
PC: BCCI/IPL.com
టీమిండియా ఆల్‌రౌండర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా పరాగ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ క్యాచ్‌ను అందుకున్న పరాగ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో రాజస్తాన్ తరపున 41 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ అజింక్య రహానే పేరిట ఉండేది. రహానే రాయల్స్ తరపున 40 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రహానే రికార్డును పరాగ్ బ్రేక్ చేశాడు. కాగా రియాన్ అతి తక్కువ సమయంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, హసరంగ తలా వికెట్ సాధించారు.