Sketch
-
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
వెన్నెల ఎందుకు కాస్తుంది? కృష్ణశాస్త్రి పొయెట్రీ ఎందుకు రాస్తాడు? ముళ్ళపూడి అప్పారావు ఎందుకని అప్పులు చేస్తాడు? డబ్బులు రాలవని తెలిసినా మా నూనెపల్లె జెండాచెట్టు కింద కూచుని గుడ్డి మగ్బుల్ ‘బహారో ఫూల్ బర్సావో…’ అని నవ్వుతూ పాటను తగులుకుంటూ ఉండేవాడెందుకు? ఏమో! ఎవడికి తెలుసో నాకేం తెలుసు? కానీ ఇలా అకారణంగా నేనెందుకు స్కెచింగ్ చేస్తానో నాకు మాత్రం తెలీదు. ఏం వస్తుంది ఇలా గీస్తే? ఏం తెస్తాయి ఈ స్కెచ్‌లు? పుస్తకాలు పుస్తకాలుగా నిలువుగా పెరుగుతూ పోతే? ఎప్పటికీ చేతరాని బొమ్మల గురించి వ్రాయరాని మాటలు ఇలా అల్లుకుంటూ పోతే? ఏం తెలీదు. ఈ పని ఒక్క మనసుకు ఇష్టమని తెలియడం తప్ప. జీవితం అంతం వరకు ఇలా గీతలపై గీతలు అకారణంగా గీసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఆకలేసినపుడు కాసింత అన్నం చాలు. చెవులకు కొంచెం సంగీతం చాలు, పుస్తకాల గూళ్ళో ఏరి దాచుకున్న కాసిని పుస్తకాలు చాలు. ఇంకేం, ఇంతకన్నా మరింకేం గీతల వెంట సాగడానికి? జీవితాన్ని ఇలా కొద్దికొద్దితో నింపుకుని భద్రంగా అపురూపంగా రేఖల్ని, రంగుల్ని ఏరుకుని మరీ ‘నేనొక పుష్పాన్ని, నీ కోమల పాదాలతాగ్రాల పూచిన పుష్పాన్ని నేనని, తొట్టతొలి రుషులు అగ్నికీలల్లో మంత్రగ్రామాలు దర్శించినట్లు నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూసినట్లు, నీ వలలో చిక్కిన శబలవర్ణసంచాలిత శఫరి నేనేనని…’ గీసుకునే బొమ్మలివి. వట్టి గాలి వేళ్ళు సుడులు సుడులుగా శూన్యంలో తిప్పి వేసిన వందల వేల బొమ్మలు జేబులో దాచుకోలేక ఆ ఊహలన్నిటిని గాలిపటం కట్టి ఆ మఖ్మల్ దారం వెంటపడి సాగిన స్కెచ్‌ల లేఖలివి.ఫైనల్ డ్రాయింగ్ పెళ్ళాం వంటిది. బొమ్మ పూర్తికాగానే మోహం నశిస్తుంది. మాయ ఆవిరవుతుంది. ఈ నా గీసుకునే స్కెచ్‌లన్నీ దరిచేరని నా ప్రేయసికి వ్రాసుకునే ప్రేమ లేఖలే! ఎందాకా ఎందాకా ఎగిరేవంటూ తన వెంట అనంతకాలం తరమనిస్తుంది. మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి, నా నాస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహారం కథ ఇది. తాళం చెవి పుట్టని, కనిపెట్టని నా బొమ్మల ప్రపంచపు తలుపు తెరుచుకోడానికి నేను దొంగిలించి తెచ్చిన జవరాలి పక్క పిన్ను కథ ఇది. ఓపిక ఉంటే వినండి. ఎందుకు స్కెచింగ్ అంటే, అక్షరమాలలో ముందు ‘అ’ నేర్చుకుంటాం కదా! కొంత తరువాత ‘మ’ కూడా నేర్చుకుంటాం. ఇంకా వత్తులు, దీర్ఘాలు గట్రా గట్రా… ఆ పై ‘అ’ పక్కన ‘మ’ వ్రాసి ‘మ’కు ‘మ’ వత్తు ఇచ్చి ‘అమ్మ’ అని నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాం? అమ్మ వస్తుంది, అమ్మ పోతుంది, అమ్మ కూచుంటుంది, అమ్మ తల దువ్వుకుంటుంది, అమ్మ చదువుకుంటుంది, అమ్మ నాన్నకు ప్రయివేట్ చెబుతుంది… ఇట్లా బోలెడు మాటలు అక్షరాల్లో నేర్చుకుని వ్రాసినంత అంతే ఇదిగా బొమ్మల్లో కూడా గీతల అమ్మ ఈ పనులన్నీ చేస్తుంది. కాదు… చచ్చినట్లు మీరు చేయించాలి. ఊరికే మాటలు చెప్పినట్లు పుట్టుకతోపాటు బొమ్మలు తెచ్చుకోడం, దేవుడు ప్రత్యేక శ్రద్దతో మన మునివేళ్ళని తీర్చిదిద్దడం, భూమ్మీదకు పంపడం అంతా హంబక్, వట్టి సొల్లు మాటలు, పంచదార పూతల కవిత్వపు కబుర్లు. నిజానికి సత్యం అనునది సత్యప్రమాణకంగా ఏవిటంటే, చచ్చేదాకా 24 ఇంటూ 7 బై 365 అనే కాలమానంలో ఇలలో కలలో స్కెచింగ్ చేస్తూనే ఉండాలి. బొమ్మని రకరకాలుగా ఊహల్లో చిలుకుతూనే ఉండాలి. ఆర్టిస్ట్‌గా పుట్టడం ఈజీ, అది డిఫాల్ట్. కానీ క్రాఫ్ట్‌మన్ కావడం కఠినాతి కష్టం. ఆర్టిస్ట్‌గా ప్రపంచాన్ని నమ్మించడం పరమ ఈజీ. దునియా మూర్ఖపుది, అది దేన్నయినా నమ్మేస్తుంది. బట్ ఆర్టిస్ట్‌గా సిసలు క్రాఫ్ట్మన్గా నిన్ను నువ్వు ఒప్పించుకోడం కుదరని కార్యం, అది అందని ఎత్తు. ఆ విషయం ఎరిగి సాధన చేయడమే నువ్వు కనీసం ఎక్కగలిగిన ఎత్తు. ‘టు హూమ్ ఇట్ మే కన్సర్న్’ వోలె ఎవరికి వారికి వారి స్కెచింగ్ అర్థం ఏమైనా కాని, కానీ నేనదేవిటంటే స్కెచింగ్ అంటే గీస్తూనే వుండు అని అర్థం. గీతని ముచ్చటపడమని కూడా ఒక అర్థం. కదులుతున్న పిల్లి తోకపై ముచ్చటపడ్డం ఆరంభించి దాని మీసాల దాకా గీత గీసి చటుక్కున ఆపడం ఒక ముచ్చట. యూఅన్ అగ్లో (Euan Uglow) పెయింటింగ్ పనితనంపై మనసు పారేసుకుని ముని వేళ్ళతో కుంచెని తడిగా సాపుచేసి సుతారంగా అతనిలా రంగుని అద్దడానికి ప్రయత్నం చెయ్యడం ఒక ముచ్చట అన్నమాట. ఆర్టిస్ట్ మిన్యోలా (Mike Mignola)లాగా పలకలు పలకలుగా నల్ల రంగుని పులిమేసి హెల్‌బాయ్ అనే ఒక కామికి క్యారెక్టర్ పెదవి చివర, ఓవర్ కోటు అంచున చిన్న ఎరుపుని మరకలా అంటించడం కూడా అచ్చం ముచ్చటే. చూపుడు వేలు చివరని గుండ్రంగా గులాబి గోరు గీసేసి ఆ పై చిన్న స్కిన్ ముద్దని సున్నితంగా బాపు గీసినట్టు గీయాలని చూడటం అదో ముచ్చట; వేలి ముద్రల, కాగితపు అచ్చుల, ఎండుటాకుల ముద్రలని భద్రంగా కాగితంపైకి తర్జుమా చెయ్యడం కూడా బత్తాల్యా వోలె (Dino Battaglia) ఒక ముచ్చటే. ఇదంతా స్రష్టల వారి వారి పనితనంపై నా వంటి బుడత బుడిబుడి అడుగుల మర్యాద ముచ్చట. స్కెచింగ్ అంటే నాకు బొమ్మ నుంచి బొమ్మ కాపీ చెయ్యడం. (అనగా, నచ్చిన బొమ్మ ఏదైనా దాన్ని చూసి అలాగే గీసెయ్యడం అన్నమాట.) పత్రికల్లో అచ్చయిన ఫోటోలని రేఖాచిత్రాలుగా, రంగు నకళ్ళుగా గీసుకోడం. అలా బయటికి వెళ్ళి కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, సభల్లో కవి కవిత్వ పఠనం వినలేక చచ్చినట్లు వినే పాపం వాళ్ళు, ఫేస్బుక్లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఔఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్ల మధ్య తేడా, ఇదీ అదని కాదు, సమస్తాన్ని చూస్తూనే ఉంటూ బుర్రలోని బోల్దంత ఖాళీని, స్కెచ్‌బుక్ లోని పేజీల ఖాళీని వీలయినంత నింపుతూనే ఉండాలి. ఇదంతా స్కెచింగే. ఇక్కడ ప్రస్తావించిన ఏ విషయం కూడా నేను ఇతరులనుండి విన్నది కాదు, చదివినదీ కాదు; నాకు నేనుగా తెలుసుకున్నవివన్నీనూ. ఇన్నేళ్ళ బొమ్మల జీవితంలో ప్రత్యక్షంగా ఏ గురువూ తగిలింది లేదు, తట్టింది లేదు. ఇదిగో ఇదే దారీ అదే చెట్టు అక్కడే పిట్ట అని గురి చూపించిందీ లేదు. నాకు నేను గురువునై శిష్యుడనై నేర్చుకున్న చాలా చిన్నచిన్న పాఠాలు ఇవన్నీ. మొన్నటికి మొన్న కూడా అత్యంత మొదటిసారిగా ‘ఇది ఇలా కదా’ అని తట్టినపుడు అమితాశ్చర్యంతో ‘అరే అవును కదా’ అనుకోవడం. మనం మళ్ళీ మళ్ళీ ఎంత ఫూలిష్ అని తెలుసుకోడం. ఇవన్నీ పాఠాలే. ఇక్కడే కొన్ని బొమ్మలు భోజనం చేస్తున్న వారివి. గుర్తులేదు దేనికని వేసుకున్న స్కెచ్‌లో ఇవి. భోజనం అంటే ఏవుంది, ఒకణ్ణి కూచోబెట్టి వాడి ముందు కంచంతో సహా రకరకాల గిన్నెలుగా వడ్డించడం, అంతే కదా! పరమ మెకానికల్‌గా గీసుకున్న స్కెచ్‌లు. బుర్ర ఏమాత్రం వాడకుండా వేసుకెళ్ళిన బొమ్మలు. అలా వేస్తూ ఉండగా మధ్యలో తట్టింది! “ఏవిరా ఫూలిష్ ఫెలో! మనిషి కుడి చేత్తో అన్నం తింటున్నాడు. నువ్వు వాడి ముందు పెట్టిన నీళ్ల గ్లాసు కుడి చేతి వైపే వుంది. గిన్నెలు, గరిటలు అన్నీ కుడి చేయి వైపే పెడితే వాడు ఆ ఎంగిలి చెయ్యే ఉపయోగించి, ఎంగిలి చేత్తో పనులన్నీ చేసుకోవాలా!” అనుకున్నా. అరే, ఎంత బుద్దితక్కువ బొమ్మలు! ఆ పక్కనే పచ్చ చొక్కావాడు పద్దతిగా తింటున్నాడు. వాడు కూచున్న తీరు, పళ్ళెం, చెంబూ అన్నీ గ్రామర్ని అనుసరించి ఉన్నాయ్. ఇక్కడ ఇది ఓ మంచి పాఠం. ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ నేను ఎక్కడో ఫోటోగ్రాఫ్ చూసి వేసుకున్నది, స్వంతంగా గీసినది కాదు. మన మూలాలు మన బొమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అదెలా అనడుగుతే, నేను ముసల్మానుల ఇంట పుట్టి పెరిగిన వాణ్ణి. నేను మసలిన వాతావరణంలో పీట వేసుకుని భోజనం చేసే సంప్రదాయం లేదు కాబట్టి, నాకు స్పృహ కలిగి ఎన్నడూ నా బొమ్మల్లో పీట తేను. ఇంకోటి మానసికమైనది. నాకు మొహమాటం చాలఎక్కువ. కొన్ని చెడ్డ అనుభవాల వలన జనానికి అనునిత్యం స్పృహలో ఉండే స్థాయీభేదం వల్ల ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యను. అత్యంత బలవంతం మీద వెళ్ళినా అక్కడి తిండి తినాల్సి వచ్చినా ప్రాణం పోతున్నంత గాభరాగా నిముషాల్లో విషయం ముగించి ప్రాణవాయువు కొరకు బయటపడతాను. ఈ గందరగోళంలో అక్కడ ఆ వాతావరణం, ఆ కప్పులు, స్పూన్లు, చెంబులు, లోటాలు, డైనింగ్ టేబుల్, నాప్కిన్ గుడ్డలు గమనించేదెక్కడా? నిజానికి ఇది ఒక ఆర్టిస్ట్‌గా నా పెద్ద లోపం. మనం ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వేషన్ అనే స్కెచింగ్ చెయ్యాలి. అందుకని ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ టెక్నికల్‌గా కరెక్ట్. కానీ ఆ పీట, ఆ చెంబు, ఆ మనిషి నావాడు కాదు. ఇంత చెబుతున్నందుకైనా నా పాఠం నేనే నేర్చుకుంటూ విషయాన్ని గ్రహించుకునే సామర్ధ్యం పెంచుకోవాలి, శక్తి ఏర్పరుచుకోవాలి. మరోటి, నెలలు నిండిన గర్భిణి స్త్రీ బొమ్మ వేయబోతాం. గట్టిగా గమనిస్తే ఆయమ్మ బ్రస్ట్ లైన్, కడుపు ఆ సమయంలో దాదాపూ వేరు వేరుగా ఉండవు. ఛాతీదాక దిగిన గీత సుతారంగా మర్యాదగా చాలా చిన్న జర్క్ ఇచ్చి పెద్ద కడుపు ఆర్క్ అల్లా దిగాలి. కానీ చాలామంది ఆ పెద్ద నిండు వక్షోజాలు వేరుగా, కడుపు వేరుగా అలా వేసేస్తారు. ఎప్పుడైనా చొక్కా లేని బ్రాహ్మణుల బొమ్మ గీయాలంటే నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే, జంధ్యం ఏ వైపునుండి ఏ వైపుకు వేసుకుంటారబ్బా అని. ఇలా రకరకాల డిటైళ్ళ గురించి ఆలోచించుకోవాలి. సిగరెట్ ముట్టించుకున్నవాడు తదనంతరం అగ్గిపుల్లని గాల్లో ఆర్పేసి ఎలా చెయ్యిని మెలితిప్పి విసిరి పడేస్తాడో అలాంటి వాళ్ళని ఊహించుకుని స్కెచ్‌లు గీసుకుని మన బంధుమిత్రసపరివారంలో ఎవరైనా పనీపాటా లేకుండా దొరికినపుడు అలాంటి అగ్గిపుల్ల పడేసే యాక్షన్ వాడితో చేయించి, దాన్ని మనం గీసుకున్న ఊహాచిత్రాల పక్కని గీసుకుని తేడా చూసుకోవాలి ఇక్కడో గులాబీ చొక్కా వాడు వున్నాడు, ఊరికే పని వున్నా లేకపోయినా ఒక క్యారెక్టర్ని అనుకునో, చదివో, ఊహించో వాడిని రకరకాలుగా వేయ ప్రయత్నించండి. ఆ పక్కనే కప్పు కాఫీనో ఉగ్గెడు పెగ్గో పుచ్చుకునేవాణ్ణి కూడా గీయండి. బొమ్మ అంటే అన్నిసార్లు తలనుంచి కాళ్ళదాక గీయనక్కరలేదు. ఆ మొహం, ఆ చేతులు, వాడి మూడ్ చూపించగలిగితే చాలు- అదే మజా ఇస్తుంది కొన్నిసార్లు. ఆ తరువాత ఆ పైన కార్నర్లో చిన్న మురిపమైన ముద్దు బొమ్మ, ఈ కింద ఒక నాగుపాము బుసలవంటి కురుల అందం. తొలినాళ్ళల్లో ఈ శ్రమ అంతా తెగ శ్రమ అనిపిస్తుంది. కానీ అలా వేసి వేసి మీరు మరిచిపోయిన ఈ బొమ్మలు అకస్మాత్తుగా ఓ రోజు మీ కంటపడి ఒక వెర్రి ఆనందం అవుతుంది. శ్రమైకజీవనసౌందర్యం అనేది రంపపు మిల్లులో రిక్షా చక్రంలోనే కాదు, అరిగిన పెన్సిల్ ములుకులో కూడా వుంటుంది. ఎటొచ్చీ ఈ అందం శ్రీశ్రీతో సహా ఎవరికీ అందనిది, మీకు మాత్రమే ఎరుకైనది. అందుకు కంగ్రాట్స్! ఇక్కడ పక్కకు ఒత్తిగిలించి పడుకున్న ముసలివాడి బొమ్మ మళ్ళీ మళ్ళీ వేసుకున్నది, అలా సాధన చేసుకున్నది. అయితే మళ్ళీ మళ్ళీ అదే బొమ్మని సాధన చెయ్యడం మా చెడ్డ బోరింగ్ కావచ్చు. కానీ ఒకదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే మిగతా అంతా కథ నడుస్తుంది. రెండు రెక్కలు, ఒక ముక్కు, కాసింత కడుపు, బారచాచిన కాళ్ళు ఇంత ఆకాశం చాలు. కాకి, చిలుక, కంజు, పిట్ట అంతా ఒకే సూత్రం. పిల్లి బొమ్మ వచ్చినవాడికి పులి కూడా తెలుస్తుంది. లెజెండ్ బ్రూస్ లీ ఇలా అన్నాడు: “నేను పదివేల కరాటే విన్యాసాల్ని సాధన చేసినవాడిని లెక్కచెయ్యను కానీ ఒకే విన్యాసాన్ని పదివేలసార్లు సాధన చేసిన వాడంటే భయభక్తులు చూపిస్తాను.” ఎంత గొప్ప సూత్రం! అయితే అన్నిసార్లు వద్దు కానీ ఒక బొమ్మని పదిసార్లో ముప్ఫై సార్లో గీద్దాం రండి. మరి ఇంకా బొమ్మలు వేసేవాళ్ళు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, మానవుడి వెన్నెముకకు ఫెవికాల్, గంజి కలిపి పెట్టి ఇస్త్రీ చేయించినట్లు వాడిని నీలిగినట్లు వేయకండి. మీ బొమ్మల్లో కొద్దిగా యాక్షన్ జోడించండి. నటుడు అమోల్ పలేకర్ తెలుసుగా, తను తన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జ్ఞాపకాలు చెబుతూ ఇట్లా అంటాడు: “నేను నటుడిగా శిక్షణ పొందిన సమయంలో హావభావాలు ఎలా పలికించాలో, డైలాగ్‌ని ఏ ఏ సంధర్భాల్లో ఎట్లా చెప్పాలో, నవరసాలు ఎట్లా ఒలికించాలో అన్నీ శుభ్రంగా చేసేవాణ్ణి. కానీ నా ఈ రెండు చేతులు వున్నాయే, వాటిని మాత్రం ఏంచెయ్యాలో నాకు అర్థంకాలేదు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని తెగ ఊపుతూ మాట్లాళ్ళేను, అండర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేశానంటే నా చేతులకు పెన్నునో, పెన్సిల్‌నో, సిగరెట్నో ఆ సన్నివేశానికి తగినట్లు అలవాటు చేశాను. ఇక అంతే, నా సమస్య తీరిపోయింది. రెండు చేతులు పెన్నుతో ఆడుతూ తన పని చేస్తుంటే మిగతా శరీరంతో నా నటన నేను కానిచ్చాను.” ఈ చిన్న ఎక్సర్సైజ్ తెలీక ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. నటుడు కాలేదు. మీ బొమ్మ సూపర్ స్టార్ కావడానికి మీరు పెద్ద కష్టపడనక్కరలేదు. ఆల్రెడీ తెలుగులో బొమ్మలు వేసేవారు చాలా మంది సూపర్ స్టార్లే. అయితే మీ బొమ్మని నటుడిగా మలచడానికి మాత్రం మీరు తెగ కష్టపడక తప్పదు. ఆ సదరు బొమ్మ వాడిని ఊరికే నిలబెట్టకండి, వాడికో బొమ్మల చొక్కా తొడగండి, చేతిలో సిగరెట్ అంటించండి, భుజాన సంచో ఫ్లాస్కో తగిలించండి, నెత్తి మీద మూట ఎక్కించండి, ఆ బరువుకు తగిన నడక అలవాటు చెయ్యండి, ఆ పై వాడిని ఒక పరుగు తీయించండి… ఇదంతా సోది అంటారా? అయితే ఓకే. నో ప్రోబ్లెమ్! మామూలుగా ఎప్పటిలాగే మీ బొమ్మకి కృష్ణలాగే చంకలు గట్టిగా అంటించండి, ఏం భయం లేదు. పోలీసులు ఎన్కౌంటర్ కాదు కదా, కనీసం ఉరి కూడా వెయ్యరు. కడమకి మీ అభిమానులెవరూ మిమల్ని ఫేస్బుక్ నుంచి అన్‌ఫ్రెండ్ కూడా చెయ్యరు, నో వర్రీస్. లైఫ్ ఈజ్ గుడ్ పైగా ఇగ్నోరెన్స్ బ్లెస్సు కూడానూ. ఇంకా, స్కెచ్ పుస్తకాలు మూడు రకాలువి ఏ3, ఏ4, ఏ5 అని ఎప్పుడూ వెంట వుంచుకోడం మంచిదంటాడు రాన్ టైనర్ (Ron Tiner) అనే ఒక చిత్రకళా గురువు. నేను రెండు చాల్లే నాకు అనుకున్నా. ఒకటి ఏ5, ఇంకా జేబులో పట్టే పాకెట్ స్కెచ్ పుస్తకానికే పరిమితమయ్యా; అదీ కాదూ అనుకుంటే మడతలుగా పెట్టుకున్న తెల్ల కాగితం కూడా మోర్ దాన్ ఎనఫ్. నిజానికి ఓ అయిదారు సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో మంచి స్కెచ్ బుక్‌లు మార్కెట్లో అందుబాట్లో వుండేవి కావు. ఇప్పుడు చాలా నయం, ఆన్లైన్లో అమెజాన్‌లో, హైద్రాబాద్‌లో అయితే పంజాగుట్ట హిమాలయలో చాలా రకాల స్కెచ్ బుక్‌లు అందుబాటులో వున్నాయి. ఆ స్కెచ్ పుస్తకాల పక్కనే బోల్డని పెన్నులు కూడా వుంటాయి. ఒకటో రెండో పద్నాలుగో మీ పర్స్ ఓపిక మేరకు ఎన్నుకోవచ్చు. సరే ఈ సరంజామా మంచి చెడ్డలు చాలా విస్తృతంగా తరువాతెప్పుడయినా తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు. చివరగా, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేనంటారు. ఇలా నాకు తెలిసీ తెలీని సంగతులు బోల్డన్ని ఈ కచేరీలో వెయ్యొచ్చు. కానీ దానికి కూడా ఒక ఓపికుండాలి. అదీ కాక నాకు ఈ చెవిటి ప్రపంచం మీద చాలా నమ్మకం, నేను చచ్చుకుంటూ వ్రాసే ఇదంతా వినడానికి చదవడానికి కోరి ఈ జన్మ మీరు ఎత్తలేదు. జానేభీదో యార్! సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం “ప్రియం చ న అనృతం బ్రూయాత్”ఏషా ధర్మః సనాతనః అనగా… ఈ భగవంతుని సృష్టిలో కరీనా కపూర్ బొడ్డుని మించిన మాస్టర్ పీస్ గీయబడలేదు, ఇది సత్యం. కింబర్లీ కేన్ క్లియవేజ్ని బోలిన ప్రకృతి సృష్టించబడలేదు, ఇదీనూ సత్యమే. పరనిందని మించిన పరమగాంధర్వమగు రాగం పాడబడలేదు, దీని సంగతి అతి సత్యమని కొత్తగా చెప్పనక్కరయే లేదు. శుభమ్ భూయాత్! చిట్టి సలహా: నిజానికి ఈ రాతలు చాలా కాలం క్రితం, నేను బొమ్మలు మొదలెట్టిన సమయంలో, నా ఊహకు బొమ్మలు, పుస్తకాలు అందిన సమయంలోనే ఎవరైనా ఒక మంచి చిత్రకారుడు, కాస్త నాలెడ్జ్ షేరింగ్ మీద నమ్మకం ఉన్నవాడు, ముందు తరాల బొమ్మల పిల్లలపై కరుణ, దయ ఉన్నవాడు ఎవరో అప్పుడే వ్రాసిపెట్టి ఉండాల్సింది. అవి చదుకుని అన్వర్ అనే కాసింత మంచి చిత్రకారుడు ఇప్పుడు నాకు తగిలేవాడు. అటువంటి వాడెవడూ మనకు రాసిపెట్టి ఉండలేదు కాబట్టి కనుకొలను చివరి వెచ్చని చిరు చెమ్మంత స్కెచ్ బుక్ సలహా ఏవిటంటే, నాకు మల్లే పుస్తకాన్ని ర్యాండమ్‌గా నింపొద్దు . సబ్జెక్ట్‌కు కొన్ని పేజీలు వదులుకోండి. నిలబడ్డ మనుషులంతా ఒక చోట, కుక్కలు పిల్లులు వంటి జంతుజాలం ఒక చోట, కుర్చీలు మేజాలు భోజనాల బల్ల ఇత్యాది ఒక దగ్గర, మసీదులు గుళ్ళు గోపురాలు ఒకే సైడునా… ఇది అవసరమైనప్పుడు మీ సబ్జెక్ట్‌ని ఎక్కువ కష్టపడి వెదుక్కునేట్టు చెయ్యదు. ఆ స్కెచ్‌లోంచి మీరు మీకు కావాల్సిన రిఫరెన్స్‌ను అనాయాసంగా పొందగలరు. ప్రస్తుతానికి ఇదింతే భశుం.--అన్వర్(చదవండి: రవి పరంజపే : చిత్రకారుల సంపద..!) -
రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది. -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
భర్తను చంపేందుకు స్వామిజీతో కలిసి భార్య స్కెచ్
-
అలా కాదు.. ఇలా ఉంటాడు.. ‘దసరా విధ్వంసం–ఉగ్ర త్రయం’లో ఇతడే కీలకం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహ్మద్ ఫర్హాతుల్లా ఘోరీ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్. దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసాలకు కుట్రపన్ని చిక్కిన ఉగ్ర త్రయాన్ని పాకిస్థాన్ నుంచి హ్యాండిల్ చేసిన ముగ్గురిలో ఇతడూ ఒకడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయి ఉన్నా... ఇప్పటి వరకు పోలీసులతో సహా ఏ ఏజెన్సీ వద్ద స్పష్టమైన ఫొటో లేదు. కొన్నేళ్ల క్రితం రూపొందించిన ఉహాచిత్రంతోనే (స్కెచ్) నెట్టుకు వస్తున్నారు. ఉగ్ర త్రయంలో కీలక వ్యక్తి మహ్మద్ జాహెద్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అధికారులు తమ వద్ద ఉన్న స్కెచ్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి... మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత కానీ ఇతని పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉన్న ఇతను ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఆపై 2005లో టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి తాజాగా దసరా ఉత్సవాల్లో విధ్వంసానికి కుట్ర సహా అనేక కేసుల్లో ఇతడి పేరుంది. కొన్నాళ్లు దుబాయ్, ఇప్పుడు రావల్పిండి... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఫర్హాతుల్లా ఘోరీ సుదీర్ఘ కాలం దుబాయ్‌లో తలదాచుకున్నాడు. అక్కడి నుంచే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడని, దుబాయ్ మీదుగా పాక్ పంపాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉంటూ ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండియన్ వుుజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్ రజా ఖాన్‌కు సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ తరహా నేరచరిత్రతో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ స్పష్టమైన ఫొటో పోలీసులకు లభించలేదు. 35 ఏళ్ల క్రితం నాటి ఫొటోనే... ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని తన వెబ్సైట్లోనూ పొందుపరిచింది. అయితే ప్రతి నోటీసుతోనూ ఆ వాండెట్ వ్యక్తి ఫొటోను జత చేస్తుంటుంది. అయితే ఘోరీ నోటీసుతో పాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి, అస్పష్టమైన ఫొటోనే ఉంచింది. అతడి స్పష్టమైన ఫొటో ఏ ఏజెన్సీ వద్దా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్‌లో ఇతని మేనల్లుడు ఫయాఖ్ను దుబాయ్ నుంచి డిపోట్ చేయగా (బలవంతంగా తిప్పిపంపడం) నగర పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా దాదాపు ఫర్హాతుల్లా ఘోరీకి సంబంధించి దాదాపు 20 స్కెచ్స్ (ఊహాచిత్రాలు) రూపొందించారు. అక్షర్ధామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు వీటిని చూపగా ఓ స్కెచ్‌ను నిర్థారించడంతో ఇప్పటి వరకు అదే ఆధారంగా ఉంది. జాహెద్‌కు వీడియో కాల్స్ చేయడంతో... ఉగ్ర త్రయంలో ఒకడైన జాహెద్‌కు రావల్పిండి నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. కొన్ని సందర్భాల్లో ఇతడితో వీడియో కాల్లో మాట్లాడాడు. జాహెద్ విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడి రూపురేఖలపై జాహెద్‌ను లోతుగా ప్రశ్నిస్తూ తమ వద్ద ఉన్న స్కెచ్ చూపించి మార్పు చేర్పులు చెప్పాలని కోరారు. ఘోరీ ప్రస్తుతం కాశ్మీరీ లుక్‌తో ఉన్నాడని జాహెద్ చెప్పాడు. గడ్డం, మీసంతో పాటు పొట్ట కూడా ఉందని, తనతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు రెండుమూడుసార్లు సిగరెట్ కాలుస్తూ కనిపించాడని బయటపెట్టాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు తమ వద్ద ఉన్న స్కెచ్‌లో పలుమార్పులు చేయాలని నిర్ణయించారు. ఊహా చిత్రాలు తయారు చేసే నిపుణుల సాయంతో ఆ పని చేస్తున్నాడు. ఘోరీ రూపురేఖలు చెప్పిన జాహెద్ -
పక్కాగా రెక్కీ.. మరో 10 మందిని చంపేందుకు స్కెచ్
సాక్షి, అమరావతి బ్యూరో: కరుడుగట్టిన నేరస్తులు సినీ ఫక్కీలో చేస్తున్న హత్యల పరంపరకు పోలీసులు బ్రేక్ వేశారు. హంతక ముఠా పోలీసులకు పట్టుపడకపోయి ఉంటే రానున్న నెల రోజుల వ్యవధిలో మరో పది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.! గత ఏడాది అక్టోబరు నుంచి వరుస హత్యలు, దోపిడీలకు ఈ ముఠా పాల్పడుతోంది. ఇటీవల ఏటీఎం చోరీ కేసులో పోలీసులకు పట్టుపడటంతో ముఠా అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. క్రూరంగా హత్యలు.. పెనమలూరు మండలం పోరంకి, తాడిగడపకి చెందిన ఫణి, చక్రి, గోపి, చంటి, కుమార్ అనే ఐదుగురు యువకులు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా యూ ట్యూబ్‌లో నేరాలకు సంబంధించిన వీడియోలు చూసి నేర బాట పట్టారు. పగటి పూట చిన్నా చితక పనులు చేస్తూ రెక్కీ నిర్వహించి, రాత్రి పూట నేరాలకు పాల్పడే వారు. ఇప్పటి వరకు వీరు మొత్తం ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు. కంచికచర్లలో వృద్ధ దంపతులతోపాటు పెనమలూరు మండలంలో నలుగురిని అత్యంత క్రూరంగా హత్యలు చేసి మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో మూడు స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తెనాలిలో రెండు ఏటీఎంల్లో, మంగళగిరిలో ఒక ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మరో పది మందిపై రెక్కీ.. తప్పిన ముప్పు నిందితులను పోలీసు అరెస్టు చేయడంలో మరో నెల రోజులు ఆలస్యమై ఉంటే.. వీరు మరో పది మంది ప్రాణాలు తీసేవారు. హంతక ముఠా సభ్యులు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో పది హత్యలు చేసేందుకు పథకం రచించారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధుల ఇళ్లను ఎంచుకున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో పథకాన్ని అమలు చేసి బంగారం చోరీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈలోపు పెనమలూరు పోలీసులకు పట్టుపడటంతో హత్యల పరంపరకు బ్రేక్ పడింది. విచారణలో నిందితులు సినీ ఫక్కీలో ఈ హత్యలకు వేసిన పథకాలను పోలీసులకు వెల్లడించారు. నేడు కోర్టులో హాజరు..! తేలికగా డబ్బు సంపాదించాలన్న అత్యాశకుపోయి అడ్డదారులు తొక్కిన హంతక ముఠా సభ్యులను పెనమలూరు పోలీసులు నేడు కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. ఆరు హత్యలతోపాటు దోపిడీలతో సహా 19 నేరాల్లో నిందితుల హస్తం ఉంది. ఇప్పటికే నిందితులను విచారించిన పోలీసులు పూర్తి వివరాలు రాబట్టారు. అలాగే నిందితులు పలు చోట్ల కుదువ పెట్టిన చోరీ చేసిన నగలను సైతం పోలీసులు రికవరీ చేశారు. మొత్తమ్మీద ఈ హత్యలు, దోపిడీలపై పెనుమలూరు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయనున్నారు. చదవండి: ఆత్మహత్య: నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకిన మహిళ -
అస్థిపంజరం ఆధారంగా..‘ఆమె’ కోసం గాలింపు
భువనేశ్వర్: కొన్నాళ్ల క్రితం నగర శివారులోని జాలాం పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ అస్థిపంజరం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు ఓ ఊహాచిత్రం గీయించి, రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లకు శుక్రవారం దాని కాపీలను పంపారు. బెంగళూర్‌కి చెందిన కొంతమంది నిపుణులు ఈ అస్థిపంజరం ఆనవాళ్లతో ఈ ఊహాచిత్రం గీయగా ఆ అస్థిపంజరం ఓ మహిళదిగా తేలింది. అయితే స్థానిక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) వైద్యుల సమాచారం మేరకు అస్థిపంజరం మహిళదని, 45 ఏళ్ల వయసున్న ఆమె ఎత్తు 164 సెంటీమీటర్లు ఉంటుందని తెలిసింది. అలాగే మృతురాలు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారించారు. గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి, 2019 నవంబరులో ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందులోని అస్థిపంజరాన్ని గుర్తించినట్లు నగర డీసీపీ ఉమాశంకర దాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, అప్పట్లో వాహనంలోని అస్థిపంజరాన్ని గుర్తించడంలో అలక్ష్యం వహించిన ఔట్‌పోస్ట్ ఇన్చార్జి సత్యబ్రత గ్రహచార్య సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. చదవండి: షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి.. -
బిజీ బిజీ
అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్ సేతుపతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా చెన్నైలో స్టార్ట్ కానుంది. అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి రాశీ సూట్ కేస్ సర్దుకుని వేరే లొకేషన్లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. -
అరవిందస్వామి, రెజీనాల ‘కల్లపార్ట్’
చార్మింగ్ నటుడు అరవిందస్వామి హీరోగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కల్లపార్ట్ చిత్రం బుధవారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఇంతకు ముందు విక్రమ్, తమన్నా జంటగా స్కెచ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మూవింగ్ ప్రేమ్ సంస్థ అధినేతలు ఎస్.పార్తీ, ఎస్ఎస్.వాసన్ నిర్మిస్తున్న తా జా చిత్రం ఈ కల్లపార్ట్. ఈ సినిమాలో అరవిందస్వామికి జంటగా రెజీనా నటిస్తోంది. ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజాపాండి దర్శకత్వం వహిస్తున్న మూవీలో ఆనందరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏవీఎం స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే భాగం చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. చెన్నైలోనే 40 రోజులు షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఎత్తులు పై ఎత్తులతో స్కెచ్
‘‘ది ఎండ్, సామాన్యుడు’ సినిమాలతో దర్శకుడిగా రవి చావలి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు నాకు ఇష్టం. ‘సూపర్ స్కెచ్’ కూడా వాటికి మించి పెద్ద హిట్ అవ్వాలి. కొత్త నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. ఆడియో మంచి సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. నర్సింగ్ మక్కల హీరోగా, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి, సోఫియా సింగ్, గ్యారీ ట్యాన్ టోనీ, అనికా రావు, సుభాంగి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. రవి చావలి దర్శకత్వంలో బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను సురేందర్ రెడ్డి విడుదల చేశారు. రవి చావలి మాట్లాడుతూ– ‘‘డ్రగ్స్‌కి బానిసలైన నలుగురు తెలివైన క్రిమినల్స్ అందరి దగ్గర మంచివాళ్లలా నటిస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తుంటారు. వారికి రాజకీయంగా సపోర్ట్ ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ నాయక్ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని ఎలా అరెస్ట్ చేశాడనేది ఆసక్తికరం. ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలంగాణలో బతుకమ్మ, బోనాలు పెద్ద పండుగలు. ఈ నెల 29న తెలంగాణ డైలాగుల పండుగ మా సినిమాతో రానుంది’’ అన్నారు నర్సింగ్ మక్కల. ‘‘మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. -
ఇకపై అన్నిటికీ ఓకే చెప్పను..
తమిళసినిమా: నటి తమన్నా భాటియా. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. నాజూకైన నడుము, పాలవన్నె శరీరం, ఆకర్షణీయమైన నగుమోము ఈ అమ్మడికే సొంతం. మొదట్లో హిందీ చిత్రంతో రంగప్రవేశం చేసినా, ఆపై దక్షిణాదికే పరిమితమైంది. 2005లో శ్రీ చిత్రంతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన తమన్నా కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో దూసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్‌ను అందించకపోయినా, తమిళంలో కల్లూరి చిత్రం పేరును, తెలుగులో హ్యాపీడేస్ చిత్రం విజయాన్ని అందించాయి. ఆ తరువాత అమ్మడికి ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. బాలీవుడ్లో కలిసి రాకపోయినా, తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరునే తెచ్చుకుంది. మొదట్లో తన అందానే నమ్ముకుని కమర్శియల్ చిత్రాల్లో నటించి గ్లామరస్ కథానాయకిగా గుర్తింపు పొందినా, బాహుబలి చిత్రంలో అవంతికగా నటిగా తానేమిటో నిరూపించుకుంది. అలా వచ్చిన అవకాశాలన్నీ ఎడాపెడా ఒప్పేసుకుని నటించేస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల స్పీడ్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో గత ఏడాది స్కెచ్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్‌తో నటిస్తున్న కన్నే కలైమానే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. కల్యాణ్ రామ్‌తో నటించిన నా నువ్వే గురువారం తెరపైకి రానుంది.ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో గెస్ట్ రోల్లో మెరవనుంది. సో మొత్తం మీద ఈ మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. తమన్నా జోరు తగ్గిందా? అన్న ప్రశ్నకు ఆమె మాత్రం అంగీకరించడంలేదు. తమన్నా ఏమంటుందో చూద్దాం. కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నానని చెప్పింది. కొంచెం విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని నిర్ణయించుకున్నానంది. -
చనిపోయిన వ్యక్తి జీపీఏ చేశాడట!
సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో (ఎంహెచ్ఏ) క్లర్క్‌గా పని చేస్తు న్న వ్యక్తి ఇచ్చిన సలహాతో భారీ స్కెచ్ వేశాడు. పుణేకు చెందిన కాందిశీకుడు పుప్పాలగూడలోని 50 ఎకరాలు తనకు విక్రయించినట్లు పత్రాలు సృష్టించాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి భూమి తన పేరిట బది లీ చేయించుకున్నాడు. రంగారెడ్డి కలెక్టర్ ద్వారా విషయం సీసీఎస్ పోలీసులకు చేరడంతో కథ అడ్డం తిరిగింది. చనిపోయిన వ్యక్తి ఏడాది తర్వాత జీపీఏ చేసినట్లు పత్రాలు సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు మొత్తం ఐదుగురు నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు రూ.750 కోట్ల విలువైన ఆ భూమి ప్రభుత్వ పరం కానుంది. ఎంహెచ్ఏ క్లర్క్ ఇచ్చిన సలహాతో... నగరానికి చెందిన న్యాయవాది చెట్ల రాజయ్య లక్ష్మీనారాయణ గతంలో జీపీ ఫర్ రెవెన్యూగా పని చేసిన నేపథ్యంలో నిత్యం ఢిల్లీలోని వివిధ కార్యాలయాలకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఎంహెచ్‌ఏలోని సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేసే దేవేందర్ కుమార్ జైన్‌తో పరిచయమైంది. ఆయన 1950లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చి కాందిశీకుడిగా మారిన హేమన్‌దాస్ హెచ్ మకీజ భూమి గురించి లక్ష్మీనారాయణకు చెప్పారు. ఆయనకు అప్పటి సెటిల్మెంట్ కమిషనర్ పుప్పాలగూడ ప్రాంతంలో 50 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని భౌతికంగా పొందక ముందే హేమన్‌దాస్ 1970లో మరణించగా... ఆయన కుమారుడైన భగవాన్ దాస్ మకీజ పుణేలో స్థిరపడ్డారు. అనంతరం భగవాన్ దాస్ ఈ స్థలం విషయం పట్టించుకోలేదు. ఇదే విషయం జైన్ ద్వారా లక్ష్మీనారాయణకు తెలిసింది. భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి... భారత్‌లో భూముల పొందిన కాందిశీకులు తమ వారసుల వివరాలను ఢిల్లీలో ఉండే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద ఉండే క్లైమ్ ఇండెక్స్‌లో నమోదు చేయించాలి. విషయం తెలిసిన హేమన్‌దాస్ తన కుమారుడు భగవాన్ దాస్ పేరును ఇండెక్స్‌లో నమోదు చేయించారు. పుప్పాలగూడలో ఉన్న 50 ఎకరాలు స్వాహా చేయడం సాధ్యమైతే తనకు కమీషన్ ఇవ్వాలనే ఒప్పందంతో జైన్ ఈ వివరాలన్నింటినీ లక్ష్మీనారాయణకు చెప్పారు. దీంతో భగవాన్‌దాస్ మకీజ ఆ 50 ఎకరాలను తనకు విక్రయిస్తూ 1996లో జీపీఏ చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ పత్రాలు సృష్టించారు. 2003లో కేటాయించిన సీసీఎల్ఏ ఈ నకిలీ పత్రాల ఆ«ధారంగా సీసీఎల్ఏ పుప్పాలగూడలోని భూమిని 2003లో లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఇది నిబంధన ప్రకారం జరగలేదనే ఉద్దేశం తో 2006లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి హైకోర్టును ఆశ్రయించగా ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై లక్ష్మీనారాయణ 2016లో సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశా రు. దీంతో ఆ సమయంలో కలెక్టర్‌గా పని చేస్తున్న రజిత్ కుమార్ సేన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో.. సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాసులు ఆరా తీయగా.. భగవాన్‌దాస్ 1995లోనే చనిపోయినట్లు తేలింది. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పత్రాల్లో భగవాన్‌దాస్ 1996లో జీపీఏ చేసినట్లు ఉంది. దీంతో ఇవి బోగస్ పత్రాలుగా నిర్ధారించిన అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆయనతో పాటు దేవేందర్ కుమార్ జైన్, మిర్యాల నరసింహను గతంలో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులపై నాంపల్లి కోర్టులో గతవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టులో దాఖలు చేసి, ఆ 50 ఎకరాలు ప్రభుత్వ పరం చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండూ ఖరీదు చేసింది ఒకరే ‘కాందిశీకుడైన మలానీ స్కామ్‌లో పుప్పాలగూడలోని 148 ఎకరాలను సుకుమారెడ్డి నుంచి నందకిశోర్ ఖరీదు చేశారు. ఈ మకీజ స్కామ్‌లోనూ న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి 2005లో ఆ 50 ఎకరాలనూ నందకిశోరే రూ.3 కోట్లకు కొన్నారు. ఈ నేపథ్యంలోనే మకీజ కేసులో నందకుమార్‌తో పాటు ఈ స్కాంలో పాత్ర ఉన్న పి.కృష్ణను నిందితుడిగా చేర్చి, నోటీసులు జారీ చేశాం. మా విచారణ ఫలితంగా పుప్పాలగూడలోని విలువైన 198 ఎకరాల భూమి ప్రభుత్వ పరం కానుంది’ – డాక్టర్ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ ఏసీపీ -
బతకాలంటే డీల్ చేస్కో
లక్నో: ప్రాణాలతో ఉండాలనుకుంటే బీజేపీ నేతలతో డీల్ చేసుకోవాలని ఓ హిస్టరీ షీటర్‌ను సాక్షాత్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారే బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో సంబంధిత అధికారిని యూపీ పోలీస్‌శాఖ సస్పెండ్ చేసింది. ఝాన్సీ జిల్లాలోని మౌరానీపూర్‌కు చెందిన స్థానిక నేత లేఖ్‌రాజ్‌సింగ్ యాదవ్‌పై 70 కేసులు ఉండగా, ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు ఫోన్ చేసిన మౌరానీపూర్ ఎస్‌హెచ్‌వో సునీత్‌కుమార్ సింగ్.. ‘ఎన్కౌంటర్ల సీజన్ మొదలైంది. నీ మొబైల్ నంబర్‌పై ఇప్పటికే నిఘాపెట్టాం. నువ్వు త్వరలోనే ఎన్కౌంటర్లో చనిపోవచ్చు. ప్రాణాలతో ఉండాలనుకుంటే జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజయ్ దూబే, బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్‌లతో డీల్ చేస్కో. లేదంటే నీకు ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. నేను చాలాపెద్ద నేరస్తుడిని. ఇప్పటికే చాలామందిని చంపి పారేశాను’ అని హెచ్చరించారు. దీన్ని యాదవ్ పట్టించుకోకపోవడంతో అదేరోజు సాయంత్రం హర్కరణ్పురా గ్రామంలో ఆయన దాగున్న ఇంటిని సునీత్ నేతృత్వంలోని పోలీసుల బృందం చుట్టుముట్టింది. దీంతో ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరగ్గా.. యాదవ్ తన అనుచరులతో అక్కడ్నుంచి పరారయ్యాడు. అనంతరం ఎస్‌హెచ్‌వో సునీత్ తనతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను లేఖ్‌రాజ్ మీడియాకు విడుదల చేశాడు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారిని సస్పెండ్‌చేసిన పోలీస్‌శాఖ.. విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో నేరస్తుల్ని ఏరివేయడానికి ఈ ఏడాది పోలీసులు చేసిన 1,200 ఎన్కౌంటర్లలో 34 మంది క్రిమినల్స్ చనిపోగా, 265 మంది గాయపడ్డారు. -
అప్పుడు అర్జున్ రెడ్డి నేనే చేసేవాణ్ణి
‘‘దేశంలో చాలా భాషలు ఉన్నాయి. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నా భాష తెలుగు. చెన్నైలో ఉన్నప్పుడు నా భాష తమిళ్. నెక్ట్స్ హిందీ సినిమా చేయబోతున్నాను. ఎక్కడి నుంచైనా మంచి స్క్రిప్ట్ వస్తే తప్పుకుండా సినిమా చేస్తాను. ఒక యాక్టర్‌గా గ్లోబల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటాను. సక్సెస్‌ను తలకు, ఫెయిల్యూర్‌ను హార్ట్‌కు చేరనివ్వకూడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతాను’’ అన్నారు విక్రమ్. విజయ్ చందర్ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘స్కెచ్’. తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం చెబుతోంది. త్వరలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విక్రమ్ చెప్పిన సంగతలు.... ► న్యూ టైప్ ఆఫ్ హీరోయిజమ్‌తో మాస్ కమర్షియల్ ఫిల్మ్‌గా ‘స్కెచ్’ చిత్రాన్ని కొత్త స్టైల్లో ట్రై చేశాం. సినిమాలో వచ్చే ట్విస్ట్‌లకు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. సూపర్ క్లైమాక్స్ ఇచ్చారు దర్శకులు. తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలో కూడా ‘స్కెచ్’ హిట్ అయ్యింది. అన్నీ సెంటర్స్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఈ సినిమాలో కొత్త విక్రమ్‌ని చూస్తారు. ఓన్లీ డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న సినిమాలే కాదు. కమర్షియల్ సినిమాలూ ఇష్టమే. అయితే క్యారెక్టర్లో డిఫరెంట్ లేకపోతే సినిమాలు చేయను. ► ప్రస్తుతం నేను గౌతమ్‌వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా త్రీ పార్ట్స్ అని కాదు. ఒక ఫ్రాంచైజీలా తీయాలనుకుంటున్నాం. ఇంట్రర్నేషనల్ స్పై థ్రిల్లర్. నెక్ట్స్ ‘సామి’ సీక్వెల్ చేస్తున్నాను. కమల్‌సార్ ప్రొడక్షన్లో సినిమా చేయనున్నాను. తర్వాత ‘మహావీర్‌కర్ణ’ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాను. ► ‘అర్జున్ రెడ్డి’ మంచి సినిమా. ఈ సినిమాతో «మా అబ్బాయి ధ్రువ్‌ను లాంచ్ చేయాలన్నది నాన్నగారి ఆలోచన. ధ్రువ్‌కి మరో త్రీ ఇయర్స్ తర్వాత యాక్టింగ్‌కి కరెక్ట్ టైమ్ అని నేను అనుకున్నాను. ఒకవేళ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను నా కొడుకు చేయకపోతే.. నేను ట్రై చేసేవాడినేమో. ఏజ్ పరంగా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. స్క్రీన్‌పై యాక్టర్ ఎలా కనిపిస్తున్నారన్నదే ముఖ్యం. -
రెండు రోజులు ముందే పండగ!
ఇక్కడ సంక్రాంతి.. అక్కడ (తమిళనాడు) పొంగల్... పేర్లు వేరైనా పండగ జోష్‌లో మాత్రం ఏ తేడా ఉండదు. తెలుగు బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి... తమిళ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే.. అక్కడ కూడా నాలుగే. అయితే ఇంట్రస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ నాలుగు సినిమాలు ఒకే తేదీన.. అది కూడా పండగ రెండు రోజులు ముందే (12.01.18) విడుదల కానున్నాయి. సంక్రాంతికి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు అందరికంటే ముందు కర్చీఫ్ వేసింది హీరో సూర్యానే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘తానా సేంద కూట్టమ్’. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. హిందీ చిత్రం ‘స్పెషల్ 26’లో ఉన్న మెయిన్ పాయింట్ ఇందులో ఉందట. సూర్య తర్వాత పండక్కి మేం వస్తున్నాం అని ఎనౌన్స్ చేశారు ప్రభుదేవా. కల్యాణ్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘గులేభకావళి’. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి రేవతి కీలక పాత్ర చేశారు. అయితే.. టైటిల్ చదవగానే పాత సినిమా గుర్తుకు రావచ్చు. అందుకే.. గతంలో ఇదే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఇక, పొంగల్ సందడిలో బాక్సాఫీస్ వద్ద స్కెచ్ వేస్తున్నామని విక్రమ్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు కానీ.. ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేదు. ఫైనల్‌గా జనవరి 12న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారాయన. విజయ్ చందర్ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్’. ఈ సినిమాను కేరళలో కూడా 12నే రిలీజ్ చేస్తున్నారు. ముగ్గురు బడా హీరోలు పండక్కి బాక్సాఫీస్ వద్ద కాచుకుని ఉంటే.. ఏం పర్లేదు. మా సినిమా కంటెంట్‌పై భరోసా ఉంది. సో.. పండగ బరిలో దిగేందుకు సిద్దమే అని ‘మధుర వీరన్’ టీమ్ సై అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు. పీజీ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయకాంత్ తనయుడు షణ్ముగ పాండియన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు. ఇవికాక.. సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘కలకలప్పు–2’, అరవింద్‌స్వామి నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ చిత్రాల విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ నాలుగు సినిమాలు రెడీ అయిపోవడంతో ఈ సినిమాలు రాకపోవచ్చన్నది కొందరి వాదన. పండక్కి ఎన్ని సినిమాలు విడుదలైనా చూసే తీరిక ప్రేక్షకులకు ఉంటుందన్నది మరికొందరి వాదన. మరి.. సంక్రాంతి కి ఎన్ని సినిమాలొస్తాయి? బరిలో గెలుపు ఎవరిది? ‘వెట్రి యారుక్కున్ను అంజు నాళ్ పొరుత్తిరిందు పార్పోమ్’. అర్థం కాలేదా? ‘గెలుపు ఎవరికన్నది ఐదు రోజులు వేచి చూద్దాం’ అని అర్థం. హన్సిక, ప్రభుదేవా షణ్ముగ విక్రమ్, తమన్నా -
సంక్రాంతికి విక్రమ్ ‘స్కెచ్’
తమిళ సినిమా: నటుడు సియాన్ విక్రమ్ సంక్రాంతికి బరిలో దిగడానికి ‘స్కెచ్’ వేస్తున్నారు. ఇరుముగన్ చిత్ర విజయంతో నూతనోత్సాహంతో ఉన్న నటుడు విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్. మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళం నటుడు హరీశ్, శ్రీమాన్, మధుమిత, విశ్వాంత్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వీరితో పాటు నటి ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను వీ.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌చందర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్.థమన్ సంగీతం, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఐ వంటి చిత్రాలతో ప్రయోగాలు చేసిన విక్రమ్ ఈ స్కెచ్ చిత్రంతో మళ్లీ పక్కా మాస్ ట్రెండ్‌కు తిరిగారు. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. భారీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అంటూ కమర్షియల్ ఫార్ములాతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర టీచర్‌ను మంగళవారం విడుదల చేశారు. -
పక్కా స్కెచ్
మనల్ని ఎవరైనా దెబ్బతీస్తే అలా ఊరుకోవద్దు అంటాడు ఆ కుర్రాడు. పక్కా స్కెచ్ గీసుకుని ఎదురెళ్లమంటాడు ఆ నార్త్ చెన్నై కుర్రాడు. అలా అనటమే కాదు ఈ సంక్రాంతికి పక్కా స్కెచ్ గీసుకు వస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? ఎవరికి స్కెచ్ వేస్తున్నారు అంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు విజయ్ చందర్. ఆయన దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమన్నా హీరోయిన్గా రూపొందిన సినిమా ‘స్కెచ్’. వి క్రియేషన్స్ అధినేత కలైపులి.ఎస్. థాను నిర్మించారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో విక్రమ్ ‘కనవే కనవే’ (కనవే అంటే కల అని అర్థం) అని సాగే ఒక పాట కూడా పాడారు. -
ప్లాన్.. ఫ్లాప్
పక్కా ప్లాన్ వేశారు.. అనుకున్నట్టుగానే దారిదోపిడీకి వెంబడించారు.. అదునుచూసి స్కెచ్ వేసిన వ్యక్తిని దొరికించుకున్నారు.. ఉన్నకాడికి డబ్బులను దోచుకున్నారు.. పారిపోతూ చివరికి ఇట్టే పట్టుబడ్డారు. వారి ప్లాన్‌ను పోలీసులు పసిగట్టి ప్లాఫ్ చేయడంతో బాధితుడికి న్యాయం జరిగింది. దోపిడీ చేయాలనే ఆలోచన వచ్చింది ఎక్కడో ఉండే దారిదోపిడీ దొంగలకు కాదు.. సదరు వ్యక్తి వద్ద పనిచేసిన పాత డ్రైవర్‌కే. మహబూబ్నగరక్రైం/జడ్చర్ల: అడ్డ దారిన సంపాదించాలనుకున్న కొంద రు దుండగులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంత చలాకీగా వ్యవహరించి దోపిడీకి పాల్పడినా చివరకు పోలీసుల చక్రబంధనంతో ఇట్టే చిక్కారు. ఈ సంఘటన జడ్చర్ల కావేరమ్మపేట అర్అండ్బీ అతిథిగృహం సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సంఘటన జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకున్నారు. మంగళవారం ఎస్పీ అను రాధ తన కార్యాలయంలో దోపిడీకి సం బంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. నేరచరిత్ర ముఠాతో దోస్తీ.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన రామావత్ మోర్ వృత్తిరీత్యా సైకిల్ విడిభాగాల హోల్‌సేల్ వ్యాపారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని రిటైల్ వ్యాపారులకు విడిబాగాలను సరఫరా చేసి ప్రతీనెల వచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. వ్యాపారివద్ద సంతోష్ సుబాన్‌జీ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో మూడేళ్ల క్రితం యజమాని అతన్ని తొలగించాడు. అయితే సంతోష్ సోదరుడు అంబదాస్ సుభాన్‌జీ, అతని బంధువు వెంకటేశ్ బిలాదార్కు ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్ల కేసులో నేరచరిత్ర కలిగి ఉన్న దినేష్ మాన్, గణేష్‌తో పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దారి దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు. అందులో ఒకరిద్దరికి దారి దోపిడీలు చేసిన అనుభవం ఉంది. యజమాని నడవడిక ఆధారంగా స్కెచ్ సైకిల్ విడిభాగాల వ్యాపారి రామావత్ను టార్కెట్ చేయడానికి అతని పాత డ్రైవర్ సంతోష్ తన బృందానికి చెప్పాడు. ప్రతీనెలా ఆయన ఎక్కడెక్కడకు వెళ్తాడు.. ఎంతెంత డబ్బులు వసూలు చేస్తాడు.. ఎక్కడెక్కడ ఆగుతాడనే పూర్తి వివరాలను సేకరించి దోపిడీ చేయాలని స్కెచ్ వేశారు. వెంకటేశ్‌కు చెందిన క్వాలిస్ (టీఎస్ 12 ఈఈ 6736)తో పాటు ఓ బైక్‌పై సోమవారం ఉదయం నుంచే రామావత్ మోర్ కారును వెంబడించారు. జడ్చర్ల నుంచి వనపర్తికి వెళ్లిన సమయంలో అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బైక్‌ను పార్క్ చేసి పెబ్బేర్ వెళ్లే రహదారిలో ఉన్న ఓ దుకాణంలో రెండు కత్తులను కొనుగోలు చేశారు. క్వాలిస్‌లో వెళ్లడానికి కుదరక పోవడంతో బైక్‌పై వెళ్లి పని పూర్తిచేసేలా వ్యూహం రచించారు. కానీ బైక్ అవసరం లేక వనపర్తిలోనే ఉంచారు. రామావత్ కర్నూల్ వెళ్లిన తర్వాత డబ్బు పెద్దమొత్తంలో వసూలయ్యాక దోపిడీ చేయాలనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే వ్యాపారి కలెక్షన్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆందోళన కలిగిస్తున్న దోపిడీలు జాతీయ రహదారిపై ప్రయాణమంటే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలతో పాటు దొంగతనాలు, దోపిడీలకు ఈ రహదారి కేరాఫ్‌గా మారడంతో ప్ర యాణికులు భయపడుతున్నారు. డబ్బులు దోచుకోవడానికి దుం డగులు హత్యలు చేయ డానికి సైతం వెనకాడటం లేదు. చాలామంది కిడ్నాప్‌లు, దోపిడీలు చేయడానికి జాతీయ రహదారినే ఎం చుకోవడం సర్వత్రా కలవరపాటుకు గురిచేసింది. కత్తులతో బెదిరించి... కారు వెంబడించిన దొంగల ముఠా వ్యాపారి ఎక్కడ వాహనం దిగుతాడోనని అదును కోసం వేచిచూశారు. అంతలోనే జడ్చర్ల అతిథిగృహం వద్ద రామావత్ మూత్ర విసర్జనకు కారు ఆపాడు. ఇదే చాన్స్ అనుకుని వెంటనే క్వాలిస్‌లో వచ్చిన దుండగులు కత్తులతో బెదిరిస్తూ అతని వద్దనున్న రూ.3.84 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పాటు కారును కూడా తీసుకుని హైదరాబాద్ వైపు పారిపోయాడు. పాత డ్రైవర్ సంతోష్ తన పాత యజమాని ఎక్కడ గుర్తిస్తాడోనన్న అనుమానంతో క్వాలిస్‌లోనే ఉండిపోయాడు. వారు అలా వెళ్లేసరికి వ్యాపారి వెంటనే జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్లపై తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అనురాధకు సమాచారం ఇవ్వగా ఆమె కూడా హుటాహుటిన జడ్చర్లకు చేరుకుని తనిఖీల్లో పాల్గొన్నారు. గొల్లపల్లి సమీపంలో కారును వదిలి అంతా క్వాలిస్‌లో కల్వకుర్తి వైపు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దోపిడీ రెండోసారి.. సారి కర్ణాటక రాష్ట్రంలో డబ్బు వసూలు చేసుకుని వస్తుండగా దో పి డీ చేయించాడు. ఈ ఘటనలో సంతోష్ నేరుగా పాల్గొనకపోయినా జ డ్చర్ల దగ్గర జరిగిన సంఘటనలో నేరుగా పాల్గొని పట్టుబడ్డాడు. సొత్తు స్వాధీనం.. దుండగుల అరెస్ట్ దొంగలను అరెస్ట్ చేసిన అనంతరం వారి నుంచి క్వాలిస్, షిఫ్ట్ కారుతో పాటు నాలుగు సెల్ఫోన్లు, రూ.3.84లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్పీ అనురాధ తన కార్యాలయంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. అలాగే, కేసును ఛేదించిన మిడ్జిల్ ఎస్ఐ సైదులు, ఏఎస్ఐ జహంగీర్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రాజు, విష్ణులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ భాస్కర్, జడ్చర్ల సీఐ బాలరాజు పాల్గొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు కొన్ని.. ♦ ఇదే రహదారిపై పోలేపల్లి సెజ్ సమీపంలో మూడేళ్ల క్రితం డబ్బుల కోసం లారీలను ఆపి దోపిడీకి పాల్పడడడమే కాక లారీ డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ♦ దశాబ్ధం క్రితం ఇదే రహదారిపై కుక్కల రాజు అనే ఘరానా దోపిడీదారుడు తన ముఠాతో జడ్చర్ల సమీపంలో హైటెక్ బస్సును దోచుకున్నాడు. ♦ 2010లో మల్లెబోయిన్పల్లి సమీపంలో జాతీయరహదారిపై లారీని ఆపి కొందరు దోపిడీకి పాల్పడ్డారు. ♦ 2011 అక్టోబర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి సెజ్ దగ్గర జాతీయరహదారి పక్కనే పెట్రోల్ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. ♦ మత ప్రచారకుడు కే.ఏ.పాల్ సోదరుడు డేవిడ్ రాజును కూడా అడ్డాకుల సమీపంలో జాతీయ రహదారి పక్కనే హత్య చేశారు. ♦ ఆగిఉన్న వాహనాల నుంచి డీజిల్ దొంగిలించిన సంఘటనలైతే లెక్కకు మించి చోటు చేసుకుంటున్నాయి. -
రౌడీషీటర్ హత్యకు టీడీపీ నేత స్కెచ్
-
లంకేశ్ హత్య కేసులో పురోగతి
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో హంతకుల ఊహాచిత్రాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విడుదల చేసింది. సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన ఇంటి ముందు లంకేశ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆమె హత్య జరిగిన 5 వారాల అనంతరం ఘటనకు కారణమని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మూడు ఊహా చిత్రాలను 21 మంది సభ్యుల సిట్ బృందం మీడియాకు విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరు నిపుణులైన చిత్రకారులు ఈ చిత్రాల్ని గీశారని, అందులో రెండు చిత్రాలు ఒక వ్యక్తివేనని సిట్ చీఫ్ బీ.కే సింగ్ బెంగళూరులో వెల్లడించారు. ఈ కేసులో దాదాపు 200–250 మందిని విచారించామని, హంతకులు దేశీ తయారీ 7.65 ఎం.ఎం తుపాకీ వాడారని తెలిపారు. ‘లంకేశ్ హత్యకు వృత్తిపరమైన విభేదాలు కారణం కాదని ఇంతకుముందే చెప్పాం. ఈ ఘటనలో ఏ జర్నలిస్టు ప్రమేయం లేదు. అయితే అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. సదరు నిందితులిద్దర్నీ ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా భావిస్తున్నామని, 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చని, కనీసం ఏడు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆ హత్యలతో సారూప్యత లేదు మహారాష్ట్రలోని దబోల్కర్, పన్సారే, కర్ణాటకలోని కల్బుర్గీ హత్యలకు సారూప్యత ఉన్నట్లు చెప్పలేమని సింగ్ పేర్కొన్నారు. సిట్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఘటనకు సంబంధమున్న రెండు వీడియోలను సిట్ మీడియాకు అందజేసింది. ఆమె ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్నూ సిట్ విడుదల చేసింది. -
విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్’
తమిళసినిమా: సియాన్ విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తుండగా వీటిలో ఒకటి ‘స్కెచ్’. ఇందులో ఆయన మిల్కీ బ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారు. నటుడు సూరి, ఆర్కే సురేశ్, అరుళ్దాస్, మలయాళం నటుడు హరీష్, శ్రీమన్, విశ్వంత్, బాబురాజ్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ కీలక పాత్రలో ప్రియాంక నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్. తమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కలైపులి ఎస్. థాను వి.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో బ్రహ్మండమైన పాటను చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇందుకోసం భారీ ఎత్తున సెట్‌ను వేసినట్లు చెప్పారు. ఇందులో విక్రమ్‌తోపాటు 150 మంది నృత్య కళాకారులు, 1,500 మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ స్కెచ్ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. -
త్వరలో స్కెచ్ ఆడియో
తమిళసినిమా: వైవిధ్యం కోసం తపించే నటుల్లో విక్రమ్ ఒకరని చెప్పవచ్చు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతకైనా రెడీ అనే నటజీవి విక్రమ్. తనకు తొలి విజయాన్ని అందించి నటుడిగా జీవితాన్నిచ్చిన సేతు చిత్రం నుంచి ఈ మధ్య తెరపైకి వచ్చి విజయం సాధించిన ఇరుముగన్ వరకూ జయాపజయాలను పక్కన పెడితే విక్రమ్ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని చెప్పవచ్చు. అయితే ‘ఐ’ వంటి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు విక్రమ్ శ్రమకు తగిన ఫలితాన్ని అందించలేదు. దీంతో చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్. రెండవది ధృవనక్షత్రం. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీంతో ముందుగా స్కెచ్ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా నటిస్తోంది. విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సంగీతదర్శకుడు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత విక్రమ్ ధృవనక్షత్రం చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. ఆ తరువాత హరి దర్శకత్వంలో సామి–2 చిత్రానికి రెడీ అవుతారని సమాచారం. -
సరైనోడు ఎక్కడున్నాడో?
తమిళసినిమా: నటి తమన్నాకు భర్త కావాలట. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి తమన్నా. ఇప్పటివరకూ గ్లామరస్ పాత్రలో అందాలను ఆరబోసిన ఈ అమ్మడు బాహుబలి చిత్రంలో తనదైన నటనతో అలరించింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తమన్నా సినీ జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునే రీతిలో ఆ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంది.కాగా ఇటీవల శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరోసారి గ్లామర్ పరంగా దుమ్మురేపిందనే చెప్పాలి. అయినా ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరచింది. కాగా ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్న తమన్నా నటనతో పాటు తన తండ్రి నగల వ్యాపారంలో సాయంగా ఉంటున్నారు. షూటింగ్ లేని సమయాల్లో నగల డిజైన్లు చేస్తుంటారట. కాగా ఇటీవలే తన సోదరుడి వివాహనిశ్చితార్ధం వేడుకలో అంతా తానై హడావుడి చేసిన భామకు కూడా పెళ్లి చేసేసి తమ బాధ్యతను దించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ఆమె తల్లిదండ్రులు తమన్నాకు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారట. మరి తమన్నాకు సరైనోడు ఎక్కడున్నాడో? ఎప్పుడోస్తాడో? తమన్నా కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉందట. -
తమన్నాతో విదేశాల్లో విక్రమ్
విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్. ఇరుముగన్ చిత్రం సంచలన విజయం సాధించిన తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా రొమాన్స్ చేస్తున్న చిత్రం స్కెచ్. ఇంతకు ముందు శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. పులి, ఇరుముగన్ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం స్కెచ్. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్, తమన్నాల రొమాంటిక్ లవ్ సన్నివేశాలను పాండిచ్చేరిలో చిత్రీకరించారట. ఇక విక్రమ్ నటించే మాస్ సాంగ్ కోసం చెన్నైలోని బిన్నీమిల్లులో వేసిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారట. అలాగే విక్రమ్, తమన్నాల డ్యూయెట్ సాంగ్‌ను విదేశాల్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇందులో విక్రమ్ బైక్‌ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీబ్యూటీ నటిస్తున్నారట. ఇంతకు ముందు చిత్రాల్లో తెగ అందాలను ఆరబోసిన ఈ అమ్మడు స్కెచ్‌లో హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు. చూద్దాం ఈ తరహా పాత్రలో తమన్నా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో. -
విక్రమ్, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్’
చెన్నై: విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్. ఇరుముగన్ చిత్రం తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా నటిస్తున్న చిత్రం ఇది. శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పులి, ఇరుముగన్ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్ దీనికీ నిర్మాతగా ఉన్నారు. కాగా, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ ఇందులోని విక్రమ్, తమన్నాల రొమాంటిక్ సన్నివేశాలను పాండిచ్ఛేరిలో చిత్రీకరించారు. ఇక విక్రమ్ నటించే మాస్ సాంగ్‌ను చెన్నైలోని బిన్నీ మిల్లులో వేసిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారని కోలీవుడ్ టాక్. ఇక విక్రమ్, తమన్నాల డ్యూయెట్ సాంగ్‌ను విదేశాలలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ వేసినట్లు సమాచారం. విక్రమ్ భైక్ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు. ఈచిత్రంలో తమన్నాని హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు. -
ష్... ఎవరికీ చెప్పకు తమ్మూ!!
ఎవరు స్కెచ్ వేశారు? హూ ఈజ్ దిస్? అని తమన్నా అడుగుతుంటే ‘ష్... ఎవరికీ చెప్పకు తమ్మూ’ అన్నట్టు ముక్కు మీద వేలేసుకుని చిన్న పిల్లాడిలా ‘చియాన్’ విక్రమ్ ఎలా ఫేస్ పెట్టాడో చూడండి. అక్కడితో ఆగలేదు. షూటింగ్ స్పాట్లో ఉన్న జనాలందర్నీ తమన్నా దగ్గరకు తీసుకొచ్చి... ‘ఇతను కావొచ్చు, ఇతను కావొచ్చు, వీళ్లలో ఎవరైనా కావొచ్చు’ అంటూ హడావుడి చేశారు. మేటర్ ఏంటంటే? విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘స్కెచ్’. టైటిల్ డిఫరెంట్‌గా ఉంది కదూ! సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుందట. ‘స్కెచ్’ చుట్టూ కథ తిరుగుతుంది. మరి, ఆ స్కెచ్ ఎవరు? మనిషా? మరొకటి ఏదైనానా? తమన్నా ఎక్కడ చెప్పేస్తుందోనని విక్రమ్‌లో చిన్నపాటి భయం. బయటకు ఏం రివీల్ చెయ్యొద్దని ఇన్‌డైరెక్ట్‌గా ఇలా చెప్పారన్న మాట! ఎందు కంటే... తమన్నా నిన్నటితో తన టాకీ పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేసేశారు. -
మురికివాడల్లో మిల్కీ బ్యూటీ
తళతళలాడే అందం తమన్నాది. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే ఈ పాలరాతి బొమ్మ స్లమ్ గర్ల్‌గా కనిపిస్తే? .. తమన్నా ఎందుకలా కనిపిస్తారు అనుకుంటున్నారు? కానీ, ఇది నిజం. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌తో తొలిసారి జోడీ కడుతున్నారీ మిల్కీ బ్యూటీ. అయితే, ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఫస్ట్ టైమ్ మురికి వాడల్లో ఉండే యువతి పాత్రలో నటిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. తన పాత్ర, కథ గురించి దర్శకుడు చెప్పిన ప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారట తమ్మూ. విక్రమ్‌తో నటించే ఛాన్స్ రావడమే హ్యాపీ అనుకుంటే, నటనకు ఆస్కారం ఉండేలా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటం డబుల్ హ్యాపీ అని తెగ సంబరపడి పోతోందట తమన్నా. ఇటువంటి చిత్రాల్లో నటించే అవకాశం ఎప్పుడోకానీ తలుపు తట్టదనీ, వచ్చినప్పుడు వెంటనే అందిపుచ్చుకోవాలని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట తమన్నా. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్కెచ్’ అనే పేరు పరిశీలనలో ఉంది. విక్రమ్ స్కెచ్ వేసి మరీ శత్రువులను అంతం చేస్తాడట. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట. -
మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్
కొన్ని సినిమా కథలు ఆర్టిఫిషియల్ అనిపిస్తే మరి కొన్ని హార్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ రెండవ కోవకు చెందిన కథలో తాను నటిస్తున్నానంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. బాహుబలి చిత్రంతో బ్రహ్మాండమైన పాపులారిటీని పెంచుకున్న ఈ భామ ఆ తరువాత ఆ స్థాయి పాత్రల్లో నటించలేదు. తాజాగా విక్రమ్‌తో రొమాన్స్ చేస్తున్నారు. విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో విక్రమ్ సంఘ విద్రోహుల్ని స్కెచ్ వేసి అంతం చేస్తారట. మదురై నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ఉత్తరచెన్నై నేపథ్యంలో వరుసగా చిత్రాలు రూపొందుతున్నాయి. ధనుష్ హీరోగా వడచెన్నై, కృష్ణ నటిస్తున్న వీరా, శుశీంద్రన్ దర్శకత్వంలో శత్రు చిత్రాలు ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలే. విక్రమ్, తమన్నాల చిత్రానికి ఇదే నేపథ్యం అట. ఇంతకు ముందు గ్లామర్‌కు ప్రాముఖ్యతనిస్తూ నటించిన తమన్నా ఈ చిత్రంలో స్లమ్ ఏరియా యువతిగా చాలా సహజత్వంతో కూడిన పాత్రను పోషిస్తున్నారట. ఈ కథ విన్నప్పుడే అమ్మడు కళ్లు చమర్చాయట. బాహుబలి చిత్రం తరువాత అంతగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ స్కెచ్ చిత్రంలో చేస్తున్నారట. విక్రమ్‌కు జంటగా నటించడమే చాలా ఎగ్జైట్‌గా ఫీలైన ఈ మిల్కీబ్యూటీ ఇప్పుడు ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెగ మురిసిపోతుందట. ఇక సంచలన నటుడు శింబుతో నటిస్తున్న అన్బానవన్ అసరాదవన్ అడంగాదన్ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుందట.అలాగే బాహుబలి–2 ఏప్రిల్ 28న తెరపైకి రావడానికి బ్రహ్మాండంగా ముస్తాబవుతోంది. -
భారీ స్కెచ్.!
సాక్షి,విశాఖపట్నం: మన్యంలో మావోయిస్టులు భారీ స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ ప్రాభవాన్ని చాటుకోవడానికి ఇక దూకుడుగా వ్యవహరించాలని వారు భావిస్తున్నారనే అనుమానాలు తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. కాఫీ తోటలను వదిలిపోవాల్సిందిగా వారు చేసిన హెచ్చరికలు ఇప్పుడు మన్యంలో కలకలం రేపుతున్నాయి. కాఫీ తోటలు కేవలం ఓ సాకు మాత్రమేనని దీని వెనక మావోలు వ్యూహం వేరుగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కాఫీ తోటలు, క్యారీలు సాకుగా... రెండు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో కలకలం రేగింది. జీకే వీధి మండలం పెదవలస గ్రామంలో రెండు రోజుల క్రితం మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. మన్యం సంపద కాజేయడానికి పోలీసులు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అరాచకం సష్టిస్తున్నారని వాటిలో రాశారు.ఏపీఎప్డీసీ అధికారులు కాఫీ తోటలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సపర్ల, చాపరాతిపాలెం, లంకపాకలు, బోనంగిపల్లి, సిరాబల, రంపుల,పెదవలస, కొమ్మంగి, వంగశార, చాపరాతిపాలెం ఎర్రమట్టిక్వారీని మూసివేయాలని లేదంటే క్వారీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న గడుతూరి బాలయ్యపడాల్, జి.శంకర్, జి.మురళి, కె.బాలరాజు, పి.దేముడులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు, కరపత్రాల్లో తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉనికి కోసమేనా... అయితే ఇదంతా అవాస్తవమని, అక్కడ అలాంటివేవీ లేవని కొందరు కొట్టిపడేశారు. కానీ అధికారులు మాత్రం ఇదంతా వాస్తమమేనంటున్నారు. అయితే ఇక్కడ మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది.ఇటీవల గాలికొండ ఏరియా కమిటీ ముఖ్య నేతలను కోల్పోయి బలహీన పడింది. అలాంటి కమిటీ ఇంత దూకుడుగా ఎందుకు హెచ్చరికలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. వెనకబడింది కాబట్టే ఉనికి చాటుకోవడానికి ఈ ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మావోయిస్టుల నోట మళ్లీ ప్రజాకోర్డు అనే మాట రావడం మాత్రం పోలీసులను, గిరిజనులను కలవరపాటుకు గురిచేస్తోంది. కలవరపెడుతున్న చేదు జ్ఞాపకాలు ఏడాదిన్నర క్రితం బలపం పంచాయతీలో జరిగిన ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ గిరిజనుడిని చంపి మరొకరిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా వారి ప్రయత్నాన్ని గిరిజనులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మావోలపై ఎదురు దాడిచేసి చంపేశారు. ఈ దుర్ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ దాడికి పాల్పడిన వారిని ప్రజాకోర్టులో హతమారుస్తామని మావోలు ప్రతిజ్ఞ కూడా చేశారు. కానీ తర్వాత వారి ప్రతిజ్ఞ నెరవేరే పరిస్థితులు మన్యంలో కనిపించలేదు. కూంబింగ్ పెరగడం, వరుసగా ముఖ్య నేతలను కోల్పోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజా కోర్టును తెరపైకి తేవడంతో మున్నుందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
అంతా.. స్కెచ్ ప్రకారమే!
♦ ఒక్కొక్కరికీ.. ఒక్కో హామీ... ♦ నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్కెచ్‌కు దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కకావికలం అవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరినీ గులాబీ గూటికి చేర్చడంలో టీఆర్ఎస్ చీఫ్ సక్సెస్ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబీల్లో కావాల్సిన సాధారణ మెజారిటీ ఉన్నా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. టీడీఎల్పీ, వైఎస్సార్సీఎల్పీ విలీనం కూడా అయ్యాయి. ఇక 17 మంది పార్లమెంటు సభ్యుల్లో ముగ్గురు మినహా 14 మంది టీఆర్ఎస్లో ఉన్నట్టే. తాము గెలిచిన 11 ఎంపీలకుతోడు టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి ఒక్కొక్కరు గులాబీ గూటీకి చేరగా, బుధవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు దేవర కొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ), మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు(కాంగ్రెస్) టీఆర్ఎస్లో చేరుతున్నారు. మరోైవె పు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ‘కాకా’ తనయులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ కూడా కాంగ్రెస్‌కు రాంరాం చెబుతున్నారు. అయితే పార్టీలో చేరుతున్న ఒక్కో నేతకు ఒక్కో రకమైన హామీని కేసీఆర్ ఇస్తున్నారని అంటున్నారు. ఒకరికి మంత్రి పదవి, మరొకరికి డిప్యూటీ సీఎం పదవి, కొందరికి ఇతరత్రా కేబినెట్ హోదా ఉన్న పదవుల తాయిలం చూపుతున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పలు తడవలు సీఎం కేసీఆర్‌తో జరిగిన చర్చల ఫలితమేనని విశ్లేషిస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 3 గంటలకు తెలంగాణ భవన్లో ఈ నేతల చేరికలకు ఏర్పాట్లు జరిగాయి. -
రూ. 150 కోట్లతో చంద్రబాబు స్కెచ్
-
భలే ప్లాన్ 'బాసూ'!
- తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రూ.75 కోట్లు - ఏపీలో స్థానిక ప్రజాప్రతినిధుల కోసం మరో 75 కోట్లు - డబ్బు సమకూర్చే బాధ్యత ఇద్దరు రాజ్యసభ సభ్యులకు - ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తల నుంచి వసూలు - రేవంత్ పట్టుబడటంతో బెడిసికొట్టిన బాబు వ్యూహం హైదరాబాద్: తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాలి, ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బు వెదజల్లాలి.. ఇందుకోసం రెండు చోట్లా రూ.75కోట్ల చొప్పున రూ.150కోట్లు కావాలి.. ఆ సొమ్మును ఏపీ ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేయాలి.. ఇదీ స్థూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పన్నాగం. ఇరవై రోజుల క్రితమే రూపకల్పన చేసిన పక్కా ప్లాన్ ఇది. అనుకున్నదే తడవుగా తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు ఆ సొమ్ము సేకరించే బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన, ప్రాజెక్టులు దక్కించుకున్న ముగ్గురు కాంట్రాక్టు సంస్థల అధినేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారితో చర్చలు జరిపారు. రూ.30 కోట్ల చొప్పున ముట్టజెప్పేలా వారితో రహస్య ఒప్పం దం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు గాలం వేశారు. ముగ్గురు చేజారినా.. ఐదుగురిని పక్కా చేసుకుని, వారి డిమాండ్‌ను బట్టి రూ.75 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. అడ్వాన్సుగా కొంత ముట్టజెప్పడం కోసం ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి రూ.5 కోట్ల చొప్పున ముందే తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బెడిసికొట్టిన వ్యూహం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసేందుకు రూ.5 కోట్ల ఒప్పందంలో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇవ్వజూపుతూ రేవంత్‌రెడ్డి పట్టుబడటంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఏసీబీ చేసిన విచారణలో.. చంద్రబాబు, ఆయన సన్నిహితులైన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పన్నాగం మొత్తం బయటపడింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలవాలన్న వ్యూహం వెల్లడైంది. బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంక్ శాఖ నుంచి డ్రా చేసిన డబ్బును రేవంత్ తెచ్చినట్లు తేలడంతో ఆ బ్యాంకు నుంచి 29, 30 తేదీల్లో పెద్ద ఎత్తున డబ్బు డ్రా చేసిన 40 మందిని గుర్తించారు. వారిలో టీడీపీతో సన్నిహితంగా ఉంటే ఐదారుగురు కాంట్రాక్టర్లు, అరడజను మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరిలో చంద్రబాబుతో, ఆయన వెన్నంటి ఉండే ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సన్నిహితంగా మెలిగే ఇద్దరు పారిశ్రామికవేత్తలు, ఓ కాంట్రాక్టు సంస్థ అధినేతను గుర్తించి వారి కాల్‌డేటాను ఏసీబీ అధికారులు విశ్లేషించారు. ఐదారుగురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబుకు సన్నిహితులైన ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు నిత్యం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. ఓ కాంట్రాక్టు సంస్థ అధినేతతో ఏపీకి చెందిన మంత్రి కూడా అనేకమార్లు ఫోన్లో మాట్లాడినట్లు ఏసీబీ గుర్తించింది. అసలు వీరితో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు మాట్లాడారని ఓ పారిశ్రామికవేత్త వద్ద ఏసీబీ విచారణాధికారి ఒకరు ప్రస్తావించగా.. ఆయన ఆఫ్ ద రికార్డుగా బాబు వ్యూహాన్ని బట్టబయలు చేసినట్లు తెలిసింది. కేసుకు అవసరమైన ఆధారాన్ని బట్టి ఆ పారిశ్రామికవేత్త వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. లబ్ధి చేకూర్చినందుకే ఏపీ ప్రభుత్వం ముగ్గురు కాంట్రాక్టు సంస్థల అధినేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలకు అయాచిత లబ్ధి చేకూర్చినందుకే వారు డబ్బు సమకూర్చడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వారిలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ప్రముఖుడు కూడా ఉన్నారు. నిజాయితీ రాజకీయాలు చేస్తానని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు, తనకు బలం లేనిచోట పోటీకి పెట్టి ప్రజాప్రతినిధులను ప్రలోభపర్చుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేశారో తెలుసుకుని ఏసీబీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ వ్యవహారా న్ని వీలైనంత త్వరగా ఛేదించి బయటపెట్టాలని ఏసీబీ భావిస్తోంది. చంద్రబాబును విచారించే సమయానికి డబ్బు సమకూర్చిన వారి వివరాలతో సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. -
కాల్పుల ఘటన నిందితుని ఉహాచిత్రం విడుదల