S Thanu
-
నెలాఖరున ‘60 వయదు మానిరం’
తమిళసినిమా: కిళక్కు సీమయిలే చిత్రం తరువాత మనసును అంతగా హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు. వీ క్రియేషన్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పబ్లిసిటీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఇటీవల రజనీకాంత్ హీరోగా కబాలి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ప్రభు, ప్రకాశ్‌రాజ్, సముద్రకని నటి ఇందుజా ప్రధాన పాత్రల్లో రాధామోహన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 60 వయదు మానిరం. చాలా సైలెంట్‌గా చిత్రీకరణను, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రామన్నారు. దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం విశేషం. సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు చాలా మంచి సినిమా అంటూ ప్రశంసల జల్లు కురిపంచి యూ సర్టిఫికెట్‌ను అందించారట. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన కిళక్కు సీమయిలే చిత్రం తరువాత అంతగా నా మనసును హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అన్నారు. చిత్రంలో ప్రకాశ్‌రాజ్ నటనకు అవార్డు రావడం ఖాయం అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
సంక్రాంతికి విక్రమ్ ‘స్కెచ్’
తమిళ సినిమా: నటుడు సియాన్ విక్రమ్ సంక్రాంతికి బరిలో దిగడానికి ‘స్కెచ్’ వేస్తున్నారు. ఇరుముగన్ చిత్ర విజయంతో నూతనోత్సాహంతో ఉన్న నటుడు విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్. మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళం నటుడు హరీశ్, శ్రీమాన్, మధుమిత, విశ్వాంత్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వీరితో పాటు నటి ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను వీ.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌చందర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్.థమన్ సంగీతం, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఐ వంటి చిత్రాలతో ప్రయోగాలు చేసిన విక్రమ్ ఈ స్కెచ్ చిత్రంతో మళ్లీ పక్కా మాస్ ట్రెండ్‌కు తిరిగారు. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. భారీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అంటూ కమర్షియల్ ఫార్ములాతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర టీచర్‌ను మంగళవారం విడుదల చేశారు. -
కెరీర్‌పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు
ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా అనే కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మరోసారి అంతా కొత్త వారితో తెరకెక్కనున్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. రజనీకాంత్ హీరోగా కబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సౌందర్య రజనీకాంత్. -
తెరి కాంబినేషన్లో మరో చిత్రం?
తెరి చిత్ర కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనుందా? ఆ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెరి ఇళయదళపతి విజయ్ కేరీర్ తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం. ఆయన 59వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఇప్పుడు రజనీకాంత్‌తో భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కలైపులి ఎస్.థానునే తెరి చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో మరో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. తెరి చిత్రం తరువాత దర్శకుడు అట్లీ తదుపరి చిత్రానికి కథను తయారు చేసుకున్నారు. దీన్ని ఏ హీరోతో తెరకెక్కించేది త్వరలోనే వెల్లడిస్తానని తెరి చిత్ర మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలిపారు. అయితే ఆ తరువాత అట్లీ చిత్ర హీరో విజయ్ అనీ, కాదు నటుడు సూర్య అనే అనధికార ప్రచారం చాలా జరిగింది. ఏ హీరోతో చిత్రం చేయాలన్న కన్ఫ్యూజన్లో అట్లీ ఉన్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విజయ్ 61వ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, దాన్ని తెరి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానునే నిర్మించడానికి రెడీ అయ్యారని కోలీవుడ్ వర్గాల ప్రచారం. రజనీకాంత్ హీరోగా నిర్మించిన కబాలి చిత్రం విడుదల అనంతరం నిర్మాత థాను విజయ్, అట్లీ కాంబినేషన్లో నిర్మించనున్న చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ తను 60వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారన్నది గమనార్హం. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమా రిలీజ్ విషయంలో భయపడుతున్నాడట. అందుకే తన లేటెస్ట్ ఎంటర్టైనర్ కబాలిని వాయిదా వేయాలని నిర్మాత ఎస్ థానుకు సూచించాడు. అయితే రజనీకాంత్ తన సినిమాను వాయిదా వేస్తోంది, ఇతర సినిమాలతో పోటి కారణంగా కాదు. త్వరలో తమిళ నాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ప్రభావం తన సినిమా మీద పడకుండా ఉండేందుకు రిలీజ్ వాయిదా వేయాలని భావిస్తున్నాడు. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మాఫియా డాన్‌గా నటిస్తున్న సినిమా కబాలి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే రజనీ మాత్రం ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెపుతున్నాడు. తమిళనాట సినీ రంగంపై రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. రాజకీయాల కారణంగా పలు సినిమాల రిలీజ్‌లను అడ్డుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఇబ్బందులేవి కలగకుండా ఉండేందుకు తన సినిమా వాయిదా వేయాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రజనీ కబాలీ వాయిదా వేయటం మాత్రం కన్ఫామ్ అంటున్నారు తమిళ ఇండస్ట్రీ వర్గాలు.