సరైనోడు ఎక్కడున్నాడో? | Tamanna is her mother's parents with bridal ideas | Sakshi
Sakshi News home page

సరైనోడు ఎక్కడున్నాడో?

Published Tue, Jul 11 2017 2:53 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

సరైనోడు ఎక్కడున్నాడో?

సరైనోడు ఎక్కడున్నాడో?

తమిళసినిమా: నటి తమన్నాకు భర్త కావాలట. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి తమన్నా. ఇప్పటివరకూ గ్లామరస్‌ పాత్రలో అందాలను ఆరబోసిన ఈ అమ్మడు బాహుబలి చిత్రంలో తనదైన నటనతో అలరించింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తమన్నా సినీ జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునే రీతిలో ఆ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంది.కాగా ఇటీవల శింబుకు జంటగా అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రంలో మరోసారి గ్లామర్‌ పరంగా దుమ్మురేపిందనే చెప్పాలి. అయినా ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరచింది.

కాగా ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా స్కెచ్‌ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్న తమన్నా నటనతో పాటు తన తండ్రి నగల వ్యాపారంలో సాయంగా ఉంటున్నారు. షూటింగ్‌ లేని సమయాల్లో నగల డిజైన్లు చేస్తుంటారట. కాగా ఇటీవలే తన సోదరుడి వివాహనిశ్చితార్ధం వేడుకలో అంతా తానై హడావుడి  చేసిన భామకు కూడా పెళ్లి చేసేసి తమ బాధ్యతను దించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ఆమె తల్లిదండ్రులు తమన్నాకు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారట. మరి తమన్నాకు సరైనోడు ఎక్కడున్నాడో? ఎప్పుడోస్తాడో? తమన్నా కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement