ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 1) మొదలుకానున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.
మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇదివరకే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ
చదవండి: విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం
Comments
Please login to add a commentAdd a comment