horse riding
-
హార్ట్స్.. రైడింగ్..
గుర్రపు స్వారీ నేర్చుకోవడం అనేది నగరంలో ఒక నయా ట్రెండ్‌గా మారుతోంది. విద్యార్థి దశ నుంచే గుర్రమెక్కాలని టీనేజర్స్ తహతహలాడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల అభిరుచి, ఆసక్తులను గమనించి ఆ మేరకు ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని కొంత మంది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఏకంగా గుర్రాన్ని కొనుగోలు చేసుకుని, ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకుంటున్నారు. పిల్లలకు గుర్రపు స్వారీలో మెళకువలు నేరి్పస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది మాత్రం శిక్షణా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలో గుర్రపు స్వారీ శిక్షణా కేందాల సంఖ్య పెరుగుతోంది. పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఇండియన్, బ్రిటిష్ బ్రీడ్ గుర్రాలకు స్థానికంగా గిరాకీ ఏర్పడింది. నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, జోథ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి రూ.లక్షలు వెచి్చంచి గుర్రాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫాం హౌస్‌లు, ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇసుకతో కూడిన మెత్తని నేలలను శిక్షణా కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. శిక్షణ తీసుకునే వారు ప్రమాదవశాత్తూ కిందపడినా దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుర్రం ఎక్కడం ఎలా, కుడి, ఎడమ ఎటు వైపు తిప్పాలంటే ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి, గుర్రాన్ని ఆపడానికి ఏం చేయాలనే విషయాలు శిక్షకులు ముందుగానే పిల్లలకు బోధిస్తున్నారు. ఏడు వేల నుంచి.. హార్స్ రైడింగ్ అనుకున్నంత సులువైనదేమీ కాదు. ఇందుకు చాలా ఏకాగ్రత, దృష్టికేంద్రీకరణ ఉండాలి. ముఖ్యంగా గుర్రంపై కూర్చోవడమే ఓ పెద్ద సవాలుగా ఉంటుంది. కూర్చున్నాక అది ఎటు వెళుతుందనేదీ ముందుగానే పసిగట్టాల, మన దారిలోకి తెచ్చుకోగల నైపుణ్యాన్ని సాధించాలి. చాలా మంది పిల్లలు నెల నుంచి రెండు నెలల్లో అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నారని శిక్షకులు చెబుతున్నారు. కాగా శిక్షణకు గానూ పెద్దవాళ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, పిల్లలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు. రిచ్‌మ్యాన్ గేమ్.. గుర్రపు స్వారీ అనేది రిచ్‌మ్యాన్ గేమ్. సామాన్యులకు గుర్రం కొనుగోలుచేయడం, పోషించడం, శిక్షణకు అవసరమైన విధంగా తీర్చిదిద్దడం, అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడు దాన్ని బాగోగులు.. ఇలా అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. ఆరోగ్యంగా ఉన్న గుర్రానికి నెలకు కనీసం రూ.25 వేలు, ఆపైనే వెచి్చంచాల్సి ఉంటుంది. జంతువులను మచి్చక చేసుకోవడం, వాటితో స్నేహంచేయడం, జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో సంతృప్తినిస్తుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. జంతువుల నుంచి కొత్తవిషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.వారాంతంలో రైడ్స్..నగరంలోని కొన్ని క్లబ్‌లు వారాంతంలో ప్రత్యేకంగా హార్స్ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. ప్రశాంతమైన ప్రకృతిలో గుర్రపు స్వారీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలుసుకుని, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గండిపేట్, ఎల్బీ నగర్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి హార్స్ రైడింగ్ కనిపిస్తోంది.ఇదో హాబీలా..పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన గుర్రాలను మాత్రమే గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు వచ్చేవారికి ఇస్తాం. మొత్తం 25 గుర్రాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు్కలు ఎక్కువ మంది శిక్షణ తీసుకోడానికి వస్తున్నారు. ఉత్తర భారత దేశంలో గుర్రపు స్వారీకి ఎక్కువ డిమండ్ ఉంది. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఇదొక హాబీలా మారిపోయింది. డిల్లీ, జైపూర్, జోథ్‌పూర్, ముంబయి, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గుర్రపు క్రీడల పోటీలకు వెళుతుంటాం. – సయ్యద్ మాజ్, ట్రైనర్, క్రాస్ కంట్రీ క్లబ్ హైదరాబాద్నవాబుల కాలం నుంచే హైదరాబాద్‌లో గుర్రపు స్వారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడదే క్రేజ్‌గా మారుతోంది. నగరంలో రాత్రి పూట పలువురు గుర్రాలపై సంచరిస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. అయితే వారికి తిరిగేందుకు వాహనాలు అందుబాటులో లేక ఇలా వస్తున్నారనుకుంటే పొరపాటే.. అందరిలోకీ ప్రత్యేకంగా ఉండాలనే దృష్టితో కొందరు.. గుర్రపు స్వారీపై మక్కువతో మరికొందరు ఇలా చేస్తున్నామంటున్నారు. స్వారీ చాలా నేరి్పస్తుంది.. కరోనా లాక్డౌన్ సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. శరీరంలోని కండరాల అమరిక, ఆత్మస్థైర్యం, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్, జంతువుల పట్ల గౌరవం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, క్లాస్, మీటింగ్, ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా మాట్లాడగలిగే వాక్చాతుర్యం, ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకేజీలా వచ్చాయి. నేర్చుకునేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన గుర్రం కొనుగోలు చేసుకున్నాం. దాన్ని నిర్వహణ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వారాంతాల్లో రైడ్స్‌కి వెళుతుంటాం. ఆ గుర్రమే మనకు అన్నీ నేరి్పస్తుంది. – ఇషాన్ శర్మ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మణికొండ -
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
రైడర్ ప్రియాంక
ఓ వైపు వృత్తి.. మరోవైపు హాబీ.. చాలా మంది ఈ రెంటిలో ఏదో ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తారు. అతికొద్దిమంది మాత్రమే ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారు.. అలా రెంటిలోనూ గుర్తింపు తెచ్చుకోడం అంత సులువేం కాదు.. అందునా ఓ మహిళ ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం చెప్పుగోదగ్గ విషయం.. పైగా అతి కష్టతరమైన గుర్రపు స్వారీలో రాణించడమంటే ఎంతో గుండె ధైర్యం కూడా ఉండాలి.. అలా గుర్రపు స్వారీలో రాణిస్తూనే.. ఎనీ్టపీసీలో మేనేజర్‌గా బిజీగా ఉంటూ.. మరోవైపు రచయిత్రిగానూ రాణిస్తున్నారు.. నగరానికి చెందిన ప్రియాంక భుయాన్. పలువురికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్న ఆమె అనుభవాలు సాక్షితో పంచుకున్నారు... ఆ వివరాలు మీకోసం.. మహిళలంటే వంటింటికే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ.. అన్నింటిలోనూ పోటీకి సిద్ధమని నిరూపిస్తున్నారు నేటి మహిళలు.. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ ముందడుగేస్తున్నారు. ఎంత కష్టమైనా.. ఎదురు నిలిచి.. గెలిచి చూపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా మరోవైపు కుటుంబ బాధ్యతలను భారంగా కాకుండా ఎంతో నిబద్ధతతో చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు ఎనీ్టపీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంక భుయాన్. గుర్రపు స్వారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. నలుగురికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. చిన్నన్నాటి కల.. అస్సాంలోని గువహటిలో జన్మించాను. అక్కడే నా బాల్యం గడిచింది. మూడేళ్లు వయసప్పుడు అమ్మ ఇచ్చిన ఓ గ్రీటింగ్ కార్డులో తొలిసారిగా గుర్రం బొమ్మ చూశాను. అప్పటి నుంచి గుర్రాలంటే పిచ్చి. కాస్త పెరిగాక గుర్రపు స్వారీపై ఆసక్తి పెరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. గుర్రాన్ని దగ్గరి నుంచి చూడటమే విశేషం. కానీ ఇప్పుడు గుర్రం స్వారీ చేస్తూ పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో ఆటంకాలు... వృత్తిలో భాగంగా 2020లో రాయ్‌పూర్ బదిలీ అయ్యాను. కుటుంబం నుంచి దూరంగా ఉండటంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. అప్పుడే హార్స్ రైడింగ్ కలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నా.. అయితే మొదట్లో ఎవరేం అనుకుంటారో అని కాస్త భయపడ్డా. పైగా మహిళలకు ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా ధైర్యం చేసి∙ట్రైనింగ్సెంటర్లో చేరాను. ట్రైనింగ్సెంటర్కు వెళ్లి గుర్రాలను చూడగానే ఎగిరి గంతేశాను. అయితే ప్రాక్టీస్ సమయంలో కింద పడి గాయాలయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాను. ఢిల్లీలో జరిగిన పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నా.ఆ బాండింగ్ ప్రత్యేకం.. హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాదు.. గుర్రంతో మంచి అనుబంధం ఉండాలి. ఎంత బాండింగ్ ఉంటే అంత అద్భుతంగా రాణించగలుగు తాం. ఒక్కోసారి గుర్రాలు మనకు సహకరించవు. దీనివల్ల గాయాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ముందస్తు జాగ్రత్తలతో పాటు గుర్రంతో స్నేహం చేయాలి. కుదిరితే సొంత గుర్రం కొనుక్కోవడం మంచిది.ధర ఎక్కువే..గుర్రాల్లో చాలారకాలుంటాయి. స్వారీలకు వేడి రక్తం ఉన్న విదేశీ గుర్రాలను వాడుతుంటారు. వాటిని దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోదాని ఖరీదు రూ.30 నుంచి రూ. 40 లక్షలు ఉంటుంది. దీనికి పన్ను అదనం. దేశవాళీ గుర్రాలు అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి. కానీ అనుకున్నన్ని సాహసాలు, మిరాకిల్స్ కష్టం. నేనూ ఓ గుర్రాన్ని కొనుక్కున్నా. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని నెలలకే క్యాన్సర్‌తో మరణించింది. గుర్రాన్ని పెంచడమూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.రాయడమూ ఇష్టమే..గుర్రపు స్వారీతో పాటు పుస్తకాలు రాయడమూ హాబీ. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాశాను. వాటికి పాఠకుల నుంచి స్పందన వచి్చంది. కురుక్షేత్రంలో మహిళల గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని నా తపన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు రాస్తుంటాను. -
'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్!
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. సంయుక్త ట్వీట్లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్‌గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.' అంటూ పోస్ట్ చేసింది. 2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫 As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7 — Samyuktha (@iamsamyuktha_) February 10, 2024 -
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత..దాని కోసమేనా ?
-
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. దాని కోసమేనా?
చల్ చల్ గుర్రం.. చలాకీ గుర్రం అంటూ గుర్రపు స్వారీ చేస్తున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఏడాది పాటు ఆమె సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారామె. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. (చదవండి: పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్‌ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్) తన కెరీర్లో భాగంగానే ఆమె గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే క్యాప్షన్‌లో ఆమె హీలింగ్ అనే పదం కూడా వాడటంతో మయోసైటిస్ వ్యాధి నివారణ చికిత్సలో భాగంగా ఈ స్వారీ చేస్తున్నారేమో అంటున్నారు నెటిజన్లు. కాగా సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ విడుదలకి సిద్ధంగా ఉంది. -
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్‌ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్‌లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
హైదరాబాద్ : గుర్రపు స్వారీ అదరహో.. (ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!
మెగా తనయుడు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జంటగా కనిపించనుంది. ఇకపోతే చిన్నప్పట్నుంచి రామ్ చరణ్‌కు హార్స్ రైడింగ్ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అంతే కాకుండా మగధీర చిత్రంలో గుర్రపు స్వారీ అభిమానులను కట్టిపడేసింది. ఆ సీన్స్ అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇసుకలో కురుకుపోయిన రామ్ చరణ్‌ను గుర్రం కాపాడే సీన్ ఎమోషనల్‌గా టచ్ చేసింది. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) అయితే గతంలో ఉపయోగించిన మగధీర సినిమాలోని గుర్రం పేరు బాద్షా. అప్పట్లో సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు చెర్రీ. వీలు చిక్కినప్పుడల్లా అలా గుర్రంపై సరదాగా రైడింగ్ చేసేవారు మన గ్లోబల్ స్టార్. మగధీర గుర్రంతో పాటు ఆయన దగ్గర మరిన్నీ హార్సెస్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెర్రీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'బ్లేజ్.. మై న్యూ ఫ్రెండ్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే అచ్చం మగధీరలోని గుర్రమే అభిమానులకు గుర్తుకు వస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
మగధీర గుర్రాన్ని మించిన గుర్రమిది
-
చల్ చల్ గుర్రం!
పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్‌కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము. – కె.అనిల్‌రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ చాలా సరదాగా ఉంది.. మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా. – ఆరుష్వర్మ, కాకినాడ చిన్ననాటి కల నేరవేరిందిలా.. ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను. – అభిషేక్, కాకినాడ -
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. ఫోటో వైరల్
సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చివరగా యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కోసం సామ్ ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకొని ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంటస్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం
న్యూజిలాండ్‌కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్‌గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్బరిలోని యాష్బర్టన్ రేస్‌వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్‌తో జరిగిన క్లాష్‌లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్‌తో రెండో స్థానంలో ఉంది. అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్‌తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్‌గా 2019లో తన కెరీర్‌ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో పలుమార్లు హార్స్ రేసింగ్‌లో పాల్గొంది. -
Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. హర్షవర్ధన్ రావు... యూఎస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆదిలాబాద్ కుర్రాడు. తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడినప్పుడు పిల్లలు అక్కడే చదువుకుంటారు... అందులో కొత్త, వింత ఏమీ ఉండకపోవచ్చు. అయితే హర్ష ఒక విజేత. అతడి తల్లి నీనారావు అతడి మార్గదర్శి. కొడుకును తీర్చిదిద్దడం కోసం ఆమె తన కెరీర్‌ను వదులుకున్నారు. ఇప్పుడు హర్ష చదువు, ఆటపాటలు, హార్స్‌రైడింగ్ వంటి నైపుణ్యాల్లో ఆరితేరాడు. నేషనల్ లెవెల్ హార్స్ రైడింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. సానుభూతి చూపులతో సాంత్వన పొంది, అంతటితో తృప్తి పడి ఉంటే ఈ రోజు తన కొడుకును విజేతగా చూపించగలిగేవారు కాదు నీనారావు. ఈ ప్రయత్నంలో ఆమె టాప్ 100 హెల్త్ కేర్ లీడర్స్ కేటగిరీలో చేరారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె పంచుకున్న వివరాలు. నా దిశ మారింది! ‘‘మాది మహారాష్ట్ర, మా వారిది మంచిర్యాల. అలా తెలుగింటి కోడలి నయ్యాను. నా జీవితాన్ని రెండు వేర్వేరు పార్శ్వాలుగా చూడాలి. తొలి పార్శ్వం పూర్తిగా అకడమిక్ గా సాగింది. పీహెచ్డీ పూర్తి చేసి ఎకనమిక్స్, హిస్టరీ, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ విధానాలు, పర్యావరణ నిర్వహణ వంటి అంశాల మీద అనేక పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద సమర్పించాను. యూఎస్‌లో నివసిస్తున్న నేటివ్ అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్ జాతులు, మనదేశంలో నాగాలాండ్, అండమాన్, ఇతర ఆదివాసీ జాతుల మీద పరిశోధనలు నిర్వహించాను. మా అబ్బాయి హర్షవర్ధన్ స్పెషల్ నీడ్స్ కిడ్ అని తెలిసిన తరవాత నా పంథా పూర్తిగా మారిపోయింది. మేము గుర్తించడం కూడా ఆలస్యంగానే జరిగింది. ఆ తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు పన్నెండేళ్లు నిండినప్పుడు మేము యూఎస్‌కి తీసుకెళ్లిపోయాం. ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు అక్కడి డాక్టర్లు. అంటే తన మనసులో అనుకున్న విషయాన్ని సంభాషణ ద్వారా వ్యక్తీకరించడంలో తగినంత చురుగ్గా లేకపోవడం అనవచ్చు. హర్ష చాలా తెలివైన పిల్లాడు, తన సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులుగా మా వంతు సపోర్టునివ్వాలి. అందుకోసం ఆటిజమ్‌తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, నిపుణులను సంప్రదించాను. తనను ది బెస్ట్ కిడ్‌గా తయారు చేసుకోగలిగాను. యూఎస్‌లో హైస్కూల్లో ఆనర్స్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరాడు. హార్స్ రైడింగ్‌లో చురుగ్గా ఉన్నాడు. ఇంకో విషయం... మా అబ్బాయి యూఎస్‌లో చదివినప్పటికీ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు చదవడం రాయడం కూడా బాగా నేర్చుకున్నాడు. నేను ఇంతగా శ్రమించడానికి ఆర్థిక వెసులుబాటు ఉంది. అలాగే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఐదువందల మందిలో ఒక బిడ్డ ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో నాలాంటి తల్లులు ఇంకా ఉన్నారు. అయితే వాళ్లందరికీ నాకు ఉన్న వెసులుబాటు ఉండకపోవచ్చు. అందుకే హర్ష కోసం యూఎస్, యూకే, ఇండియాలోని నిపుణుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఒక నియమావళిని రూపొందించాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని పేదవాళ్లకు మార్గిక సేవాసంస్థ నుంచి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక సేవలందించాం. పేరెంట్స్తోపాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి శిక్షణనిచ్చాం. వాళ్లు పిల్లలకు ఫోన్ ద్వారా రోజుకో టాస్క్ ఇస్తూ రోజంతా ఒక వ్యాపకంలో మునిగేలా చేశారు. అలాగే సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లకు కూడా థియరిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సానుభూతి వద్దు! ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు నేను చెప్పేది ఒక్కటే. పిల్లలు పుట్టిన తర్వాత నెలలు గడిచే కొద్దీ మెడ నిలపాల్సిన సమయానికి మెడ నిలపకపోవడం, కూర్చోవాల్సిన సమయానికి కూర్చోకపోవడం, మాట్లాడాల్సిన వయసుకి మాట్లాడకపోవడం వంటి తేడాని గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎవరూ ఇలాంటి స్థితిని కోరు కోరు. కానీ ఎదురైన తర్వాత ఎదుర్కోవడం ఒక్కటే మన ముందున్న ఆప్షన్. మానసికంగా కుంగిపోవద్దు. దేనినీ దాచవద్దు. పిల్లలను సమాజానికి చూపించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయవద్దు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాలి. పిల్లల మూడ్‌ని బట్టి ఆ సమయంలో వారిని ఎలా డీల్ చేయాలనే విషయంలో శిక్షణ తీసుకోవాలి. ఆ అవగాహనతో మెలగాలి. వారిలో తప్పనిసరిగా ప్రత్యేకమైన కళ ఏదో ఉండి తీరుతుంది. దానిని గ్రహించండి. దానిని సాధన చేయించండి. నేను ఓ చాంపియన్‌కి తల్లినయ్యాను. మీ బిడ్డ ఐన్‌స్టీన్ కావచ్చు... మీరు ఐన్‌స్టీన్ తల్లి కావచ్చు’’ అన్నారు నీనారావు. సింపతీ కోరుకోవద్దని తల్లులకు చెబుతూనే, ‘ప్రత్యేకమైన పిల్లల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపించడం మానేయండి. దానికి బదులు ప్రోత్స హించండి’ అని సమాజానికి హితవు చేశారామె. ప్రత్యేక చిత్రకారులు స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్లో కొందరు చక్కగా పాటలు పాడేవాళ్లున్నారు. మరొకరు చక్కగా బొమ్మలు వేస్తారు. మరొకరు మంచి కవితలు రాస్తారు. వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీయడం మన బాధ్యత. పిల్లలు వేసిన బొమ్మలు, కవితలతో ఓ పుస్తకం ప్రచురించాం. మేఘన తల్లి ఇద్దరమ్మాయిలున్న సింగిల్ పేరెంట్. ఆ అమ్మాయి వేసిన బొమ్మ చూడండి. చెట్టుకొమ్మకు కట్టిన ఊయల, ఆ ఊయలలో తల్లి రూపం ఉంది. ఊయల లోపల పాపాయి ఉంది. పన్నెండేళ్ల అమ్మాయి మాతృత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించిందో చూడండి. మరో అమ్మాయి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని చక్కటి నినాదాలతో బొమ్మలు వేసింది. తమ మేధను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంచుకున్నట్లే వీరు కూడా. – డాక్టర్ నీనారావు, ఫౌండర్, మార్గిక స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
విశాఖలో ఇక గుర్రం స్వారీ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్.. వాల్తేర్ ఆధ్వర్యంలో వాల్తేర్ రైల్వే ఫుట్ బాల్ స్టేడియం(పాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్)లో హార్స్ రైడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి తెలిపారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్ రైడింగ్ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు షరీఫ్ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని, ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్ అబ్బాస్ చెప్పారు. ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్ బహిరంగ సభలో సీఎం జగన్ -
మునుగోడు బైపోల్.. గుర్రంపై వీరభోగ వసంతరాయుడు
ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కొందరు మందీమార్బలంతో వస్తే.. మరికొందరు.. ఇదిగో ఇలా వినూత్నంగా హాజరవుతారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయుడు వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆకర్షించింది. ఇదీ చదవండి: తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా.. -
క్యాసినో,ఆన్లైన్ గేమింగ్‌పై భారీ జీఎస్టీ.. ఎంతంటే!
గేమింగ్ ఇండస్ట్రీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరిలో ఆన్లైన్ గేమింగ్‌పై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు,మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు,తెలంగాణకు చెందిన రెవెన్యూ అధికారులు ఆన్లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ విధింపును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మంత్రుల బృందానికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నాయకత్వం వహించనున్నారు. దేశంలో బెట్టింగ్, జూదంతో పాటు సరిసమానంగా ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను విధించాలని మంత్రుల ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనల మేరకు 28 శాతం గేమింగ్‌పై జీఎస్టీ పడనుంది. జీఎస్టీ ఖరారు ఎప్పుడంటే ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీని ఖరారు చేయడానికి ఆర్ధిక మంత్రుల బృందం జూలై 23న బెంగళూరులో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను ఫెడరల్ జీఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తుంది. దీంతో పాటు ఆన్లైన్ గేమ్‌లో పెట్టే బెట్టింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తుంది. క్యాసినోల విషయంలో, ఎంట్రీ పాయింట్ వద్ద చెల్లించిన మొత్తంపై ట్యాక్స్ విధించాలని నిర్ణయించబడింది. ప్రతిసారి కాకుండా చిప్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ జీఎస్టీ ఉండనుంది. హార్స్ రైడింగ్‌లో పందెం మొత్తంపై 28 శాతం జిఎస్టి విధించే ప్రస్తుత పద్ధతి కొనసాగుతుందని ప్రతిపాదించబడింది. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
Anitha Rao: మహిళా ట్రెక్కర్‌గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్‌లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్‌తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్‌లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్‌గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్‌లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్‌లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్‌లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్‌పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్‌లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్‌లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్‌లోనూ.. పెయింటింగ్‌లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్‌లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఆమె మాట్లాడుతూ... ప్రతి మహిళలోనూ దుర్గా, జాన్సీరాణీ ఉందన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్‌ను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విద్యను అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది! #WATCH Congress MLA Amba Prasad rides a horse to Jharkhand Assembly on #InternationalWomensDay2022 There is Durga, Jhansi ki Rani in every woman, she should face every challenge with strength. Parents must educate their daughters as women are doing well in every field,she says. pic.twitter.com/dUAT2kX2BD — ANI (@ANI) March 8, 2022 -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్రపు స్వారీ.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్రంపై స్వారీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఆర్బన్ ఎకో పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కాసేపు సరాదాగా గుర్రపు స్వారీ చేశారు. దీనికి చెందిన వీడియోను ఆయన తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా KCR ఎకో పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/gtASkTSLTQ — V Srinivas Goud (@VSrinivasGoud) February 3, 2022 -
ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే..
బండి ఆత్మకూరు: గుర్రంపై ప్రయాణించడమంటే అదో కిక్కు..దానికి కాసింత ధైర్యం ఉండాలి.. కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన అన్నెం చిన్న వెంకటరెడ్డి ఈ విద్యలో ఆరితేరారు. గుర్రంపై వెనక్కి కూర్చొని కూడా ఈయన స్వారీ చేయగలరు. తండ్రి నుంచి మెలకువలు నేర్చుకుని.. వృద్ధాప్యంలో సైతం అందరినీ ఆశ్చర్య పరుస్తూ చల్‌చల్ గుర్రం అంటూ దౌడు తీస్తున్నారు. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి తండ్రే ఆదర్శం.. పూర్వం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గుర్రాలను వినియోగించేవారు. యుద్ధాల కోసం రాజులు వీటిని ప్రత్యేకంగా పోషించేవారు. మోటారు వాహనాలు రావడంతో క్రమంగా అశ్వాలను వినియోగించేవారు తగ్గారు. గుర్రుపు స్వారీ తెలిసిన వారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. అయితే చిన్న వెంకటరెడ్డి తన తండ్రి బాల వెంకటరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రం మీదనే వెళ్తున్నారు. ఈయన 15 ఏళ్ల వయసులో స్వారీ నేర్చుకుని.. ప్రస్తుతం 71 ఏళ్ల ముదిమిలో అంతే ఉత్సాహంగా అశ్వంపై దౌడు తీస్తున్నారు. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరం వరకు గుర్రం పైనే వెళ్తున్నారు. తన గుర్రానికి తెలివి ఎక్కువని, ఎవరైనా తాగుబోతులు దారికి అడ్డంగా వచ్చినా, చిన్నారులు రోడ్డుపై నిల్చున్నా వారి మీదకు వెళ్లదని, వేగాన్ని అదుపు చేసుకుంటుందని చిన్న వెంకట రెడ్డి తెలిపారు. చదవండి: ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల ఐదు గుర్రాల మార్పు.. వ్యవసాయం చేసే చిన్న వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఐదు గుర్రాలను మార్చారు. నందికొట్కూరులో రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దౌడుకు ఆడ గుర్రాలు బాగుంటాయని చెప్పారు. ఎక్కువగా గుర్రపు స్వారీ చేసేవారు పంచకల్యాణిని ఇష్టపడతారని, దాని నుదురు, కాళ్లు, తోక భాగాలు తెలుపు వన్నె కలిగి ఉంటాయన్నారు. ఆ తరువాత స్థానం దేవమణి గుర్రానిదని, దీనికి నుదుటన సుడి ఉంటుందని వివరించారు. గుర్రానికి 101 సుడులు ఉంటాయని, అవి ఉంటే ప్రదేశాన్ని బట్టి వాటి ధర ఉంటుందని చెప్పారు. అలుపు లేకుండా.. ఎంత దూరమైనా ఏ మాత్రం అలుపు లేకుండా గుర్రం మీద వెళ్లవచ్చని వెంకటరెడ్డి తెలిపారు. తన గుర్రంపై ఇద్దరు కూర్చున్నా సాఫీగా వెళుతుందన్నారు. ఆహారంగా పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఇస్తానని తెలిపారు. జొన్నపిండి వేసి నీళ్లు తాపితే సరిపోతుందన్నారు. ఇంతకు మించి గుర్రానికి ఎటువంటి ఖర్చు లేదన్నారు. ఎంత బురద ఉన్నా, మోకాలిలోతుకు పైగా నీళ్లు ఉన్నా.. గుర్రంపై ప్రయాణానికి ఇబ్బంది లేదన్నారు. అశ్వానికి ఆరోగ్య సమస్యలు వస్తే స్థానిక పశువైద్యుని వద్ద చూపిస్తానన్నారు. సహజంగా గుర్రం 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవిస్తుందని చెప్పారు.