సంక్రాంతికి విక్రమ్ ‘స్కెచ్‌’ | Release date of Vikram Sketch | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 27 2017 10:02 AM | Last Updated on Wed, Dec 27 2017 10:02 AM

Release date of Vikram Sketch - Sakshi

తమిళ సినిమా: నటుడు సియాన్‌ విక్రమ్‌ సంక్రాంతికి బరిలో దిగడానికి ‘స్కెచ్‌’ వేస్తున్నారు. ఇరుముగన్‌ చిత్ర విజయంతో నూతనోత్సాహంతో ఉన్న నటుడు విక్రమ్‌ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్‌. మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో సూరి, ఆర్‌కే.సురేశ్, అరుళ్‌దాస్, మలయాళం నటుడు హరీశ్, శ్రీమాన్, మధుమిత, విశ్వాంత్, వినోద్, వేల్‌ రామమూర్తి, సారిక తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. 

వీరితో పాటు నటి ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌.ధాను వీ.క్రియేషన్స్‌ సమర్పణలో మూవింగ్‌ ఫ్రేమ్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌చందర్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతం, సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఐ వంటి చిత్రాలతో ప్రయోగాలు చేసిన విక్రమ్‌ ఈ స్కెచ్‌ చిత్రంతో మళ్లీ పక్కా మాస్‌ ట్రెండ్‌కు తిరిగారు.

ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్‌ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. భారీ ఫైట్స్, యాక్షన్‌ సన్నివేశాలు అంటూ కమర్షియల్‌ ఫార్ములాతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర టీచర్‌ను మంగళవారం విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement