సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. సూపర్‌మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ | Will Young plucks a single handed stunner Catch | Sakshi
Sakshi News home page

SA vs NZ: సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. సూపర్‌మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ.. వీడియో వైరల్‌

Published Tue, Mar 1 2022 1:33 PM | Last Updated on Tue, Mar 1 2022 8:05 PM

Will Young plucks a single handed stunner Catch - Sakshi

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఫీల్డర్‌ విల్‌ యంగ్‌ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 79 ఓవర్‌ వేసిన గ్రాండ్‌హామ్‌ బౌలింగ్‌లో.. జాన్సెన్‌ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బౌండరీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న యంగ్‌.. పరిగెత్తుకుంటూ వెళ్లి సింగ్‌ హ్యండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. యంగ్‌ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన జాన్సెన్‌ నిరాశగా పెవిలియన్‌ వైపు నడిచాడు.

కాగా యంగ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో డివాన్‌ కాన్వే (92),టామ్‌  బ్లాండల్‌(44) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకున్నట్లైంది.

చదవండి: Nicholas Pooran: 37 బంతుల్లోనే శతకం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఊరటనిచ్చే అంశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement