మురికివాడల్లో మిల్కీ బ్యూటీ | Tamanna as Slum Girl? | Sakshi
Sakshi News home page

మురికివాడల్లో మిల్కీ బ్యూటీ

Published Fri, Feb 17 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

మురికివాడల్లో  మిల్కీ బ్యూటీ

మురికివాడల్లో మిల్కీ బ్యూటీ

తళతళలాడే అందం తమన్నాది. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే ఈ పాలరాతి బొమ్మ స్లమ్‌ గర్ల్‌గా కనిపిస్తే? .. తమన్నా ఎందుకలా కనిపిస్తారు అనుకుంటున్నారు? కానీ, ఇది నిజం. విలక్షణ నటుడు విక్రమ్‌ హీరోగా విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌తో తొలిసారి జోడీ కడుతున్నారీ మిల్కీ బ్యూటీ. అయితే, ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఫస్ట్‌ టైమ్‌ మురికి వాడల్లో ఉండే యువతి పాత్రలో నటిస్తున్నట్లు కోలీవుడ్‌ సమాచారం.

తన పాత్ర, కథ గురించి దర్శకుడు చెప్పిన ప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారట తమ్మూ. విక్రమ్‌తో నటించే ఛాన్స్‌ రావడమే హ్యాపీ అనుకుంటే, నటనకు ఆస్కారం ఉండేలా తన పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉండటం డబుల్‌ హ్యాపీ అని తెగ సంబరపడి పోతోందట తమన్నా. ఇటువంటి చిత్రాల్లో నటించే అవకాశం ఎప్పుడోకానీ తలుపు తట్టదనీ, వచ్చినప్పుడు వెంటనే అందిపుచ్చుకోవాలని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట తమన్నా. థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్కెచ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. విక్రమ్‌ స్కెచ్‌ వేసి మరీ శత్రువులను అంతం చేస్తాడట. అందుకే ఆ టైటిల్‌ ఫిక్స్‌ చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement