
స్కూబా డైవింగ్ చేస్తూ...
కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు ప్రణీతా సుభాష్. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేట్ పొందారు. కొన్ని రోజులుగా మాల్డీవుల్లో విహార యాత్రలో ఉన్నారు ప్రణీత. బీచ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారామె. స్కూబా డైవింగ్ కూడా చేస్తూ కనిపించారు. అయితే స్కూబా డైవింగ్‌ను సరదాగా కాదు... సీరియస్‌గా చేయాలనుకున్నారు. అందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుని స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్ కూడా పొందారామె. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించి, స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment