Tom Latham
-
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.కాగా న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 259 పరుగులకు ఆలౌటైంది.న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. అంతకుముందు ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(106) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్ డకెట్(92), జాకెబ్ బెతల్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.మ్యాచ్ స్కోర్లు..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 280/10న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 125/10ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 424/6 డిక్లేర్కివీస్ రెండో ఇన్నింగ్స్: 259/10ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయంప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్‌ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్‌ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్
పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.ఇన్నింగ్స్ 24వ ఓవర్లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈసారి యాష్ విల్ యంగ్‌ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యంగ్ పెవిలియన్ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 76/2గా ఉంది. డెవాన్ కాన్వే (38), రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నారు.ASHWIN STRIKES IN HIS FIRST OVER 👌- What a champion, India on charge at Pune. pic.twitter.com/oJOCsGZPAZ— Johns. (@CricCrazyJohns) October 24, 2024కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేసింది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106 -
IND Vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్‌లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్‌పై కివీస్ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్‌గా రెండో రోజు కివీస్‌దే పైచేయి అయింది.భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దుకాగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్స్‌తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ‘హాక్–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్ బ్రేక్ ప్రకటించి ‘హాక్–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో రోజు కరుణించిన వరణుడుఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కెప్టెన్ రోహిత్ శర్మ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు.వికెట్ల పతనంఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.కాన్వే హీరో ఇన్నింగ్స్ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు డెవాన్ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారత్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
IND vs NZ 1st Test: బెంగళూరులో భారీ వర్షం.. అభిమానులకు చేదువార్త
Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత్‌కు వచ్చింది.షెడ్యూల్ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్- కివీస్ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్‌తో కప్పినా.. సమయానికి మ్యాచ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.ఫైనల్ దారిలో టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్‌తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్‌లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2024 జట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024 -
Ind vs NZ: కివీస్ పేసర్ అవుట్! అన్క్యాప్డ్ ప్లేయర్ ఎంట్రీ
టీమిండియాతో టెస్టులకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ బెన్ సియర్స్(Ben Sears) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. సియర్స్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ జాకోబ్ డఫీ(Jacob Duffy)ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. బెంగళూరు వేదికగా అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.మోకాలి గాయంఅయితే, తొలి టెస్టు ఆరంభానికి ముందే న్యూజిలాండ్ యువ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం తీవ్రమైంది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా 26 ఏళ్ల సియర్స్ ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.అనంతరం.. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. అయితే, రెండో టెస్టు సమయంలో మోకాలి నొప్పితో అతడు ఇబ్బందిపడ్డాడు. వైద్య పరీక్షల ఫలితాలు తాజాగా వెలువడగా.. ఆటకు కొంతకాలం దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.పేస్ విభాగం పటిష్టంగానేఇక సియర్స్ టీమిండియాతో సిరీస్‌కు సియర్స్ లేకపోయినా.. న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగానే ఉంది. వెటరన్ బౌలర్ టిమ్ సౌతీతో పాటు ఎమర్జింగ్ పేసర్ విలియం ఒ రూర్కీ జట్టుతో ఉన్నారు. అంతేకాదు.. మీడియం పేసర్‌గా డారిల్ మిచెల్ కూడా సేవలు అందించగలడు. ఈ క్రమంలో సియర్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాకోబ్ డఫీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం లేదు.టీమిండియాతో టెస్టు సిరీస్-2024కు న్యూజిలాండ్ జట్టు(అప్డేటెడ్)డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.న్యూజిలాండ్‌తో టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. తదుపరి న్యూజిలాండ్‌తో పోరులోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.ఇక స్వదేశంలో ఈ టెస్టు సిరీస్ జరుగనుండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు.. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 0-2తో వైట్‌వాష్ అయిన కివీస్ జట్టు.. భారత్‌లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ ఆరో స్థానంలో ఉంది.మరి ఇరుజట్లకు కీలకమైన ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందామా?!టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ 2024 టెస్టు సిరీస్👉తొలి టెస్టు: అక్టోబరు 16(బుధవారం)- అక్టోబరు 20(ఆదివారం), ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉రెండో టెస్టు: అక్టోబరు 24(గురువారం)- అక్టోబరు 28(సోమవారం), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె👉మూడో టెస్టు: నవంబరు 1(శుక్రవారం)- నవంబరు 5(మంగళవారం), వాంఖడే స్టేడియం, ముంబై.మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం.. మూడు టెస్టులు ఉదయం 9.30 - సాయంత్రం 5 గంటల వరకు.ఎక్కడ చూడవచ్చు?👉టీవీ: స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్👉డిజిటల్ మీడియా: జియో సినిమా, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం.న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh— BCCI (@BCCI) October 15, 2024 -
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్‌గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్‌లను ఓటమితో ముగించింది.న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్..ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్‌గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్‌తో కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్ ఆక్టోబర్ 10న భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్‌దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్‌కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
అత్యుత్తమ ప్రదర్శన కాదు.. ఒత్తిడిలో ఉన్నాం.. రాత్రికిరాత్రి చెత్త టీమ్ అయిపోదు..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జరిగే రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌లో ఓడినా కివీస్ సెమీస్ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో మేం స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. డికాక్, డస్సెన్‌ల భాగస్వామ్యం తర్వాత ఒత్తిడిలో పడ్డాం. వారు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మా బౌలర్లు ప్రత్యర్ధిని 330 పరుగుల్లోపు పరిమితం చేయాల్సి ఉండింది. అలా చేయడంలో మేం విఫలమయ్యాం. గ్రౌండ్ చాలా చిన్నగా, బ్యాటింగ్‌కు అనుకువగా ఉండింది. అయితే మేము పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మొదటి 10 ఓవర్లలో (పవర్‌ప్లే) పెద్దగా ఏమీ చేయలేకపోయాం. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి తమను తాము గొప్ప స్థితిలో ఉంచుకుంది. ఏ సందర్భంలోనూ వారు మ్యాచ్‌పై పట్టు కోల్పోలేదు. గాయాలు మా జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ ఓటమిని ఇక్కడితో వదిలేసి, తదుపరి పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం. రాత్రికిరాత్రి మేం చెడ్డ జట్టుగా మారిపోమని అనుకుంటున్నానని అన్నాడు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
Aus vs NZ: గ్రీన్ అవుట్.. ట్రవిస్ హెడ్ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ధర్మశాల వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగినట్లు కివీస్ సారథి టామ్ లాథమ్ తెలిపాడు. మార్క్ చాప్మన్ పిక్కల్లో నొప్పితో దూరంకాగా.. అతడి స్థానంలో జిమ్మీ నీషం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. మేము టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఈ మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్ స్థానంలో ట్రవిస్ హెడ్ తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు. ఇక కివీస్‌తో పోరు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుందన్న కమిన్స్.. ‘‘వాళ్లేంటో మాకు తెలుసు.. మేమేంటో వాళ్లకు కూడా బాగానే తెలుసు. భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. మూడు గెలుపొందిన ఆసీస్ నాలుగో స్థానంలో ఉంది. తుదిజట్లు: న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. -
అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం: న్యూజిలాండ్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. 274 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో న్యూజిలాండ్ బౌలర్లు సఫలం కాలేదు. ఈ మెగా టోర్నీలో తమ తొలి ఓటమిపై మ్యాచ్ అనంతర కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పందించాడు. తమ బ్యాటింగ్‌లో ఆఖరి 10 ఓవర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని లాథమ్ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డాం. మేము చివరి 10 ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మా స్కోర్ బోర్డ్‌లో మరో 30 నుంచి 40 పరుగులు తక్కువ అయ్యాయి. కానీ ఆఖరిలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాబట్టి క్రెడిట్ మొత్తం వారికే. రాచిన్ రవీంద్ర, మిచెల్ మాకు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. కానీ దాన్ని మేము వినియోగించుకోలేకపోయాం. మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా పోరాడారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. మా జట్టు ప్రస్తుతం సమతుల్యంగా ఉంది. మా తదుపరి మ్యాచ్‌ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో లాథమ్ పేర్కొన్నాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఓడినా వారు తోపులే.. ఆఫ్ఘన్ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన కివీస్ కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 18) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 149 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. అయితే ఓ దశలో ఆఫ్ఘన్ బౌలర్లు కివీస్‌ను వణికించారు. కేవలం పరుగు వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, కెప్టెన్ టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో ఆదుకోవడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లాథమ్, ఫిలిప్స్‌తో పాటు విల్ యంగ్ (54) కూడా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు.. ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్.. లోకీ ఫెర్గూసన్ (7-1-19-3), మిచెల్ సాంట్నర్ (7.4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (7-1-18-2), మ్యాట్ హెన్రీ (5-2-16-1), రచిన్ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మాత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. మెగా టోర్నీలో మరో మంచి ఆరంభం లభించింది. మా ఆటగాళ్లు మరో అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్‌లో మేము ఓ దశలో ఒత్తిడికి లోనయ్యాం. అయితే ఓ కీలక భాగస్వామ్యం (లాథమ్-ఫిలిప్స్) తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చింది. ఒత్తిడిలో ఫిలిప్స్ అద్బుతంగా ఆడాడు. ఇక్కడ ఆఫ్ఘన్ బౌలర్ల నైపుణ్యాన్ని పొగడకుండా ఉండలేము. వారు ప్రపంచంలోని ఎంతటి బ్యాటింగ్ లైనప్‌నైనా ఒత్తిడిలోకి నెట్టగలరు. ముఖ్యంగా ఆఫ్ఘన్ స్పిన్నర్లు ప్రత్యర్ధి నుంచి ఒక్కసారిగా మ్యాచ్‌ను లాగేసుకోగలరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వారేం చేశారో చూశాం. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఓడినా, వారి బౌలర్లు తోపులే. మా బౌలర్ల విషయానికొస్తే.. అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవసరమైన సమయంలో వికెట్లు తీయగలిగారు. మిచ్ సాంట్నర్ మరోసారి తన పని తాను చేసుకుపోయాడు. మొత్తానికి హర్షించదగ్గ ప్రదర్శన. తుదుపరి భారత్, ఆస్ట్రేలియాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నామని అన్నాడు. -
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్‌పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్‌కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్‌లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో సాన్‌ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్‌ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్‌తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్‌తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్‌కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్‌లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్‌ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్‌తో మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దది. క్రీజ్‌లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్‌ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్‌జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్‌ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్‌మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్‌ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: రచిన్ రవీంద్ర.. మొన్న సెంచరీ.. ఇప్పుడేమో!
ICC Cricket World Cup 2023 - New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ అర్ధ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కాగా ఉప్పల్‌లో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మూడు హాఫ్ సెంచరీలు ఈ క్రమంలో స్కాట్ ఎడ్వర్డ్ బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు. గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు. సాంట్నర్ మెరపులు అయితే, ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక.. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్ చేసిన మ్యాట్ హెన్రీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌కు కష్టమే! నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మెకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ ఛేదించడం కష్టంగానే కనిపిస్తోంది! ఇదిలా ఉంటే.. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్.. ఉప్పల్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరి ఇదే వేదికపై మరోసారి పటిష్ట కివీస్‌తో తలపడుతున్న డచ్ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో!? చదవండి: CWC 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం.. షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023 Eng Vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లండ్‌కు షాక్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్‌కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్‌కు షాక్.. స్టోక్స్ లేకుండానే టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్.. కివీస్‌తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. వాళ్లు ముగ్గురూ మిస్ కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. పిచ్ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్‌ని గాయం వేధిస్తోంది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. -
ప్రపంచకప్‌కు విలియమ్సన్ దూరం! న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2023లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్వదేశానికి వెళ్లిన కేన్‌మామ మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోన్నాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్ సమయానికి విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. కివీస్ జట్టను టిమ్ సౌథీ లేదా టామ్ లాథమ్ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. "కేన్ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్‌కప్‌కు దూరమమ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేన్ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమించాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టామ్ లాథమ్‌కు వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది. టామ్ పాకిస్తాన్ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్‌గా లాథమ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ టామ్ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
Pak Vs NZ: 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్ సమర్పయామి.. ఇప్పుడేమో ఏకంగా..
Pakistan vs New Zealand- Babar Azam: పాకిస్తాన్ గడ్డపై టీ20 సిరీస్‌లో రాణించిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటికే మూడింట ఓటమిపాలై సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న కివీస్.. నాలుగో వన్డేలోనూ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 5 టీ20లు, 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో కివీస్ వైఫల్యం కొనసాగిస్తోంది. కరాచీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెంచరీతో చెలరేగిన బాబర్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య పాకిస్తాన్‌కు ఓపెనర్ మసూద్(44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ సెంచరీ(107)తో చెలరేగాడు. అతడికి తోడు.. ఐదో స్థానంలో వచ్చిన ఆగా సల్మాన్ అర్థ శతకం(58)తో రాణించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఒక్కడే ఈ మాత్రం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను ఉసామా మీర్ దెబ్బకొట్టాడు. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి కివీస్ పతనాన్ని శాసించాడు. హారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్ మూడు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో మార్క్ చాప్మన్ 46 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 43.4 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసి కివీస్ ఆలౌట్ అయింది. 102 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి సెంచరీ హీరో బాబర్ ఆజం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్‌కు వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆఖరి మ్యాచ్‌లో గనుక ఓడితే క్లీన్‌స్వీప్‌తో అపఖ్యాతిని మూటగట్టుకోకతప్పదు. చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ .@iShaheenAfridi gets the New Zealand skipper! \0/#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/dE5C7ZmOOq — Pakistan Cricket (@TheRealPCB) May 5, 2023 -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్‌కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్‌కు పరాభవం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
బదులు తీర్చుకున్న న్యూజిలాండ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్‌పై విజయం
లాహొర్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్ తొలి గెలుపు నమోదు చేసింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బంతిని నీషమ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని ఇఫ్తికర్ ఆహ్మద్ సిక్సర్‌గా మలచగా.. రెండో బంతికి ఎటువంటి రన్స్ రాలేదు. మూడో బంతికి ఇఫ్తికర్ ఫోర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ నాలుగో బంతికి ఇఫ్తికర్ ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఓటమి ఖారారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే,రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(64) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్, అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. పదండి ఉప్పల్‌కి అంటూ! వీడియో వైరల్ -
న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 88 పరుగులకే ఆలౌట్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహొర్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. పాక్ పేసర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ నాలుగు వికెట్లతో కివీస్ వెన్ను విరచగా.. ఇమాడ్ వసీం రెండు, అఫ్రిది, షాదాబ్ ఖాన్, జమాన్ ఖాన్, ఆష్రాఫ్ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మాన్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 182 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో అయాబ్(47), ఫఖర్ జమాన్(47) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిల్నే, లిస్టర్ తలా రెండు వికెట్లు, సోధి, లిస్టర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇది 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ రెండు జట్ల రెండో టీ20 లాహొర్ వేదికగానే శనివారం జరగనుంది. చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్‌దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది.