IND Vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాలో మూడు మార్పులు | IND Vs NZ 2nd Test: India Made Three Changes In Playing XI, Check Out More Insights | Sakshi
Sakshi News home page

IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాలో మూడు మార్పులు

Published Thu, Oct 24 2024 9:18 AM | Last Updated on Thu, Oct 24 2024 10:00 AM

IND VS NZ 2nd Test: India Made Three Changes In Playing XI

పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ మూడు మార్పులు చేసింది. కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు న్యూజిలాండ్‌ సైతం  నేటి మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. పేసర్‌ మ్యాట్‌ హెన్రీ స్థానంలో స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ తొలి మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే.

తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్‌), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్‌), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

చదవండి: స్కై, విరాట్‌లను అధిగమించిన సికందర్‌ రజా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement