
కేరళ మన దేశంలో మొదటి మహిళా స్కూబా టీమ్‌ను సిద్ధం చేసింది. అగ్నిమాపక దళం నుంచి ఎంపిక చేసిన వారితో ఈ టీమ్‌ను తయారు చేసి ఇక పై వరద ప్రమాదాల్లో వీరి సేవను వినియోగించనుంది.
‘గన్నెట్స్’(The Gannets)... ఇదీ కేరళ(Kerala) అగ్నిమాపక శాఖ(Fire Department) తన ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ టీమ్‌కు(All Women Scuba Diving Team) పెట్టిన పేరు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో సముద్రపు లోతుకు దూసుకెళ్లి చేపలను నోట కరుచుకుని ఎగిరే పక్షులే ‘గన్నెట్స్’.
ఇకపై కేరళలో ఏవైనా జల ప్రమాదాలు సంభవిస్తే ఈ గన్నెట్స్ దూసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. వీరి మొత్తం సంఖ్య 17. ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ముగించుకొని ఈ టీమ్ మంగళవారం బాధ్యతల్లోకి వచ్చింది. భారతదేశంలో అందరు మహిళల స్కూబా రక్షణ దళం ఇదే.
100 మంది నుంచి...
కేరళలో వానకాలంలో ఊహించని వరదలు సర్వసాధారణంగా మారాయి. మనుషుల్లో నీళ్లల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే సామర్థ్యం ఉన్న స్కూబా డైవర్స్ ఉండాలని ప్రభుత్వం భావించింది. అయితే వారు ఎందుకు స్త్రీలు కాకూడదు అని ప్రశ్నించుకుంది. అగ్నిమాపక శాఖ నుంచి 100 మంది మహిళలను ఎంపిక చేస్తే వారిలో 17 మంది అన్ని విధాలుగా అర్హులుగా నిలిచి ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు.
కఠినమైన ట్రైనింగ్
కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అకాడెమీలో ఈ మహిళా సభ్యుల శిక్షణ 21 రోజుల పాటు జరిగింది. స్కూబా డైవింగ్‌తోపాటు నదులు, చెరువులు, సముద్రాల్లో నీటి స్వభావాన్ని బట్టి ఎలా రక్షణ చర్యలు చేపట్టాలో నేర్పారు. అండర్‌వాటర్ కెమెరాలు వాడటం కూడా ఇందులో భాగం.]
వీరికి 30 మీటర్ల లోతుకు వెళ్లి రక్షించడం నేర్పారు. ‘ట్రైనింగ్ మాకు మొదట్లో కష్టమైంది. కాని అన్ని దశలను దాటగలిగాం. ఇప్పుడు మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల సేవకు సిద్ధం’ అని ఈ టీమ్‌లోని మహిళలు అన్నారు. ఈ కొత్తశక్తికి స్వాగతం.
(చదవండి: చాట్ జీపీటీ బామ్మ..! ఆమె అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్)
Comments
Please login to add a commentAdd a comment