
హామిల్టన్: ఓపెనర్లు జీత్ రావల్ (220 బంతుల్లో 132; 19 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లాథమ్ (248 బంతుల్లో 161; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 86/0తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టుకు తొలి వికెట్‌కు రావల్, లాథమ్ 254 పరుగులు జోడించి పటిష్ఠ పునాది వేశారు.
అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (132 బంతుల్లో 93 బ్యాటింగ్; 9 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నికోల్స్ (81 బంతుల్లో 53; 7 ఫోర్లు) రాణించడంతో ఆట ముగిసే సమయానికి కివీస్ 4 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. మరో మూడు రోజుల ఆట మిగిలిన ఉన్న ఈ టెస్టులో న్యూజిలాండ్ ఇప్పటికే 217 పరుగుల ఆధిక్యంలో ఉంది. విలియమ్సన్‌కు తోడుగా వాగ్నర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment