Scuba Diving
-
ద్వారకలో స్కూబా డైవింగ్
ద్వారక: ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్‌లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు. -
సాగర గర్భంలో పర్యాటకం
విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. – సాక్షి, అమరావతి ఎన్నెన్నో డైవింగ్ స్పాట్లు విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్‌లో 3 స్పాట్స్, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. అరుదైన చింతపల్లి.. ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్దీవులు, అండమాన్ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో మీటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్‌ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా.. పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్ చేయించడంతో పాటు అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్ వాటర్, అడ్వాన్స్ ఓపెన్ వాటర్ విభాగాల్లో డైÐŒ లు చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్ పూల్ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సమీపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో మాత్రమే డైవింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్‌ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. రెండు విధాలుగా.. విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్ మాస్టర్ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 మీటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో మీటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్ చేయిస్తారు. రెండింటిలోనూ 8–11 మీటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు. ప్రశాంత జలాల్లోనే.. ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్‌ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్‌కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్ నుంచి అకాడమీ సేవలను ప్రారంభించనున్నాం. – బలరామ్‌నాయుడు, లైవ్ ఇన్ అడ్వెంచర్స్, విశాఖపట్నం -
సముద్ర గర్భంలో చిన్నారి సాహసం
స్కూబా డైవింగ్‌లో పదేళ్ల చిన్నారి విశాఖ వేదికగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. చిచ్చరపిడుగు దేబప్రియ రుషికొండ సముద్ర జలాల్లో 35 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్రగర్భంలో స్కూబా డైవింగ్ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మొదటి డైవ్‌ని 40 నిమిషాల పాటు సముద్రంలో కొనసాగించిన దేబప్రియ.. రెండో డైవ్‌ని మరో 5 నిమిషాలు అదనంగా సాగర జలాల్లో కలియతిరుగుతూ 45 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్ బలరాం సారథ్యంలో చిన్నారి దేబప్రియ ఈ సాహస రికార్డుని నెలకొల్పింది. ఈ సందర్భంగా దేబప్రియకు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. తన పదో పుట్టిన రోజునే చిన్నారి ఈ రికార్డు సృష్టించడం కొసమెరుపు. చదవండి: (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం) -
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్', 'సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
Tharagai Aradhana: శెభాష్.. 9 నెలలకే ఈత నేర్చుకుని... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..
తారాగై ఆరాధన సముద్రంలో ఈదడానికే పుట్టినట్లుంది. సముద్రంతో మమకారం పెంచుకుంటూ పెరుగుతోంది. సముద్ర జీవులను కాపాడడానికే పని చేస్తోంది. సముద్రంలో చెత్త వేయవద్దని చెప్తోంది. చేపపిల్లలా నీటిలో మునిగి వ్యర్థాల అంతుచూస్తోంది. తారాగై ఆరాధన స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ ధరించి పడవలో నుంచి సముద్రపు నీటిలోకి దూకిందంటే మరో క్షణంలో కంటికి కనిపించదు. పడవలో నుంచి ముందుకు ఉరికిన దేహం నీటిని తాకడమే ఆలస్యం... బుడుంగున మునక వేస్తుంది. చేపపిల్లలాగ నీటి అడుగుకు చేరుతుంది. పాన్‌పరాగ్ సాషేలు, పాలిథిన్ కవర్లు... అవీ ఇవీ అనే తేడా లేకుండా సముద్రంలో ఉండకూడని వ్యర్థాలన్నింటినీ ఏరి వేస్తుంది. నిజానికి సముద్రానికే ఆ లక్షణం ఉంటుంది. ప్రాణం లేని వస్తువును సముద్రం తన గర్భంలో దాచుకోదు. తనలో రూపుదిద్దుకున్న ప్రాణులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునూ నిలవనీయదు. వీలయినంత త్వరగా బయటకు తోసేస్తుంది. అలలతోపాటు నిమిషాల్లో తీరానికి కొట్టుకు వచ్చేస్తుందా వస్తువు. కానీ పలుచటి ప్లాస్టిక్ కవర్లు, చిన్న చిన్న వక్కపొడి కవర్ల వంటివి సముద్రంలో నీటి అడుగున ఇసుకలో కూరుకుపోతుంటాయి. అలాంటి వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని తనంతట తానుగా ప్రక్షాళన చేసుకోవడం సముద్రానికి చేతకావడం లేదు. అలలకు శక్తి చాలడం లేదు. అందుకే... ఆ పని సముద్రం మీద ప్రేమ ఉన్న మనుషుల బాధ్యత అయింది. అంతటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్న సాహసి మన తారాగై ఆరాధన. ఈ పాప వయసు ఎనిమిదేళ్లు. ఇప్పటి వరకు ఆమె సముద్ర తీరంలోనూ, సముద్రంలోనూ కూరుకుని పోయి ఉన్న 600 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసింది. సముద్రపు అలలతో ఆడుకునే వయసులో ఇంత పెద్ద పర్యావరణహితమైన బాధ్యతను తలకెత్తుకుంది. ఏ పని చేస్తున్నా తన వెంట తండ్రి ఉంటాడని, అందుకే ధైర్యంగా చేసేస్తున్నానని చెప్తోంది ఆరాధన. నీటిలోనే పెరిగింది తమిళనాడు రాష్ట్రం, కరప్పగమ్లో పుట్టిన ఆరాధనకు సముద్రంతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. ఆరాధన తండ్రి అరవింద్ తరుణ్‌శ్రీ స్కూబా డైవింగ్ ఎక్సపర్ట్ మాత్రమే కాదు, ఇన్స్ట్రక్టర్ కూడా. చెన్నై, పాండిచ్చేరిల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు అరవింద్. తన కూతురిని చిన్న వయసులోనే ఏదైనా సాధించేలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. నవజాత శిశువుకు ఈత నేర్పించడం చాలా సులువు కూడా. ఆరాధనకు మూడు రోజుల పాపాయిగా ఉన్నప్పుడే నీటిలో తేలడం అలవాటు చేశాడు. తొమ్మిది నెలలకు నీటి తొట్టిలో వదిలితే ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఈదేది. రెండేళ్లు నిండినప్పటి నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా తయారైంది. ఐదేళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఏడేళ్లు వచ్చేటప్పటికి స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో ఆరితేరింది. తండ్రి నేర్పిన విద్య అరవింద్ ఇరవై ఏళ్లుగా ఇదే రంగంలో ఉండడం, సముద్ర జలాలకు జరుగుతున్న హానిని కూడా దగ్గరగా చూడడంతో మెరైన్ పొల్యూషన్‌ని అరికట్టాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఆరాధనకు స్కూబా డైవింగ్ నేర్పించడంతోపాటు సముద్ర జలాల పరిరక్షణ పట్ల కూడా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆరాధన సముద్ర జలాలను ప్రక్షాళన చేయడంతోపాటు సముద్రజలాలు కలుషితమైతే సముద్రంలో నివసించే జీవులకు ఎదురయ్యే ప్రాణహాని గురించి చెబుతోంది. అంతరించిపోతున్న సముద్ర జీవుల పరిరక్షణ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది. ఇందుకోసం స్కూళ్లకు వెళ్లి తన వయసు పిల్లలకు తనకంటే పెద్ద పిల్లలకు మెరైన్ కన్జర్వేషన్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆరాధన ‘సేవ్ ద ఓషన్’ కార్యక్రమంలో భాగంగా ఏకబిగిన పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది. ‘‘మా నాన్న గడచిన పదిహేడేళ్లుగా పదివేల కిలోల వ్యర్థాలను వెలికి తీశాడు. నేను ఆరువందల కిలోలు తీశాను. ఇలా సాగర ప్రక్షాళన చేయడమే కాదు, ఇకపై ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పారవేయకుండా చైతన్యవంతం చేస్తున్నాం. మా తరం పెద్దయ్యేటప్పటికి సముద్ర పరిరక్షణ కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటోంది తారాగై ఆరాధన. చదవండి: సముద్రం నుంచి సముద్రానికి -
స్కూబా డైవింగ్: కవర్లో చేప, మహిళ కంటబడటంతో..
సాటి మనిషికి సాయపడటం ఎంతో అవసరం. కేవలం మనిషికే కాదు, జంతు జీవ రాశులకు సహయం అందించడం వల్ల మానవత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్లం అవుతాం. చేసిన సాయం చిన్నదే అయినా అది జీవితాంతం గుర్తుంటుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినప్పటికీ భారత అటవీశాఖ అధికారి సుశాంత్ సందా షేర్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ సముద్రంలో తన స్నేహితులతో కలిసి నాట్ సేన్మువాంగ్ అనే మహిళ స్కూబా డైవింగ్‌కు వెళ్లింది అక్కడ నీటి అడుగున ఓ బండరాయి దగ్గర ప్లాస్టిక్ ప్యాకెట్ లోపల చిక్కుకున్న చేపను నాట్ గమనించింది. వెంటనే దాన్ని చేతులోకి తీసుకొని ప్లాస్టిక్ కవర్ నుంచి చేపను రక్షించడంతో అది తిరిగి నీటిలోకి వెళ్లింది. ఈ వీడియోను సుశాంత నందా సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మనిషి ఎక్కడుంటాడో అక్కడ మానవత్వం పరిమళించే అవకాశం ఉంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘చాలా గొప్ప పని చేశారు మేడమ్. కానీ మరోవైపు ఆలోచిస్తే అదంతా మనుషుల నిర్లక్ష్యమే అనిపిస్తోంది. సముద్రాలను కలుషితం చేసి చేపలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాం' 'అవును, భగవంతుడు సృష్టించిన దానిలో ఉత్తమమైనది మనిషే. ఒకరినొకరు సాయం చేసుకుంటూ ప్రపంచాన్ని గొప్పగా మారుద్దాం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: చేపను వాకింగ్ తీసుకెళ్లాలనుకుంటున్నారా.. అయితే! Wherever there is a human being, there is an opportunity for kindness 💕 pic.twitter.com/7IjJuiVv9O — Susanta Nanda IFS (@susantananda3) May 10, 2021 True that. But sadly it’s the same human who has polluted the oceans and has put the fish in the precarious conditions — Lakshmi Sharath (@lakshmisharath) May 10, 2021 True that. But sadly it’s the same human who has polluted the oceans and has put the fish in the precarious conditions — Lakshmi Sharath (@lakshmisharath) May 10, 2021 -
స్కూబా టెస్ట్ పాసయ్యా!
కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు ప్రణీతా సుభాష్. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేట్ పొందారు. కొన్ని రోజులుగా మాల్డీవుల్లో విహార యాత్రలో ఉన్నారు ప్రణీత. బీచ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారామె. స్కూబా డైవింగ్ కూడా చేస్తూ కనిపించారు. అయితే స్కూబా డైవింగ్‌ను సరదాగా కాదు... సీరియస్‌గా చేయాలనుకున్నారు. అందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుని స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్ కూడా పొందారామె. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించి, స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. -
మురిపాల సముద్రం
సుస్మితా సేన్ తన పదేళ్ల చిన్న కూతురు అలీసాకు ఎప్పటికీ మర్చిపోలేని బర్త్ డే గిఫ్టును అందించారు. ఇటీవల అలీసా పుట్టిన సందర్భంగా ఆ చిన్నారిని మాల్దీవులకు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేయించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ‘‘నా కూతురు తన ఐదవ ఏట నుంచీ స్కూబా డైవింగ్ చేస్తానని అడుగుతోంది. నేనే తనకు మరింత వయసు రావడం కోసం ఆగాను’’ అని కామెంట్ పెట్టారు. డైవింగ్‌కి ముందు సుస్మిత అలీసాపై ఎన్ని ముద్దు మురిపాలు కురిపించారో చూడ్డం కోసమైనా ఈ వీడియోను చూడాల్సిందే. సుస్మితకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రీనీ వయసు పందొమ్మిదేళ్లు. సుస్మిత వివాహం చేసుకోలేదు. ఇద్దరూ దత్త పుత్రికలు. -
పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశ్ మల్హోత్ర గత జూలై, ఆగస్టు రెండు నెలలు ఇండోనేసియాలో ఒంటరిగా పర్యటించారు. కొమడో డ్రాగన్ల (రాక్షస బల్లులు)ను ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు సముద్ర గర్భంలోని అందాలను తిలకించడానికి స్కూబా డైవింగ్ చేశారు. మంటా రేస్‌గా ఆంగ్లంలో పిలిచే షార్క్ జాతికి చెందిన అతి భారీ జలచరం (8 మీటర్ల వెడల్పు దాదాపు 1400 కిలోల బరువు)తో కలిసి సముద్ర గర్భంలో ఈత కొట్టారు. అద్భుతమైన సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాన్ని కెమెరా కన్నులో బంధించేందుకు మౌంట్ బాటూర్లోని క్రియాశీలక అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. దేశ, విదేశాల్లో పర్యటించడం ద్వారా అనూహ్య అనుభవాలను, అనిర్వచనీయ అనుభూతులను పొందవచ్చని భావించే మల్హోత్ర ఈసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆయన అనుభవాలన్నీ తీపి గుర్తులే కాదు. ఆయన బాలి నగరంలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఓ మాల్ శిథిలాలు కూలుతుంటే అందులోనుంచి అందరితోపాటు ఆయన బయటకు పరుగెత్తికొచ్చారు. 26 ఏళ్ల ఆకాశ్ మల్హోత్రకు ప్రపంచం తిరగడమంటే ఎంతో పిచ్చి. ఆయన గత నాలుగేళ్లలో 34 దేశాలు తిరిగొచ్చారు. రెండు నెలలు భారత్‌లో ఉంటే, నాలుగు నెలలు విదేశాల్లో తిరుగుతుంటారు. ‘డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ’ని నడిపే ఆకాశ్ తన పర్యటన పిచ్చికి అనుకూలంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రోజుకు కేవలం నాలుగు గంటలే పనిచేస్తారు. మిగతా సమయమంతా పర్యటనలోనే గడుపుతారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే తన క్లైంట్లను నేరుగా కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లపైనే సలహాలు, సంప్రతింపులు నడుస్తాయి. ఆయన తన పర్యటన ఫొటోలను ఎప్పటికప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఏ దేశానికి ఎంత చీప్‌గా వెళ్లవచ్చో, ఏయే ట్రావెల్ ప్యాకేజీలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవచ్చో, ఎక్కడ ఎంత చీప్‌గా ఆనందాన్ని ఆస్వాదించవచ్చో.. కిటికులన్నీ ఆకాశ్‌కు తెలుసు. ఆయన తన ‘వాండర్ విత్ స్కై’ వెబ్సైట్ ద్వారా తనలాంటి పర్యాటకులతో వీటిని షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త టిమ్ ఫెర్రీస్ రాసిన ‘ది 4–అవర్ వర్క్ వీక్’ పుస్తకాన్ని చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు. ఆకాశ్లాగా ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఆసక్తి నేటి యువతరంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో పనిచేస్తే యువతలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన ‘ది మిలీనియల్ ట్రావెల్ సర్వే–2017’ నివేదిక ప్రకారం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న నేటి తరంలో 62 శాతం మంది ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పది శాతం మంది మాత్రం ఏడాదికి ఆరు నుంచి పది సార్లు పర్యటనలకు వెళుతున్నారు. ఇలా దేశ, విదేశీ పర్యటనలను ఇష్టపడుతున్న యువతలో స్త్రీ, పురుషులు ఆఫీసు సెలవుల్లో ఉన్న వెసలుబాటును బట్టి దగ్గరి ప్రాంతాలు, దూర ప్రాంతాల పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఆకాశ్ లాంటి ప్రపంచ పర్యటనను పిచ్చిగా ప్రేమించే వాళ్లు ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ పర్యటిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు దేశ, విదేశాలు తిరిగేందుకు డబ్బులు ఎలా వస్తున్నాయన్నా సందేహం రావచ్చు. కూడబెట్టుకుంటున్న సొమ్ము సరిపోకపోతే వారంతా ట్రావెల్ రుణాలు తీసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్. వారికి ఈ రుణాలు ఇవ్వడం కోసమే ‘క్యూబెరా, ఫింజీ, ఫేర్‌సెంట్, రూబిక్యూ’ లాంటి ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొలాటరల్ గ్యారంటీ, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ అనే తలనొప్పి షరతులు లేకుండా ఈ సంస్థలు బ్యాంకులకన్నా తక్కువ ఒడ్డీతో ట్రావెల్ రుణాలను అతి సులువుగా మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్న వారిలో 80 శాతం మంది ఉద్యోగులే ఉంటున్నారు. గత రెండేళ్లలోనే ట్రావెల్ రుణాలు 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని ఉద్యోగులకు, ఇతరులకు వ్యక్తిగత లోన్లను మాత్రమే మంజూరు చేసే సాంకేతిక సంస్థ ‘క్యూబెరా’ తెలిపింది. గతేడాది ట్రావెల్ రుణాలు కావాలంటూ తమ సంస్థకు దాదాపు 1700 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 728 మంది దరఖాస్తుదారులు 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొంది. తమ సంస్థ నుంచి రుణాలు కోరుతున్న ఐదు ముఖ్య కారణాల్లో ట్రావెల్ ఒకటని ‘క్యూబెరా’ వ్యవస్థాపకుడు అనుభవ్ జైన్ తెలిపారు. ట్రావెల్ రుణాల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగస్థులవడం, అందులో యువకులు అవడం, పర్యటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల అంత రిస్క్ తమకు ఎదురు కావడం లేదని ఆయన అన్నారు. తామిచ్యే మొత్తం రుణాల్లో ట్రావెల్ రుణాలు గతేడాది ఐదారు శాతం ఉండగా, ఇప్పుడు 15, 16 శాతానికి చేరుకున్నాయని ఆయన వివరించారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తాము 12 శాతం వ్యక్తిగత రుణాలు పర్యటనల కోసం మంజూరు చేశామని ‘ఫింజీ’ సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అభినందన్ సంఘమ్ తెలిపారు. తాము ట్రావెల్ రుణాలను మంజూరు చేస్తుండడం వల్ల ముందుగా ఎకానబీ క్లాస్‌ను ఎన్నుకున్న పర్యాటకులు ఆ తర్వాత లగ్జరీ క్లాస్‌కు మారుతున్నారని కూడా ఆయన చెప్పారు. తాము కూడా ఆరు శాతం రుణాలను ట్రావెల్‌కే ఇస్తున్నామని, వీరి సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతోందని ‘ఫేర్‌సెంట్’ వెబ్ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజత్ గాంధీ తెలిపారు. తాము పెళ్లిళ్లకు, హానీమూన్లకు కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. జేబులో పైసా లేకపోయినా ట్రావెల్ రుణాలను, ట్రావెల్ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాల్లో పర్యటించవచ్చని ఆకాశ్ మల్హోత్ర సూచిస్తున్నారు. -
జ్ఞాపకాల గుర్తులు
సిల్వర్ స్క్రీన్‌పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్గా స్కూబా డైవింగ్ చేసా. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యు టర్న్’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు. -
డైవింగ్ లైఫ్!
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేకి చెక్కేస్తున్నారు హీరోయిన్ పరిణీతి చోప్రా. డైవింగ్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. లాస్ట్ టైమ్ మాల్దీవుల్లో మస్తీ చేసిన పరిణీతి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సమీపంలోని గ్రేట్ బారియర్ రిఫ్లో డైవింగ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.‘‘ఆస్ట్రేలియాలో డైవింగ్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. పొఫెషనల్ లైఫ్‌లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారామె. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్, నమస్తే ఇంగ్లాండ్’ సినిమాల్లో పరిణీతిచోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘కేసరి’ సినిమాలో కూడా పరిణీతినే కథానాయిక. -
మాల్దీవుల్లో మస్తీ
... చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు పరిణీతి చోప్రా. స్కూబా డైవింగ్ అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. ఆల్రెడీ ఆమె సర్టిఫైడ్ డైవర్ కూడా. సో.. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ డైవ్స్ చేయాలని డిసైడై మరీ మాల్దీవులకి వెళ్లారు. మరి పరిణీతికి చేతిలో సినిమాల్లేవా? అంటే.. అలాంటిదేమీ లేదండి బాబు. ఆల్రెడీ దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీకీ ఫరార్’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నిన్నమొన్నటి వరకు జరిగిన షూట్లో పాల్గొన్నారు. ఇంకో వైపు విశాల్ షా దర్శకత్వంలో రూపొందనున్న ‘నమస్తే లండన్’ సినిమాలోనూ పరిణీతి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న అంటే.. వేలంటేన్స్ డే నాడు∙సెట్స్‌పైకి వెళుతుంది. ఇందులోనూ అర్జున్ కపూర్‌నే హీరో కావడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనే కాకుండా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘కేసరి’ చిత్రంలోనూ పరిణీతినే కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇలా వరుస చాన్స్‌లతోపాటు వీలు చిక్కినప్పుడుల్లా ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పరిణీతి. ప్రొఫెషన్ని, పర్సనల్ లైఫ్‌ని చక్కగా బాల్యెన్స్ చేసుకుంటున్నారంటే.. పేరులోనే కాదు.. ఆలోచనలపరంగా కూడా పరిణితి చెందినట్లు ఉన్నారు కదూ. -
షార్క్ దాడిలో భారత సంతతి మహిళ మృతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన 49 ఏళ్ల ఓ మహిళ షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కోస్టారికా పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్టారికాలోని కోకస్ ద్వీపంలో స్క్యూబా డైవింగ్ చేయడానికి 18 మంది వెళ్లారు. వీరంతా డైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్క్వచ్చి వారిపై దాడిచేసింది. వారిలో రోహినా భండారీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆమెకు చికిత్స అందించినా కాళ్లకు అయిన గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆమె మరణించారు. రోహినాతోపాటు స్కూబా డైవింగ్ మాస్టర్ కూడా షార్క్ వల్ల స్వల్ప గాయలపాలయ్యారు. అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. షార్క్ మామీద దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి షార్క్ నుంచి దూరంగా ప్రయాణించేందుకు ఎంత ప్రయత్నించినా అది వేగంగా వచ్చి దాడిచేసిందని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో భండారీ ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోకస్ ద్వీపం రకరకాల షార్క్ జాతులకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందడంతోపాటు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి కూడా గుర్తింపు పొందింది. -
సాహసం.. నా నేస్తం!
మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనడిగితే... కొందరి పేర్లు చెబుతాం. శ్రియకు కూడా అలా చెప్పడానికి ఓ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ‘సాహసం’ కూడా ఉంటుంది. అవును.. అడ్వెంచర్ నా ఫ్రెండ్ అంటారు శ్రియ. అందుకే వీలు కుదిరినప్పుడల్లా నేస్తానికి దగ్గరగా వెళతారు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. విదేశాల్లో అడ్వంచర్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీకి స్కూబా డైవింగ్ అంటే ఇష్టం. అందుకే స్కూబా డైవింగ్ కోర్స్‌తో పాటు, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కోర్స్‌లను ఆమె కంప్లీట్ చేశారట. విక్రమ్ హీరోగా తెలుగులో వచ్చిన ‘మల్లన్న’ సినిమాలోని ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న..’సాంగ్‌లో ఆమె అండర్‌వాటర్ సీన్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఇండోనేషియాలోని బాలీలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. దానికి సంబంధించిన ఫొటోను శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఫస్ట్ సన్‌రైజ్ నా ఫేస్‌ను టచ్ చేస్తున్నప్పుడు సముద్రంలో బ్యూటిఫుల్ డైవ్ చేస్తున్నాను. సముద్రంలో ఇలా చేయడం ఇట్స్ ఎ మ్యాజికల్’’ అని పేర్కొన్నారు శ్రియ. చూశారుగా... నీటి లోపల ఏమాత్రం భయం లేకుండా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చేయాలంటే ధైర్యం ఉండాలండి బాబు. శ్రియ డేరింగ్ అండ్ డ్యాషింగ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘నరకాసురుడు’, ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో శ్రియ నటిస్తున్నారు. -
సముద్రంలోకి దూకేసింది!
అవును.. త్రిష దూకింది. ఎందుకు? అంత కష్టం ఏమొచ్చింది? కష్టాలేం లేవ్. సరదా కోసమే దూకారు. అవునా? అవును... నిజమే! సరదాగా సముద్రంలోకి దూకి, నీటి అడుగుకు వెళ్లి, జలచరాల మధ్య వాటితో పాటు ఈత కొట్టడమే ‘స్కూబా డైవింగ్’. ఇదంటే త్రిషకు ఎంతో ఇష్టమట. ఎక్కువగా వేసవిలో స్కూబా డైవింగ్ చేయడానికి జనాలు ఇష్టపడతారు. మొన్న వేసవిలో శ్రిచ మాల్దీవ్స్‌లో స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు త్రిషకు తీరిక దొరికినట్టుంది. ‘టైమ్ ఫర్ సమ్ అండర్‌వాటర్ లవ్ రే’ అని త్రిష స్కూబా డైవింగ్‌కి వెళ్లే ముందు ఫొటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. -
సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..!
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమా షూటింగ్ ను ప్రారంభించిన డార్లింగ్.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందించే పనిలో ఉన్నాడు. అందుకోసం కొన్ని రిస్క్ స్టంట్స్ కూడా చేస్తున్నాడట. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వన్స్ కోసం స్కూబా డైవింగ్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ లు సంగీతమందిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
రిస్క్‌లోనే కిక్!
సాగర గర్భంలో ఈత అంటే, స్విమ్మింగ్‌పూల్‌లో ఈదినంత సులువు కాదనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ రిస్క్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. దాని కోసం పని గట్టుకుని స్క్యూబా డైవింగ్ నేర్చుకుంటారు. సాగరంలో జలచరాలను చూసి, ఆనందించేస్తారు. ఇలాంటి ఆనందాన్ని త్రిష చాలాసార్లు పొందారు. రిస్క్‌లో ఓ కిక్ ఉందంటారామె. స్నేహితులతో విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు స్క్యూబా డైవింగ్ చేయకుండా దాదాపు వెనక్కి రారు. అదంతా సరదా కోసం అయితే ఇప్పుడు సినిమా కోసం చేశారు. త్రిష టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మోహిని’. రమణ మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ మూవీ ఇది. ఈ చిత్రం కోసం నీటి లోపల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు చెప్పగానే, త్రిష ఓకే అనేశారు. ఆ సీన్స్‌ని ఇటీవల చిత్రీకరించారు. ఆ సమయంలో సాగరంలో దర్శకుడితో ఓ ఫొటో కూడా దిగారు. ‘‘నీటి లోపల మా డెరైక్టర్‌తో సరదాగా’’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. సినిమా కోసం ఎలాంటి రిస్కులైనా తీసుకోవడానికి ఇష్టపడే ఈ బ్యూటీ ఆ రిస్కులంటే తనకు బోల్డంత ఇష్టం అంటున్నారు. అంత ఇష్టంగా నటిస్తారు కాబట్టే, కథానాయిక అయ్యి పదమూడేళ్లయినా ‘నాట్ అవుట్’ అని చెప్పొచ్చు. -
స్కూబా.. అబ్బా...!
కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. కంటికీ, మనసుకీ నచ్చితే చాలు సెల్ఫీ దిగేస్తుంటారు. సెల్ఫీ కోసం కొంతమంది రిస్కులు కూడా తీసుకుంటున్నారు. సోనాక్షీ సిన్హా కూడా ఇటీవల ఓ రిస్క్ తీసుకున్నారు. అయితే, అది సెల్ఫీ కోసం కాదులెండి. వేరే ఏదో రిస్క్ తీసుకుని, పనిలో పనిగా సెల్ఫీగా కూడా దిగారామె. ఈ బ్యూటీకి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే... స్కూబా డైవింగ్ చేయాలనే తన కోరికను తీర్చేసుకోవాలనుకున్నారు. స్కూబా అంటే నీటి లోపల ఈతకొట్టడం అన్నమాట. ఈ సాహసం చేయాలంటే దమ్ము కావాలి. సోనాక్షి సో బోల్డ్ కాబట్టి, చేసేశారు. ఈత కొట్టడం మాత్రమే కాదు... నీటి లోపల కనిపించే స్టార్ ఫిష్‌లను పట్టుకుని సెల్ఫీ దిగారు. నీటి లోపల ఫొటోలు దిగడమా? కెమెరా తడిచిపోదూ? అనుకుంటే అమాయకత్వం అవుతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా... ఇకపోతే సోనాక్షి తన స్కూబా డైవింగ్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పెట్టారు. అవి చూసిన ఆమె అభిమానులు.. ‘అబ్బా.. సోనా స్కూబా ఏం చేసిందబ్బా?’ అని ముద్దుగా మెచ్చుకుంటున్నారు. -
చేపలలో చేపలా...
స్కూబా డైవింగ్ సముద్రపు నీటిలో వేగంగా, చల్లచల్లగా ఈదులాడే సాహసక్రీడ పేరు స్కూబా డైవింగ్. ప్రపంచంలో పేరెన్నికగన్న స్కూబా డైవింగ్ ప్రాంతాలు... ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన డైవింగ్ ప్రదేశాలలో ఒకటి. ఇది మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అతి పెద్ద పగడపు దిబ్బలు కలిగిన ప్రదేశం. నీటిలో ఈదుతూ... సముద్రపు తాబేళ్లు, డాల్ఫిన్లు, వేల రకాల చేపలను చూడొచ్చు. ప్రపంచంలో అత్యంత అందమైన సముద్ర తీరాలలో ఎర్రసముద్రం ప్రఖ్యాతి గాంచింది. ఈజిప్టు పర్యాటక ఆకర్షణలో ప్రధానమైన ఈ సముద్రంలో డైవింగ్ మరిచిపోలేని అనుభూతి. భారత దేశంలో 572 చిన్న చిన్న ద్వీపాలు గల అండమాన్ నికోబార్ దీవుల్లోని హ్యావ్లాక్ దీవిలో స్కూబా డైవింగ్ అంటే జీవితకాలపు ఊహించని ఆనందాన్ని మదిలో నిలుపుకున్నట్టే!