రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. తొలి వన్డేలో పోరాడిన జట్టేనా ఇప్పుడు ఆడుతుంది అన్న తరహాలో కివీస్ బ్యాటింగ్ సాగుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 20, మిచెల్ సాంట్నర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.
లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న మైకెల్ బ్రాస్‌వెల్ ఈ మ్యాచ్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్ల దాటికి కివీస్ టాపార్డర్ కకావికలమైంది. మహ్మద్ షమీ తన పేస్ పదును చూపిస్తూ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వన్డేల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియాతో వన్డేలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్‌కు ఇదే అత్యల్పం. ఇంతకముందు 2001లో శ్రీలంకతో మ్యాచ్‌లో 18 పరుగులకు ఐదు వికెట్లు, 2010లో బంగ్లా తో మ్యాచ్‌లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా!
Comments
Please login to add a commentAdd a comment