Stunning Catch
-
వారెవ్వా.. ఫిలిప్స్‌ను మించిపోయాడుగా! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ అసాధరణ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. రవూఫ్ అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్ పెవిలియన్‌కు పంపాడు. అతడి క్యాచ్‌తో ఆక్లాండ్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో పాక్ బౌలింగ్ ఎటాక్‌ను షాహీన్ అఫ్రిది ప్రారంభించగా.. కివీస్ ఓపెనర్లగా టిమ్ సీఫర్ట్, అలెన్ బరిలోకి దిగారు. అయితే మొదటి ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది ఐదో బంతిని లెగ్ సైడ్‌గా సంధించాడు. ఆ బంతిని అలెన్ లెగ్ సైడ్‌లోకి ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రవూఫ్ అద్బుతం చేశాడు.రౌఫ్ తన కుడి వైపునకు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఫిన్ అలెన్ ఆశ్చర్యపోయాడు. రవూఫ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్లెన్ ఫిలిప్స్‌ను మించిన క్యాచ్ పట్టావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ డూర్ ఆర్ డై. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.ఇక ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం దూరమైన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైనందుకు ఈ సీనియర్ ద్వయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను నియమించిన పీసీబీ.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌కు అప్పగించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ? pic.twitter.com/odGcpMzlPX— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 21, 2025 -
పాక్ ఫీల్డర్ సంచలనం.. క్రికెట్ చరిత్రలో సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం ప్రోటీస్, పాక్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు అఘా సల్మాన్ తన ఫీల్డింగ్ విన్యాసంతో దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను గుర్తు చేశాడు. సల్మాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు.అద్బుతమైన క్యాచ్‌తో దక్షిణాఫ్రికా యువ సంచలనం మాథ్యూ బ్రీట్జ్కేను సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన పాక్ స్పిన్నర్ కుష్దిల్ షా.. తొలి బంతిని బ్రీట్జ్కేకి షా టాస్డ్అప్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్రీట్జ్కే కాస్త ముందుకు వచ్చి కవర్స్‌పై నుంచి ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి కవర్స్‌లో ఉన్న ఆఘా సల్మాన్ అద్బుతం చేశాడు. సల్మాన్ తన కుడివైపునకు గాల్లోకి దూకుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎన్నాళ్లకు పాక్ ఫీల్డర్ల నుంచి గుడ్ క్యాచ్ చూశాము నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బ్రీట్జ్కే సూపర్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్‌లో కూడా బ్రీట్జ్కే దుమ్ములేపాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(82), క్లాసెన్(87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించగా.. నసీం షా, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు Salman " Superman" Ali Agha 👏🏻🥵Salman Ali Agha with a jaw-dropping one-handed grab! 🤯#3Nations1Trophy | #PAKvSA pic.twitter.com/AKe4TmgaEY— Abdullah Zafar (@Arain_417) February 12, 2025 -
సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో అద్బుత క్యాచ్‌లను అందుకున్న స్మిత్.. తాజాగా మరోసారి తన సంచలన ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు.గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్.. నాలుగో బంతిని దనుంజయ డిసిల్వాకు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శ్రీలంక కెప్టెన్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి సిల్వా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ తన కుడివైపునకి డైవ్ చేస్తూ సింగల్ హ్యాండ్‌తో సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అది చూసిన డిసిల్వా బిత్తరపోయాడు. చేసేదేమి లేక డిసిల్వా(23) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.స్మిత్ సరికొత్త చరిత్ర..కాగా ఈ మ్యాచ్‌లో స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రబాత్ జైసూర్య క్యాచ్‌ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌లలో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ ఇప్పటివరకు 205 ఇన్నింగ్స్‌లలో 198 క్యాచ్‌లను తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్‌లలో ద్రవిడ్.. 210 క్యాచ్‌లను తీసుకున్నాడు.స్మిత్ 12 క్యాచ్‌లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్(131) సెంచరీతో మెరిశాడు. తద్వారా ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting)ను స్మిత్ అధిగమించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. OUTSTANDING from Steve Smith 😮What. A. Catch. #SLvAUS pic.twitter.com/mVIJLZWbGI— 7Cricket (@7Cricket) February 8, 2025 -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్‌కు మైండ్ బ్లాంక్! వీడియో
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్‌తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్‌కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ మిస్టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జైశ్వాల్‌తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. భారత్‌కు భారీ షాక్YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025 -
వావ్ వాట్ ఏ క్యాచ్.. సింగల్ హ్యాండ్‌తో అద్బుతం! వీడియో వైరల్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో (7), దిముత్ కరుణరత్నె (7), ఏంజెలో మాథ్యూస్ (7) అవుట్ కాగా... దినేశ్ చండీమల్ (9 బ్యాటింగ్), కమిందు మెండిస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 610 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఆ్రస్టేలియా 154 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (352 బంతుల్లో 232; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా... అరంగ్రేట ఆటగాడు జోస్ ఇంగ్లిస్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (251 బంతుల్లో 141; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో మెరిశారు.హెడ్ సూపర్ క్యాచ్..కాగా రెండో రోజు ఆటలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్‌ను హెడ్ పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. మూడో బంతిని మాథ్యూస్‌కు ఆఫ్‌బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ లూపీ డెలివరీని మాథ్యూస్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు.కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్-లెగ్ ఫీల్డర్ కుడివైపునకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హెడ్ తన కుడివైపునకు లాంగ్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాథ్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేదేమి లేక మాథ్యూస్(7) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. ఓపెనర్‌గా వచ్చిన హెడ్ 40 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో Travis Head flies at bat pad! ✈️Nathan Lyon gets Australia's THIRD #SLvAUS pic.twitter.com/Nx4KxB0bwy— 7Cricket (@7Cricket) January 30, 2025 -
వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ స్టార్, ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్రెవిస్ తన అద్బుత విన్యాసంతో సన్‌రైజర్స్ బ్యాటర్ టామ్ అబెల్ను పెవిలియన్‌కు పంపాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన కార్బిన్ బాష్ ఆఖరి బంతిని షార్ట్ పిచ్ డెలివరీగా అబెల్‌కు సంధించాడు. ఆ బంతికి అబెల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ బౌండరీ లైన్‌వద్ద ఉన్న బ్రెవిస్ అద్భుతం చేశాడు. గాల్లోకి దూకి తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి మరి సింగిల్ హ్యాండ్‌తో బ్రెవిస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లంతా బిత్తర పోయారు. కాగా జూనియర్ ఏబీడీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ అభివర్ణిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో అంతకుముందు జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్‌ను కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు.ప్లే ఆఫ్స్‌కు ఎంఐ..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 10 వికెట్ల తేడాతో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) చిత్తు చేసింది. దీంతో తొలిసారి ఎస్ఎ20 ప్లేఆప్స్‌కు ఎంఐ ఆర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ మార్క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే చేధించింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.Brevis just defied gravity with that catch! 🤯#BetwaySA20 #MICTvSEC #WelcomeToIncredible pic.twitter.com/NNE8lUVtWM— Betway SA20 (@SA20_League) January 29, 2025చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
నితీశ్ కుమార్ కళ్లు చెదిరే క్యాచ్.. జోస్ బట్లర్! వీడియో వైరల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. నితీశ్ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తొలి బంతిని బట్లర్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత వెంటనే రెండో బంతిని వరుణ్.. బట్లర్‌కు షార్ట్-పిచ్డ్ డెలివరీ సంధిచాడు.ఆ బంతిని కూడా లెడ్ సైడ్ దిశగా బట్లర్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో బట్లర్(68) నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో నితీశ్ మొత్తంగా రెండు క్యాచ్‌లను అందుకున్నాడు. నితీశ్ డైవింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. Runs in ✅Dives forward ✅Completes a superb catch ✅Superb work this is from Nitish Kumar Reddy! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#TeamIndia | #INDvENG | @NKReddy07 | @IDFCFIRSTBank pic.twitter.com/LsKP5QblJO— BCCI (@BCCI) January 22, 2025 -
పుష్ప 2 కిస్సిక్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అదిరిపోయే లేటెస్ట్ లుక్స్ (ఫొటోలు)
-
వారెవ్వా బదోని.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్(వీడియో)
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆయుష్ బౌండరీ లైన్ వద్ద తన అద్బుత విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ ఆఖరి బంతిని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జవదుల్లా తన ఫ్రంట్ ఫుట్‌ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి కచ్చితంగా బౌండరీకి పోతుందని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోని అందరి అంచనాలను తారుమారు చేశాడు.వైడ్ లాంగ్-ఆన్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బదోని.. గాలిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండగ? 𝐅𝐥𝐢𝐠𝐡𝐭 𝐦𝐨𝐝𝐞 🔛A super catch by Ayush Badoni! 👐@BCCI#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/imOQae1Xu6— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా?
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భారత్ ఎ జట్టు శుభారంభం చేసింది. శనివారం(అక్టోబర్ 19) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య చేధనలో పాక్-ఎ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ తిలక్ వర్మ(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(35), ప్రభుసిమ్రాన్ సింగ్(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.రమణ్‌దీప్ సింగ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాక్ స్టార్ బ్యాటర్ యాసిర్ ఖాన్‌ను సింగ్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమంలో యాసిర్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న రమణ్‌దీప్ సింగ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. డిప్ మిడ్ వికెట్లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి విన్యాసం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.చదవండి: పాక్‌పై విజయం.. భారత్ ‘ఎ’ శుభారంభం ONE OF THE GREATEST EVER CATCHES FROM RAMANDEEP SINGH. 🥶 pic.twitter.com/5gM0L02eDv— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024 -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.సూపర్ మ్యాన్‌లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో)
ది హాండ్రడ్ లీగ్-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ తన ఫీల్డింగ్ విన్యాసాలను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంట్నర్ మరోసారి సంచలన క్యాచ్‌తో మెరిశాడు.మంగళవారం(ఆగస్టు 13) లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ను ఈ కివీ స్టార్ అందుకున్నాడు. సూపర్ క్యాచ్‌తో లండన్ స్పిరిట్ బ్యాటర్ మైఖేల్ పెప్పర్‌ను సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.లండన్ ఇన్నింగ్స్ 11వ బంతిని పేసర్ రీస్ టాప్లీ.. పెప్పర్‌కు ఫుల్ అండ్ మిడిల్లో సంధించాడు. పెప్పర్ ఆ బంతిని మిడ్ ఆన్ మీదగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సాంట్నర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన బ్యాక్వర్డ్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. చివరి క్షణం వరకు బంతిపై తన దృష్టిని కోల్పోకుండా వెనక్కి వెళ్లిన సాంట్నర్.. డైవ్ సంచలన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఘన విజయం సాధించింది. Mitchell Santner, that is UNBELIEVABLE 🤯Enjoy every angle of 𝘵𝘩𝘢𝘵 catch 👇#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oJupXTP3hR— The Hundred (@thehundred) August 13, 2024 -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
Suryakumar Yadav Catch: 'సూపర్ మేన్' సూర్య.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్ పట్టంది ఈజీ క్యాచే అయినా అంతటి ఒత్తిడిలో బంతిని ఒడిసిపట్టడం అంత సులభం కాదు. అప్పుడు ఏ క్యాచ్ అయితే భారత్‌ను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిందో.. ఇప్పుడు అటువంటి మరో అద్భుత క్యాచే 17 ఏళ్ల తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది.టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ అద్బుతం చేశాడు. సూర్య సంచలన క్యాచ్‌తో భారత్ రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకులతో పాటు టీవీల ముందు కూర్చుకున్న భారత అభిమానల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ మేన్ సూర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. What A Catch By Suryakumar Yadav 🔥🔥Game changing catch 🥹❤️Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024 -
కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో డర్హామ్ ఆల్‌రౌండర్ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్ను సంచలన క్యాచ్‌తో కొగ్లిన్ పెవిలియన్‌కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ కొగ్లిన్ ప్లాన్‌ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్ ఫ్రంట్‌పుట్‌కు వచ్చి స్టైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్‌లో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. What a ludicrous catch.pic.twitter.com/ucPjKpeH0Z— The Cricketer (@TheCricketerMag) June 16, 2024 -
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏 ..#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024 -
సిరాజ్ మియా మ్యాజిక్.. కళ్లు చెదిరే క్యాచ్! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. గ్రూపు-ఎ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేన అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో 110 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటింది. 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకుముందు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.సిరాజ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో అమెరికా బ్యాటర్ నితీష్ కుమార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతిని నితీష్ కుమార్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫుల్ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు.కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో సిరాజ్ బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. అయినప్పటకి బంతిని మాత్రం జారవిడచలేదు. సిరాజ్ క్యాచ్ చూసిన ప్రతీఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Siraj took a stunner pic.twitter.com/kJYMmupOS5— mohsinali (@mohsinaliisb) June 12, 2024 -
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా పాకిస్తాన్-యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 30 పరుగులకే పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్(9), ఫఖార్ జమాన్(11), ఉస్మాన్ ఖాన్(3) వంటి స్టార్ బ్యాటర్లు ఎటువంటి ప్రభావం చూపకలేకపోయారు. నేత్రవల్కర్,నోస్తుష్ కేంజిగే, అలీ ఖాన్ తలా వికెట్ సాధించారు.సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను టేలర్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నేత్రవల్కర్ మూడో బంతిని రిజ్వాన్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో రిజ్వాన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త లేట్‌గా స్వింగ్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ల్ స్లిప్‌లో ఉన్న టేలర్ తన కుడివైపునకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు.దీంతో రిజ్వాన్ మైండ్‌బ్లాంక్ అయిపోయింది. చేసేదేమి లేక రిజ్వాన్(9) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్‌తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్‌లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
వారెవ్వా సాల్ట్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయిట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సాల్ట్ అద్భుతమైన క్యాచ్‌తో లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిష్ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 11 ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాలుగో బంతిని గుగ్లీగా సంధించాడు. అయితే ఆ డెలివరీని స్టోయినిష్ లెగ్ సైడ్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్టోయినిష్ థై ప్యాడ్‌కు తాకి ఆనూహ్యంగా ఆఫ్‌సైడ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ సాల్ట్ తన కుడివైపున్కు జంప్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో స్టోయినిష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నిలిచిపోతుందని కామెట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మరో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ సైతం సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ✌️wickets in ✌️ overs for @KKRiders! A wicket each for @Russell12A & @chakaravarthy29 👍 👍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvLSG pic.twitter.com/HDTLXUDgOK — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో)
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని రోహిత్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న టాప్లీ ఎడమవైపు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. టాప్లీ క్యాచ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. రోహిత్ కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక 38 పరుగులు చేసిన రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61), కార్తీక్(53) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. WHAT A CATCH! Reece Topley takes a blinder to dismiss Rohit Sharma. Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/wBAiSbBCoW — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ స్టైట్‌గా సింగిల్ కోసం చిప్ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్ తన కుడివైపున్కి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామతో పాటు గ్రౌండ్లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲 Flying Bishoni ✈️ Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
వారెవ్వా పతిరాన.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! ఒంటి చేత్తో
ఐపీఎల్-2024లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరనా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పతిరనా అద్భుతమైన క్యాచ్‌తో ఢిల్లీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఢిల్లీ ఏకంగా 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పేసర్ ముస్తఫిజర్ రెహ్మాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన ముస్తఫిజర్ మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని వార్నర్ షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న పతిరనా తన కుడివైపున్కు గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో పతిరాన బౌలింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 3 వికెట్లు పడగొట్టి 31 పరుగులిచ్చాడు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩 Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
CSK Vs GT: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతమకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ధోని సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన వికెట్ కీపింగ్‌తో ఔరా అన్పించాడు. అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను ధోని పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో డారిల్ మిచెల్ మూడో బంతిని విజయ్ శంకర్‌కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ వర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుత పులిలా డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 -
RCB Vs PBKS: వారెవ్వా అనూజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యశ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఈ క్రమంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ పై నుంచి వెళ్లింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావత్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. Athletic Anuj! A sharp catch behind the stumps from @RCBTweets wicketkeeper-batter as #PBKS reach 154/6 with 8 balls to go Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3snw3syupr — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వివిలవిల్లాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. అశ్విన్ రెండు, జడ్డూ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ క్రాలే మినహా మిగితా బ్యాటర్లు నిరాశపరిచారు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి మార్క్ వుడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమలో స్లిప్‌లో ఉన్న రోహిత్ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/RkDk3S3gqY — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 7, 2024 -
వారెవ్వా గిల్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఆరో డెలివరీని బెన్ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు. ఈ క్రమంలో డకెట్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో ఎక్స్ట్రా కవర్స్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే భారత ఆటగాళ్లంతా గిల్ దగ్గరకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో సైతం గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. Catching game 🔛 point! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/DdHGPrTMVL — BCCI (@BCCI) March 7, 2024 -
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను వేడ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది. pic.twitter.com/Wkw2LZb1JX — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. మెరుపు వేగంతో! వీడియో వైరల్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లీష్ బ్యాటర్ ఆలీ పోప్‌ను సంచలన క్యాచ్‌తో హిట్‌మ్యాన్ పెవిలియన్‌ను పంపాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన జడేజా బౌలంగ్‌లో నాలుగో బంతిని పోప్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్పందిస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్ బ్యాటర్ ఒక్కనిమషం పాటు అలా క్రీజులో ఉండిపోయాడు. చేసేదేమిలేక పోప్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాజ్‌కోట్ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత విజయానికి ఇంకా 4 వికెట్లు కావాలి. pic.twitter.com/JhFcWH9hht — Sitaraman (@Sitaraman112971) February 18, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
కాన్బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లాన్స్ మోరిస్ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే విధంగా ఆసీస్ ఆటగాళ్లందరూ లబుషేన్‌కు వద్దకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 6.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చదవండి: IND vs ENG: శ్రీకర్ భరత్‌కు బైబై.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!? MARNUS! Whatta catch - and first international wicket for Lance Morris too!#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/KwZP43hEFd — cricket.com.au (@cricketcomau) February 6, 2024 -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న స్టోక్స్.. నిశ్చేష్ఠుడిగా ఉండిపోయిన అయ్యర్
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసింది. అశ్విన్ (8), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 పరుగులకు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది. A STUNNER FROM STOKES. 🔥🫡pic.twitter.com/7Ml2YADBEE — Johns. (@CricCrazyJohns) February 4, 2024 కళ్లు చెదిరే క్యాచ్.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. స్టోక్స్ దాదాపు 23 మీటర్లు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. స్టోక్స్ క్యాచ్ పట్టిన తీరును చూసి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిశ్రేష్ఠుడిగా ఉండిపోయాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో స్టోక్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. -
ఇదెక్కడి క్రేజీ క్యాచ్ రా సామీ.. నమ్మశక్యంగా లేదు..!
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన వాళ్లు 'కలయా నిజమా..' అని అంటున్నారు. సమరవిక్రమ ముందుచూపుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రెహ్మత్ షా లెగ్‌సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. సాధారణంగా అయితే ఈ షాట్ వికెట్‌కీపర్‌కు చాలా దూరంగా (లెగ్ స్లిప్ అనవచ్చు) వెళ్తూ బౌండరీకి చేరుకుంటుంది. అయితే షా ఈ షాట్ ఆడతాడని ముందుగానే పసిగట్టిన సమరవిక్రమ బంతి పిచ్ కాగానే లెగ్‌సైడ్ దిశగా వెళ్లి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని ఇట్టే పట్టేసుకున్నాడు. బ్యాటర్, బౌలర్ సహా ఈ తంతు మొత్తం చూస్తున్న వారు నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. Crazy catch 😳pic.twitter.com/wQgNRGtSsO — CricTracker (@Cricketracker) February 2, 2024 కాగా, స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సమరవిక్రమ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అయిన రెహ్మత్ షాను పెవిలియన్‌కు పంపిన అనంతరం ఆఫ్ఘన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. నిషాన్ మధుష్క (36), దిముత్ కరుణరత్నే (42) క్రీజ్‌లో ఉన్నారు. -
వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కెవిన్ సింక్లైర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సంచలన క్యాచ్‌తో సింక్లైర్ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో లబుషేన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో నాలుగో స్లిప్‌లో ఉన్న సింక్లైర్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చేసేదేమి లేక లబుషేన్(3) నిరాశతో మైదాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కీమర్ రోచ్ 4 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఖ్వాజా(24), ఆలెక్సీ క్యారీ(22) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ మొదట ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. A fourth-slip SCREAMER! Kevin Sinclair is having a debut to remember! #PlayOfTheDay | @nrmainsurance | #AUSvWI pic.twitter.com/jrwK4jmkuD — cricket.com.au (@cricketcomau) January 26, 2024 -
రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో
హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని పోప్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే స్లిప్‌లో ఉన్న రోహిత్.. డైవ్ చేస్తూ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోప్ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. చదవండి: AUS VS WI 2nd Test: కోవిడ్ ఉన్నా ఆడించారు.. కానీ, ఇలా దూరం పెట్టారు..! Whatt a Catch Rohit Sharma #RohitSharma𓃵 #Jadeja pic.twitter.com/V9oozOrEiU — Rajeshhhhh🤐 (@johnholick) January 25, 2024 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్!
ది హండ్రడ్ లీగ్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్ దగ్గర బ్రూక్ విన్యాసాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఏం జరిగిందంటే..? వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ జంప్ చేస్తూ ఒంటి కాలితో బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ రోప్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతిని మైదానంలో విసిరేశాడు. ఈ క్రమంలో అప్పటికే బౌండరీ లైన్ వద్దకు చేరుకున్న మరో ఫీల్డర్ హోస్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన జానీ బెయిర్ స్టో(44) బిత్తరపోయాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే మ్యాచ్‌లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్రూక్ కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. చదవండి: APL 2023: అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD — Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023 -
స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన తిలక్ వర్మ
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు గాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ 10 నుంచి 15 మీటర్ల దూరం ఎడమవైపుగా పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్లోనే వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిది. నికోలస్ పూరన్ 7, రోవ్‌మెన్ పావెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఇటీవలే మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) ఫైనల్లో సెంచరీతో మెరిసిన పూరన్ వచ్చీ రాగానే సిక్సర్ల వర్షం కురిపించాడు. Tilak Varma, A flying debut 🔥 What a catch...!!!pic.twitter.com/ZPmSrJ9mTd — Johns. (@CricCrazyJohns) August 3, 2023 చదవండి: 'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రిప్లై -
బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. అదెలాగంటే విండీస్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్ ఆఫ్‌సైడ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ క్రమంలో కోహ్లి వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లి అందుకున్న షెపర్డ్ క్యాచ్ అతనికి 142వది. ఇక కోహ్లి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 160 క్యాచ్‌లతో ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి తన స్థానంలో బ్యాటింగ్‌కు రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో తాము విఫలమైతే బ్యాటింగ్ బలం ఎంతనేది తెలుసుకోవడానికి రోహిత్, కోహ్లిలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ తెలిపాడు. టార్గెట్‌ను చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయినప్పటికి ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Most catches in ODI history: 1) Jayawardena - 218 2) Ponting - 160 3) Azharuddin - 156 4) Taylor - 142 5) Kohli - 142* pic.twitter.com/GjMZGcXiDJ — Johns. (@CricCrazyJohns) July 28, 2023 King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm — FanCode (@FanCode) July 27, 2023 చదవండి: AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి
క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి పరిగెత్తుకురావడం చూస్తుంటాం. ఒక్కోసారి క్యాచ్ మిస్ కావొచ్చు.. లేదంటే క్యాచ్ అందుకునే సమయంలో ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం జరగొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్ మాత్రం కాస్త వెరైటీ పద్దతిలో ఉంటుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఈసీఎస్ చెకియా టి10 లీగ్‌లో భాగంగా నో క్రికెట్ క్లబ్, పరాగ్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టైగర్స్ ఓపెనర్ జిఎమ్ హసంత్ భారీ షాట్ ఆడబోయి బ్యాడ్ ఎడ్జ్ తగిలిన బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ రహత్ అలీ, బౌలింగ్ చేసిన రియాజ్ అఫ్రిదిలు ఒకేసారి దూసుకొచ్చారు. అయితే రహత్ అలీ క్యాచ్ ఈజీగా అందుకునే చాన్స్ ఉన్నా రిస్క్ చేసిన రియాజ్ అఫ్రిది తానే క్యాచ్ అందుకున్నాడు. అదృష్టవశాత్తూ ఇద్దరిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలో రహత్ అలీ రియాజ్ వైపు కోపంగా చూస్తూ..''నేను పట్టుకునేవాడిని కదా.. నాపై నమ్మకం లేదా'' అంటూ పేర్కొన్నాడు. దీనిపై రియాజ్ అఫ్రిది స్పందిస్తూ.. ''నమ్మకం లేక కాదు క్యాచ్ అందుకోవాలనే వచ్చాను'' అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Tag a teammate you wouldn't trust under the high ball...😄 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/oxQx5HMPa7 — European Cricket (@EuropeanCricket) July 26, 2023 చదవండి: అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్.. ఫొటో వైరల్ వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
దేశవాళీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ జూన్ 24(సోమవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా సోమవారం సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్,పంజాబ్ వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సౌత్‌జోన్ బ్యాటర్ రిక్కీ భుయ్‌ను అద్భుతమైన క్యాచ్‌తో ప్రభ్సిమ్రాన్ పెవిలియన్‌కు పంపాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో రెండో బంతిని రిక్కీ భుయ్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మొదటి స్లిప్ దిశగా వెళ్తున్న బంతిని వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అది చూసిన బ్యాటర్‌తో పాటు మిగితా ఆటగాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియాకప్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ప్రభుసిమ్రాన్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా వచ్చే నెలలో జరగనున్న ఆసియాక్రీడల్లో భారత సీనియర్ జట్టు తరపున ప్రభ్సిమ్రాన్ పాల్గొనున్నాడు. ఈ జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నార్త్‌జోన్‌పై 185 పరుగుల భారీ తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్ జోన్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. చదవండి: IND Vs WI ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు Ripper Alert 🚨 You do not want to miss Prabhsimran Singh's flying catch behind the stumps 🔥🔥 WATCH Now 🎥🔽 #DeodharTrophy | #NZvSZhttps://t.co/Tr2XHldbHY — BCCI Domestic (@BCCIdomestic) July 24, 2023 -
వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! విండీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. మూడో రోజు ఆట ఫైనల్ సెషన్ తొలి ఓవర్ వేసేందుకు బంతిని జడ్డూ చేతికి రోహిత్ ఇచ్చాడు. ఈ క్రమంలో 87 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో మూడో బంతిని బ్లాక్‌వుడ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్‌వైపు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రహానే డైవ్‌చేస్తూ ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసిన విండీస్ బ్యాటర్ ఆశ్చర్యపోయాడు. పిచ్ స్లో గా ఉన్నందన భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో రహానే తన అద్బుత క్యాచ్‌తో జట్టుకు కీలక వికెట్‌ను అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహానేకు ఇది 102 టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo — Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023 చదవండి: Roosh Kalaria: రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్.. -
'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ క్రిస్ వోక్స్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని వోక్స్ వైడ్ లైన్ స్టంప్ మీదుగా వేశాడు. మార్ష్ పొజిషన్ మార్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్స్ కార్డన్ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్లో వెళ్లడంతో క్యాచ్ కష్టతరమనిపించింది. కానీ కీపర్ బెయిర్ స్టో డైవ్ చేస్తూ తన గ్లోవ్స్‌ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్‌గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్ తిన్న మార్ష్ నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్ స్టో క్యాచ్‌పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్‌గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. STOP THAT JONNY BAIRSTOW! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/aZ7wKcncRW — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: ICC ODI WC 2023: 'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
'సూపర్‌మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు
వెస్టిండీస్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ లో చురుకుగా కనిపించింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తూ కుడివైపునకు పరుగెత్తుకుంటూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టేశాడు. విండీస్ ఇన్నింగ్స్ లో 28వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. జడేజా వేసిన ఆ ఓవర్ ఆఖరి బంతికి బ్లాక్ వుడ్.. భారీ షాట్ అడే ప్రయత్నం చేశాడు. అయితే సరిగ్గా టైమ్ అవ్వకపోవడంతో గాల్లోకి లేచిన బంతి మిడాఫ్ కు కుడివైపు దిశలోకి వెళ్లింది. షాట్ ను సరిగ్గా ఆడకపోయినా ఫోర్ వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. క్యాచ్ అనంతరం మైదానంలో కాసేపు అలానే పడిపోయాడు. అతడి కుడి మోచేతికి గాయం అయినట్లు అంతా అనుకున్నారు. అయితే వెంటనే లేవడంతో గాయం భయాలు తొలిగిపోయాయి. క్యాచ్‌కు సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. రిస్క్ అయినా పర్లేదు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు.. సూపర్‌మ్యాన్ అవతారంలో సిరాజ్.. వావ్ అనకుండా ఉండలేరు అంటూ కామెంట్ చేశారు. ఇక టీమిండియాతో తొలి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr — FanCode (@FanCode) July 12, 2023 చదవండి: R Ashwin: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా రోహిత్, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసింది ఇతడే! -
మిస్ అయిన చోటే మళ్లీ దొరికితే!
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది క్రికెట్లో ఒక సూత్రం. పటిష్ట ఫీల్డింగ్ వల్ల చాలా జట్లు అద్భుతమైన విజయాలు అందుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. క్యాచ్‌లు డ్రాప్ చేస్తే చివాట్లు పెట్టడం.. స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకుంటే మెచ్చుకోవడం చూస్తుంటాం. తాజాగా యార్క్‌షైర్ క్రికెట్ సదరన్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాంటి ఫన్నీ ఘటనే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. హ్యాట్‌ఫీల్డ్ వేదికగా హ్యాట్‌ఫీల్డ్ టౌన్ సీసీ ఫస్ట్ ఎలెవెన్, హల్లమ్ సీసీ సెకండ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హల్లమ్ సీసీ ఎలెవెన్ బౌలింగ్‌కు దిగింది. మ్యాచ్ సాధారణంగా సాగుతున్న వేళ ఒక క్యాచ్‌ను ఫీల్డర్ జారవిడిచాడు. దీంతో ఆటగాళ్లంతా నిరాశకు లోనయ్యారు. అయితే మరుసటి బంతికే ఎవరు ఊహించని విధంగా క్యాచ్ జారవిడిచిన ఫీల్డరే మరోసారి మెరిశాడు. బౌలర్ వేసిన బంతిని స్లిప్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హల్లమ్ సీసీ తొలుత బ్యాటింగ్ చేసి 249 పరుగులు చేసింది. విలియమ్ కోట్స్ 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హ్యాట్‌ఫీల్డ్ 167 పరుగులకే కుప్పకూలింది. హల్లమ్ కెప్టెన్ నిక్ కూపర్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఏడు బౌండరీల సాయంతో 36 బంతుల్లో 37 పరుగులు చేశాడు. "He only takes the hard ones" 😂Absolute scenes from @HatfieldTownCC! pic.twitter.com/w4hLzRfR9l— That’s So Village (@ThatsSoVillage) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ -
ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్ చేరడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా లీస్టర్‌షైర్, నాటింగ్హమ్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లీస్టర్‌షైర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ స్టీవెన్ ముల్లానే వేశాడు. స్ట్రైక్ ఎండ్‌లో కెప్టెన్ కొలిన్ అకెర్మన్ ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వియాన్ ముల్డర్ ఉన్నాడు. స్టీవెన్ వేసిన ఓవర్ తొలి బంతిని కొలిన్ అకెర్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో స్టీవెన్ తొలుత విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వియాన్ ముల్డర్ చేతులను తాకి మరోసారి పైకి లేచింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయని స్టీవెన్ ముల్లానే క్యాచ్ తీసుకున్నాడు. దీంతో కొలిన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఊహించని విధంగా బంతి వియాన్‌కు తగలడం.. ఆపై క్యాచ్ తీసుకోవడం కొలిన్ అకెర్‌మన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. రూల్ ప్రకారం ఔట్ అవడం వల్ల ఏం చేయలేక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ శని రూపంలో వెంటపడ్డాడు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో నాటింగ్హమ్షైర్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జో క్లార్క్ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. వియాన్ ముల్డర్ 38, నిక్ వెల్చ్ 32 పరుగులు చేశారు. నాటింగ్హమ్షైర్ బౌలర్లలో స్టీవెన్ ముల్లానే మూడు వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Vitality Blast (@vitalityblast) చదవండి: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా' అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్ -
'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయినప్పటికి గిల్ క్యాచ్ విషయంలో మాత్రం భారత్‌కు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. తాజాగా మరోసారి గిల్ క్యాచ్ సీన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రీక్రియేట్ అయింది. యాదృశ్చికంగా జరిగినప్పటికి అచ్చం గిల్ క్యాచ్ వివాదమే ఇక్కడా చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో మరోసారి అన్యాయమే గెలిచింది. టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో నాలుగో ఓవర్ భువనేశ్వరన్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఎల్. సూర్యప్రకాశ్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న ఎస్. రాధాకృష్ణన్ చేతిలోకి వెళ్లింది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో రాధాకృష్ణన్ బంతిని నేలకు తాకించాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనుమానంతో థర్డ్ అంపైర్‌కు పంపించాడు. క్యాచ్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సూర్యప్రకాశ్ షాక్ తిన్నాడు. ఎందుకంటే రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఎలా ఇస్తారంటూ బాధపడిన సూర్య చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The third umpire thought this catch was clean. Does it bring back some recent memories? 🤔 #TNPLonFanCode pic.twitter.com/apAKHVn34v — FanCode (@FanCode) June 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐడ్రీమ్ తిరుప్పూర్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 18.2 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయింది. సోను యాదవ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. భువనేశ్వరన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. తుషార్ రహేజా 49, ఎస్ రాధాకృష్ణన్ 34, రాజేంద్రన్ వివేక్ 21 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్
క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుతుందని.. ఇక లక్ష్యం 10 బంతుల్లో 17 పరుగులే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ గాల్లోకి అమాంతం లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత విన్యాసాన్ని మైదానంలోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు. కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STOP WHAT YOU ARE DOING BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI — Vitality Blast (@VitalityBlast) June 16, 2023 చదవండి: లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్ -
కోహ్లి వికెట్.. స్మిత్‌కు రికార్డు అందించిన వేళ
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో కోహ్లి క్యాచ్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్లో ఆసీస్ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి క్యాచ్ స్మిత్‌కు 157వది. తొలి స్థానంలో రికీ పాంటింగ్ 196 క్యాచ్‌లతో ఉన్నాడు. 181 క్యాచ్‌లతో మార్క్ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్ టేలర్‌తో కలసి స్టీవ్ స్మిత్ 157 క్యాచ్‌లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్ బోర్డర్ 156 క్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడుతుందా లేక మ్యాచ్ డ్రా చేసుకుంటుందా అన్నది చూడాలి. కోహ్లి ఉన్నంతవరకు గెలుపుపై ఆశలు ఉన్నా అతను ఔట్ కావడం టీమిండియాకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక రిస్క్ తీసుకోకుండా డ్రా కోసం ఆడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ అద్బుతంగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. He's an absolute G.O.A.T in slip fielding.#INDvsAUS #WTCFinals #WTC23Final #WTC2023Final #WTCFinals #TeamIndia #KingKohli #ViratKohli #AUSvsIND #ViratKohli𓃵 #SteveSmith pic.twitter.com/IHSn0rnlV0 — myKhel.com (@mykhelcom) June 11, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!' -
అద్బుత విన్యాసం.. వయసుతో పనేంటి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్నెస్తో అద్బుత విన్యాసం చేయడం ధావన్‌కే చెల్లింది. విషయంలోకి వెళితే.. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతి వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపుకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే తొలుత బంతి చేతి నుంచి జారిపోతుందేమో అనిపించింది. కానీ ధావన్ కిందపడినప్పటికి బంతిని ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Stunning from Shikhar Dhawan 🙌 (via @IPL) #PBKSvDC #IPL2023 pic.twitter.com/px5hB5y1dH — ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2023 చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు -
సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీలైన వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచింది. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్ వెళ్లేదే. కానీ హెట్‌మైర్ ఆ తప్పు చేయకుండా చాలా పద్దతిగా.. బ్యాలెన్స్‌తో క్యాచ్ తీసుకోవడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన ఓవర్ రెండో బంతిని రాయ్ డీప్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. స్లోబాల్ కావడంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకిన బంతి గాల్లోకి లేచింది. అయితే లాంగాఫ్‌లో ఉన్న హెట్‌మైర్ డీప్‌స్క్వేర్ లెగ్ వద్దకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే కొంచెం పట్టు తప్పినా హెట్‌మైర్ బౌండరీ రోప్‌ను తాకేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Shimron Hetmyer takes a stunner to dismiss Jason Roy. pic.twitter.com/6Syx5Whdjo — Cricket is Love ❤ (@cricketfan__) May 11, 2023 చదవండి: 'మా కెప్టెన్ బ్యాటింగ్ విఫలం వెనుక సీక్రెట్ అదే!' -
రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా వెళ్లడంతో క్యాచ్ మిస్ అవుతుందని అనుకున్నాం. కానీ లలిత్ యాదవ్ అద్బుతం చేశాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ కుడిచేత్తో కేవలం వేళ్ల సాయంతోనే అద్బుతంగా అందుకున్నాడు. అయితే ఇక్కడ లలిత్ యాదవ్ దూబేను రనౌట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ రహానే క్యాచ్ అందుకున్న లలిత్ ఆ పని చేయలేకపోయాడు. అయితే లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే షాక్ తినగా.. అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం ఇంప్రెస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What a Catch by Lalit Yadav 🤯🤯#LalitYadav #CSKvDC pic.twitter.com/WJP6GyPXtl — Cricket Apna l Indian cricket l Bleed Blue 💙🇮🇳 (@cricketapna1) May 10, 2023 -
సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ నితీశ్ రానా, రింకూ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు దాదాపు 60 పరుగులు జోడించారు. ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్క్రమ్ తానే బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి రింకూ సింగ్ సింగిల్ తీయగా.. రెండో బంతిని నితీశ్ రానా లాంగాన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మార్క్రమ్ లాంగాన్ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకోవడంతో కేకేఆర్ కెప్టెన్ 42 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Just something about Proteas and 👌🏻 fielding efforts... @AidzMarkram's 💥 catch sends the #KKR skipper packing 🔙#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/bAn65remH3 — JioCinema (@JioCinema) May 4, 2023 చదవండి: తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం! -
సీఎస్కే ఓడినా.. క్రికెట్ చరిత్రలో అతిగొప్ప క్యాచ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. సీఎస్కే మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం షేక్ రషీద్ మ్యాచ్ హీరోగా మిగిలిపోయేవాడు. అయినప్పటికి తన స్టన్నింగ్ క్యాచ్‌తో షేక్ రషీద్ అందరిని ఆకట్టుకున్నాడు. అతని విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. క్యాచ్‌ల్లో చాలా రకాలు చూశాం.. డైవింగ్ క్యాచ్‌లు, ఒంటిచేతి క్యాచ్‌లు.. కానీ వీటన్నింటికి కాస్త భిన్నంగా అందుకున్నాడు షేక్ రషీద్. పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్ నాలుగో బంతిని జితేశ్ శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న షేక్ రషీద్ క్యాచ్ అందుకున్నప్పటికి కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా అతని కాలు బౌండరీ రోప్‌ను తాకేదే. Photo: IPL Twitter కానీ ఇక్కడే అతను చేసుకున్న బ్యాలెన్సింగ్ విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. బంతిని అందుకున్న మరుక్షణమే షేక్ రషీద్ తన కాలిని గమనించి వెనక్కి లాగేందుకు యత్నించాడు. కానీ అతని కాలు బౌండరీ రోప్‌కు తాకినట్లే అనిపించింది. కానీ చివరకు సెంటీమీటర్ గ్యాప్‌లో షేక్ రషీద్ షూ రోప్‌ను తాకలేదని థర్డ్ అంపైర్ నిర్థారించి జితేశ్ శర్మను ఔట్‌గా ప్రకటించాడు. అంతే సీఎస్కే అభిమానుల గోలతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. షేక్ రషీద్ విన్యాసానికి అటు సీఎస్కేతో పాటు పంజాబ్ ఆటగాళ్లు కూడా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. ఏది ఏమైనా పరుగులు చేసి కొందరు పేరు సంపాదిస్తే.. వికెట్లు తీసి మరికొందరు వెలుగులోకి వస్తే.. ఒక్క సంచలన క్యాచ్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు షేక్ రషీద్. షేక్ రషీద్ క్యాచ్ మాత్రం క్రికెట్ చరిత్రలో అతిగొప్ప వాటిలో నిలిచిపోవడం ఖాయం. What a catch 👏🏻 (Sub) Shaik Rasheed#WhistlePodu #CSKvPBKS pic.twitter.com/6HiU5yAuix — CricketInfoClub 🏏 (@tortoiseRabbit4) April 30, 2023 Shaik Rasheed you beauty 🔥#WhistlePodu #IPL2023 #CSK pic.twitter.com/JabeMI0cfh — CSK Fans Army™ (@CSKFansArmy) April 30, 2023 చదవండి: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు? -
మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. శార్దూల్‌కు కలిసి రాని ప్రమోషన్ ఇక శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్లో క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్‌గా వెనుదిరిగాడు. Mohit Sharma you beauty 🔥🔥 A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH — IndianPremierLeague (@IPL) April 29, 2023 చదవండి: ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా! -
స్టన్నింగ్ క్యాచ్‌తో అరుదైన జాబితాలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో సొంతగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుత విన్యాసాన్ని ప్రదర్శించాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతా బౌండరీ వెళుతుందని అనుకున్నారు. కానీ అక్కడే ఉన్న మార్క్రమ్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌ను ఊహించని సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కాగా అంతకముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల క్యాచ్‌లు తీసుకుంది కూడా మార్ర్కమ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో మార్క్రమ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు క్యాచ్‌లను ఒకే ప్లేయర్ తీసుకోవడం ఇది నాలుగో సారి మాత్రమే. ఇంతకముందు కేన్ రిచర్డ్సన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 2014లో, హార్దిక్ పాండ్యా వర్సెస్ సీఎస్కే 2015లో, ఫాఫ్ డుప్లెసిస్ వర్సెస్ కేకేఆర్ 2019లో ఉన్నారు. Aiden Markram setting an example on the field! All three catches so far taken by the South African... That SKY catch was a scorcher!#IPL2023 #SRHvsMI #RohitSharma #AidenMarkram #TATAIPL #MumbaiIndians #SunrisersHyderabadpic.twitter.com/fUV54r2Gaq — OneCricket (@OneCricketApp) April 18, 2023 CAUGHT IN 4K - Aiden Markram 🔥#TATAIPL #IPLonJioCinema #SRHvMI #IPL2023 #OrangeFireIdhi | @SunRisers @AidzMarkram pic.twitter.com/WJVkXuH2pL — JioCinema (@JioCinema) April 18, 2023 చదవండి: రోహిత్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఆటగాడిగా రోహిత్ ఔట్.. బుంగమూతి పెట్టిన రితికా -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన జితేశ్ శర్మ
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మార్క్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని జితేశ్శర్మ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతి కచ్చితంగా బౌండరీ వెళుతుందన్న దశలో కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. బంతి అతనికి చాలా దూరంలో ఉన్నప్పటికి సూపర్ టైమ్‌లైన్‌తో స్పందించిన రాహుల్ అమాంతం ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. లక్నో కెప్టెన్ దెబ్బకు జితేశ్ శర్మ నోట మాట రాక బిత్తరపోయాడు. రాహుల్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కేఎల్ రాహుల్ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. 56 బంతుల్లో 74 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌కు ఈ సీజన్లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. उड़ता राहुल #KLRahul #LSGvPBKS @LucknowIPL #IPL23 pic.twitter.com/koq3dTTj4R — KUNAL KOUSHAL (@KUNALKOUSHAL65) April 15, 2023 WHAT A CATCH BY KL RAHUL. pic.twitter.com/cFzyRdQbQ0 — Johns. (@CricCrazyJohns) April 15, 2023 An absolute blinder from KL Rahul to dismiss Jitesh Sharma🔥 📸: JioCinema#KLRahul #JiteshSharma #LSGvPBKS #LSGvsPBKS #PBKSvLSG #PBKSvsLSG #TATAIPL #TATAIPL2023 #IPL #IPL2023 #IndianPremierLeague #Cricket #SBM pic.twitter.com/VttOONPJrC — SBM Cricket (@Sbettingmarkets) April 15, 2023 చదవండి: 'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అక్కడుంది జడ్డూ.. బంతి మిస్సయ్యే చాన్స్ లేదు
సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. తానే బౌలింగ్ చేసి తానే క్యాచ్ తీసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కామెరున్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్బుత రీతిలో తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన జడేజా రెండో బంతిని ఫ్లైటెడ్ డెలివరీ వేశాడు. కామెరున్ గ్రీన్ కవర్స్ దిశగా ఆడుదామని ప్రయత్నించి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే జడేజా చేతులు అడ్డుపెట్టి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో జడేజా క్యాచ్‌ను తీసుకున్నాడు. అంతే గ్రీన్ ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Now THAT'S what you call a blinder, courtesy Ravindra Jadeja 🤯#MIvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @imjadeja pic.twitter.com/NpJRXhBvtJ — JioCinema (@JioCinema) April 8, 2023 -
Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అమిత్ మిశ్రా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి థర్డ్‌మన్ దిశగా ఆడాలనుకున్నాడు. అయితే బంతి ఔట్‌సైడ్ అయి బ్యాట్ ఎడ్జ్ అయి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అమిత్ మిశ్రా ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మిశ్రా కళ్లు చెదిరే క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ''స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి అని మిశ్రా నిరూపించాడు''.. ''40 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్న మిశ్రాకు హ్యాట్సాఫ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక బౌలింగ్‌లోనూ అమిత్ మిశ్రా మెరిశాడు. తన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ఐపీఎల్లో తన వికెట్ల సంఖ్యను 168కి పెంచుకున్నాడు. మార్క్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అమిత్ మిశ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా అమిత్ మిశ్రా ఐపీఎల్లో 155 మ్యాచ్‌లాడి 168 వికెట్లు తీసుకున్నాడు. 40 Years Old Amit Mishra while making debut for Lucknow & taking this catch means age is just a number for him #LSGvsSRH #MIvsCSK #amitmishra #T20 #IPL #IPL2023 #cricketmatlabMyfab11 #CricketTwitter pic.twitter.com/ZC3dZYh6LP — raman thind (@thindpau87) April 7, 2023 40 years O̵l̵d̵ young 🙌 Amit Mishra took a brilliant diving catch much to the delight of his teammates. Also bowled a brilliant spell of 4-0-23-2 📸 : Jio Cinema#LSGvSRH #IPL2023 pic.twitter.com/X8rnIqBTIC — 12th Khiladi (@12th_khiladi) April 7, 2023 -
తెవాటియా స్టన్నింగ్ క్యాచ్.. బ్యాటర్‌కు మైండ్‌బ్లాక్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ వేసిన బౌన్సర్‌ను ఆడే ప్రయత్నంలో భుజం ఎత్తులో బ్యాట్‌కు తగిలి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. 24 మీటర్ల దూరంలో ఉన్న తెవాటియా కొంచెం ముందుకు పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అయితే బంతి కింద పడిందేమోనన్న అనుమానంతో రివ్యూకు వెళ్లిన రొసౌకు నిరాశే మిగిలింది. రిప్లేలో తెవాటియా క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదని తేలింది. దీంతో రొసౌకు మైండ్‌బ్లాక్ అయింది. అంతేకాదు ఆడిన తొలి బంతికే ఔటైన రొసౌ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 0:07 - Stunning Catch by Rahul Tewatia🙌#DCvGT #IPL2023 pic.twitter.com/c94fIN3D03 — 12th Khiladi (@12th_khiladi) April 4, 2023 చదవండి: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం -
స్టన్నింగ్ క్యాచ్.. చెత్త రివ్యూతో పరువు తీసుకున్న బ్యాటర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్డ్ వేసిన ఔట్ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్ త్రిపాఠి మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకింది. కీపర్‌కు, స్లిప్ ఫీల్డర్‌కు మధ్య గ్యాప్‌లో వెళ్తున్న బంతిని జేసన్ హోల్డర్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే త్రిపాఠి రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. బ్యాట్‌కు బంతి క్లియర్‌గా తగిలిందని తెలుస్తున్నా అనవసరంగా రివ్యూకు వెళ్లి పరువు తీసుకున్నాడు. బౌల్ట్ వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బౌన్స్ అయినప్పటికి.. అయితే బంతి బ్యాట్‌ను తగల్లేదనే ఉద్దేశంతో త్రిపాఠి రివ్యూకు వెళ్లి ఉంటాడు. ఇక జేసన్ హోల్డర్ క్యాచ్ సీజన్ ఆఫ్ ది క్యాచ్‌గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. Trent Boult is a beast in the Powerplay. pic.twitter.com/0nRX2295wc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023 చదవండి: ఇంతలా చెలరేగుతున్నా మనసు కరగడం లేదా! -
తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'
సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌లు తీసుకోవడం చూస్తుంటాం. కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, తెలివిగా ఆలోచించాడు. బ్యాటర్ బంతిని బారీ షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్జ్టే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్‌గా నోర్ట్జే తీసుకున్న క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నోర్ట్జే ఆలోచన కాస్త కొత్తగా ఉండడంతో ''క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'' అన్న క్యాప్షన్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. @AnrichNortje02 Become The Superman What a catch 🔥 @DelhiCapitals #SAvsWIt20 📹 by FanCode pic.twitter.com/S3JntWA8qd — Mr Perfect 🤟🏻 (@starmanjeet007) March 25, 2023 చదవండి: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్
యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం సీవైఎంస్, డ్రీక్స్ హార్న్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీవైఎంస్పై 3 వికెట్ల తేడాతో డ్రీక్స్ హార్న్స్ విజయం సాధించింది. తద్వారా యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ ఫైనల్లో డ్రీక్స్ హార్న్స్ అడుగుపెట్టింది. 126 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రీక్స్.. 9.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వారెవ్వా.. సూపర్ క్యాచ్ ఇక ఈ మ్యాచ్‌లో సీవైఎంస్ ఆటగాళ్లు జాసన్ వాన్ డెర్ మెర్వ్, జాకబ్ ముల్డర్ అద్భుతమైన విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వీరిద్దరూ ఓ సంచలన క్యాచ్‌తో మెరిశారు. డ్రీక్స్ హార్న్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆడామ్ కెన్నడీ బౌలింగ్‌లో నబీ డిప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ మెర్వ్ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ రోప్‌కు దగ్గరగా ఉండటంతో బంతిని వాన్ డెర్ మెర్వ్ గాల్లోకి విసిరాడు. ఈ క్రమంలో జాకబ్ ముల్డర్ పరిగెత్తూ కుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన డ్రీక్స్ హార్న్స్ బ్యాటర్ బిత్తరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం! Is this one of the best team catches ever? Just when you thought you'd seen it all, Jason van der Merve and Jacob Mulder produce magic on the boundary! 😱🙌🏏@CIYMSCC #EuropeanCricket #ECL23 #StrongerTogether pic.twitter.com/G1Pj8imaE8 — European Cricket (@EuropeanCricket) March 24, 2023 -
వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..
మహ్మద్ కైఫ్.. టీమిండియా క్రికెట్లో మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ కంటే తన ఫీల్డింగ్ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్ ఫీల్డ్‌లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని వెళ్లడం అసాధ్యం. ఎన్నోసార్లు తన మెరుపు ఫీల్డింగ్‌తో అలరించిన కైఫ్ అద్భుతమైన క్యాచ్‌లు కూడా చాలానే తీసుకున్నాడు. 2002-06 మధ్యలో టీమిండియా తరపున కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా వింటేజ్ కైఫ్‌ను తలపించాడు. శనివారం ఆసియా లయన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కైఫ్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇందులో రెండు క్యాచ్‌లు అయితే డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం విశేషం. స్టన్నింగ్ క్యాచ్‌లతో వయసు పెరిగినా వన్నె తగ్గలేదని నిరూపించాడు. తొలుత ఆసియా లయన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రజ్ఞాన్ ఓజా వేసిన 8వ ఓవర్లో ఉపుల్ తరంగను స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఓజా వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడాడు. బంతి వేగం చూస్తే కచ్చితంగా బౌండరీ వెళ్లేలా కనిపించింది. కానీ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న కైఫ్ ఒక్క ఉదుటన డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కైఫ్ మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపెట్టాడు. ప్రవీణ్ తాంబే వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాఫ్ దిశగా ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న కైఫ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ ఓటమి చవిచూసింది. 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆసియా లయన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 16.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. Vintage Kaif! 🔥@MohammadKaif #LegendsLeagueCricket #YahanSabBossHain pic.twitter.com/9Gc4qO5Cyl — FanCode (@FanCode) March 18, 2023 చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు LLC 2023: గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి -
స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ అందుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూపీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హేలీ మాథ్యూస్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. దేవికా డ్రైవ్ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. ఇక్కడే హర్మన్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేదే. అందుకే క్యాచ్ అందుకోగానే హర్మన్ కూడా చాలాసేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్లో తిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. Cheer on Hayley and Harry as they take on the UP Warriors in the #WPL2023 season! 🏏🔥 Use the hashtags #OneFamily, #MumbaiIndians, #AaliRe, and #MIvUPW to show your support for the Mumbai Indians 💙#CricketGaliyara #CricketTwitter #cricketnews pic.twitter.com/Ua4SjQBV2p — Cricket Galiyara (@cricketgaliyara) March 18, 2023 చదవండి: Deepthi Sharma: చరిత్రలో నిలిచిపోయే రనౌట్.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి -
ద్రవిడ్ కృషి ఫలించింది.. సంచలన క్యాచ్‌లతో మెరిసిన గిల్!
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా పేసర్ల దాటికి ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్(81) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు. ఫలించిన ద్రవిడ్ కృషి ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. స్లీప్‌లో సంచలన క్యాచ్‌లతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లను శుబ్‌మన్ అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో గిల్‌కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. స్లిప్‌లో క్యాచ్‌లను ఎలా అందుకోవాలన్న మెళకువలను ద్రవిడ్ నేర్పించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ స్లిప్‌లో మెరవడంతో ద్రవిడ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లైంది. చదవండి: IND vs AUS: వారెవ్వా షమీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయిందిగా! వీడియో వైరల్ -
జడేజాతో అట్లుంటది మరి.. డైవ్ చేస్తూ సంచలన క్యాచ్! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌ను ఓ సంచలన క్యాచ్‌తో జడ్డూ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 23 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లాబుషేన్ కట్‌షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. తన కుడివైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడేజా సూపర్ క్యాచ్‌ను చూసిన లాబుషేన్ బిత్తిరిపోయాడు. అదే విధంగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న జడ్డూను ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిలకడగా ఆడుతోంది. 26 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్(81) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. చదవండి: Tim Paine: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై! What a catch by sir Jadeja#INDvsAUS #INDvAUS #AUSvIND #jadeja#CricketTwitter pic.twitter.com/VFJoz4Q1N5 — abhishek agrawal🇮🇳 (@abhishe92065110) March 17, 2023 -
స్టన్నింగ్ క్యాచ్.. క్యాచ్ ఆఫ్ సీజన్ అయ్యే అవకాశం!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ నమోదు చేసింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ శిఖా పాండే వేసింది. ఓవర్ తొలి బంతిని దీప్తి శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న రాధా యాదవ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ లో క్యాచ్ తీసుకుంది. దెబ్బకు దీప్తి శర్మ మొహం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. Catch of the WPL: Radha Yadav. pic.twitter.com/RTGoONifYT — Johns. (@CricCrazyJohns) March 7, 2023 చదవండి: Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా.. -
స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన ఆటతీరునే రెండో ఇన్నింగ్స్‌లోనూ చూపిస్తుంది. కాకపోతే అప్పుడు వంద పరుగులు చేయడానికి నానా కష్టాలు పడితే.. ఇప్పుడు మాత్రం 150 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి యత్నిస్తుంది. గింగిరాలు తిరుగుతున్న బంతితో బ్యాటర్లు ముప్పతిప్పలు పడుతున్నారు. తాజాగా పుజారాతో కలిసి రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ కాస్త ప్రతిఘటించాడు. 26 పరుగులతో కుదురుకున్నాడని అనుకునే లోపే ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా ఫీల్డింగ్‌లోనూ తన విన్యాసంతో అదరగొట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన శ్రేయాస్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 26 పరుగులతో జోరు కనబర్చాడు. కానీ అతని దూకుడుకు ఉస్మాన్ ఖవాజా ముకుతాడు వేశాడు. అయ్యర్ 26 పరుగుల వద్ద ఉండగా.. స్టార్క్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఖవాజా బ్లైండర్ క్యాచ్ అందుకున్నాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే అంపైర్‌కు క్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సాఫ్ట్ సిగ్నల్ కోసం థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో ఖవాజా బంతిని ఎక్కడా నేలకు తగిలించినట్లు కనిపించకపోవడంతో అయ్యర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం టీమిండియా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులుగా ఉంది. పుజారా 49, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. లియోన్ నాలుగు వికెట్లు తీయగా కుహ్నెమన్, మిచెల్ స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. pic.twitter.com/fg0G1Q7vzH — IPLT20 Fan (@FanIplt20) March 2, 2023 చదవండి: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్ -
పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక సంచలన క్యాచ్‌ను అందుకున్న పొలార్డ్‌ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2 — PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023 -
స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఎలిస్సే పెర్రీ వేసిన బంతిని చమేరీ ఆటపట్టు లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాలని ప్రయత్నించింది. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఉన్న గ్రేస్ హారిస్ తన కుడివైపునకు కొన్ని గజాల దూరం పరిగెత్తి డైవ్ చేసి బంతిని అందుకుంది. ఆమె అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా మాత్రం ఉండలేం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక హారిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. మూడు ఓవర్లు వేసిన గ్రేస్ హారిస్ ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వుమెన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మాదవి 34 పరుగులు చేయగా.. విశ్మి గుణరత్నే 24 పరుగులు చేసింది. ఆసీస్ వెటరన్ పేసర్ మేఘన్ స్కాట్ నాలుగు వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 15.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను చేధించింది. బెత్ మూనీ 56 నాటౌట్, అలీసా హేలీ 54 నాటౌట్ ఆసీస్‌ను గెలిపించారు. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. That's unreal from Grace Harris, what a catch #T20WorldCup pic.twitter.com/AkJRxZYzdf — Ricky Mangidis (@rickm18) February 16, 2023 చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న! -
వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్‌తో..
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. వేలి గాయం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 75 పరుగులతో విండీస్ పటిష్టంగా కనిపించింది. ఈ దశలో దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని క్యాంప్బెల్లె రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకడంతో స్లిప్‌లో పడింది. అయితే ఇక్కడే మంధాన తన మెరుపు ఫీల్డింగ్‌ను ప్రదర్శించింది. క్యాంప్బెల్లె ఆడిన బంతి కాస్త ముందుకు పడడంతో మంధాన డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. దీంతో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన స్మృతి మంధాన పేరు స్టేడియంలో మార్మోగిపోయింది. -
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్.. దిగ్గజాలను సైతం అబ్బురపరిచేలా
క్రికెట్లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకొని మళ్లీ బౌండరీ లోపలికి విసిరి అందుకోవడం చూస్తున్నాం. ఇలాంటి క్యాచ్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. జిల్లా క్రికెట్ క్లబ్లో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌలర్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని బ్యాటర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని అద్బుతం జరిగింది. ఆ ఏముందిలే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకొని ఉంటాడులే అనుకుంటే పొరబడ్డట్లే. బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్.. ఇక్కడే తన ఫుట్‌బాల్ విన్యాసం చూపించాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పట్టుతప్పి బౌండరీ లైన్ మీదకు జారిపడతానని భావించిన ఫీల్డర్.. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టాడు. అంతే బంతి మరో ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం.. అతను సేఫ్‌గా అందుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సదరు ఫీల్డర్ చేసిన విన్యాసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ''ఫుట్‌బాల్ తెలిసిన ఆటగాడిని క్రికెట్లోకి తీసుకొస్తే ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్.. ''నిజంగా ఇది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్'' అంటూ అభివర్ణించాడు. ఇక కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్.. ''నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్..'' అంటూ పొగడ్తలు కురిపించాడు. It doesn't matter what the rules say. You've got to give this out for the pure AUDACITY 🤯😂 Sent in by Kiran Tarlekar pic.twitter.com/pquwsLc5YC — Cricket District (@cricketdistrict) February 12, 2023 This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg — Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023 Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B — Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023 Absolutely outstanding 👌👌😂 https://t.co/Im77ogdGQB — Jimmy Neesham (@JimmyNeesh) February 12, 2023 చదవండి: Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్ ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని -
ఒకే స్టైల్లో రెండు క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నయా స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో రెండు క్యాచ్‌లు హైలైట్ గా నిలిచాయి. ఇందులో విశేషమేమిటంటే సూర్య తీసుకున్న రెండు క్యాచ్‌లు ఒకే స్టైల్లో ఉండడం. ఈ రెండు క్యాచ్‌లు పక్కపక్కనబెట్టి చూస్తే రిప్లే చూసినట్లుగా అనిపించడం ఖాయం. అందుకే అతను రెండు క్యాచ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూర్యను అందరూ ముద్దుగా ''స్కై(SKY)'' పిలుచుకుంటారు. అతను గాల్లోకి ఎగిరి రెండు క్యాచ్‌లు పట్టడం చూసిన అభిమానులు.. నిన్ను ''స్కై(SKY)'' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపించుకున్నావ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక సూర్యకుమార్ మ్యాచ్‌లో 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. విషయంలోకి వెళితే.. న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ఓవర్ ఐదో బంతిని ఫిన్ అలెన్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. స్లిప్‌లో ఉన్న సూర్యకుమార్ అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో క్యాచ్‌ను అందుకున్నాడు. అలా ఫిన్ అలెన్ మూడు పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు. కట్‌చేస్తే ఇన్నింగ్స్ మూడు ఓవర్లో హార్దిక్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్ నాలుగో బంతిని పాండ్యా మళ్లీ ఆఫ్‌సైడ్ దిశగా వేశాడు. ఈసారి గ్లెన్ పిలిప్స్ ఔట్‌సైడ్ ఎడ్జ్ షాట్ ఆడాడు. స్లిప్‌లో ఉన్న సూర్య డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు.ఇంకేముంది మళ్లీ అదే సీన్ రిపీట్. మొదటి క్యాచ్‌ను కాపీ కొట్టాడా అన్న తరహాలో ఆ క్యాచ్ ఉంటుంది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా మరో అద్భుత క్యాచ్‌తో మెరిశాడు సూర్య. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శివమ్ మావి వేసిన మూడో బంతిని మిచెల్ సాంట్నర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న సూర్య గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్‌ను తాకకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ క్యాచ్‌ను తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి స్కై అన్న పేరును సూర్యకుమార్ సార్థకం చేసుకున్నాడు. ICYMI - WHAT. A. CATCH 🔥🔥#TeamIndia vice-captain @surya_14kumar takes a stunner to get Finn Allen 👏#INDvNZ | @mastercardindia pic.twitter.com/WvKQK8V67b — BCCI (@BCCI) February 1, 2023 చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్ చేశారా -
స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్..
రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ చాప్‌మన్‌ను సుందర్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని సుందర్ ఔట్‌సైడ్ దిశగా వేయగా.. చాప్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సుందర్ ఒకవైపుగా డైవ్గా చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి కింద తాకిందేమోనని థర్డ్ అంపైర్ పరిశీలించాడు. రిప్లేలో సుందర్ బంతిని అందుకున్నాకే కింద పడినట్లు చూపించింది. దీంతో చాప్మన్ ఔట్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 7, గ్లెన్ పిలిప్స్ 2 పరుగులతో ఆడుతున్నారు. Washington Sundar catch.#INDvsNZ #INDvNZpic.twitter.com/Kr0JsJmNs4 — Abdullah Neaz (@Abdullah__Neaz) January 27, 2023 -
విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్ వైపర్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్ అనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని కొలిన్ మున్రో లాంగాన్ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను తీసుకొని వెనుకవైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెసర్ట్ వైపర్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్ 67 నాటౌట్, పూరన్ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్.. అలెక్స్ హేల్స్(44 బంతుల్లో 62 నాటౌట్), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(29 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. #PollyPandey, what have you done! 🤯🤯🤯🤯@KieronPollard55 with a 𝑩𝒂𝒘𝒂𝒂𝒍 one-handed catch and the celebration to match. 😎#MIEvDV #CricketOnZee #DPWorldILT20 #BawaalMachneWalaHai #HarBallBawaal @MIEmirates @ILT20Official pic.twitter.com/2eKZPWjoYk — Zee Cricket (@ilt20onzee) January 24, 2023 చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
స్టన్నింగ్ క్యాచ్.. బిక్కమొహం వేసిన కాన్వే
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్ పాండ్యానే బౌలింగ్ చేశాడు. ఓవర్ నాలుగో బంతిని పాండ్యా ఆఫ్‌సైడ్ వేయగా కాన్వే డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో స్రెయిట్ షాట్ ఆడాడు. దీంతో పాండ్యా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. పాండ్యా క్యాచ్‌కు కాన్వే బిక్కమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు షమీ కూడా డారిల్ మిచెల్‌ను ఇదే తరహాలో ఔట్ చేయడం విశేషం. తొలి వన్డేలో పోరాడిన న్యూజిలాండ్ రెండో వన్డేలో మాత్రం దారుణ ఆటతీరు ప్రదర్శిస్తుంది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ కివీస్‌పై ఒత్తిడి తెచ్చారు.15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ ఒక దశలో 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో గ్లెన్ పిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్‌లు కాసేపు ప్రతిఘటించారు. ఈ క్రమంలో స్కోరుబోర్డు 56 పరుగులకు చేరగానే కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 28 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛! 😎 Talk about a stunning grab! 🙌 🙌@hardikpandya7 took a BEAUT of a catch on his own bowling 🔽 #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/saJB6FcurA — BCCI (@BCCI) January 21, 2023 చదవండి: IND Vs NZ: కివీస్ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా! -
వారెవ్వా అక్షర్! గాల్లోకి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో.. కరుణరత్నే పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం అక్షర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3 — BCCI (@BCCI) January 12, 2023 చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ -
మొన్న విలన్.. ఈ రోజు హీరో.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో రాహుల్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేతితో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 77 పరుగులు చేసిన మహ్మదుల్లా నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉన్న మహ్మదుల్లాను రాహుల్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడం భారత్‌కు కాస్త ఊరట లభించింది. కాగా రాహుల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ మ్యాన్ అంటూ రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఈజీ క్యాచ్‌ను జారవిడిచి మ్యాచ్ ఓటమికి కారణమైన రాహుల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. What a catch it was by KL Rahul. pic.twitter.com/0gcTgNZQxy — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2022 చదవండి: BAN vs IND: మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా -
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇదేనేమో.. బట్లర్, లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే క్యాచ్‌లు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రుజువు చేసింది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-1 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను గెలిపించారు. క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముందుగా లివింగ్‌స్టోన్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన భారీ షాట్‌ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లివింగ్‌స్టోన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్‌స్టోన్ ముందుకు పరిగెడుతూ సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక జోస్ బట్లర్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ లెగ్ గ్లాన్స్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ బట్లర్‌ను క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షిలా తన లెఫ్ట్ సైడ్‌కు డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తప్పక క్యాచ్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్‌స్టోన్, బట్లర్ పట్టిన క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇవే కాక.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్‌లో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్ అనుకుంటే మరో రెండు క్యాచ్‌లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-1లో ఇవాళ జరిగిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. ఆసీస్‌పై, ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫిలిప్స్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ..!
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్‌లో.. స్టోయినిస్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో స్వీపర్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిఫ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఒక్క సారిగా స్టేడియంలో ఉన్న ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఫిలిప్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా అడగులు వేస్తోంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లు ముగిసే సరికి 86 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సేన రికార్డులు! -
స్టన్నింగ్ క్యాచ్.. స్ప్రింగులేమైనా ఉన్నాయా!
స్కాట్లాండ్పై విజయంతో జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో అడుగుపెట్టింది. 15 ఏళ్ల టి20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి సూపర్-12 దశకు చేరుకున్న జింబాబ్వేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. క్రెయిగ్ ఇర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.ఆరేళ్లుగా ఒక్క ఐసీసీ టోరీ్నలో కూడా ఆడలేకపోయిన జింబాబ్వే ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో తమ ముద్ర చూపించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో చెలరేగి ఈసారి ‘సూపర్ 12’ దశకు అర్హత సాధించింది. అయితే ఇదే మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు వెస్లీ మాదేవేర స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాచ్‌ను వెస్లీ మాదవేర అద్భుతంగా అందుకున్నాడు. కళ్లు చెదిరిలో రీతిలో గాల్లోకి అమాంతం ఎగిరి రెండు చేతులో ఒడిసి పట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. సూపర్ మ్యాన్ క్యాచ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. " క్యాచ్ అందుకున్నది సూపర్‌మ్యానా లేక వెస్లీ మాధవేరేనా" అంటూ పోస్టు పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా... జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. లీగ్ దశలో ఐర్లాండ్‌పై నెగ్గి, ఆ తర్వాత విండీస్ చేతిలో ఓడిన జింబాబ్వే కీలక పోరులో చెలరేగగా, విండీస్‌పై సంచలన విజయంతో టోర్నీని మొదలు పెట్టిన స్కాట్లాండ్ ఆ తర్వాత సాధారణ ప్రదర్శనతో నిష్క్రమించింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్యాచ్ పట్టగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ స్టార్ స్పిన్నర్ గ్రేమీ స్వాన్ టి10 యూరోపియన్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఆటగాడిగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే స్వాన్ ఆ క్యాచ్ అందుకుంది ఒక ప్రేక్షకుడిగా. విషయంలోకి వెళితే.. టి10 యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇటలీ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్స్‌లో ఉన్న గ్రేమీ స్వాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తాను పట్టుకున్న బంతితో స్టాండ్స్ మొత్తం కలియ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రేమీ స్వాన్ ఇంగ్లండ్ తరపున మంచి స్పిన్నర్‌గా పేరు పొందాడు. ఇంగ్లీష్ జట్టు తరపున స్వాన్ 60 టెస్టుల్లో 255 వికెట్లు, 70 వన్డేల్లో 104 వికెట్లు, 39 టి20ల్లో 51 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటలీ చేతిలో స్విట్జర్లాండ్ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు భారీ స్కోరు చేసింది. అమిర్ షరీఫ్ 24 బంతుల్లో 64 నాటౌట్, రాజ్మణి సింగ్ 18 బంతుల్లో 51, బల్జీత్ సింగ్ 17 బంతుల్లో 50 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. And @Swannyg66 grabs another one! Absolute scenes in Cartama😄 #EuropeanCricketChampionship #ECC22 #CricketinSpain pic.twitter.com/edTwcCrKPQ — European Cricket (@EuropeanCricket) October 6, 2022 చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' -
సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ప్రపంచ ఉత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ సెమీఫైనల్-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిమాన్యు మిథున్ బౌలింగ్‌లో.. బెన్ డంక్ పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సురేష్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కెప్టెన్ సచిన్.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను గురువారానికి వాయిదా వేశారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. What a dive. What a catch 😱✨@ImRaina you beauty ♥️ Dekhte rahiye @India__Legends vs @aussie_legends in the #RoadSafetyWorldSeries now, only on @Colors_Cineplex, @justvoot, Colors Cineplex Superhits and @Sports18. pic.twitter.com/gXMHxd1KTy — Colors Cineplex (@Colors_Cineplex) September 28, 2022 చదవండి: Abu Dhabi T10 League: రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్! -
బాబర్ ఆజం కూడా ఊహించలేదు..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బానుక రాజపక్స మెరుపులతో 170 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు మరోసారి బాబర్ ఆజం రూపంలో షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం ప్రమోద్ మధుషాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే బాబర్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగా ఒక బ్యాటర్ ఫైన్‌లెగ్ దిశగా బంతిని బాదితే కచ్చితంగా బౌండరీ లేదా పరుగులు వస్తాయి. కానీ ఇక్కడే లంక కెప్టెన్ దాసున్ షనక తెలివిని ఉపయోగించాడు. బాబర్ ఆజం ఫైన్‌లెగ్ దిశగా ఆడేలా బంతిని వేయమని షనక చెప్పడం.. ప్రమోద్ అదే తరహాలో బంతి వేయడం.. ఫైన్ లెగ్ దిశలో ఉన్న మధుషనక క్యాచ్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. బాబర్ ఆజం తాను ఇలా ఔట్ అవుతానని ఊహించలేదనుకుంటా.. కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఇక బాబర్ తన ఫేలవ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10, 9, 14, 0, 30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉండడం విశేషం. అలా ఈ పాక్ కెప్టెన్ తన ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్‌ను ముగించాల్సి వచ్చింది. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు Asia Cup 2022 Final: పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స.. -
సెంచరీ వీరుడి సంచలన క్యాచ్.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 97 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 130 పరుగులు చేసిన గిల్.. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో ఇరగదీసిన గిల్.. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. అతను అందుకున్న సంచలన క్యాచ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. గిల్ అందుకున్న క్యాచ్ ఎవరిదో తెలుసా.. సికందర్ రజా. జింబాబ్వే బ్యాటర్స్ అంతా తడబడిన వేళ తాను మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్న సికందర్ రజా ఒక దశలో భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. రజా సెంచరీతో జింబాబ్వే క్లీన్‌స్వీప్ నుంచి బయటపడేలా కనిపించింది. 49వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఫుల్‌లెంగ్త్ డెలివరీని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇంతలో బౌండరీ లైన్ వద్ద ఉన్న గిల్.. ముందుకు పరిగెత్తుకొచ్చి అద్బుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. అప్పటికే రజా 115 పరుగులతో జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. రజా ఔటైన వెంటనే జింబాబ్వే ఆలౌట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. First with the bat and then with a diving catch, this man won our hearts more than once today 😍 How good was this effort from @ShubmanGill to dismiss the dangerous Sikandar Raza? 🤩💯#ShubmanGill #ZIMvIND #TeamIndia #SirfSonyPeDikhega pic.twitter.com/u5snCqECBw — Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2022 చదవండి: Shikar Dhawan: అడగ్గానే ఇద్దామనుకున్నాడు.. ధావన్ చర్య వైరల్ IND Vs ZIM: సిరీస్ క్లీన్‌స్వీప్.. 'కాలా చష్మా' పాటకు చిందేసిన టీమిండియా -
అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్‌లు కూడా బాగా పట్టగలడు
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుత విన్యాసంతో మెరిశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్రాడ్ ఈ విన్యాసం చేశాడు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మాథ్యూ పాట్ బౌలింగ్‌లో రబడా మిడ్‌ఫీల్డ్ దిశగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుంది ఎవరు.. ఆరు అడుగులు ఆరు అంగుళాల స్టువర్ట్ బ్రాడ్. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన బ్రాడ్ ఒకవైపుగా డైవ్‌చేస్తూ ఒంటిచేత్తో ఎవరు ఊహించని విధంగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తన మెరుపు విన్యాసంతో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టును కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. బ్రాడ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే టెస్టులో బ్రాడ్.. ప్రొటిస్ బ్యాటర్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో 100వ వికెట్ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఒకే వేదికపై వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్‌గా.. ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌గా ఘనత సాధించాడు. బ్రాడ్ ఇంత మంచి ఫీట్ అందుకున్నా ఇంగ్లండ్ మాత్రం తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Oh Broady! 😱 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/SCkwjfD7g5 — England Cricket (@englandcricket) August 19, 2022 చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా! -
మొదటిసారి విఫలం.. రెండోసారి సఫలం; దటీజ్ సంజూ శాంసన్!
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఆసక్తికరంగా ప్రారంభించింది. గురువారం తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసింది. దీపక్ చహర్ 3 వికెట్లతో ఘనంగా పునరాగమనం చేయగా.. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌లు చెరో 3 వికెట్లు తీశారు. కాగా మ్యాచ్‌లో సంజూ శాంసన్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. దీపక్ చహర్ వేసిన స్వింగ్ బంతిని ఆడడంలో ఇన్నోసెంట్ కైయా విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు తాకి కీపర్ సంజూ వైపు వెళ్లింది. కాగా సంజూ శాంసన్ క్యాచ్ అందుకునే క్రమంలో మొదటిసారి మిస్ అయ్యాడు.. కానీ రెండోసారి మాత్రం అవకాశం వదల్లేదు. ఒకవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సంజూ శాంసన్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ''మొదటిసారి విఫలం.. రెండోసారి సఫలం.. దటీజ్ సంజూ శాంసన్'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర ! KL Rahul: కేఎల్ రాహుల్‌తో మజాక్ చేసిన టీమిండియా అభిమాని.. Out!#INDvsZIM @IamSanjuSamson @deepak_chahar9 @BCCI pic.twitter.com/Mp1dRmCiG0 — Nikhil Kalal (@NikhilK85748502) August 18, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ!
ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో రెన్ షా సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సర్రే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన ఆల్డ్రిడ్జ్ బౌలింగ్‌లో.. బ్యాటర్ ర్యాన్ పటేల్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెన్ షా డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురియ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రే 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సర్రే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. సర్రే బ్యాటర్లు నికో రైఫర్(70),షెరిడాన్ గంబ్స్(66) పరుగులతో రాణించారు. అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ నిలిపోయే సమయానికి సోమర్సెట్12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రేను విజేతగా నిర్ణయించారు. One of the greatest catches you will see in a long time... LIVE STREAM ➡️ https://t.co/dF6GhNA901 #SURvSOM#WeAreSomerset https://t.co/hEzrqhCsx8 pic.twitter.com/cIGNGmLhhX — Somerset Cricket 🏏 (@SomersetCCC) August 17, 2022 చదవండి: IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ -
హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్!
కింగ్స్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ను షాక్‌కు గురిచేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఒడియన్ స్మిత్ బౌలింగ్‌లో మూడో బంతిని మార్టిన్ గుప్టిల్ భారీ షాట్ ఆడాడు. అయితే అది సిక్స్ వెళ్తుందన్న క్రమంలో.. పాయింట్ దశలో ఫీల్డింగ్ చేస్తున్న హైట్‌మైర్ పరుగెత్తుకుంటూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు విండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్ కూడా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. గుప్టిల్ ఔటైన తర్వాతి బంతికే కాన్వే ఇచ్చిన క్యాచ్‌ను థామస్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. What a catch from @SHetmyer! A display of brilliant athleticism to get @Martyguptill's wicket. Watch all the action from the New Zealand tour of West Indies LIVE, only on #FanCode 👉https://t.co/6aagmd7vyt@windiescricket @BLACKCAPS#WIvNZ pic.twitter.com/oAmqHi8sy0 — FanCode (@FanCode) August 11, 2022 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కివీస్‌పై 13 పరుగుల తేడాతో విండీస్ పరాజాయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్(47),డెవాన్ కాన్వే(43) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో స్మిత్ మూడు వికెట్లు, హోల్డర్, మోకాయ్ తలా వికెట్ సాధించారు. ఇక 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, సౌథీ, సోధి తలా వికెట్ సాధించారు. కాగా విండీస్ బ్యాటర్లో ఓపెనర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఆగస్టు 13న జరగనుంది. #DevonConway caught behind and what a spectacular piece of wicket keeping it was! Watch all the action from the New Zealand tour of West Indies LIVE, only on #FanCode 👉https://t.co/6aagmd7vyt@windiescricket @BLACKCAPS#WIvNZ pic.twitter.com/WWDC2GpuRP — FanCode (@FanCode) August 11, 2022 చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. ప్రాక్టీస్ షురూ చేసిన కింగ్ కోహ్లి! -
ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ 2022 టోర్నమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాస్ బట్లర్ కొట్టిన ఒక బంతి ఆరు సెకన్ల పాటు గాల్లోనే ఉంది. ఇది సూపర్ అని మనం భావించేలోపే వెంటనే మరొక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను మాసన్ క్రేన్ ఒంటిచేత్తో డైవ్ చేస్తూ తీసుకున్నాడు. ఇలా సెకన్ల వ్యవధిలోనే రెండు అద్భుతాలు జరిగాయి. విషయంలోకి వెళితే.. సోమవారం లండన్ స్పిరిట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్ జోర్డాన్ థాంప్సన్ వేశాడు. అప్పటికే బట్లర్ 10 బంతుల్లో ఆరు పరుగులతో ఆడుతున్నాడు. కాగా భారీ షాట్లకు పెట్టింది పేరైనా బట్లర్ థాంప్సన్ వేసిన నాలుగో బంతిని గాల్లోకి లేపాడు. దాదాపు ఆరు సెకన్ల పాటు బంతి గాల్లోనే ఉండడం విశేషం. కచ్చితంగా సిక్స్ అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా బంతి గ్రౌండ్ పరిధిలోనే ఉండడం.. మాసక్ క్రేన్ పరిగెత్తుకొచ్చి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే డేంజర్ బ్యాటర్ అయిన బట్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పొలార్డ్ హిట్టింగ్తో లండన్ స్పిరిట్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(37 పరుగులు), ఓపెనర్ జాక్ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్ జోర్డాన్ థాంప్సన్(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. Mason Crane. Wow. 🤯#TheHundred | @masoncrane32 pic.twitter.com/Rycid40AsX — The Hundred (@thehundred) August 9, 2022 చదవండి: Roger Federer: చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు CWG 2022- Virat Kohli: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం.. కంగ్రాట్స్: కోహ్లి -
పూరన్ సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన గుడాకేష్ మోటీ బౌలింగ్‌లో.. శ్రేయస్ అయ్యర్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కాగా అప్పటికే 54 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న అయ్యర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా అద్భుతమైన త్రోతో పూరన్ పెవిలియన్‌కు పంపాడు. ఇక తొలి వన్డేలో అఖరి వరకు పోరాడిన విండీస్ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్ (64) శ్రేయస్ అయ్యర్(54) పరుగులతో రాణించారు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ►టాస్: విండీస్- బౌలింగ్ ►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) ►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) ►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) ►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్.. వెస్టిండీస్‌కు బిగ్ షాక్..! .@ShreyasIyer15 is gone, caught by @nicholas_47. So disappointing, his scuffed shot. Watch the India tour of West Indies LIVE, exclusively on #FanCode 👉https://t.co/RCdQk12YsM@windiescricket @BCCI#WIvIND #INDvsWIonFanCode pic.twitter.com/z6ZZquTTYZ — FanCode (@FanCode) July 22, 2022 -
జడేజా విన్యాసాలు చూసి తీరాల్సిందే..
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎలాంటి ఫీల్డర్అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మెరుపు ఫీల్డింగ్‌తో పలుమార్లు రనౌట్లు.. మరి కొన్నిసార్లు అద్బుత క్యాచ్‌లు అందుకున్నాడు. బెస్ట్ ఫీల్డర్‌గా ముద్రపడిన జడేజా తాజాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్‌లో తన విన్యాసాలు రుచి చూపించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్, లివింగ్‌స్టోన్ క్యాచ్‌లు తీసుకోగా.. ఇందులో బట్లర్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. అప్పటికే జాస్ బట్లర్ అర్థసెంచరీ పూర్తి చేసుకొని దాటిగా ఆడడం మొదలెట్టాడు. అతనికి తోడుగా లివింగ్‌స్టోన్ కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతుందన్న తరుణంలో హార్దిక్ మ్యాజిక్ చేశాడు. హార్దిక్ షార్ట్‌బాల్ వేయగా.. బట్లర్ డీప్‌స్వ్కేర్ లెగ్ మీదుగా భారీషాట్ ఆడాడు. బౌండరీ అనుకున్న తరుణంలో దాదాపు 25 గజాల దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన జడేజా మొత్తం ఎడమవైపునకు తిరిగి డైవ్ చేస్తూ అద్బుత క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు లివింగ్‌స్టోన్ క్యాచ్ కూడా జడేజా దాదాపు ఇదే తరహాలో అందుకోవడం విశేషం. A fine catch from Jadeja removes Buttler. Scorecard/clips: https://t.co/2efir2v7RD 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5zIQnQ8Nh4 — England Cricket (@englandcricket) July 17, 2022 చదవండి: Kohli-Siraj: రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్లో సిరాజ్ బౌలింగ్.. ఫలితం! Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్స్ట్రక్షన్ సైట్లోకి బంతి' -
వారెవ్వా బట్లర్.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. భారత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో.. రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ బట్లర్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 170/8 (20) ఇంగ్లండ్ స్కోరు: 121 (17) విజేత: ఇండియా(49 పరుగుల తేడాతో విజయం) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) చదవండి: IND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్ What a moment! ❤️ A wicket on debut for @RicGleeson! 🙌 Scorecard/clips: https://t.co/aZbATuE7p7 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/LB8vQ70Hpb — England Cricket (@englandcricket) July 9, 2022 -
వారెవ్వా... కెప్టెన్ బుమ్రా
రెండో రోజు ఆటలో భారత సారథి బుమ్రా బ్యాటింగ్‌లో మెరుపులతో, బౌలింగ్‌లో వికెట్లతో అదరగొట్టాడు. మూడో రోజు అద్భుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ బోర్డు ప్రశంసలందుకున్నాడు. ఓవర్‌నైట్ బ్యాటర్స్ బెయిర్‌స్టో–స్టోక్స్ పాతుకుపోతున్న దశలో శార్దుల్ వేసిన ఓవర్లో కెప్టెన్ స్టోక్స్ బౌండరీ కోసం మిడాఫ్‌లో షాట్ ఆడాడు. సమీపంలో ఉన్న బుమ్రా మెరుపువేగంతో ఎడమవైపు వెనక్కి డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. నోరెళ్లబెడుతూ స్టోక్స్ నిష్క్రమించాడు. ఇంగ్లండ్ బోర్డు బుమ్రాను అభినందిస్తూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రేయస్ అయ్యర్ పట్టిన ఆఖరి వికెట్ సందేహాస్పద క్యాచ్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ద్వారా భారత్‌కు అనుకూలమైంది. పాట్స్ ఇచ్చిన ఈ క్యాచ్ రిప్లేలో నేలకు తాకుతున్నట్లు కనిపించింది. -
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని ఊరికే అనరు
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. యార్క్‌షైర్ విజయానికి ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో డొమినిక్ డ్రేక్స్ ఉన్నాడు. అవతలి ఎండ్‌లో డానీ లాంబ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిక్స్ కొడితే మ్యాచ్ విన్ అవుతుంది.. లేదంటే యార్క్‌షైర్‌కు ఓటమి తప్పదు. ఈ దశలో డానీ లాంబ్ పూర్తిగా ఆఫ్ స్టంప్ అవతల బంతిని విసిరాడు. అయితే డొమినిక్ డ్రేక్స్ డీమ్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అతని టైమింగ్ షాట్ చూసి అంతా సిక్స్ అని భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద టామ్ హార్ట్లే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే లైన్ తొక్కాడేమోనన్న చిన్న అనుమానం ఉండడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో టామ్ హార్టీ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా క్యాచ్‌ను ఒడిసిపడినట్లు తేలడంతో ఔట్ ఇచ్చాడు. దీంతో యార్క్‌షైర్ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(32 బంతుల్లో 66), క్రాప్ట్ 41, జెన్నింగ్స్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌లో టామ్ కోహ్లెర్ 77, డేవిడ్ విల్లీ 52 పరుగులతో మెరిసినప్పటికి లాభం లేకుండా పోయింది. చదవండి: European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో! UNBELIEVABLE DRAMA!!! Tom Hartley catches on the boundary to win it for @lancscricket!!#Blast22 #RosesT20 pic.twitter.com/StKY6rcv5T — Vitality Blast (@VitalityBlast) June 8, 2022 -
రిజ్వాన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్..!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్హామ్ రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ స్పిన్నర్ రాలిన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్త్విక్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు! This catch from @iMRizwanPak. 🤯 👏 #GOSBTS pic.twitter.com/uOdy7JJ2nr — Sussex Cricket (@SussexCCC) May 1, 2022 -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. చిరకాల మిత్రుడిపై పైచేయి
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్బుతంగా బ్యాలెన్స్ చేసుకొని క్యాచ్ తీసుకున్నాడు. చమీర వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికే మయాంక్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులతో జోరు కనబరుస్తున్నాడు. తన చిరకాల మిత్రుడిని ఔట్ చేయడానికి రాహుల్ బంతిని చమీర చేతిలో పెట్టాడు. ఆ ఓవర్ తొలి బంతిని సూపర్ సిక్స్ కొట్టాడు. అయితే నాలుగో బంతిని షాట్ ఆడే క్రమంలో మిడాఫ్ దిశగా గాల్లోకి ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ వెనక్కి పరిగెట్టి తన తలపై నుంచి పడిన బంతిని ఏ మాత్రం మిస్టేక్ చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో మయాంక్ కథ ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ మంచి మిత్రులున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు గన్నారు. తమ కలను నెరవేర్చుకున్నారు. చదవండి: IPL 2022: డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే! #LSGvsPBKS pic.twitter.com/t4MB77FyjN — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
‘స్పైడర్‌మ్యాన్’లా క్యాచ్ పట్టిన పంత్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో గురువారం (ఏప్రిల్28) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన కుల్ధీప్ యాదవ్ బౌలింగ్‌లో.. శ్రేయస్ అయ్యర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో వికెట్ కీపర్ పంత్ అద్భుతమైన 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. వెంటనే క్యాచ్‌కు పంత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి క్లియర్‌గా తాకినట్లు కనిపించింది. ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అద్భుతంగా ఆడుతున్న అయ్యర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఆదే ఓవర్లో రస్సెల్‌ను స్టంప్ చేసి పంత్ పెవిలియన్‌కు పంపాడు. ఇక పంత్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "స్పైడర్‌మ్యాన్‌లా క్యాచ్ పట్టావు" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: SL vs AUS: శ్రీలంక టూర్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. స్టార్ బౌలర్ దూరం..! Unlucky Shreyas or Lucky Pant? 🙄 pic.twitter.com/Zj8wqS9V8t — Krishna Tiwari (@krishnaa_ti) April 28, 2022 -
కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మ వైపు చూస్తూ.. వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 17 ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ వేసిన ఫుల్ టాస్ బంతిని కవర్స్ దిశగా బౌండరీ కొట్టడానికి పంత్ ప్రయత్నించాడు. అయితే షాట్ టైమింగ్ కుదిరినప్పటికీ.. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో పంత్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షక్షులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్క శర్మ వైపు విక్టరీ సింబల్ చూపిస్తూ కోహ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇక కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. అప్పటికే 34 పరుగులు సాధించి మంచి ఊపుమీద ఉన్న పంత్ ఔట్ కావడంతో ఢిల్లీకు ఓటమి తప్పలేదు. కోహ్లి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో మాక్స్వెల్(55),కార్తీక్(66) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(66),పంత్(34) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు సాధించారు. చదవండి: IPL 2022: ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన ఫీట్ pic.twitter.com/m3pTznQun1 — Diving Slip (@SlipDiving) April 16, 2022 -
వికెట్లే కాదు స్టన్నింగ్ క్యాచ్ కూడా.. పాత కుల్దీప్ కనిపిస్తున్నాడు!
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఆదివారం తన పాత జట్టు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసిన కుల్దీప్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఉమేశ్ యాదవ్‌తో కలిసి కుల్దీప్ 10 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే కుల్దీప్ వికెట్లు తీయడమే కాదు.. మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని ఉమేశ్ యాదవ్ స్వీప్ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. దాదాపు 30 గజాల దూరం పరిగెత్తిన కుల్దీప్ ముందుకు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కాగా అదే ఓవర్లో కమిన్స్, నరైన్‌లను ఔట్ చేసిన కుల్దీప్.. ఒకే ఓవర్లు మూడు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన కుల్దీప్ తాజాగా ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. రానున్న టి20 వరల్డ్‌కప్ దృష్టిలో పెట్టుకొని కుల్దీప్ మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్నాడు. కాగా కుల్దీప్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రాకముందు మూడేళ్ల పాటు కేకేఆర్‌కు ఆడాడు. ఈ మూడేళ్లలో కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కుల్దీప్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా గాయం కారణంగా కుల్దీప్ యాదవ్ గత సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే కుల్దీప్ ప్రదర్శనపై అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ''వికెట్లే కాదు.. స్టన్నింగ్ క్యాచ్లతోనూ అదరగొడుతున్నాడు.. పాత కుల్దీప్ కనిపిస్తున్నాడు.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం! కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి ICYMI: @imkuldeep18 stole the show with the ball & scalped a match-winning 4⃣-wicket haul against #KKR. 👏 👏 #TATAIPL | #KKRvDC | @DelhiCapitals Watch🎥 🔽https://t.co/3RvxXe4uk9 𝗣.𝗦.: 𝗗𝗼 𝗻𝗼𝘁 𝗺𝗶𝘀𝘀 𝘁𝗵𝗮𝘁 𝗯𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝘁 𝗰𝗮𝘂𝗴𝗵 & 𝗯𝗼𝘄𝗹𝗲𝗱! — IndianPremierLeague (@IPL) April 10, 2022 -
వారెవ్వా శార్ధూల్.. అద్భతమైన రన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శార్ధూల్ ఠాకూర్ అద్భతమైన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి రహానే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ ఠాకూర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకు ముందు మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర(61), పృథ్వీ షా(51) అర్ధ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. ఇక 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 171 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54), నితీష్ రాణా(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్ యాదవ్ నాలుగు వికెట్లు, ఖాలీల్ ఆహ్మద్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు, లలిత్ యాదవ్ ఒక వికెట్ సాధించారు. చదవండి: IPL 2022: ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు! శార్ధూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయంది -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ!
ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో.. రెండో బంతిని రూథర్‌ఫోర్డ్ లెగ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్‌కు కుడివైపు నుంచి వెళ్లింది. ఈ క్రమంలో జాక్సన్ డైవ్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న జాక్సన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రసంశించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాక్సన్ మూడు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్ చేశాడు. అంతకుమందు సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోను రాబిన్ ఉతప్పను మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి అందరి చేత జాక్సన్ ప్రశంసలు పొందాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. . తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు, ఆకాశ్ దీప్ మూడు, హర్షల్ పటేల్ , సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ! @ShelJackson27 what a catch 👏 @msdhoni @KKRiders #whatacatch pic.twitter.com/QLbSg33ZwS — sid (@siddheshnate) March 30, 2022 -
బ్యాట్‌తోనే అనుకుంటే.. స్టన్నింగ్ క్యాచ్తోనూ మెరిసింది
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ ఏడోసారి టైటిల్ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాటింగ్‌లో బెత్ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో మెరిసిన బెత్ మూనీ.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటింది. వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఉమెన్స్‌కు ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ రషదా విలియమ్స్‌ను.. మేఘన్ స్కట్డకౌట్గా పెవిలియన్‌గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్ అయింది మాత్రం బెత్ మూనీనే. విలియమ్స్.. కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఉన్న బెత్ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్‌కు Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ View this post on Instagram A post shared by ICC (@icc) -
సంచలన క్యాచ్‌తో మెరిసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్ కుల్దీప్ వేశాడు. 3 పరుగులతో ఆడుతున్న పొలార్డ్ కుల్దీప్ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి మిడ్ వికెట్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సీఫెర్ట్ పూర్తిగా తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. సీఫెర్ట్ విన్యాసం పొలార్డ్ నమ్మలేకపోయాడు. అయినా సూపర్ క్యాచ్ అందుకోవడంతో విండీస్ హిట్టర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే లలిత్ యాదవ్( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లోమెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: IPL 2022: ఏం ఆడుతున్నావని విమర్శించారు.. కట్‌చేస్తే An absolutely sensational grab by Tim Seifert to dismiss Keiron Pollard. #IPL2022 #DCvMI pic.twitter.com/jXkRxxzqEb — Dr. Mukul Kumar (@WhiteCoat_no_48) March 27, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆష్లీ గార్డనర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన జెస్ జోనాసెన్ బౌలింగ్‌లో.. మిగ్నాన్ డు ప్రీజ్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే అంతా బంతి బౌండరీ దాటడం ఖాయమని భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్లీ గార్డనర్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దీంతో గార్డెనర్ క్యాచ్‌ను మైదానంలో ఉన్న వాళ్లంతా ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లు లీ(36), వొల్వార్ట్(90) కెప్టెన్ సునే లాస్ (52) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్లు రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) వికెట్లు కోల్పోయింది.ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. Take a bow, Ash Gardner 🙌😍 #CWC22 #SAvAUS pic.twitter.com/KY3Cu9F9Mn — Female Cricket #CWC22 (@imfemalecricket) March 22, 2022 -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్భుత విన్యాసం.. నోర్లెళ్లబెట్టిన ప్రత్యర్ధులు.. రెప్పపాటులోనే..!
NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ఆల్‌రౌండర్ నతాలీ స్కివర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు మ్యాడీ గ్రీన్ (52) అజేయమైన అర్ధశతకంతో రాణించడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చేసిన ఓ అద్భుతమైన విన్యాసం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ పవర్ హిట్టర్ లీ తహుహు భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. రెప్పపాటు సమయంలో నైట్ చేసిన ఈ విన్యాసాన్ని చూసి మైదానంలో ఉన్న వాళ్లంతా నోర్లెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ విజయం.. న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! -
"ఓ మై గాడ్".. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్..
మార్ష్కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన డిఆర్సీ షార్ట్ బౌలింగ్‌లో.. హెన్రిక్స్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ ఖాయమని అంతా భావించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కార్ట్‌రైట్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కార్ట్‌రైట్ తన స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో మంచి ఊపు మీద ఉన్న హెన్రిక్స్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక హెన్రిక్స్ ఔటయ్యక న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెన్‌క్రాప్ట్(39), జో రిచర్డ్సన్(44) పరుగులతో రాణించారు. ఇక 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్ 46.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లలో హెన్రిక్స్(43), డానియల్ సామ్స్(42) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ.. Catch of the summer?! Hilton goes horizontal! #MarshCup pic.twitter.com/uLQcYsXPnn — cricket.com.au (@cricketcomau) March 11, 2022 -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్‌లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్‌తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్‌కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్‌బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
రెప్పపాటులో స్టన్నింగ్ క్యాచ్.. చూపులతోనే ఫిదా
ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్‌ను జోనాస్సెన్ వేసింది. ఓవర్ రెండో బంతిని ఇంగ్లండ్ బ్యాటర్ కాథరిన్ బ్రంట్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేసింది. అందుకు తగ్గట్టగానే బ్యాట్‌తో పర్ఫెక్ట్ షాట్ ఆడింది. కానీ బౌలర్ జొనాస్సెన్ బంతికి అడ్డుగోడలా నిలిచింది. తన చేతికి చిక్కితే బంతి ఎక్కడికి వెళ్లదు అన్నట్లుగా.. రెప్పపాటులో వేగంగా వెళుతున్న బంతి ఎడమ చేత్తో స్టన్నింగ్‌గా అందుకుంది. అంతే పట్టిన ఆమెకు.. చూస్తున్న మనకు.. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు.. ఫీల్డర్లు అందరికి షాక్ తగిలింది. అసలు క్యాచ్ పట్టానా అన్న రీతిలో జొనాస్సెస్ ఇచ్చిన లుక్స్.. చిరునవ్వు హైలెట్‌గా నిలిచాయి. జొనాస్సెన్ క్యాచ్ పట్టిన దానికంటే ఆమె ఇచ్చిన లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోనూ షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిల మెక్‌గ్రాత్, జెస్ జొనాస్సెన్ తలో 2 వికెట్లు, మెగాన్ ష్కట్ ఓ వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: Womens World Cup 2022: ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఆసీస్... బంగ్లాను ఆటాడుకున్న సౌతాఫ్రికా Icc women's world cup 2022: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ సంచలన విజయం View this post on Instagram A post shared by ICC (@icc) -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫీల్డర్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 79 ఓవర్ వేసిన గ్రాండ్‌హామ్ బౌలింగ్‌లో.. జాన్సెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బౌండరీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యంగ్.. పరిగెత్తుకుంటూ వెళ్లి సింగ్ హ్యండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. యంగ్ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన జాన్సెన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కాగా యంగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివాన్ కాన్వే (92),టామ్ బ్లాండల్(44) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకున్నట్లైంది. చదవండి: Nicholas Pooran: 37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం Will Young takes one of the greatest catches in the cricket history 🔥#NZvSA #NZvsSA pic.twitter.com/klszfnjTJQ — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 28, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో వైరల్
Binura Fernando Grabs An Exceptional Catch: ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పీల్డర్ బినురా ఫెర్నాండో అద్భుతమైన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన లాహిరు కుమార బౌలింగ్‌లో.. సంజు శాంసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్‌మెన్ దిశగా వెళ్లగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫెర్నాండో జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టాడు. దీంతో 39 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న శాంసన్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఇక ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(75), షనకా(47) రాణించారు. ఇక 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కిషన్, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది. అనంతరం శ్రేయస్ అయ్యర్, శాంసన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. 39 పరుగులు చేసిన శాంసన్.. కూమార బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన జడేజా కూడా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతుల్లో జడేజా 7 ఫోర్లు, 1సిక్స్‌తో 45 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ మరోసారి తన బ్యాట్‌ను ఝులిపించాడు. 44 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా 17.1 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: IND vs SL: ఏ ముహుర్తానా సిరీస్ ప్రారంభమయిందో.. ఇషాన్ కిషన్ తలకు గాయం Binura Fernando 💥🤯 WHAT A CATCH....😱#INDvSL pic.twitter.com/5ymg7mzYle — Sandalu Gaganaka ✨ (@gaganaka49) February 26, 2022 -
స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్‌తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్‌లో.. సోఫియా డివైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధాన డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. కాగా మంధాన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(68), బేట్స్(41),డివైన్(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్,దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(52), మిథాలీ రాజ్(30) పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో కేర్, జానేసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు. Oh YAAAS! Smriti Mandhana!!#NZvIND #CricketTwitter pic.twitter.com/0fy0JJ60BE — Krithika (@krithika0808) February 22, 2022 -
'బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్' అని అపవాదు.. ఇప్పుడది పటాపంచలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్ఢింగ్ సరిగా చేయలేడు అనే అపవాదు ఒకటి ఉండేది. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకోవడం అరుదు. బ్యాట్స్‌మన్‌గా క్రీజులో పరుగులు తీయడానికి పెద్దగా ఇష్టపడని రోహిత్.. ఫీల్డింగ్‌లోనూ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మాత్రం టీమిండియా కెప్టెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 34 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్ ఎలాంటి సందేహాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేశాడు. చదవండి: రోహిత్ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయి.. తొలి మ్యాచ్ కదా వదిలేయ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టి20లో విండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హర్షల్ పటేల్ వేశాడు. ఓడియన్ స్మిత్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. లాంగాఫ్ నుంచి సూర్యకుమార్ పరిగెత్తుకు రాగా.. ఎక్స్ట్రా కవర్ నుంచి రోహిత్ వెనుకకు పరిగెత్తుతూ డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రోహిత్.. అటు సూర్యకుమార్‌తో పాటు మిగతా ఆటగాళ్లను, కామెంటేటర్లను .. స్టన్నింగ్ క్యాచ్‌తో షాక్‌కు గురిచేశాడు. రోహిత్ క్యాచ్‌కు క్రీడా పండితులు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ స్టన్నింగ్ ఫీట్ చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కెప్టెన్ అయ్యాకా కొత్త రోహిత్ కనిపిస్తున్నాడు.. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అనే అపవాదు ఉండేది.. ఇప్పుడది పటాపంచలు అయింది అంటూ కామెంట్ చేశారు. చదవండి: IND Vs WI: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒకరినొకరు భయంకరంగా గుద్దుకున్నారు..
పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పెషావర్ జాల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. చేజింగ్‌కు దిగిన పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కమ్రాన్ అక్మల్ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి ఫైన్‌లెగ్ దిశగా హైట్లోకి వెళ్లింది. చదవండి: 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్‌తో మెసేజ్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకవైపు నుంచి.. షాహనావాజ్ దహాని మరో ఎండ్ నుంచి క్యాచ్ కోసం పరిగెత్తారు. ఇద్దరు ఎదురుఎదురుగా వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. అనవసరంగా క్యాచ్ మిస్ అయిందని మనం అనుకునేలోపే అద్భుతం జరిగింది. కిందపడుతూనే దహాని ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముందు సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మహ్మద్ రిజ్వాన్ వచ్చి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ 42 పరుగుల తేడాతో పెషావర్ జాల్మీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మసూద్ 68, రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 34 రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ మాలిక్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు 😄#HBLPSL7 l #LevelHai l #MSvPZ pic.twitter.com/3caWheCXaK — PakistanSuperLeague (@thePSLt20) February 10, 2022 -
చూసి చూసి బోర్ కొడుతుంది.. అయినా మళ్లీ ఒకసారి
క్రికెట్లో ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో స్టన్నింగ్ క్యాచ్‌లు అనే పదం తరచుగా వింటాం. ఈసారి కూడా ఒక స్టన్నింగ్ క్యాచ్ గురించి ప్రస్తావించుకుందాం. ఫీల్డర్ క్యాచ్ పట్టిన విధానం చూసి ఫిదా కావాల్సిందే. యూరోపియన్ క్రికెట్ లీగ్ 2022లో ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా వాన్హోమ్, డ్రూక్స్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వాలోహోమ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు వాలోహోమ్ కెప్టెన్ హమీద్ షా తొలుత బ్యాటింగ్‌లో మెరిశాడు. ఆ తర్వాత ఫీల్ఢింగ్లోనూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో కమ్రాన్ అహ్మద్‌జై స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అతను కొట్టిన స్రెయిట్ షాట్ కచ్చితంగా సిక్స్ అని భావిస్తాం. కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. లాంగాన్ నుంచి పరిగెత్తుకు వచ్చిన హమీద్ షా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అతని బ్యాలెన్సింగ్ విధానానికి వారెవ్వా అనుకుండా మాత్రం ఉండలేం. కచ్చితంగా హమీద్ షా పట్టిన క్యాచ్.. క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం ఖాయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "You will not see a better grab than that" Svanholm Cricket Club legend Hamid Shah with the Catch of the Millennium!!@BET2BALL European Cricket League presented by Kiba Inu@KibaInuWorld #ECL22 pic.twitter.com/dlayx5yoq4 — European Cricket (@EuropeanCricket) February 9, 2022 -
వారెవ్వా వోల్వార్డ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్
వెస్టిండీస్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ఫీల్డర్ లారా వోల్వార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన తుమీ సెఖుఖునే బౌలింగ్‌లో.. వెస్టిండీస్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న లారా వోల్వార్డ్ ఒంటి చెత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్ల్లో కిసియా నైట్(48),డాటిన్(36) పరుగులతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్ 4 వికెట్లతో వెస్టిండీస్‌ను కుప్పకూల్చగా, ఆయబొంగ ఖాకా, ట్రయాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండ్రీ స్టెయిన్(52),సునే లూస్(47) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. చదవండి: IPL 2022 Auction: "చాహల్ భాయ్ నీకు భారీ ధర దక్కడం ఖాయం.. ఆల్‌ది బెస్ట్" What the hell 🤯 Laura Woolvardt takes a stunner to dismiss Mathews.#SAvWI pic.twitter.com/ZxkKlWJeu1 — WCricCraze🏏 (@WomensCricCraze) February 6, 2022 -
ఒక చేతిలో ఫోన్.. మరో చేతితో స్టన్నింగ్ క్యాచ్
క్రికెట్లో కొన్ని క్యాచ్‌లు స్టన్నింగ్‌గా ఉంటాయి. ఒక ప్లేయర్ పడితే సూపర్.. అద్బుతం.. అమేజింగ్ అంటూ మెచ్చుకుంటాం. మరీ అదే మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు ఒక చేతితో ఫోన్ పట్టుకొని.. మరో చేతితో వేగంగా వచ్చిన బంతిని ఒడిసి పట్టాడు. ఇంకముంది కెమెరాలన్నీ అతని వైపే తిరిగాయి. అయితే అతను క్రికెటర్ అయ్యుంటే ఈ న్యూస్ సంచలనంగా మారేది. చదవండి: BBL 2021-22: ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు కరోనా లేని ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ తొలి బంతిని మాట్ రెన్షా లాంగాన్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. అతను ఫర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టిన సిక్స్ స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడు ఫోన్ మాట్లాడుతుండగానే.. బంతి అతని వద్దకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి మాత్రం సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ తీసుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోను లీగ్ నిర్వాహకులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వెల్స్ 62 నాటౌట్, ఇయాన్ కాక్బ్రెయిన్ 48, రెన్ షా 36 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్.. పెర్త్ స్కార్చర్స్‌తో తలపడనుంది. చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్ Not many crowd catch opportunities on the second tier... and even less taken one-handed with the 📱 in the other mitt! @KFCAustralia | #BBL11 pic.twitter.com/JDqrXiEzcd — KFC Big Bash League (@BBL) January 26, 2022 -
క్యాచ్ పట్టలేదని తిట్టిపోశారు.. కట్‌చేస్తే
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్లో సింపుల్ క్యాచ్ జారవిడిచాడని డేనియల్ సామ్స్‌ను బౌలర్ తిట్టినంత పని చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్నాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మరుసటి ఓవర్లోనే దిమ్మతిరిగే క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో తన్వీర్ సంగా వేసిన మూడో బంతిని అలెక్స్ క్యారీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డేనియల్ సామ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..! ఇక మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇయాన్ కాక్బెన్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Don't let his subdued reaction fool you. Daniel Sams makes up for his earlier drop with a hanger in the deep! A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/7hCV5VxxK0 — cricket.com.au (@cricketcomau) January 23, 2022 -
స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్ అయింది. హరికేన్ హోబర్ట్స్ ఆటగాడు విల్ పార్కర్ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పటికి.. బౌండరీ లైన్ తాకడంతో అంపైర్లు సిక్స్‌గా ప్రకటించారు. అయితే పార్కర్ బౌండరీ లైన్ తాకకుండా క్యాచ్ తీసుకొని ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని మాట్ షార్ట్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న పార్కర్ పరిగెత్తుకొచ్చి విల్లులా వొంగి.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అప్పటికే బౌండరీ లైన్ టచ్ చేయడంతో పార్కర్ ఏం చేయలేక బంతిని విసిరాడు. రూల్ ప్రకారం అంపైర్లు సిక్సర్ ఇవ్వడంతో పార్కర్ విన్యాసం వృథాగా మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 22 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. WILL PARKER! Six in the scorebook, but oh my... 🤯 #BBL11 pic.twitter.com/vIUFy64Kc5 — KFC Big Bash League (@BBL) January 21, 2022 -
IND Vs SA 3rd Test: పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. నిరాశతో వెనుదిరిగిన పుజారా
Keegan Petersen Stunning Catch: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో అద్భుతం చోటు చేసుకుంది. సఫారీ ఆటగాడు కీగన్ పీటర్సన్.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ రెప్పపాటులో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కీలక మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని భావించిన పుజారా.. పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. మూడో రోజు తొలి ఓవర్ రెండో బంతికే మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. ఫలితంగా భారీ స్కోర్‌పై కన్నేసిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలినట్లైంది. Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/zqcAtMahSi — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 ఇదిలా ఉంటే, 57 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127 బంతుల్లో 28; 4 ఫోరు).. తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతుండగా.. రిషబ్ పంత్(60 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతున్నాడు. లంచ్ సమయానికి భారత్ 143 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. చదవండి: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా.. వీడియో వైరల్!
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో.. మొహమ్మద్ నయీమ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. దీంతో థర్డ్ స్లిప్‌లో ఉన్న లాథమ్ డైవ్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బ్లాక్ క్యాప్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో ఇన్నింగ్స్, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో లాథమ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. -
అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్‌ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్‌ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మార్క్‌వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! -
జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుతమైన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన సువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో.. మార్కస్ హారిస్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్‌కు దూరంగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ క్యాచ్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇక బట్లర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండో టెస్ట్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్ సంచలన వాఖ్యలు INSANE! Buttler pulls in an all-timer behind the stumps! #Ashes pic.twitter.com/v96UgK42ce — cricket.com.au (@cricketcomau) December 16, 2021 -
స్టన్నింగ్ క్యాచ్.. ప్రేక్షకులకు దిమ్మతిరిగింది
Fielder Stunning Catch Shock Audience BBL 2021.. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఆటగాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్ సూపర్ విన్యాసంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌ను జహీర్ ఖాన్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్టంప్స్ మీదకు వేయగా.. అడిలైడ్ ఓపెనర్ జేక్ వెదర్లాండ్ మిడ్ వికెట్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. భారీ సిక్స్ ఖాయమనుకున్న వేళ 19 ఏళ్ల ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకొని రివర్స్‌లో జిమ్నాస్ట్ చేస్తూ సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. అతని దెబ్బకు మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ప్రేజ్ అద్భుత విన్యాసానికి మంత్ర ముగ్దులయ్యారు. కాగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న ఫ్రేజర్‌ను చూసి జేక్ వెదర్లాండ్ ఆశ్చర్యపోయి పెవిలియన్ బాట పట్టాడు. చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 2 పరుగుల తేడాతో విజాయన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మెకెంజీ హార్వే 56 పరుగులతో టాప్ స్కోర్ర్గా నిలవగా.. సామ్ హార్పర్ 33 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హారీ నీల్సన్ 30, మాథ్యూ షార్ట్ 29 పరుగులు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో జహీర్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. చదవండి: Mitchell Santner: మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు Jake Fraser-McGurk plucks an INSANE grab!! #BBL11 pic.twitter.com/YT18EE0BBR — KFC Big Bash League (@BBL) December 7, 2021 -
వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు..
క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువలేదు. ఆటగాళ్లు చేసే స్టంట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తాయి. వీటికి తోడూ ఆటగాళ్ల డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ పోతుందని అంతా భావించారు. చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. 30 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్ బౌండరీలైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఫీల్డర్ క్యాచ్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ పేర్కొన్నారు. Can't stop watching this. It's just so ridiculously casual 😂👏 [@EuropeanCricket] pic.twitter.com/2yOdXFvmAV — That’s so Village (@ThatsSoVillage) December 6, 2021 -
సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్
Ish Sodhi takes one handed stunner to dismiss Rohit Sharma: భారత్‌తో జరిగిన మూడో టీ20లో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండో బంతిని రోహిత్ శర్మ బౌలర్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో సోధి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోధి స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈడెన్ గార్డన్స్ వేదికగా నవంబర్21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అధేవిదంగా కెప్టెన్‌గా రోహిత్‌కు, కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. చదవండి: SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక Even if you recognize a fast moving opportunity coming your way, you still need to... raise your hand to stake your claim to it. (enabled by @ish_sodhi)#bgLifeLessons #bgCricGyan pic.twitter.com/4eWAtJjCOz — bollyglot gifs (@BollyglotGifs) November 21, 2021 -
జడ్డూ సూపర్ క్యాచ్.. అంపైర్ 'నాటౌట్'.. కోహ్లి రియాక్షన్
Ravindra Jadeja Stunning Fielding Effort.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గొప్ప ఫీల్డర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో జడేజా మరోసారి రుచి చూపించాడు. దాదాపు జడేజా క్యాచ్ పట్టేసినప్పటికి చివరి నిమిషంలో బంతిని నేలకు తాకించడంతో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ ఇచ్చాడు. కానీ జడేజా మాత్రం అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగా అయిపోళ్లంము కదా.. ఇప్పుడు.. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో షమీ వేసిన బంతిని కరీమ్ జైనత్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే జడేజా వేగంగా పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. టీమిండియా అప్పీల్ చేసింది. సాఫ్ట్సిగ్నల్లో ఔట్ అని ప్రకటించినా.. చివరి నిమిషంలో జడేజా బంతిని కింద ఆనించినట్లు రిప్లైలో అన్క్లియర్గా ఉంది. దీంతో థర్డ్ అంపైర్ మాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ అని ఇచ్చాడు. దీంతో కోహ్లి ఇదేంటి అన్నట్లుగా అంపైర్‌వైపు ఆశ్చరంగా చూశాడు. అయితే జడేజా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే మాత్రం మ్యాచ్ ''క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్''గా నిలిచిపోయేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కోహ్లి రియాక్షన్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. చదవండి: IND Vs AFG: టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు pic.twitter.com/IFlGjLUtgi — Cric Zoom (@cric_zoom) November 3, 2021 -
వారెవ్వా వోక్స్.. సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్
Chris Woakes Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని స్టీవ్ స్మిత్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే మిడాన్‌లో ఉన్న వోక్స్ వెనక్కి పరిగెత్తుతూ అమాంతం గాల్లోకి లేచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ తీసుకున్నాడు. అయితే వోక్స్ కాస్త పట్టు తప్పినా పరిస్థితి వేరేలా ఉండేది. వోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌కు షాకైన స్మిత్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. వోక్స్ అందుకున్న క్యాచ్ ఈ ప్రపంచకప్‌లో బెస్ట్ క్యాచెస్ ఆఫ్ టోర్నమెంట్లో చోటు దక్కించుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: SA Vs SL: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు Woakes with a worldie of a catch via @t20worldcup https://t.co/cPcthNTkJG — Bhavana.Gunda (@GundaBhavana) October 30, 2021 -
డెవన్ కాన్వే 'సూపర్ మ్యాన్'.. క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్
Devon Conway Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డెవన్ కాన్వే సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చొన్న కాన్వే పరిగెత్తుతూ ఎడమవైపుగా డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో హఫీజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా కాన్వే అందుకున్న క్యాచ్.. టోర్నమెంట్లో సూపర్ క్యాచ్‌గా నిలిచే అవకాశముందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. చదవండి: NZ Vs PAK: టిమ్ సౌథీ నయా రికార్డు; టి20 చరిత్రలో మూడో బౌలర్‌గా What a catch Unbelievable... Devon Conway ♥#PakvsNz#T20WC pic.twitter.com/wJJEpPOnTY — Mudassir Shafiq (@MudassirShaf01) October 26, 2021 -
హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Shimron Hetmyer Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికి హెట్‌మైర్ మాత్రం స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ రెండో బంతిని దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ డీప్స్కేర్ లెగ్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే అక్కడే ఉన్న హెట్‌మైర్ ముందుకు పరిగెత్తుకొచ్చి కిందకు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. చదవండి: WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో అయితే ఔట్ విషయంలో అంపైర్ క్లారిటీ లేకపోవడంతో థర్ఢ్అంపైర్కు వెళ్లింది. సాఫ్ట్ సిగ్నల్‌లో నాటౌట్ అని చూపించగా.. రిప్లేలో మాత్రం బంతి ఎక్కడా నేలకు తగిలినట్లు కనిపించలేదు. హెట్‌మైర్ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని తన చేతివేళ్ల మధ్యలో పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో రీజా హెండ్రిక్స్ ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. An excellent low diving catch by Hetmyer https://t.co/N3Up6TCnhn via @t20wc — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
T20 World Cup 2021: అకేల్ హోసిన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్
Akeal Hosein Takes Sensational One Handed Catch: టి20 ప్రపంచ కప్ 2021లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ చిత్తుగా ఓటమి చెందినప్పటికీ .. ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ వేయడానికి వచ్చిన అకేల్ హోసిన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అకేల్ హోసిన్ వేగంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హోసిన్ స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అకేల్ హోసిన్.. రెండు కూడా కాట్ అండ్ బౌల్డ్ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానకి వస్తే.. వెస్టిండీస్‌పై 6వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కేవలం 55 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎక్కువ బెట్టింగ్‌లు! View this post on Instagram A post shared by ICC (@icc) -
AUS Vs SA: మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Aiden Markram Stunning Catch.. మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. నోర్ట్జే వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతా బౌండరీ అనుకుంటున్న దశలో మక్రమ్ అద్బుతం చేశాడు. లాంగాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మక్రమ్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో స్మిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే మక్రమ్ది సూపర్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే.. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం అందుకొని భోణి కొట్టింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన దశలో మార్కస్ స్టోయినిస్(24 నాటౌట్), మాథ్యూ వేడ్(15 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించారు. అంతకముందు స్టీవ్ స్మిత్ 35 పరుగులు పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2, షంసీ, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. Flying Markram!!! Whatta Catch!!!@AidenMarkram#SAvsAUS#T20WorldCup#LiveTheGame pic.twitter.com/C37EPswwRs — Arnavicious!!! (@TweetsByArnav) October 23, 2021 చదవండి: Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు View this post on Instagram A post shared by ICC (@icc) -
జట్టులో బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్‌కు షకీబ్ ఫిదా
Charles Amini Stunning Catch In BAN Vs PNG.. టి20 ప్రపంచకప్ 2021లో అరంగేట్రం చేసిన పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకపోయినప్పటికి ఒమన్ అభిమానులను మాత్రం అలరిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్, పపువా మధ్య జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పపువా ఫీల్డర్ చార్లెస్ అమిని సూపర్ క్యాచ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అందులోనూ షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ క్యాచ్ అందుకుంటే ఆ ఫీల్డర్ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పపువా జట్టులో చార్లెస్ అమిని బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. చదవండి: T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్ అయితే అక్కడే ఉన్న చార్లెస్ అమిని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అంతే అర్థసెంచరీ లేకుండానే షకీబ్ కథ ముగిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా సాగుతుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 13 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహ్మదుల్లా, షకీబ్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/KhbiXQ5edS — jennifer (@jennife74834570) October 21, 2021 -
T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్‌తో
Oman Bowler Fayyaz Butt Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. తన బౌలింగ్‌లోనే ఒకవైపుగా డైవ్ చేస్తూ మెహదీ హసన్‌ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతిని ఫయాజ్ భట్ ఫుల్‌టాస్ వేయగా.. మెహదీ బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. వెంటనే భట్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకొని ఆ తర్వాత రెండు చేతులతో బంతిని బాలెన్స్ చేశాడు. దీంతో మెహదీ అసన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: Oman Vs BAN: చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం PC: ICC T20.Com కాగా మెహదీ అసన్ను డకౌట్ చేసిన భట్ మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 26 పరుగుల తేడాతో ఒమన్‌పై విజయం సాధించింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్‌లో 42 పరుగులు.. అనంతరం బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: T20 WC 2021: మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు View this post on Instagram A post shared by ICC (@icc) -
డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్... వీడియో వైరల్
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ అధ్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ లాంగాన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ బ్యాలన్స్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా ప్రస్తుతం13 ఓవర్లో మూడో వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం నితీశ్ రాణా(9), ఆండ్రీ రసెల్(2) క్రీజులో ఉన్నారు. చదవండి: T20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే #CSKvKKR catch by faf 😍 Credits - @DisneyPlusHS pic.twitter.com/0hb1ZW0NSl — Jr.Power_STAR ⭐😎🤙 (@nithishjackson) September 26, 2021 -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ
KL Rahul Stunning Catch.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇషాన్ పోరెల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శాంసన్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి కీపర్‌కు దూరంగా టాప్ఎడ్జ్లో వెళ్లింది. అయితే రాహుల్ మాత్రం ఏ పొరపాటు చేయకుండా సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ 4 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం 7.1 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 68/2. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు. -
60 బంతుల్లో సెంచరీ; ఒంటిచేత్తో సూపర్ క్యాచ్.. అయినా ఓడిపోయింది
దుబాయ్: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్‌లో(సీడబ్య్లూసీ) భాగంగా నేపాల్, ఒమన్, యూఎస్ఏల మధ్య ట్రై సిరీస్ జరుగుతుంది. కాగా నేపాల్, ఒమన్‌ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు రోహిత్ పౌడెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్ వద్ద ఒమన్ బ్యాట్స్‌మన్ జతీంధర్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను పౌడెల్ బౌండరీ రోప్‌కు తగలకుండా ఎగిరి ఒంటిచేత్తో తీసుకున్నాడు. అనంతరం బంతిని విసిరేసి బౌండరీ లైన్ ఇవతలకు వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న జతీంధర్ అవుట్ కావడంతో నేపాల్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. చదవండి: CPL 2021: వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన ఒమన్ బ్యాట్స్‌మన్ జతీంధర్ సింగ్(62 బంతుల్లో 102 పరుగులు) ఈ మ్యాచ్‌లో ఒమన్ ఘన విజయాన్ని అందుకుంది. నేపాల్ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 31.1 ఓవర్లలోనే చేధించింది. ఒమన్ ఓపెనర్ జతీంధర్ సింగ్ 62 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని సత్తా చాటాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. ఓవరాల్‌గా 107 పరుగులు చేసిన జతీంధర్ రోహిత్ పౌడేలా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికే లక్ష్యాని చేరువ కావడంతో మహ్మద్ నదీమ్ 38 నాటౌట్ మిగతా పనిని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు నేపాల్ జట్టు 47.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (90 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఒమన్ బౌలర్లలో బిలాయ్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. నెస్టర్ దాంబా రెండు వికెట్లు తీశాడు. చదవండి: IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా! Simply ridiculous from Nepal's Rohit Paudel 🤯 Watch the Men’s CWC League 2 match live on https://t.co/CPDKNxoJ9v and @FanCode (in the sub-continent) 📺 pic.twitter.com/m6ZxYIPiya — ICC (@ICC) September 15, 2021 -
ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా
ఢాకా: బంగ్లాదేశ్,న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన ఐదో టీ20లో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోల్ మెక్కొంచీని కాట్ అండ్ బౌల్డ్‌తో డక్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఒంటి చేత్తో క్యాచ్ అందుకునే క్రమంలో మోచేతికి దెబ్బ తగిలినా బంతిని మాత్రం విడువలేదు. అతని క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. కివీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ 3.3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల తీశాడు. మరో బంగ్లా బౌలర్ నసూమ్ అహ్మద్ స్టన్నింగ్ బౌలింగ్‌తో మెరిశాడు. 4-2-10-4తో టీ20ల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. చదవండి: Rohit Vs Shardul : అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 93 పరుగులకే ఆలౌట్ అయింది. విల్ యంగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బంగ్లా బౌలర్ల దాటికి ముగ్గురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా మారిన చివరి టీ20 రేపు(శుక్రవారం) జరగనుంది. చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి.. Mustafizur magic #BANvNZ pic.twitter.com/dJoUIamwE3 — Aaron Murphy💉💉 (@AaronMurphyFS) September 8, 2021 -
ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉమేశ్ వేసిన గుడ్‌లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో మలాన్ పొరబడ్డాడు. బంతి మలాన్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు వెళ్లింది. రోహిత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కాగా మలాన్ 31 పరుగులు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Sheldon Cotrell: వారెవ్వా కాట్రెల్.. స్టన్నింగ్ క్యాచ్.. ఆఖరి బంతికి సిక్స్ ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కూడా తడబడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను తక్కువకే ఆలౌట్ చేశామన్న ఆనందం లేకుండానే ఇంగ్లండ్ కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఓలీ పోప్ 27, జానీ బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లి 50 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. చదవండి: శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు Umesh on fire! 🔥 Gets Malan to nick one to Rohit at slip. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Umesh #Malan pic.twitter.com/MdKd0xLu4k — Sony Sports (@SonySportsIndia) September 3, 2021 -
'స్టన్నింగ్ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు'
అంగవైకల్యం కేవలం శరీరానికి మాత్రమే అని ఒక దివ్యాంగ క్రికెటర్ చేసి చూపెట్టాడు. ఒక కాలు లేకపోయిన బౌలింగ్ వేయడమేగాక ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. జాతీయ తరహాలో దివ్యాంగుల క్రికెట్ పోటీ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్‌లకు అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ కూడా ఉన్నారు. చదవండి: ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్ భయపడింది'.. అందుకే నిషేధం ఈ సందర్భంగా ఒక దివ్యాంగ క్రికెటర్ తనకు కాలు లేకపోవడంతో కర్ర సాయంతో బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ లాంగాన్ రీజియన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి టర్న్ బ్యాట్‌కు తగిలి బౌలర్ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో బౌలర్ తన కర్రను కిందపడేసి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత పైకి లేచే ప్రయత్నం చేస్తుండగా.. తన సహచరులు వచ్చి అతన్ని పైకి లేపి అభినందించారు. సదరు దివ్యాంగ క్రికెటర్ చేసిన విన్యాసాలు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ''నిజంగా అద్బుతం.. స్టన్నింగ్ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు'' అంటూ దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ పేర్కొన్నాడు. ''వైకల్యం అనేది శరీరానికి మాత్రమే.. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు'' అని న్యూజిలాండ్ బౌలర్ మెక్లీగన్ తెలిపాడు. చదవండి: CPL 2021: షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ Melts my heart 😟🥺 pic.twitter.com/2BIg68PfFV — Tony (@ProudSuriyaFan) September 1, 2021 -
స్టన్నింగ్ క్యాచ్ పట్టావ్.. క్రికెటర్ అయితే బాగుండు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్ సిక్సర్ల హోరుతో బర్మింగ్హమ్ ఫోనిక్స్ ఫైనల్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లివింగ్స్టన్ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు అద్బుత క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి స్టాండ్స్‌లోకి రావడంతో ఆ వ్యక్తి లేచి దానిని అందుకునే ప్రయత్నంలో సీటు నుంచి పక్కకు పడిపోయాడు. అయినా పట్టువిడవకుండా డైవ్ చేస్తూ సూపర్‌గా అందుకున్నాడు. ఇంకేముంది ప్రపంచాన్ని జయించానన్నట్లుగా అతను ఇచ్చిన హావభావాలు సూపర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. Great night of entertainment again in #TheHundred Only thing better than all of Liam Livingstone’s sixes have been the crowd catches at Headingley. Catch of the night here 👇🏻 pic.twitter.com/6oTte47nxp — Tom Hyland (@TomHyland4) August 17, 2021 -
లంక కెప్టెన్ షనక స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
కొలంబో: టీమిండియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో లంక కెప్టెన్ దాసున్ షనక స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. నితీష్ రాణా ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్బుతంగా అందుకున్నాడు. ఇన్నింగ్స్ 9 ఓవర్ చివరి బంతికి ఇది చోటుచేసుకుంది. షనక వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో అతని బ్యాట్‌కు తగిలి షనక వైపు వచ్చింది. అయితే షనక వేగంగా పరిగెత్తుకొచ్చి ఒకవైపుగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఇక షనక తానే బౌలింగ్ చేసి.. ఆ తర్వాత క్యాచ్‌ను అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. లంక బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది.. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఏడుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో ధావన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. లంక బౌలర్ వినిందు హసరంగ 4 వికెట్లతో దుమ్మురేపగా.. దాసున్ షనక రెండు వికట్లు తీశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఎనిమిది వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి. EXTRAORDINARY GRAB 🤯 Dasun Shanaka with a 🔥 return catch to get rid of Rana 💪 Tune into #SonyLIV now 👉 https://t.co/1qIy7cs7B6 📺📲#SLvsINDonSonyLIV #SLvIND #NitishRana #Wicket pic.twitter.com/fVhbmGFkXr — SonyLIV (@SonyLIV) July 29, 2021 -
ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్; వీడియో వైరల్
సెంట్ లూసియా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను హెడెన్ వాల్ష్ వేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఆరోన్ ఫించ్ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా భారీషాట్ ఆడాడు. అది సిక్స్ అని అంతా భావిస్తున్న తరుణంలో ఫాబియెన్ అలెన్ కొన్ని గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ ఎడమ చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే ఫించ్ బిక్కమొహంతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబందించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి ముందు కూడా అలెన్ మూడో టీ20లోనూ ఇలాంటి మాదిరి ఫీట్‌ను నమోదు చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీసీ అలెన్ పట్టిన కొన్ని అద్భుత క్యాచ్‌లను వీడియో రూపంలో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విండీస్ బ్యాటింగ్‌లో ఎవిన లూయిస్( 79, 34 బంతులు; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. పూరన్ 31, గేల్ 21, సిమన్స్ 21తో అతనికి సహకరించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఆరోన్ ఫించ్ 34, మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశారు. What a catch from Fabian Allen pic.twitter.com/w5F042PlSe — William Mitchell (@news_mitchell) July 17, 2021 Simply ridiculous🤯 An out of this world catch by @FabianAllen338 🦸♂️#WIvAUS | https://t.co/9eurWAvjaF pic.twitter.com/Kmz8Hlma0J — ICC (@ICC) July 17, 2021 -
ఆటగాడి క్యాచ్‌కు అభిమానులు ఫిదా; నీ తెలివి సూపర్
సెంట్ లూసియా: విండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ క్యాచ్‌తో అలరించాడు. ముందు బౌలింగ్‌లో కీలకమైన మిచెల్ మార్ష్ వికెట్ తీసిన అతను ఆ తర్వాత రెండు క్యాచ్‌లతో మెరిశాడు. అందులో ఒకటి బౌండరీ లైన్ వద్ద మరొక ఆటగాడిని సమన్వయం చేసుకుంటూ అలెన్ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హెడెన్ వాల్స్ వేసిన ఐదో బంతిని కెప్టెన్ ఆరోన్ ఫించ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అది సిక్స్ అని అంతా భావిస్తున్న తరుణంలో లాంగాన్.. అటు మిడ్ వికెట్ నుంచి బ్రేవో, అలెన్‌లు పరిగెత్తుకొచ్చారు. అయితే బ్రేవో అప్పటికే బంతిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయగా.. అతని చేతుల నుంచి జారింది. ఇంతలో సమయస్పూర్తితో వ్యవహరించిన అలెన్ బంతికి కాస్త దూరంలో ఉన్నా తన కాళ్లను స్ట్రెచ్ చేస్తూ అందుకున్నాడు. అంతే ఫామ్‌లో ఉన్న ఫించ్ పెవిలియన్‌కు చేరగా.. విండీస్ క్రికెటర్లు సంబరాల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్డ్ హిట్టర్ గేల్ సునామీతో విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. గేల్(38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడడంతో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సహకరించాడు. దీంతో విండీస్ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో హెన్రిక్స్ 33, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 30 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 3, ఆండీ రసెల్ 2 వికెట్లు తీశారు. ఇక గేల్ ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. What a catch!! #WIvAUS #WIvsAUS pic.twitter.com/q5Ma0zq1Yt — Paul Kneeshaw (@Stick_Beetle) July 13, 2021 -
ఆ క్యాచ్‌కు ప్రధాని కూడా ఫిదా అయ్యాడు..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చేరారు. గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పురుష క్రికెటర్లను తలదన్నే రీతిలో బంతిని ఒడిసి పట్టుకొని ఔరా అనిపించింది. ఈ సూపర్ డూపర్ క్యాచ్‌పై దిగ్గజ క్రికెటర్లు, ఆనంద్ మహీంద్ర వంటి బిజినెస్ టైకూన్స్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా అయ్యానన్నారు. తన ఇన్‌స్టా స్టోరీలో అసాధారణ క్యాచ్ అంటూ హర్లీన్ డియోల్‌ను ప్రశంసించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా శిఖా పాండే వేసిన 19 ఓవర్లో అమీ జోన్స్ (43 ) ఆడిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ అత్యద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకుంది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పురుష క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్నెస్, క్రీడా నైపుణ్యం సాధించారంటూ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ ఈ ఒక్క క్యాచ్‌తో హర్లీన్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఇదే అత్యుత్తమ క్యాచ్ అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. క్రికెట్ మైదానంలో చూసిన క్యాచ్లలో ఇదొక గొప్ప క్యాచ్, టాప్ క్లాస్ ఫీల్డింగ్ అంటూ కామెంట్ చేశాడు. -
అబ్దుల్ సమద్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. విజయ్ శంకర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతిని సామ్సన్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ మీదున్న అబ్దుల్ సమద్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ క్యాచ్‌ను నేర్పుగా అందుకున్నాడు. కొంచెం అటూ ఇటైనా సమద్ బౌండరీలైన్‌ను తొక్కేసేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బట్లర్ సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 64 బంతుల్లో 124 పరుగులు చేసిన బట్లర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సామ్సన్ 48 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. Abdul Samad's ice-cool catch https://t.co/GBrXLRclRW — varun seggari (@SeggariVarun) May 2, 2021 -
రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
అహ్మదాబాద్: కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. రవి తాను ఉన్న స్థానం నుంచి కొన్ని గజాల దూరం ముందుకు పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అర్షదీప్ వేసిన బంతిని నరైన్ డీప్‌మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న రవి బిష్ణోయ్ క్యాచ్ అందుకోవడం కాస్త కష్టతరంగా ఉన్నా.. కొన్ని గజాలు ముందుకు పరిగెత్తి డైవ్ చేసి క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. దీంతో నరైన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. చదవండి: హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు Incredible catch from Ravi Bishnoi! pic.twitter.com/jSlXcodO75 — Anurag ☮️😷 (@anuragb0rah) April 26, 2021 -
వారెవ్వా.. క్రిస్టియన్ సూపర్ స్టన్నింగ్ క్యాచ్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఫీల్డర్ డేనియల్ క్రిస్టియన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న గిల్ జేమిసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి మిడాన్ దిశగా వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ వేచివున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ క్రిస్టియన్ ఒకవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కేకేఆర్ 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్టియన్ స్టన్నింగ్ క్యాచ్ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. -
సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్
ముంబై: రవీంద్ర జడేజా.. ఫీల్డింగ్‌లో ఉన్నాడంటే బంతి అతని చేయి దాటి వెళ్లడం అసాధ్యం. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా తన ఫీల్డింగ్ పవర్ ఏంటో మరోసారి రుచి చూపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక కళ్లు చెదిరే క్యాచ్.. ఒక మెరుపు రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. మొదట చహర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ ఐదో బంతిని గేల్ ఫ్లిక్ చేశాడు. అయితే గేల్ రన్ కోసం సిగ్నల్ ఇవ్వడంతో రాహుల్ అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు. దీంతో గేల్ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. ఈ దశలో మెరుపువేగంతో స్పందించిన జడేజా డైరెక్ట్ త్రో విసరడంతో రెప్పపాటులో బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అలా రాహుల్‌ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్‌కు చేర్చిన జడ్డూ ఆ తర్వాత గేల్‌ను ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపించాడు. దీపక్ చహర్ వేసిన 5వ ఓవర్ రెండో బంతిని గేల్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశలో ఆడాడు. అయితే అప్పటికే అక్కడ కాచుకు కూర్చున్న జడేజా పాదరసంలా కదిలి ఒకవైపుగా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అలా ఇద్దరు కీలక ఆటగాళ్లను ఔట్ చేయడంలో జడ్డూ కీలకపాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ బాధ్యతాయుతంగా ఆడి 47 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ ఆ మాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది. ఇక సీఎస్కే బౌలర్లలో దీపక్ చహర్ (4-1-13-4)తో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. బ్రావో, సామ్ కరన్, మొయిన్ అలీ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: మొదట రనౌట్ చేసినందుకు.. తర్వాత మ్యాచ్ గెలిచినందుకు సంజూ సూపర్ క్యాచ్.. బిక్కమొహం వేసిన ధావన్ "Ravindra Jadeja is the Best fielder in the World. You cannot take a runs against Ravi Jadeja as fielder." - Gautam Gambhir#jadeja #CSKvPBKS @imjadeja | @GautamGambhir Bapu Rocks! pic.twitter.com/7kXIBC8HmO — Akshayrajsinh Mahendrasinh Sarvaiya (@AkshayrajsinhS) April 16, 2021 #CSKvPBKS #MSDhoni Sir Jadeja has mastered the art of fielding. His squad can always rely on him for catching a ball. He has also shown off his fielding skills in the field too. Undoubtedly, he is one of the finest fielder First with run out, second with this catch! Wonder. pic.twitter.com/mRpL3OhJFI — Fenil Kothari CA (@fenilkothari) April 16, 2021