విక్రమ్‌, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్‌’ | vikram and tamanna movie plan to foreign schedule | Sakshi
Sakshi News home page

విక్రమ్‌, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్‌’

Published Mon, May 22 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

విక్రమ్‌, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్‌’

విక్రమ్‌, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్‌’

చెన్నై: విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్‌. ఇరుముగన్‌ చిత్రం తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా నటిస్తున్న చిత్రం ఇది. శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పులి, ఇరుముగన్‌ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్‌ దీనికీ నిర్మాతగా ఉన్నారు.

కాగా, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ ఇందులోని విక్రమ్, తమన్నాల రొమాంటిక్‌ సన్నివేశాలను పాండిచ్ఛేరిలో చిత్రీకరించారు. ఇక విక్రమ్‌ నటించే మాస్‌ సాంగ్‌ను చెన్నైలోని బిన్నీ మిల్లులో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇక విక్రమ్‌, తమన్నాల డ్యూయెట్‌ సాంగ్‌ను విదేశాలలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. విక్రమ్‌ భైక్‌ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు. ఈచిత్రంలో తమన్నాని హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement