; 9 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడగా ఆడగా, మరో ఓపెనర్ సైమన్ కటిచ్ (90 బంతుల్లో 79; 9 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు 15.2 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ రికీ పాంటింగ్ (105 బంతుల్లో 164; 13 ఫోర్లు, 9 సిక్సర్లు) బరిలోకి దిగి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 2003లో ఇదే మైదానంలో భారత్‌పై ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఏ ఒక్క బౌలర్‌నూ వదిలిపెట్టకుండా మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. 71 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. తర్వాత వచ్చిన మైక్ హస్సీ (51 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. 39.5 ఓవర్లలో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటగా, 47 ఓవర్లలో ఆ జట్టు 400 పరుగుల మైలురాయిని అధిగమించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లకు 434 పరుగులు చేసింది. స్మిత్ దూకుడు... అసాధ్యంగా కనిపించిన ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఓవర్లోనే డిపెనార్ (1) వికెట్ కోల్పోయింది. అయితే హెర్షల్ గిబ్స్ (111 బంతుల్లో 175; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) వీర బాదుడుతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన స్వభావానికి విరుద్ధంగా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (55 బంతుల్లో 90; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. 79 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న గిబ్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అతను అవుటయ్యే సమయానికి సఫారీలు 18.1 ఓవర్లలో మరో 136 పరుగులు చేయాల్సి ఉండటంతో కష్టంగా అనిపించింది. కలిస్ (20), డివిలియర్స్ (14) కూడా విఫలమయ్యారు. అయితే లోయర్ ఆర్డర్లో వాండర్వాత్ (18 బంతుల్లో 35; ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్... మరోవైపు వికెట్ కీపర్ మార్క్ బౌచర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) పట్టుదలగా నిలబడి జట్టును విజయంవైపు నడిపించాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు కావాల్సి ఉండగా... ఆ జట్టు 4 ఓవర్లలో 40 పరుగులు చేసింది. బ్రెట్‌లీ వేసిన చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా... తొలి 3 బంతుల్లో 5 పరుగులు వచ్చాయికానీ 9వ వికెట్ కూడా పడింది. తీవ్ర ఒత్తిడిలో నాలుగో బంతికి ఎన్తిని సింగిల్ తీయగా, ఐదో బంతికి ఫోర్ కొట్టి బౌచర్ మ్యాచ్ ముగించాడు. దాంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 438 పరుగులు చేసి గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. బౌచర్ విక్టరీ షాట్ తర్వాత సఫారీ శిబిరంలో సంబరాలకు అంతు లేకుండా పోయింది. అయితే ఆసీస్ ఆటగాళ్లు కూడా పెద్దగా నిరాశ చెందలేదు. చరిత్రకెక్కిన ఒక మ్యాచ్‌లో భాగమైనందుకు ఆటగాళ్లందరూ గర్వించారు. ► వన్డేల్లో ఒక జట్టు 400కు పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ► వన్డేల్లో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు... ఒకే వన్డేలో అత్యధిక పరుగులు (872) నమోదైన రికార్డు ఈ మ్యాచ్ పేరిటే ఉన్నాయి. ► గిబ్స్ 175 పరుగులు చేసి 31.5వ ఓవర్లో అవుటయ్యాడు. అప్పుడే డబుల్ సెంచరీకి అవకాశం కనిపించింది కానీ సాధ్యం కాలేదు. ► మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిక్ లూయిస్ 10 ఓవర్లలో 113 పరుగులు ఇవ్వడం ఇప్పటికీ వన్డేల్లో అతి చెత్త రికార్డుగా నమోదై ఉంది. ఈ మ్యాచ్ తర్వాత లూయిస్ మళ్లీ ఆసీస్‌కు ఆడలేకపోయాడు. ► దక్షిణాఫ్రికా బౌలర్ టెలిమాకస్ ఒక ఓవర్లో వరుసగా నాలుగు నోబాల్స్ వేశాడు. మ్యాచ్‌లో ఓవరాల్‌గా 87 పరుగులు ఇచ్చిన అతను ఇంత జోరులోనూ ఒక ఓవర్ మెయిడిన్‌గా వేయడం విశేషం. -
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
-
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
ముంబై : క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం అవసరం లేదు. మరీ అలాంటి మ్యాచ్‌లో తమ ఆరాధ్య క్రికెటర్ చెలరేగి ఆడాడంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయని చెప్పొచ్చు. అలాంటి ఇన్నింగ్స్నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా 22ఏళ్ల క్రితం(ఏప్రిల్ 22, 1998లో) షార్జా కప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చూపించాడు. ఇప్పటివరకు సచిన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 143 పరగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో మొత్తం 9ఫోర్లు ,4 సిక్సర్లు ఉన్నాయి. ('బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు') సాధారణంగా చూస్తే ఇది మాములుగానే కనిపిస్తుంది కానీ.. జట్టును ఫైనల్ చేర్చాలన్న తపన సచిన్ ఇన్నింగ్స్‌లో స్ఫష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా ఫైనల్‌కు చేరుకుంది. అదెలాగో తెలుసుకోవాలంటే మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాల్సిందే. 1998 ఏప్రిల్ నెలలో కోకకోలా కప్‌ను దుబాయ్ వేదికగా షార్జాలో నిర్వహించారు. ఈ సిరీస్‌లో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా పాల్గొనగా, మ్యాచ్‌లన్నీ డే అండ్ నైట్ పద్దతిలోనే జరిగాయి. ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఏంచుకొంది. ఆసీస్ ఆటగాడు మైఖేల్ బెవాన్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కాకుండా ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే 46ఓవర్లలో 254 పరుగులు చేయాలి.. అయితే ఇసుకతుఫానుతో మ్యాచ్‌కు 25 నిమిషాల పాటు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276కు కుదించారు.ఆటకు అంతరాయం కలగడంతో 46 ఓవర్లలో 237 పరుగులు చేస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక్కడే సచిన్ టెండూల్కర్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు షేన్ వార్న్, డామియన్ ప్లెమింగ్, మైఖెల్ కాస్ప్రోవిచ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 131 బంతులెదుర్కొన్న సచిన్ 9 ఫోర్లు , 4 సిక్స్‌ల సాయంతో 143 పరుగులు చేసి జట్టు స్కోరు 242 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒకదశలో సచిన్ బ్యాటింగ్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా అనిపించింది. అయితే సచిన్ ఓటయ్యాక ఒత్తిడికి తలొగ్గిన భారత్ 46 ఓవర్లలో 250 పరుగులు చేసింది.(' స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం') అయితే ఫైనల్‌కు చేరుకోవాలంటే చేయాల్సిన పరుగులు అప్పటికే పూర్తి చేయడంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత జట్టు కోకకోలా కప్‌ను ఎగరేసుకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది సరీస్గా సచిన్ నిలవడం విశేషం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సచిన్ వల్ల తనకు నిద్రలేని రాత్రులు గడిచాయని ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ సిరీస్ తర్వాత పేర్కొన్నాడు. -
లిటన్ దాస్ శతకం: బంగ్లాదేశ్ భారీ గెలుపు
సిల్హెట్: ఓపెనర్ లిటన్ దాస్ (105 బంతుల్లో 126 రిటైర్డ్ హర్ట్) కెరీర్లో రెండో సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 169 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం నమోదు చేసింది. పరుగుల పరంగా వన్డేల్లో బంగ్లాదేశ్‌కిదే భారీ విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. మొహమ్మద్ మిథున్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్ (3/22), మష్రఫె మొర్తజా (2/35), మిరాజ్ (2/33) ఆకట్టుకున్నారు. -
క్లాసెన్ అజేయ సెంచరీ
పార్ల్: హెన్రిచ్ క్లాసెన్ (114 బంతుల్లో 123 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ... డేవిడ్ మిల్లర్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుత బ్యాటింగ్ కారణంగా... ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 74 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. క్లాసెన్, మిల్లర్ ఐదో వికెట్‌కు 149 పరుగులు జతచేసి తమ జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్ మూడు వికెట్లు తీశారు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (94 బంతుల్లో 76; 3 ఫోర్లు), లబ్‌షేన్ (51 బంతుల్లో 41; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి (3/30), షమ్సీ (2/45) రాణించారు. క్లాసెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం బ్లోమ్‌ఫోంటెన్‌లో జరుగుతుంది. -
ఉత్కంఠపోరులో శ్రీలంక గెలుపు
కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో శ్రీలంక వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. షై హోప్ (115; 10 ఫోర్లు) శతకంతో రాణించాడు. ఇసురు ఉదానకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్‌లో అవిష్క ఫెర్నాండో (50; 5 ఫోర్లు, సిక్స్), దిముత్ కరుణరత్నే (52; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (42; 4 ఫోర్లు) రాణించారు. మిడిలార్డర్ తడబడ్డా... చివర్లో తిసారా పెరీరా (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వనిందు హసరంగ డిసిల్వా (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడి మిగతా పనిని పూర్తి చేశారు. రెండో వన్డే ఈ నెల 26న జరుగుతుంది. -
రోహిత్ శర్మ అవుట్
ముంబై: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. కాలి పిక్క గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మిగిలిన పర్యటన నుంచి తప్పుకున్నాడు. బుధవారం నుంచి జరిగే వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కూడా రోహిత్ దూరమయ్యాడు. మౌంట్ మాంగనీలో ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 60 పరుగులు చేసిన అనంతరం కాలి పిక్క గాయంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పరీక్షల్లో దాని తీవ్రత ఎక్కువని తేలింది. ‘రోహిత్ గాయం చిన్నదేమీ కాదు. ఫిజియో దీనిని పర్యవేక్షిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో మిగిలిన సిరీస్‌లో మాత్రం ఆడే అవకాశం లేదని తేలిపోయింది. అతను ఈ పర్యటన నుంచి తప్పుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఓపెనర్‌గా భారత జట్టుకు తిరుగులేని విజయాలు అందిస్తున్న రోహిత్ శర్మ లేకపోవడం వన్డేల్లో టీమిండియాను బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. గత ఏడాది టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. విశాఖపట్నంలో తొలి టెస్టులోనే రెండు సెంచరీలు చేసిన అతను ఆ తర్వాత రాంచీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. పృథ్వీ షాకు నో! రోహిత్ శర్మ స్థానంలో న్యూజిలాండ్‌లోనే భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లకు టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తొలి అనధికారిక టెస్టులో డబుల్ సెంచరీ చేయడం గిల్ స్థానాన్ని అవకాశాలను పటిష్టం చేయగా... విండీస్ వన్డే సిరీస్‌కు జట్టులో భాగంగా ఉన్న మయాంక్‌కు ఇప్పుడు మరో అవకాశం లభించింది. రాహుల్ కూడా అందుబాటులో ఉన్న కారణంగా... ప్రస్తుతం వన్డే జట్టులోకి ఎంపికైన పృథ్వీ షాను ఇంకా టెస్టుల్లోకి పరిశీలించలేదని తెలుస్తోంది. -
భారత్ ‘ఎ’ ఓటమి
క్రైస్ట్‌చర్చ్: భారత ‘ఎ’ జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 29 పరుగుల తేడాతో ఓడింది. తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 295 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ వర్కర్ (135; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ 3 వికెట్లు ... సిరాజ్ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి ఓడిపోయింది. మయాంక్ అగర్వాల్ (37; 2 ఫోర్లు, సిక్స్), ఇషాన్ కిషన్ (44; 2 ఫోర్లు, సిక్స్), విజయ్ శంకర్ (41; 2 ఫోర్లు, సిక్స్), కృనాల్ పాండ్యా (51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా కీలకదశలో అవుటవ్వడంతో భారత్ ‘ఎ’ లక్ష్యానికి దూరంలో నిలిచింది. -
ఆఖరి పంచ్ ఎవరిదో!
భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగిన రెండు వన్డేలు చూసిన తర్వాత ఈ సిరీస్ కనీసం ఐదు మ్యాచ్‌లైనా ఉంటే బాగుండేదని సగటు అభిమానికి అనిపించడంలో తప్పు లేదు. కానీ ఆ అవకాశం లేకుండా పోరు మూడు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఇక ఇప్పుడు సిరీస్ విజేతగా ఎవరు నిలుస్తారో తేల్చే సమరానికి రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించగా... గత మ్యాచ్‌లో భారత్ తమ స్థాయిని ప్రదర్శించింది. వన్డే సిరీస్ విజయంతో స్వదేశంలో సీజన్‌ను ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... భారత గడ్డపై ఏడాది క్రితం ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆసీస్ భావిస్తోంది. బెంగళూరు: సుదీర్ఘమైన విదేశీ పర్యటనకు ముందు ఈ సీజన్లో భారత్ స్వదేశంలో తమ చివరి మ్యాచ్‌కు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే చివరి పోరులో ఆస్ట్రేలియాతో కోహ్లి సేన తలపడనుంది. సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్ చేరుతుంది. రెండు జట్లు కూడా దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పాటు భారీ స్కోర్ల వేదికపై మ్యాచ్ జరుగుతుండంతో మరో హోరాహోరీ పోరును ఆశించవచ్చు. గాయాల నుంచి కోలుకున్నారా! చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు వన్డేల్లో కలిపి డబుల్ సెంచరీ సహా 318 పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ సొంతం. రెండో వన్డేలో అతనికి తగిలిన గాయం పెద్దదిగా కనిపించకపోయినా దానిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరో ఓపెనర్ ధావన్ గాయం గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే వీరిద్దరు బరిలోకి దిగవచ్చని టీమ్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది. ఓపెనర్లతో పాటు రాహుల్ అద్భుత ఫామ్ భారత్‌కు అదనపు బలంగా మారింది. పైగా అతను ఇప్పుడు సొంత మైదానంలో ఆడబోతున్నాడు. వీరందరికీ కెపె్టన్ కోహ్లి బ్యాటింగ్ తోడైతే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. వన్డే జట్టులో స్థిరపడే ప్రయత్నంలో ఉన్న అయ్యర్ గత రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నా అతను ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకోలేదు. ఇప్పుడైనా అయ్యర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇదే తరహాలో మనీశ్ పాండేకు కూడా మరో అవకాశం దక్కవచ్చు. పంత్ ఎన్సీ ఏలోనే ఉన్నా... మ్యాచ్ ఫిట్‌గా ఉన్నాడో లేదో సందేహమే. పైగా రాజ్‌కోట్ మ్యాచ్‌లో రాహుల్ చక్కటి కీపింగ్ తర్వాత ఇదే జట్టును భారత్ కొనసాగించే అవకాశం ఉంది. రెండో వన్డేలో భారత బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా బుమ్రా తొలి స్పెల్ చూస్తే అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్కే అవకాశం ఖాయం. హాజల్‌వుడ్‌కు చోటు! రాజ్‌కోట్ వన్డేలో పరాజయం పాలైనా... ఆ్రస్టేలియా 300కు పైగా పరుగులు చేసి స్వల్ప తేడాతోనే ఓడింది. కాబట్టి ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం రావచ్చు. ముఖ్యంగా భారత పిచ్‌లపై ఐపీఎల్ ద్వారా రాటుదేలిపోయిన వార్నర్‌కు మరో భారీ ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉంది. కెప్టెన్ ఫించ్‌తో కలిసి శుభారంభం చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. చక్కటి ఇన్నింగ్స్‌తో వన్డేల్లో తాను ఎంత కీలకమో స్మిత్ చూపించగా... లబ్‌షేన్ కూడా అతనికి సరి జోడీగా నిలిచాడు. వీరిద్దరు కలిసి మ్యాచ్ స్వరూపం మార్చేయగలరు. మిడిలార్డర్లో క్యారీ, టర్నర్ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా స్టార్క్ ఆసీస్ నంబర్‌వన్ బౌలర్ అనడంలో సందేహం లేదు. అతనికి తోడుగా కమిన్స్ చెలరేగుతున్నాడు. టూర్లో చివరి మ్యాచ్ కాబట్టి రిచర్డ్సన్ స్థానంలో హాజల్‌వుడ్‌కు అవకాశం దక్కవచ్చు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పాండే, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, బుమ్రా. ఆ్రస్టేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, టర్నర్, క్యారీ, అగర్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, జంపా. ►4 చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియా మధ్య 7 వన్డేలు జరగ్గా భారత్ 4 ఓడి 2 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చివరగా సెప్టెంబర్, 2017లో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ సెంచరీ సహాయంతో ఆసీస్ 21 పరుగులతో నెగ్గింది. -
వ్యూహం మార్చి అదరగొట్టారు
భారత జట్టు వ్యూహం మారింది. మ్యాచ్ ఫలితం కూడా మారింది. తొలి బంతి నుంచే ధాటిగా ఆడి భారీ స్కోరు సాధించిన టీమిండియా విజయంతో కంగారూలకు జవాబిచ్చింది. ధావన్ దూకుడైన ఆరంభాన్ని ఇస్తే కోహ్లి దానిని కొనసాగించాడు. చివర్లో రాహుల్ మెరుపు దాడితో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిచింది. ముంబై మ్యాచ్ తరహా ప్రమాదం ఎదురు కాకుండా ఓపెనర్లను భారత్ కట్టడి చేయడంతో ఆసీస్‌కు ఛేదన కష్టంగా మారిపోయింది. స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేసినా అది సరిపోలేదు. ఐదుగురు బౌలర్లూ వికెట్లు తీసి సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇరు జట్లు సమంగా నిలిచిన స్థితిలో ఇక ఆదివారం జరిగే పోరుతో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. రాజ్‌కోట్: తొలి వన్డే పరాజయం నుంచి భారత్ వెంటనే కోలుకుంది. సిరీస్ చేజార్చుకునే ప్రమాదం ఎదురు కాకుండా సరైన రీతిలో స్పందించి 1–1తో పోరును సమం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (90 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (76 బంతుల్లో 78; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (102 బంతుల్లో 98; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ అవకాశం కోల్పోగా, లబ్‌షేన్ (47 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులో జరుగుతుంది. (చదవండి : కుల్దీప్ @ సెంచరీ) సెంచరీ మిస్... కమిన్స్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్‌గా ముగియగా, ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్‌గా మలచి బోణీ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (44 బంతుల్లో 42; 6 ఫోర్లు) కూడా కొన్ని చక్కటి ఫ్లిక్‌లు, డ్రైవ్‌లు ఆడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. వీరిద్దరి భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న తరుణంలో జంపా బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూ కోరినా లాభం లేకపోయింది. ఎప్పటిలాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి తనదైన శైలిలో చకచకా పరుగులు సాధించాడు. అనంతరం 60 బంతుల్లో ధావన్ వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని దూకుడు మరింత పెరిగింది. అగర్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్ అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదాడు. అయితే కోహ్లితో సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేయగానే దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. అయ్యర్ (7) మరో సారి విఫలమయ్యాడు. (చదవండి : ఇది మనీష్ పాండే వికెట్!) రాహుల్ జోరు... ఐదో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ ఈసారి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తించాడు. చూడచక్కటి షాట్లతో అతను మరో ఎండ్‌లో ఉన్న కోహ్లికంటే వేగంగా, ఎక్కువగా పరుగులు రాబట్టడం విశేషం. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి ఇన్నింగ్స్‌లో... కమిన్స్ ఓవర్లో కొట్టిన రెండు వరుస ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే బౌండరీ వద్ద అగర్–స్టార్క్ ర్యాలీ క్యాచ్ భారత కెపె్టన్ ఆటను ముగించింది. 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంలో రాహుల్ 42 పరుగులు చేయగా, కోహ్లి 36 పరుగులు సాధించాడు. పంత్‌కు బదులుగా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న మనీశ్ పాండే (2) ఎక్కువ సేపు నిలవలేదు. అయితే రాహుల్ బ్యాటింగ్ ఒక్కసారిగా కథ మార్చేసింది. స్టార్క్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన రాహుల్... కమిన్స్ ఓవర్లోనూ ఇదే తరహాలో వరుసగా 6, 4తో చెలరేగాడు. చివరి ఓవర్లో స్ట్రైకింగ్ కోసం ప్రయత్నిస్తూ రాహుల్ రనౌటయ్యాడు. 10 ఓవర్లలో 91 పరుగులు... 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 249/3. అయితే ఆ తర్వాత విరుచుకుపడిన టీమిండియా చివరి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సాధించడం విశేషం. 41–45 ఓవర్ల మధ్య 38 పరుగులు రాగా, తర్వాతి 4 ఓవర్లలో 15, 8, 11, 14 చొప్పున పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ వేసిన స్టార్క్ 5 పరుగులే ఇచ్చే కొంత నష్ట నివారణకు ప్రయత్నించాడు. స్మిత్ ఒంటరిపోరు... గత మ్యాచ్ తరహాలో ఆస్ట్రేలియాకు ఈసారి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. కవర్స్‌లో మనీశ్ పాండే సూపర్ క్యాచ్‌కు వార్నర్ (15) వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఫించ్ (33; 3 ఫోర్లు), స్మిత్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే రాహుల్ అద్భుతమైన కీపింగ్ నైపుణ్యం ఫించ్ స్టంపౌట్‌కు కారణమైంది. ఈ దశలో స్మిత్‌కు కెరీర్లో తొలి వన్డే ఇన్నింగ్స్ ఆడుతున్న లబ్‌షేన్ జత కలిశాడు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బంతికో పరుగు చొప్పున రాబడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 47 బంతుల్లోనే స్మిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ భాగస్వామ్యం సాగినంత సేపు ఆసీస్‌కు విజయావకాశాలు కనిపించాయి. అయితే లబ్‌షేన్‌ను జడేజా వెనక్కి పంపడంతో ఆసీస్ పతనం ప్రారంభమైంది. 38వ ఓవర్లో ముందుగా క్యారీ (18)ని కుల్దీప్ అవుట్ చేయగా, ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకొని సెంచరీ ముంగిట స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత కంగారూల పరాజయం లాంఛనమే అయింది. ధావన్‌కు గాయం భారత ఓపెనర్ ధావన్ స్వల్ప గాయానికి గురయ్యాడు. దాంతో ఫీల్డింగ్ కోసం మైదానంలోకి దిగలేదు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో కమిన్స్ విసిరిన బంతి నేరుగా అతని కుడి వైపు పక్కటెముకల్లో బలంగా తాకింది. ఆ బంతికి సింగిల్ పూర్తి చేసుకున్న ధావన్ చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే బెదరకుండా క్రీజ్‌లోనే నిలిచి ఆటను కొనసాగించిన అతను తన స్కోరుకు మరో 69 పరుగులు జోడించడం విశేషం. ధావన్‌కు బదులుగా చహల్ ఫీల్డింగ్ చేశాడు. పంత్ స్థానంలో భరత్ :‘కన్కషన్’ కారణంగా రెండో వన్డేకు దూరమైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో సెలక్టర్లు మరో ప్రత్యామ్నాయ ఎంపిక చేశారు. రెండో వన్డే కోసం పంత్ స్థానంలో ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ కూడా: ఫీల్డింగ్‌లో మరో ఓపెనర్ రోహిత్ భుజానికి కూడా స్వల్ప గాయమైంది. 43వ ఓవర్లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో రోహిత్ నియంత్రణ కోల్పోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతనికి టీమ్ ఫిజియో నితిన్ పటేల్ చికిత్స అందించిన అనంతరం రోహిత్ మైదానం వీడాడు. రోహిత్‌కు కొంత నొప్పి ఉన్నా పగులు మాత్రం రాలేదు కాబట్టి తర్వాతి మ్యాచ్‌కు అతను అందు బాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు కోహ్లి వెల్లడించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) జంపా 42; ధావన్ (సి) స్టార్క్ (బి) రిచర్డ్సన్ 96; కోహ్లి (సి) స్టార్క్ (బి) జంపా 78; అయ్యర్ (బి) జంపా 7; రాహుల్ (రనౌట్) 80; పాండే (సి) అగర్ (బి) రిచర్డ్సన్ 2; జడేజా (నాటౌట్) 20; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–81; 2–184; 3–198; 4–276; 5–280; 6–338. బౌలింగ్: కమిన్స్ 10–1–53–0; స్టార్క్ 10–0–78–0; రిచర్డ్సన్ 10–0–73–2; జంపా 10–0–50–3; అగర్ 8–0–63–0; లబ్õÙన్ 2–0–14–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) పాండే (బి) షమీ 15; ఫించ్ (స్టంప్డ్) రాహుల్ (బి) జడేజా 33; స్మిత్ (బి) కుల్దీప్ 98; లబ్õÙన్ (సి) షమీ (బి) జడేజా 46; క్యారీ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 18; టర్నర్ (బి) షమీ 13; అగర్ (ఎల్బీ) (బి) సైనీ 25; కమిన్స్ (బి) షమీ 0; స్టార్క్ (సి) రాహుల్ (బి) సైనీ 6; రిచర్డ్సన్ (నాటౌట్) 24; జంపా (సి) రాహుల్ (బి) బుమ్రా 6; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–20; 2–82; 3–178; 4–220; 5–221; 6–259; 7–259; 8–274; 9–275; 10–304. బౌలింగ్: బుమ్రా 9.1–2–32–1; షమీ 10–0–77–3; సైనీ 10–0–62–2; జడేజా 10–0–58–2; కుల్దీప్ 10–0–65–2. -
చివరి వన్డేలో భారత్ ఓటమి
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో జరిగిన చివరిదైన మూడో అనధికారిక వన్డేలో భారత అండర్–19 జట్టు ఐదు వికెట్లతో ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా యువ భారత్ 2–1 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. ప్రియం గార్గ్ (52; 6 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జొనాథన్ బర్డ్ (88 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) జట్టుకు విజయాన్ని అందించాడు. -
నిలవాలంటే గెలవాలి
భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోయింది. స్వదేశంలో గతంలో ఎప్పుడూ వరుసగా ఐదు వన్డేలు ఓడిన పరాభవం కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ విశాఖ వేదికగా రెండో మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోతే మాత్రం ఈ రెండు చెత్త రికార్డులు మన ఖాతాలో చేరతాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా చేతిలో వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు వెస్టిండీస్‌కు ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. భారత్‌కు అచ్చొచ్చిన వేదికల్లో వైజాగ్ ఒకటి కాగా... ఇక్కడ ఎదురైన ఏకైక పరాజయం విండీస్ చేతిలోనే కావడం గమనార్హం. సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌పై టి20 సిరీస్ గెలుచుకున్న తర్వాత చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం భారత్‌ను నేలకు దించింది. గత మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లి సేన ఇప్పుడు పట్టుదలగా తర్వాతి సమరానికి సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉండగా... మరో దూకుడైన విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని పొలార్డ్ బృందం పట్టుదలతో ఉంది. చహల్‌కు చోటు! చెన్నైలాంటి నెమ్మదైన పిచ్‌పై 288 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. భారత బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా... బౌలింగ్ వైఫల్యం విండీస్ పనిని సులువు చేసింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌కంటే ఒక స్పెషలిస్ట్ బౌలర్ అదనంగా జట్టులో ఉంటే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. భిన్నమైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బ తీయగల యజువేంద్ర చహల్‌పై అందరి దృష్టీ నిలిచింది. గత మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ లెగ్ స్పిన్నర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే శివమ్ దూబే, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. చెన్నై మ్యాచ్‌లో దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు. ఇక షమీ, దీపక్ చాహర్ కూడా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. బౌలింగ్‌లో కేదార్ జాదవ్ ప్రత్యేకత చూపించకపోయినా అతను చేసిన కీలక పరుగులు జట్టులో స్థానానికి ఢోకా లేకుండా చేశాయి. సుదీర్ఘ కాలం తర్వాత భారత టాప్–3 బ్యాట్స్‌మెన్ విఫలం కావడం చెన్నై మ్యాచ్‌లోనే జరిగింది. విశాఖలో అద్భుత రికార్డు ఉన్న కోహ్లి, రోహిత్‌లలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్‌కు కష్టాలు తప్పవు. రెండో ఓపెనర్‌గా రాహుల్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మయాంక్ అగర్వాల్‌కు ప్రస్తుతానికి అవకాశం లేదు. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ రాణించడం భారత్‌కు శుభసూచకం. తొలి వన్డేలో ఓటమి పలకరించినా ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు కష్టం కాకపోవచ్చు. లూయిస్ పునరాగమనం! సిరీస్‌లో శుభారంభం చేయడం వెస్టిండీస్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హెట్‌మైర్, షై హోప్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని వీరిద్దరు బాగా ఆడి 218 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అందరి ప్రశంసలకు కారణమైంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే వైజాగ్ వేదికపై వీరిద్దరు చక్కటి ఇన్నింగ్స్‌లతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడి మ్యాచ్‌ను ‘టై’గా ముగించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చెలరేగితే భారత బౌలర్లు ఇబ్బంది పడాల్సిందే. హెట్‌మైర్,షై హోప్ పూరన్, పొలార్డ్‌లతో జట్టు బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తోంది. మరో భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్ గాయం నుంచి కోలుకుంటే అతను ఆంబ్రిస్ స్థానంలో జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన విశాఖ పిచ్‌పై పేసర్లు కాట్రెల్, జోసెఫ్, హోల్డర్ ఎలా ప్రత్యర్థిని నిలువరిస్తారనేది ఆసక్తికరం. స్పిన్నర్లు వాల్ష్, ఛేజ్ కూడా గత మ్యాచ్‌లో మెరుగ్గానే బౌలింగ్ చేశారు. అయితే మొత్తంగా చూస్తే విండీస్ విజయరహస్యం, బలమంతా ఆ జట్టు విధ్వంసక బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. కాబట్టి బ్యాట్స్‌మెన్ చెలరేగితే చిరస్మరణీయ సిరీస్ వారి ఖాతాలో చేరవచ్చు. విండీస్ మాజీ క్రికెటర్ బాసిల్ బుచర్ (86 ఏళ్లు) మృతికి సంతాపంగా నేటి మ్యాచ్‌లో విండీస్ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడతారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, దూబే/చహల్, చాహర్, షమీ, కుల్దీప్. విండీస్: పొలార్డ్ (కెపె్టన్), షై హోప్, ఆంబ్రిస్/లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, వాల్ష్, జోసెఫ్, కాట్రెల్. పిచ్, వాతావరణం పిచ్‌ను పరిశీలిస్తున్న జడేజా, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే డిసెంబర్ మాసం కావడంతో రాత్రి మంచు ప్రభావంతో బౌలర్లకు పట్టు చిక్కడం కష్టంగా మారిపోవచ్చు. దీంతో పాటు ఛేదననే ఇరు జట్లు ఇష్టపడుతున్నాయి కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం లాంఛనమే. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
-
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
హెర్షెలె గిబ్స్.. క్రికెట్ ప్రేమికులకు చిరపరితమైన పేరు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. దూకుడుగా ఆడటంలో అతడు పేరుగాంచాడు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున(మార్చి 16) వన్డే మ్యాచ్‌లో గిబ్స్ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఈ ఘనత నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన గిబ్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్ ఏలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జాక్వెస్ కల్లిస్(128) అజేయ శతకంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 132 పరుగులు మాత్రమే చేసింది. -
మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ ‘ట్రిపుల్ సెంచరీ’...
భారత్–వెస్టిండీస్ మధ్య మూడో వన్డేతో రిఫరీ క్రిస్ బ్రాడ్ అరుదైన రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన బ్రాడ్... 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రిస్ బ్రాడ్‌కు భారత కెప్టెన్ కోహ్లి జ్ఞాపిక అందజేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక–336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు.