త్వరలో స్కెచ్‌ ఆడియో | Preparations for release of sketch movie audio soon | Sakshi
Sakshi News home page

త్వరలో స్కెచ్‌ ఆడియో

Published Tue, Aug 15 2017 3:27 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

త్వరలో  స్కెచ్‌ ఆడియో

త్వరలో స్కెచ్‌ ఆడియో

తమిళసినిమా:  వైవిధ్యం కోసం తపించే నటుల్లో విక్రమ్‌ ఒకరని చెప్పవచ్చు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతకైనా రెడీ అనే నటజీవి విక్రమ్‌. తనకు తొలి విజయాన్ని అందించి నటుడిగా జీవితాన్నిచ్చిన సేతు చిత్రం నుంచి ఈ మధ్య తెరపైకి వచ్చి విజయం సాధించిన ఇరుముగన్‌ వరకూ జయాపజయాలను పక్కన పెడితే విక్రమ్‌ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని చెప్పవచ్చు. అయితే ‘ఐ’ వంటి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు విక్రమ్‌ శ్రమకు తగిన ఫలితాన్ని అందించలేదు.

దీంతో చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న విక్రమ్‌ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్‌. రెండవది ధృవనక్షత్రం. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం చిత్రం ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది. దీంతో ముందుగా స్కెచ్‌ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా నటిస్తోంది.

విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సంగీతదర్శకుడు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత విక్రమ్‌ ధృవనక్షత్రం చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు. ఆ తరువాత హరి దర్శకత్వంలో సామి–2 చిత్రానికి రెడీ అవుతారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement