
న్యూఢిల్లీ: పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్‌బల్ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్‌బల్‌లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్ అహ్మద్ జుంగల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి సంబంధముందా అనే కోణంలో అతడిని ప్రశి్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు విడుదల చేసిన నలుగురు అనుమానితుల స్కెచ్‌లపై యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన యుక్తా తివారీ అనే పర్యాటకురాలు స్పందించారు. వారిలో ఇద్దరితో ఘటన రోజున తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తాను వారి పేర్లు అడగలేదని చెప్పా రు. ఆమె వెంట ఉన్న స్నేహితులు సైతం వీరిని గుర్తు పట్టారు. అతడు తమను, పేరు, మతం గురించి అడిగాడని, ఎన్నడైనా అజీ్మర్ దర్గాకు గానీ అమర్నాథ్‌కు గానీ వెళ్లారా అని కూడా ఆరా తీశాడన్నారు.
హిందూ ముస్లిం మతాల్లో ఏదంటే ఎక్కువ ఇష్టమని మరొకడు ఆరా తీశాడని యుక్తా తివారీ పోలీసులకు తెలిపారు. ‘ఖురాన్ చదివారా, స్నేహితుల్లో హిందువులెందరు, ముస్లింలెందరు అని కూడా అడిగా డు. ఉర్దూ నాకు రాదని చెప్పగా, ఖురాన్ హిందీలోనూ ఉంటుందన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఇంతలోనే అతడి ఫోన్ మోగింది. ఆ వ్యక్తి ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్. ప్లాన్ బి 35 తుపాకులు పంపాం.
వ్యాలీలో గడ్డిలో దాచామని చెప్పా డు. నేను వింటున్నట్లు తెలుసుకుని, వెంటనే మాట మార్చాడు’అని వివరించారు. అలా వారితో చాలా సేపు మాట్లాడామన్నారు. అత డు ఏడేళ్లుగా ఖురాన్ బోధిస్తున్నట్లుగా చెప్పా డన్నారు. అక్కడ తనకు పోలీసులెవరూ కనిపించకపోవడంతో ఈ విషయాలను చెప్పడం కుదరలేదని ఆమె వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత తనకు కనిపించలేదన్నారు. తమ మతం గురించి, 35 తుపాకులను గురించి మాట్లాడినందువల్లే ఆ ఇద్దరూ తనకు, తన స్నేహితులకు బాగా గుర్తుండిపోయారని తివారీ వివరించారు.
కూంబింగ్ ముమ్మరం
పర్యాటకులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసు విభాగం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అనుమానితుల కోసం కథువా జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో గాలింపు చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఆపరేషన్ మొదలైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో నిషేధిత జమ్మూకశ్మీర్ నేషనల్ ఫ్రంట్(జేకేఎన్‌ఎఫ్) సంస్థ కార్యకలాపాలు, స్థానికులకు సంబంధాలపై విచారణ మొదలు పెట్టారు. పట్టణలోని గులాం మహ్మద్ గనీ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ సమక్షంలో జరిపిన తనిఖీల్లో జేకేఎన్‌ఎఫ్‌కు సంబంధించిన సాహిత్యం లభ్యమైంది. వీటిన్నిటినీ రికార్డు చేశారు.
ఆ్రక్టాయ్ పోస్ట్‌ను మూసేసిన భారత్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఆ్రక్టాయ్ పోస్ట్‌ను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ పోస్ట్ ద్వారా రెండు దేశాల పౌరుల రాకపోకలకు ఇకపై అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమైన అట్టారీ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ పోస్టును పూర్తిగా మూసివేయడం తెల్సిందే.