Viral Video: Woman Rescued From 50-Feet Well In Kerala Wayanad - Sakshi
Sakshi News home page

50 అడుగుల లోతు బావిలో పడిన మహిళ..వీడియో చూస్తే షాక్‌

Published Thu, Aug 12 2021 2:01 PM | Last Updated on Thu, Aug 12 2021 5:20 PM

Woman Rescued Falls Into 50 Feet Deep Well In kerala - Sakshi

తిరువనంతపురం: ఇంకా భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే ఎంత ప్రమాదం నుంచి అయినా బయట పడతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణననే ఈ సంఘటన. 50 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయిన ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. వివరాలు.. కేరళలోని వయనాడ్ కు  చెందిన  ఓ మహిళ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతులో పడిపోయింది. అయితే దాన్ని గమనించిన స్థానికులు వెంటనే  అగ్నిమాపక శాఖవారికి సమాచారం అందించారు. హుటహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు.

ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో బావిలో పడిపోయిన మహిళను  పైకి లాగడానికి అగ్నిమాపక సిబ్బంది,స్ధానికులు ఓ నిచ్చెన లాంటి తాడును బావిలోకి దింపి, ఆమెను కాపాడిన దృశ్యాలును చూడవచ్చు. చివరకు ఎలాగోలా ఆమెను బయటకు తీశారు. కానీ ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అనే వివరాలు తెలియలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement