ఆర్థిక సంక్షోభంలో మాల్‌దీవులు.. స్పందించిన భారత్‌ | Maldives bad Financial Condition Like Sri Lanka and Pakistan Help from India | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలో మాల్‌దీవులు.. స్పందించిన భారత్‌

Published Sat, Feb 1 2025 1:19 PM | Last Updated on Sat, Feb 1 2025 1:36 PM

Maldives bad Financial Condition Like Sri Lanka and Pakistan Help from India

మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్‌ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల​్‌దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ  ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎ‍ప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్‌దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్‌ పేర్కొన్నారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్‌ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ  ఒప్పందాలను గౌరవించాలని భారత్‌ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్‌ఎఫ్‌- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల  కల్పనను సులభతరం చేయనున్నాయి.

ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్‌ జీవితం మారిందిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement