
ఐపీఎల్-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్‌లో మొత్తం పది జట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయర్లు, కోచ్‌లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్‌లు ఎరగా వేస్తాడని క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్-2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.
గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వంటి జట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ జట్లు తడబడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?