viral vedio
-
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
ఏంటి రాహుల్.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్‌ను కోల్పోయాడు.అసలేం జరిగిందంటే?భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు. "Don't know what he was thinking!"Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024 -
Video: బాలీవుడ్ పాటకు యూఎస్ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. #WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH— ANI (@ANI) October 30, 2024 -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
ఓర్నీ.. క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్లతో కొట్టుకున్న ప్లేయర్లు(వీడియో)
క్రికెట్.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన విషయం అందరికి తెలిసిందే. కానీ క్రికెట్ టోర్నమెంట్లో ఆ పేరుకే మాయని మచ్చ తీసుకువచ్చారు. ఓ మ్యాచ్‌లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అంపైర్లు ఆపినా కూడా బ్యాట్లతో మరి కొట్టుకున్నారు. ప్రొఫిషనల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. అస్సలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ టోర్నీ ఏదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఏం జరిగిందంటే?ఎంసీసీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్.. ఎంసీసీ వీక్డేష్ బాష్ XIX పేరిట ఓ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీకి యూఏఈలోని ఆజ్మల్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్‌లో చివరి బంతికి కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే కాషిఫ్ను ఔట్ చేసిన తర్వాత బౌలర్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ అతడిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు.అతడి వైపు చేతి వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. కాషిఫ్ కూడా అతడి వ్యాఖ్యలకు స్పందిస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరు జట్ల నుంచి ఆటగాళ్ల సైతం తమ ప్లేయర్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ మరింత తీవ్రమైంది. ఒకరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్లతో కూడా కొట్టుకున్నారు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I— Sameer Allana (@HitmanCricket) September 25, 2024 -
ఓర్నీ.. ఇదేమి సెలబ్రేషన్స్ రా బాబు! అంపైర్‌ను భయపెట్టాడు(వీడియో)
జింబాబ్వే దేశీవాళీ క్రికెట్ టోర్నీ నేషనల్ వన్డే కప్-2024లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఓ జింబాబ్వే క్రికెటర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. సదరు బ్యాటర్ ఓవరాక్షన్ కారణంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ కాలికి గాయమైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఓగో రేంజర్స్, రెయిన్ బో 1 క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఓగో రేంజర్స్ నిర్ణీత 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెయిన్బో 1 క్రికెట్ క్లబ్ సరిగ్గా 44.5 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. దీంతో రెయిన్ బో జట్టు విజయానికి ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఓగో రేంజర్స్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన బంతిని ఫ్రాన్సిస్ సాండే అద్భుతమైన సిక్స్ కొట్టి రెయిన్బో క్రికెట్ క్లబ్‌కు విజయాన్ని అందించాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న మ్యాచ్‌ను గెలిపించిన సాండే అతి చేశాడు. సిక్స్ కొట్టిన వెంటనే తన బ్యాట్‌ను బలంగా నాన్‌స్ట్రైక్ వైపు విసిరాడు. దీంతో ఆ బ్యాట్ కాస్త అంపైర్ కాలికి తాకింది. అంపైర్ నొప్పితో కాసేపు విల్లవిల్లాడు. కానీ ఫ్రాన్సిస్ సాండే మాత్రం అంపైర్‌కు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు కావాలనే తన బ్యాట్‌ను అంపైర్ విసిరాడని కామెంట్లు చేస్తున్నారు. The 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 dishes out sissling hot action! 🙌🏻Rainbow wanted 4 runs off the last ball against SOGO Rangers 🎥#NPL2024 pic.twitter.com/oj0bwT1X4Q— Zimbabwe Cricket Domestic (@zcdomestic) July 31, 2024 -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్‌లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్‌ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
నన్ను గేలి చేశారు.. అవమానించారు.. కెప్టెన్ వల్లే ఇలా!
‘‘గత ఆరు నెలల కాలం భావోద్వేగేలా సమ్మేళనం. ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ప్రేక్షకులు నన్ను ఏడిపించారు. నన్ను తమవాడిగా అనుకోలేకపోయారు.ఎన్నో జరిగాయి. వాటన్నింటికీ ఆటతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నాను. కఠినంగా శ్రమిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని.. గట్టిగా నమ్మాను.విమర్శలపాలైనపుడు మౌనాన్నే ఆశ్రయించాను. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆటను వదిలేది అని నిర్ణయించుకున్నాను.గెలిచినా.. ఓడినా.. మనమేంటో మైదానంలోనే నిరూపించాలి. కెప్టెన్, కోచ్, సహచర ఆటగాళ్ల మద్దతు లభించింది. పూర్తిస్థాయిలో టోర్నీ కోసం సన్నద్ధమయ్యాను.అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసే అవకాశం రావడం.. అంచనాలు అందుకుని జట్టు విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చింది.నిజానికి సూర్య సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అతడు క్యాచ్ పట్టిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నా.. నేను మాత్రం సూర్య దానిని ధ్రువీకరించిన తర్వాతే సంబరాలు చేసుకున్నా.మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అదే’’ అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషిస్తున్న సమయంలో గత ఆర్నెళ్లుగా తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలనుకున్నానని.. టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తనకు ఆ అవకాశం వచ్చిందని హార్దిక్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్ పాండ్యాకు కాలం కలిసి రాలేదు.రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని దారుణంగా అవమానించారు. మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హేళన చేశారు. కెరీర్ పరంగా ఇలా ఉంటే.. వ్యక్తిగతంగానూ భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలంటూ వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుత ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక జగజ్జేతగా అవతరించిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీని కలిసింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. #WATCH | During his interaction with PM Modi, Cricketer Hardik Pandya said, "...Last 6 months have been very entertaining for me, there have been a lot of ups and downs and the public booed me. A lot of things happened and I always felt that if I give any answer, it would be… pic.twitter.com/bzti1hNUKu— ANI (@ANI) July 5, 2024 -
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్‌గా మారింది.😂😂pic.twitter.com/yp5QDTfMVc— Figen (@TheFigen_) June 19, 2024 తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుఉంది. -
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
నాన్న (బ్రెయిన్ టీబీ) అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లి ఇక్కడ ఉండలేనంటూ సొంత ఊరికి (పంజాబ్) వెళ్లిపోయింది. దీంతో ఒంటరి అయిపోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. నాన్న చనిపోయి నెలరోజులైనా కాకుండానే బాధ్యతను భుజానకెత్తు కున్నాడు. నాన్న నేర్పిన విద్యనే ఎంచుకున్నాడు. కేవలం పదేళ్లకే స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ని నడుపుతూ దైర్యంగా జీవిస్తున్నాడు. తన 14 ఏళ్ల అక్కకు కూడా కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆ దైర్యం పేరే జస్ప్రీత్. చదువుకుంటూనే, ఈ సెంటర్ నడుపుతూ ఉండటం విశేషం. ‘‘జబ్‌తక్ హిమ్మత్ హై.. తబ్ తక్ లడూంగా’’ అంటున్న ఆ కుర్రవాడి కళ్లలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం నెటిజనులకు ఆకట్టుకుంటోంది. After Kids Video Went Viral On Different SM Platforms, Help And Support For Kid Is Pouring Out Huge...Y'day @JarnailSinghAAP Reached The Kid And Assured Eveey Possible Help And Support For Him.Thank You Everyone For Sharing Such Videos, You Friends Are A Huge Support.🙏❤️ https://t.co/8DKP3G7QlF pic.twitter.com/Rs3sCnM5al— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) May 3, 2024 పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఈ సెంటర్ నడుపుతున్న జస్ప్రీత్ వీడియోను ఫుడ్ వ్లాగర్ సరబ్జీత్ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. చికెన్ ఎగ్ రోల్, కబాబ్ రోల్, పన్నీర్ రోల్...ఇలా రుచికరమైన పదార్థాలను అలవోకగా చేసి కస్టమర్లకు అందిస్తాడు. జస్ప్రీత్కు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరలవుతోంది.ఈ వీడియో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర వరకూ చేరింది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ఆ బాలుడి ధైర్యానికి దృఢ సంకల్పానికి ఫిదా అయిపోయారు. అతని కాంటాక్ట్ నంబరు తెలిస్తే జస్ప్రీత్కు సాయం చేస్తానంటూ ప్రకటించారు. అతని చదువు దెబ్బ తినకూడదు. మహీంద్రా ఫౌండేషన్ బృందం, అతని విద్యకు ఎలా మద్దతు ఇవ్వగలదో ఆలోచిస్తుంది. దయచేసి జస్ప్రీత్ వివరాలను అందింగచలరు అంటూ ఎక్స్ లో పోస్ట్(ట్వీట్) చేశారు.Courage, thy name is Jaspreet. But his education shouldn’t suffer. I believe, he’s in Tilak Nagar, Delhi. If anyone has access to his contact number please do share it. The Mahindra foundation team will explore how we can support his education.pic.twitter.com/MkYpJmvlPG— anand mahindra (@anandmahindra) May 6, 2024మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జస్ప్రీత్ భారీ మద్దతు లభిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా స్పందించారు. తగిన సాయం అందిస్తానని ప్రకటించారు. -
ఈజీ మనీ, క్రేజీ బోయ్: ఈ వీడియో చూస్తే మీకు పిచ్చెక్కుద్ది!
ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే దూకుడు సినిమా డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే.. ది ఇన్స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. పలు నగరాల్లో డివైడర్ కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే, స్మార్ట్ ఐడియా ఇలా పలు కమెంట్లు సందడి చేస్తున్నాయి. Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk — The Instigator (@Am_Blujay) March 19, 2024 -
‘ఈ జీవితానికి ఇది చాలు’ : ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెటిజన్లు హృదయాల్ని హత్తుకునేలా ఓ వీడియోని షేర్ చేశారు. వీడియో పాతదే. కానీ అందులో ఓ పదేళ్ల బాలుడు ఉన్నట్లు తన మనవళ్లు కూడా ఉంటే ఈ జీవితానికి ఇది చాలు అని అర్ధం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? హృదయాల్ని హద్దుకునేలా ఆ వీడియోలో ఏముంది? ఈ సంఘటన 2022లో జరిగిన అర్జెంటీనా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లోనిది. ఈ మ్యాచ్‌లో బోకా జూనియర్స్తో ఓడిపోయిన తర్వాత డిఫెన్సా వై జస్టిసియా టీం గోల్ కీపర్ ఎజెక్వియెల్ అన్‌సైన్ ఓటమి తట్టుకోలేక తన రెండు చేతుల్ని మైదానానికి వేసి గుద్దుతున్నాడు. అది చూసిన ఓ పదేళ్లు బాలుడు అయ్యో పాపం అనుకుంటూ తనని ఓదార్చేందుకు గ్రౌండ్లోకి దూసుకు వచ్చాడు. అనంతరం ఎజెక్వియెల్ను హత్తుకుని ఓదార్చాడు. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అలాగే ‘నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను’ అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. This little boy apparently ran on to the pitch after a match to console the losing goalkeeper. My 2 young grandsons will soon be visiting us & I would wish for nothing more than for them to have hearts as empathetic & large as this kid’s.. pic.twitter.com/fQ3uLbHo97 — anand mahindra (@anandmahindra) February 11, 2024 -
సరదాగా పిక్నిక్ వెళ్తే ఏం జరిగిందంటే.?
-
Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు
టోక్యో: ఉత్తర జపాన్ బీచ్‌లో వేలాది చేపలు మృతి చెందాయి. జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడోలోని హకోడేట్లో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సముద్ర కెరటాలను కమ్మేసిన మృతి చెందిన చేపలు చూసిన అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ చేపలను తినకూడదని స్థానికులకు తెలిపారు. చేపల మరణానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలతో కూడిన నీటిని విడుదల చేయడమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. Massive number of dead fish washing up along the coast of northern Japan pic.twitter.com/xeCn4yv5xB— DeepCoverPatriot☦️ (@samuelculper3rd) December 7, 2023 ఈ ఏడాది అక్టోబర్‌లో జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం నుండి మురుగునీటిని విడుదల చేసింది. ఈ చర్యను చైనా ఖండించింది. 2011 నుండి సేకరించబడిన 1.34 మిలియన్ టన్నుల మురుగునీటిలో కొంత భాగాన్ని పసిఫిక్‌లోకి జపాన్ మొదటిసారి ఆగష్టు 24న విడుదల చేసింది. మార్చి 2011లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా పవర్ ప్లాంట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి -
ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సౌత్,నార్త్ నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన ప్రభాస్ సినిమాలు కాస్త నిరాశపర్చినా ఆయనపై అభిమానం కూసింత కూడా వారిలో తగ్గలేదు. ముఖ్యంగా తన ఫ్యాన్స్‌ను ప్రభాస్ ఎక్కడా నిరుత్సాహపరచడు. అడిగినవారందరికీ సాయం చేయడమే కాకుండా ఎప్పుడూ వారికి పెద్ద పీట వేస్తాడు. అందుకే ఆయన అంటే ఫ్యాన్స్‌కు కూడా ఎనలేని అభిమానం. (ఇదీ చదవండి: సినిమా ఛాన్సుల కోసం దేవయాని ఇలాంటి తప్పులు చేసిందా .. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి. ఎయిర్‌పోర్టులో డార్లింగ్‌ను గుర్తించిన ఆ యువతి ఫోటో దిగిన అనంతరం ప్రభాస్ చెంపపై తన చేతితో ప్రేమగా కొడుతుంది. ఆ క్షణం తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు. అప్పుడు ప్రభాస్ కూడా నవ్వుతూ ఆనందించాడు. ఆమె ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు, ముఖ్యంగా ప్రభాస్.. వీడియోలో, గందరగోళంగా చిరునవ్వు అందరినీ కట్టిపడేసింది. యాదృచ్ఛికంగా మరికొద్దిరోజుల్లో ప్రభాస్ సలార్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రభాస్‌కు సంబంధించిన పలు వీడియోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 22న సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పుడు షారుక్ ఖాన్ డుంకీ సినిమాతో పోటీ పడుతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) View this post on Instagram A post shared by telugutiktokofficial (@telugutiktok_official) -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట
పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl — Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. सोशल मीडिया पर नालन्दा जिला अंतर्गत दो पुलिस कर्मियों के बीच विवाद का वायरल विडिओ पर पुलिस अधीक्षक, नालन्दा के द्वारा संज्ञान लेते हुए दोनों पुलिस कर्मियों को पुलिस केंद्र वापस किया गया है और जांच का आदेश दिया गया है।(1/2) . .#BiharPolice #HainTaiyaarHum #Bihar — Bihar Police (@bihar_police) September 18, 2023 ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
వెడ్డింగ్ ఫంక్షన్ కాస్త రెజ్లింగ్ అడ్డాగా మారింది..!
ఇస్లామాబాద్:పాకిస్థాన్‌లో ఓ వెడ్డింగ్ ఫంక్షన్ రెజ్లింగ్ అడ్డాగా మారింది. వేడుకకు వచ్చిన అతిథులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కుర్చీలు, ప్లేట్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. తినుబండారాలు చెల్లాచెదురుగా విసిరారు. ఈ వీడియో ట్విట్టర్(ఎక్) లో ఓ యూజర్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. వేడుకకు వచ్చిన అతిథులందరూ భోజనంలో పాల్గొన్నారు. మగవారికి ఓ వైపు మరొవైపు ఆడవారికి ఏర్పాట్లు చేశారు. బంధువులందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ డైనింగ్ టేబుళ్లపై ఉన్న ఆహారాన్ని ఆరగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరోవ్యక్తి టోపీని తిప్పాడు. అంతే.. గొడవ ప్రారంభమైంది. బంధువులు రెండు వర్గాలుగా వీడి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వేడుకలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. Kalesh during marriage ceremony in pakistan over mamu didn’t got Mutton pieces in biriyani pic.twitter.com/mYrIMbIVVx — Ghar Ke Kalesh (@gharkekalesh) August 29, 2023 ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 3,33000 వ్యూస్ వచ్చాయి. ఫంక్షన్లో చికెన్ ముక్క సరిపోట్లేదా..? అని ఓ యూజర్ ఫన్నీగా ప్రశ్నించారు. పాపం ఆ పెళ్లి చేసుకున్న వరుడు-వధువు పరిస్థితి ఏంటో..? అంటూ మరొకరు స్పందించారు. వేలు ఖర్చు చేసి ఫంక్షన్ చేస్తే నాశనం చేశారు కదరా..? అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ -
'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలిగ్రామ్ ఛానల్లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు. వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్(ఎక్స్) లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్‌లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death. "So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi — Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023 రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్‌పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
దారుణం: డాక్టర్ని ఢీకొట్టి.. కారుతో లాక్కెళ్లి..
చంఢీగర్: హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ డాక్టర్ని కారుతో దాడి చేసి 50 మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లారు దుండగులు. పంచకుల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. గగన్ తన కుమారున్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కారు అతన్ని ఢీ కొట్టింది. గగన్ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోమ్‌పై అతన్ని అలాగే ఉంచి ముందుకు దూసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల వరకు కారుతోపాటు లాక్కెళ్లారు దుండగులు. #Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6 — mishikasingh (@mishika_singh) August 28, 2023 తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ప్రభుత్వ ఆఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్
క్రికెట్ అనేది వయస్సుతో సంబంధం లేని క్రీడ. ఆడాలనే తపన ఉంటే ఏ వయస్సులోనైనా మైదానంలో అడుగుపెట్టవచ్చు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆటను ఆస్వాదించవచ్చు. తాజాగా స్కాట్లాండ్ మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ కూడా అదే చేసి చూపించాడు. 83 ఏళ్ల వయస్సులో కూడా క్రికెట్‌పై తన మక్కువను చాటుకున్నాడు. ఓ వైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. క్రికెట్ మైదానంలో సందడి చేశాడు. ఓ స్థానిక క్లబ్ మ్యాచ్‌లో తన వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి అతడు వికెట్ కీపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి ఆటపై ఉన్న అంకితభావం పట్ల సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అలెక్స్ 2020లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతడు అక్సిజన్ సపోర్ట్‌తోనే తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత 3 నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది. ఇక స్టీల్ 1967లో స్కాట్లాండ్ తరపున ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో లాంక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీల్..621 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఐర్లాండ్‌పై సాధించనివే. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు ఉన్నాయి. చదవండి: IND vs AUS: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు! View this post on Instagram A post shared by Cricketgraph (@cricketgraph) -
ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్రా బాబు! పాపం పృథ్వీ
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్ తరపున అరంగేట్రం చేశాడు. శుక్రవారం రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే విచిత్రమైన రీతిలో పృథ్వీషా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన పృథ్వీషా హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? నార్తాంప్టన్‌షైర్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో గ్లౌసెస్టర్షైర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆఖరి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని ఫుల్‌షాట్ ఆడిబోయిన పృథ్వీ.. తన నియంత్రణను కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి షూ స్టంప్స్‌కు తాకింది. దీంతో ఊహించని రీతిలో పృథ్వీ షా హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ఔట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "ఏంటి భయ్యా నీ అదృష్టం, ఎక్కడ ఆడినా ఇంతేనా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీ షా.. తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలోనే నార్తాంప్టన్‌షైర్‌తో జతకట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా పృథ్వీ షా తీవ్ర నిరాశపరిచాడు. చదవండి: Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్! అలా ప్రపంచంలో నం.1గా.. HIT WICKET!!!! 🚀 Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34. Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy — Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023 -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్‌గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్‌గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కొలంబో వేదికగా గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చింది. దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము మైదానంలోకి ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. ఒక్క సారిగా ఆటగాళ్లు పామును చూసి ఉలిక్కిపడ్డారు. అంపైర్లు వెంటనే స్టేడియం భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్లో దంబుల్లాపై గాలే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గాలే బ్యాటర్లలో భానుక రాజపక్స (48), కెప్టెన్ దాసున్ షనక (42 నాటౌట్) రాణించారు. అనంతరం లో దంబుల్లా కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గాలె టైటాన్స్ కేవలం రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసి విజయం సాధించింది. సూపర్ ఓవర్లో గాలె ఓపెనర్ రాజపాక్స వరుసగా సిక్స్ ఫోర్ బాది తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు Hello, stranger. Where is your accreditation card? 🐍 Even the Sri Lankan wildlife can't resist the action at the LPL! 🏏#LPL2023 #LiveTheAction pic.twitter.com/R9Fa5k1D3p — LPL - Lanka Premier League (@LPLT20) July 31, 2023 -
క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్
టీ20 క్రికెట్లో ఆఫ్గాన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏకంగా 7 సిక్సర్లతో 42 పరుగులు రాబట్టి రికార్డులకెక్కాడు. ఆఫ్గానిస్తాన్ వేదికగా జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్ ఈ సంచలనానికి వేదికైంది. ఈ లీగ్‌లో షహీన్ హంటర్స్‌కు అటల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అబాసిన్ డిఫెండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హంటర్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో వేసిన అమీర్ జజాయ్ బౌలింగ్‌లో అటల్ ఈ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో జజాయ్ మొదటి బంతిని నోబాల్ వేయగా అటల్ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతి వైడ్ ఫోరు గా వెళ్ళింది. దీనితో బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన 6 బంతులను అటల్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 48 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 7 సిక్సర్లు, 1 నోబాల్, 1 వైడ్ అండ్ ఫోర్ వచ్చాయి. ఓవరాల్‌గా అటల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదడం ఇదే తొలి సారి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జజాయ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా షాహిన్ హంటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. 214 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక సెదీఖుల్లా అటల్ అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రుత్‌రాజ్ కూడా.. కాగా ఒకే ఓవర్లో 7 సిక్సర్ల కొట్టిన ఘనత అంతుకుముందు భారత యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ కూడా సాధించాడు. కానీ అది 50 ఓవర్ల ఫార్మాట్లో కావడం గమనార్హం. గతేడాది జయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర బౌలర్ శివసింగ్ వేసిన ఓవర్ లో రుతురాజ్ 7 సిక్సులు బాదాడు. తొలి ఆరు బంతులను సిక్సర్లగా మలిచిన రుతు.. ఆ ఓవర్ లో పడిన నోబాల్ ను స్టాండ్స్ లోకి పంపించాడు. 48 runs from 1 over. @Sediq_Atal26 is now in the cricketing history books. Equalled Rituraj Gaikwad's 7 sixes in an over. Poor Amir Zazai, almost escaped a heartache. This 💯 must open the doors of international cricket & leagues for Atal. 🇦🇫 #FutureStar #WorldRecord #SevenSixes pic.twitter.com/Ntt0lkZVUm — Cricket Afghanistan (@AFG_Sports) July 29, 2023 చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్ -
అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చెలరేగిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు రెండో టెస్టులో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ను విండీస్ స్పిన్నర్ వారికన్ ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. భారత ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన వారికిన్ బౌలింగ్‌లో ఐదో బంతిని రోహిత్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మిడిల్‌స్టంప్ దిశగా పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోవడంతో రోహిత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో టెస్టు మెదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(87 నాటౌట్) సెంచరీకి చేరువలో ఉన్నాడు. కోహ్లితో పాటు క్రీజులో రవీంద్ర జడేజా 36(నాటౌట్) ఉన్నాడు. చదవండి: WTC Points Table: అగ్రస్థానంలో రోహిత్ సేన.. పాకిస్తాన్ కూడా మనవెంటే! చాంపియన్ ఎక్కడంటే? "A real beauty from Warrican!" Rohit Sharma goes for 80! ❌ pic.twitter.com/kwYYL8iKT1 — Cricket on TNT Sports (@cricketontnt) July 20, 2023 -
గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..
నేపాల్‌కు చెందిన సైనికుడు అరుదైన గిన్నీస్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. కేవలం చేతులను మాత్రమే ఉపయోగించి 75 మెట్లను 25.03 సెకన్లలో కిందకు దిగి చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేగంగా మెట్లపై కిందకు దిగే పోటీకి ప్రపంచంలోనే మంచి ప్రజాధరణ ఉంది. అయితే.. ఇందులో ఇలా మెట్లను దిగడంలో కేవలం చేతులను మాత్రమే ఉపయోగించాలి. శరీర బరువు మొత్తం చేతులపై మోస్తూ మెట్లపై నుంచి కిందకు దిగాలి. ఇలా దిగే క్రమంలో బ్యాలెన్స్ మిస్ కాకుండా చూసుకోవడం చాలా కీలకం. ఈ పోటీలో ఇప్పటివరకు 30..8 సెకన్లతో అమెరికాకు చెందిన వ్యక్తిపై రికార్డ్ ఉంది. దీనిని ప్రస్తుతం నేపాల్‌కు చెందిన సైనికుడు హరి చంద్ర గిరి ఛేదించాడు. ఖాట్మండ్ లోయలో ఉన్న బుద్దిస్ట్ దేవాలయం జమ్చెన్ విజయ స్థూపంపై ఉన్న మెట్లపై హరి చంద్ర ఈ ఫీట్‌ను సాధించాడు. అయితే.. తాను 8 ఏళ్ల వయస్సు నుంచి చేతులపై నడిచే నైపుణ్యాన్ని సాధన చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ వేషధారణలో బాలుడు.. పార్కుకి వెళ్తే.. -
బీచ్ రోడ్లో 'బిగ్ బీ' పాటకు వృద్ధ జంట స్టప్స్.. నెటిజన్స్ ఫిదా..!
ముంబయి: 1971 నాటి మంజిల్ సినిమాలోని 'రిమ్జిమ్ గిరే సవాన్' పాట అందరికీ గుర్తింది కదా..! ముంబయి బీచ్ రోడ్లో తీసిన ఈ పాటలో అమితాబ్, మౌషుమి ఛటర్జీ ప్రదర్శించిన హృదయాన్ని హత్తుకునే సీన్స్ మరువలేనివి. అయితే.. తాజాగా అచ్చం అలానే ఓ వృద్ధ జంట అదే బీచ్‌లో ఆ పాటకు సీన్ టు సీన్ ప్రదర్శించి అందర్ని ఆకట్టుకున్నారు. ఈ వీడియోను మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వద్ధ జంట ముంబయి బీచ్‌లో చిరుజల్లులు పడుతుండగా.. రిమ్ జిమ్ గిరే సాంగ్‌కు తగ్గ స్టెప్పులు వేశారు. ఎంతో ప్రజాధరణ కలిగిన ఈ పాటలోని ప్రతీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. పాటలోని అమాయకత్వాన్ని ఏ మాత్రం మిస్ చేయకుండా.. చిన్నపిల్లలవలె గెంతులు వేస్తూ సీన్ సీన్ రిపీట్ చేశారు. This is justifiably going viral. An elderly couple re-enact the popular song 'Rimjhim gire sawan' at the very same locations in Mumbai as in the original film. I applaud them. They’re telling us that if you unleash your imagination, you can make life as beautiful as you want it… pic.twitter.com/wO7iJ3da3m — anand mahindra (@anandmahindra) July 2, 2023 ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర.. 'ఆనాటి బిగ్‌బీ తీసిన సినిమాలోని పాటకు అదే లొకేషన్స్‌లో వృద్ధ జంట సరైన స్టెప్పులు వేశారు. వారిని అభినందిస్తున్నా. మన కలల్ని నిజం చేసుకుంటే జీవితం ఇలానే అందంగా ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. వీడియోకు 15 వేల లైక్స్, 7 లక్షల వ్యూస్ వచ్చాయి. వర్షాకాల రొమాన్స్‌ను వృద్ధ జంట అందరికీ గుర్తు చేశారు.. వారు నిండు జీవితం గడపాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వయస్సు కేవలం నెంబర్ మాత్రమే.. మనలోని చిన్నపిల్లల తత్వాన్ని గుర్తు చేశారని మరొకరు కామెంట్ చేశారు. మానసికంగా వారు చాలా పరిపక్వత సాధించారు.. అందుకే ఈ రోజుని బాగా ఎంజాయ్ చేశారని ఇంకొకరు స్పందించారు. ఇదీ చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! సీనియర్ నటి సలహాలు -
40 మీటర్ల ఎత్తులో రోప్ ర్యాక్.. అమాంతం పడిపోయిన బాలుడు..
మెక్సికోలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రోప్స్ ర్యాక్‌లో ఆరేళ్ల పిల్లాడు 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు పిల్లాడు పడిపోయే ప్రదేశంలో చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పింది. మాంటెర్రేలోని ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో కుటుంబంతో అందరూ కలిసి వచ్చారు. ఈ క్రమంలో రోప్స్ ర్యాక్ సాహస క్రీడలో పాల్గొనడానికి పిల్లలు వెళ్లారు. అందులో ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్‌పై ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్‌పై వెళ్లాడు. ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే అబ్బాయి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడ కింద చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది. 🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA — Around the world (@1Around_theworl) June 26, 2023 స్వల్ప గాయాలతో బయటపడిన బాధితున్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోప్ ర్యాక్ నిర్వహణలో యాజమాన్యం సరిగా స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
మెట్రోలో మహిళ డ్యాన్సులు.. బాలీవుడ్ పాటకు స్టెప్పేస్తూ..వీడియో వైరల్..
ఢిల్లీ: మెట్రోలో డ్యాన్సులు చేయకూడదని అధికారులు ఎంత చెప్పినప్పటికీ ప్రయాణికులు వినిపించుకోవడం లేదు. మెట్రోలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోల ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన యువతి నేహా బాసిన్, బిప్పి లహరి పాడిన 'అసలామ్ ఈ ఇష్క్' పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బాగా డ్సాన్స్ చేశారని కొందరు మెచ్చుకోగా.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Angel (@pari_sharma2319) ఇదీ చదవండి:రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు.. -
పాకిస్తాన్ బ్యాటర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
రంజాన్ మాసం సందర్భంగా జరుగుతున్న ఘనీ రంజాన్ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటర్ ఉస్మా మీర్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో జీఐసీ జట్టుకు ఉస్మా మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం కరాచీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మా మీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న మీర్ 7 సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 66 పరుగులు చేశాడు. ముఖ్యంగా జీఐసీ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన బిలాల్‌కు మీర్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో అతడు.. 5 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఉస్మా మీర్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా జీఐసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది. కాగా ప్రతీ ఏడాది రంజాన్ నెల సమయంలో పాకిస్తాన్లో ఘనీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఇక ఉస్మా మీర్ పాక్ తరుపున ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. చదవండి: IPL 2023: యువ బౌలర్‌కు క్లాస్ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్ Usama mir on 🔥🔥🔥🔥 He scored 34 runs with 5 sixes and one 4 in an over.... What a bowler and what a clean hitter he is... Usama mir the real future of Pakistan cricket 😍❤️🙌🙌🙌🙌 Vc: @geosupertv@iamusamamir#PakistanCricket #ramzancricket pic.twitter.com/mwcxtVvPcy — Qadir Khawaja (@iamqadirkhawaja) April 2, 2023 -
పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. దెబ్బకు రక్తం వచ్చేసింది! వీడియో వైరల్
షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ ఇహ్సానుల్లా వేసిన ఓ బౌన్సర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని జద్రాన్ దవడ కింది బాగానికి బలంగా తాకింది. బంతి గట్టిగా తాకడంతో రక్తం కూడా కారింది. దీంతో మైదానంలో నజీబుల్లా తీవ్రమైన నొప్పితో మైదానంలో విలావిల్లాడు. వెంటనే ఫిజియో వెంటనే వచ్చి చికిత్స అందించినప్పటికీ అతడికి నొప్పి తగ్గలేదు. దీంతో అతడు మైదానం విడిచిపెట్టాడు. కాగా జద్రాన్ ఎదుర్కొన్న తొలి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గాయపడిన జద్రాన్ స్థానంలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అజ్మతుల్లా 20 బంతుల్లో 2 పోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులు చేశాడు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. కాగా ఆఫ్గాన్‌కు పాక్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. What a delivery by Ihsanullah, it had Zadran bleeding and also look at the reaction of Mohammad Haris behind the wicket, he has such a soft heart man! pic.twitter.com/GvAEoYKuLM — KH SAKIB 🇧🇩 (@Crickettalkss) March 27, 2023 చదవండి: AFG vs PAK: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! -
ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా లీగ్ కోసం ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలపెట్టాయి. ఆయా జట్లు తమ హాంగ్రౌండ్స్లో ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో సరికొత్తగా బరిలోకి దిగబోతున్న సర్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఉప్పల్ నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చోతుంది. ఆ జట్టు బ్యాటర్ హ్యారీ బ్రూక్ నెట్ ప్రాక్టీస్‌కు వీడియోను ఎస్ఆర్హెచ్ ట్విటర్లో షేర్ చేసింది. నెట్స్‌లో ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న బ్రూక్.. భారీ సిక్స్‌లతో విరుచుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2023 మినీవేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన సూపర్ ఫామ్‌ను ఐపీఎల్లో కూడా కొనసాగించాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: SL vs NZ: క్లియర్‌గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 -
క్లియర్‌గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కివీస్ పేసర్ల దాటికి కేవలం 76 పరుగులకే కూప్పకూలింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్, టిక్నర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి తీయడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. బంతిని అందుకున్న టిక్నర్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్కు చేశాడు. రిప్లేలో టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంలో ఉన్నాడు. దీంతో కరుణరత్నే ఔట్ అని అంతా భావించారు. అయితే ఇక్కడే కరుణరత్నేని అదృష్టం వెంటాడింది. బంతి స్టంప్స్ తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయం చూసిన కివీస్ ఆటగాళ్లు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రనౌట్ విషయంలో బెయిల్స్ వెలగకపోవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్ Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd — Spark Sport (@sparknzsport) March 25, 2023 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్
యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం సీవైఎంస్, డ్రీక్స్ హార్న్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీవైఎంస్పై 3 వికెట్ల తేడాతో డ్రీక్స్ హార్న్స్ విజయం సాధించింది. తద్వారా యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ ఫైనల్లో డ్రీక్స్ హార్న్స్ అడుగుపెట్టింది. 126 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రీక్స్.. 9.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వారెవ్వా.. సూపర్ క్యాచ్ ఇక ఈ మ్యాచ్‌లో సీవైఎంస్ ఆటగాళ్లు జాసన్ వాన్ డెర్ మెర్వ్, జాకబ్ ముల్డర్ అద్భుతమైన విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వీరిద్దరూ ఓ సంచలన క్యాచ్‌తో మెరిశారు. డ్రీక్స్ హార్న్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆడామ్ కెన్నడీ బౌలింగ్‌లో నబీ డిప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ మెర్వ్ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ రోప్‌కు దగ్గరగా ఉండటంతో బంతిని వాన్ డెర్ మెర్వ్ గాల్లోకి విసిరాడు. ఈ క్రమంలో జాకబ్ ముల్డర్ పరిగెత్తూ కుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన డ్రీక్స్ హార్న్స్ బ్యాటర్ బిత్తరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం! Is this one of the best team catches ever? Just when you thought you'd seen it all, Jason van der Merve and Jacob Mulder produce magic on the boundary! 😱🙌🏏@CIYMSCC #EuropeanCricket #ECL23 #StrongerTogether pic.twitter.com/G1Pj8imaE8 — European Cricket (@EuropeanCricket) March 24, 2023 -
సురేష్ రైనా సూపర్ సిక్సర్.. కొంచెం కూడా జోరు తగ్గలేదు! వీడియో వైరల్
లెజెండ్స్ లీగ్-2023లో భాగంగా బుధవారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇండియా మహారాజాస్ పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రైనా.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. మహారాజాస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పనేసర్ బౌలింగ్‌లో ఐదో బంతికి.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్స్ రైనా బాదాడు. ఈ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా తప్పుకున్నప్పటికీ అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది రైనా ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నారు. A classic @ImRaina shot! 🔥@IndMaharajasLLC #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/FtdhpF5B4U — Legends League Cricket (@llct20) March 15, 2023 -
ఆసీస్ బ్యాటర్‌పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రైజింగ్ స్టార్ షఫాలీ వర్మ తన సహానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ బెత్ మూనీపై కోపంతో షఫాలీ ఊగిపోయింది. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్‌లో.. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ మూనీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫాలీ వర్మ జారవిడిచింది. అనంతరం 12 ఓవర్లో శిఖాపాండే బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా మూనీ షాట్ ఆడింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షఫాలీ ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో షాఫాలీ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మూనీ వైపు వేలు చూపిస్తూ వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో షఫాలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: PSL 2023: పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్ Aggression of Shafali Verma. #INDWvsAUSW #ShafaliVerma pic.twitter.com/msTWcMrAx5 — Naveen Sharma (@iamnaveenn100) February 23, 2023 -
పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక సంచలన క్యాచ్‌ను అందుకున్న పొలార్డ్‌ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2 — PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023 -
రంజితమే సాంగ్.. కాలు కదిపిన కడుపులో బిడ్డ
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సినిమా వారసుడు(వారిసు). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలోని రంజితమే రంజితమే అంటూ సాగే సాంగ్ విజయ్ ఫ్యాన్స్‌తో పాటు థియేటర్లను ఓ రేంజ్లో ఊపేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను సైతం షేక్ చేసింది. అయితే ఈ పాటకు తాజాగా ఓ మహిళ కడుపులోని బిడ్డ సైతం కదలడం వైరల్‌గా మారింది. రంజితమే సాంగ్ ప్లే చేస్తున్నప్పడు ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న కదలడం కనిపించింది. దీంతో ఆ మహిళ ఆనందంతో మురిసిపోయింది. తన బిడ్డ డ్యాన్స్ చేయడాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది. ఈ వీడియోను చూసిన సంగీత దర్శకుడు తమన్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ వీడియో చూస్తుంటే చాలా మధురానుభూతికి లోనవుతున్నా.. ఇది నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసింది.' అని పోస్ట్ చేశారు. Such a divine feel How Cute this is made my day 🥹❤️ #Ranjithame 💃🤍🍭 https://t.co/3eRNztekDP — thaman S (@MusicThaman) January 14, 2023 -
కొంచెం చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్ మధ్యలోకి! వీడియో వైరల్
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తరుచూ ఏదో ఒక మ్యాచ్‌లో మన్కడింగ్( నాన్-స్ట్రైకర్స్ రనౌట్)ను మనం చూస్తునే ఉన్నాం. కొన్ని వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ దాదాపు మిడిల్ పిచ్ వరకు వెళ్లిపోయాడు. రౌనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. బౌలర్ మాత్రం కేవలం వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. అయితే పిచ్ మధ్య వరకు వెళ్లిన బ్యాటర్ మళ్లీ వెనుక్కి వచ్చే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. ఈ సంఘటన సైప్రస్ మౌఫ్లన్స్- పంజాబ్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "కొంచెం బంతిని చూసి వెళ్ల వచ్చుకదా" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడమ్ జంపా చేసిన మన్కడింగ్ తీవ్ర చర్చనీయాంశం అయింది. Incredible backing up🤯 #EuropeanCricket #EuropeanCricketLeague #ThrowbackECL22 pic.twitter.com/lZZroI2X3V — European Cricket (@EuropeanCricket) January 6, 2023 చదవండి: Rishabh Pant: రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ! -
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
బిగ్ బాష్ లీగ్-2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో మెల్బోర్న్ కెప్టెన్ నిక్ మాడిన్సన్(87) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. గాలి కారణంగా స్టంప్స్ పైన బెయిల్స్ పడితే ఔట్ అని మెల్బోర్న్ బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఏం జరిగిందంటే..? మెల్బోర్న్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో మార్క్ స్టెకెటీ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్‌ను.. మాడిన్సన్ బ్యాక్వర్డ్ స్క్వేర్-లెగ్ బౌండరీ వైపు షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే క్రమంలో స్టంప్స్ బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో అతడు స్టంప్స్‌ను తన కాలితో తాకడం వల్లే బెయిల్స్ కిందపడిపోయాయి అని అంతా భావించారు. మాడిన్సన్ కూడా హిట్ వికెట్ అయ్యాని భావించి డగౌట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడి ఔట్‌పై సందేహంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే స్టంప్స్‌కు మాడిన్సన్ బ్యాట్ గానీ, అతడి బ్యాక్‌ఫుట్ గానీ తాకనట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో బెయిల్స్ గాలికి పడి ఉంటాయిని భావించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కొద్ది నిమిషాలపాటు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What on earth??? Looks like the wind's knocked the bail off! Maddinson stays safe 😅@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/sboxGvIewA — KFC Big Bash League (@BBL) December 15, 2022 చదవండి: IND vs BAN: ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ .. 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
సచిన్ అరుదైన లాఫ్టెడ్ షాట్.. వీడియో వైరల్!
టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ కేవలం16 పరుగులే చేసినప్పటికి.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో మాత్రం అభిమానులను అలరించాడు. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో లాఫ్టెడ్తో షాట్‌తో మరోసారి తన క్లాస్‌ను లిటిల్ మాస్టర్ చూపించాడు. సచిన్ ఆ షాట్ కొట్టిన వెంటనే ఒక్క సారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9 — abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022 చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్!
ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం జరిగిన భారత్- హాంకాంగ్ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా.. ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్ క్యూట్ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది. అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సైతం ఇలాగే స్టేడియంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్‌లో వారి వివాహం జరిగింది. ఇదిలా ఉంటే... మ్యాచ్ విషయానికి వస్తే.. హాంకాంగ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు. She said YES! 😍💍 A heartwarming moment where Hong Kong's @shah_kinchit95 proposed to his SO after playing a big match against India 🥰 A huge congratulations to the happy couple. We wish you all the joy and happiness in your new life together ❤️#AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/CFypYMaPxj — AsianCricketCouncil (@ACCMedia1) August 31, 2022 చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
కిరాక్ వీడియో.. ట్రక్కును బయటకు తీస్తూ క్రేన్ గాల్లోకి ఎగిరి..
Crane Falls Off Bridge.. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి పడిపోయిన ట్రక్కును బయటకు తీసే క్రమంలో క్రేన్ బ్రిడ్జిపై నుండి పడిపోయింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాల్చేర్ పట్టణంలో వంతెనపై నుండి ఓ ట్రక్కు నీటిలో పడిపోయింది. దీంతో, ఆ ట్రక్కును బయటకు తీసేందుకు రెండు క్రేన్స్ అక్కడికి చేరుకున్నాయి. కాగా, రెండు క్రేన్ల సాయంతో బెల్టులను ఉపయోగించి ట్రక్కును పైకి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంతలో ఒక క్రేన్‌కు ఉన్న బెల్టు తెగిపోయింది. దీంతో, మరో క్రేన్పైనే ట్రక్కు బరువు మొత్తం పడటంతో సదరు క్రేన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. అనంతరం ఒక్కసైడ్కు ఒరిగి.. బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిపోయింది. అయితే, ప్రమాదంలో క్రేన్లోని డ్రైవర్ సమయ స్పూర్తితో నీటిలో దూకాడు. దీంతో, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Viral video: రోడ్డుపై గొడ్డలితో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్!
చండీగఢ్: రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయటం అంత సులభమైన పనేమి కాదు. నిత్యం ఎండలో నిలబడి ట్రాఫిక్ సూచనలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా.. రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఈ వీడియోలో.. ఓ బైక్‌పై ముగ్గురు యువకులు రాగా.. వారి వైపు గొడ్డలితో దూసుకెళ్లారు పోలీసు. వారిని కాలితో తన్నుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం, ముగ్గురు ఎక్కటంతో అలా చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడ్డలి పట్టుకుని బైక్‌పైన ఉన్న వారిని బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ గద్దరించారు. మంగళవారం ఉదయం ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ దర్యాప్తునకు ఆదేశించాం. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నట్లు తెలిసింది. నిజానిజాలు వెల్లడైన తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని హర్యానా పోలీస్ ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు -
మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా థింక్ చేస్తుంటారు. ఇందుకోసం స్పెషల్ ఫీట్స్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఈ కేటగిరికి చెందిన ఓ వీడియో తాజాగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇటీవలే వచ్చిన జిగల్ జిగల్ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొందరు నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్ విసురుతున్నారు. తన ఫ్రెండ్ విసిరిన ఛాలెంజ్‌ను ఆక్సెప్ట్ చేసిన ఢిల్లీకి చెందిన ఓ యువతి ట్రెండీగా ఆలోచించింది. ఢిల్లీ మెట్రో రైలులో జిగల్ జిగల్ డ్యాన్స్ చేసి.. ఛాలెంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by kashika (@kashikabassi) కాగా, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీంతో వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక, జిగల్ జిగల్ డ్యాన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ నడుస్తోంది. వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆమె వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మెట్రోలో డ్యాన్స్ చేయాలంటే ఎంతో కరేజ్ ఉండాలి అంటూ కామెంట్ చేశాడు. [TIKTOK] 220528 #ROSÉ Tiktok update with #JENNIE & #LISA 블랙핑크 @BLACKPINK pic.twitter.com/BXWbjvN6mF — Worldwide BLIИK 🌷 (@WorldwideBLINK) May 28, 2022 My favorite female artist Shakira dancing to a song called my money don't jiggle jiggle on the Tonight show with Jimmy Fallon she absolutely killed it ♥️♥️🔥🔥@shakira ♥️♥️🔥🔥 pic.twitter.com/zHR1JEkQLj — Vanessa Mendes (@vanessa_ban2) May 20, 2022 View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) ఇది కూడా చదవండి: నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హైబ్రిడ్ భరతనాట్యం -
Victory Day: పుతిన్‌కు షాక్.. రష్యా అంబాసిడర్‌పై దాడి
వార్సా: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నవేళ రష్యా విక్టరీ డే(మే 9వ తేదీ) సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యా విక్టరీ డే సందర్బంగా వ్లాదిమిర్ పుతిన్.. మాతృభూమి కోసం రష్యా వీరులు పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునేందుకే ఈ ప్రయత్నం. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలాండ్ రాజధాని వార్సాలో రష్యా అంబాసిడర్ సెర్గీ ఆండ్రియేవ్‌పై ఉక్రేనియన్లు దాడి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు సెర్గీ ఆండ్రియేవ్ నివాళులు అర్పిస్తుండగా ఉక్రెయిన్ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆయనపై ఎరుపు రంగు సిరాను చల్లి నిరసనలు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేవీ కాలేదని సెర్గీ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో విక్టరీ సందర్భంగా పోలాండ్‌లో పుష్ప నివాళి ఈవెంట్‌ను రద్దు చేయాలని అధికారులు రష్యాను కోరారు. కానీ, సెర్గీ ఆండ్రియేవ్ మాత్రం సైనిక శ్మశానవాటికకు వచ్చి పెద్ద సాహసం చేశారు. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. Russian Ambassador to Poland Sergey Andreev covered in red paint in Warsaw. 100s of protesters met him at the soviet soldiers cemetery where he went to mark Russian victory day over the Nazis. The crowd chants “fascist” and “murderer” at him. pic.twitter.com/jAIHvLXEgv — Jack Parrock (@jackeparrock) May 9, 2022 -
ఔటైన కోపంలో ఇషాన్ కిషన్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన కిషన్, తర్వాత మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఎదర్కొన్న కిషన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ముంబై ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో.. సింగిల్ తీయడానికి ప్రయత్నించిన కిషన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో నిరాశకు గురైన కిషన్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిషన్ చర్య ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ రిఫరీ అతడిపై జరిమానా విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 17 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. చదవండి: IPL 2022: "టీమిండియాలో చోటు కోసం చాలా కష్టపడుతున్నా.. అదే నా కోరిక" pic.twitter.com/Gm5LVgRyp4 — Diving Slip (@SlipDiving) April 16, 2022 -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫీల్డర్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 79 ఓవర్ వేసిన గ్రాండ్‌హామ్ బౌలింగ్‌లో.. జాన్సెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బౌండరీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యంగ్.. పరిగెత్తుకుంటూ వెళ్లి సింగ్ హ్యండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. యంగ్ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన జాన్సెన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కాగా యంగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివాన్ కాన్వే (92),టామ్ బ్లాండల్(44) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకున్నట్లైంది. చదవండి: Nicholas Pooran: 37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం Will Young takes one of the greatest catches in the cricket history 🔥#NZvSA #NZvsSA pic.twitter.com/klszfnjTJQ — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 28, 2022 -
క్యాచ్ పట్టిన ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే లెవల్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా
సాధారణంగా ఏదైనా మ్యాచ్‌లో క్యాచ్ పడితే ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయి. అయితే పట్టిన క్యాచ్ నోబాల్ అయితే.. ఫీల్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అచ్చెం ఇటువంటి సంఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా బ్రెస్సియా క్రికెట్ క్లబ్, టర్కీ జైటిన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రెస్సియా ఇన్నింగ్స్‌లో చాలా ఈజీ క్యాచ్‌లను టర్కీ ఫీల్డర్లు జారవిడిచారు. అయితే బ్రెస్సియా ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన అభిషేక్ కుమార్ బౌలింగ్‌లో.. బాబర్ హుస్సేన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్‌గా అందుకున్నాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో ఫీల్డర్ సెలెబ్రేషన్లో మునిగిపోయాడు. అయితే అతడు ఆనందం కొంత సమయం మాత్రమే మిగిలింది. ఎందుకంటే సదరు ఫీల్డర్ క్యాచ్ పట్టిన బంతిను అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో అతడికి ఒక్క సారిగా గుండె జారినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూరోపియన్ క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ind Vs SL T20I: ఓపెనర్లుగా వారిద్దరు.. రోహిత్‌కి నో ఛాన్స్! When your team finally hold onto a catch... 🥳 But it's a free-hit 😭 So many emotions in one ball! 😂 #ECL2022 pic.twitter.com/HoJxGc8tJJ — European Cricket (@EuropeanCricket) February 23, 2022 -
క్యాచ్ వదిలేశాడని చెంప పగలగొట్టేశాడు.. కేవలం వార్నింగ్ మాత్రమేనా!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్యాచ్ మిస్ చేశాడాని హారిస్ రౌఫ్ తన సహచర ఆటగాడు కమ్రాన్ గులాంను చెంప దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హారిస్ రౌఫ్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. కాగా ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ అలీ నఖ్వీ స్పందించాడు. రౌఫ్‌ను అతడు హెచ్చరించనట్లు సమాచారం. అదే విధంగా రౌఫ్‌కు అలీ నఖ్వీ సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే రౌఫ్‌పై లాహోర్ ఖలందర్స్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. కాగా రౌఫ్‌పై ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, కేవలం వార్నింగ్‌తోనే విడిచిపెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఎం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా సోమవారం పెషావర్ జల్మీ వర్సెస్ లాహోర్ ఖలాండర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కమ్రాన్ గులామ్ ఈజీ క్యాచ్‌ను జారవేశాడు. అయితే వెంటనే అఖరి బంతికి మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయయాడు. సహచర ఆటగాళ్లందరూ రౌఫ్‌ను అభినందిస్తుండగా.. కమ్రాన్ గులామ్ కూడా దగ్గరకు వచ్చి అభినందించాడు. ఈ క్రమంలో కోపంగా ఉన్న రౌఫ్ అతడిని చెంప దెబ్బ కొట్టాడు. అయితే ఇదే మ్యాచ్ చివర్లో ఓ రనౌట్ సందర్భంగా హారిస్ రౌఫ్, కమ్రాన్ గులాంను కౌగిలించుకోవడం గమనార్హం. Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్‌తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్‌లో.. సోఫియా డివైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధాన డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. కాగా మంధాన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(68), బేట్స్(41),డివైన్(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్,దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(52), మిథాలీ రాజ్(30) పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో కేర్, జానేసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు. Oh YAAAS! Smriti Mandhana!!#NZvIND #CricketTwitter pic.twitter.com/0fy0JJ60BE — Krithika (@krithika0808) February 22, 2022 -
ములాయం సింగ్‌కు స్మృతి ఇరానీ పాదాభివందనం, వీడియో వైరల్
Mulayam Singh Yadav blesses Smriti Irani: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం కాగా ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి వేసి దీవించారు. చదవండి: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా? #WATCH | Samajwadi Party (SP) founder-patron and MP Mulayam Singh Yadav blesses Union Minister Smriti Irani, as she greets him at the Parliament. pic.twitter.com/3ti42DXkpa — ANI (@ANI) January 31, 2022 -
వైరల్ వీడియో: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు
Pushpa Movie Allu Arjun Srivalli Song Hook Step In Mumbai Trains: జనాల్లో పుష్ప ఫీవర్ ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. పుష్ప చిత్రాన్ని, అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ఎవరికీ నచ్చినట్లు వారు వాడేస్తున్నారు. సినిమాలోని బన్ని యాక్టింగ్‌కు అశేషప్రేక్షక జనం ఫిదా అయ్యారు. అందులోని పాటలు మరింత హైలెట్ అయ్యాయి. సాంగ్స్ లిరికల్ వీడియోలు విడుదలైనప్పుడే వాటిని స్పూఫ్, కవర్స్‌లా తెగ వాడేశారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు, హైదారబాద్ పోలీసులు సైతం పుష్పరాజ్‌ను బీభత్సంగా ఉపయోగించుకున్నారు. ఇటీవల శ్రీవల్లి సాంగ్‌ను మరాఠీ భాషలో రాసి మరీ పాట పాడాడు ఓ ట్రాఫిక్ పోలీసు. తాజాగా ఇదే పాటపై అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్‌ను అనుకరిస్తూ వైరల్ అయ్యాడు ఒక ఇన్‌స్టా గ్రామ్ యూజర్. ముంబైకి చెందిన ధీరజ్ సనప్ శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ హుక్ స్టెప్పును అనుకరిస్తూ వీడియో చేశాడు. ఆ స్టెప్పుతోనే ముంబై లోకల్ ట్రైన్‌లోకి వెళ్లడం, ప్రజల మధ్య తిరగడం, ఎస్కలేటర్ ఎక్కడం వంటివి చేస్తూ నవ్వు తెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్ మ్యానరిజంతో హుక్ స్టెప్పు వేస్తే ధీరజ్ అదే స్టెప్పును సరదాగా అనుకరిస్తూ వీడియో చేసి నెట్టింట్లో వదిలాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్ కామెంట్ రూపంలో మెచ్చుకుంటున్నారు. ఆదివారం అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ప్రస్తుతం లక్షకుపైగా వీక్షణలు వచ్చాయి. View this post on Instagram A post shared by Dhiraj sanap (@dhirajjjjj_) ఇదీ చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. అవగాహన కోసం పోలీసుల వాడకం -
గులాబ్ జామూన్ సమోసా రెసిపీ ట్రై చేసే ధైర్యం ఉందా మీకు?
సాక్షి, హైదరాబాద్: వంటల్లో రకారకాల కాంబినేషన్లు, ప్రయోగాలు చాలామందికి తెలుసు. దాదాపు చాలావరకు ఇలాంటి మిక్స్డ్ రెసిపీస్, వినూత్నమైన వంటకాలు బాగానే క్లిక్అవుతాయి. కానీ ఒక్కోసారి మాత్రం దారుణంగా బెడిసి కొడతాయి. తాజాగా గులాబ్ జామూన్ సమోసా వంటకం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కమెంట్లు, లైక్‌లతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (Salman Khan Birthday: జెనీలియా, సల్మాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్) అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ వెరైటీగా సమోసా విత్గులాబ్ జామూన్ ట్రైస్ చేశాడు. ఢిల్లీలోని రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే ఒక దుకాణం వద్ద గులాబ్ జామూన్ సమోసాను తయారు చేయించాడు. అయితే గులాబ్ జామూన్ సమోసా టేస్ట్ చేసిన అభిషేక్ ఫీలింగ్స్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.‘‘కనీసం ట్రై కూడా చేయొద్దు.. అతని కోతి మొఖం చూస్తే అర్థం కావడం లేదా. దాని టేస్ట్ ఎలా ఉందో’’ అని ఒకరు, నీ కరేజ్కి హేట్సాఫ్ భయ్యా అని మరొకరు ‘‘చండాలంగా ఉంది’’ అని ఇంకో యూజర్ కమెంట్ చేశారు. గత వారం అప్లోడ్ చేసిన వీడియోకు వ్యూస్ ఇప్పటికే 2 మిలియన్లు దాటేసాయి. View this post on Instagram A post shared by KOMAL || ABHISHEK (@thefoodiehat) -
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma is back in nets, playing lovely strokes: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు డిసెంబర్ 16న పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సౌత్ఆఫ్రికా పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ ఇనస్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అదే విధంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి షమీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
గిల్ కళ్లు చెదిరే సిక్స్.. వీడియో వైరల్
Shubman Gill smashes a fluent six down the ground off Ajaz Patel: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధసెంచరీతో మెరిశాడు. అయితే భారత ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. రెండో బంతికి గిల్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. దీంతో బౌలర్ ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతే కాకుండా అతడి సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే మయాంక్ ఆగర్వాల్ వికెట్ కోల్పోయినప్పటకీ.. శుభమన్ గిల్, పూజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కాగా లంచ్ విరామం తర్వాత తొలి ఓవర్లోనే భారత్ శుభమన్ గిల్(52) వికెట్ కోల్పోయింది. 34 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. చదవండి: IND Vs NZ 1st Test: నిలకడగా ఆడుతున్న భారత్.. 20 ఓవర్లకు 63/1 pic.twitter.com/CZK8CVNHXG — Simran (@CowCorner9) November 25, 2021 -
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్.. కొంచెం బొద్దుగా ఉండటంతో..
ఈ మధ్య కాలంలో ఫంక్షన్ ఏదైనా ఫోటో షూట్లు మాత్రం పక్కా ఉండాల్సిందే. బర్త్‌డే అయినా, పెళ్లి అయినా చిరకాలం గుర్తుండి పోవాలంటే ఫోటో షూట్ తప్పనిసరి. ఇక పెళ్లి ముందే అయితే వెడ్డింగ్ షూట్ల శర మామూలు అయిపోయాయి. లక్షలు ధారపోసి మరీ ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. అచ్చం ఓ ఇలాగే ఓ యువతి ఫోటో షూట్ ప్లాన్ చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోవాలనుకుని నది దగ్గర ఫోటో షూట్ ఏర్పాటు చేసింది. కెమెరామెన్, అసిస్టెంట్, మెకప్‌మెన్.. ఇలా అందరూ రెడీగా ఉన్నారు. చదవండి: వీడియో వైరల్: ప్రియుడితో పారిపోయిందని.. సీరా పూసి.. గుండు కొట్టించి యువతి కూడా అందమైన గులాబి రంగు గౌనులో మరింత అందంగా ముస్తాబు అయ్యింది. నది ఒడ్డున కొన్ని అడుగుల లోతు నీటిపై క్రేన్ సాయంతో అమర్చిన సన్నని ఊయల మీద కూర్చొని ఫోటోషూట్‌కు ఫోజిచ్చింది. పక్క నుంచి ఓ వ్యక్తి యువతి గౌనులో గాలో ఎగిరేలా ప్రయత్నిస్తున్నాడు.. అయితే యువతి కొంచెం బొద్దుగా ఉండటం, బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా ఊయల మీద నుంచి జారీ అమాంతం నీళ్లలో పడిపపోయింది. చదవండి: ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో అనంతరం నీటి నుంచి బయటకు వచ్చిన యువతి, అక్కడి వారంతా జరిగింది తలుచుకొని పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు తెగ నవ్వుకకుంటున్నారు. అయితే ‘ రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఇలాంటి మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా ఇంకొంచెం కావాలా’అఅంటూ పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by punjabi industry (@punjabi_industry__) -
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
-
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు జోధ్‌పూర్‌లోని రహదారిపై డ్రైవర్ అదుపు తప్పడంతో.. పలు ద్విచక్ర వాహనాల మీదకు కారు దూసుకెళ్లింది. బైకుల మీదకు దూసుకెళ్లిన కారు చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’.. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. చదవండి: చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్ -
లాహోర్ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్
లాహోర్: ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చింది ఒక ఆస్ట్రిచ్. లాహోర్ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్‌లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్ రోడ్లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్‌లో ప్రతి రోజు ఉదయం బస్‌ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్బాయ్ మాత్రమే హ్యండిల్ చేయగలడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా -
SA Vs WI: పెను ప్రమాదం తప్పించకున్న పాక్ అంపైర్ .. వీడియో వైరల్
Umpire Aleem Dar: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12 రౌండ్లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు పెను ప్రమాదం తప్పింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ప్రిటోరియాస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకుని కింద పడిపోయాడు. అయితే బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. వెంటనే అతడు రనౌట్‌కు ప్రయత్నించి చాలా వేగంగా బౌలర్ ఎండ్‌వైపు త్రో చేశాడు. దీంతో అలీమ్ దార్ మరోసారి బంతి నుంచి తప్పించుకున్నాడు. అలీమ్ దార్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Pak Vs NZ: కంగ్రాట్స్ న్యూజిలాండ్... పాకిస్తాన్ సేఫ్.. కానీ మా జట్టు మాత్రం డేంజర్: అక్తర్ Aleem Dar 🥶 pic.twitter.com/33nwLghf71 — Abdul Hadi 🇵🇰 (@Abdul_Hadi_1) October 26, 2021 -
T20 World Cup 2021: అకేల్ హోసిన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్
Akeal Hosein Takes Sensational One Handed Catch: టి20 ప్రపంచ కప్ 2021లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ చిత్తుగా ఓటమి చెందినప్పటికీ .. ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ వేయడానికి వచ్చిన అకేల్ హోసిన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అకేల్ హోసిన్ వేగంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హోసిన్ స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అకేల్ హోసిన్.. రెండు కూడా కాట్ అండ్ బౌల్డ్ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానకి వస్తే.. వెస్టిండీస్‌పై 6వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కేవలం 55 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎక్కువ బెట్టింగ్‌లు! View this post on Instagram A post shared by ICC (@icc) -
వైరల్: నీళ్లలో పాముల సయ్యాట.. ఒళ్లు జలదరించాల్సిందే
ఒక పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది రెండు పాములు ఒక్కచోట చేరి సయ్యాటలాడుతూ కనిపిస్తే? వామ్మో..ఇంకేమైనా ఉందా.. గుండె జారుతుంది కదూ. తాజాగా హెలికాప్టర్ యాట్రా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియోలో.. పచ్చని చెట్ల మధ్యలోని నీటిలో ఎనిమిదడుగల పొడవున్న రెండు పాములు ఒకదానికొకటి చుట్టుకొని డ్యాన్స్ చేస్తూ కనిపించాయి. చదవండి: వైరల్: తండ్రి లైవ్ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు.. పాములు ఒక్క క్షణం అలా ఆగి మళ్లీ దూకుడుగా మెలి తిరుగుతూ ఆవేశంగా నీటిని చిమ్ముతున్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిని చూసిన నెటిజన్లు పాములు అసలు సయ్యాటలు ఆడుతున్నాయా లేక పోట్లాడుకుంటున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు. చాలామంది నాగ్, నాగినిల మధ్య అందమైన డ్యాన్స్ అని అంటుంటే.. మరి కొంతమంది రెండు మగ పాముల కుస్తీ పోటీ అని చెబుతున్నారు. ఏదైతే ఏంటి.. వీడియో మాత్రం బాగుంది కదా.. చూసేయండి మరి.. View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు. చైతన్యపురి ప్రధాన రహదారిలో Greater Hyderabad 🌧🌦#HyderabadRains pic.twitter.com/vFbKjT1erQ — Nani (@srichowdary4) October 9, 2021 ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 10 గంటల వరకు కుర్మగూడలో 11.7, ఎల్బీనగర్ 11, హస్తినాపురంలో 10.8, ఆస్మాన్‌ఘడ్ 10.5, విరాట్‌నగర్ 10.3, కంచన్‌బాగ్ 10, సర్దార్ మహల్ 9.9, చందూలాల్ బారాదరిలో 9.6, జహానుమా 9.2, రెయిన్ బజార్ 9.2, శివరాంపల్లి 8.9, అత్తాపూర్ 8.1, నాచారం 8.1, రాజేంద్రనగర్ 8, భవానీనగర్ 7.4, బేగంబజార్ 7.2, బతుకమ్మకుంట 7.1, నాంపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో #HyderabadRains | Rainwater entered a restaurant in Old City after incessant rains lashed Hyderabad yesterday. (ANI) pic.twitter.com/rJEGYwGdKZ — NDTV (@ndtv) October 9, 2021 ►రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీ వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్తాపూర్ ఆరాంఘర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ►అప్పా చెరువు నుండి వరద నీరు కర్నూలు జాతీయ రహదారిపై ప్రవహించడంతో శంషాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. వాహనాలను హిమాయత్ సాగర్ మీదుగా మళ్లిస్తున్నారు. సాగర్ రింగ్‌రోడ్డులో ►కాటేదాన్ 33/11 కె.వి సబ్‌స్టేషన్ మరోసారి నీటమునిగింది. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ►సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, చిలకలగూడ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఎల్బీనగర్లో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 ►దిల్‌సుఖ్‌గర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, మీర్‌పేట, బడంగ్‌పేటలలో వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు సైతం నీటమునిగాయి. మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్ ప్రాంతాల్లోనూ రహదారు లు నీటమునిగి..మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. ►పాతబస్తీలో వరదనీటిలో ట్రాలీ ఆటోతో పాటు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తపేటలో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 వందలాది ఫీడర్లలో నిలిచిన విద్యుత్ సరఫరా గ్రేటర్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా స్తంభించింది. 250కిపైగా ఫీడర్ల పరిధిలో అంతరాయం ఏర్పడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, సంతో‹Ùనగర్, లింగోజిగూడ, హస్తినాపురం, నాగోల్, సరూర్‌నగర్, చంపాపేట, కర్మన్‌ఘాట్, కొత్తపేట, మలక్‌పేట, పాతబస్తీ సహా పలు ప్రాంతాలలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, సైదాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఇమ్లీబన్ బస్టాండ్ పరిసరాల్లో అంధకారం తప్పలేదు. పాతబస్తీలో ఒకరికొకరు తోడుగా రోడ్డు దాటుతున్న దృశ్యం చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, అంబర్‌పేట, సికింద్రాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షం..మరో వైపు మోకాళ్ల లోతు చేరిన వరద నీటితో ప్రయాణికులు, వీధి దీపాలు వెలగక ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచి్చంది. పలు చోట్ల గంట నుంచి గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయేదాకా కరెంట్ సరఫరా లేదు. రోడ్డుపై భారీగా చేరిన వరద నీరు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ భారీ వర్షానికి ఉప్పల్‌లో రోడ్లపై ఉన్న షటర్లు, షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్లపై డివైడర్లను తొలగించారు. వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పాతబస్తీలోని ఓ హోటల్లో.. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీట మునిగిన కాలనీ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాణిగంజ్‌లో.. పాతబస్తీ అతలాకుతలం చార్మినార్: పాతబస్తీలో గంటన్నరపాటు దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడ్డారు. చారి్మనార్, మీరాలం మండి, మదీనా, పత్తర్ గట్టి, పురానాపూల్ తదితర ప్రాంతాల నుంచి సైదాబాద్, మలక్‌పేట, సంతోష్ నగర్, డబీర్ పురా, చంచల్ గూడ, ఈదిబజార్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రైల్వే అండర్‌బ్రిడ్జి పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో రోడ్లపైనే గంటల తరబడి వాహనదారులు నిలిచిపోయారు. చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, చత్రినాక, పటేల్ నగర్, శివాజీ నగర్, శివగంగా నగర్ తదితర ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దాదాపు మొదటి అంతస్తు మునిగేంత వరకు వరద నీరు చేరింది. -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!
Finlands Use of eight slips vs England XI: యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు స్లిప్స్‌లో.. కెప్టెన్ ఫీల్డర్లను పెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మూడు లేక నలుగురు ఫీల్డర్లను స్లిప్స్‌లో పెడతారు. అయితే, టీ10 మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ వేసిన తొలి బంతికే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది ఫీల్డర్లను కెప్టెన్ జోనాథన్ స్కామన్స్ స్లిప్స్‌లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫిన్‌ల్యాండ్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో ఫిన్‌ల్యాండ్‌పై విజయం సాధించింది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ Just one normal day of European Championship Cricket 🙏 Finland start the game against England with EIGHT in the slips, and a leg slip for good measure 😂#ECC21 pic.twitter.com/lnuTv2RwMt — Cricket on BT Sport (@btsportcricket) September 30, 2021 -
జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
సాక్షి, రాజోళి (జోగులాంబ గద్వాల్): జిల్లాలోని రాజోళిలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై తోటి సిబ్బందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయించాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి రాజోళిలోని నిర్మానుష్య ప్రదేశంలో పార్టీ చేసుకుంటుండగా ఎస్సై లెనిన్ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా యువకుడి తలను ఇన్నోవా కారు అద్దానికేసి బలంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు యువకులే మద్యం సేవించి కారు అద్దాలు పగలగొట్టినట్లు ప్రచారం చేయించారు. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం రాజోళి లో విచారణ చేపట్టారు. ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన, లక్ష్మణ్‌పై పోలీసులు దాడి చేసేందుకు గల కారణాలను అక్కడి రైతులతో అడిగి తెలుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో తమతో లక్ష్మణ్ గొడవ పెట్టుకున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన వారితోనూ అతను వాగ్వాదానికి దిగాడన్నారు. ప్రతిఘటించే సమయంలో ఎస్ఐ లెనిన్ దాడి చేశారని తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీడియో వైరల్.. ఆదివారం జరిగిన దానికి పోలీసులు చెప్పిన దానికి అంతా సరిపోయిందనుకునేలో గానే సోమవారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ కిందపడగా ఎస్ఐ లెనిన్ బూటు కాలుతో దాడి చేస్తుండగా.. మరో కానిస్టేబుల్ సహకరించాడు. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాధితుడు లక్ష్మణ్ తరఫున బీసీ కమిషన్, హెచ్‌ఆర్‌సీలను ఆశ్రయించారు. కంగుతిన్న పోలీసులు తమపై దాడికి యత్నించినందుకే కర్నూలుకు చెందిన లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామని, ఈ క్రమంలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని ఆదివారం చెప్పిన పోలీసులు, సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో కంగుతిన్నారు. -
జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆప్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో దీపక్ హుడా మిడాన్ దిశగా కొట్టిన షాట్‌ను మెరుపు వేగంతో గాల్లోకి ఎగురుతూ సుచిత్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: హోల్డర్ మెరిసినా... సన్‌రైజర్స్ అవుట్ pic.twitter.com/jvRijSA0pS — Sardar Khan (@SardarK07004661) September 25, 2021 -
ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ..
రస్క్‌లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం సాయంత్రం, ఛాయ్‌లో ముంచుకొని వీటిని తింటుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత రస్క్‌లు తినే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రస్క్‌ల తయారీకి చెందిన ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంతోంది. అసలేం జరిగిందంటే.. ఓ ఫ్యాక్టరీలో కొందరు రస్క్‌లు తయారు చేస్తూ వాటిని ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వర్కర్ ట్రేలోని రస్క్‌లపై తన పాదాలను ఉంచాడు. అంతేగాక చేతులోకి కొన్ని రస్క్‌లను తీసుకొని నాలుకతో నాకుతూ ప్యాకింగ్ చేశాడు. ఇదంతా చూస్తూ పక్కన ఉన్న వారు సంతోషంతో నవ్వుతున్నారు. చదవండి: వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం ఈ వీడియోను శివకుమార్ పార్థసారథి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వర్కర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లని పట్టుకుని తన్నాలని కొందరు.. జైల్లో పెట్టాలని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు .నెటిజన్లతో పాటు బాలీవుడ్ నటి రవీనా టండన్ సీరియస్ అయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.."వారు పట్టుబడతారని, ఎప్పటికీ కటకటల వెనుకే మగ్గుతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Shivkumar Parthasarathy (@instantshiva) -
కోన్ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్!!
నోరూరించే వంటకాలు ఎన్నిఉన్నా పిజ్జా రుచుల ప్రత్యేకతే వేరు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పిజ్జా దర్శనమిస్తూనే ఉంటుంది. సాధారణంగా పిజ్జా అంటే గోధుమ లేదా మైదాతో తయారుచేసిన గుండ్రటి రొట్టెపైన ట్యాంగీ మారినారా సాస్, ఊజింగ్ చీజ్ కాంబినేషన్‌తో, రకరకాల వెజిటబుల్స్ ముక్కలతో అలంకరించబడి రుచికే కాకుండా చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రకరకాల రుచుల్లో దొరికే పిజ్జాలని తినడానికి ఏ సమయంలోనైనా రెడీ అంటారు భోజన ప్రియులు. ఐతే ఈ వీడియోలో ఉన్న పిజ్జా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైంది. అందుకే ఇప్పుడిది వైరల్ అవుతోంది. అదే పిజ్జా కోన్.. సాధారణ రూపానికి భిన్నంగా, కోనికల్ స్ట్రక్చర్‌లో, సాస్, చీజ్ కూరిన ఈ ప్రత్యేకమైన పిజ్జా వైపు మనమూ ఓ లుక్కేద్దాం! యాక్ట్ నార్మల్ ఆర్ ఎల్స్ అనే యూజర్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో మొదట పిజ్జా తయారు చేసే పిండితో కోన్‌ను రూపొందించారు. తర్వాత మారినారా సాస్, చీజ్‌తో ఫిల్ చేసి పూర్తిగా ఉడికేలా బేక్ చేశారు. ఇదొక పిజ్జాకోన్ వెరైటీ. చీజ్ కలిపిన టోస్డ్ వెజిటబుల్స్‌తో ఫిల్ చేసిన పిజ్జాకోన్ మరొకటి. ఈ రెండు రకాలైన పిజ్జాలకు ట్విట్టర్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దీనిని ప్రయత్నిస్తామని కోరుకుంటే, ఈ విధమైన వంటకాన్ని మొదటి స్థానంలో ఉంచవలసిన అవసరం లేదని మరికొందరు పెదవి విరిచారు. కోన్లోపల ఫిల్ చేసినవి వేడిగా ఉంటాయని, నోరు కాలుతుందేమోనని కూడా చాలామంది యూజర్లు ఆరోపించారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకి వేల వ్యూస్ వచ్చాయి. చదవండి: చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? every couple of years someone tries to make the pizza cone a thing. i don't think they're ever going to really pull off making the pizza cone a thing pic.twitter.com/i2j3jQk1vR — lauren (@ActNormalOrElse) August 30, 2021 -
'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా.. చాహల్ ఫన్నీ వీడియో!
అహ్మదాబాద్: భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు . తాజాగా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి నటించిన ఓ ఫన్నీ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో చాహల్ కోసం అతని భార్య ఆలు పరోటా తీసుకు వస్తుంది. అయితే అది తినడానికి ముందు ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించట్లేదేమిటని అతడు చమత్కారంగా ప్రశ్నిస్తాడు. దానికి బదులుగా ఆమె 'కాశ్మీరీ పులావ్' లో కాశ్మీర్ ఉంటుందా, 'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై చాహల్ కింద పడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ ధావన్ వరుసగా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేశాడు. కాగా మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ కోసం చాహల్ యూఏఈ వెళ్లనున్నాడు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు -
వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలోని ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు వింతగా ఉన్నాయి. ఆ పక్షి అచ్చం పసిపిల్లల ఏడుపులా శబ్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ పక్షి ఇలా ఎందుకు అరుస్తుందంటే.. వీటిని లైర్ బర్డ్ అంటారు. ఇవి తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను మిమిక్రీ చెయ్యగలవు. వీటి ప్రత్యేకత అదే. ఇక కోవిడ్ లాక్డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు పెద్దగా అరుస్తున్న శబ్దాన్ని వింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: స్నేక్గారూ.. స్మైల్ ప్లీజ్.. Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls - including a baby's cry! 📽️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos — Taronga Zoo (@tarongazoo) August 30, 2021 -
కూతురు పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
బెంగళూరు: పెళ్లిలో మ్యూజిక్, డ్యాన్స్‌లు, ఎంజాయ్మెంట్ కామన్‌గా మారిపోయింది. వివాహ తంతు కంటే వీటి కోసమే ఎక్కువ ఆర్భాటాలు చేస్తున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా అందరూ ఏకమై ఆటపాటలతో చిందేస్తున్నారు. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు సైతం ఇలాంటి వేడుకలకు సై అంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కుమార్తె వివాహం బుధవారం కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి ఓ పాటకు డ్యాన్స్ చేశారు. చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు! హుబ్లీలో జరిగిన ఈ ఫంక్షన్లో ఆయన సతీమణి జోత్యితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. కన్నడ లెజెండ్ దివంగత రాజ్ కుమార్ పాడిన ‘ఏరాడు కనుసు’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఎండెందు నిన్నాను మారేటు నానిరాలారే’ కు జోషి దంపతులు డ్యాన్స్ చేశారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకొని తమదైన స్టెప్పులతో అందరినీ అలరించారు. మంత్రి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. -
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రడూన్ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని గ్రహించి వంతెనపైకి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. చదవండి: Cricketer Rashid Khan: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్
కొందరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవడం, అలగడం లాంటివి చేస్తుంటారు. పక్కన వాళ్లు అలకకు కారణం తెలుసుకుని కాసేపు బుజ్జగించి, లాలించి కూల్ చేస్తే మళ్లీ మామూలు మూడ్‌లోకి వచ్చేస్తారు. సాధారాణంగా చిన్నపిల్లల దగ్గర ఇలాంటి చేష్టలు ఎక్కువగా చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి లక్షణాలే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ వధువు ప్రదర్శించి అందరికీ షాక్కిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఓవైపు అతిథులు వచ్చారు, కాసేపట్లో ముహూర్త సమయం దగ్గర పడుతోంది అనగా ఓ పెళ్లి కూతురు నేను హర్ట్ అయ్యాను పెళ్లి మండపం ఎక్కను గాక ఎక్కును.. అంటూ చిన్న పిల్లలా మారాం చేయడంతో పాటు అలిగి బుంగమూతి పెట్టుకుంది. అసలు తను ఇలా ఎందుకు చేస్తోందని బంధువులు ఆరా తీయగా.. అప్పుడు ఆ వధువు మండపంలోకి తన ఎంట్రీ ఉన్నప్పుడు ఆమె చెప్పిన పాటకు బదులు వేరే పాటను ప్లే చేశారని చెప్పింది. ఈ విషయంపై ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో గొడవ కూడా పడింది. నేను ముందే చెప్పాను కదా.. ఆ పాట ప్లే చేయమని. అందుకే హర్ట్ అయ్యాను, నేను అసలు పెళ్లిమండపమే ఎక్కను.. అంటూ అందరినీ ఇబ్బంది పెట్టింది ఆ పెళ్లికూతురు. చివరకు వధువు కుటుంబ సభ్యులు బతిమలాడి, ఓదార్చడంతో బుంగమూతి పక్కన పెట్టి పెళ్లి పీటలు మీద కూర్చింది. ది వెడ్డింగ్ బ్రిగేడ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. View this post on Instagram A post shared by The Wedding Brigade (@theweddingbrigade) చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా -
అత్తగారి అదిరిపోయే డాన్స్: చూస్తూ ఉండిపోయిన వధువు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లలో సంగీత్‌లు, బారాత్‌లు, డ్యాన్స్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. అంతేకాదు ఇలాంటి వేడుకల్లో వధూవరులతోపాటు, బంధువులు, స్నేహితులు స్టెప్పులతో ఇరగదీయడం కూడా చాలా కామన్‌గా మారి పోయింది. ఇటీవల ‘బుల్లెట్టు బండి’ పాటతో ఒక తెలుగింటి నవ వధువు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా వీటన్నింటికీ భిన్నంగా వరుడి తల్లి చేసిన డ్యాన్స్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. చదవండి : Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో వరుడి తల్లి పంజాబీ పాటకు భాంగ్రా నృత్యంతో పెద్ద సంచలనమే సృష్టించింది. దీనికి తోడు ఆమె పాటకు ఆమె బంధువులు డబ్బుల వర్షం కురిపించడం విశేషం. అటు అత్తగారి పెర్ఫామెన్స్‌కు వధువు ముచ్చటగా అలా చూస్తూ ఉండి పోయింది. ఈ వయసులో కూడా ఎంత ఎనర్జటిక్ స్టెప్స్! అంటూ నెటిజన్లు ఫిదా. చదవండి : Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా View this post on Instagram A post shared by 𝔖aͥɴaͣmͫ (@i.am.sanam) -
వైరల్: రాహుల్ గాంధీ నా కొడుకు.. నర్సు భావోద్వేగం!
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో రెండు రోజులు(సోమ, మంగళవారం) పర్యటించిన విషయం తెలసిందే. కేరళ పర్యటనలో భాగంగా గాంధీపార్కెలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన బోధనలను, జీవన విధానాన్ని స్మరించారు. అనంతరం కోజిక్కోడ్‌లో రాహుల్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సిఎల్ఎటి)లో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులతో కలసి భోజనం చేశారు. నియోజవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం వయనాడ్‌లో నర్సు రాజమ్మ వవతిల్ను రాహుల్ కలిశారు. రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్లో నర్సుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 1970 జూన్ 19 రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో రాజమ్మనే అక్కడ నర్సుగా పనిచేస్తున్నారు. మొదటగా రాహుల్ తన చేతుల్లోకి తీసుకుంది రాజమ్మనే. తాజాగా రాహుల్ వయనాడ్ వచ్చారని తెలిసి ఆయన్ను కలిసిందేకు వచ్చారు. రాహుల్ కారులో కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చి రాజమ్మ పలకరించారు. రాహుల్‌ను చూసిన వెంటనే అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించారు. అలాగే ఓ స్వీట్ బాక్స్‌ను బహుకరించారు. రాజమ్మ తన కూడుకును రాహుల్ గాంధీకి పరిచయం చేస్తూ.. ఇతను నా కొడుకులాంటి వాడు. నా కళ్ల ముందే పుట్టాడు. మీరందరూ తనను చూడకముందే నేను చూశాను అంటూ సంబరపడ్డారు.తల్లి సోనియా గాంధీని కుశల ప్రశ్నలు అడిగినట్లు చెప్పమని అన్నారు. ‘నేను మా ఇంటి నుంచి మీకు ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీకు అంత సమయం లేదు, నాకు అర్థమైంది. ఒకవేళ ఇబ్బంది పెడితే క్షమించాలి’ అని అన్నారు. దీంతో వెంటనే అలాంటిదేం లేదంటూ ఆమెను అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. దీనికి సంబంధిన వీడియోను కేరళ కాంగ్రెస్ ట్విటర్లో షేర్ చేయడంతో నర్సను కలిసి రాహుల్ మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The wholesome love and affection from Rajamma Amma who was a nurse at Delhi’s holy family hospital where Shri @RahulGandhi was born. pic.twitter.com/fMCDNIsUio — Congress Kerala (@INCKerala) August 17, 2021 -
వ్యూస్ కోసం డేంజర్ స్టంట్స్.. పోలీసుల ట్విస్ట్ అదిరింది
సాక్షి, ముంబై: బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం కొంతమంది యువకుల్లో ఫ్యాషన్‌గా మారుతోంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ మరీ యువకులు స్టంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరు పెట్టిన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో, తామేమీ తక్కువ లేమంటూ మరికొందరు పోటీపడి మరీ స్టంట్లు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వారిలో 18–30 ఏళ్ల వయసు యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు. చిత్రీకరించిన వీడియోలను వాట్సాప్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, వీరు స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తలకు హెల్మెట్ పెట్టుకోరు. బైక్ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం, నడుస్తున్న బైక్‌పై నుంచి దిగడం, మళ్లీ ఎక్కడం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలేస్తున్నారు. అది కూడా ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేదని కారణాలు చూపుతూ తక్కువ జరిమానా విధిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ యొక్క లిరిక్స్‌ను మార్చి తమ రోడ్డు భద్రతా విషయాన్ని వెల్లడించారు.‘ బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈవీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కాగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారి లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. View this post on Instagram A post shared by Mumbai Police (@mumbaipolice) కాగా స్టంట్ మాస్టర్లు స్టంట్లు చేసేందుకు రాత్రివేళల్లో వాహనాలు, జనాల సంఖ్య తక్కువగా ఉండే రోడ్లను ఎంచుకుంటారు. ప్రధానంగా మలాడ్, దిండోషీ, కాల్బాదేవి, వర్లీ సీఫేస్, మాహీం, దాదర్, ఘాట్కోపర్, చెంబూర్, కుర్లా, బాంద్రా, సహార్, కాందివలి, దహిసర్, వాకోలా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి స్టంట్లు చేస్తారు. ఈ స్టంట్ మాస్టర్ల నిర్వాకంవల్ల రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో స్టంట్ మాస్టర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు గాయాల పాలవుతున్నారు. -
50 అడుగుల లోతు బావిలో పడిన మహిళ..వీడియో చూస్తే షాక్
తిరువనంతపురం: ఇంకా భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే ఎంత ప్రమాదం నుంచి అయినా బయట పడతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణననే ఈ సంఘటన. 50 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయిన ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. వివరాలు.. కేరళలోని వయనాడ్ కు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతులో పడిపోయింది. అయితే దాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖవారికి సమాచారం అందించారు. హుటహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బావిలో పడిపోయిన మహిళను పైకి లాగడానికి అగ్నిమాపక సిబ్బంది,స్ధానికులు ఓ నిచ్చెన లాంటి తాడును బావిలోకి దింపి, ఆమెను కాపాడిన దృశ్యాలును చూడవచ్చు. చివరకు ఎలాగోలా ఆమెను బయటకు తీశారు. కానీ ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అనే వివరాలు తెలియలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. #WATCH | Kerala: Fire Department officials and locals rescued a woman after she fell into a 50-feet deep well in Wayanad (10.08) pic.twitter.com/5tG6Jq0vx3 — ANI (@ANI) August 10, 2021 -
‘దోస్తీ’ సాంగ్: ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్
రెండేళ్లుగా అభిమానులను ఊరిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎట్టకేలకు ఈ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో భాగంగా ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ పాట విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దోస్తీ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 1న విడుదలైన ఈ పాట ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటోంది. కీరవాణి సంగీతంలో అయిదు భాషలకు చెందిన అయిదుగురు సంగీత యువ గాయకులు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు.. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో వీడియోతో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లగ్జరీ కారులో ఉక్రెయిన్‌లో షూటింగ్ ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. అలా వెళ్తూ కారులో దోస్తీ సాంగ్‌ను వింటూ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పాట ప్లే అవుతుంటూ ఎన్టీఆర్ తన గొంతును కూడా కలిపాడు. ఇక ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టుర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
బేరమాడి చెప్పులు కొన్న సోనూసూద్.. వీడియో వైరల్
రియల్ హీరో సోనూసూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా.. సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సాయం చేసిన ఈ రియల్ హీరో.. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగాడు. ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20 శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
షాకింగ్ వీడియో: ఏకంగా జాతీయ రహదారి లోయలోకి పడిపోయింది..
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఓ రోడ్డు కుప్పకూలింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవోంతా సాహిబ్, షిల్లై–హట్కోరీని అనుసంధానించే ఈ ఘాట్ రోడ్డుపై నహన్ పట్టణం సమీపంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి 100 మీటర్ల పొడవునా దిగువకు జారిపోయింది. ప్రస్తుతం అక్కడ మట్టి, రాళ్లు తప్ప రోడ్డు ఆనవాళ్లే కనిపించడం లేదు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపోయాయి. భీకర వర్షాలతోపాటు కొండ చరియలు విరిగిపడుతుండడంలో హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితీలో 200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. -
నీటిలో అబ్బురపరిచే డ్యాన్స్ విన్యాసం.. ‘వారెవ్వా’ అనాల్సిందే
డ్యాన్స్ చాలా మందికి పిచ్చి. దాన్ని ఒక ఫ్యాషన్‌లా ఫీల్ అవుతూ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తుంటారు. నాట్యంలో కొత్త మెలుకువలు నేర్చుకుంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటారు. తమ విన్యాసాలతో అందరి చేత శభాష్ అనిపించుకునేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఫ్లోర్, బ్రేక్, హిప్ అప్, ఫోక్ వంటి వెరైటీ డ్యాన్లు చూసే ఉంటాం. అలాగే నేల మీద, తాడులతో వేలాడుతూ గాల్లో చేసే డ్యాన్లు కూడా తెలుసు. కానీ నీళ్లలో డ్యాన్స్ చేయడం చూశారా.. చాలా తక్కువ మంది ఇలా ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ జిమ్నాసిస్ట్ నీటి లోపల డ్యాన్స్ చేస్తూ ఎంతో మందిని అబ్బురపరిచింది. ఫ్లోరిడాలోని మయామికి చెందిన క్రిస్టినా మకుషెంకో అనేమహిళ నీటి లోపల అద్భుతమైన స్టెప్పులతో చేస్తున్న డ్యాన్స్ విన్యాసం పలువురిని ఆకట్టుకుంటోంది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజనులు సర్ఫ్రైజ్కు గురవుతున్నారు. మకుషెంకో నీటి లోపల చేసిన డ్యాన్స్ ప్రతిభను చాలా మంది ప్రశంసించారు. ‘మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఇది మాకెంతో నచ్చింది. వారెవ్వా సూపర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అమెరికాకు చెందిన 26 ఏళ్ల క్రిస్టినా మకుషెంకో అంతర్జాతీయ స్విమ్మర్. 2011 లో యూరోపియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు కూడా సాధించారు. ఆ తరువాత ఆమె ఈతల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Kristina Makushenko (@kristimakusha) -
పెళ్లిలో వరుడి చిలిపి పని.. ఒక్కసారిగా అందరు షాక్..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్చల్ చేస్తుంది. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!
కొంతమంది పవర్ బిల్ కట్టకుండా ఎగ్గొట్టేందుకు నానా వేషాలు వేస్తుంటారు. అధికారులకు తెలియకుండా పోల్ నుంచి దొంగతనంగా వైర్లను ఏర్పరుచుకొని కరెంట్ వినియోస్తుంటారు. చదువుకోని వారు, అవగాహన లేని వాళ్లే ఇలాంటి దొంగ పనులు చేస్తారనుకుంటే పొరపాటే. చదువుకున్నవారు సైతం తెలివిగా కరెంట్ దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకుండా కరెంట్ వాడుకునేవాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్ వైర్లను కట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు. అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్వైర్ను కట్ చేయబోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అంటూ బదులిచ్చాడు. ఆ మాట విని అయ్యో దొరికిపోయానా అనే రేంజ్లో కరెంట్ దొంగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ग़ाज़ियाबाद में जब एक कटियाबाज़ के यहां बिजली विभाग का छापा पड़ा तो वो रेंगते हुए अपना अवैध कनेक्शन काटने गया,जिससे उसे कोई देख न पाए,लेकिन बिजली विभाग एक कर्मचारी उससे 2 कदम आगे निकला,वो पहले ही बगल वाले कि छत से वीडियो बना रहा था,फिर क्या हुआ देखिये pic.twitter.com/3Gs5rDIneD — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 13, 2021 -
కారు బానెట్‌పై వధువు విహారం.. చివరిలో ట్విస్ట్ అదిరిపోయింది
ప్రతి అమ్మాయి తన పెళ్లిని జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటుంది. పెళ్లి జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందకు ఎన్నో కలలుకంటుంది. తనకు నచ్చినట్లు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంటుంది. అచ్చం ఇలాగే పుణెకు చెందిన యువతి తన వివాహంపై ఎక్కవగానే అంచనాలు పెట్టుకుంది. పెళ్లినాడు వివాహం మండంపంలోకి వైభవంగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇంతలో పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో ఈ 23 ఏళ్ల వధువు మంగళవారం తన ఇంటి నుంచి కదిలే ఎస్యూవీ కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వద్దకు వెళ్లింది. ఈ దృశ్యాలను బైక్ మీద ఉన్న వీడియో గ్రాఫర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఆమెను చిక్కుల్లోకి పడేసింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించినందుకు యువతిపై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు, వీడియోగ్రాఫర్, కార్ డ్రైవర్‌తోపాటు యువతి కుటుంబ సభ్యులపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక వధువుతో సహా పెళ్లి మండపం వద్ద ఎవరూ మాస్క్ పెట్టుకోకపోడంతో కోవిడ్ నిబంధనలు కూడా అతిక్రమించారని పోలీసులు పేర్కొన్నారు. -
షాకింగ్: రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఎందుకంటే
కరాచీ: మనుషులకు మరణశిక్ష విధిస్తారన్నది తెలిసిన విషయమే. కానీ ఓ దేశంలో విచిత్రంగా రెండు కుక్కలకు మరణ విధించారు. వినడానికి కాస్తా ఆశ్చర్యంగానే ఉన్న నిజంగానే పాకిస్థాన్‌లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. కరాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయన్న కారణంగా రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించడం గమనార్హం. మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అక్కడ ఓ రెండు కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి కౄరమైన కుక్కలను ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇక అక్తర్ లాయర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్ రాజీకి వచ్చాడు. కానీ రాజీకి అంగీకరిస్తూనే లాయర్ అక్తర్ యాజమానికి పలు షరతులు పెట్టాడు. ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని, అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని సదరు యజమానికి లాయర్ అక్తర్ షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL — Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021 -
వైరల్: టీకా భయంతో చిన్న పిల్లలా ఏడ్చిన మహిళ!
కరోనా బారి నుంచి రక్షణ పొందడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం భారతదేశం అంతటా కోవిడ్ -19 టీకా డ్రైవ్ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత తెలుపుతూ ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికి కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవటానికి చాలా భయపడుతున్నారు. ఇందులో కొంతమంది సూది భయం (ట్రిపనోఫోబియా)తో కూడా వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. చిన్నపిల్లలు ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు ఏడవడం, అరవడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరిగింది. ఒక మహిళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు చిన్న పిల్లలా ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ కూర్చుని కనిపిస్తుంది. ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే చాలా బాధలో ఉన్నట్లుగా చిన్న పిల్లలా బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఇలా ఏడవటం చూసి, టీకా తీసుకునే మిగతా వారు కూడా భయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది చిన్నారిలా ఏడుస్తూ, భయపడినందుకు మహిళని ఎగతాళి చేశారు. మరికొందరు ఆమెకు అంత నొప్పి ఎలా పుట్టిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝘁𝘂𝗯𝗲.𝗶𝗻𝗱𝗶𝗮𝗻 💀🇮🇳 (@tube__indian) -
లేటు వయసులో మరదలితో ఘాటు డ్యాన్స్, నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. తాజాగా బావ..మరదలి మధ్య ప్రేమ బంధాన్ని వర్ణించే ఓ వీడియో సాంగ్ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ కుటంబంలోనైనా సరదా కోసం బావను ఆటపట్టించడం..ఎగతాళి చేయడానికి మరదలు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వీడియోలో మరదలు తన బావతో బాలీవుడ్ పాట కు సరదాగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లును ఫిదా చేస్తుంది. అతను కూడా తన వంతు ప్రయత్నం పాటకు తగ్గట్లుగా హావభావాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను "బోల్డ్ మీరా స్వాగ్" అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లేటు వయసులో మరదలితో ఘాటు డ్యాన్స్ అంటూ కొంతమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bold Meera (@boldmeeraswag) -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
ఫన్నీ వీడియో: పాపం హరితేజ భర్త.. చివరకు ఇలా అయ్యాడేంటి?
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. అయితే పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు హరితేజ. కానీ అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్గా హరితేజ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అందులో దీపక్ రావు కూతురిని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. ఇలా రోజూ ఆడించడం అలవాటుపడిన దీపక్ రావు.. ఒకసారి చేతుల్లో కూతురు లేకున్నా.. అదేపనిగా చేతులు ఊపుతుంటాడు. ఈ ఫన్నీ వీడియోని హరితేజ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఫాదర్ ఆన్ డ్యూటీ’అని హాష్‌ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ‘క్యూటెస్ట్ డాడీ’అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. -
వైరల్: అమ్మో ఇంజక్షన్! గట్టిగా కేకలు, రచ్చ చేసిన మహిళ
కోవిడ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువత నుంచి పండు ముసలి వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ అనంతరం స్వల్ప అనారోగ్యానికి గురవుతుండంతో కొంతమంది భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో టీకా తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే సూదులంటే భయపడేవారు వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో వ్యాక్సినేషన్ సెంటర్లో భయంతో నానా హంగామా చేస్తున్నారు. తాజాగా టీకా కేంద్రంలో కూర్చున్న ఓ మహిళా రచ్చ రచ్చే చేసింది. వ్యాక్సిన్ వేయించుకుంటుండగా గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసింది. నర్సు మహిళ వద్దకు వస్తుంటే ఎక్కువ అరవడం ప్రారంభించింది. ఇక ఆమెను ఆపేందుకు ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చింది. చివరికి నర్సు టీకా వేసింది. కాగా ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘నాకు కూడా ఇంజక్షన్ అంటే భయం.. నేనూ ఇలాగే ఏడ్చేదాన్ని.’ అంటూ కామెంట్ పెడుతున్నారు. మరికొంతమందేమో.. ‘ఇంజక్షన్‌కే ఇంత భయమా, చిన్న పిల్లల కంటే ఎక్కవ అరుస్తుంది’ అంటున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టిన ప్రియురాలు ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్.. ఆ తర్వాత #VaxPhobia 😢😢😢😢😢😢HUMOUR again...☺️☺️☺️😊☺️ Perhaps she would have more pain where others "held" her than at PRICK. pic.twitter.com/0W3yvkQrtg — Rupin Sharma IPS (@rupin1992) June 29, 2021 -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్‌మాన్‌లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్‌కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్‌పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్‌స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్‌మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
వైరల్: వధువు పెళ్లి గౌనులోకి దూరిన వ్యక్తి.. అందరూ చూసేశారు!
పెళ్లిలో వధూవరులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వడం అందరికీ తెలిసిన విషయమే. వారి ఆచారాలు, సంప్రదాయలు ఏమైనప్పటికీ అందరికంటే స్పెషల్‌గా ముస్తాబవుతారు. అయితే వధూవరులిద్దరిలో ఎక్కువగా అందరి కళ్లు పెళ్లి కూతురుపైనే ఉంటుంది. ఆమె వస్త్రాధారణ, అభరణాలు, మేకప్ ఇలా అన్నింటిపై ప్రతి ఒక్క దానిని గమనిస్తూ ఉంటారు. ఇక వధువుని పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చే సీన్ పెళ్లితంతు మొత్తంలో హైలెట్‌గా నిలుస్తోంది. పైన చెప్పిన విధంగానే ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు అందమైన గౌనులో రెడీ వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చింది. వరుడు ఆమెను చేతిని అందుకుంటున్న క్షణంలో ఓ వ్యక్తి ఆమె గౌను కింద నుంచి ఓ వ్యక్తి అనూహ్యంగా బయటకు వచ్చాడు. అది చూసిన వరుడితో సహా అతిథులంతా నోరెళ్లబెట్టారు. అయితే, అసలు విషయం తెలిసి అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.ఫిలిప్పీన్స్‌లో జరిగిన పెళ్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోయల్ లునేసా అనే వ్యక్తి బ్రైడల్ ఇవెంట్స్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా ఓ పెళ్లిలో వధువు కోసం ఆ సంస్థ గౌను తయారు చేసింది. అయితే, పెళ్లి రోజున గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో. వధువు ఆ గౌనులో నడుస్తుంటే.. గాలికి పైకి లేస్తోంది. గౌను పైకి లేవకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి రోయల్ ఓ నిర్ణయం ఆలోచించి. అతడు వధువు గౌనులోకి దూరతానని చెప్పాడు. ముందు అందరూ అతని నిర్ణయాన్ని ఆశ్చర్యంగా చూసినా.. చివరికి అంగీకరించారు. దీంతో అధిక గాలులకు డ్రెస్ ఎగరకుండా సక్రమంగా ఉంచేందుకు ఆమె దుస్తుల కింద అతను దాక్కున్నాడు. ఇలా వధువు పెళ్లి వేడుక వద్దకు చేరే వరకు ఆమె గౌనులోనే ఉన్నాడు. వరుడు ముందుకొచ్చి ఆమె చేతిని అందుకోగానే.. అతను ఆమె గౌను నుంచి వేగంగా బయటకు వచ్చేశాడు. అయితే అతన్ని ఎవరూ చూడలేదు అనుకున్నాడు కానీ అప్పటికే అతిథులు అది చూసి షాక్‌కు గురయ్యారు. అంతేగాక కెమెరాలోనూ ఇదంతా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం ఈ విషయంపై రోయల్ మాట్లాడుతూ.. తను నిజంగా వధువు పెళ్లి దుస్తుల కింద దూరిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అంతేగాక అందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు. పెళ్లిలో బలంగా గాలులు వీస్తుండటంతో వధువు తన డ్రెస్‌తో ఇబ్బంది పడుతుందని, అందుకే ఏం చేయాలో తెలియక అలా చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. వధువు ఆ గౌను లోపల మరో డ్రెస్ వేసుకుందని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్ ఏంటంటే! ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు! -
మండపంలోకి రాగానే వధువు చేసిన పనికి అందరూ షాక్!
లక్నో: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నట్లు లాక్డౌన్లో పెళ్లిళ్లు సహా ఇతరత్రా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ వేడుకలు అతి కొద్దిమంది సమక్షంలోనే జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఒక పెళ్లిలో కరోనా నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, మండపంలో వధువు రివాల్వర్‌ను పైకెత్తి ఆకాశంలో కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని జేత్వారాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు రూపా పాండె, వరుడితో కలసి పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె, తన మేనమామ రామ్నివాస్ పాండె రివాల్వర్‌ను తీసుకుంది. వివాహ వేదికపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా గాలిలో కాల్పులు జరిపింది. ఆ తర్వాత రివాల్వర్‌ను తన మామకు అప్పగించింది. అయితే, ఆ రివాల్వర్‌కు లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో యూపీ పోలీసుల కంట పడటంతో పెళ్లి కూతురిని, ఆమె మేనమామ రామ్నివాస్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అతని రివాల్వర్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహా వేడుకకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్కడ అంతకన్నా ఎక్కువ మంది జనం హాజరయ్యారు. దీంతో వీరందరిపై అంటు వ్యాధులు నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. చదవండి: గాలిలో ఎగిరిన ఐఫోన్.. వైరల్ వీడియో -
వైరల్: కానిస్టేబుల్ మానవత్వం.. సలామ్ కొడుతున్న నెటిజన్లు
హైదరాబాద్: కరోనా వేళ పోలీసులు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి పగలు, రాత్రి పని చేస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా పంజాగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్‌కుమార్ మానవత్వానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కానిస్టేబుల్ మహేశ్ ఆదివారం రాత్రి 11గంటకు సోమాజిగూడలో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో రోడ్డుపక్కన ఇద్దరు చిన్నారులు ఆహారం కోసం యాచించడం చూసి చలించిపోయాడు. తన కోసం తెచ్చుకున్న క్యారేజీని స్వయంగా ఆ చిన్నారుల వడ్డించి వారి ఆకలి తీర్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 1.65 లక్షల మంది వీక్షించగా.. వేల మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘నేను ఆయనకు వందనం చేస్తున్నాను. అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలియజేయండి. కరోనా తర్వాత కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుతా. అతడికి దేవుడి ఆశీర్వాదం ఉంటుంది’ అని కామెంట్ చేశాడు. ‘సలామ్ పోలీసు కానిస్టేబుల్! మీరు మానవత్వం చాటుకున్నారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #ActOfKindness Panjagutta Traffic Police Constable Mr. Mahesh while performing patrolling duty @Somajiguda noticed two children requesting others for food at the road side, immediately he took out his lunch box & served food to the hungry children. pic.twitter.com/LTNjihUawn— Telangana State Police (@TelanganaCOPs) May 17, 2021 (చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ షూటింగ్: అడ్డుకున్న పోలీసులు) -
చెట్టెక్కి కూర్చున్న దొంగ.. పోలీసులు ఏం చేశారంటే?
రాయ్‌పూర్: చిన్నప్పుడు అందరూ దొంగ-పోలీస్ ఆట ఆడే ఉంటారు. దొంగలు దాక్కుంటే పోలీసు వారిని వెతికి పట్టుకోవడమే ఈ ఆట. సరిగ్గా చిన్నప్పుడు ఆడే ఈ ఆటలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులకు చిక్కుకుండా ఓ దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చెట్టెక్కి మీద కూర్చున్నాడు. చెట్టు వద్దకు చేరుకున్న పోలీసులు దొంగను కిందకు దిగి రావాలని కోరారు. వాళ్లు ఎంత చెప్పిన సదరు దొంగ ససేమిరా రానన్నాడు. దీంతో విసుగు చెందిన పోలీసులు ఓ ప్లాన్ వేశారు. ఓ పోలీస్ ఆఫీసర్ బూట్లు విప్పీసి చెట్టెక్కేశారు. తప్పించుకునే దారిలేదని తెలిసి కూడా ఆ దొంగ.. చెట్టుమీదనే మరింత పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, వేరే మార్గం లేక ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ వీడియోను చత్తీస్ఘడ్ ఐపీఎస్ పోలీస్ అధికారి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. దొంగోడి అతి తెలివికి నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.. ‘చెట్టెక్కి తప్పించుకోవటం ఏంట్రా బాబు.. దొరకి పోయావ్గా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! खुदी को कर के बुलंद इतना चढ़ गए ऊपर जैसे तैसे, पर #Khakhi वाले उतार देंगे, बड़े आराम से 😅😝 pic.twitter.com/FoePjKOLfj — Dipanshu Kabra (@ipskabra) May 12, 2021 -
కోవిడ్: వైరలవుతోన్న చెన్నై మహిళా పోలీసుల డ్యాన్స్
చెన్నై: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం నాలుగు లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కోవిడ్‌పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఎక్కవ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం కరోనా పెరిగేందుకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై రైల్వే పోలీసులు కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే దానిపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో యూనిఫాం, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌవ్స్ ధరించి పోలీసులు డ్యాన్స్ చేశారు. పోలీసు అధికారులంతా ‘ఎంజాయ్ ఎంజామి’ అనే పాపులర్ పాటకు స్టెప్పులు వేశారు. వీరంతా మహిళా పోలీసు అధికారులే కావడం విశేషం. డ్యాన్స్‌తోపాటు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటింజడం వంటివి కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ విధంగా సాయపడుతుందో తెలిపేందుకు ఓ స్కిట్‌ను రూపొందించారు. పోలీసుల ప్రదర్శన ప్రయాణీకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దీనికి ముందు కూడా కేరళ పోలీసులు ఇదే పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించారు. చదవండి: సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్ -
వైరల్ వీడియో: ఉల్లి ఏడిపిస్తోందా.. ఇలా చేయండి!
ఉల్లిపాయలను రకరకాలుగా వాడుతుంటాము. ఉల్లి మేలేమోగానీ దాని ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారడం ఖాయం. ఉల్లిపాయలు కోయాలన్నా, ఆ ఆలోచన మనసులో రాగానే∙వెంటనే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఉల్లిని ఒక్కచుక్క కన్నీళ్లు రానియకుండా కోయవచ్చు అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మ్యాక్స్ మెక్కెన్ అనే వ్యక్తి ఇక ఉల్లిపాయలను ఏడవకుండా ఇలా కోయండి అని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. వీడియోలో.. తడిగా ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకుని దానిని కూరగాయలు కట్‌చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. తరువాత మీరు ఎన్ని ఉల్లిపాయలు కోయాలనుకుంటున్నారో వాటన్నింటిని ముక్కలుగా తరగండి. అయితే మనం ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా.. వాటి నుంచి కొన్ని రకాల ఆమ్లాలు బయటకు వెదజల్లి మన కళ్లని నేరుగా తాకుతాయి. దీంతో కళ్లు మండి నీరు వస్తుంది. అయితే చాపింగ్ బోర్డు మీద తడిగా ఉన్న వస్త్రం ఉంచడం వల్ల ఉల్లి నుంచి వచ్చే ఆమ్లాలను అది పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్లు మండవు.’’ అని మ్యాక్స్ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవడమేగాక వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. చాలామంది నెటిజన్లు నిజంగా ఇది పనిచేస్తుందా? అయితే మేము ఒకసారి ట్రె చేస్తాం అని కొందరు అంటే.. మరికొందరు ఇప్పటికే ఈ ట్రిక్కును మేము ట్రై చేశాము బాగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. మీరూ ప్రయత్నం చేసి చూడండి ఇది ఎంతవరకు పనిచేస్తుదో తెలుసుకోండి. -
మున్సిపల్ సిబ్బందిపై మహిళ విశ్వరూపం.. వీడియో వైరల్!
కరోనా దెబ్బతో మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. జేబులో పర్సు లేకుండా కాలు బయట పెడుతున్నారేమో గానీ ముఖానికి మాస్కు లేకుండా జనావాసాల్లోకి మాత్రం రావడం లేదు. అయితే సుమారు రెండు నెలలుగా మహమ్మారి ప్రభావం పెద్దగా లేకపోవడంతో జనాల్లో భయం వీడింది. నిబంధనలు పాటించకుండానే విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో ముఖానికి మాస్కు ధరించలేదని అడ్డుకున్నందుకు మున్సిపల్ కార్మికురాలి చెంప చెళ్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహారాష్ట్రలో కోవిడ్ కేసులు అధికమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ప్రజలందరు కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముంబైలో మాస్కు ధరించకుండా బయటకు రావడం నిషేదం. ఇందుకు 200 రూపాయల జరిమానా కూడా విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ మాస్కు ధరించకుండా ఆటోలో వెళుతూ మున్సిపల్ సిబ్బంది కంటపడింది. ముంబైలోని కండివాలి రోడ్లో ఆటో రిక్షాలో మాస్కు ధరించకుండా ప్రయాణిస్తున్నా మహిళను బృహాన్ ముంబై కార్పోరేషన్లో పనిచేస్తున్న కార్మికురాలు అడ్డుకుంది. మాస్కు ధరించాలని, లేకుంటే 200 రూపాయల ఫైన్ కట్టాలని కోరింది. ఈక్రమంలో వీరిద్దరి మధ్య కొద్దిసేపు వాదన సాగింది. నన్నే ఆపుతావా అని ఆగ్రహించిన మహిళా.. సదరు కార్మికురాలిపై చేయి చేసుకుంది. దీంతో మహిళను వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకోడంతో బీఎంసీ కార్మికురాలిపై మహిళా తన ప్రతాపం చూపించింది. ఆటోలో నుంచి బయటకు దిగి వర్కర్‌పై దాడి చేసింది. ‘నన్ను ఆపడానికి నీకు ఎంత ధైర్యం, నన్నే ముట్టుకుంటావా అంటూ మహిళపై పిడిగుద్దులు గుద్దుతూ, కాలితో ఇష్టం వచ్చినట్లు తన్నింది. ఈ దృశ్యాలన్నింటిని ఓ వ్యక్తి తన మోబైల్లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ముంబైలోని చార్కోప్ పోలీసులు చార్కోప్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని బీఎంసీ పర్యవేక్షకుడు ప్రశాంత్ కాంబ్లే తెలిపారు. కాగా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 25,681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక కేసులు నమోదవ్వడం. గురువారం కూడా 25,853 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి రాష్ట్రంలో కఠినమైన లాక్డౌన్ విధిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. థియేటర్లలు, ఆడిటోరియాలు, ప్రైవేటు కార్యాలయాలలు ఇక నుంచి 50 శాతం సామర్థ్యంతో కొనసాగించాలని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 వరకు కొనసాగుతాయిన పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ -
ఆమె కోసం అన్నదమ్ముల పచ్చబొట్టు, చివరికి పట్టాల పైకి
జైపూర్: ఇద్దరు అన్మదమ్ములు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఆమెతోనే జీవితం అనుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బుంది జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం..కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. అయితే ఒకరికి తెలయకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ప్రేయసి ఆశా పేరును ఇద్దరు అన్నదమ్ములు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినే అని. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ ట్రాక్ నడిపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత యువతి కనిపించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ వీడియోను రికార్డ్ చేశారు. అంతేకాకుండా తాము ఇద్దరం ప్రేమిస్తున్న యువతికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు యువకులు వీడియోలో పేర్కొన్నారు. మా చావుకు ఎవరినీ నిందించవద్దని కోరారు. చదవండి : (మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై) (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా) -
వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక..
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అయితే రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో కొండచిలువ, భుజంపై రామ చిలుకతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని చోటుచేసుకొంది. వివరాలు.. ఒక రోజు హేలీరోబిన్ అనే మహిళ తన మిత్రులతో కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి చూస్తొంది. అప్పుడు రోడ్డుకు ఆవల ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలోని మొబైల్ తీసుకొని రికార్డు చేసింది.. కాగా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద కొండచిలువను, భుజంపై రామచిలుకతో ఎంచక్కా నడుచుకొంటు వెళ్తున్నాడు. అతడిలో ఏమాత్రం భయంలేదు. తీరిగ్గా డ్యాన్స్ చేసుకొంటూ, ఫోన్ బయటకు తీసి మాట్లాడుకొంటూ వెళ్తున్నాడు. కొండ చిలువను ఒక చేతిలో నుంచి మరొక చేతిలోకి మార్చుకొంటూ ఏదో బటన్ నొక్కాల్సి వచ్చిన క్రమంలో కొండ చిలువను కిందపడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏదో ర్యాంప్‌వాక్ చేస్తున్నట్లు ఏంటా నడక అని సరదా కామెంట్లు పెడుతున్నారు చదవండి: బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ -
ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్
ముంబై : పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషం తెలిసిందే. అస్సాంకు చెందిన ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అరూప్ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ ధరించి 'వార్' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్ ఫైజన్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైద్యుడి డ్యాన్స్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఇంకేముంది సదరు డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కరోనా కష్ట కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి తన వృత్తిని కొనసాగిస్తూ, మరోవైపు రోగులను ఉత్తేజపరిచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం’ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: పీపీఈ కిట్‌లో డాక్టర్ అదిరిపోయే స్టెప్పులు తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. వైద్యుడు డ్యాన్స్ వీడియోను హృతిక్ రీట్వీట్ చేశాడు. 'డాక్టర్ అరూప్ తో చెప్పండి. నేను ఏదో ఒక రోజు అస్సాంలో అతని డ్యాన్స్ స్టెప్పులను నేర్చుకుంటాను. అతనిలా డ్యాన్స్ చేస్తాను. అద్భుత ప్రదర్శన' అంటూ హృతిక్ రోషన్ రీట్వీట్ చేశాడు. కాగా డాక్టర్ స్టెప్పులకు బీటౌన్ ఇండస్ట్రీలోనే గొప్ప డ్యాన్సర్ అయిన హృతిక్ ఫిదా అయిపోయాడంటే అతడి డ్యాన్స్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హృతిక్ స్పందించడంతో అమితానందం వ్యక్తం చేశారు డాక్టర్ అరూప్..“సర్, నేను డాక్టర్ అరుప్. చాలా ధన్యవాదాలు సార్. కహో నా ప్యార్ హై సినిమా నుంచి మీరు నా హీరో, మీలాంటి గొప్ప వారికి డ్యాన్స్ నేర్పే అంత వాడిని కాదు సార్. ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీరెప్పుడైనా అస్సాంకు రావచ్చు. అంటూ డాక్టర్ బదులిచ్చారు. చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్ Tell Dr Arup I’m gonna learn his steps and dance as good as him someday in Assam . Terrific spirit . 🕺🏻 https://t.co/AdBCarfCYO — Hrithik Roshan (@iHrithik) October 19, 2020 -
మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం
సోషల్ మీడియాకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఒక్క వీడియా జీవితాలనే మార్చేస్తుంది. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయింది. సరిగ్గా మరోసారి అలాంటి కథే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. (‘బాబా కా దాబా’ వీడియో.. రెస్పాన్స్ సూపర్) ముంబైలోని ఫడేకే రోడ్ డోంబివాలిలో రీసైకిల్ బ్యాగులను అమ్ముతూ కుటుంబ పోషణను నెట్టుకొస్తున్న 87 ఏళ్ల జోషి అనే వ్యక్తి కథను ఓ యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 'చిరిగిన సోఫా కవర్లు, కర్ట్‌న్‌లను అందమైన బ్యాగులుగా తీర్చుదిద్దుతున్నాడు. కేవలం 40-80 రూపాయలకే ఈ అందమైన బ్యాగును సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరకే చేతిసంచులను అమ్ముతున్న ఈ అంకుల్‌ను మనమూ ఫేమస్ చేద్దాం బ్యాగ్ కొనడం మాత్రం మరవద్దు' అంటూ వీడియాను పోస్ట్ చేయగానే వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం..ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతున్న అంకుల్ జోషికి మనమూ బాసటగా నిలుద్దాం అంటూ పలువురు నెటిజన్లు ముందుకొస్తున్నారు. Uncle Joshi age 87 sells bags of Rs 40 to 80.He buys broken pieces of clothes frm sofa and curtain makers.He himself stitches these bags.He sits at Phadeke Road Dombivali,#Mumbai Let's make Joshi Uncle famous & plz don't forget to buy 1 bag from him.🙏 pic.twitter.com/fbI7ZkP2dA — Gauri (@ardor_gauri) October 17, 2020 -
కప్ప మిణుగురును మింగితే : వైరల్ వీడియో
సాక్షి, ముంబై: సోషల్ మీడియా అనేకవింతలకు విశేషాలకు నెలవు. ఆటవిడుపుగా, అసక్తికరంగా ఉండే ఇలాంటి వీడియోలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఎపుడూ చూడని ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక కప్ప మిణుగురును మింగితే.. ఎలా ఉంటుంది.. ఆ మిణుగురు పురుగు కప్ప పొట్టలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే..ఎలాంటి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసిన తర్వాత సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూలు, 4.3 వేల లైక్‌లను సంపాదించింది. దీనికి మించిన యూజర్లు కామెంట్లు, పిట్ట కథలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒక ట్విటర్ యూజర్ మాయ ఏంజెల్‌తో పోలుస్తూ.. మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అంటూ ఒకరు, బీకన్ లైటు వెలుగుతున్న విమానంలా ఉందని మరొకరు కామెంట్ చేశారు. When a frog eats a firefly pic.twitter.com/31m6ZcurWP — Nature is Lit🔥 (@NaturelsLit) September 10, 2020 "Nothing can dim the light that shines from within." Maya Angelou 😉 — gabrielle (@drgabrielnn) September 10, 2020 it's like an airplane with it's beacon light — Thank You, Messi. (@RifqiAthallah13) September 11, 2020 -
బాక్సర్‌నే ఆశ్చర్యపరుస్తున్న బుడ్డోడు!
చాలా మంది ఆరోగ్యం కోసం రోజు ఎక్సర్సైజ్లు చేద్దామనుకొని బద్దకంతో వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో మీరు చూస్తే కచ్ఛితంగా మీకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ వీడియోలో ఒక బుడ్డోడు ఆగకుండా పుల్అప్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోలను ఇండియన్ బాక్సర్ భజరంగ్ పూనియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 23 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పుల్ అప్స్ చేస్తున్నాడు. వాళ్ల ఇంటిలోని వారందరూ శభాష్ అంటుంటే ఇంకా ఉత్సాహంగా పుల్అప్స్ చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. प्रैक्टिस शुरू कर दी है आने वाली चैंपियनशिप के लिए 🙏🏽😝😝 pic.twitter.com/pMDGCagtjB — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) September 1, 2020 ఈ వీడియోను పోస్ట్ చేసిన పూనియా ‘వచ్చే ఛాంపియన్ షిప్ కోసం ఇప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు’ అనే కాప్షన్‌ను జోడించారు. ఈ వీడియోను ఇప్పటికే 53000ల మందికి పైగా వీక్షించారు. 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తన గురువు చెప్పినట్లు చక్కగా సాధన చేస్తున్నాడు అని కొంతమంది కామెంట్ చేయగా, చాలా మంది ఆ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: వేడిగా ఉందని.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచింది -
‘రూ 1800 నోటు ఉంటే బాగుండేది’
తన నెల జీతం పూర్తిగా ఇవ్వలేదని ఓ యువకుడితో పనిమనిషి వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తనకు రూ 1800 చెల్లించలేదని మహిళ మరాఠీలో వాదిస్తుండగా, పూర్తి జీతం ఇచ్చామని యువకుడు చెబుతున్నారు. తాము రూ 500 నోట్లు మూడు, ఒక రూ .రెండు వందల నోటు, ఒక వంద నోటును ఇచ్చామని మొత్తం 1800 రూపాయలు చెల్లించామని అతడు చెబుతుండగా, ఆమె తనకు 1500 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చారు కానీ 1800 రూపాయలు పూర్తిగా ఇవ్వలేదని వాదించారు. ఎంత చెప్పినా ఆమెకు అర్ధం కాకపోవడంతో కాలిక్యులేటర్లో లెక్క వేసి చూపినా మహిళ సమాధానపడలేదు. ‘వీరు పనిమనిషికి 1800 రూపాయలు చెల్లించారు..అయితే వారు రూ 1500 రూ 300లే ఇచ్చారని మహిళ చెబుతోంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 1800 రూపాయల నోటు విడుదల చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. చదవండి : స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్ These guys paid their house help 1800 bucks but she’s saying they paid her 1500 and 300 😫 pic.twitter.com/KTwGW1NyQW — Daaktarni (@DrVW30) August 30, 2020 -
ఫస్ట్‌టైమ్ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్ ఏం చేశారంటే..
తొలిసారి డేట్‌కి వెళ్లిన ఓ జంటకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్నేహితులు. ఎంగేజ్మెంట్ లెవల్లో వారి ‘ఫస్ట్‌డేట్’ను సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే..నార్తర్న్ ఐర్లాండ్‌లోని డెర్రీకి చెందిన నీల్ హర్కిన్ (31), జీన్ మెక్ఆలే (31) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల తొలిసారి డేట్‌కి వెళ్లాలని నిర్ణయించుకొని లండన్డెరీలోని ఓల్డ్ డాక్స్ బార్కి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమాని, హర్కిన్ ప్రాణస్నేహితుడు లియామ్ షీల్స్ వారి ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. (చదవండి : పాముల సయ్యాట: ఒళ్లు గగుర్పొడిచే వీడియో!) అనుకున్నట్లే వారికి తెలియకుండా హోటల్లోని సెంట్రల్లో ఓ టేబుల్ వేయించాడు. మిగిలిన డేబుళ్లపై వారి స్నేహితులను కూర్చోబెట్టారు. లోపలికి వచ్చిన హర్కిన్ జంట.. అన్ని టేబుల్లో నిండిపోవడంతో సెంట్రల్లో ఏర్పాటు చేసిన టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్నారు. డిన్నర్ కూడా చేశారు. తిరిగి వెళ్లే క్రమంలో ఓ వేటర్ భారీ స్పార్క్లర్తో పాటు ప్రాసికో బాటిల్ తెచ్చి వారి టేబుల్‌పై పెట్టాడు. వెంటనే రెస్టారెంట్‌లోని ఇతర డైనర్లు చప్పట్లు కొడుతూ వారిని విష్ చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఆ జంట.. సిగ్గుపడుతూ తలలు కిందకు దించుకున్నారు. తామేదో డిన్నర్ చేసి వెళ్దామని వస్తే.. ఈ వేడుకలు ఏంటో వారికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుండగా, అందరూ చప్పట్లు కొడుతు వారిని అభినందిస్తున్నారు. తర్వాత తెలిసింది ఇది తన స్నేహితుల నిర్వాహకం అని. తమ ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసినందుకు తమ స్నేహితులకు ఆ జంట కృతజ్ఙతలు తెలిపింది. (చదవండి : వైరల్: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు!) -
గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!
వంట చేసేటప్పుడు ఎంతటి నిష్ణాతులకైనా కొన్ని పొరపాట్లు తలెత్తడం సహజం. ఒక్కోసారి చక్కెర బదులుగా ఉప్పు వేయడం లాంటి తప్పులు దొర్లుతుంటాయి. కొన్ని చిట్కాలు ఉపయోగించి దాన్ని సరిచేసే పద్దతులూ ఉంటాయి. అయితే ఓ ట్విట్టర్ యూజర్ చేసిన వినూత్నంగా ఆలోచించాడు. ఉడకబెట్టిన గుడ్డును తిందామనుకుంటే అందులో మిరియాల పొడి కాస్త ఎక్కువైంది. దీంతో వాక్యూమ్ క్లీనర్‌తో ఎక్స్ట్రా పెప్పర్‌ను తీసేద్దాం అనుకొని వెరైటీగా ఆలోచించాడు. ఈ ఐడియా కాస్తా ఫెయిల్ అయ్యి చివరకు గుడ్డు పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 7.1 మిలియన్ల మంది వీక్షించారు. ఐడియా ఫెయిలంయిదేమో కానీ బోలెడంత ఫన్ క్రియేట్ అయ్యింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. (40 అడుగుల ఎత్తు నుంచి దూకిన చిన్నారులు ) Added too much pepper 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/3AQUSt5Jun — Sgujana 🧃 (@shange033) July 20, 2020 -
వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా!
ముంబై: లాక్‌డౌన్‌తో జనావాసాలు నిర్మానుష్యంగా మారడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుతలు తరచుగా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందిరా నగర్లో రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఓ చిరుత అనూహ్యంగా దాడికి దిగింది. ఈ దాడిలో ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. #WATCH Maharashtra: A leopard was seen attacking a man in Indira Nagar area of Nashik y'day. The leopard has attacked two people here, giving them serious injuries. Forest Officials say, "Its footprints can be traced to forests. Our team is at the spot." (Source: CCTV footage) pic.twitter.com/9MTCCHW73N — ANI (@ANI) May 30, 2020 -
సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్!
చిన్నప్పుడు పిల్లలకు ఏవేవో కథలు చెబుతూ ఉంటాం. అవి నిజమనుకొని పిల్లలు ఆ కథల్లోని పాత్రలను నిజ జీవితంలో ఊహించుకుంటూ ఉంటారు. ఆ కథలో వాళ్లకు బాగా నచ్చిన పాత్రలో తమని తాము ఊహించుకొని మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు కథలు చెప్పే కాలం పోయి పిల్లలందరికి టీవీలో కార్టూన్లు, యూ ట్యూబ్‌లో బొమ్మల కథలను చూపిస్తున్నాం. అయితే ఒక పిల్లాడు తాను చూసే బొమ్మల్లో ఒక పాత్రకు ఉండే సూపర్ పవర్స్ తనకి కూడా ఉన్నాయని అనుకుంటున్నాడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చి తాను చేతులు కదపగానే చెట్టు ఆకులు కదలడాన్ని చూసి తనకున్న సూపర్ పవర్స్ వల్లే చెట్లు ఆకులు ఊగుతున్నాయని సంబరపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..) తాను చూసే కార్టూన్ పాత్రల్లో తనని తాను ఊహించుకుంటున్న ఒక పిల్లాడు తాను కూడా ఒక సూపర్ మ్యాన్ని అని అనుకున్నాడు. తనకున్న సూపర్ పవర్‌తోనే చెట్టు కొమ్మలు, ఆకులు ఊగుతున్నాయని తెగ సంబర పడిపోతున్నాడు. అసలు ఇంతకి ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఆకుల్ని చూస్తూ చేతులు ఆడించగానే చెట్టు ఆకులు కదులుతున్నాయి. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి నా శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని చెబుతాడు. దానికి వాళ్ల నాన్న కూడా నీ వల్లే అని తల ఊపుతాడు.నిజానికి ఆ చెట్టుకు కట్టిన ఊయలలో ఆ బాబు తండ్రి కూర్చోని పిల్లవాడు చేతులు కదపగానే ఊయలని కదుపుతున్నాడు. దీంతో ఆకులు కదులుతున్నాయి. అది తెలియని చిన్నారి తన శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని మురిసిపోతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసి క్వారంటైన్ సమయంలో చిన్నారి తండ్రి పిల్లవాడికి ఎంతో కొంత ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు భావిస్తుంటే మరి కొంతమంది పిల్లవాడిని అతని తండ్రి ఫూల్ చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. (సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..) Giving a little boy super powers from r/HumansBeingBros -
గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..
డల్లాస్ : చిన్నతనంలో నీళ్లున్న బకెట్లోకో లేదా టబ్బులోకో దిగి కేరింతలు కొడుతూ ఆడుకున్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేము. సంతోషమంతా మనదే అన్నట్లుగా ఆడుకున్న అమాయకత్వపు రోజులు మళ్లీ రావు. ఏదో ఒక సందర్భంలో ఆ సంఘటనలు గుర్తుకొచ్చినపుడు మాత్రం మనసు అదోలాంటి భావంతో ఉప్పొంగుతుంది. మన చిన్నతనాన్ని గుర్తుచేసేలా బాత్‌టబ్‌లో డ్యాన్స్ ఇరగదీసేసింది ఓ గొరిల్లా. డల్లాస్ జూకు చెందిన జోలా అనే మగ గోరిల్లా నీటితో నింపిన బాత్‌టబ్‌లోకి దిగి ఒళ్లు మైమరిచిపోయింది. అటుఇటు తిరుగుతూ.. చేతుల్తో నీటిని చిమ్ముతూ సంతోషంతో ఆడింది. ( లాక్డౌన్: ఆ వార్తలో నిజం లేదు ) 2017లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ దానికో శీర్షికను కూడా పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు..‘‘ గాళ్‌ఫ్రెండ్ తన ప్రేమను ఒప్పుకుందేమో, అందుకే ఈ సంతోషం... అది నేనే! ఓ వారం రోజుల తర్వాత స్నానం చేసినపుడు.. ఓ మై గాడ్! అతడెంతలా సంతోష పడుతున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు ) -
సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..
తన పుట్టిన రోజు నాడు స్నేహితుడు ఇచ్చిన గిఫ్ట్ చూసి సర్ప్రైజ్ అవ్వటమే కాదు.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడతను. అతడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎదుటి వ్యక్తి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అలాంటిది మరి. అంతలా సంతోష పెట్టే గిఫ్ట్ ఏమిచ్చాడా అని ఆలోచిస్తున్నారా. ఏం లేదు.. సంవత్సరం పాటు దూరంగా ఉన్న స్నేహితుడ్ని కానుక రూపంలో కలుసుకోవటమే. వీడియోలో.. ఓ వ్యక్తి అట్టపెట్టె పక్కన నిల్చుని ఉన్నాడు. అంత పెద్ద అట్టపెట్టలో తనకు వచ్చిన గిఫ్ట్ ఏంటా అని ఆలోచిస్తూనే దాన్ని తెరిచాడు. కానుక రూపంలో ఉన్న స్నేహితుడ్ని చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ( మర్కజ్‌తో లింకైన కరోనా కేసులు ఎన్నో తెలుసా ) క్షణాల్లో తేరుకుని, సంవత్సరం పాటు స్నేహితుడికి దూరంగా ఉండి, పుట్టినరోజు నాడు అతడ్ని చూసిన సంతోషంలో బర్త్‌డే బాయ్ ఉక్కిరిబిక్కిరై.. ఎదుటి వ్యక్తిని బాహువులలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. 2019 నవంబర్‌లో విడుదలైన 20 సెకన్ల ఈ టిక్‌టాక్ వీడియోకు 48 మిలియన్ల వ్యూస్, 8.5మిలియన్ల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోను రెడ్డిట్‌లో మళ్లీ విడుదల చేయగా మరోసారి వైరల్‌గా మారింది. ( హ్యాట్యాఫ్ పోలీస్ సాబ్.. చేతుల్లేని కోతికి.. ) -
మా అమ్మను వెతకండి ప్లీజ్!
బాతు పిల్లలకి ఎస్కాట్‌గా పోలీసు ఆఫీసర్ ఉండటం మీరెక్కడైనా చూశారా? అలాంటి ఒక విషయం టెక్సాస్‌లోని హౌస్టన్ మెమోరియల్ పార్క్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్లితే మెమోరియల్పార్క్లో 6 బాతు పిల్లలు మా అమ్మ కనిపించడం లేదు, చూపించరా అన్నట్లు ఒక పోలీసు ఆఫీసర్ వెంట వరుసగా నడుచుకుంటూ వెళ్లాయి. అతను వాటికి అమ్మను చూపించడానికి సరస్సు వైపు వెళితే అవి కూడా అతనితో పాటు అవే మార్గంలో వెళ్లాయి. (కనువిందు చేస్తున్న వింత స్నేహం!) ఈ వీడియోని హౌస్టన్ పోలీసు డిపార్ట్మెంట్ వారి ఫేస్బుక్ ఖాతలో పోస్ట్ చేశారు. అసిస్టెంట్ చీఫ్ లారీ స్టార్వైట్ బాతు పిల్లలకు ఎస్కాట్‌గా మారి వాళ్ల అమ్మను కనుగోవడానికి సహాయపడ్డారు. గుర్తుపెట్టుకొండి,ఈ సమయంలో పార్క్ మూసివేయబడి ఉన్నది. హౌస్టన్ పార్క్‌కి సంబంధించిన అన్ని విషయాలు కంట్రోల్లో ఉన్నాయి అనే క్యాప్షన్‌తో వీడియోని పోస్ట్ చేశారు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్‌గా మారాయి. ఈ వీడియో పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాతుపిల్లలకు వాళ్ల అమ్మను కనుగొనడంలో సాయపడి మంచి పని చేశారు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ( లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్! ) -
కనువిందు చేస్తున్న విచిత్ర బంధం!
గుర్రం, కుక్కల స్నేహం గురించి మనం ఏ కథల పుస్తకంలోనో, సినిమాల్లోనో చూస్తాం. కానీ నిజంగానే గుర్రం, కుక్కలు ఒకదానినొకటి ముద్దాడుకుంటున్న వీడియో ఒకదానిని యానిమల్స్ బీయింగ్ బ్రోస్ అనే బ్లాగ్ వారు గుర్రం, కుక్క బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గుర్రం కుక్కకు వేసిన టీషర్ట్‌ని పట్టుకొని లాగుతుంది. కుక్క వెంటనే గుర్రానికి దగ్గరగా వచ్చి దాన్ని ముద్దాడుతుంది. 14 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన జంటను చూసి నెటిజన్లు వాళ్లకు తోచినట్లు స్పందిస్తున్నారు. ఒకతను నిజంగా గుర్రం కుక్కను పైకి లాగుతుందనుకున్నాను అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ దీనిపై స్పందిస్తూ గుర్రం, కుక్కకి ఆయా(సంరక్షకురాలు) లాంటిదని కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ఈ రెండింటికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని చెప్పండి అని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకి 200కి పైగ కామెంట్స్ రాగా, లక్ష డైబ్బైవేల మందికి పైగ వీక్షించారు. ఇది చదవండి: వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం -
కనువిందు చేస్తున్న వింత స్నేహం!
-
వైరల్: లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్!
మెక్సికో : జూ ఎన్‌క్లోజర్‌లోని ఓ చింపాంజీ మహిళకు లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఈ సంఘటన న్యూ మెక్సికోలోని ఏబీక్యూ బయోపార్క్ జూలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ కావటంతో వారం రోజుల క్రిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం న్యూ మెక్సికోకు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి అక్కడి బీక్యూ బయోపార్క్ జూకు వెళ్లింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ చింపాంజీ ఆమెకు బాగా నచ్చటంతో దానికి దగ్గరగా వెళ్లింది. మొదట ఆ చింపాంజీ వారి వైపు చూడలేదు. ఆ మహిళ కొన్ని పిల్లి మొగ్గలు వేయటంతో ఆ కోతి ఆమె వైపు తిరిగింది. ఆమె దాని కళ్లలోకి చూస్తూ పెదాలను ముందుకు చాపింది. అంతే అటువైపునుంచి ఆ చింపాంజీ కూడా పెదాలను చాచి ఆమెను ముద్దుపెట్టుకుంది. అయితే ఇద్దరి మధ్యా ఎన్‌క్లోజర్ అద్దం ఉండటం గమనార్హం. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్! .. బ్యూటీ అండ్ ది బీస్ట్..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కరోనా: మనుషులకు సరే, మరి దేవుళ్లకు ) -
సామజవరగమన.. ఇది నీకు తగునా!
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠాపురంలో’ సినిమాలోని ‘సామజవరగమన నిను చూసి ఆగగలనా!’ అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాట నచ్చిన వారితోపాటు పాట మెచ్చని వారు కూడా ఈ పాటకు పారడీలు కట్టి మరీ పాడుతున్నారు. సోషల్ మీడియాను ఊపుతున్నారు. (సామజవరగమన పాట అలా పుట్టింది..) ‘సామజవరగమన ఇంత షాపింగ్ నీకు తగునా! కట్టుకున్న మొగడినే కనికరించే లలనా!’ అంటూ ఒకరు, ‘సామజవరగమనా ఓ భర్త నీకు తగునా! అంటూ మరొకరు మాటల కూర్పుతో నవ్విస్తున్నారు. ఏడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుహన రాజకీయాల గురించి ‘నీ కళ్లకు ఇంకా మాయరోగం పోనే లేదంటా, ఆ చూపులకింక పచ్చ కామెర్లు పోవా ఇక అసలు!’ అంటూ వ్యంగోక్తులు విసురుతున్న వారూ ఉన్నారు. త్యాగరాజ కృతి ‘సామజవరగమన’ను ఇలా అవమానిస్తారా ? మీకు పోయే కాలం వచ్చిందీ’ అంటూ శాపనార్థాలు పెడుతున్న సనాతన వాదులు లేకపోలేదు. వారిలో కూడా ‘ఇది శ్రీకృష్ణుడి గురించి పాడారు’ అని కొందరంటే ‘లేదు శ్రీరాముడి గురించి పాడారు’ అంటూ మరికొందరు వాదులాడుకుంటున్నారు. ఎవరి గురించి పాడినా ‘సామజవరగమన’ అంటే తెలుగులో మాత్రం ‘ఏనుగులా గాంభీర్యంగా నడచివొస్తున్నా’ అని అర్థం. మొత్తం సంస్కృతంలో త్యాగరాజ కృతి నుంచి ‘సామజవరగమన’ అన్న ఒక్క పదాన్ని మాత్రమే పాట పల్లవిగా తీసుకున్నారు. త్యాగరాజు కృతి ‘సామజవరగమన’ పాటను హిందోళ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడడం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2013లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమాలో ఎస్ జానకి ఈ పాటను పాడడం ద్వారా మరో తరానికి పరిచయం చేశారు. కొంత సినిమా టిక్‌గా పాడనన్న పశ్చాత్తాప భావంతో ఆమె ఆ తర్వాత ఈ పాట సహ పలు త్యాగరాజ కీర్తనలను పాడి ప్రైవేట్ ఆల్బమ్‌గా విడుదల చేశారు. గాన గాంధర్వుడు ఘంటసాల 1971, డిసెంబర్లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సంగీత కచేరి ఇచ్చినప్పుడు అక్కడి శ్రోతల డిమాండ్ మేరకు ‘సామజవరగమన’ త్యాగరాజ కృతిని పాడారు. తమిళనాడులోని తిర్పూర్‌లో కూడా ఆయన ఓసారి పాడిన రికార్డు ఉంది. బాల మురళి, ఎస్. జానకి, ఘంటసాల గాన మాధుర్యాన్ని అమితంగా ఆస్వాదించే శ్రోతలు, కొత్త పాట అర్థంపర్థంలేని పదాల కూర్పు కుప్పని, రాగాలాపన కూడా లేని కూని రాగమని విమర్శిస్తున్నన్నారు. ఎవరేమన్నా, అనుకున్నా నేటి కుర్రకారును కుదిపేస్తున్న ‘సామజవరగమన’ను కాదనగలమా! అని ఆ మీడియాలో మనగలమా!? -
సామజవరగమన.. ఇది నీకు తగునా!
-
మిరాకిల్.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు
చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. కారు డోర్లు లాక్ వేయకపోవడం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో... నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయతో తెలియజేసే వీడియోను ట్విట్ చేశాడు పంకజ్ నైన్ అనే ఐపీఎస్ అధికారి. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోర్ లాక్ చేయకపోవడంతో టర్నింగ్ పాయింట్ వద్ద డోర్ లాక్ తెరచుకొని ఓ చిన్న బాలుడు కిందపడ్డాడు. హైవే రోడ్డు.. నలుదిక్కుల వాహనాలు ప్రయాణిస్తున్నా .. అదృష్టంకొద్ది ఈ బుడ్డోడు బతికిబయటపడ్డాడు. కారులోనుంచి కిందపడే సమయానికి ఎదురుగా ఓ బస్సు, బైక్.. పక్కనుంచి ఓ ఆటో వస్తుంది. బాలుడు కిందపడగానే అందరూ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదమేమి కాలేదు. వెంటనే బాలుడి తండ్రి వచ్చి.. బుడ్డొడిని కారులో తీసుకొని వెళ్లాడు. అయితే తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డోర్ లాక్ వేయకుండా.. ఉండడం వల్లే బాలుడు కిందపడ్డాడు ‘ పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కారు డోర్లు లాక్ చేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోండి. పిల్లలు సీటులో సరిగా కూర్చున్నారా లేదా చెక్ చేసుకొని ప్రయాణించండి. అందరూ ఈ బాలుడిలాగా అదృష్టవంతులు ఉండరు కదా’ అని పంకజ్ ట్వీట్ చేశారు. -
మిరాకిల్.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు
-
వైరల్: థ్యాంక్స్ చెప్పిన తల్లి ఏనుగు.. నెటిజన్లు ఫిదా
మనకు సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పడం మన కనీస ధర్మం. ఈ విషయం తెలిసీ తెలియక చాలా మంది కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటారు. కొంత మంది అయితే చెప్పేదేముందిలే అంటూ లైట్ తీసుకుంటారు. కానీ జంతువులు మాత్రం పొందిన సహాయాన్ని మర్చిపోలేవు. దీనికి తాజాగా వైరల్ అయిన ఓ వీడియోనే నిదర్శనం. బావిలో పడిపోయిన తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది ఓ తల్లి ఏనుగు. సేఫ్‌గా బయట పడ్డాముగా ఇంకేముందిలే అని మనుషుల్లా అలోచించకుండా..తన సైగలతో రక్షించిన వారందరికి థ్యాంక్స్ చెప్పింది. వీడియోలో ఏముందంటే.. ఓ పిల్ల ఏనుగులో అనుకోకుండా లోతైన బావిలో పడిపోయింది. పైకి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా రాలేకపోయింది. తల్లి ఏనుగుతో సహా మిగతా ఏనుగులు కూడా ఏమీ చేయలేకపోయాయి. అరుపులు విన్న స్థానికులు లోయలో పడిన ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. జేసీబీలో సహాయంతో మట్టిని బావిలోకి తోస్తూ ఏనుగు బయటకు వచ్చేలా చేశారు. బయటపడ్డ ఏనుగు వెంటనే తన తల్లి ఉన్న గుంపులోకి పరగెత్తింది. పిల్ల ఏనుగు రావడంతో గుంపు అంతా అడవిలోకి వెళ్లింది. తల్లి ఏనుగు మాత్రం మరలా వెనక్కి తిరిగి తొండం పైకిలేపి ఊపుతూ కాపాడిన వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘అది అద్భుతమైన జంతువు’, ‘హృదయాలను కదలించే ఘటన..మనుషులు జంతువులతో సహజీవనం చేయ్యొచ్చు’, ‘వావ్.. జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’, ‘ బిడ్డను కాపాడిన వారిని తల్లి ఏనుగు ఆశీర్వదించింది’, ‘మనుషుల కంటే జంతువులే బెటర్’ అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. -
వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం
‘ఇక నా పని అయిపోయింది. ‘కుక్క చావు’ చావాల్సిందే. ఈ రోజుతో నా జీవితం ముగుస్తుంది. ఆ కొండ చిలువకు ఆహారంగా మారాల్సిందే’ అని అనుకుంది కొండ చిలువ నోటికి చిక్కిన ఓ కుక్క. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు కనిపించారు. వచ్చారు.. వచ్చారు.. నా వాళ్లు వచ్చారు. ఇక నువ్వు నన్నేం చేయలేవు అంటూ గంభీర ముఖంతో పాము వైపు చూసింది. ‘నీ వాళ్లు వస్తే నాకేంటే.. నా పట్టు విడిపించడం అంత వీజీ కాదు. నాతో పెట్టుకునే ధైర్యం వాళ్లకు లేదు. నా దగ్గర వచ్చేంత సాహసం చెయ్యలేరు’ అంటూ తన పట్టును మరింత బిగించింది ఆ కొండ చిలువ. కానీ కొండ చిలువ ఆశ అడియాశలు అయ్యాయి. కుక్క బతికింది. కుర్రాళ్లు హీరోలయ్యారు. వారు చేసిన సాహసం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారులను నెటింజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. ఏ జంకు బెదురు లేకుండా కొండచిలువపై దాడి చేసి కుక్కను రక్షించారు. కుక్కను విడిపించడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. తమ చేతికి దొరికిన వాటిని కొండ చిలువపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ, దైర్య సాహసాలు ప్రదర్శించారు. అప్పటకీ కొండ చిలువ కుక్కను విడవకపోవడంతో చిన్నారులు మరింతగా ప్రయత్నించారు. ఒకరు తోకను పట్టుకుంటే , మరొకరు కొండ చిలువ తలను పట్టుకున్నాడు. ఇంకొకరు కుక్కను జాగ్రత్తగా విడదీశారు. చివరికి ఎలాగోలా ప్రయత్నించి కుక్కను విడిపించారు. కుక్క అక్కడి నుంచి కుయ్యో.. మెర్రో.. అనుకుంటూ పరుగు పెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముగ్గురు కుర్రాళ్ల సాహసంపై నెటిజన్లు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. -
వైరల్: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా!
న్యూయార్క్ : 'కాకిలా కలకాలం బతికేకంటే హంసలాగా ఒక్కరోజు బతికినా చాలు' అంటుంటారు సాధారణంగా. మనిషి ఎలా బ్రతకకూడదో కాకుల్ని ఉదాహరణగా చూపుతుంటారు. కానీ నేటి సమాజంలో కాకుల్ని చూసి మనిషి నేర్చు కోవాల్సింది చాలా ఉందని అవి నిరూపిస్తున్నాయి. ఓ కాకి చేసిన చిన్న పని దాన్నో ఇంటర్నెట్ హీరోను చేసేసింది. దాని తెలివికి నెటిజన్లు జోహార్లు చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని రీసైకిల్ డస్ట్ బిన్మీద వాలిన ఓ కాకి బాటిల్‌ను డస్ట్‌బిన్ లోపల వేయటానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు ప్రయత్నించి దాన్ని లోపలపడేసి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికాకు చెందిన ఓ వ్యక్తి స్టాన్స్ గ్రౌండెడ్ అనే ట్విటర్ ఖాతాలో ఉంచాడు. దీంతో ఆ కాకి సోషల్ మీడియా ఫేమ్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ‘‘కాకులు చాలా తెలివైనవి.. ఆ కాకిని చూసి మనిషి బుద్ది తెచ్చుకోవాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో.. -
సియాచిన్‌లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్‌లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019 -
పోలీసు కష్టాలంటే ఇవే మరి : వైరల్
పోలీసుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలవుల్లేని ఉద్యోగం.. ప్రశాంతత లేని జీవితం. అర్థరాత్రి పిలిచినా పరిగెత్తుకెళ్లాలి. చిన్న పిల్లలు ఉన్న పోలీసు తండ్రులకైతే చెప్పనక్కర్లేదు. తండ్రి తనతో ఎక్కువసేపు గడపాలనే చిన్ని మనసును కష్టపెట్టక తప్పదు వారికి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పోలీసు అధికారి ఆఫీసుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి కొడుకు పోలీసు తండ్రి కాళ్లు గట్టిగా పట్టుకుని వెళ్లవద్దంటూ ఏడుస్తుంటాడు. ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించలేక.. ఆఫీసుకు వెళ్లకుండా ఉండలేక అతడు పడ్డ వేదన వర్ణణాతీతం. పట్టువదలని విక్రమార్కుడిలాంటి కొడుకు తన పట్టు సాధించడాని పట్టు విడవకుండా తండ్రిని పట్టిన పట్టు సామాన్య జనాన్ని కదిలిస్తుంది. ఒకటి ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన చాలా మంది హృదయం ద్రవించింది. పోలీసు కుటుంబాలకు జోహార్లు.. అందరి లాగా వారికి కూడా 8 గంటల డ్యూటీ, వారంతంలో సెలవు ఉండేలా కృషి చేయాలి.. పోలీసు దుస్తులు ధరించిన అందరికి సెల్యూట్!.. అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు తమ సానుభూతి ప్రకటిస్తున్నారు. -
సీరియస్ మీటింగ్ ఇంతలో అనుకోని అతిథి..
-
అనుకోని అతిథి రాకతో పరుగో పరుగు
బీజింగ్ : సీరియస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనుకోని అతిథి అది కూడా ఆ సమావేశంతో సంబంధం లేని వారు వస్తే కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. ఆ అతిథి కాస్తా ఏ పామో, పులో అయితే ఆ పరిస్థితి ఇక వర్ణణాతీతం. మీటింగ్ సంగతి దేవుడేరుగు ముందైతే కాలుకి బుద్ధి చెప్పి పరుగందుంకుంటారు. ఇలాంటి సంఘటనే జరిగింది చైనాలో. వివరాలు.. చైనా నాన్నింగ్ సిటీలోని ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంకు సిబ్బంది మీటింగ్‌లో భాగంగా సమావేశమయ్యారు. మీటింగ్ జరుగుతుండగా.. ఇంతలో ఆ గదిలోని పైకప్పు నుంచి ఓ ఐదు అడుగుల పైథాన్ కిందపడిపోయింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య పైథాన్ పడడంతో.. సిబ్బంది అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ గందరగోళానికి జడిసిన ఆ పైథాన్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ లోపు సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని.. ఆ పైథాన్‌ను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. -
పోలీసులు చూస్తుండగానే..
-
పోలీసులు చూస్తుండగానే మరో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మీరట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీకి చెందిన నర్సింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, తనతోపాటే చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఉంటున్న జాగృతి విహార్‌కు ఆదివారం నాడు వెళ్లింది. జాగృతి విహార్, వారు చదువుతున్న నర్సింగ్ కాలేజీకి ఎదురుగానే ఉంది. మీరట్ వైద్య యూనివర్శిటీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఆ జాగృతి విహార్లోనే ఉంటారు. అందులో కిరాయి తీసుకొని ఉంటున్న ముస్లిం యువకుడి వద్దకు ఆ విద్యార్థిని వెళ్లడం గమనించిన స్థానికులు విశ్వ హిందూ పరిషత్‌కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ జంటను పట్టుకొని కొట్టారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా, మహిళా పోలీసులు వచ్చి మహిళను రక్షించి జీపులో తీసుకెళ్లారు. తాము జాగృతి విహార్‌పై దాడి చేసినప్పుడు ఆ యువ జంట ప్రేమించుకుంటున్నారని, వారిని హెచ్చరించి పోలీసులకు అప్పగించామని, వారిపై చేయి చేసుకోలేదని వీహెచ్‌పీ స్థానిక నాయకుడు బలరాజ్ దూంగర్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి హెపూర్‌లో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి, ముస్లిం యువకుడిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమేనని, వారి మధ్య మరెలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ వస్తున్నారు. బుధవారం రాత్రి వరకు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే విద్యార్థినిగానీ, ముస్లిం యువకుడుగానీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆదివారం ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నర్సింగ్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సంఘటనపై కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమది కో ఎడ్యుకేషన్ కాలేజని, విద్యార్థిని, ముస్లిం యువకుడు క్లాస్మేట్స్ అని తెలిపారు. నర్సింగ్ కాలేజీ అవడం వల్ల ల్యాబుల్లో కూడా ఆడ, మగ కలిసే పనిచేయాల్సి వస్తుందని, కలుసుకోవద్దని, పరిచయాలు పెంచుకోవద్దని వారికి తాము చెప్పలేమని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కళాశాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. యూనివర్శిటీలో హిందూత్వ సంస్థల ఉనికి పెరిగినప్పటి నుంచి అశాంతి పరిస్థితులు పెరుగుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం శోచనీయమని, అందుకే మహిళా పోలీసులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని సబ్ ఇనిస్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. పోలీసుల సమక్షంలోనే ముస్లిం యువకుడిపై గూండాలు దాడి చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి చర్యలను సహించబోమని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని యూపీ డీజీపీ ట్వీట్ చేశారు. -
దెబ్బకు ట్రక్కు వంద ముక్కలైంది.. వారు మాత్రం..
కెనడా : అదృష్టం బాగుంటే సింహం బోనులో అడుగుపెట్టి దర్జాగా బయటకు తిరిగిరావచ్చంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే కెనడాలో చోటుచేసుకుంది. రోడ్డుపై రీపేర్ల నిమిత్తం ఆపిన ఓ ట్రక్కును వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఆ వేగానికి ట్రక్కు ముక్కలు ముక్కలు అయినా కూడా దాన్ని రిపేర్ చేస్తున్న వారికి మాత్రం ఏమీ కాలేదు. కేవలం చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టోరంటో హైవేపై ఓ ట్రక్కు రిపేర్ల కోసం ఆగింది. ఓవ్యక్తి ఆ వాహనాన్ని రిపేర్ చేసే పనిలో బిజిగా ఉన్నాడు. రోడ్డుపై వాహనం ఆగిపోవటం వల్ల ఇతర వాహనాలతో ప్రమాదం జరగకుండా ఉండటానికి అక్కడ ఓ జెండాను ఎగరేశారు. కొద్దిసేపటి తర్వాత ఓ తెల్లకారు వేగంగా ట్రక్కువైపు దూసుకు వచ్చింది. కారు వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు ముక్కలు ముక్కలుగా అయ్యి ఎగిరిపడింది. దాన్ని రిపేర్ చేస్తున్న వ్యక్తి, లోపల ఉన్న మరికొందరు అంతా ఎగిరిపడ్డారు. అయినా వారికి పెద్ద గాయాలేమీ కాలేదు.. చిన్న చిన్న గాయలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు.. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. -
తాగిన మత్తులో బతికున్న కోడిని..
-
పీకలదాకా తాగి బతికున్న కోడిని పీక్కుతిన్నాడు
సాక్షి, హైదరాబాద్ : మద్యం తాగిన మత్తులో కొంతమంది దారుణాలకు తెగబడుతుంటారు. ఇంకొంతమంది జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కేసముద్రంలో ఓ యువకుడు మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం తాగారు. పక్కనే చికెన్ షాపులో ఓ కోడిని కొనుక్కుని ఇంటికి బయల్దేరారు. మద్యం అతిగా సేవించడంతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు యువకులు ఆర్వోబీ రోడ్డు సమీపంలో పడిపోయారు. ఓ యువకుడు పూర్తిగా స్రృహ కోల్పోయాడు. మరో యువకుడు మాత్రం చేతిలో ఉన్న కోడి మెడ కొరికేసి, బతికున్న దాన్నే కొరుక్కుతిన్నాడు. ఈ తతంగాన్నంతా రోడ్డున వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో చూపిన వారంతా వీడెంత తాగాడురా.. బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సదరు యువకుల వివరాలు తెలియరాలేదు. -
అలాంటిది చూడ్డం చాలా అరుదు : సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికేట్‌కు దూరమైనా, ట్వీటర్లో తనకు నచ్చిన వీడియోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. శనివారం ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన తన పోస్ట్‌లో ఓ పేషంట్‌ను తెగపొగిడేశారు. ఆ పేషంట్ డాక్టర్లకు సహకరిస్తున్న తీరుకు ఆయన ముచ్చటపడిపోయారు. ఇంతకీ ఎవరా పేషంట్ అనుకుంటున్నారా?.. సెహ్వాగ్ పొగిడింది, ముచ్చటపడ్డది ఓ ఏనుగును చూసి. ‘‘ఇలాంటిది చూడ్డం చాలా అరుదు. ఎంత అందంగా డాక్టర్లకు సహకరిస్తోంద’’ని పేర్కొన్నారాయన. ఆయన పోస్ట్ చేసిన ఆ వీడియోలో... ఓ ఏనుగు మెల్లగా డాక్టర్ వెంట నడుచుకుంటూ స్కానింగ్ రూంలోకి వస్తుంది. డాక్టర్ చెప్పగానే బుద్దిగా నేలపై పడుకుంటుంది. ఓ సారి కొద్దిగా లేవమనగానే లేచి మళ్లీ పడుకుంటుంది. డాక్టర్లు స్కానింగ్ చేసేంత వరకు అలా కదలకుండా నేలపై పడుకుంటుంది. Rare sight. How beautifully does this patient cooperate with the doctors ! pic.twitter.com/5Fp7Wo14U3 — Virender Sehwag (@virendersehwag) July 21, 2018 -
పెళ్లి వేడుకకు పంజరంలో వచ్చిన జంట
-
వెరైటీ పెళ్లి.. గాల్లో వధూవరులు..
న్యూఢిల్లీ : జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం పెళ్లి. అలాంటి పెళ్లి జీవితాంతం తియ్యని జ్ఞాపకంగా గుర్తుండేలా చాలా మంది రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ పెళ్లిని ఉత్సవంలా, మరికొంత మంది మరుపురాని వేడుకలా జరుపుకున్నారు. కొంత మంది గుర్రాలపై ఊరేగింపుగా రావడం, ఇంకొంత మంది హెలికాప్టర్లో పెళ్లిమండపానికి చేరుకోవడం ఇలా భిన్నంగా పెళ్లిళ్లు చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా మరో జంట ఇంకాస్త వెరైటీగా కల్యాణ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి ఓ విద్యుత్ పంజరంలో వారిద్దరూ వచ్చారు. ఆకాశం నుంచి వారిద్దరినీ ఓ డేగ తీసుకువస్తున్నట్లుగా ఓ క్రేన్ సాయంతో వారిని కిందకి దించారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. వధూవరులు దిగుతున్న సమయంలో ‘బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..’అనే క్లాసికల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండడంతో ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
శిక్షకుడిని కాపాడేందుకు పోలీసు కుక్క నానా తిప్పలు
-
మనిషి కన్నా జంతువే మిన్నా.. వైరల్ వీడియో
స్పేయిన్: మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిన సంఘటన ఒకటి స్పేయిన్‌లో చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన శిక్షకుడిని కాపాడేందుకు ఓ పోలీసు కుక్క నానా తిప్పలు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ పోలీసు అధికారి కే-9 శిక్షకునిగా పనిచేస్తున్నారు. శిక్షణలో భాగంగా అధికారి సెల్యూట్ చేస్తూ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలీపోయినట్టు నటించారు. దీంతో తన దగ్గరలో ఉన్న ఆఫీసర్ పోంచో అనే పోలీసు కుక్క అధికారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. అధికారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఛాతిపై ఒత్తిడి పెంచేందుకు పైకి కిందకు దూకుతూ.. మద్యలో మద్యలో శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఆతని ముఖంపై తల పెట్టి గమనించింది. కొంత సమయం తరువాత అధికారి లేచి కూర్చోవడంతో కుక్క ఆనందంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను మాడ్రిడ్ మున్సిపల్ పోలీసులు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన నాలుగు రోజులకే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో ఆ కుక్క సోషల్ మీడియాలో హీరో అయిపోయింది. -
అభిమాన నటున్ని కలిసిన డాన్సింగ్ అంకుల్
డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవ. ఇతనికి హీరో గోవిందా అంటే ఎంత అభిమానమో తెలిసిందే. శ్రీవాస్తవ తన అభిమాన హీరో గోవిందాను అనుకరిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయము తెలిసిందే. శ్రీవాస్తవ చేసిన డాన్స్‌కు గోవిందా కూడా ఫిదా అయ్యాడు. ఫోన్ చేసి మరి శ్రీవాస్తవను అభినందించడమే కాక కలుస్తానని కూడా మాటిచ్చాడు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చడానికి మాధురి దీక్షిత్ డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ దివానే’ కార్యక్రమం అందుకు వేదికయ్యింది. ఈ షోలో గోవిందా ‘డాన్సింగ్ అంకుల్’ కలవడమే కాక అతనితో పాటు కాలు కదిపి ప్రేక్షకులను అలరించాడు. ‘డాన్స్ దివానే షో’ ద్వారా మాధురి దీక్షిత్‌తో కూడా డాన్స్ చేసే అవకాశం లభించింది ‘డాన్సింగ్ అంకుల్’కు. ఈ షోలో మాధురి కూడా శ్రీవాస్తవ, గోవిందాలతో పాటు డాన్స్ చేసింది. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. -
సీఎంను చంపేస్తా.. వైరల్ వీడియో!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానంటూ హెచ్చరిస్తూ ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు ఎన్నారై వ్యక్తి. వీడియోలో ముఖ్యమంత్రిని పరుష పదాలతో దూషించాడు. గతంలో ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేసిన తాను సీఎంను చంపడానికే సరిపడా డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. సీఎం విజయన్‌తోపాటు మరో మంత్రి, గతంలో టీవీ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఓ వ్యక్తిని అతను అసభ్యకర పదజాలంతో దూషించాడు. అతడు పోస్టు చేసిన ఈ వీడియో గంటలోపే వైరల్‌గా మారింది. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపటికే సీఎంకు క్షమాపణలు చెబుతూ మరో వీడియో పెట్టాడు. ఎస్ఎన్ కృష్ణకుమార్ నాయర్ (50) అనే కేరళ వ్యక్తి దుబాయ్‌లో సీనియర్ రిగ్గింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. సీఎంను తిడుతూ ఓ వీడియోను మంగళవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘నా పేరు కృష్ణకుమార్నాయర్. నేను నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ముఖ్యమంత్రిని చంపడానికే డబ్బు పోగు చేసున్నాను. కొద్ది రోజుల్లో కేరళకు వస్తున్నాను. నేను ఎవర్నైనా చంపాలనుకుంటే.. చేసి తీరుతాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముఖ్యమంత్రి తనను క్షమించాలంటూ మరో వీడియోని పోస్ట్ చేశారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని, తనను క్షమించాలని సీఎం, మంత్రులను కోరారు. తన వయస్సు చూసైనా ముఖ్యమంత్రి క్షమించాలని వేడుకున్నాడు. సీఎంను తిడుతూ ఉన్న వీడియోను తన ఫేస్బుక్ అకౌంట్లో నుంచి తొలగించాడు. ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినందుకుగాను కృష్ణకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పూల కోసం.. అత్తను చావబాదింది
కోల్‌కతా : తన అనుమతి లేకుండా పెరట్లోని పూలు కోసిందనే కారణంతో వృద్ధురాలనే కనికరం లేకుండా అత్తను చావబాదిందో కోడలు. విషయాన్ని గమనించిన ఇంటి పక్కన వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అత్తను హింసించిన కోడల్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యశోదాపాల్ అనే 75 ఏళ్ల వృద్ధురాలు భర్త మరణించడంతో కొడుకు, కోడలితో పాటు గారియాలో నివాసం ఉంటోంది. యశోదకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. కోడలు నిత్యం ఆమెను హింసిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే బుధవారం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తున్న యశోదను చూసిన కోడలు కోపంతో ఆమెపై దాడి చేసింది. ‘నా అనుమతి లేకుండా పూలు కోస్తావా’ అంటూ జుట్టు పట్టి ఈడ్చుకుంటూ అత్తను చావబాదింది. ఇందుకు సంబంధించిన వీడియోను కోల్‌కతా పోలీసులు అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. A video was viral today in which a elderly lady was tortured by her daughter in law. Team #BANSDRONI PS traced the tormentor and arrested her. pic.twitter.com/wSUrenYWGc — DCP Jadavpur Divn Kolkata (@KPSouthsubnDiv) May 30, 2018 -
ఈ వీడియో చూసిన తర్వాతైనా..
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో ప్రకటనల్లో చూస్తుంటాం. పొగ తాగితే మనకే కాదు.. మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదమని తెలిసినా చాలా మంది ఆ వ్యసనాన్ని మానుకోలేకపోతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. పొగ తాగడం వల్ల ఏడాదికి సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో సుమారు 60 లక్షల మంది ప్రత్యక్షంగా పొగతాగడం వల్ల, మరో 9 లక్షల మంది పొగతాగే వారి పక్కనుండటం వల్ల (సెకండ్ స్మోకర్స్‌గా) మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ నేపథ్యంలో నార్త్ కరోలినాకు చెందిన నర్స్ అమాండ ఎల్లర్.. తాను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే పొగరాయుళ్లు ఇక స్మోకింగ్ మానేయడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొగ తాగేవారి, తాగనివారి ఊపిరితిత్తుల పనితీరును వివరించే వీడియో పోస్ట్ చేసిన అమాండ.. ‘క్యాన్సర్ పేషెంట్, 20 ఏళ్ల పాటు రోజూ ఒక ప్యాకెట్ సిగరెట్ తాగిన వారి ఊపిరితిత్తులు. ఆరోగ్యకరమైన వ్యక్తి ఊపిరితిత్తులు ఇవి. వీడియో చూశాక కూడా స్మోకింగ్ చేయాలనుకుంటున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన పోస్ట్ 5 లక్షల షేర్లతో దూసుకుపోతోంది. వీడియోలోని నల్లగా మారిన ఆ ఊపిరితిత్తులను చూస్తే.. పొగ తాగడం మానేయాలకున్న వారు.. ఒక్కసారిగా మానేయడం వీలుకాకపోయినా.. క్రమ క్రమంగా మానేయడానికి ప్రయత్నిస్తే ఆమె పోస్ట్‌కి ఫలితం దక్కడంతో పాటు.. మీ ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
గర్భిణి ఆకతాయి చర్య.. వైరల్..
బీజింగ్: చిన్న పిల్లలు అన్నాక అపుడప్పుడు అనుకోకుండా తప్పులు చేస్తారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను ఎవరైనా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం నాలుగేళ్ల బాలుడు చేసిన చిన్న తప్పుకు పగబట్టి గాయలయ్యేలా చేసింది. తన కాలు అడ్డుపెట్టి అతడు కిందపడేలా చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే చైనాలోని రెస్టారెంట్‌కి ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి భోజనానికి వెళ్లింది. ఆ బాలుడు రెస్టారెంట్ ఎంట్రీ డోర్ వద్ద ఆడుతూ..అటు ఇటూ తిరుగుతున్నాడు. ఆ రెస్టారెంట్ డోర్‌కి దగ్గరలో ఉన్న ఓ టేబుల్ వద్ద సదరు 7 నెలల గర్భిణి తన భర్తతో కలిసి భోజనం చేస్తోంది. ఈ క్రమంలో ఆ బాలుడు డోర్ వద్ద నుంచి లోపలికి వెళ్తుండగా.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ పరదా ఆ మహిళకి తాకి ప్లేట్లో ఉన్న భోజనం ఆమెపై పడింది. దీంతో కోపానికి గురైన మహిళ..మరోసారి డోర్ వైపు వస్తున్న బాలుడికి కాలు అడ్డం పెట్టింది. అది గమనించని బాలుడు వేగంగా వచ్చి మెట్లపై పడిపోయాడు. అక్కడే ఉన్నఆ జంట బాలుడిని లేపడానికి కూడా ప్రయత్నించలేదు. దూరంలో ఉన్న బాలుడి తల్లి వచ్చి బాబుని ఆస్పత్రిలో చేర్చింది. అయితే ఆ బాలుడు తనంతట తానే కింద పడిపోయాడని తల్లి భావించింది. కానీ బాలుడు కోలుకున్నాక అసలు విషయం చెప్పాడు. వెంటనే ఆమె రెస్టారెంట్‌కి వెళ్లి సీసీ కెమోరా దృశ్యాలు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెకు 1000 యువాన్ల (దాదాపు రూ.10,500) జరిమానా కూడా విధించారు. అయితే ఆమె గర్భిణీ అని తెలుసుకున్న బాలుడి తల్లి కేసు విత్‌డ్రా చేసుకుంది. తనకు పిల్లలు ఉన్నారని మానవత్వంతో వదిలేస్తున్నాని ఆమె చైనా మీడియాకు తెలిపారు. ఆ వీడియో చైనాలో వైరల్ కావడంతో నిందితురాలు సిగ్గుతో తలదించుకుంది. వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పింది. తాను చేసిన పొరపాటును క్షమించాలని బాలుడి తల్లిదండ్రులను కోరింది.