NZ Vs BAN: Tom Latham Sensational Catch Against Bangladesh, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Tom Latham Catch: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. సూపర్ మ్యాన్‌లా.. వీడియో వైరల్‌!

Published Tue, Jan 11 2022 12:22 PM | Last Updated on Tue, Jan 11 2022 2:01 PM

Tom Latham takes a breathtaking catch at slips after double century - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్‌ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో.. మొహమ్మద్ నయీమ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది. దీంతో థర్డ్‌ స్లిప్‌లో ఉన్న లాథమ్‌ డైవ్‌ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బ్లాక్‌ క్యాప్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో టెస్టులో ఇన్నింగ్స్‌, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో లాథమ్ డబుల్‌ సెంచరీతో మెరిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement