ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. మూడో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ నేరుగా చెప్పనప్పటికీ.. వర్క్ లోడ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.
ప్రాక్టీస్ సెషన్స్‌లో సైతం బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఆకాశ్‌దీప్, మొహ్మద్ సిరాజ్ నెట్స్‌లో లాంగ్ స్పెల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.
మూడో టెస్ట్‌లో ఇద్దరు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో ఆడిన స్పిన్నర్లే మూడో టెస్ట్‌లోనూ కొనసాగవచ్చు. మూడో టెస్ట్ కోసమని హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను బెంచ్‌కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు. మూడో టెస్ట్‌లో టీమిండియా ఒక్క మార్పు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుమ్రా స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగవచ్చు.
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం భారత జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment